Door43-Catalog_te_iev/50-EPH.usfm

296 lines
67 KiB
Plaintext

\id EPH - Indian Easy Version (IEV) Telugu 1
\ide UTF-8
\h ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc1 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc2 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc3 eph
\mt1 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 దేవుడు కోరుకున్న ప్రకారంగా యేసు క్రీస్తు అపోస్తలుడు అయిన నేను అంటే పౌలును, ఈ ఉత్తరం ఎఫెసు పట్టణంలో దేవుడు తనకోసం ప్రత్యేకించుకున్న వాళ్ళకి, అంటే యేసు క్రీస్తు భక్తులకు రాస్తున్నాను.
\v 2 మన తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీ పట్ల కృప చూపి, శాంతి సమాధానాలు ఇవ్వాలని నా ప్రార్థన.
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు. మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాబట్టి ఆయన పరలోక విషయాల్లో అన్ని రకాల ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు.
\v 4 దేవుడు ఈ లోకాన్ని చేయకముందే మనం క్రీస్తుకు చెంది ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో ఇతరులకంటే ప్రత్యేకంగా ఉండి ఎలాటి తప్పూ లేనివారంగా జీవించేలా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమే కారణం.
\s5
\v 5 ఎప్పుడో పూర్వకాలంలోనే యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన సొంత కొడుకులుగా దత్తత చేసుకోడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఆయనకు ఎంతో ఆనందం. ఆయన అలా ఆశించాడు కాబట్టి అలా చేశాడు.
\v 6 ఇంత అద్భుతమైన దయను మన పట్ల చూపినందుకు ఆయనకు స్తుతులు. ఇది మనకున్న అర్హతకు ఎన్నో రెట్లు మించినది. ఆయన ప్రేమను చూరగొన్న ఆయన కుమారుడి ద్వారా ఆయన మనల్ని దీవించాడు.
\s5
\p
\v 7 యేసు మనకు బదులుగా చనిపోయి మన పాపాలకు వెల చెల్లించాడు. అంటే ఆయన చనిపోయినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించాడు. దీనికి కారణం ఆయన మనపట్ల చూపిన ధారాళమైన కరుణ.
\v 8 ఆయన అపారమైన దయతో బాటు ఆయనకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, ఆయనకు అన్నీ తెలుసు.
\s5
\v 9 ఇప్పుడు దేవుడు తన పథకం లోని రహస్యాన్ని వెల్లడించాడు. ఇది ఆయన క్రీస్తుతో కలిసి నిర్ణయించిన పథకం.
\v 10 సరిగ్గా ఆ సమయం వచ్చినప్పుడు క్రీస్తు మొత్తాన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుని అన్నిటినీ ఏకం చేస్తాడు. ఆ విధంగా పరలోకంలో, భూలోకంలో ఉన్నవన్నీ క్రీస్తువి అవుతాయి.
\s5
\v 11 క్రీస్తు ఏవైతే చేసాడో దాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని తన సొంత మనుషులుగా చేసుకున్నాడు. ఇలా చెయ్యాలని ఆయన ఏనాడో నిశ్చయించుకున్నాడు. తాను ఏమి చెయ్యాలనుకున్నాడో అది ఆయన చేసి తీరుతాడు.
\v 12 దేవుడి ప్రణాళికలో మొట్టమొదటగా క్రీస్తును నమ్ముకున్న యూదులమైన మనం ఆయన్ని కొనియాడాలి. ఎందుకంటే ఆయనెంతో గొప్పవాడు.
\s5
\v 13 ఆపైన యూదులు కాని మీరు కూడా సత్య సందేశం విన్నారు. అంటే దేవుడు మిమ్మల్ని ఎలా రక్షిస్తున్నాడో మీరు ఆ క్రీస్తును ఎలా నమ్మారో ఆ సువార్త అన్నమాట. మీరది చేసినప్పుడు దేవుడు తాను మాట ఇచ్చినట్టు మీకు పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని ముద్ర వేశాడు.
\p
\v 14 దేవుడు మాట ఇచ్చిన మిగతావన్నీ తప్పకుండా ఇస్తాడు అనడానికి ఆ ఆత్మ అడ్వాన్సు లాగా ఉంది. ఆ సమయంలో ఆయన మనకోసం దాచిపెట్టిన వాటన్నిటినీ ఇస్తాడు. దేవుడు గొప్పవాడు గనక ఆయనకు స్తుతి.
\s5
\p
\v 15 దేవుడు ఇదంతా మీకోసం చేశాడు గనక మీరు యేసు క్రీస్తును ఎంత బలంగా నమ్ముకున్నారో, విశ్వాసులందరినీ మీరెంతగా ప్రేమిస్తున్నారో నేను విన్నాను.
\v 16 మీ కోసం అస్తమానం నా ప్రార్థనల్లో దేవునికి కృతఙ్ఞతలు అర్పిస్తున్నాను.
\s5
\v 17 మన ప్రభువైన యేసు క్రీస్తుకు దేవుడు, తేజోమూర్తి అయిన తండ్రి, తనను మరింతగా తెలుసుకోడానికి మీకు తన ఆత్మను ఇవ్వడం ద్వారా, మీకు తెలివినిచ్చి దేవుణ్ణి మీకు వెల్లడి చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాను.
\v 18 విషయాల్ని ఉన్నవి ఉన్నట్టుగా మీరు చూడగలిగేలా దేవునికి మన విషయంలో ఉన్న అద్భుత ప్రణాళిక మనం తెలుసుకోగలిగేలా దేవుడు చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాను. మనకు, విశ్వాసులందరికీ దేవుడు వాగ్దానం చేసినవి ఎంత అద్భుతమైనవో, సౌభాగ్యవంతమైనవో మీకు తెలియాలని నా ప్రార్థన.
\s5
\v 19 క్రీస్తు లో విశ్వాసం ఉంచిన మనకోసం దేవుడు ఎంత శక్తివంతంగా పని చేస్తాడో మీరు గ్రహించాలని నా ప్రార్థన. ఆయన మన విషయంలో అంత అనంత ప్రభావం గలవాడు.
\p
\v 20 క్రీస్తు చనిపోయాక దేవుడు ఇదే శక్తితో ఆయన్ని తిరిగి బతికించి పరలోకంలో అత్యున్నత స్థానంలో ఉంచాడు.
\v 21 క్రీస్తు పాలకులందరికంటే అన్ని స్థాయిల్లో ఉండే శక్తులన్నిటికంటే మనుషులు పూజించే ప్రతిదానికంటే పైగా పరిపాలిస్తాడు, ఇప్పుడు మాత్రమే కాదు, శాశ్వతంగా.
\s5
\v 22 దేవుడు అన్నిటినీ క్రీస్తు పరిపాలన కింద ఉంచాడు. అన్నిటా అందరు విశ్వాసుల మధ్యా క్రీస్తును ఏలికగా నియమించాడు.
\v 23 విశ్వాసులమైన మనకు క్రీస్తుతో సంబంధం ఎలాటిదంటే, మనిషి శరీరానికి తలతో ఉన్న సంబంధం లాటిది. ఆయన అంతటా అన్నిటినీ నింపినట్టే విశ్వాసులందరిలోనూ నిండిపోతున్నాడు.
\s5
\c 2
\p
\v 1 మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచకముందు అత్మసంబంధంగా చచ్చిన స్థితిలో ఉండి పాపం చెయ్యడం మానలేక పోయేవాళ్ళు.
\v 2 ఈ లోకం పోకడ, ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా పాపభూయిష్టమైన బ్రతుకులో ఉండేవాళ్ళు. ఈ లోకాధికారులను గుప్పెట్లో ఉంచుకున్న దురాత్మల అధికారి అదుపులో మీరు ఉండేవాళ్ళు. ఈ అధికారి సాతాను. దేవునికి ఎదురు తిరుగుతూ ఉండే మనుషుల ద్వారా అతడు ఇప్పుడు పని చేస్తూ ఉంటాడు.
\v 3 పూర్వం మనమంతా దేవునికి లోబడని వాళ్ళ లాగానే జీవించాము. మన మనసుకు నచ్చినవి చేస్తూ వచ్చాము. అవన్నీ శరీర సుఖాలే, మానసిక ఉల్లాసాలే. మనమంతా ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు అర్హులం.
\s5
\p
\v 4 కానీ దేవుడు కరుణానిధి. మనల్ని ఎంతో ప్రేమించాడు.
\v 5 ఎంతగా ప్రేమించాడంటే మనం అత్మసంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ, ఎడతెరిపి లేకుండా పాపం చేస్తున్నప్పటికీ మనల్ని క్రీస్తుతో జోడించడం ద్వారా బ్రతికించాడు. గుర్తుంచుకోండి. మీకు ఏమాత్రం అర్హత లేకపోయినా దేవుడు మీపై దయ చూపి మీరు మీ అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, రక్షించాడు.
\v 6 దేవుడు మనల్ని రక్షించడం అంటే అది సమాధుల్లో నుండి మనల్ని క్రీస్తు యేసులో బయటికి తెచ్చి ఆయనతో బాటు మళ్లీ మనల్ని బ్రతికించి, పరలోకంలో ఆయనతో పాటు పరిపాలన చేసే గౌరవం కట్టబెట్టాడు.
\v 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా తన అపరిమితమైన కృపా సమృద్ధిని అందరికీ కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.
\s5
\p
\v 8 కాబట్టి మీకు అర్హత లేని విధంగా దేవుడు మీ పట్ల కృప చూపాడు. ఆత్మసంబంధమైన మరణం నుండి రక్షించడంలో ఇది బయట పడింది. మీరు క్రీస్తుపై నమ్మకం ఉంచారు గనక దేవుడు ఇలా చేశాడు. మిమ్మల్ని మీరే రక్షించుకోలేదు. ఇది దేవుని బహుమానం.
\v 9 దీన్ని ఎవరూ స్వంతగా సంపాదించుకోలేరు. కాబట్టి నన్ను నేనే రక్షించుకున్నానని గొప్పలు చెప్పుకోవడం ఇక్కడ కుదరదు.
\v 10 మనం ఎలా ఉండాలని దేవుడు కోరాడో అలా ఆయన మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో మనం మంచిపనులు చెయ్యడం కోసం ఆయన మనల్ని కొత్త మనుషులుగా మళ్ళీ సృష్టించాడు. అసలు అవి మనం చెయ్యాలని దేవుడు ముందుగా సిద్ధపరచినవే.
\s5
\p
\v 11 కాబట్టి వంశాన్ని బట్టి చూస్తే మీరు యూదులు కారు. దేవుని ప్రజలకు చెందినవాళ్ళు కాదు. యూదులు మిమ్మల్ని "సున్నతి లేనివాళ్ళు, సున్నతి లేని వాళ్ళు" అని ఆక్షేపించారు. తామేమో సున్నతి గల వారమని చెప్పుకునే వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం తామే దేవుని ప్రజలం, మీరు కాదు, అని. అసలు సున్నతి అనేది మనుషులు శరీరంలో ఒక చిన్న మార్పు. ఆత్మ లో దేవుడు చేసే మార్పు కాదు.
\v 12 గుర్తుంచుకోండి, ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు పరదేశులు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న ఒడంబడికలోని వాగ్దానాలు మీకు లేవు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని ఎలాటి నిబ్బరం, ఆశాభావం లేవు. అసలు ఈ లోకంలో దేవుడు లేనివాళ్ళుగా జీవించారు.
\s5
\v 13 అయితే ఇప్పుడు క్రీస్తు యేసులో నమ్మకం పెట్టుకున్నారు గనక మీరు చాలా దూరంలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని తనకు దగ్గర చేసుకున్నాడు. క్రీస్తు సిలువపై మీకోసం చనిపోయాడు గనక ఇది సాధ్యం అయింది.
\p
\v 14 యూదులు, యూదేతరులు కలిసి ప్రశాంతంగా జీవించడం ఇప్పుడు క్రీస్తు మూలానే సాధ్యం అయింది. రెండు వేరువేరు సమూహాలను ఆయన ఒకటిగా చేశాడు. ఈ రెండు గుంపులు ఇంతకుముందు ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు. అయితే క్రీస్తు మనకోసం మరణించడం ద్వారా ఇలాటి ద్వేషానికి ఉన్న కారణాన్ని తీసి పారేసాడు.
\v 15 ఒక యూదుడు మనల్ని ఆమోదించడానికి ఇకపై మనం యూదుల ధర్మశాస్త్రం లోని చట్టాలు, ఆజ్ఞలు పాటించే అవసరం లేకుండా చేశాడు. యూదులు, యూదేతరులు కలిసి ఒకే కొత్త జాతి అయ్యారు. క్రీస్తుకు జత కావడం వల్ల వాళ్ళద్దరూ కలిసిమెలిసి జీవించగలుగుతారు.
\v 16 సిలువపై మరణించడం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న వైరాన్ని నిర్మూలించి ఇద్దరినీ దేవునితో ఏకం చేశాడు. తద్వారా ఒకరితో ఒకరికీ, తమతో దేవునికీ శాంతిసమాధానాలు ఉండాలని ఇలా చేశాడు
\s5
\v 17 యేసు వచ్చి మనకు దేవునితో శాంతియుతంగా జీవించడం వీలౌతుందనే శుభవార్త ప్రకటించాడు. దేవుడంటే తెలియని యూదేతరులైన మీకు, దేవుణ్ణి గురించి తెలిసిన యూదులమైన మాకు దీన్ని ప్రకటించాడు.
\v 18 యేసు మనకు చేసిన దాని కారణంగా యూదులు, యూదేతరులు ఇప్పుడు దేవుని ఆత్మ మూలంగా తండ్రి అయిన దేవుని చెంతకు రాగలరు.
\s5
\p
\v 19 కాబట్టి యూదేతరులైన మీరు దేవుని ప్రజల్లో చేరకుండా బయట ఉన్నవాళ్ళు కారు. దేవుని కుటుంబానికి చెంది ఉండేలా దేవుడు తనకోసం ప్రత్యేకంగా పెట్టుకున్న వాళ్ళతో కలిసి ఉన్నారు.
\v 20 దేవుడు ఒక కట్టడం నిర్మించడానికి తెచ్చుకున్న రాళ్లలాటి వాళ్ళు మీరు. ఆ భవనానికి అపోస్తలులు, ప్రవక్తలు పునాది లాంటివాళ్ళు. అంటే ఇల్లు కట్టడానికి వాడే రాళ్లు పునాదిపై ఎలా ఆధారపడతాయో అలానే వాళ్ళు నేర్పించిన దానిపై మీరు ఆధారపడి బలమైన గోడలుగా తయారు అవుతున్నారు. యేసు క్రీస్తు తానే ఆధారశిల. అది భవనం అంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి.
\v 21 ప్రతి ఒక్కడూ ఎక్కడ ఉండాలో యేసు నిర్ణయిస్తాడు. ఇదేలాగంటే ఏ రాయి ఎక్కడ అమరి ఉండాలో ఆధార శిలను బట్టే కదా తెలిసేది? ఇల్లు కట్టే వాళ్ళు రాతిమీద రాతిని పెట్టి ఎలా కడతారో ప్రభువును ఆరాధించడానికి ఒక పవిత్ర ఆలయంగా ఉండేందుకు యేసు ఈ కుటుంబాన్ని వృద్ధి చేస్తున్నాడు.
\v 22 మీరు యేసుకు చెందిన వాళ్ళు కాబట్టి ఆయన మిమ్మల్ని కడుతున్నాడు. యూదులనూ, యూదేతరులనూ కూడా ఒక భవనంలాగా ఒక కుటుంబంగా ఆయన కడుతున్నాడు. అందులో దేవుడు తన ఆత్మ మూలంగా కాపురముంటాడు.
\s5
\c 3
\p
\v 1 యూదేతర విశ్వాసులైన మీకోసం దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఈ కారణాన మీకోసం క్రీస్తును సేవిస్తున్న నేను ఖైదీనయ్యాను.
\v 2 మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన పనిని అంటే దేవుడు యూదేతరుల పట్ల దయ చూపుతాడనే సంగతిని మీకు తెలియజెప్పడం అనే పనిని గురించి మీరు వినే వుంటారు.
\s5
\v 3 అదేమంటే ఇంతకు ముందు మనుషులకు అర్థం కాని విషయాన్ని నేరుగా దేవుడు నాకు తెలిపాడు. దీన్ని గురించి మీకు ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
\v 4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తును గురించి ఇంతకు ముందు వెల్లడి చెయ్యని దాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకున్నానని మీరు గ్రహించగలరు.
\p
\v 5 గతంలో దేవుడు ఈ సందేశం పూర్తిగా మనుషులకు వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మ ఈ సంగతిని తన పవిత్ర అపోస్తలులకు, ప్రవక్తలకు తెలియజెప్పాడు.
\s5
\v 6 సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా దేవుని ఆత్మసంబంధమైన సౌభాగ్యంలో భాగస్తులు. దేవుని ప్రజల సమూహానికి చెందిన వాళ్ళు. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన వాటన్నిటిలో వాళ్ళకీ భాగం ఉంది. ఇది ఎలానంటే సువార్తను నమ్మడం ద్వారా వాళ్ళు కూడా యేసు క్రీస్తులో కలిసిపోయారు.
\v 7 ఈ శుభవార్త మనుషులందరికీ చెప్పడం ద్వారా నేను దేవుణ్ణి సేవించే వాడినయ్యాను. నిజానికి నేను ఇందుకు తగిన వాణ్ణి కాకపోయినప్పటికీ దేవుడు నా పట్ల దయ చూపి ఈ పని నాకు అప్పజెప్పాడు. నాలో శక్తివంతంగా పనిచెయ్యడం ద్వారా నాకు ఆ సామర్థ్యం కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 8 దేవునికి చెందిన వారందరిలోకీ నేను అత్యల్పుడిని అయినా దేవుడు తన దయ చొప్పున నాకు ఈ వరమిచ్చాడు. క్రీస్తు మనకోసం సిద్ధం చేసిన అనంతమైన ఆత్మసంబంధమైన దీవెనలు వాళ్ళవి అని యూదేతరులకు ప్రకటించమని నన్ను నియమించాడు.
\v 9 దేవుని ప్రణాళికను అందరూ అర్థం చేసుకునేలా చెయ్యమని నన్ను ఆదేశించాడు. ఈ ఉద్దేశం అన్నిటినీ చేసిన దేవుడు చాలా కాలం నుండీ దాచి ఉంచినది.
\s5
\v 10 దేవుడు దీన్ని ఎందుకు ఇప్పటిదాకా దాచి ఉంచాడంటే ఇప్పుడు తాను ఎన్నుకున్న ప్రజలకు దాన్ని వెల్లడి చెయ్యడం ద్వారా దాన్ని అత్యున్నత హోదాల్లో ఉన్న ఆత్మసంబంధమైన అధిపతులకు కూడా తెలియజేయాలనే, ఈ విధంగా వాళ్ళు తన జ్ఞానం ఎంత గంభీరమైనదో గ్రహించాలనే.
\p
\v 11 ఈ ప్రణాళిక ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఆయన దగ్గర ఉంది. మన ప్రభు యేసుక్రీస్తు చేసిన పని ద్వారా ఆయన దీన్ని నెరవేర్చాడు.
\s5
\v 12 కాబట్టి ఇప్పుడు యేసు చేసిన దాన్ని బట్టి మనం స్వేచ్ఛగా, ఆత్మనిబ్బరంతో దేవుని చెంతకు రావచ్చు. ఎందుకంటే మనం యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని తనతో కలుపుకున్నాడు.
\v 13 కాబట్టి నేనిక్కడ మీ పక్షాన జైల్లో బాధలు పడుతుండడం చూసి దిగులు పడకండి. ఎందుకంటే ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
\s5
\p
\v 14 దేవుడు మీకు ఇవన్నీ చేశాడు గనక మన తండ్రీ అయిన దేవుని ఎదుట నేను మోకరించి ప్రార్థిస్తున్నాను.
\v 15 ఆయన ఆదిమూల జనకుడు. పరలోకంలో, భూమి మీదా ప్రతి కుటుంబానికీ నమూనా ఆయనే.
\v 16 ఆయన ఎంత ఘనుడో ఆ మేరకు మిమ్మల్ని కూడా బలపరచడం కోసం ఆయన తన ఆత్మను మీకివ్వాలని నా ప్రార్థన.
\s5
\p
\v 17 మీరు ఆయనపై విశ్వాసం ఉంచిన కారణంగా క్రీస్తు మీ చెంతనే ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసేదీ, చెప్పేదీ అంతా మీకోసం ఆయన ప్రేమ కారణంగానూ, ఇతరుల పట్ల మీ ప్రేమ కారణంగానూ ఉండాలి.
\v 18 ఫలితంగా మీరు దేవుని ప్రజలందరితో కూడా క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో సంపూర్ణంగా గ్రహించగలగాలి.
\v 19 ఆయన మన అవగాహనకు అతీతంగా మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు గ్రహించాలని నా కోరిక. తద్వారా దేవుడు తానేమిటో దానంతటినీ మీలో నింపాలి.
\s5
\p
\v 20 మనలో దేవుని శక్తి పనిజేస్తున్నది గనక మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే దేవుడు ఎంతో ఎక్కువగా మనకోసం చెయ్యగలడు.
\v 21 ఆయన మహాత్మ్యాన్ని బట్టి విశ్వాసులు అందరూ ఆయన్ని కొనియాడుతారు గాక. క్రీస్తు యేసు ద్వారా ఆయన చేసిన మహత్కార్యం నిమిత్తం తరతరాలు శాశ్వతంగా అలా జరుగును గాక.
\s5
\c 4
\p
\v 1 దీనంతటి మూలంగా యేసు క్రీస్తును సేవిస్తున్న కారణంగా చెరసాలలో ఉన్న నేను మీకు చేసే విన్నపం. మిమ్మల్ని తనకోసం జీవించమని పిలుచుకున్న యేసు ప్రతిష్టకు తగినట్టు మీరు ప్రవర్తించాలి.
\v 2 ఎప్పుడూ వినయంగా మృదువుగా నడుచుకోండి. ఒకరితో ఒకరు ఓపికగా ఉండండి. మీలో ఉన్న ప్రేమను బట్టి. ఎదుటి మనిషి చేసే భారభారితమైన పనులను సహిస్తూ ఉండండి.
\v 3 దేవుని ఆత్మ మిమ్మల్ని ఐక్యం చేశాడు గనక ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి శాయశక్తులా కృషి చెయ్యండి. ఒకరి పట్ల ఒకరు శాంతంగా ప్రవర్తించడం ద్వారా ఒకరికి ఒకరు కలిపి కట్టి వేసుకోండి.
\s5
\v 4 దేవునిది ఒకటే విశ్వాసుల కుటుంబం. ఒక్కడే ఆత్మ. మనుషులు ఆశించే ఏకైక విషయాన్ని అందుకోడానికి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక్కటే. దేవుడు పిలిచిన మీకే అది సొంతం.
\v 5 ఒక్కడే ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు. ఆయన్ని సేవించడానికి ఒక్కటే మార్గం. ఆయనపై సంపూర్ణంగా నమ్మకం ఉంచడం మూలంగా ఆయనకోసం మాత్రమే మనం బాప్తిసం పొందాము.
\v 6 ఒక్కడే దేవుడు ఉన్నాడు. యూదులైనా, కాని వారైనా అందరికీ ఆయనే తండ్రి. మనందరినీ ఆయనే ఏలుతున్నాడు. మనందరిలో ఆయనే పని చేస్తున్నాడు. మనందరిలో ఆయనే ఉన్నాడు.
\s5
\p
\v 7 మనలో ప్రతి ఒక్కరికీ క్రీస్తు నిర్ణయించిన రీతిగా దేవుడు ఆత్మ వరాలు పంచిపెట్టాడు.
\v 8 లేఖనం చెప్పినట్టుగా,
\q ఆయన ఉన్నత స్థలానికి ఎక్కిపోయి
\q తాను స్వాధీనం చేసుకున్న అనేకమందిని తనతో తీసుకొచ్చాడు.
\q తన ప్రజలకు ఇనాములిచ్చాడు.
\s5
\p
\v 9 "ఎక్కిపోయి" అనే మాటను చూస్తుంటే క్రీస్తు అంతకు ముందు భూమి అట్టడుగు భాగాల్లోకి దిగి పోయాడని మనకు అర్థం అవుతుంది గదా.
\v 10 దివి నుండి భువికి దిగివచ్చిన ఆ క్రీస్తే పైకి ఆరోహణం అయిపోయి విశ్వంభరునిగా మహోత్కృష్టమైన స్థానం ఆక్రమించాడు.
\s5
\v 11 ఇకపోతే తన వాళ్ళకి బహుమతులుగా ఆయన కొందరిని అపోస్తలులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి యేసును గురించి సువార్త చెప్పే వాళ్ళుగా, మరికొందరిని విశ్వాసుల సమూహాల విషయం శ్రద్ధ తీసుకుంటూ, వాళ్ళకి ఉపదేశించే వాళ్ళుగా చేశాడు.
\p
\v 12 వీరందరినీ దేవుడు తన ప్రజలను సేవించే పని కోసం నియమించాడు. ఆ విధంగా క్రీస్తుకు చెందిన వారంతా అత్మసంబంధంగా బలోపేతం ఔతారు.
\v 13 మనమంతా ఏమి కావాలని దేవుడు కోరుకున్నాడో అలా మారేంతవరకూ ఈ పని కొనసాగుతుంది. దైవ కుమారుణ్ణి సంపూర్ణంగా నమ్ముకుని ఐక్యంగా ఉంటూ, ఆయన మనలో చేస్తున్న పనిని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉండాలి. దేవుణ్ణి క్రీస్తు ఎరిగినంతగా మనమూ ఎరిగి విశ్వాసుల సంఘంగా ఆయనపై ఆధారపడడంలో పూర్తిగా పరిణతి చెందాలి.
\s5
\v 14 అప్పుడు మనం ఇక మీదట ఆత్మసంబంధంగా పసి పిల్లల్లాగా పరిణతి లేకుండా ఉండము. అప్పుడు ఇక మనకు ఎదురయ్యే ప్రతి కొత్త ఉపదేశాన్నీ మనం అనుసరించం. అంటే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే నావ లాగా ఎటుబడితే అటు దారి మార్చుకుంటూ ఇకపై ఉండము. కొందరు తెలివి గల వాళ్ళు అబద్ధాలు చెప్పి మనల్ని మోసగించడానికి ఇకపై అవకాశం ఇవ్వము.
\p
\v 15 దానికి బదులుగా మనం ఒకరితో ఒకరం ప్రేమపూర్వకంగా నిజాలే చెప్పుకుంటూ అన్ని విషయాల్లోనూ మరింతగా క్రీస్తు పోలికలోకి మారుతూ ఉందాము. విశ్వాసులమైన మనం ఒక మనిషి శరీరంలోని భాగాల్లాటి వాళ్ళం. క్రీస్తు ఆ శరీరానికి తల.
\v 16 మనల్ని ఒకరితో ఒకరిని కలిపి ఉంచేది ఆయనే. ఒకరికి ఒకరం ఎలా సహాయం చేసుకుంటూ ఉండాలి సమన్వయంతో ఎలా పని చెయ్యాలి అనేవి ఆయన నేర్పిస్తున్నాడు. మనిషి తల ఆ శరీరానికి అంతటికీ ఆదేశాలు ఇచ్చినట్టే మనలో ప్రతి వాడికీ ఆయనే సామర్థ్యం ఇస్తున్నాడు. ఈ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు బలపరుస్తూ కలిసి ఎదుగుతాము.
\s5
\p
\v 17 ఈ కారణాన యేసు ప్రభువు అధికారాన్ని బట్టి నేను మీకీ మాట చెబుతున్నాను. ఇప్పటినుంచి మీరు తక్కిన యూదేతరుల్లాగా జీవించకూడదు. వాళ్ళ జీవితవిధానం శూన్య ఆలోచనలపై శుష్క ప్రియాలపై ఆధారపడి ఉంటుంది.
\v 18 వారికి మంచిచెడుల పట్ల సరైన అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా దేవుడికి దూరమైపోయారు. వాళ్ళు మొండిగా దేవుడికి లోబడడానికి ఒప్పుకోనందువల్ల తాము ఏది కోల్పోతున్నామో వాళ్ళకి తెలియదు.
\v 19 వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేకుండా పోయింది. అందువల్ల వాళ్ళు సిగ్గులేని తమ విషయవాంఛలకు లొంగిపోతున్నారు. అన్ని రకాల దిగజారిన పనులు చేస్తూ ఇంకా చేయడానికి చూస్తున్నారు.
\s5
\p
\v 20 కానీ మీరు మాత్రం క్రీస్తును గురించి విన్న కారణంగా మీరు మరింత శ్రేష్ఠ మార్గం గుర్తించారు.
\v 21 మీరు యేసును గురించిన సందేశం విని అర్థం చేసుకుని ఆయన దగ్గరనుండి నేర్చుకున్నారు. కాబట్టి ఆయన మార్గం సత్య మార్గం అని మీకు తెలుసు.
\v 22 మీరు ఇంతవరకూ జీవించిన పద్ధతి మార్చుకోవాలని మీకు ఉపదేశించిన వాళ్ళు చెప్పారుగదా. ఎందుకంటే మీరు కోరరానివి కోరారు. అవి మంచివి అనుకుంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. అలాటి జీవన విధానం మిమ్మల్ని ఆత్మసంబంధంగా ధ్వంసం చేసింది.
\s5
\v 23 కాబట్టి దేవుడు మీకు ఒక సరికొత్త ఆత్మనూ, సరికొత్త ఆలోచనావిధానాన్నీ ఇవ్వాలి.
\v 24 మిమ్మల్ని దేవుడు కొత్త మనిషిగా సృష్టించిన దానికి అనుగుణంగా జీవించడం మొదలు పెట్టాలి. యేసు చూపిన ఋజు మార్గంలో ఒకరితో ఒకరూ అదేసమయంలో దేవునితో కూడా సరి అయిన విధానంలో మసులుకోవాలని ఆయన మిమ్మల్ని తిరిగి సృష్టించాడు.
\s5
\p
\v 25 కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడవద్దు. నిజాలే పలకండి. ఎందుకంటే దేవుని కుటుంబ సభ్యులుగా మీరు ఒకరికొకరికి చెందిన వాళ్ళు.
\v 26 పాపభూయిష్టమైన ప్రవర్తన గురించి కోపం చూపవచ్చు. అయితే కోపం వచ్చింది గనక పాపం మాత్రం చెయ్యకండి. ప్రతి దినం చివర్లో మీకు కోపం తెప్పించిన విషయం పరిష్కారం చేసుకోండి.
\v 27 అలా చెయ్యడం ద్వారా సాతాను తన దుర్మార్గం మీ మధ్య చేయడానికి వీలు లేకుండా చేసిన వారౌతారు.
\s5
\p
\v 28 దొంగతనం చేసే వాడు ఇకపై అది మానెయ్యాలి. వాళ్ళు చెమటోడ్చి తమ స్వంతగా పని చేసుకోవాలి. తద్వారా వాళ్ళు అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకోగలుగుతారు.
\v 29 పరుషమైన మాటలు మానుకోండి. సహాయం కావలసిన వాళ్ళని ప్రోత్సహించే మాటలే పలకండి. తద్వారా దేవుడు మీ మాటల ద్వారా పనిచేసి వినేవాళ్ళకు మేలు చేస్తాడు.
\v 30 దేవుడు మీకు తన పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా మీరు తన సొంతమని ముద్ర వేశాడు. క్రీస్తు మిమ్మల్ని ఈ లోకం నుండి విడిపించే దాకా ఆ పరిశుద్ధాత్మ మీతోనే ఉంటాడు. అందుకని మీ జీవన విధానం ద్వారా మీలో నివసిస్తున్న దేవుని పరిశుద్ధాత్మకు విచారం కలిగించకండి.
\s5
\v 31 ఈ పద్ధతుల్లో ప్రవర్తించడం పూర్తిగా మానుకోడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. సాటి మనిషి పట్ల అసహనంగా రౌద్రంగా ఉండకండి. అసలు ఎవరి విషయంలోనూ కోపంగా ఉండకండి. ఇతరులను తిట్టకండి. కోపంగా అరవడం, దూషించడం పూర్తిగా మానుకోండి. ఏ రకంగానూ ఎవరిపట్లా ద్రోహ చింతన కలిగి ఉండవద్దు.
\p
\v 32 ఒకరిపట్ల ఒకరు దయ చూపండి. సాటి మనిషి పట్ల సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండండి. క్రీస్తు మీకోసం చేసిన దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ ఒకరినొకరు క్షమించుకోండి.
\s5
\c 5
\p
\v 1 మళ్లీ తండ్రి తమను ఇష్టంగా ప్రేమిస్తున్నాడు గనక పిల్లలు అతన్ని అనుకరించినట్టు దేవుడు మీకు చేసిన దాన్ని బట్టి ఆయన్ను అనుకరించండి.
\v 2 మీరు ఇతరులను ప్రేమిస్తున్నట్టు బయటికి కనబడేలా అన్నీ చెయ్యండి. మనల్ని ప్రేమించి ఇష్టపూర్తిగా సిలువపై మన స్థానంలో దేవునికి బలిగానూ అర్పణగానూ మరణించిన క్రీస్తు వలే ఉండండి. ఈ అర్పణ దేవునికి ఎంతో ఆమోదయోగ్యం అయింది.
\s5
\p
\v 3 మీలో ఎవరైనా సరే లైంగిక పాపంలో, లేదా ఏ విధమైన దుర్నీతిలో, ఉన్నారని, కామ వికారాలకు మరిగారని, ఎవరైనా చూచాయగానైనా సరే, అనడానికి ఏ ఆస్కారం ఉండకూడదు.
\v 4 మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అశ్లీలమైన బూతు మాటలు చెప్పుకోవద్దు. బుద్ధిహీనంగా పాపాలు చెయ్యడం గురించిన హాస్యాలు మాట్లాడుకోవద్దు. దేవునికి చెందినవాళ్ళకి అలాటివి తగవు. మీకు వేటి విషయంలో కృతజ్ఞతాభావం ఉందో అవి మాట్లాడు కోండి.
\s5
\v 5 ఇలాటి మనుషులను దేవుడైన క్రీస్తు రాజ్యంలో చేరనివ్వరు అనేది స్పష్టం. లైంగిక అవినీతిపరులు, వెకిలి వాళ్ళు, కామవాంఛలతో వేగిపోయేవాళ్ళు, విగ్రహ పూజ చేస్తున్నట్టే లెక్క.
\v 6 ఇలాటివే మనం చూసీ చూడనట్టు వదిలెయ్యాలని ఎవరన్నా చెబితే మోసపోవద్దు. ఎందుకంటే సరిగ్గా ఇలాటి విషయాల్లోనే దేవుడు తన మాట వినని వాళ్ళను శిక్షిస్తాడు.
\p
\v 7 కాబట్టి ఇలాటి వాటిని చేసే వాళ్ళతో చేరవద్దు.
\s5
\v 8 యేసు ప్రభువును నమ్ముకోక ముందు సత్యమేదో మీకు తెలియదు, గుర్తుందా? చీకటిలో ఉన్నవాళ్ళకి చుట్టూ ఏముందో కనిపించదు కదా, ఇదీ అంతే. కానీ ఇప్పుడు ప్రభువు మీకు ఏది సత్యమో చూపించాడు గనక మీరు వెలుతురు లోకి వచ్చారు. కాబట్టి ప్రభువు చూపిన పద్ధతిలోనే నడుచుకోండి.
\v 9 వెలుతురులో ఉన్నవాళ్లు సరైన దారిలో నడిచినట్టే యేసును ఎరిగిన కారణంగా సన్మార్గంలో, సత్యమైన, రుజువైన దారిలో మీరు ఉండగలరు.
\v 10 మీరిలా జీవిస్తూ ప్రభువుకు ఏది ఇష్టమో నేర్చుకుంటూ ఉండండి.
\p
\v 11 కాబట్టి ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్నవాళ్ళు చేసే పనికిమాలిన పనుల్లో పాల్గొనకండి. అవి ఎంత నీచమైన పనులో అందరికీ బట్టబయలు చెయ్యండి.
\v 12 మనుషులు రహస్యంలో చేసే తప్పుడు పనుల గురించి మాట్లాడడం కూడా సిగ్గుమాలినతనమే.
\s5
\p
\v 13 ఈ భాగోతాలను బట్టబయలు చెయ్యడం అవసరం. అప్పుడే ఈ పనులు దుర్మార్గమని మనుషులు తెలుసుకుంటారు. దేన్నైనా దాని నిజస్వరూపం చూపించడానికి వెలుతురు లోకి తెస్తాము కదా? అప్పుడే వెలుగులోకి వచ్చిన దాన్ని మనుషులు పరీక్షించి తెలుసుకోగలుగుతారు.
\p
\v 14 ఇలా అంటున్నప్పుడు విశ్వాసుల ఉద్దేశం ఇదే కదా.
\q1 నిద్ర పోతున్నావా, మేలుకో.
\q1 చనిపోయిన వాడా, చీకటిలో నుండి లేచి వచ్చి బ్రతుకు.
\q1 చీకటిలో ఉన్నవాళ్ళకి అక్కడ ఉన్నవేవో చూపించడానికి వెలుగు ప్రకాశించినట్టు క్రీస్తు నీకు ఏది సత్యమో తెలియజేస్తాడు.
\s5
\p
\v 15 కాబట్టి ఎలా జీవిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించాలి.
\v 16 మీకున్న సమయంలోనే సాధ్యమైనంత మేలు చెయ్యండి. ఎందుకంటే రోజురోజుకీ మనుషులు దుర్మార్గానికి తెగబడుతున్నారు.
\v 17 అందుకే జ్ఞానంగా నడుచుకోండి. యేసు ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకుని అలా చెయ్యండి.
\s5
\v 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. ఎందుకంటే తాగిన వాడు తన అదుపులో తాను ఉండదు. దేవుని పరిశుద్ధాత్మమిమ్మల్ని అదుపు చెయ్యనివ్వండి.
\v 19 ఒకరికొకరు కీర్తనలు వినిపించుకోండి. క్రీస్తును గురించిన పాటలు, దేవుని ఆత్మ మీకిచ్చిన పాటలు పాడుకోండి. బయటికి వినిపించేలా కాకపోయినా మీలో మీరు ప్రభువుకు స్తుతి గీతాలను సమర్పించండి.
\v 20 అస్తమానం ప్రభు యేసు క్రీస్తు మీకు చేసినదాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతఙ్ఞతలు చెల్లించండి.
\p
\v 21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
\s5
\v 22 భార్యలు యేసు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకూ లోబడాలి.
\v 23 ఎందుకంటే క్రీస్తు ప్రపంచ వ్యాప్త సంఘానికి ఏ విధంగా నాయకుడో అలాగే భర్త తన భార్యకు నాయకుడు. క్రీస్తే మానవ పాపాలకు శిక్ష పడకుండా అందరినీ రక్షించిన వాడు.
\v 24 మరి భార్యల విషయానికొస్తే విశ్వాసులు క్రీస్తు అధికారానికి లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలఅధికారానికి పూర్తిగా లోబడాలి.
\s5
\p
\v 25 భర్తలారా, సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీరు మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు తనను నమ్మిన వాళ్ళ కోసం సిలువపై తన ప్రాణమే పెట్టాడు.
\v 26 మనల్ని తనకోసం ప్రత్యేకించుకోడానికి ఆయనిలా చేశాడు. తన సందేశం మనకు వినిపించడం ద్వారా యేసు మనల్ని ప్రక్షాలణం చేశాడు. నీటితో కడిగితే మురికి పోయినట్టు ఆయన మన పాపాలను కడిగివేశాడు.
\v 27 అందరూ పాపరహితంగా, అనింద్యులుగా పూర్తిగా నిష్కళంకంగా పరిపూర్ణంగా ఉన్న విశ్వాసుల సమూహాన్ని వైభవోపేతమైన పెళ్లి కూతురుగా చేసి ఆమెను చేపట్టే వరునిగా తానుండాలని ఆయనిలా చేశాడు.
\s5
\p
\v 28 అలాగే ప్రతి పురుషుడు తన సొంత శరీరం లాగానే తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
\v 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు. ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
\v 30 క్రీస్తు కూడా లోకవ్యాప్తంగా ఉన్న విశ్వాసులమైన మనందరికోసం శ్రద్ధ వహిస్తున్నాడు. మనం సంఘమనే క్రీస్తు శరీరంలో భాగం అయ్యాము.
\s5
\p
\v 31 పెళ్లి అయిన వాళ్ళ గురించి లేఖనం ఇలా చెబుతున్నది.
\q "ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో మమేకం అవుతాడు. వారిద్దరూ ఒకే మనిషి అన్నట్టుగా అవుతారు."
\p
\v 32 ఈ మాటల్లో మనకి అర్థం కానిది ఎంతో ఉంది. అయితే ఈ భార్యాభర్తల ఉదాహరణ క్రీస్తు సార్వత్రిక విశ్వాస సమూహాన్ని ఎలా ప్రేమించాడో అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుంది.
\v 33 మొత్తం మీద ప్రతి మగవాడు తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
\s5
\c 6
\p
\v 1 పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడడం ద్వారా యేసు ప్రభువును సేవించండి. ఇలా చెయ్యడం మంచిది.
\v 2 దేవుడు తన లేఖనాల్లో అజ్ఞాపించాడు.
\p "నీ తల్లిదండ్రులను గౌరవించు, అది దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ. అందులో ఆయన ఒక వాగ్దానం కూడా కలిపాడు.
\v 3 అలా చేస్తే నీవు వర్థిల్లుతావు. భూమిపై చిరకాలం జీవిస్తావు."
\s5
\p
\v 4 తండ్రులారా, ఇక మీ విషయానికొస్తే మీ పిల్లలకు కోపం వచ్చేలా ప్రవర్తించవద్దు. వాళ్ళని యేసు ప్రభువు చెప్పిన ప్రకారం చక్కగా అన్నీ బోధిస్తూ అన్ని విధాలా క్రమశిక్షణలో పెంచండి.
\s5
\p
\v 5 సేవకులారా, మీరైతే ఈ లోకంలో మీ యజమానుల పట్ల క్రీస్తుకీ లాగానే గౌరవంగా నమ్మకంగా నడుచుకోండి.
\v 6 తాము కష్టపడి పనిచేస్తున్నట్టు అందరూ చూడాలని కొంతమంది ఇతరులు చూస్తున్నప్పుడు విధేయంగా ఉన్నట్టు కనిపిస్తారు. మీరైతే క్రీస్తు బానిసలు అయినట్టుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగించండి.
\v 7 మనుషులకు గాక ప్రభువుకు చేసినట్టే యజమానులకు ఇష్టపూర్వకంగా సేవచేయండి.
\v 8 ఎవరూ చేసిన మంచి పనికైనా యేసు ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం ఇస్తాడు గనక ఇలా చెయ్యండి. అలాటి వాడు బానిసైనా స్వతంత్రుడైనా, ఇదే జరుగుతుంది.
\s5
\p
\v 9 యజమానులారా, మీ బానిసలు మిమ్మల్ని చక్కగా సేవించాలని చెప్పాము గదా, అదే విధంగా మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళని బెదిరించడం మానుకోండి. పరలోకంలో మీ ప్రభువూ, వాళ్ళ ప్రభువూ ఒక్కడేననీ ఆయన రాజునీ పేదనీ అందరినీ సమభావంతో చూస్తున్నాడని మర్చిపోకండి.
\s5
\p
\v 10 చివరిగా, యేసు ప్రభువు మహాశక్తిమంతుడు గనక మిమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరచేలా ఆయనపై ఆధారపడండి.
\v 11 శత్రువుపై యుద్దమాడేందుకు సైనికుడు తన కవచం ధరిస్తాడుగదా. అలానే మీరు కూడా సాతాను మీకు విరోధంగా చేసే ప్రతి పన్నాగాన్నీ తిప్పికొట్టేటందుకు దేవుడిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక వనరునూ వాడుకోవాలి.
\s5
\p
\v 12 గుర్తుంచుకోండి. మనం నరమాత్రులతో పోరాడడం లేదు. ఈ దుష్ట కాలంలో చెడ్డ పనులు చేసే మనుషులను ఏలే అధికారం గల దురాత్మలతో పోరాడుతున్నాము. అంటే గాలిలో ఉండే దయ్యాల గుంపులతో పోరాడుతున్నాము.
\p
\v 13 అందువల్ల సైనికుడు తన కవచమంతా ధరించినట్టు మీరు దేవుడిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక వనరునూ మీరు ఉపయోగించుకోవాలి. అలా చేస్తే గనక దురాత్మలు మీపై దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదిరించగలుగుతారు. ఎప్పుడూ దాడి చేసినా సిద్ధంగా ఉంటారు.
\s5
\p
\v 14 శత్రువును ఎదిరించడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండడం కోసం దేవుడు మీకు చూపించిన శ్రేష్ఠమైన విషయాలను తలపోసుకుంటూ ఉండండి. నీతిగా ప్రవర్తించండి. ఇది ఒక సైనికుడి రొమ్ము భాగాన్ని భద్రం చేసే కవచంలాగా పని చేస్తుంది.
\v 15 సైనికుడు ఎప్పుడూ బూట్లు వేసుకుని ఉన్నట్టే దేవునితో శాంతిసమాధానాలు చేకూర్చే సువార్త ప్రకటించడానికి ఎక్కడికైనా వెళ్ళేటందుకు సిద్ధంగా ఉండండి.
\v 16 సైనికుడు శత్రువు వదిలే అగ్ని బాణాలనుండి తనను కాపాడుకోడానికి డాలు పట్టుకున్నట్టుగానే ప్రభువుపై అన్నిసమయాల్లోనూ విశ్వాసం ఉంచాలి. మీ విరోధి దుష్టుడైన సాతాను ఆధ్యాత్మికంగా మీకు హాని కలిగించడానికి ప్రయోగించే ఎత్తుగడలన్నిటినుంచీ అది మిమ్మల్ని భద్రపరుస్తుంది.
\s5
\v 17 ఇంకా సైనికుడు తన తల భద్రత కోసం హెల్మెట్ పెట్టుకుంటాడు. అలానే దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు అనే వాస్తవం పై ఆధారపడండి. శత్రువును ఓడించడానికీ సైనికుడు కత్తితో పోరాడినట్టు దేవుని ఆత్మ ఇచ్చే ఆయుధం ప్రయోగించండి. అది దేవుడి నుంచీ మీకు అందే సందేశమే.
\p
\v 18 దేవుడికి ప్రార్థన, విన్నపాలు చేసినప్పుడల్లా ఎలా ప్రార్థించాలో దేని కోసం ప్రార్థించాలో తెలియాలంటే ఎప్పుడూ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. ప్రార్థన ఫలితాలను ఇవ్వాలంటే దేవుడు ఏమి చేస్తున్నాడో కనిపెట్టుకుని చూస్తూ ఉండండి. దేవుని ప్రజల కోసం మీరు ప్రార్థన చెయ్యడంలో నిలకడగా ఉండండి.
\s5
\v 19 గతంలో ఇతరులకు తెలియని క్రీస్తు సువార్తను నేను ధైర్యంగా ప్రకటించేలా, నేను ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడాలో దేవుడు నాకు తెలిపేలా నా కోసం ప్రార్థన చెయ్యండి.
\v 20 నేను మనుషులకు క్రీస్తును గురించి అంతటా చెబుతున్న కారణంగానే నేనిక్కడ చెరసాలలో ఆయన నిమిత్తం ఉన్నాను. నేనీ పని కొనసాగించేలా ప్రార్థన చెయ్యండి. ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
\s5
\p
\v 21 నాకెంతో ఇష్టమైన నా సాటి విశ్వాసి తుకికు ప్రభువును ఎంతో నమ్మకంగా సేవిస్తున్నాడు. ఇక్కడ ఏమి జరుగుతున్నదో నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో అన్నీ అతడు మీకు చెబుతాడు.
\v 22 ఈ కారణం తోనే నేను ఈ ఉత్తరం అతని చేతికిచ్చి పంపుతున్నాను. మేమెలా ఉన్నామో అతని వల్ల మీకు తెలుస్తుంది. అతడు మిమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తాడు.
\s5
\p
\v 23 తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు నా సాటి విశ్వాసులైన మీకు శాంతి అనుగ్రహించి మీరు ఆయనపై విశ్వాసంలో కొనసాగుతూ మీరు ఒకరినొకరు ప్రేమించుకునేలా చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాను.
\v 24 దేవుడు మీ పట్ల, మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వాళ్ళందరిపట్ల కనికరం చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.