Door43-Catalog_te_iev/45-ACT.usfm

2012 lines
408 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id ACT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h అపోస్తలుల కార్యములు
\toc1 అపోస్తలుల కార్యములు
\toc2 అపోస్తలుల కార్యములు
\toc3 act
\mt1 అపోస్తలుల కార్యములు
\s5
\c 1
\p
\v 1 ప్రియమైన తియోఫిల్ గారికి, నేను నా మొదటి పుస్తకంలో యేసు చేసిన పనులు, ఆయన బోధించిన సంగతులు మొదలుకొని, ఆయన పరలోకానికి ఎక్కిపోయిన విషయం వరకు రాసాను.
\v 2 పరలోకానికి వెళ్ళిపోక ముందు ఆయన తాను ఎన్నుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు జరిగించవలసిన పనులను గురించి చెప్పాడు.
\v 3 ఆయన సిలువపై హింసలు పడి మరణించి మళ్ళీ తిరిగి లేచి నలభై రోజులపాటు తరచుగా వాళ్లకు కనిపించాడు. తాను తిరిగి బ్రతికానని అనేక విధాలుగా రుజువులు చూపించాడు. దేవుడు తన ప్రజలను తన రాజ్యంలో పరిపాలిస్తాడని వాళ్లకు బోధించాడు.
\s5
\p
\v 4 యేసు తన శిష్యులతో కలసి ఉన్న సమయంలో వాళ్ళతో ఇలా చెప్పాడు, "నా తండ్రి మీ కోసం ఆత్మను పంపేదాకా ఎదురు చూస్తూ ఉండండి, అప్పటివరకు మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకండి. ఈ సంగతి నేను మీకు ముందుగానే చెప్పాను.
\v 5 బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు నీళ్ళలో బాప్తిసమిచ్చాడు. అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసమిస్తాడు."
\s5
\p
\v 6 ఒకరోజు అపొస్తలులు యేసును కలిసినప్పుడు ఆయనను ఇలా అడిగారు, "ప్రభూ, గతంలో ఇశ్రాయేలీయులను పాలించిన దావీదు రాజువలె నువ్వు మాకు రాజువు అవుతావా?"
\v 7 అందుకాయన ఇలా బదులిచ్చాడు, "అది జరగబోయే సమయం మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. నా తండ్రి మాత్రమే నన్ను రాజుగా నియమించే రోజును, సమయాన్ని నిర్ణయిస్తాడు."
\p
\v 8 "అయితే పరిశుద్ధాత్మ దిగి వచ్చి మీకు శక్తి ప్రసాదిస్తాడు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాలలోను, ఇంకా ప్రపంచమంతటా నా గురించి ప్రకటించగలుగుతారు."
\s5
\p
\v 9 ఆయన ఇలా చెప్పిన తరువాత ఆకాశంలోకి ఆరోహణం అయ్యాడు. ఒక మేఘం ఆయన వాళ్లకు కనబడకుండా అడ్డు వచ్చింది.
\p
\v 10 ఆయన ఆకాశంలోకి వెళ్తూ ఉండడం ఆసక్తిగా చూస్తూ ఉన్న అపొస్తలుల ఎదుట ఆకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు.
\v 11 ఆ దూతలు, "గలిలయ మనుషులారా, మీరు ఇక్కడే నిలబడి పైకి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు పరలోకానికి తీసుకువెళ్తున్న ఈ యేసు తిరిగి ఒకరోజున భూలోకానికి తిరిగి వస్తాడు. పరలోకానికి వెళ్ళిన విధంగానే ఆయన తిరిగి రావడం మీరు చూస్తారు" అని చెప్పారు.
\s5
\p
\v 12 దేవదూతలు వెళ్ళిపోయిన తరువాత అపాస్తలులు యెరూషలేముకు సమీపాన ఉన్న ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
\p
\v 13 పట్టణంలోకి ప్రవేశించి తాము నివసిస్తున్న ఇంటి మేడగదికి చేరుకున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తోలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుల వర్గానికి చెందిన సీమోను, యాకోబు కొడుకు యూదా అనేవాళ్ళు.
\v 14 ఈ అపోస్తలులంతా కలిసి అస్తమానం ప్రార్థిస్తూ ఉన్నారు. యేసుతో కలిసి ఉన్న స్త్రీలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ వారితో ఉన్నారు.
\s5
\p
\v 15 ఆ రోజుల్లో పేతురు వాళ్ళకు ఆసరాగా నిలబడ్డాడు. కనీసం 120 మంది యేసు అనుచరులు అక్కడ సమావేశమయ్యారు.
\p
\v 16 పేతురు వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడాడు, "నా సాటి విశ్వాసులారా, పూర్వ కాలంలో రాజైన దావీదు పలికిన విధంగా లేఖనాల్లో రాసినట్టు ఏమి జరగాలో అదంతా జరిగింది. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినట్టుగా యూదా ద్వారా ఆ ప్రవచనం నేరవేరింది."
\s5
\p
\v 17 "యూదాను మాతో కలసి అపోస్తలుడుగా సేవ చేయడానికి యేసు నియమించినప్పటికీ అతడు యేసును బంధించడానికి శత్రువులకు ఉపాయం చెప్పాడు."
\p
\v 18 "యూదా యేసుకు చేసిన నమ్మకద్రోహానికి ప్రతిఫలంగా యూదు నాయకులనుంచి అతనికి డబ్బు ముట్టింది. తరువాత అతడు ఆ డబ్బును వాళ్లకు ఇచ్చేసి, ఉరి వేసుకుని మరణించాడు. అతని శవం నేలపై పడి అతని పొట్ట పగిలి పేగులు బయటపడ్డాయి. అప్పుడు యూదు నాయకులు అతనికి ఇచ్చిన సొమ్ముతో ఒక పొలం కొన్నారు."
\p
\v 19 "యెరూషలేము పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయం విన్నారు. ఆ పొలాన్ని తమ మాతృ భాష అరమెయిక్ లో "అకెల్డమ" అని పిలిచారు. దీని అర్థం "నెత్తురు నేల." ఎందుకంటే అక్కడ ఒక మనిషి చనిపోయాడు."
\s5
\p
\v 20 పేతురు ఇంకా ఇలా చెప్పాడు, "కీర్తనల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా యూదా విషయంలో ఇదంతా జరిగింది."
\q1 "అతని కుటుంబం నశించిపోతుంది, అక్కడ ఎవ్వరూ మిగలరు."
\q1 "అతని స్థానంలో మరొకరు నాయకునిగా ఎంపిక అవుతారు"
\q1 అని దావీదు రాసినట్టు యూదా విషయంలో అంతా జరిగింది."
\s5
\p
\v 21 "కాబట్టి యూదా స్థానంలో మరొక అపొస్తలుని ఎంపిక చేయవలసిన అవసరత ఏర్పడింది. ఎన్నిక కాబోయే వ్యక్తి యేసు ప్రారంభ దినాలనుంచి మనతో ఉన్నవాడై ఉండాలి.
\v 22 అంటే బాప్తిసమిచ్చే యోహాను దగ్గర యేసు బాప్తిసం పొందిన సమయం నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన రోజు దాకానన్నమాట. యూదా స్థానంలో వచ్చేవాడు యేసు గురించి బోధిస్తూ, ఆయన మరణించి తిరిగి లేచాడని మాతో కలసి ప్రకటించేవాడై ఉండాలి."
\p
\v 23 మిగిలిన అపోస్తలులు, ఇతర విశ్వాసులు కలిసి ఇద్దరి పేర్లు ఎంపిక చేశారు. వాళ్ళలో ఒకడు యోసేపు బర్సబ్బా. ఇతణ్ణి యూస్తు అని కూడా పిలుస్తారు. మరొకడు మత్తీయ.
\s5
\p
\v 24 తరువాత వాళ్ళంతా కలసి, "యేసు ప్రభూ, అపోస్తలుడుగా యూదా తన స్థానం విడిచి పాపం చేసి తనకు కేటాయించిన చోటికి చేరుకున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాలోచనలు నీకు తెలుసు.
\v 25 కనుక ఈ ఇద్దరిలో యూదా స్థానంలో ఎన్నుకోదగ్గ వ్యక్తిని మాకు చూపించు" అని ప్రార్ధించారు.
\v 26 తరువాత వాళ్ళు ఇద్దరి పేర్లు రాసి చీట్లు వేసారు. చీటీ మత్తీయ పేరున వచ్చింది. ఇక అప్పటినుండి అతడు మిగిలిన పదకొండుమందితో కలసి అపోస్తలుడుగా కొనసాగాడు.
\s5
\c 2
\p
\v 1 పెంతెకొస్తు పండగనాడు యూదులు, విశ్వాసులందరూ పండగ జరుపుకోవడానికి యెరూషలేముకు చేరుకున్నారు.
\p
\v 2 ఆ రోజు ఉదయం అకస్మాత్తుగాఈదురు గాలి లాంటి శబ్దం వాళ్ళకి వినిపించింది. ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళంతా ఆ శబ్దం విన్నారు.
\v 3 కొద్దిసేపటికి వాళ్ళు పైనుండి వస్తున్న అగ్ని జ్వాలలను చూసారు. అవి నాలుకలుగా చీలిపోయి విశ్వాసులందరి మీదా వాలాయి.
\v 4 అప్పుడు విశ్వాసులంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆ ఆత్మ ఇచ్చిన శక్తి కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 5 ఆ సమయంలో పెంతెకొస్తు పండగ ఆచరించడానికి యూదులంతా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా దేవుణ్ణి ఆరాధించడానికి వివిధ దేశాలనుంచి వచ్చిన నిష్ఠ గల యూదులు.
\v 6 పెను గాలిలాంటి శబ్దం విని వాళ్ళంతా విశ్వాసులు కూడి ఉన్న చోటికి గుంపులుగా చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ విశ్వాసులు తమ తమ సొంత భాషలో మాట్లాడడం విని ఆశ్చర్యపడ్డారు.
\v 7 వాళ్ళు పూర్తిగా గందరగోళానికి లోనయ్యారు, "ఇలా మాట్లాతున్న వాళ్ళంతా గలిలయ నుంచి వచ్చినవాళ్ళే కదా, వీళ్ళు మన భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు?" అనుకున్నారు.
\s5
\v 8 "మనం వింటున్నది పుట్టినప్పటి నుండి మనం మాట్లాతున్న భాష.
\v 9 మనలో కొందరం పార్తీయ, మాదీయ, ఎలామీయ ప్రాంతాలకు చెందిన వాళ్ళం. కొందరం మెసపోటేమియా, యూదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా ప్రాంతాల వాళ్ళం."
\p
\v 10 అక్కడ చేరిన మరి కొందరు ఫ్రుగియ, పంపూలియ, ఈజిప్టు, ఇంకా ఇతర ప్రాంతాలైన కురేనేలో భాగమైన లిబియ, రోమ్ నుంచి యెరూషలేముకు వచ్చినవాళ్ళు.
\p
\v 11 వాళ్ళు "యూదులూ, యూదేతరులూ, యూదా మతంలోనికి మారిన వాళ్ళూ, క్రేతు ప్రజలు, అరబ్బు జాతివారు మొదలైన మనమంతా వీళ్ళు మన భాషల్లో దేవుడు చేసిన గొప్ప పనులను గురించి వీళ్ళు చెబుతుంటే వింటున్నాము" అనుకున్నారు.
\s5
\p
\v 12 జరుగుతున్న దాన్నిబట్టి విస్మయం చెంది "ఏమి జరుగుతున్నదో, ఇదేమిటో" అని ఒకళ్ళతో ఒకరు చెప్పుకున్నారు.
\v 13 కొందరైతే "వీళ్ళు విపరీతంగా కొత్త సారా తాగి ఇలా మాట్లాడుతున్నారు" అన్నారు.
\s5
\p
\v 14 అయితే పేతురు ఆ పదకొండుమంది అపొస్తలులతో సహా లేచి నిలబడి ఆ జనసమూహంతో గట్టిగా ఇలా చెప్పాడు, "యూదయ ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరంతా నేను చెప్పేది వినండి. జరుగుతున్నదంతా నేను మీకు వివరిస్తాను."
\p
\v 15 "మీలో కొందరు మేము సారాయి తాగామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలే అయింది. ఈ సమయంలో ఎవ్వరూ మద్యపానం చెయ్యరు."
\s5
\p
\v 16 "అయితే, పూర్వ కాలంలో యోవేలు ప్రవక్త రాసినట్టుగా ఒక అద్భుత కార్యం ఇక్కడ జరిగింది."
\p
\v 17 "యోవేలు ప్రవక్త ఇలా రాసాడు,
\q1 "చివరి రోజుల్లో నేను ప్రజలందరికీ నా ఆత్మ అనుగ్రహిస్తాను.
\q1 మీ కొడుకులు, కూతుళ్ళు నన్ను గురించి ప్రకటిస్తారు.
\q1 మీ యువకులకు నా దర్శనాలు, మీ ముసలివాళ్ళకు కలలు అనుగ్రహిస్తాను.
\s5
\q1
\v 18 ఆ రోజుల్లో నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
\q1 వాళ్ళు ప్రజలకు నా గురించి ప్రకటిస్తారు."
\p
\v 19 "పైన ఆకాశంలో, కింద భూమిపై అనేకమైన అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రజలు చూస్తారు."
\q1 "రక్తం, అగ్ని, పొగ భూమి అంతటా వ్యాపించడం ప్రజలు చూస్తారు.
\s5
\q1
\v 20 ప్రభువును, దేవుడినైన నేను ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చేందుకు రాకముందు
\q1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
\q1
\v 21 ఆ సమయానికి ముందు తమ పాపాల భారం నుండి విడుదల కోరుకున్నవాళ్ళు
\q1 విమోచన పొందుతారు అని దేవుడు చెబుతున్నాడు."
\s5
\p
\v 22 పేతురు ఇంకా మాట్లాడుతూ "ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి. నజరేతు వాడైన యేసు మీ మధ్య నివసించాడు. అప్పుడు దేవుడు ఆయనచే బోలెడన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు చేయించి ఆయన తన కుమారుడని కనపరచుకున్నాడు. ఇది నిజమని మీకు తెలుసు."
\p
\v 23 "అయినప్పటికీ మీరు ఆయనను శత్రువుల చేతికి అప్పగించారు. అయితే దేవుడు ముందుగానే సిద్ధపరచిన ప్రణాళిక ప్రకారం ఇది జరిగింది. ఆయనను మీరు దుష్టులకు అప్పగించి సిలువ వేయించి చంపారు.
\v 24 ఆయన చనిపోయాడు. అయితే దేవుడు ఆయనను తిరిగి లేపాడు. ఆయనను చనిపోయిన స్థితిలో ఉంచడం అసాధ్యం కనుక దేవుడు ఆయనను తిరిగి బతికించాడు.
\s5
\v 25 రాజైన దావీదు క్రీస్తును గురించి ఇలా అన్నాడు."
\q1 "ప్రభువైన దేవుడు నా మాట ఎల్లప్పుడూ ఆలకిస్తాడని నాకు తెలుసు.
\q1 నువ్వు నా కుడిపక్కన ఉన్నావు, నాకు హాని చేసే వాళ్ళకి నేను భయపడను.
\q1
\v 26 ఓ దేవా, అందుకే నేను ఉల్లాసంతో నిన్ను స్తుతిస్తాను.
\q1 మరణం నుండి నువ్వు నా శరీరాన్ని సజీవంగా లేపుతావని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
\s5
\q1
\v 27 నన్ను నీకు సమర్పించుకున్నాను, ఎప్పుడూ నీకు లోబడే ఉంటాను
\q1 కాబట్టి నువ్వు నన్ను పాతాళంలో విడిచిపెట్టవు, నా శరీరాన్ని కుళ్ళిపోనియ్యవు.
\q1
\v 28 ఏవిధంగా మృత్యుంజయుణ్ణి ఎలా కాగలనో చూపించావు.
\q1 నాతో సదాకాలం ఉంటావు గనుక నన్ను చాలా సంతోషంగా ఉంచుతావు."
\s5
\p
\v 29 పేతురు ఇంకా ఇలా చెప్పాడు, "నా తోటి యూదులారా, మన పూర్వికుడైన దావీదు చనిపోయాడు, సమాధి అయ్యాడు. అతని సమాధి నేటికీ ఇక్కడ ఉంది.
\v 30 దావీదు మహారాజు ప్రవక్త కాబట్టి తన వంశంలో నుండి రాజు వస్తాడని దేవుడు చేసిన వాగ్దానం ఉందని అతనికి తెలుసు.
\v 31 చాలాకాలం క్రితమే దేవుడు చేసిన ఆ వాగ్దానం నెరవేరుతుందని అతనికి తెలుసు. మెస్సీయ అయిన క్రీస్తు పాతాళంలో ఉండిపోలేదనీ, ఆయన శరీరం కుళ్ళిపోలేదనీ ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్నిగూర్చి చెప్పాడు."
\s5
\p
\v 32 "యేసు మరణించాడు, దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఆయన శిష్యులంగా మేమంతా దీనికి సాక్షులం. ఎందుకంటే మేము ఆయనను చూసాం.
\v 33 దేవుడు ఆయనను హెచ్చించి తనతో కలసి పరిపాలించడానికి పరలోకానికి కొనిపోయాడు. దేవుడు వాగ్దానం చేసినట్టుగా యేసు పరిశుద్ధాత్మను పొందాడు. మీరు చూస్తున్న, వింటున్న ఆ ఆత్మను ఆయన మాపై కుమ్మరించాడు.
\s5
\v 34 దావీదు తనను గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అతడు యేసు వలె పరలోకానికి వెళ్ళలేదు. అయితే, మెస్సీయ గురించి ఇలా చెప్పాడు."
\q1 "నేను నీ శత్రువులను పూర్తిగా ఓడించే వరకు
\q1
\v 35 నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు."
\p
\v 36 "మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది మీరంతా ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి" అని చెప్పి పేతురు తన మాటలు ముగించాడు.
\s5
\p
\v 37 పేతురు, ఇతర అపొస్తలుల మాటలు విన్న ప్రజలు తాము చేసిన తప్పు గ్రహించారు. "మేమేమి చెయ్యాలి?" అని వాళ్ళని అడిగారు.
\v 38 అందుకు పేతురు, "మీలో ప్రతి ఒక్కడూ మీ పాప స్వభావం విడిచిపెట్టండి. మెస్సీయ అయిన యేసును నమ్మి, ఆయన మీకోసం ఏమి చేశాడో గ్రహించినప్పుడు, మీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడానికి సూచనగా మేము మీకు బాప్తిసం ఇస్తాము. దేవుడు మీకే పరిశుద్ధాత్మను ఇస్తాడు.
\v 39 ఈ వాగ్దానం మీకూ, మీ పిల్లలకూ, యేసును నమ్మిన వాళ్ళందరికీ, దూరంగా నివసించేవాళ్ళకీ చెందుతుంది. అంటే మన ప్రభువైన దేవుడు తన దగ్గరకు పిలుచుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ లభిస్తాడు."
\s5
\p
\v 40 పేతురు ఇంకా గట్టిగా కొన్ని విషయాలు బోధించి వాళ్ళని హెచ్చరించాడు. "యేసును తృణీకరించే ఈ చెడ్డ తరం వారిని శిక్షించినట్టు దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా ఉండేలా రక్షణ కోసం దేవుణ్ణి వేడుకోండి" అని చెప్పాడు.
\p
\v 41 పేతురు బోధ విన్న వాళ్ళు చాలామంది బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు 3,000 మంది కంటే పైగా విశ్వాసుల గుంపులో చేరారు.
\v 42 వాళ్ళు ప్రతిరోజూ ఇతర విశ్వాసులతో క్రమంగా కలుసుకుంటూ అపొస్తలుల బోధలో, రొట్టె విరవడంలో, సహవాసంలో, ప్రార్థనలో కొనసాగారు.
\s5
\p
\v 43 అప్పుడు అపొస్తలులు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాల వల్ల యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవునిపట్ల గౌరవ మర్యాదలు పెరిగాయి.
\v 44 యేసును నమ్మిన విశ్వాసులంతా ఒకే విశ్వాసం పై నిలిచి క్రమంగా సమావేశం అవుతూ వచ్చారు. ప్రతిరోజూ తమకున్న దానిని ఉమ్మడిగా పంచుకున్నారు.
\v 45 క్రమేణా కొందరు తమ పొలాలను, ఆస్తిపాస్తులను అమ్మివేసి ఇతర విశ్వాసుల అవసరాలు తీర్చడానికి ఆ ధనం ఉపయోగించారు.
\s5
\v 46 ప్రతిరోజూ దేవాలయంలో కలుస్తూ, ఇళ్ళలో భోజనం చేస్తూ తమకున్నది ఇతరులతో పంచుకుంటూ, ఆనందంగా కలసి ఉన్నారు.
\p
\v 47 వాళ్ళు ఇలా చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ కొనసాగుతూ యెరూషలేములోని ప్రజల మన్నన పొందారు. ఇలా కొనసాగుతూ ఉండగా యేసు ప్రభువు ప్రతిరోజూ తమ పాపపు శిక్ష నుండి రక్షణ పొందిన వాళ్ళని సంఘంలో చేర్చుతూ వచ్చాడు. క్రమంగా సంఘ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
\s5
\c 3
\p
\v 1 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి.
\p
\v 2 అక్కడ పుట్టినప్పటి నుండి నడవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవాలయనికి ఉన్న "సౌందర్య ద్వారం" అనే పేరుగల గేటు పరిసరాల్లో కూర్చుని ఉన్నాడు. ప్రతిరోజూ కొందరు మనుషులు అతణ్ణి అక్కడికి మోసుకువచ్చి కూర్చోబెడతారు. అతడు దేవాలయానికి వస్తూ ఉండేవాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు.
\p
\v 3 పేతురు, యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వాడు వాళ్ళను భిక్షం వేయమని అడగడం మొదలుపెట్టాడు.
\s5
\v 4 పేతురు, యోహానులు అతని వైపు సూటిగా చూసారు. పేతురు అతనితో, "మా వైపు చూడు" అన్నాడు.
\v 5 ఏదైనా సహాయం చేస్తారని అతడు వాళ్ళవైపు చూసాడు.
\v 6 అప్పుడు పేతురు అతనితో, "నా దగ్గర డబ్బు ఏమీ లేదు, అయితే నా దగ్గర ఉన్నదే నీకిస్తున్నాను. నజరేతు వాడైన యేసు నామంలో నువ్వు స్వస్థత పొందావు. లేచి నడువు" అని చెప్పాడు.
\s5
\v 7 అప్పుడు పేతురు అతని కుడి చెయ్యి పట్టుకుని అతడు నిలబడడానికి సహాయం చేసాడు. వెంటనే అతని కాళ్ళకు, చీలమండలకు శక్తి వచ్చింది.
\v 8 వాడు లేచి గంతులు వేసి నడవసాగాడు. వాడు నడుస్తూ గంతులు వేస్తూ పేతురు యోహానుతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు.
\s5
\v 9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూసారు.
\p
\v 10 "సౌందర్య ద్వారం దగ్గర అడుక్కునేవాడు వీడే" అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, గందరగోళంలో మునిగిపోయారు.
\s5
\p
\v 11 వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉండడాన్ని చూసిన జనమంతా ఆశ్చర్యపడి, సోలోమోను మండపంలో వాళ్ళ దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
\p
\v 12 దీన్ని చూసిన పేతురు ప్రజలతో ఇలా అన్నాడు "ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితో అతడు నడిచేలా చేేేశామన్నట్లు ఎందుకలా చూస్తున్నారు?"
\s5
\p
\v 13 "ఇప్పుడు నేను నిజంగా జరుగుతున్నది చెప్తాను. మన పూర్వికులు అబ్రాహాము, ఇస్సాకు, యకోబులు దేవుణ్ణి మహిమ పరిచారు, ఇప్పుడు దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరు ఆయన్ని పిలాతుకు అప్పగించారు, ఆయన్ని విడుదల చెయ్యడానికి పిలాతు నిశ్చయించుకున్నప్పడు మీరు దాన్ని అడ్డుకున్నారు."
\p
\v 14 "దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయుల మెస్సీయ, నీతిమంతుడు అయిన యేసుని మీరు తిరస్కరించి, ఒక హంతకుణ్ణి విడుదల చేయాలని అడిగారు."
\s5
\p
\v 15 "నిత్యజీవం ఇచ్చే యేసుని మీరు చంపించారు, కాని దేవుడు ఆయనను చావు నుండి తిరిగి లేపాడు. అందుకు సాక్షులం మేమే."
\p
\v 16 "యేసు జరిగించిన కార్యాలపై ఉంచిన విశ్వాసమే ఇతనిని బలపరిచింది. యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ఎదుట ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
\s5
\v 17 "సోదరులారా, మీరు, మీ నాయకులు యేసు మెస్సీయ అని తెలియక తప్పు చేసారని నాకు తెలుసు."
\p
\v 18 "ప్రజల చేతుల్లో యేసు మరణిస్తాడని ప్రవక్తల ముందే చెప్పిన విధంగానే ఇదంతా జరిగింది.
\s5
\v 19 కాబట్టి మీ పాపాల నుంచి మళ్లుకొని దేవునికి ఇష్టులుగా నడుచుకోండి. కాగా ఆయన మీ పాపాలను క్షమించి మిమ్మల్ని బలపరుస్తాడు.
\v 20 అలా చేసినప్పుడు దేవుడు అభిషిక్తుడైన యేసును మీ కోసం మళ్ళీ పంపుతాడు.
\s5
\v 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండటం అవసరం.
\v 22 మోషే మెస్సీయ గురించి ఇలా అన్నాడు, "ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుంచి మీ కోసం పంపుతాడు, మీరు తప్పకుండా ఆయన చెప్పింది వినాలి."
\v 23 ఆ ప్రవక్త చెప్పిన దాన్నివినని వాడు, ఆయనకు లోబడనివాడు దేవుని ప్రజల్లో ఉండకుండా నాశనమైపోతారు అన్నాడు."
\s5
\p
\v 24 పేతురు ఇంకా "ఈ రోజుల్లో ఏమి జరుగుతుందో ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. సమూయేలుతో సహా మిగిలిన ప్రవక్తలు ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
\v 25 "నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న కుటుంబాలన్నీ దీవెనలు పొందుతాయని దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది.
\v 26 "ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని దుష్టత్వం నుండి తప్పించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మెస్సీయగా యేసును ఈ లోకానికి మొదట పంపించాడు" అని చెప్పాడు.
\s5
\c 4
\p
\v 1 దేవాలయం ఆవరణలో పేతురు, యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలయ కాపలాదారుల అధికారి, కొందరు సద్దూకయ్యులు వాళ్ళ దగ్గరికి వచ్చారు.
\v 2 యేసు చనిపోయిన తరువాత దేవుడు ఆయన్ను మళ్ళీ బతికించాడని ఈ ఇద్దరు అపొస్తలులు బోధిస్తూ ఉండడం వాళ్లకు కోపం తెప్పించింది.
\v 3 అందువల్ల ఇద్దరినీ బంధించి చెరసాలలో పడేసారు. అప్పటికే సాయంత్రం కావడంవల్ల యూదు సభ ఎదుట హాజరు పరచడం కోసం మరుసటి రోజు వరకు వేచి ఉన్నారు.
\v 4 పేతురు బోధ విన్న అనేకులు యేసుపై విశ్వాసముంచారు. వాళ్ళలో మగవాళ్ళ సంఖ్య అయిదు వేలకు మించిపోయింది.
\s5
\p
\v 5 తరువాతి రోజు ఆలయ అధికారి ప్రధాన గురువులకూ, యూదా మత పెద్దలకూ, యూదు సభ సభ్యులకూ కబురుపెట్టాడు. అందరూ యెరూషలేములో సమావేశమయ్యారు.
\v 6 ఒకప్పటి ప్రధాన యాజకుడు అన్నతోపాటు కయప, యోహాను అలెగ్జాండర్, ఇంకా ఇతర అధికారులు హాజరయ్యారు.
\p
\v 7 పేతురు, యోహానులను తీసుకురమ్మని కాపలాదారులకు ఆజ్ఞాపించారు. "కుంటివాణ్ణి నడవగలిగేలా చేసే ప్రభావం మీకు ఎవరిచ్చారు?" అని వారిని ప్రశ్నించారు.
\s5
\v 8 పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడంతో పేతురు వాళ్ళతో ఇలా చెప్పాడు, "నాతోటి ఇశ్రాయేలు అధికారులారా, ఇతర పెద్దలారా, నేను చెప్పేది వినండి.
\v 9 మేము ఆ కుంటివాణ్ణి బాగు చేసిన మంచి పని గురించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరూ, ఇశ్రాయేలు ప్రజలూ అందరూ వినండి."
\p
\v 10 "నాతోటి ఇశ్రాయేలు ప్రజలంతా దీన్ని తెలుసుకోవాలి. నజరేయుడైన యేసును మీరు సిలువకు వేలాడదీసి చంపారు, తండ్రి ఆయనను సజీవుడుగా తిరిగి లేపాడు. ఆ కుంటివాడికి యేసు నామంలో స్వస్థత కలిగింది."
\s5
\p
\v 11 "ఎవరిగురించి "ఇల్లు కట్టే వాళ్ళు వదిలేసిన రాయి భవనానికి మూలరాయి అవుతుంది" అని లేఖనాల్లో చెప్పారో ఆ మూల రాయి నజరేతు వాడైన యేసే."
\p
\v 12 "కేవలం యేసు మాత్రమే మనల్ని రక్షించగలడు. మన పాపాల నుండి మనల్ని రక్షించగల శక్తిని దేవుడు లోకంలో ఇంకెవ్వరికీ ఇవ్వలేదు."
\s5
\p
\v 13 తమకు పేతురు యోహానులు భయపడడం లేదని యూదా అధికారులు గ్రహించారు. ఈ ఇద్దరూ సామాన్యులని ఎలాంటి చదువు సంధ్యలు లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఈ ఇద్దరూ యేసుతో కలసి ఉన్నవారని గుర్తించారు.
\p
\v 14 బాగుపడిన వ్యక్తి పేతురు, యోహానులతో ఉండడం వల్ల వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోయారు.
\s5
\p
\v 15 యూదా అధికారులు కాపలాదారుల్ని పిలిచి పేతురు యోహానులను, స్వస్థత పొందిన వ్యక్తినీ బయటకు తీసుకువెళ్ళమని చెప్పారు. తరువాత ఆ నాయకులు ఆ ఇద్దరి గురించి ఒకళ్ళతో ఒకరు మాట్లాడుకున్నారు.
\p
\v 16 "ఈ ఇద్దరినీ శిక్షించడానికి ఏమీ లేదు. యెరూషలేములో ప్రతి ఒక్కరూ ఈ అద్భుత కార్యం జరగడం చూశారు. కాబట్టి మనం ప్రజలకు ఏమీ జరగలేదని చెప్పలేము."
\p
\v 17 "అయితే ఇకనుండి యేసు గురించి వీళ్ళు చెప్పేది ఎవ్వరూ వినవద్దని ప్రజలను హెచ్చరిద్దాం, కుంటివాణ్ణి బాగుచేయగల శక్తిగల యేసు గురించి ఇకపై బోధిస్తే శిక్ష తప్పదని వీరిని బెదిరిద్దాం" అని చెప్పుకున్నారు.
\p
\v 18 యూదు నాయకులు ఇద్దరు అపొస్తలులను లోపలకి పిలిపించారు. ఇక నుంచి యేసు గురించి ఎవ్వరికీ ఏమీ బోధించకూడదని ఆజ్ఞాపించారు.
\s5
\p
\v 19 అందుకు పేతురు యోహానులు, "మేము దేవుని మాట కంటే మీ మాటకు లోబడడం సరియైనదా, మీరే చెప్పండి.
\v 20 మాకు సంబంధించినంత వరకు మేము మీకు లోబడము. మేము యేసును గురించి ఏమి చూశామో, ఏది విన్నామో ప్రజలకు చెప్పకుండా ఉండలేము" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 21 యూదు పెద్దలు మరొకసారి తమ మాట వినక తప్పదని పేతురు యోహానులకు చెప్పారు. వాళ్ళను శిక్షించకుండా వదిలెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, యెరూషలేములోని ప్రజలు జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడుతున్నారు.
\v 22 అద్భుతరీతిగా స్వస్థత పొందిన వాడి వయస్సు 40 ఏళ్ళు పైమాటే.
\s5
\v 23 పేతురు యోహనులు అక్కడినుంచి వచ్చి ప్రధాన యాజకులూ, యూదీయ పెద్దలు తమతో చెప్పిన మాటలన్నీ ఇతర విశ్వాసులకు చెప్పారు.
\p
\v 24 వాళ్ళు ఆ మాటలు విని అందరూ కలిసి ఏక మనస్సుతో దేవుడికి ఇలా ప్రార్థన చేశారు, "ప్రభూ, నువ్వు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్ని కలుగజేసావు."
\v 25 మన పూర్వీకుడైన దావీదు మహారాజు పరిశుద్ధాత్మ పూర్ణుడై
\q "ప్రజల సమూహాలు ఎందుకు కోపం తెచ్చుకుని,
\q ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు?
\s5
\q
\v 26 దేవుని మీదా, ఆయన ఎన్నుకున్న మెస్సీయ మీదా
\q భూలోకంలోని రాజులు, అధికారులు ఏకమై తిరుగుబాటు చేసారు" అని రాశాడు."
\s5
\p
\v 27 "ఇది నిజం. హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఎన్నుకున్న నీ సేవకుడి మీద ఈ పట్టణంలో వ్యతిరేకంగా లేచారు.
\v 28 పూర్వ కాలంలో ఇలా జరగాలని నిర్ణయించావు గనుక దీనిని అనుమతించావు."
\s5
\p
\v 29 "ప్రభూ, వాళ్ళు మా గురించి పలికే మాటలను, మాకు కలుగజేసే హింసను గమనించు. ప్రతిచోటా యేసు నామాన్ని ప్రకటించే వాళ్ళకి సహాయం చెయ్యి.
\v 30 నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో గొప్ప అద్భుత కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేసేలా నీ హస్తం చాపు."
\p
\v 31 విశ్వాసులు ప్రార్థన ముగించగానే వాళ్ళున్న స్థలమంతా కంపించింది. దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించడానికి తగిన శక్తి పరిశుద్ధాత్మ వాళ్ళకి ప్రసాదించాడు.
\s5
\v 32 యేసును విశ్వసించిన ప్రజలంతా తమ ఆలోచనల్లో, అవసరాల్లో పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళలో ఎవరికీ సొంతంగా ఏమీ లేదు. వాళ్లకు ఉన్నదంతా ఒకరితో ఒకరు సమానంగా పంచుకున్నారు.
\p
\v 33 అపొస్తలులు ప్రభువైన యేసును సజీవంగా తిరిగి లేపాడన్న సత్యాన్ని స్థిరంగా బోధించసాగారు. విశ్వాసులందరికీ దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు.
\s5
\v 34 కొందరు విశ్వాసులు తమ భూములు, ఇళ్ళు, మరికొందరు తమ ఆస్తిలో కొంత భాగం అమ్మి, అమ్మగా వచ్చిన సొమ్మును అపొస్తలులకు అప్పగించారు.
\v 35 అపొస్తలులు దాన్ని అవసరంలో ఉన్న విశ్వాసులకు పంచిపెట్టారు. విశ్వాసుల్లో ఎవరికీ ఎలాంటి కొదువా లేకుండా పోయింది.
\s5
\p
\v 36 ఆ ప్రాంతంలో సైప్రస్ ద్వీప నివాసి, లేవి గోత్రానికి చెందిన యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. అపొస్తలులు అతన్ని "బర్నబా"అని పిలిచారు. యూదుల భాషలో ఆ పేరుకు అందరినీ అన్నివేళలా ఆదుకొనేవాడు అని అర్థం.
\v 37 అతడు తనకున్న పొలం అమ్మివేసి వచ్చిన సొమ్మును ఇతర విశ్వాసుల అవసరాల కోసం అపొస్తలులకు అప్పగించాడు.
\s5
\c 5
\p
\v 1 ఆనాటి విశ్వాసుల్లో అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు సప్పీర. అతడు కూడా తన పొలం అమ్మాడు.
\v 2 వచ్చిన పైకంలో కొంత తన కోసం దాచుకొని మిగిలినది అపోస్తలుల దగ్గరికి తెచ్చి వాళ్ళ ఎదుట పెట్టాడు. అతడు కొంత డబ్బు దాచుకున్న సంగతి అతని భార్యకు కూడా తెలుసు.
\s5
\p
\v 3 అప్పుడు పేతురు, "అననీయా, పరిశుద్ధాత్మను మోసగించడానికి నువ్వెందుకు సాతానుకు లొంగిపోయావు? ఇంత భయంకరమైన పని నువ్వు చేయకుండా ఉండవలసింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బులో నువ్వు కొంత దాచుకున్నావు. మొత్తం మాకు ఇవ్వలేదు.
\v 4 పొలం అమ్మకముందు అది నీదే, అమ్మిన తరువాత కూడా ఆ సొమ్ము నీదే. నీ మనసులో ఇలాంటి చెడ్డ పని ఎందుకు ఆలోచించావు? నువ్వు మోసం చేయాలని చూసింది మమ్మల్ని మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా."
\p
\v 5 ఈ మాటలు విన్న వెంటనే అతడు నేలపై పడి చచ్చిపోయాడు.
\v 6 కొందరు యువకులు ముందుకు వచ్చి అతణ్ణి బట్టతో చుట్టి పాతిపెట్టడానికి మోసుకుపోయారు.
\s5
\p
\v 7 మూడు గంటలు గడచిన తరువాత, జరిగినదేమీ తెలియని అతని భార్య లోపలి వచ్చింది.
\v 8 అప్పుడు పేతురు అననీయ తెచ్చిన సొమ్ము చూపించి, "మీరిద్దరూ పొలం అమ్మగా వచ్చిన సొమ్ము ఇదేనా?" అని అడిగాడు. అందుకామె, "అవును, మాకు వచ్చిన మొత్తం సొమ్ము ఇదే" అని చెప్పింది.
\s5
\p
\v 9 అందుకు పేతురు, "మీరిద్దరూ భయంకరమైన తప్పు చేసారు. ప్రభువు ఆత్మను మోసగించడానికి ఇద్దరూ ఏకమయ్యారు. చూడు, నీ భర్తను పాతిపెట్టడానికి వెళ్ళినవాళ్ళు ఇప్పుడే లోపలికి వస్తున్నారు. ఇదుగో తలుపు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు నిన్ను కూడా తీసుకుపోతారు" అన్నాడు.
\v 10 వెంటనే ఆమె పేతురు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చి, చచ్చి పడి ఉన్న ఆమెను మోసుకుపోయి ఆమె భర్త సమాధి పక్కన పాతిపెట్టారు.
\p
\v 11 అననీయ సప్పీరాల విషయంలో దేవుడు చేసిన దాన్ని చూసి యెరూషలేములోని విశ్వాసులకూ చాలా భయమేసింది. ఈ విషయాలు విన్న ప్రతి ఒక్కరికీ భయం కలిగింది.
\s5
\p
\v 12 ప్రజల మధ్య బోధించడానికి, నిజమైన దేవుని శక్తి కనపరచేలా అనేకమైన సూచక క్రియలు చెయ్యడానికి దేవుడు అపొస్తలులకు తోడుగా ఉన్నాడు. విశ్వాసులంతా దేవాలయ ప్రాంగణంలోని సోలోమోను మండపం దగ్గర క్రమంగా కలుసుకుంటున్నారు.
\p
\v 13 యేసును నమ్మని ప్రజలు విశ్వాసులతో కలవడానికి భయపడుతున్నారు. అయితే వాళ్ళు విశ్వాసుల పట్ల గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు.
\s5
\p
\v 14 స్త్రీ పురుషులలో అనేకులు ప్రభువును నమ్మి విశ్వాసుల గుంపులో చేరుతున్నారు.
\p
\v 15 ఫలితంగా, పేతురు నడుస్తూ ఉన్నప్పుడు అతని నీడ అయినా సోకి బాగుపడాలని అనేకులు రోగులను వీధుల్లోకి మంచాలపైనా, పరుపులపైనా తీసుకువచ్చేవారు.
\v 16 యెరూషలేము చుట్టుపక్కల నుండి జనం రోగులను, దయ్యాలు పట్టిన వాళ్ళను అపొస్తలుల దగ్గరికి తీసుకువచ్చారు. దేవుడు వాళ్లకు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు.
\s5
\p
\v 17 ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అంటే సద్దూకయ్యులు తదితరులు అపొస్తలులపై అసూయ పెంచుకున్నారు.
\v 18 దేవాలయ ద్వారపాలకులకు ఆజ్ఞాపించి అపొస్తలులను పట్టణ చెరసాలలో వేయించారు.
\s5
\p
\v 19 అయితే రాత్రి వేళ ప్రభువు దూత చెరసాల తలుపులు తెరిచి అపొస్తలులను బయటకు తెచ్చాడు.
\v 20 తరువాత దూత అపొస్తలులతో, "మీరు వెళ్లి దేవాలయం దగ్గర నిలబడి నిత్యజీవాన్ని గురించిన సందేశం ప్రజలందరికీ చెప్పండి" అని చెప్పాడు.
\p
\v 21 ఈ మాటలు విని అపొస్తలులు దేవాలయం దగ్గరికి వచ్చి యేసు గురించి బోధించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రధాన యాజకుడు, అపొస్తలులను చెరసాలలో పెట్టించిన దేవాలయ నాయకులు, యూదీయ సభ పెద్దలు సమావేశమై అపొస్తలులను విచారణకు తీసుకు రమ్మని కాపలాదారుల్ని పంపించారు.
\s5
\v 22 కాపలాదారులు చెరసాలకు పోయి అపొస్తలులు అక్కడ లేకపోవడం గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సంగతి పెద్దలకు చెప్పారు.
\v 23 "చెరసాల తలుపులు భద్రంగా మూసి ఉన్నాయి. కాపలాదారులు గస్తీ తిరుగుతున్నారు. మేము తలుపులు తీసి చూస్తే మాకు ఎవరూ కనబడలేదు" అని వాళ్ళు చెప్పారు.
\s5
\p
\v 24 ఈ సంగతి విన్న కాపలదారుల అధికారి, ప్రధాన యాజకుడు ఆశ్చర్యానికి, అయోమయానికి గురయ్యారు. "ఇది ఏమవుతుందో" అని బెంబేలెత్తి పోయారు.
\p
\v 25 అప్పుడు ఒకడు అక్కడకు వచ్చి "విన్నారా, మీరు జైల్లో పెట్టిన మనుషులు ఇప్పుడు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు" అని చెప్పాడు.
\s5
\v 26 అప్పుడు ఆ దేవాలయ అధికారి తన అనుచరులతో వెళ్లి అపొస్తలులను తీసుకువచ్చి సభ జరిగే గదిలో నిలబెట్టాడు. వాళ్ళను చాలా మర్యాదగా వెంటబెట్టుకు వచ్చారు. ఎందుకంటే అక్కడ గుమి గూడి ఉన్న ప్రజలు తమను రాళ్ళతో కొడతారేమోనని భయపడ్డారు.
\p
\v 27 ఆ అధికారి తన అనుచరులతో అపొస్తలులను సభ జరిగే గదిలోకి తీసుకు వచ్చినప్పుడు సభ సభ్యులఎదుట నిలబడమని వాళ్ళను ఆజ్ఞాపించారు. ప్రధాన యాజకుడు వాళ్ళను ఇలా ప్రశ్నించాడు.
\v 28 "యేసును గురించి బోధించవద్దని మీకు ఆజ్ఞాపించాము. మీరు మా మాట నిర్లక్ష్యం చేసి, యెరూషలేము అంతటా బోధిస్తున్నారు. అంతేకాక, ఆ మనిషి హత్యానేరాన్ని మామీదికి తేవాలని చూస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 29 అప్పుడు పేతురు, మిగిలిన అపోస్తలులు, "మేము దేవుని ఆజ్ఞలకు లోబడాలి గానీ మీకు కాదు.
\v 30 మీరు యేసును సిలువకు వేలాడేసి చంపారు. మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు ఆయనను చావు నుండి తిరిగి బ్రతికించాడు,
\v 31 దేవుడు ఆయన స్థాయిని హెచ్చించాడు. మనల్ని రక్షించడానికి, పరిపాలించడానికి దేవుడు ఆయనను నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మారుమనస్సు, పాప క్షమాపణ దయచేయడానికి ఆయనను అధికారిగా నియమించాడు.
\v 32 యేసు విషయంలో జరిగిన సంగతులకు మేము, దేవుడు తన విధేయులకు తోడుగా పంపిన పరిశుద్ధాత్మ సాక్షులం. అందుకే ఈ విషయాలన్నీ మేము బోధిస్తున్నాం" అన్నారు.
\s5
\p
\v 33 వాళ్ళు ఈ మాటలు విని, కోపంతో ఊగిపోతూ అపొస్తలులను చంపెయ్యాలని చూశారు.
\v 34 అయితే గమలియేలు అనే పరిసయ్యుడు మాట్లాడడానికి లేచి నిలబడ్డాడు. ఇతడు ధర్మశాస్త బోధకుడు, సంఘంలో అందరిచే గౌరవ మర్యాదలు చూరగొన్నవాడు. అతడు భటులతో అపొస్తలులను కొంచెం సేపు బయటకు తీసుకువెళ్ళమని చెప్పాడు.
\s5
\p
\v 35 వాళ్ళు అపొస్తలులను బయటకు తీసుకు వెళ్ళిన తరువాత సభలోని ఇతర సభ్యులతో ఇలా చెప్పాడు, "నా సాటి ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
\v 36 కొన్ని ఏళ్ల క్రితం తుదాస్ అనే వాడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. తానొక గొప్ప నాయకుడినని చెప్పుకున్నాడు. 400 కంటే ఎక్కువ మంది అతనితో చేతులు కలిపారు. అయితే అతడు హతమయ్యాడు. అతని అనుచరులు చెల్లాచెదరై పోయారు. కనుక వాళ్ళు ఆశించినది ఏమీ సాధించ లేకపోయారు.
\v 37 ఆ తరువాత, పన్నులు విధించడం కోసం జనాభా లెక్కల సేకరణ సమయంలో గలిలయ వాడైన యూదా తిరుగుబాటు చేసి చాలామందిని తనవైపు తిప్పుకున్నాడు. అతడు కూడా హతమయ్యాడు. అతని అనుచరులు కూడా చెదిరిపోయారు.
\s5
\v 38 కాబట్టి నేను చెప్పేదేమంటే, ఈ మనుషులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దు. వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇది మనుషుల ఆలోచనల వల్ల అయినదైతే అది ఎలానూ కుప్పగూలుతుంది.
\v 39 అయితే ఇది గనక దేవుడు నియమించినదైతే మీరు వాళ్ళను ఆపలేరు. అప్పుడు మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడినవారౌతారు." అతడు చెప్పిన మాటలు సభ సభ్యులు అంగీకరించారు.
\s5
\p
\v 40 ఆలయ సైనికులను పిలిచి అపొస్తలులను బయటకు తెచ్చి వాళ్ళను కొరడాలతో కొట్టమని చెప్పారు. సైనికులు అపొస్తలులను కొరడా దెబ్బలు కొట్టారు. ఇకపై యేసును గురించి ఎన్నడూ బోధించవద్దని హెచ్చరించి విడుదల చేశారు.
\v 41 అపొస్తలులు ఆ సభ దగ్గరనుండి బయలుదేరారు. యేసు అనుచరులుగా అవమానం పొందడానికి తాము పాత్రులమని దేవుడు తమను ఎంచినందుకు సంతోషిస్తూ వెళ్ళిపోయారు.
\p
\v 42 తరువాత, ప్రతిరోజూ అపొస్తలులు దేవాలయంలో, ఇళ్ళలో క్రమం తప్పకుండా బోధిస్తూ, యేసే మెస్సీయ అని ప్రకటిస్తూ వచ్చారు.
\s5
\c 6
\p
\v 1 ఆ రోజుల్లో విశ్వాసులుగా మారుతున్నవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. యూదులు కాని విశ్వాసులు ప్రతిరోజూ భోజనం అందించే విషయంలో తమలోని వితంతువులను చిన్నచూపు చూస్తున్నారని యూదులైన ఇశ్రాయేలు విశ్వాసులపై పిర్యాదు చేశారు.
\s5
\p
\v 2 ఇది తెలుసుకున్న అపొస్తలులు యెరూషలేములోని విశ్వాసులందరినీ సమావేశపరిచారు. వాళ్ళతో ఇలా అన్నారు, "మేము బోధించడం, సువార్త అందించడం మానుకుని ప్రజలకు భోజనాలు వడ్డిస్తూ ఉండడం మంచిది కాదు.
\v 3 కాబట్టి మీరు మీలో నుండి ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఎంపిక చేసుకోండి. వాళ్ళు చేయవలసిన పనులను మేము కేటాయిస్తాం.
\v 4 మేము మాత్రం ప్రార్థనలో, సువార్త ప్రకటనలో మా సమయం గడుపుతాం."
\s5
\p
\v 5 ఈ మాటలు విశ్వాసులకు నచ్చాయి. అందువల్ల వాళ్ళు విశ్వాసంలో స్థిరుడై, పరిశుద్దాత్మతో నిండి ఉన్న స్తెఫనును ఎంపిక చేసుకున్నారు. ఇంకా అతనితోపాటు ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, సీమోను, పర్మినాసు, యూదా మతం స్వీకరించిన అంతియొకయ నివాసి నీకోలాసు అనే వాళ్ళను ఈ పనుల నిమిత్తం ఎన్నుకున్నారు.
\v 6 విశ్వాసులు తాము ఎన్నుకొన్న ఏడుగురిని అపొస్తలుల చెంతకు తీసుకువచ్చారు. అపొస్తలులు వాళ్ళలో ప్రతి ఒక్కరి మీదా చేతులుంచి ప్రార్థన చేసి వారి వారి పనులు పురమాయించారు.
\s5
\p
\v 7 విశ్వాసులు అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చారు. దేవుని వార్త అంతటా వ్యాపించి యెరూషలేములో యేసుని నమ్మినవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. సువార్త విని యేసును నమ్మిన యూదా మత బోధకులు కూడా వీరితో కలిశారు.
\s5
\p
\v 8 స్తెఫను దేవుని శక్తితో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు చేస్తూ యేసు సువార్త ప్రకటిస్తున్నాడు.
\v 9 అయితే యూదుల సమాజమందిరాల్లో క్రమంగా కలుస్తూ ఉండే "స్వతంత్రులు" అనే వర్గం, కురేనీయులు, అలెగ్జాండ్రియా వాళ్ళు, కిలికియ, ఆసియా ప్రాంతాలవాళ్ళు స్తెఫనుకు వ్యతిరేకంగా గుమిగూడి, అతనితో వాదులాటకు దిగారు.
\s5
\p
\v 10 దేవుని ఆత్మ ప్రభావంతో జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫను ఎదుట వాళ్ళ వాదనలు నిలవ లేకపోయాయి.
\p
\v 11 అందువల్ల వాళ్ళు కొందరు మనుషులను రహస్యంగా పోగుచేసి, వాళ్ళతో "ఈ వ్యక్తి మోషేను, దేవుణ్ణి దూషిస్తున్నాడు" అని స్తెఫనుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పించారు.
\s5
\p
\v 12 ఇది విన్న యూదా పెద్దలకు, మత గురువులకు స్తెఫనుపై కోపం వచ్చింది. అతణ్ణి బంధించి యూదా మత సభ ఎదుట నిలబెట్టారు.
\v 13 అతనిపై తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు కొందరికి డబ్బు ముట్టజెప్పి వాళ్ళను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వాళ్ళు, "ఇతడు పవిత్ర దేవాలయం గురించీ, దేవుని ధర్మశాస్త్రం గురించీ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు."
\p
\v 14 "నజరేతు వాడైన యేసు దేవాలయాన్ని ధ్వంసం చేసి, మోషే మన పూర్వీకులకు ఇచ్చిన ఆచారాలకు మార్చివేస్తాడని వీడు చెబుతుండగా మేము విన్నాము" అని చెప్పారు.
\p
\v 15 సభలో కూర్చున్న వాళ్ళంతా అతనివైపు చూసినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం లాగా వెలిగిపోతున్నట్టు కనబడింది.
\s5
\c 7
\p
\v 1 ప్రధాన యాజకుడు స్తెఫనుతో "ప్రజలు నీ గురించి చెప్పుకునే మాటలు నిజమేనా?" అని అడిగాడు.
\p
\v 2 అందుకు స్తెఫను "సాటి యూదులారా, నాయకులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపోటేమియాలో ఉన్నప్పుడు మహిమగల మన దేవుడు అతనికి ప్రత్యక్షమై,
\v 3 "నువ్వు, నీ మనుషులూ మీరు నివసిస్తున్న ప్రాంతం విడిచి, నేను నీకు చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు" అని చెప్పాడు."
\s5
\p
\v 4 "అప్పుడు అబ్రాహాము కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మనం ఉంటున్న ఈ దేశంలో ఉండటానికి దేవుడు అతణ్ణి తీసుకొచ్చాడు.
\v 5 ఆ సమయంలో దేవుడు అబ్రాహాముకి కొంచెం భూమి కూడా ఇవ్వకుండా, అతనికి సంతానం లేని సమయంలో అతనికీ, అతని తర్వాత అతని సంతానానికీ దాన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు."
\s5
\p
\v 6 "తర్వాత దేవుడు అబ్రాహాముతో "నీ సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారు, అక్కడి నాయకులు వాళ్ళని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారు.
\v 7 కాని నేను మిమ్మల్ని బానిసలుగా చేసిన ఆ ప్రాంత ప్రజలను శిక్షిస్తాను. ఆ తర్వాత మీ వారసులు బయటకి వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు," అని దేవుడు చెప్పాడు."
\p
\v 8 "అప్పుడు దేవుడు అబ్రాహాముకు, అతని మరుసటి తరం వాళ్ళకీ సున్నతితో కూడిన ఒక ఆజ్ఞ నియమించాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 మంది గోత్ర మూలపురుషులను కని వాళ్ళకి సున్నతి చేసాడు."
\s5
\p
\v 9 "యాకోబు 12 మంది కుమారులు యోసేపుపై తమ తండ్రి చూపుతున్న అతి ప్రేమకు అసూయపడి, అతణ్ణి ఈజిప్టు వాళ్ళకి అమ్మేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి,
\v 10 అతని బాధలన్నిటి నుండి తప్పించాడు. ఈజిప్టుకు రాజైన ఫరో ఎదుట అతనికి దయను, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఫరో ఈజిప్టు మీద, తన ఆస్థానం అంతటి మీద అతణ్ణి అధికారిగా నియమించాడు."
\s5
\p
\v 11 "యోసేపు అధికారిగా ఉండగా, ఈజిప్టులో, కనాను దేశమంతటిలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలందరు బాధలు పడ్డారు. ఆ సమయంలో కనానులోని యాకోబు అతని కుమారులకు కూడా ఆహారం దొరకలేదు.
\v 12 ఈజిప్టులో తిండి గింజలు ఉన్నాయని యాకోబు తెలుసుకుని ధాన్యం కొనుక్కు రమ్మని అక్కడికి తన కొడుకులను పంపాడు. వాళ్ళు యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కుని వెళ్ళిపోయారు కాని అతణ్ణి గుర్తుపట్టలేదు."
\p
\v 13 "యోసేపు అన్నలు రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు, యోసేపు తాను ఎవరో వాళ్ళకి చెప్పాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
\s5
\v 14 అప్పుడు యోసేపు తన అన్నలను వెనక్కి పంపించి తన తండ్రి యాకోబును, తన మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకు రమ్మని చెప్పాడు. వాళ్ళు మొత్తం 75 మంది.
\v 15 అది విన్న యాకోబు తన కుటుంబంతో ఈజిప్టులో జీవించడానికి వెళ్ళాడు. తర్వాత యాకోబు, మన పితరులూ అక్కడే చనిపోయారు.
\v 16 వాళ్ళని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు వంశం వాళ్ళ దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు."
\s5
\p
\v 17 "దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా, తామరతంపరగా వృద్ధి చెందిన జాతిని ఈజిప్టు నుంచి విడిపించే సమయం దగ్గర పడింది.
\v 18 ఈజిప్టు ప్రజలకు మేలు చేసిన యోసేపు గురించి తెలియని వేరొక రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.
\v 19 ఆ రాజు మన పూర్వికులను మట్టుపెట్టాలని ప్రయత్నించాడు. వాళ్ళకి పుట్టిన పిల్లలు బతక్కుండా వాళ్ళని బయట పారేయాలని వాళ్ళని బాధించాడు."
\s5
\p
\v 20 "ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందంగా ఉండటంతో, అతని తల్లితండ్రులు రహస్యంగా మూడు నెలలు వాళ్ళ ఇంట్లో పెంచారు.
\v 21 వాళ్ళు అతణ్ణి ఇక దాచిపెట్టలేని సమయం వచ్చినప్పుడు ఫరో కుమార్తె ఆ బిడ్డను తన సొంత కుమారుడిగా పెంచుకుంది.
\s5
\v 22 మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, తాను ఎదిగిన తర్వాత మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం పొందాడు.
\v 23 మోషేకు సుమారు 40 ఏళ్ళ వయసప్పుడు, ఇశ్రాయేలీయులైన తన బంధువులను చూడాలని అనుకున్నాడు.
\v 24 అక్కడ ఒక ఈజిప్టు వాడి వల్ల ఒక ఇశ్రాయేలీయుడు దౌర్జన్యానికి గురి కావడం చూసి, అతన్ని కాపాడి ఆ ఈజిప్టువాణ్ణి చంపి ప్రతికారం తీర్చుకున్నాడు.
\v 25 తన ద్వారా తన ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే విషయం తన ప్రజలు గ్రహిస్తారని అనుకున్నాడు. కాని వాళ్ళు గ్రహించలేదు."
\s5
\p
\v 26 "ఆ తర్వాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వాళ్ళను చూసి, "ఏమయ్యా, మీరు ఒకే జాతి వాళ్ళు కదా, ఎందుకు పోట్లాడుకుంటున్నారు?" అని వాళ్ళకి సర్దిచెప్పాలని చూసాడు.
\v 27 అయితే అవతల వ్యక్తిని గాయపరిచినవాడు, మోషేను పక్కకు నెట్టి "మా మీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?
\v 28 నిన్న ఈజిప్టువాణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా?" అని అడిగాడు."
\s5
\p
\v 29 "ఆ మాట విన్న మోషే ఈజిప్టు నుండి మిద్యాను దేశం పారిపోయి, అక్కడే పెళ్ళిచేసుకుని, ఇద్దరు కొడుకులను కని అక్కడే కొన్ని ఏళ్ళు ఉన్నాడు.
\v 30 నలభై ఏళ్ళ తర్వాత ఒక రోజు సీనాయి పర్వతారణ్యంలో, దేవుడు ఒక పొదలోని మంటల్లో దేవదూత వలె కనిపించాడు.
\s5
\v 31 పొదలో మంటలు లేకపోయినా మండుతున్న దాన్ని చూసి ఆశ్యర్యపడిన మోషే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రభువు మాటలు అతనికి వినపడ్డాయి.,
\v 32 "నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి." ప్రభువు మాటలు విన్న మోషే వణికిపోతూ, అటు చూడటానికి సాహసించ లేకపోయాడు."
\s5
\p
\v 33 "అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, "నన్ను ఘనపరచాలంటే నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలుచున్న చోటు పవిత్ర స్థలం, నీవు నా ఎదుట నిల్చున్నావు.
\v 34 ఈజిప్టులో ఉన్న నా ప్రజలు అక్కడి వాళ్ళచేతుల్లో పడుతున్న బాధలను చూసాను. వాళ్ళ మూలుగులు నేను విన్నాను. వాళ్ళని విడిపించడానికే దిగి వచ్చాను. రా, నిన్ను ఇప్పుడు ఈజిప్టుకు పంపబోతున్నాను."
\s5
\v 35 మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు? అని వాళ్ళు నిరాకరించిన మోషేను, ప్రభువు తానే దూత ద్వారా అతనికి పొదలో కనబడి, అధికారిగా విమోచకుడిగా నియమించి పంపాడు."
\p
\v 36 "మోషే ఈజిప్టులో, ఎర్ర సముద్రంలో, అరణ్యంలో 40 ఏళ్ళు అనేక అద్బుత కార్యాలను చేసి, ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి బయటకు తోడుకుని వచ్చాడు."
\q1
\v 37 "నా లాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ ప్రజలనుండి లేవనెత్తుతాడు." "ఈ విధంగా ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే."
\s5
\p
\v 38 "సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోను మన పూర్వికులతోను అరణ్యంలోని సంఘంలో ఉండి మనకు ఇవ్వడానికి దేవుని ఆజ్ఞలను తీసుకున్నది ఈ మోషేనే."
\p
\v 39 "మన పూర్వికులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వాళ్ళు అతణ్ణి నాయకుడిగా ఒప్పుకోకుండా ఈజిప్టుకు తిరిగి వెళ్ళాలనుకున్నారు.
\v 40 అప్పుడు వాళ్ళు "మమ్మల్ని ముందుకు నడిపించే దేవుళ్ళను మా కోసం తయారు చెయ్యి. ఈజిప్టు నుంచి మమ్మల్ని తీసుకువచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అని అహరోనుతో అన్నారు.
\s5
\v 41 అప్పుడు వాళ్ళు దూడ ఆకారంలో ఒక విగ్రహం చేసుకుని, దానికి బలి అర్పించి, ఆడి పాడి, తాము చేసిన పనిలో ఆనందించారు.
\v 42 అందుకని దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పూజించే ఆ జనాన్ని విడిచిపెట్టాడు. ఒక ప్రవక్త ఇలా రాసాడు."
\q1 "ఇశ్రాయేలీయులారా, 40 ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
\s5
\q1
\v 43 మీరు చేసుకున్న విగ్రహాలు మీతోపాటు తీసుకెళ్ళి పూజించిన మొలెకు గుడారాన్ని,
\q1 నక్షత్రం ఆకారంలో ఉండే రెఫాను అనే శని దేవుడిని పూజించడం కోసం మోసుకుపోయారు.
\q1 కాబట్టి బబులోను అవతలకి మిమ్మల్ని తీసుకుపోతాను."
\s5
\p
\v 44 "మన పూర్వికులు అరణ్యంలో ఉన్నప్పుడు, దేవుడు మోషేకి కొండపైన చూపిన నమూనా లాగా ప్రత్యక్ష గుడారం తయారు చేసుకుని దానిని పూజించడం మొదలుపెట్టారు.
\v 45 తర్వాత మన పూర్వికులు దాన్ని తీసుకుని యెహోషువతో పాటు ఈ దేశంలోకి వచ్చారు. దేవుడు తమ ఎదుట నుంచి వెళ్ళగొట్టిన జనాలను వాళ్ళు ఓడించి స్వాధీనపర్చుకున్నారు. తర్వాత అది దావీదు కాలం వరకు ఉంది.
\v 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది, ఆయన్ను పూజించడానికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు."
\s5
\p
\v 47 "అయితే దావీదు కుమారుడు సొలోమోనుద్వారా దేవుడు ఆ మందిరం కట్టించాడు.
\v 48 కానీ యెషయా ప్రవక్త చెప్పినట్టుగా, "సర్వోన్నతుడైన దేవుడు, మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు."
\q1
\v 49 "ఆకాశం నా సింహాసనం, భూమి నేను కాలు మోపే స్థలం.
\q1 మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
\q1 నా విశ్రాంతి స్థలమేది?
\q1
\v 50 ఇవన్నీ నా చేతిపనులు కావా?" అని ప్రభువు అడుగుతున్నాడు."
\s5
\p
\v 51 "మీరు దేవుని పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకుల లాగే మీరు కూడా ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
\v 52 మీ పూర్వికులు ప్రతి ప్రవక్తనూ హింసించారు. మెస్సీయ రాక గురించి ముందే చెప్పిన వాళ్ళని చంపేశారు. ఆయనను కూడా మీరు ఇప్పుడు అప్పగించి హత్యానేరం మూటగట్టుకున్నారు.
\v 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు కాని దానిని మీరే పాటించలేదు."
\s5
\p
\v 54 యూదుల సభలోని వాళ్ళు ఈ మాటలు విని తోక తొక్కిన తాచుల్లా లేచారు. స్తెఫనును చూసి పళ్ళు పటపట కొరికారు.
\p
\v 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశంలోకి చూస్తూ, దేవుని వెలుగును చూసాడు. దేవుడు కుడి పక్కన యేసు నిలబడి ఉండటం చూసాడు.
\v 56 "అదుగో ఆకాశం తెరుచుకోవడం, మనుష్యకుమారుడు దేవుని కుడి పక్కన నిలిచి ఉండటం చూస్తున్నాను" అని చెప్పాడు.
\s5
\v 57 అప్పుడు అతని మాటలు వింటున్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని అతని మీదకు వచ్చారు.
\v 58 అతణ్ణి యెరూషలేము పట్టణం బయటకి ఈడ్చుకుపోయి, రాళ్ళతో కొట్టారు. రాళ్ళు బలంగా విసరడానికి వీలుగా తమ పైదుస్తులు తీసివేశారు. తీసివేసిన తమ బట్టలకు కాపలాగా సౌలు అనే యువకుణ్ణి ఉంచారు.
\s5
\p
\v 59 వాళ్ళు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నపుడు, అతడు ప్రభువును ప్రార్ధిస్తూ, "యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో" అన్నాడు.
\p
\v 60 అప్పుడు స్తెఫను మోకరించి గట్టిగా కేక వేశాడు, "ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు." ఈ మాట పలికి అతడు చచ్చిపోయాడు.
\s5
\c 8
\p
\v 1 అప్పుడు దేవుణ్ణి నమ్మిన కొందరు స్తెఫను శవాన్ని సమాధి చేసి, అతణ్ణి గురించి ఎంతగానో విలపించారు.
\v 2 ఆ రోజు నుంచి యెరూషలేములో విశ్వాసులకు తీవ్రమైన హింస మొదలైంది.
\v 3 స్తెఫను మరణాన్ని సౌలు అధికారికంగా ఆమోదించాడు. ఇక అప్పటినుండి అతడు కూడా విశ్వాసుల సమూహాలను హింసించడం మొదలుపెట్టాడు. ప్రతి ఇంట్లోకీ చొరబడి స్త్రీ పురుషులని తేడా లేకుండా యేసును నమ్మే అందిరినీ బయటకు ఈడ్చుకు వచ్చి చెరసాలలో వేయడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 4 యెరూషలేములోని విశ్వాసులంతా వేరు వేరు ప్రాంతాలకు చెదరిపోయి అక్కడ యేసు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు.
\v 5 యేసు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు సమరయ నగరానికి వెళ్లి అక్కడ యేసు సందేశాన్ని ప్రకటించాడు.
\s5
\v 6 అతడు చెబుతున్న బోధలు, చేస్తున్న అద్భుత క్రియల గురించి విన్న అనేకులు అతనిపై దృష్టి నిలిపారు.
\v 7 ఫిలిప్పు చాలా మందికి పట్టిన దురాత్మలను వెళ్ళగొట్టాడు. పక్షవాతం వచ్చినవాళ్ళను, కుంటివాళ్ళను బాగుచేశాడు.
\v 8 అందువల్ల ఆ పట్టణంలో అందరూ ఆనందించారు.
\s5
\p
\v 9 అదే నగరంలో నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ కొంతకాలంగా తన మంత్ర విద్యలచే ప్రజలను ఆకట్టుకొంటున్న సీమోను అనే వాడు ఉన్నాడు.
\p
\v 10 పట్టణంలో సామాన్యులు, గొప్పవాళ్ళు "అతడు దేవుని మహా శక్తి" అని భావిస్తూ అతని మాట వినేవాళ్ళు.
\p
\v 11 అతడు చాలాకాలంగా మంత్రవిద్యలు చూపుతూ ఉండడం వల్ల అనేకులు అతని మాటలు శ్రద్ధగా వినేవాళ్ళు.
\s5
\p
\v 12 అయితే ఫిలిప్పు దేవుణ్ణి గురించీ, యేసును గురించీ సువార్త బోధించినప్పుడు నగర ప్రజలు యేసుపై విశ్వాసముంచి స్త్రీ పురుషులు అనేకులు బాప్తిసం తీసుకున్నారు.
\p
\v 13 సీమోను కూడా ఫిలిప్పు బోధను నమ్మి బాప్తిసం పొందాడు. అతడు ఫిలిప్పుతో కలసి ఉంటూ జరుగుతున్న సూచక క్రియలూ, అద్భుతాల చూసి ఆశ్చర్యపడ్డాడు.
\s5
\p
\v 14 సమరయ ప్రజలు దేవుని సువార్తను నమ్ముతూ కొనసాగుతున్నారన్న సమాచారం విని, యెరూషలేములో ఉన్న అపొస్తలులు పేతురు, యోహానులను అక్కడికి పంపారు.
\p
\v 15 వాళ్ళు అక్కడకు వచ్చి అక్కడి విశ్వాసులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్ధించారు.
\p
\v 16 అంతకుముందు అక్కడి వాళ్ళు యేసు నామంలో బాప్తిసం పొందారు కానీ పరిశుద్దాత్మను పొందలేదు.
\p
\v 17 పేతురు, యోహానులువాళ్ళ తలలపై చేతులుంచి ప్రార్ధించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు.
\s5
\p
\v 18 అపొస్తలులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడం చూసిన సీమోను, తనపై కూడా ఆత్మ వచ్చేలా చేయమని అపొస్తలులకు డబ్బు ఆశ చూపించాడు.
\p
\v 19 "నేను ఎవరి మీదైతే చేతులుంచుతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందేలా నాకు అధికారం ఇవ్వండి" అని అడిగాడు.
\s5
\p
\v 20 అందుకు పేతురు, "నువ్వు దేవుడిచ్చే వరాన్ని డబ్బుతోకొనాలని చూస్తున్నావు. కాబట్టి నీ డబ్బు నీతోపాటు నశిస్తుంది.
\v 21 నీ హృదయం దేవునితో కలవలేదు. కనుక మా పనిలో నీకు పాలు లేదు.
\v 22 నీ చెడ్డ ఆలోచన బట్టి పశ్చాత్తాపపడి ఆయనను వేడుకో. నీ దురాశను ఆయన క్షమించవచ్చు.
\v 23 నువ్వు కటిక చీకటిలో ఉన్నావు. నీలో నిలువెల్లా దుష్టత్వమే నాకు కనిపిస్తున్నది" అన్నాడు.
\s5
\v 24 అప్పుడు సీమోను "మీరు చెప్పిన ఏ కీడూ నాకు కలగకుండా నా కోసం ప్రార్ధించండి" అని కోరుకున్నాడు.
\s5
\p
\v 25 ఆ తరువాత పేతురు, యోహానులు సాక్ష్యమిస్తూ, యేసు ప్రభువని ప్రకటిస్తూ సమరయ గ్రామాల్లో అంతటా పర్యటించి యెరూషలేముకు చేరుకున్నారు.
\s5
\p
\v 26 ఒకనాడు దేవుడు పంపిన దూత ఫిలిప్పుకు కనిపించి, "నువ్వు బయలుదేరి దక్షిణ దిశగా అరణ్య మార్గంలో ప్రయాణించి యెరూషలేము నుండి గాజాకు వైపుకు వెళ్ళు" అని చెప్పాడు. ఆప్రకారమే అతడు బయలుదేరాడు.
\v 27 ఫిలిప్పు దారి వెంట నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతియోపియా దేశపు రాణి కందాకే ఖజానా లావాదేవీలు నిర్వహించే ఇతియోపీయుడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు.
\v 28 తన తిరుగు ప్రయాణంలో తన రథం పై కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
\s5
\p
\v 29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు బయలుదేరి ఆ రథం దగ్గరుకు చేరుకో" అని చెప్పాడు.
\v 30 ఫిలిప్పు ఆ రథం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఆ అధికారి యెషయా గ్రంథం చదువుతూ ఉండడం చూసి, "నువ్వు చదువుతున్నది నీకు అర్ధమౌతుందా? అని అడిగాడు.
\v 31 అందుకతడు "నాకెవరైనా దీనిని వివరించేవాళ్ళు లేకపోతే ఎలా అర్థం అవుతుంది? దయచేసి రథమెక్కి నా పక్కన కూర్చో" అన్నాడు.
\s5
\v 32 ఆ సమయంలో అతడు చదువుతున్న భాగం,
\q1 ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.
\q1 ఉన్ని కత్తిరించే వాడి దగ్గర
\q1 గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే,
\q1 ఆయన నోరు తెరవలేదు.
\q1
\v 33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.
\q1 ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?
\q1 ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.
\s5
\p
\v 34 వాళ్ళు ప్రయాణిస్తూ నీళ్ళు ఉన్న చోట ఆగారు. అప్పుడు ఆ అధికారి "చూడు, అక్కడ నీళ్ళు ఉన్నాయి. నేను బాప్తిసం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు బాప్తిసం ఇవ్వు" అని కోరాడు.
\v 35 అతడు రథం ఆపమని చెప్పి ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు.
\s5
\v 36 వాళ్లిద్దరూ బయటకు వచ్చారు.
\v 37 ప్రభువు ఆత్మ ఉన్నట్టుండి ఫిలిప్పును తీసుకుపోయాడు.
\v 38 ఆ అధికారికి ఫిలిప్పు అక్కడ కనబడలేదు.
\s5
\v 39 ఫిలిప్పు కనిపించకుండా పోయినప్పటికీ అతడు ఆ దారి వెంట సంతోషంగా వెళ్ళిపోయాడు.
\p
\v 40 పరిశుద్ధాత్మ తనను అజోతు అనే చోటికి అద్భుత రీతిగా తీసుకువచ్చాడని ఫిలిప్పు గ్రహించాడు. అతడు అజోతు ప్రాంతం అంతా సంచరిస్తూ, అజోతు, కైసరయల మధ్య సువార్త ప్రకటన కొనసాగిస్తూ, చివరకు కైసరయకు చేరుకునేదాకా ప్రకటిస్తూనే ఉన్నాడు.
\s5
\c 9
\p
\v 1 ఆ సమయంలో సౌలు కోపంతో బుస కొడుతూ ప్రభువును వెంబడించే వాళ్ళని చంపుతానని బెదిరిస్తూ ఉన్నాడు. అతడు యెరూషలేములోని ప్రధాన యాజకుడి దగ్గరకి వెళ్లి,
\v 2 యేసు బోధించిన మార్గాన్ని అనుసరించే మగవాళ్ళు గానీ ఆడవాళ్లు గానీ దొరికితే, వాళ్ళని బంధించి యెరూషలేముకు తీసుకుని వస్తాననీ అప్పుడు యూదీయ నాయకులు న్యాయం తీర్చి వాళ్ళని శిక్షించ వచ్చనీ ఉత్తరం రాశాడు. దమస్కు ఊరి యూదీయ సమాజ మందిరాల నాయకులకు తన గురించి పరిచయ పత్రాలు రాసి ఇమ్మని అడిగాడు.
\s5
\p
\v 3 అతడు వాళ్ళతో ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చేసరికి, హటాత్తుగా ఆకాశo నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
\p
\v 4 వెంటనే అతడు నేల మీద పడిపోయాడు, "సౌలూ, సౌలూ నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?" అనే ఒక స్వరం విన్నాడు.
\s5
\p
\v 5 "ప్రభూ, నీవెవరు?" అని అతడు అడిగాడు. ప్రభువు, "నువ్వు హింసిస్తున్న యేసును.
\v 6 లేచి ఉళ్ళోకి వెళ్ళు. అక్కడ నీవేం చెయ్యాలో అది నీకు తెలుస్తుoది" అని చెప్పాడు.
\v 7 సౌలుతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఆ శబ్దం విని, ఏమీ మాట్లాడలేక నిలబడిపోయారు. వాళ్ళకి ఏమీ కనబడలేదు.
\s5
\p
\v 8 సౌలు నేల మీద నుంచి లేచి కళ్ళు తెరిచి ఏమీ చూడలేకపోయాడు. అప్పుడు వాళ్ళు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు.
\v 9 అతడు మూడు రోజులపాటు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
\s5
\p
\v 10 దమస్కులో అననీయ అనే ఒక యేసు శిష్యుడున్నాడు. అతనికి ప్రభువు దర్శనమిచ్చి, "అననీయా" అని పిలిచాడు. దానికి అతడు, "ప్రభూ వింటున్నాను, చెప్పండి" అన్నాడు.
\p
\v 11 అందుకు ప్రభువు, "నీవు వెంటనే "వంకర లేనిది" అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం వాకబు చెయ్యి. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
\v 12 అతడు దర్శనంలో, అననీయ అనే పేరు గల వ్యక్తి తన ఇంటి లోపలికి వచ్చి తాను చూపు పొందేలా తన తల మీద చేతులు వెయ్యడం చూసాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 13 అయితే అననీయ, "ప్రభూ, ఈ వ్యక్తి యెరుషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి చాలామంది చెప్పారు.
\v 14 దమస్కులో నిన్ను నమ్మిన వాళ్ళని బంధించడానికి అతడు ప్రధాన యాజకులు పంపితే వచ్చాడు" అన్నాడు.
\p
\v 15 అందుకు ప్రభువు, "నువ్వు సౌలు దగ్గరికి పోయి నేను చెప్పింది చెయ్యి. ఎందుకంటే ఇతన్ని యూదులు కానివాళ్ళ ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుటా నన్ను సేవించడానికి నేను ఏర్పరచుకున్నాను.
\v 16 నాకు నేనుగా అతడు నా నామం కోసం ఎన్ని బాధలు భరించాలో చూపిస్తాను" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 17 అననీయ ఆ ఇంట్లోకి వెళ్లి, అతని మీద చేతులు వేసి, "సోదరా, సౌలూ, ప్రభువు తానే నాకు ఆజ్ఞాపించాడు, నువ్వు వచ్చిన దారిలో నీకు కనబడిన యేసు ప్రభువు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరికి పంపాడు" అని చెప్పాడు.
\p
\v 18 వెంటనే సౌలు కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోయి అతడికి చూపు వచ్చింది. అతడు లేచి బాప్తిసం పొందాడు.
\v 19 తర్వాత సౌలు భోజనం చేసి బలం పుంజుకుని, దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
\s5
\v 20 వెంటనే అతడు సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలు పెట్టాడు.
\v 21 అది విన్న జనమంతా ఆశ్చర్యపడి, "యెరూషలేములోఈ పేరుతో ప్రార్థన చేసే వాళ్ళని నాశనం చేసింది ఇతడే గదా? వాళ్ళని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోవడానికి గదా ఇతడు ఇక్కడికి వచ్చింది?" అనుకున్నారు.
\v 22 కాని దేవుడు సౌలును మరింత బలపరిచాడు. సౌలు మాత్రం యేసే క్రీస్తు అని రుజువు పరుస్తూ దమస్కులో ఉంటున్న యూదుల్ని కలవరపరిచాడు.
\s5
\p
\v 23 కొన్ని రోజుల తర్వాత యూదీయ నాయకులు అతణ్ణి చంపాలని ఆలోచించారు.
\v 24 వాళ్ళు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు ఆ పట్టణ సింహద్వారం దగ్గర మాటు వేశారు. వాళ్ళ కుట్ర సౌలుకు తెలిసింది.
\v 25 అయితే యేసును నమ్ముకున్న ఒకడు రాత్రివేళ అతణ్ణి ఆ నగరప్రకారం మీదకు తీసుకెళ్ళాడు. అక్కడ అతణ్ణి ఒక బుట్టలో కూర్చోబెట్టి గోడ మీద నుంచి అతణ్ణి కిందకు దింపి దమస్కు నుంచి తప్పించాడు.
\s5
\p
\v 26 అతడు యెరూషలేము వచ్చి శిష్యులను కలవాలని చూసాడు, కాని అతడు కూడా శిష్యుడేనని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.
\p
\v 27 కానీ బర్నబా అతణ్ణి చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకు వచ్చి, "ఇతడు దారిలో ప్రభువుని చూశాడు. ప్రభువు ఇతనితో మాట్లాడాడు. ఇతడు దమస్కులో యేసు గురించి ధైర్యంగా బోధించాడు" అని వాళ్ళకి వివరించాడు.
\s5
\v 28 అప్పటినుంచి సౌలు యెరూషలేములోని శిష్యులను కలిసి యేసు గురించి ధైర్యంగా బోధించనారంభించాడు.
\p
\v 29 అతడు యేసు గురించి మాట్లాడుతూ, గ్రీకు యూదులతో కూడా చర్చించాడు. అయితే వాళ్ళు సౌలును చంపాలని ప్రయత్నం చేసారు.
\v 30 ఇతర శిష్యులు ఆ ప్రయత్నం గురించి విని అతణ్ణి కైసరయకు తీసుకువచ్చి అతని సొంత ఊరు తార్సుకు పంపేసారు.
\s5
\p
\v 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ ప్రాంతంలోని సంఘాలు ప్రశాంతంగా ఉన్నారు. పరిశుద్దాత్మ ఇచ్చే ఆదరణతో, బలంతో అక్కడి సంఘాలు అభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించాయి.
\p
\v 32 పేతురు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నపుడు, లుద్ద అనే ఊరిలో ఉంటున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.
\s5
\v 33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచాన ఉన్న ఐనెయ అనే వ్యక్తిని చూసి,
\v 34 "ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేసాడు, లేచి నీ పడక సర్దుకో" అని అతనితో చెప్పగానే అతడు లేచి నిలబడ్డాడు.
\v 35 లుద్ద, షారోను పట్టణాల్లో ఉంటున్న వారంతా అతణ్ణి చూసి ప్రభువుని విశ్వసించారు.
\s5
\p
\v 36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. గ్రీకు భాషలో ఆమె పేరు దొర్కా. ఆమె పేదల పాలిట కల్పవల్లి.
\v 37 పేతురు లుద్దలో ఉన్నప్పుడు ఆమె జబ్బు పడి మరణించింది. అక్కడి స్త్రీలు ఆమె శరీరానికి స్నానం చేయించి మేడగదిలో ఉంచారు.
\s5
\p
\v 38 లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండటం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతణ్ణి బ్రతిమలాడటానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.
\p
\v 39 పేతురు లేచి వాళ్ళతో కూడా యొప్పెలోని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు మేడ గదిలోకి అతణ్ణి తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అక్కడే నిలబడ్డారు.
\s5
\p
\v 40 పేతురు అందరిని బయటకి పంపించి మోకరించి ప్రార్థన చేసాడు, తర్వాత ఆ శవం వైపు తిరిగి, "తబితా, లేమ్మా" అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూసి లేచి కూర్చుంది.
\v 41 ఆతడు ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వాళ్ళకి అప్పగించాడు.
\v 42 ఈ అద్భుత కార్యం యొప్పే ప్రాంతమంతా తెలిసి, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
\v 43 యొప్పేలో జంతువుల తోళ్ళు బాగుచేసే సీమోను ఇంట్లో పేతురు చాలా రోజులు గడిపాడు.
\s5
\c 10
\p
\v 1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే వ్యక్తి ఉండేవాడు. ఇతడు ఇటలీ దేశపు సైన్యాధికారి.
\v 2 అతడు యూదుడు కాకపోయినా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.
\s5
\p
\v 3 మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనంలో దేవుడు పంపిన దూత అతని దగ్గరికి వచ్చి "కొర్నేలీ" అని పిలవడం స్పష్టంగా విన్నాడు.
\v 4 అతడు ఆ దూతను స్పష్టంగా చూసి ఎంతగానో భయపడ్డాడు, "ప్రభూ, ఏమిటి?" అని అడిగాడు. అందుకు ఆ దూత, "నీ ప్రార్థనలూ, పేదలకు నువ్వు చేసే సాయాలు దేవునికి జ్ఞాపకం ఉన్నాయి.
\v 5 కనుక ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించు. అక్కడ పేతురు అనే మారుపేరున్న సీమోను ఉంటాడు. అతణ్ణి నీ దగ్గరకు పిలిపించుకో.
\v 6 అతడు సముద్రం పక్కనే ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో ఉన్నాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 7 దూత ఇలా చెప్పి వెళ్ళిన తరువాత కొర్నేలి తన పనివాళ్ళలో ఇద్దరిని పిలిచాడు. ఈ ఇద్దరు కాక, మరొక సైనికుణ్ణి పిలిచి
\v 8 దూత తనకు చెప్పిన విషయం వాళ్లకు వివరించి పేతురును కైసరయకు వెంటబెట్టుకు రమ్మని చెప్పి యొప్పేకు పంపించాడు.
\s5
\p
\v 9 తరువాతి రోజు మధ్యాహ్నం వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు యొప్పేకు చేరుకునే సమయానికి పేతురు ప్రార్థన చేసుకోవడానికి డాబా పైకి వెళ్ళాడు.
\p
\v 10 పేతురుకు ఆకలి వేసింది. ఏమైనా తినాలని చూశాడు. ఇంట్లోనివాళ్ళు వంట సిద్ధం చేస్తున్నారు. అప్పుడు పేతురుకి ఒక దర్శనం వచ్చింది.
\p
\v 11 ఆకాశం తెరుచుకుని ఒక పెద్ద దుప్పటి వంటిది కిందికి దిగి వచ్చింది. దాని నాలుగు మూలలు పైకి లేపి ఉన్నాయి.
\v 12 దానిలో భూమిపై ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, పక్షులు ఉన్నాయి.
\s5
\p
\v 13 అప్పుడు "పేతురూ, లేచి వాటిని చంపి తిను" అనే శబ్దం వినిపించింది.
\v 14 అందుకు పేతురు, "నువ్వు చెయ్యమన్న ఈ పని నేను చేయలేను. యూదుల చట్టంలో నిషేధమైన అపవిత్రమైన వాటిని నేను తినలేను" అని జవాబిచ్చాడు.
\p
\v 15 పేతురు రెండవసారి కూడా అలాగే దేవుడు చెప్పడం విన్నాడు.
\v 16 ఇలా మూడుసార్లు జరిగింది. వెంటనే జంతువులు, పక్షులు ఉన్న దుప్పటి వంటిది ఆకాశంలోకి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\p
\v 17 పేతురు తనకు కలిగిన దర్శనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటిని కనుక్కొని అతని ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి,
\v 18 పేతురు అనే పేరున్న సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు.
\s5
\p
\v 19 పేతురు తనకు కలిగిన దర్శనం గురించి ఆలోచిస్తూ ఉండగా, దేవుని ఆత్మ ఇలా చెప్పాడు, "పేతురూ, విను. ముగ్గురు వ్యక్తులు నిన్ను కలిసేందుకు వచ్చారు.
\v 20 నువ్వు లేచి కిందకు దిగి వాళ్ళతో వెళ్ళు. వాళ్ళతో వెళ్లేందుకు వెనకాడవద్దు. ఎందుకంటే నేనే వాళ్ళను పంపించాను.
\v 21 పేతురు కిందికి దిగివచ్చాడు. "వందనాలు. మీరు వెదుకుతున్నది నా కోసమే. ఏం పని మీద వచ్చారు?" అని అడిగాడు.
\s5
\v 22 అందుకు వాళ్ళు "కొర్నేలి అనే రోమా సైనికాధికారి మమ్మల్ని పంపించాడు. అతడు మంచివాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరిచేతా మంచివాడని పేరు పొందిన వ్యక్తి. యొప్పే నుంచి నిన్ను తన ఇంటికి పిలిపించుకుని నువ్వు చెప్పే మాటలు వినాలని ఒక దూత అతనికి చెప్పాడు" అని చెప్పారు.
\v 23 పేతురు వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఆ రాత్రి గడిచిన తర్వాత బయలు దేరదామని చెప్పాడు. తెల్లవారాక పేతురు వాళ్ళతో కలసి బయలుదేరాడు. మరికొందరు విశ్వాసులు కూడా వాళ్ళతో వెళ్లారు.
\s5
\p
\v 24 తరువాతి రోజు వాళ్ళు కైసరయ చేరుకునే సమయానికి కొర్నేలీ తన బంధువులను, స్నేహితులను, ఇంట్లోని వాళ్ళను సమకూర్చి పేతురు కోసం ఎదురుచూస్తున్నాడు.
\s5
\v 25 పేతురు లోపలి వచ్చినప్పుడు కొర్నేలి పేతురుకు పాదాభివందనం చేశాడు.
\v 26 పేతురు అతణ్ణి వారించి, "లే, నన్ను పూజించవద్దు. నేనూ నీలాంటి మనిషినే" అన్నాడు.
\s5
\p
\v 27 పేతురు కోర్నేలితో మాట్లాడుతూ లోపలికి వెళ్లి అక్కడ చాలామంది కూర్చుని ఉండడం చూసాడు.
\v 28 అప్పుడు పేతురు, "యూదులమైన మేము యూదులు కాని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళతో సాంగత్యం చేయడం నిషిద్ధమని మీకందరికీ తెలుసు. అయినప్పటికీ ఏ వ్యక్తినీ అపవిత్రుడుగా, నిషిద్ధమైన వాడుగా ఎంచకూడదని దేవుడు నాకు దర్శనం చూపించాడు.
\v 29 కనుక ఎలాంటి అభ్యంతరం లేకుండా మీరు పంపిన మనుషులతో కలసి నేను ఇక్కడకు వచ్చాను. నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి" అన్నాడు.
\s5
\p
\v 30 కొర్నేలి, "మూడు రోజుల క్రితం నేను రోజూ క్రమంగా చేస్తున్నట్టు దేవునికి ప్రార్ధిస్తున్నాను. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెరిసిపోతున్న దుస్తులు ధరించిన ఒక వ్యక్తి నా ఎదుట నిలబడ్డాడు.
\v 31 అతడు నాతో, "కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. పేదవాళ్ళకి నువ్వు చేస్తున్న సహాయాల పట్ల దేవుడు సంతోస్తున్నాడు.
\v 32 నువ్వు నీ సేవకులను యొప్పేకు పంపి పేతురు అనే పేరుగల సీమోనును నీ దగ్గరకు రప్పించుకో. అతడు సముద్రం పక్కన నివసించే సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉంటున్నాడు" అని చెప్పాడు.
\v 33 నేను వెంటనే మనుషులను మీ కోసం పంపించాను. మీరు రావడం మంచిది అయ్యింది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినదంతా వినడానికి మేమంతా ఇక్కడ సమకూడాము. దయచేసి మాతో మాట్లాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 34 పేతురు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు, "దేవుడు ఎవరిపట్లా పక్షపాతం చూపడని నేను గ్రహించాను.
\v 35 తనపట్ల భయభక్తులు కలిగి ఆయనను సంతోషపరిచే అన్ని రకాల జాతుల ప్రజలనూ ఆయన అంగీకరిస్తాడు."
\s5
\p
\v 36 "ఇశ్రాయేలీయులమైన మాకు దేవుడు సందేశం పంపించాడని మీకు తెలుసు. మెస్సీయ అయిన యేసు జరిగించిన కార్యం ద్వారా కలిగిన సువార్తను ప్రపంచమంతటా ప్రకటించమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించాడు. ఈ యేసు ఇశ్రాయేలీయులమైన మాకు మాత్రమే ప్రభువు కాదు, ఆయన పాలించే ప్రజలందరికీ ఆయన దేవుడు.
\v 37 యూదయ నుండి గలిలయ వరకు యోహాను ప్రజలను మారుమనస్సు పొంది బాప్తిసం పొందమని ప్రకటించిన సంగతి మొదలుకుని మిగిలిన విషయాలు మీకందరికీ తెలుసు."
\p
\v 38 "నజరేయుడైన యేసు దేవుని ఆత్మ అనుగ్రహించిన శక్తితో అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఆయన అనేక ప్రాంతాలు సంచరించి ప్రతిచోటా మనుషులను స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టిన వాళ్ళను బాగుచేసాడు. ఈ పనులన్నీ చేయడానికి దేవుడు అన్ని సమయాల్లో ఆయనకు సహాయం చేశాడు. ఈ సంగతులన్నీ మీకు తెలుసు."
\s5
\p
\v 39 "ఆయన ఇశ్రాయేలు దేశమంతటా, యెరూషలేము చుట్టు పక్కల గ్రామాల్లో జరిగించిన పనులకు మేము సాక్షులం. శత్రువులు ఆయనను కొయ్య సిలువకు వేలాడదీసి చంపారు.
\v 40 ఆయన చనిపోయిన మూడవ రోజున దేవుడు ఆయనను తిరిగి లేపాడు. అనేకులు తిరిగి బ్రతికిన ఆయనను చూసారు. ఆయన చనిపోవడం చూసిన అనేకులు తమ కళ్ళతో సజీవుడైన యేసును చూసి ఆయన లేచాడని నిర్ధారించుకున్నారు.
\v 41 ప్రజలందరికీ కాకుండా ఆయన ఏర్పరచుకున్న ఆయనతో కలసి భోజనం చేసి కాలం గడిపిన కొద్దిమందికే కనిపించేలా దేవుడు అనుగ్రహించాడు."
\s5
\p
\v 42 "తప్పక రాబోతున్న ఒక రోజున ఈయన న్యాయాధిపతిగా జీవిస్తున్న వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు తీరుస్తాడని ప్రకటించమని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు.
\v 43 ఆయనను విశ్వసించే వాళ్ళ పాపాలన్నిటినీ క్షమిస్తాడని పూర్వం ప్రవక్తలు ప్రవచించారు."
\s5
\p
\v 44 పేతురు ఈ మాటలు చెప్తూ ఉండగానే వింటూ ఉన్న వారందరి మీదకూ పరిశుద్ధాత్మ దిగివచ్చాడు.
\v 45 యూదు విశ్వాసులు, పేతురుతో కలసి వచ్చినవాళ్ళు యూదులు కాని వాళ్ళ మీద ఆత్మ దిగిరావడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
\s5
\v 46 వాళ్ళు భాషల్లో మాట్లాడడం, దేవుని గొప్పదనం గురించి చెప్పడం దేవుడు చేసిన పని అని వాళ్ళు అంతకు ముందే చూసారు.
\p
\v 47 అప్పుడు పేతురు అక్కడ ఉన్న యూదు విశ్వాసులతో "మనలాగానే దేవుని ఆత్మ వీళ్లకు లభించింది. ఇక వీళ్ళకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి" అన్నాడు.
\v 48 మెస్సియ అయిన యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని అతడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళంతా బాప్తిసం పొందారు. తరువాత వాళ్ళు పేతురును తమతో కొన్ని రోజులు ఉండమని కోరారు. అందుకు పేతురు, అతనితో కలసి వచ్చిన విశ్వాసులు అంగీకరించారు.
\s5
\c 11
\p
\v 1 యూదులు కానివాళ్ళు కూడా దేవుని వాక్యం అంగీకరించారని యుదా ప్రాంతంలో నివసించే అపొస్తలులు, విశ్వాసులు విన్నారు.
\v 2 యెరూషలేములోని యూదా విశ్వాసులు దేవుణ్ణి విశ్వసించే వాళ్ళందరూ సున్నతి పొందాలని చెప్పారు. కైసరయ నుండి పేతురు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అతణ్ణి విమర్శించారు,
\v 3 "నువ్వు సున్నతి లేనివాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాక వాళ్ళతో భోజనం కూడా చేసావు."
\s5
\p
\v 4 అందుకు పేతురు ఇలా వివరించాడు.
\v 5 "నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దర్శనం చూసాను. దానిలో నాలుగు వైపుల నుంచి పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటిది ఒకటి ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది,
\v 6 దానిలోకి జాగ్రత్తగా చూస్తే, భూమి మీద ఉండే వివిధ రకాల జంతువులూ, అడవి జంతువులూ, పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనపడ్డాయి.
\s5
\v 7 అప్పుడు నాకు, "పేతురూ, నీవు లేచి వాటిని చంపుకుని తిను" అని దేవుని ఆజ్ఞ వినబడింది."
\p
\v 8 "అందుకు నేను "ప్రభూ, మన ధర్మాలలో తినకూడదు అని చెప్పినవేవీ నేను ఇంతవరకూ తినలేదు" అన్నాను.
\v 9 ఆకాశం నుండి ఆ శబ్దం రెండవసారి, "నేను దేవుణ్ణి, నేను పవిత్రమైనవిగా చేసిన వాటిని తినమంటే, నీవు వాటిని అపవిత్రమైనవి అనకూడదు" అని వినిపించింది."
\p
\v 10 "ఇదే విధంగా ఇంకా రెండు సార్లు జరిగింది. తరువాత ఆ జంతువులూ, పక్షులూ ఉన్న దుప్పటి అంతా ఆకాశానికి తిరిగి వెళ్లిపోయింది."
\s5
\p
\v 11 "అదే సమయంలో కైసరయ నుండి నేను ఉంటున్న ఇంటికి ముగ్గురు మనుషులు వచ్చారు.
\v 12 అప్పుడు దేవుని ఆత్మ, "నీవు వాళ్ళు యూదులు కారు అని సంకోచించకుండా, వాళ్ళతో పాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. కైసరియకు నాతోపాటు ఆరుగురు యూదా సోదరులు కూడా కొర్నేలి ఇంటికి వెళ్లాము."
\p
\v 13 "అతడు తాను ఒక దూతని చూశానని ఆ దూత, "నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
\v 14 నీవు, నీ ఇంటివారంతా రక్షణ ఎలా పొందాలో అతడు నీతో చెప్తాడు" అని ఆ దూత చెప్పాడని అతడు మాతో చెప్పాడు."
\s5
\p
\v 15 "నేను మాట్లాడటం మొదలుపెట్టాక, పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదకు దిగివచ్చినట్లుగానే వాళ్ళ మీదకి దిగాడు."
\p
\v 16 "అప్పుడు, "యోహాను నీళ్ళతో బాప్తిసమిచ్చాడు కాని మీరు పరిశుద్దాత్మలో బాప్తిసం పొందుతారు" అని దేవుడు చెప్పిన మాటలు నేను గుర్తుచేసుకున్నాను."
\s5
\p
\v 17 "ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినదే, దేవుడు వాళ్ళకి కూడా అనుగ్రహిస్తే, దేవుడు చేసింది తప్పు, అని నేనెలా అన గలను?" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 18 యూదా విశ్వాసులు పేతురు చెప్పింది విని, అతణ్ణి తప్పు పట్టడం మాని దేవుణ్ణి కీర్తిస్తూ, "అలాగైతే యూదులు కాని వాళ్ళకి కూడా దేవుడు నిత్యజీవాన్ని, మారుమనసును దయచేశాడు" అని చెప్పుకుంటూ దేవుణ్ణి ఘనపరిచారు.
\s5
\p
\v 19 స్తెఫను చనిపోయిన తర్వాత, హింసలను తట్టుకోలేక అక్కడి విశ్వాసులు యెరూషలేము విడిచి, ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకు వెళ్లి దేవుని మాట యూదులకు తప్ప ఇంక ఎవ్వరికీ చెప్పకుండా సంచరించారు.
\v 20 వాళ్ళలో కొంతమంది సైప్రస్, కురేనీ వాళ్ళు అంతియొకయ వచ్చి అక్కడి యూదులు కాని వాళ్ళకి కూడా యేసు ప్రభువని ప్రకటించారు.
\v 21 ఆ విశ్వాసులు ప్రకటించడానికి ప్రభువు శక్తి తోడ్పడింది. దాని వలన అక్కడి వాళ్ళు అది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
\s5
\v 22 ఆ విషయం విన్న యెరుషలేములో ఉన్న సంఘం బర్నబాను అంతియోకయకు పంపించారు.
\p
\v 23 అతడు అక్కడికి వచ్చి, దేవుడు అక్కడివాళ్ళకి చూపిన అనుగ్రహాన్ని బట్టి సంతోషించి, ప్రభువులో పూర్తి నమ్మకం ఉంచాలని వాళ్ళని ప్రోత్సాహపరిచాడు.
\v 24 పరిశుద్దాత్మ అదుపులో ఉండే బర్నబా సజ్జనుడు. అతనిని బట్టి చాల మంది ప్రభువును నమ్మారు.
\s5
\v 25 బర్నబా సౌలును వెతకడానికి తార్సు ఊరికి వెళ్ళాడు.
\v 26 సౌలు దొరికాక, బర్నబా అతణ్ణి అంతియొకయకు బోధించడానికి పంపాడు. వాళ్ళద్దరూ కలిసి ఒక సంవత్సరమంతా సంఘంలో ఉండి చాలామందికి బోధించారు, మొట్టమొదటిసారిగా అంతియొకయలోనే శిష్యులను "క్రైస్తవులు" అన్నారు.
\s5
\p
\v 27 ఆ రోజుల్లో బర్నబా, సౌలు అంతియొకయలో ఉన్నప్పుడు, కొంతమంది ప్రవక్తలు అక్కడికి వచ్చారు.
\v 28 వాళ్ళలో అగబు అనే ఒకడు మాట్లాడటానికి నిలబడి, లోకమంతా కరువు రాబోతుందని ఆత్మ ద్వారా ప్రవచనం పలికాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి పాలన రోజుల్లో జరిగింది.
\s5
\p
\v 29 అది విన్న శిష్యులు యూదయలోని సోదరులకు సహాయం పంపడానికి వాళ్ళ శక్తి కొద్దీ డబ్బు ఇచ్చారు.
\v 30 వాళ్ళు ఆ డబ్బును బర్నబా, సౌలుల ద్వారా యెరూషలేములోని పెద్దలకు పంపించారు.
\s5
\c 12
\p
\v 1 ఆ సమయంలో హేరోదు రాజు యెరూషలేములోని విశ్వాసులను హింసించడానికి పంపిన సైనికులు వాళ్ళని పట్టుకుని చెరసాలలో పెట్టారు.
\v 2 యోహాను సోదరుడైన యాకోబు తల నరకమని ఆజ్ఞాపించగా, ఆ సైనికుడు అలా చేశాడు.
\s5
\v 3 ఇది యూదా నాయకులకు ఇష్టంగా ఉండటం గమనించిన హేరోదు, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
\v 4 అతణ్ణి బంధించి చెరసాలలో వేసి, కాపలాగా నలుగురు చొప్పున ఉండే నాలుగు సైనిక దళాలను పెట్టాడు. పస్కా పండగైన తరువాత అతణ్ణి ప్రజల ఎదుటకు తీసుకుని వచ్చి విచారించాలని అనుకున్నాడు.
\s5
\p
\v 5 పేతురును చాలా రోజులు చెరసాలలో ఉంచారు. అయితే సంఘం అతని కోసం శ్రద్ధతో దేవునికి ప్రార్థన చేసారు.
\v 6 హేరోదు పేతురును విచారణకు తీసుకురావాలని అనుకున్న రాత్రి, పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. ఇద్దరు కాపలా వాళ్ళు తలుపు ఎదుట కాపలా ఉన్నారు.
\s5
\v 7 ఉన్నట్టుండి ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి. అక్కడి సైనికులకు అక్కడ జరుగుతున్నదేమీ తెలియదు.
\p
\v 8 దూత అతనితో, "నీ నడుం కట్టుకుని, చెప్పులు వేసుకో" అని చెప్పగా పేతురు అలాగే చేశాడు. తర్వాత ఆ దూత "పై బట్ట వేసుకుని నాతో రా" అన్నాడు.
\s5
\v 9 అతడు పై బట్ట, చెప్పులు వేసుకుని ఆ దూత వెనక వెళ్ళాడు, కాని అతనికి ఇదంతా నిజంగా జరుగుతుందని నమ్మలేకపోయాడు, ఇది ఒక కల అనుకున్నాడు.
\p
\v 10 ద్వారం దగ్గరి సైనికులను దాటి ఆ దూత, పట్టణంలోకి వెళ్ళే ఇనప తలుపు దానంతట అదే తెరచుకున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్లి ఒక వీధి దాటిన తరువాత దూత అక్కడినుంచి మాయమై పోయాడు.
\s5
\p
\v 11 పేతురు జరిగినది అంతా కల కాదు అని గుర్తించిన తర్వాత, "ప్రభువు తన దూతను పంపి హేరోదు నుంచి, యూదా నాయకులు అనుకున్న దాని నుంచి నిజంగా నన్ను తప్పించాడు" అని గ్రహించాడు.
\p
\v 12 అప్పుడు పేతురు తర్వాత మార్కు అనే పేరున్న యోహాను యొక్క తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ చాలా మంది విశ్వాసులు పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు.
\s5
\p
\v 13 పేతురు అక్కడి తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు కొడుతున్నది ఎవరో తెలుసుకోవడానికి వచ్చింది.
\p
\v 14 పేతురు గొంతు విని, గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తెరవకుండానే లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి, పేతురు తలుపు బయట ఉన్నాడని అక్కడి వాళ్ళకి చెప్పింది.
\p
\v 15 అందులో ఒకరు ఆమెను "నువ్వు పిచ్చిదానివి" అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికి నిజమని ఆమె చెప్పినప్పుడు వాళ్ళు, "అది అతని దూత అయి ఉండవచ్చు కదా" అన్నారు.
\s5
\p
\v 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వాళ్ళు చివరికి తలుపు తీసి పేతురును చూసి ఆశ్చర్యపోయారు.
\p
\v 17 పేతురు అక్కడి వాళ్ళకి నిశబ్దంగా ఉండమని చేతితో సైగ చేసి, ప్రభువు అతణ్ణి చెరసాల నుంచి ఎలా బయటకి తెచ్చాడో వాళ్ళకి చెప్పి, యాకోబుకు, ఇతర సోదరులకు జరిగిన విషయాలు తెలియజేయమని చెప్పి అక్కడినుంచి వేరొక చోటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 18 మరుసటి రోజు ఉదయం అక్కడి సైనికులు పేతురు ఏమయ్యాడో, అసలు ఏమి జరిగిందో తెలియక ఎంతో గాభరాపడ్డారు.
\p
\v 19 ఆ విషయం తెలుసుకున్న హేరోదు, సైనికులందరికీ పేతురును వెదకమని ఆజ్ఞాపించాడు. కాని వాళ్ళకి అతడు దొరకలేదు. హేరోదు అక్కడి కాపలా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి మరణ శిక్ష విధించాడు. ఆ పైన హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నాడు.
\s5
\p
\v 20 తూరు, సీదోను ప్రజలపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక రోజు రాజు దగ్గరికి వెళ్లారు. వారంతా హేరోదు రాజు ముఖ్య అధికారి అయిన బ్లాస్తును కలిసి రాజుకు నచ్చజెప్పి అతణ్ణి తమ పట్ల ప్రసన్నంగా చెయ్యాలని వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వాళ్ళ దేశాలకు ఆహారం వస్తూ ఉండేది.
\p
\v 21 ఒక రోజు, హేరోదు వాళ్ళని కలవాలని నిర్ణయించి రాజవస్త్రాలు ధరించి, సింహాసనం మీద కూర్చుని వాళ్ళందరి ఎదుటా ప్రసంగించాడు.
\s5
\v 22 అది వింటున్న ప్రజలు, "మాట్లాడుతున్నది దేవుడే గాని, మనిషి కాదు" అని గట్టిగా కేకలు వేసారు.
\v 23 హేరోదు దేవుణ్ణి మహిమ పరచడానికి బదులు ప్రజలు తనను దేవుడంతటి వాడుగా ఎంచి పొగడాలని భావించినందుకు వెంటనే ప్రభువు దూత అతణ్ణి ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడి కడుపులో పురుగులు పడి, భయంకరమైన నొప్పితో గిలగిల్లాడుతూ అతడు చనిపోయాడు.
\s5
\p
\v 24 దేవుని వాక్యం అన్ని చోట్లా విస్తరించింది, యేసుని నమ్ముకున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.
\p
\v 25 బర్నబా, సౌలు యెరూషలేములోని యూదా విశ్వాసులకి సహాయం అందించిన తర్వాత మార్కు అనే పేరున్న యోహానును తమతో వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.
\s5
\c 13
\p
\v 1 సిరియా దేశంలోని అంతియొకయలో విశ్వాసుల గుంపుతోపాటు సంఘంలో బర్న బా, నీగెర్ అనే మారు పేరున్న సుమియోను, కురేని నివాసి లూకియ, రాజైన హేరోదు అంతిపతో పాటు కలసి పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు ఉన్నారు.
\v 2 వాళ్ళంతా ఉపవాసముండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళతో, "నేను బర్నబాను, సౌలును అనుకున్న పని కోసం వాళ్ళను నాకు కేటాయించండి" అని చెప్పాడు.
\v 3 విశ్వాసులు ఉపవాసముండి ప్రార్ధించి బర్నబా, సౌలులపై చేతులుంచి దేవుని సహాయం కోసం ప్రార్ధించారు. తరువాత పరిశుద్ధాత్మ ఆదేశించినట్టు ఇద్దరినీ పంపించారు.
\s5
\p
\v 4 బర్నబా, సౌలు బయలుదేరి అంతియొకయ నుండి సెలూకియకు సముద్ర ప్రయాణం చేయడానికి పరిశుద్ధాత్మ నడిపించాడు. అక్కడినుంచి ఓడలో ప్రయాణించి సైప్రస్ ద్వీపంలోని సలమీకు చేరుకున్నారు.
\v 5 వాళ్ళు సలమీలో ఉన్నప్పుడు యూదుల సమావేశమయ్యే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ యేసును గురించి సువార్త ప్రకటించారు. మార్కు అనే యోహాను వాళ్లకు సహాయం చేశాడు.
\s5
\p
\v 6 ఈ ముగ్గురూ కలిసి పాఫు ద్వీపమంతా సంచరించారు. అక్కడ వాళ్లకు, తనను తాను ప్రవక్తగా ప్రకటించుకొంటూ గారడీ విద్యలు చేస్తున్న ఒక అబద్ద బోధకుడు తారసపడ్డాడు. అతడి పేరు బర్ యేసు.
\v 7 అతడు వివేకం గల సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్యం వినడానికి పౌలును, బర్నబాను పిలిపించాడు.
\p
\v 8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని యేసులో విశ్వాసం నుండి తొలగించడానికి చాలా సార్లు అడ్డుపడ్డాడు.
\s5
\v 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్దాత్మతో నిండి ఆ మాంత్రికునీ కేసి తీక్షణం గా చూశాడు.
\p
\v 10 "నీవు సాతానును సేవిస్తున్నావు. మంచికి విరోధివి. ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళకి కీడు కలిగిస్తున్నావు. ప్రభువైన దేవుని గురించి నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేయడం నువ్వు మానుకోవాలి.
\s5
\v 11 ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. నీవు గుడ్డివాడివి అవుతావు. నీవు ఇకమీదట ఏమీ చూడలేవు" అన్నాడు. ఒక్కసారిగా అతడు గుడ్డివాడయ్యాడు, చీకట్లో ఉన్నట్టు తడుములాడుతూ తనని చెయ్యి పట్టి ఎవరు నడిపిస్తారా అని వెతకసాగాడు.
\p
\v 12 ఎలమకు జరిగిన విషయాన్నిచూసిన ఆ అధికారి దేవుణ్ణి నమ్మాడు. యేసు ప్రభు గురించి పౌలు, బర్నబాలు చెప్పే విషయాలకి ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 13 తరువాత పౌలు అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియలోని పెర్గేకు వచ్చారు. అక్కడ మార్కు వాళ్ళని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు.
\p
\v 14 అప్పుడు పౌలు, బర్నబా కాలిబాట ద్వారా పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చారు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు.
\p
\v 15 అక్కడ కొంతమంది మోషే చట్టాలు గట్టిగా చదివాళ్ళు, ఇంకొంతమంది ప్రవక్తలు రాసినవి చదివారు. అప్పుడు అక్కడి నాయకులు పౌలు, బర్నబాలతో "సహోదరులారా, ప్రజలకి మీరు ఏదైనా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలంటే చెప్పండి" అని అడిగారు.
\s5
\p
\v 16 అప్పుడు పౌలు నిలబడి ప్రజలు వినాలని చేతితో సైగ చేశాడు. అప్పుడు అతడు "ఇశ్రాయేలీయులారా, దేవుణ్ణి పూజించే ప్రజలారా, నా మాట వినండి.
\v 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వికులను ఏర్పరచుకొని, వాళ్ళు ఈజిప్టు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని లెక్కించలేనంత జనంగా చేసి, తన శక్తివంతమైన కార్యాలతో వాళ్ళని బానిసత్వం నుండి విడిపించి ఇక్కడకు తీసుకు వచ్చాడు.
\v 18 వాళ్ళు దేవుని మాట తిరస్కరించినా 40 ఏళ్ళు వాళ్ళని అరణ్యంలో భరించాడు.
\s5
\v 19 కనాను దేశంలోని ఏడు జాతుల వాళ్ళని నాశనం చేసి, ఆ భూమిని ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
\v 20 ఇదంతా వాళ్ళ పూర్వికులు సుమారు ఈజిప్టుకు వెళ్ళిన 450 ఏళ్ళ తర్వాత జరిగింది. దాని తర్వాత ఇశ్రాయేలీయులను పాలించడానికి ప్రజల్లో నుండి న్యాయాధిపతులను నాయకులను ఎన్నుకున్నాడు, వాళ్ళలో చిట్టచివరి న్యాయాధిపతిగా సమూయేలు ప్రవక్తను ఇచ్చాడు."
\s5
\p
\v 21 "సమూయేలు నాయకుడిగా ఉన్నప్పుడే ఆ ప్రజలు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు అయిన సౌలును వాళ్ళకి 40 ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు.
\v 22 తరువాత దేవుడు సౌలుని రాజుగా తొలగించి, యెష్షయి కుమారుడైన దావీదును వాళ్ళకి రాజుగా చేశాడు. ఆయన దావీదు గురించి "యెష్షయి కుమారుడైన దావీదు నేను కోరుకున్నదాన్నే కోరుకుంటాడు. అతడు ఏమి చెయ్యాలని నేను అనుకుంటానో అదే చేస్తాడు" అన్నాడు."
\s5
\p
\v 23 "దావీదు సంతానం నుండి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలీయులను కాపాడటానికి రక్షకుడైన యేసుని పుట్టించాడు.
\v 24 యేసు రాక ముందు, బాప్తిసమిచ్చే యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ తమ పాపపు జీవితాన్ని విడిచి దేవుని క్షమాపణ కోరమని, అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇస్తానని చెప్పాడు.
\v 25 యోహాను దేవుడు ఇచ్చిన పనిని నేరవేరుస్తుండగా, "మీరు నన్ను దేవుడు పంపిన మెస్సీయ అని అనుకుంటున్నారా? కానే కాదు. ఆయన వెనక వస్తున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాను" అని చెప్పాడు."
\s5
\p
\v 26 "సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుణ్ణి పూజించే ప్రజలారా, వినండి! ఈ రక్షణ సందేశం మనందరికీ వచ్చింది.
\v 27 యెరూషలేములో నివసిస్తున్నవారూ వాళ్ళ అధికారులూ యేసుని గుర్తించలేదు. ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను నిజంగా గ్రహించక, ఆ ప్రవచనాలలో ముందే చెప్పిన విధంగా యేసుకు మరణ శిక్ష విధించారు.
\s5
\v 28 చాలా మంది యేసు చెడ్డ పనులు చేసాడని నేరం మోపారు. కాని వాళ్ళు మరణానికి తగిన కారణాలు ఏమీ రుజువు చెయ్యలేకపోయినా ఆయన్ని చంపాలని పిలాతును కోరారు.
\v 29 ప్రవక్తలు ముందే రాసిన విధంగానే అన్నీ నెరవేరిన తరువాత, ఆయనను సిలువకు మేకులతో కొట్టి చంపారు. ఆయన చనిపోయిన తర్వాత సిలువ మీద నుండి దింపి సమాధిలో పెట్టారు."
\s5
\p
\v 30 అయితే దేవుడు ఆయన్ను చావు నుండి తిరిగిలేపాడు.
\v 31 చాల రోజులపాటు ఆయన తనతో గలిలయ నుండి యెరూషలేముకు వచ్చిన వాళ్ళకి చాలసార్లు కనిపించారు. ఇప్పుడు ఆయన్ని చూసిన వాళ్ళు ఆయనకు సాక్షులుగా ఉన్నారు.
\s5
\v 32 మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. మన పూర్వీకులకు చేసిన వాగ్దానాలను ఆయన నెరవేర్చాడు.
\v 33 దేవుడు యేసును చనిపోయిన వాళ్ళలో నుండి లేపడం ద్వారా వాళ్ళ సంతానమైన మన కోసం, యూదులు కానివాళ్ళ కోసం దీనిని నెరవేర్చాడు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడం గురించిన వాగ్దానం దావీదు రాసిన రెండవ కీర్తనలో ఇలా ఉంది. "నువ్వు నా కుమారుడివి, నేడు నేను నీ తండ్రిని."
\v 34 దేవుడు చనిపోయిన మెస్సీయను ఇకపై కలకాలం జీవించి ఉండేలా చావు నుండి లేపాడు. యూదులైన మన పూర్వికులతో ఆయన ఇలా చెప్పాడు, "దావీదు విషయంలో నేను వాగ్దానం చేసినట్టు నేను మీకు సహాయం చేస్తాను."
\s5
\v 35 దావీదు రాసిన మరో కీర్తనలో "నీ పరిశుద్ధుని శరీరాన్ని కుళ్ళిపోయేలా చేయవు" అని ఉంది.
\v 36 దావీదు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి చనిపోయాడు. అతని శరీరం సమాధిలో కుళ్ళిపోయింది. కనుక ఈ కీర్తనలో దావీదు తన గురించి చెప్పుకోవడం లేదు.
\v 37 యేసును మాత్రమే దేవుడు చనిపోయిన వాళ్ళలో నుండి లేపాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు."
\s5
\p
\v 38 "కాబట్టి నా సాటి ఇశ్రాయేలీయులారా, ఇతర స్నేహితులారా, యేసు చేసిన ఈ కార్యం వల్లనే మీ పాపాలకు క్షమాపణ ఉందని తెలుసుకోవడం ప్రాముఖ్యమైన విషయం. మోషే చట్టాలు ఏ విషయాల్లో మిమ్మల్ని పాపం లేనివాళ్ళుగా తీర్చలేకపోయాయో ఆ విషయాల్లో ఆయన ఇచ్చే క్షమాపణ ద్వారా దేవుడు మిమ్మల్ని పాపం లేనివాళ్ళుగా చేస్తాడు.
\v 39 దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించినవాళ్ళు యేసులో విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు చేసిన పనులన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. ఇకపై పాపాలకు శిక్ష ఎన్నడూ ఉండదు.
\s5
\v 40 కాబట్టి ప్రవక్తలు చెప్పినట్టు దేవుని న్యాయతీర్పుకు గురికావద్దు.
\q
\v 41 "మీరు నన్ను తిరస్కరించారు.
\q మీ చెడ్డ పనులనుబట్టి నేను మిమ్మల్ని నాశనం చేయడం చూసి మీరు ఆశ్చర్యపడతారు.
\q మీరు బ్రతికి ఉన్న కాలంలో నేను జరిగించే ఈ భయంకరమైన కార్యాలు చూస్తారు.
\q ఈ విషయాలు ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు" అని ఆయన తన ప్రవక్త ద్వారా పలికించాడు."
\s5
\p
\v 42 ఈ మాటలు చెప్పి పౌలు వెళ్ళిపోతూ ఉంటే, అనేకులు వాళ్ళ దగ్గరకు వచ్చి, తరువాతి విశ్రాంతి దినాన కూడా వచ్చి మరిన్ని విషయాలు చెప్పాలని కోరారు.
\p
\v 43 సమావేశం ముగిసిన తరువాత దేవుణ్ణి ఆరాధించే యూదులు, యూదులు కానివాళ్ళు పౌలు బర్నబాలను వెంబడించారు. పౌలు, బర్నబాలు మాట్లాడుతూ, దేవుని ఉచిత కృప వలన యేసు చేసిన కార్యాన్నిబట్టి ఆయన్ను నమ్ముకొని పాప క్షమాపణ పొందాలని బోధించారు.
\s5
\p
\v 44 తరువాతి విశ్రాంతి దినాన ప్రభువైన యేసును గురించి పౌలు, బర్నబాల బోధలు వినడానికి అంతియొకయ నుండి యూదులు తండోపతండాలుగా సమావేశ స్థలానికి రుకున్నారు.
\v 45 అయితే జనసమూహాలు పౌలు బర్నబాల బోధలు వినేందుకు విరివిగా రావడం చూసి యూదు నాయకులకు ఈర్ష్య కలిగింది. పౌలు చెబుతున్న మాటలకు అడ్డుపడుతూ అతణ్ణి గేలిచేయడం మొదలుపెట్టారు.
\s5
\v 46 అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా యూదు నాయకులతో ఇలా చెప్పారు, "దేవుడు పంపిన యేసు సువార్త మేము మొదట యూదులు కానివాళ్ళకు కాక, యూదులైన మీకు బోధించాలని దేవుని ఆజ్ఞ. అయితే యూదులైన మీరు సువార్తను తోసిపుచ్చి నిత్యజీవాన్ని కోల్పోతున్నారు. అందువల్ల మేము మిమ్మల్ని విడిచిపెట్టి యూదులు కాని వాళ్ళకు సువార్త బోధిస్తున్నాము.
\v 47 దేవుడు ఈ విధంగా చేయమని చెప్పాడు కనుక మేము చేస్తున్నాము. ఆయన తన లేఖనాల్లో ఇలా చెప్పాడు."
\q "యూదులు కాని ప్రజలకు వెలుగుగా ఉండేందుకు నేను నిన్ను ఎన్నుకున్నాను.
\q ప్రపంచమంతటా రక్షణ వార్త బోధించేవానిగా నిన్ను నియమించుకున్నాను."
\s5
\p
\v 48 ఈ మాటలు విన్న యూదులు కానివాళ్ళు ఎంతో సంతోషించి, యేసుని గురించిన వార్తను బట్టి దేవుణ్ణి కొనియాడారు. యూదులు కానివాళ్ళు అయిన తమను నిత్యజీవానికి వారసులుగా చేసిన యేసు వార్తను విశ్వసించారు.
\p
\v 49 ఆ రోజుల్లో సువార్త ఆ పరిసర ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. విశ్వాసులు అనేకులు తాము ప్రయాణించిన ప్రతి చోటా సువార్త ప్రచురించారు.
\s5
\v 50 అయితే యూదు పెద్దలు కొందరు నగరంలోని తమతో కలసి ఆరాధించే ముఖ్యమైన స్త్రీలను, పేరుప్రఖ్యాతులు గల పురుషులను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకున్నారు. వాళ్ళు పౌలు బర్నబాలను హింసించి వాళ్ళను తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు.
\v 51 ఇద్దరు అపొస్తలులు దేవుడు వాళ్ళను తిరస్కరించాడని, వాళ్ళను శిక్షిస్తాడని చూపేందుకు గుర్తుగా తమ కాళ్ళ దుమ్మును దులిపివేసి అంతియొకయ నుంచి ఈకోనియ ప్రాంతానికి బయలుదేరారు.
\v 52 అయితే విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఆనందంగా ఉన్నారు.
\s5
\c 14
\p
\v 1 ఈకొనియలో పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలోకి వెళ్లి, ఎంత బాగా మాట్లాడారంటే చాలా మంది యూదులూ గ్రీకులూ యేసులో విశ్వాసముంచారు.
\v 2 అయితే కొంత మంది యూదులు ఆ మాటలు నమ్మకుండా, యూదులు కానివాళ్ళని రెచ్చగొట్టి అక్కడి విశ్వాసుల మీద ద్వేషం పుట్టించారు.
\s5
\p
\v 3 పౌలు బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాల కాలం గడిపారు. వాళ్ళ ద్వారా యేసు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలను చేయించాడు. ఈ విధంగా మనం అర్హులం కాకపోయినప్పటికీ ప్రభువు రక్షిస్తాడు అనే వాక్య సత్యాన్ని ప్రజలకు బోధించారు.
\p
\v 4 ఈకొనియలో ఉండే ప్రజలకి రెండు వేరు వేరు అభిప్రాయాలు ఉండేవి. కొందరు యూదులతో మరికొందరు అపొస్తులతో ఏకీభవించారు.
\s5
\p
\v 5 పౌలు బర్నబాను వ్యతిరేకించే యూదులు, యూదులు కానివాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసారు. వాళ్ళందరూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు.
\v 6 వాళ్ళు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియా ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకు, ఆ చుట్టుపక్కల ప్రాంతలకు వెళ్లిపోయారు.
\p
\v 7 వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు, అక్కడివాళ్ళకి ఎప్పుడూ ప్రభుని వాక్యమే చెప్పారు.
\s5
\v 8 లుస్త్రలో కాళ్ళు పనిచెయ్యని వికలాంగుడు ఒకడున్నాడు. అతడు పుట్టినప్పటి నుంచీ కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు.
\v 9 అతడు పౌలు మాట్లాడుతుంటే విన్నాడు, పౌలు సూటిగా అతని వైపు చూసి, అతని ముఖంలో యేసు తనను బాగు చెయ్యగలడు అనే విశ్వాసం గమనించి,
\v 10 "లేచి నిలబడు" అని గట్టిగా అనగానే, అతడు చటుక్కున లేచి గంతులేస్తూ నడవడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 11 ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, పౌలు బర్నబాలు తమ కులదైవాలుగా భావించారు. లుకయోనియ భాషలో, "దేవుళ్ళు మానవ రూపంలో ఆకాశం నుండి మన దగ్గరికి వచ్చారు" అని కేకలు వేశారు.
\p
\v 12 బర్నబాను ప్రధాన దేవుడు అనుకుని అతనికి జూస్ అనీ, పౌలు ప్రసంగిస్తున్నాడు కాబట్టి అతనికి హెర్మే, అంటే ఇతర దేవుళ్ళ పక్షంగా మాట్లాడే వాడు అని అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు.
\p
\v 13 పట్టణానికి బయట ఉన్న గుడిలో జూస్ దేవుడి పూజారి ప్రజలు అనుకునేది విని, పట్టణ ముఖద్వారం దగ్గర జన సమూహంతో కలిసి రెండు ఎడ్ల మెడలకు పూల దండలు వేసి వాళ్ళకి బలి అర్పించడానికి తీసుకొచ్చారు.
\s5
\p
\v 14 అది చూసి అపొస్తలులు పౌలు బర్నబాలు తీవ్ర ఉద్వేగంతో బట్టలు చింపుకొని, గట్టిగా అరుచుకుంటూ గుంపులోకి పరుగెత్తారు.
\p
\v 15 "అయ్యలారా, మీరు చేస్తున్నదేమిటి? మాకోసం ఆ ఎద్దులను బలి ఇవ్వకండి. మేము దేవుళ్ళo కాదు, మీలానే మనుషులం. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి గురించి చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్నీవాటిలో ఉండే సమస్త జీవరాసులను సృష్టించిన దేవుడు ఇతర దేవుళ్ళను పూజించడం మానుకోమని మీకు చెబుతున్నాడు."
\p
\v 16 "గతంలో మీరందరూ మీకు ఇష్టం వచ్చిన దేవుళ్ళని పూజించారు. ఎందుకంటే అప్పుడు మీకు నిజ దేవుడు తెలియదు.
\s5
\v 17 ఆయన తన కార్యాల ద్వారా మనకి వర్షం కురిసేలా, దాని ద్వారా మంచి పంటలు పండేలా, పుష్కలంగా ఆహారం ఉండేలా, మన హృదయం నిండా ఆనందం నిండేలా అనుగ్రహం చూపాడు."
\p
\v 18 పౌలు చెప్పింది వింటున్న జనం, పౌలు బర్నబాలు అలా చెబుతున్నప్పటికీ వారికి బలులు అర్పిద్దాం అనుకుని, కొంత సేపటికి చివరికి విరమించుకున్నారు.
\s5
\p
\v 19 అంతియొకయ, ఈకొనియ నుండి వచ్చిన యూదులు జనాన్ని తమవైపు తిప్పుకుని, పౌలు చెప్పేది నిజం కాదని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మిన జనం కోపంతో పౌలు మీద రాళ్ళు విసిరి, అతడు చనిపోయాడనుకుని ఊరి బయటకి ఈడ్చివేసారు.
\v 20 అయితే కొంత మంది శిష్యులు అతని చుట్టూ నిలబడి ఉండగా, పౌలు లేచి శిష్యులతో తిరిగి పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్ళిపోయారు.
\s5
\p
\v 21 అక్కడ చాల రోజులు సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.
\v 22 ప్రతి చోటా వాళ్ళు విశ్వాసులతో దేవునిపై విశ్వాసం ఉంచమని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక బాధలు పడాలని చెప్పి వాళ్ళని బలపరిచారు.
\s5
\p
\v 23 పౌలు, బర్నబాలు ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరచి వాళ్ళతో కలిసి ఉపవాసముండి ప్రార్థన చేసి, వాళ్ళు నమ్మిన ప్రభువుకు వాళ్ళని అప్పగించారు.
\p
\v 24 తర్వాత పౌలు బర్నబా పిసిదియ ప్రాంతమంతా తిరిగి, పంఫూలియకు వచ్చారు.
\v 25 అక్కడ పెర్గేలో వాక్యం బోధించి, అత్తాలియ పట్టణంలో తీరం ప్రాంతానికి వెళ్లారు.
\v 26 అక్కడ నుంచి ఒక ఓడ ఎక్కి సిరియా లోని అంతియొకయ చేరుకున్నారు. మొదట్లో తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించుకుని వారు బయలు దేరింది ఇక్కడే. మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చారు.
\s5
\v 27 వాళ్ళు అంతియొకయ వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడుగా ఉండి చేసి పనులన్నిటినీ, యూదులు కానివాళ్ళు యేసులో నమ్మకముంచడానికి దేవుడు చేసిన కార్యాలనూ వివరించారు.
\v 28 ఆ తర్వాత పౌలు, బర్నబాలు శిష్యుల దగ్గరే చాలా కాలం గడిపారు.
\s5
\c 15
\p
\v 1 యూదయ ప్రాంతం నుండి కొందరు విశ్వాసులు అంతియొకయకు వెళ్లారు. వాళ్ళు అక్కడి యూదేతర విశ్వాసులకు, "మీరు దేవునికి చెందిన వారని నిరూపించుకోవాలంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా సున్నతి పొందాలి, అలా చేయకపోతే మీకు రక్షణ లేదు" అని బోధించడం మొదలుపెట్టారు.
\v 2 పౌలు, బర్నబాలు ఆ బోధను తీవ్రంగా వ్యతిరేకించి వాదనకు దిగారు. కాబట్టి అంతియొకయ విశ్వాసులు ఈ సమస్య విషయమై యెరూషలేము వెళ్లి అపొస్తలులతో, ఇతర నాయకులతో చర్చించవచ్చని పౌలును, బర్నబాను, ఇంకా కొంతమందిని యెరూషలేము పంపడానికి తీర్మానించారు.
\s5
\p
\v 3 అంతియొకయ విశ్వాసులు పంపిన పౌలు, బర్నబా, మరికొందరు ఫెనీకే, సమరయ ప్రాంతాల ద్వారా ప్రయాణించారు. మార్గంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఆగినప్పుడు అనేకమంది యూదేతరులు దేవునిలో విశ్వాసముంచారనే సంగతిని విశ్వాసులకు వాళ్ళు తెలియచేశారు. దాని ఫలితంగా ఆ ప్రాంతంలోని విశ్వాసులందరూ ఎంతో ఆనందించారు.
\p
\v 4 పౌలు, బర్నబా, మిగిలినవాళ్ళు యెరూషలేము చేరుకోగానే, అక్కడి సంఘంలోని అపొస్తలులూ, పెద్దలూ, ఇతర విశ్వాసులూ వాళ్ళకి స్వాగతం పలికారు. అప్పుడు పౌలు, బర్నబాలు దేవుడు తమకు తోడై, యూదేతరుల మధ్య జరిగించిన సంగతులను వాళ్ళకి వివరించారు.
\s5
\p
\v 5 అయితే పరిసయ్యుల తెగలోని కొంతమంది యూదు విశ్వాసులు లేచి వాళ్ళతో, "యేసులో విశ్వాసముంచిన యూదేతరులకు సున్నతి చేయించి, దేవుడు అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వాళ్ళకి ఆజ్ఞాపించాలి" అని చెప్పారు.
\p
\v 6 అప్పుడు అపొస్తలులూ, పెద్దలూ ఈ సంగతి గురించి చర్చించడానికి సమావేశం అయ్యారు.
\s5
\v 7 చాలా సేపు చర్చ జరిగిన తరవాత పేతురు లేచి వాళ్ళతో ఇలా అన్నాడు, "సాటి విశ్వాసులారా, యూదేతరులు కూడా దేవుని ప్రేమను గురించి నా నోట విని ఆయనను విశ్వసించేలా ప్రారంభంలో మీలోనుండి నన్ను దేవుడు ఎన్నుకున్నాడని మీకందరికీ తెలుసు.
\v 8 దేవుడు మనుషుల హృదయాలను ఎరిగినవాడు. నాకు, ఇతరులకు ఇచ్చినట్టే యూదేతరులకు కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా వాళ్ళని తన ప్రజలుగా అంగీకరించినట్టు కనపరచుకున్నాడు. ఆ విధంగానే మనపట్ల కూడా జరిగించాడు.
\v 9 ప్రభువైన యేసులో వాళ్ళ విశ్వాసానికి ఫలితంగా దేవుడు వాళ్ళని కూడా పవిత్రపరిచి, మనకీ వాళ్ళకీ ఏ వ్యత్యాసమూ చూపలేదు. కచ్చితంగా మనల్ని ఎలా క్షమించాడో వాళ్ళని కూడా అలాగే క్షమించాడు."
\s5
\p
\v 10 "మన యూదు ఆచార నియమాలను పాటించాలని యూదేతర విశ్వాసులను ఎందుకు మీరు బలవంతం చేస్తారు? మన పూర్వికులు కూడా చేయలేక అతిక్రమించిన వాటినీ, యూదులమైన మనం కూడా ఈ రోజుల్లో పాటించలేని వాటినీ చేయమనడం మోయలేని బరువును వాళ్ళ మీద మోపినట్టే గదా. కాబట్టి అలా చేసి దేవుని కోపానికి గురికావద్దు.
\v 11 ప్రభువైన యేసు మనకోసం చేసిన కార్యం వలన యూదులమైన మనం మన పాపాలనుండి రక్షణ పొందుతామని నమ్ముతున్నాం గదా. యూదులమైన మనల్ని దేవుడు ఎలా రక్షిస్తాడో అదే విధంగా కచ్చితంగా యూదేతరులను కూడా రక్షిస్తాడు."
\s5
\p
\v 12 పేతురు మాట్లాడిన తరవాత అక్కడ ఉన్న వారంతా నిశ్శబ్దమైపోయారు. అప్పుడు పౌలు, బర్నబా దేవుడు తమకు తోడై ఉండి, యూదేతరులను ఆయన అంగీకరించిన దానికి సూచనగా తమ ద్వారా వాళ్ళ మధ్య చేసిన అనేక సూచక క్రియలనూ, అద్భుతాలనూ వివరిస్తుంటే వారంతా ఆలకించారు.
\s5
\p
\v 13 పౌలు, బర్నబాలు చెప్పడం ముగించిన తరవాత, యెరూషలేములోని విశ్వాసుల సంఘ నాయకుడైన యాకోబు వాళ్ళతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు.
\p
\v 14 "సోదరులారా, నా మాట వినండి. దేవుడు యూదేతరులను ఎలా ఆశీర్వదించాడో సీమోను పేతురు ఇంతకు ముందే మీకు తెలిపాడు. దేవుడు వాళ్ళలోనుండి తన ప్రజలుగా ఉండడానికి ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు.
\s5
\v 15 "అనాది కాలంలో దేవుడు పలికిన మాటలూ, ప్రవక్తలలో ఒకరు రాసిన మాటలతో సరిపోతున్నాయి.
\q1
\v 16 ఆ తరవాత నేను తిరిగి వస్తాను,
\q1 దావీదు వంశం వారిలో నుండి ఒక రాజును ఎంపిక చేసి
\q1 దావీదు రాజ్యాన్ని పునరుద్ధరిస్తాను.
\q1 అది పడిపోయిన ఇంటిని మళ్ళీ కట్టినట్టుగా ఉంటుంది."
\p
\v 17 "నేనే ప్రభువైన దేవుడని మిగిలిన వారంతా తెలుసుకోడానికి ప్రయత్నించేలా నేను దీనిని చేస్తాను. ఎవరినైతే నాకు చెందినవారని నేను ఏర్పరచుకున్నానో వాళ్ళలో ఆ యూదేతరులు కూడా భాగం అవుతారు.
\v 18 అనాది కాలం నుండీ ఈ సంగతులను జరిగిస్తున్నాను. దీనిని నా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను."
\s5
\p
\v 19 యాకోబు తన మాటలు కొనసాగిస్తూ, "కాబట్టి తమ పాపాలను విడిచిపెట్టి దేవునివైపు తిరిగే వాళ్ళని కష్టపెట్టకూడదని నా అభిప్రాయం. అంతేకాదు, వాళ్ళు మన ఆచార నియమాలను పాటించాలని వత్తిడి చేయకూడదు.
\v 20 వాటికంటే, వాళ్ళు పాటించాల్సిన నాలుగు విషయాలు తెలుపుతూ వాళ్ళకి ఉత్తరం రాసి పంపాలి. విగ్రహాలకు అర్పించిన మాంసం తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి, గొంతు నులిమి చంపిన జంతువు మాంసాన్ని తినకూడదు, జంతు రక్తం తినకూడదు.
\v 21 ప్రతి పట్టణంలో తరతరాలుగా మోషే రాసిన లేఖనాలను ప్రజలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయాలను లేఖనాలు నిషేధిస్తున్నాయి. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరాలలో ఈ సంగతులు చదువుతున్నారు. కాబట్టి యూదేతరులు ఒకవేళ ఈ నియమాలను మరింతగా తెలుసుకోవాలి అనుకుంటే, వాళ్ళు సమాజ మందిరాలలో తెలుసుకోవచ్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 యాకోబు చెప్పిన వాటిని అపొస్తలులూ, మిగిలిన పెద్దలూ, యెరూషలేములోని విశ్వాసులంతా అంగీకరించారు. అప్పుడు సోదరులలో కొందరిని ఎంపిక చేసి, పౌలు బర్నబాలతో బాటు అంతియొకయకు పంపడం మంచిదని, యెరూషలేము పెద్దల నిర్ణయాన్ని అక్కడి యూదేతర పెద్దలకు వాళ్ళు తెలియజేయాలని నిర్ణయించారు. ఆ విధంగా వాళ్ళు బర్సబ్బ అనే పేరున్న యూదానూ, సీలనూ ఎన్నుకున్నారు. వీరిద్దరూ యెరూషలేము విశ్వాసులలో నాయకులు.
\p
\v 23 అప్పుడు యూదా, సీల అనే వీరిద్దరినీ అంతియొకయ విశ్వాసులు చేర్చుకోవలసిందిగా కోరుతూ, ఈ విధంగా ఉత్తరం రాశారు. "అపొస్తలులూ, పెద్దలూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదేతరులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాస్తున్నాం.
\s5
\v 24 కొందరు మేము పంపకపోయినప్పటికీ మా నుండి మీ దగ్గరకు వచ్చారని మాకు తెలిసింది. వాళ్ళు తమ బోధతో మిమ్మల్ని గాభరా పెట్టి మీ మనసులు పాడుచేశారని మేము విన్నాం.
\v 25 కాబట్టి మేమందరం సమావేశమై కొందరిని ఎంపిక చేసి మేము బాగా ఇష్టపడే పౌలు, బర్నబాలతో కూడా మీ దగ్గరకు పంపాలని నిర్ణయించాం.
\v 26 పౌలు, బర్నబాలిద్దరూ, మన ప్రభువైన యేసును సేవించడంలో ప్రాణాలను ఫణంగా పెట్టినవాళ్ళు.
\s5
\v 27 యూదా, సీలలను మీ దగ్గరకు పంపుతున్నాం. మేము రాసిన విషయాలనే వాళ్ళు మళ్ళీ మీకు చెబుతారు.
\v 28 తలబరువుగా ఉండే యూదు ఆచార నియమాలను మీరు పాటించవలసిన అవసరం లేదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించింది. వీటికి బదులుగా మీరు కొన్ని సూచనలు మాత్రమే పాటించాల్సిన అవసరం ఉంది."
\p
\v 29 "మీరు విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినకూడదు. జంతువుల రక్తం, గొంతు పిసికి చంపిన జంతువుల మాంసం తినకూడదు. వ్యభిచారం జరిగించకూడదు. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మేలు."
\s5
\p
\v 30 ఆ నలుగురూ యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. విశ్వాసులంతా సమావేశమైనప్పుడు వాళ్ళకి ఆ ఉత్తరం ఇచ్చారు.
\v 31 వాళ్ళు ఆ ఉత్తరం చదువుకొని సంతోషించారు, ఎందుకంటే ఆ ఉత్తరం వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం కలిగించింది.
\v 32 ప్రవక్తలుగా ఉన్న యూదా, సీలలు అక్కడి విశ్వాసులతో చాలాసేపు మాట్లాడి, ప్రోత్సహించి ప్రభువైన యేసులో మరింత బలంగా విశ్వసించడానికి వాళ్ళకి సహాయం చేశారు.
\s5
\p
\v 33 యూదా, సీల కొంతకాలం వాళ్ళతో గడిపిన తరవాత తిరిగి యెరూషలేము వెళ్ళడానికి అక్కడి విశ్వాసులు వాళ్ళకి సాదరంగా వీడ్కోలు పలికారు. తరవాత యూదా, సీల యెరూషలేము వెళ్ళిపోయారు.
\v 34-35 అయితే పౌలు, బర్నబా అంతియొకయలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ అనేకమందితో కలిసి యేసు ప్రభువు సువార్త బోధిస్తూ ఉన్నారు.
\s5
\p
\v 36 కొంతకాలం తరవాత పౌలు, బర్నబాతో "ఇంతకు ముందు యేసుప్రభువు ప్రకటించిన ప్రతి పట్టణానికీ వెళ్లి తోటి విశ్వాసులను మళ్ళీ కలుద్దాము, ఆ విధంగా వాళ్ళు ప్రభువులో ఎలా ముందుకు కొనసాగుతున్నారో తెలుసుకుందాం" అన్నాడు.
\v 37 బర్నబా దానికి అంగీకరించి తనతోబాటు మార్కు అనే మారు పేరు ఉన్న యోహానును తీసుకు రావడానికి ఇష్టపడ్డాడు.
\p
\v 38 అయితే అతణ్ణి వెంటబెట్టుకు వెళ్ళడం సబబు కాడని పౌలు అన్నాడు. ఎందుకంటే పంఫులియ ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు తమను విడిచిపెట్టి వెళ్ళిపోయదు. పని కొనసాగించలేదు. అందుకే అతణ్ణి మళ్ళీ తీసుకువెళ్ళడం భావ్యం కాదని పౌలు తలంచాడు.
\s5
\v 39 పౌలు, బర్నబా ఈ విషయంలో ఒకరితో ఒకరు తీవ్రమైన భేదాభిప్రాయం తలెత్తింది. వాళ్ళు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర దీవికి వెళ్ళాడు.
\p
\v 40 పౌలు అంతియొకయకు వచ్చిన సీలతో కలిసి పనిచేయడానికి పూనుకున్నాడు. అక్కడి విశ్వాసులు పౌలు సీలలకు కృపతో సహాయం అందించమని ప్రభువును వేడుకున్నారు. అప్పుడు వారిద్దరూ అంతియొకయ విడిచి వెళ్ళారు.
\v 41 పౌలు సీలతో కలిసి సిరియా, కిలికియ దేశాలగుండా తన ప్రయాణం కొనసాగించాడు. ఆయా స్థలాల్లో ఉన్న విశ్వాసుల గుంపులను ప్రభువైన యేసు విశ్వాసంలో బలపడేలా వాళ్ళకి సహాయం చేస్తూ ప్రయాణించారు.
\s5
\c 16
\p
\v 1 పౌలు దేర్బే, లుస్త్ర పట్టణాలకు వెళ్లి అక్కడి విశ్వాసులను కలుసుకున్నాడు. దీన్ని గమనించండి: లుస్త్రలో తిమోతి అనే ఒక విశ్వాసి ఉన్నాడు. అతని తల్లి విశ్వసించిన యూదురాలు. అతని తండ్రి మాత్రం గ్రీకు జాతి వాడు.
\v 2 లుస్త్ర, ఈకొనియలోని విశ్వాసులు అతని గురించి మంచి విషయాలు చెప్పారు.
\v 3 పౌలు తనతోబాటు తిమోతిని తీసుకెళ్లాలని ఆశించాడు. దానికోసం అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే అతని తండ్రి యూదేతరుడనీ, అతనికి సున్నతి చేయించలేదనీ అక్కడి యూదులందరికీ తెలుసు. అదీ గాక తాను వెళ్లబోయే ప్రాంతాలన్నీ యూదులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు కాబట్టి సున్నతి జరిగితే వాళ్ళు అతణ్ణి తేలికగా అంగీకరిస్తారని పౌలు భావించాడు.
\s5
\p
\v 4 తిమోతి, పౌలు, సీల కలిసి అనేక పట్టణాలు తిరిగారు. ప్రతి చోటా విశ్వాసులకు యెరూషలేములోని అపొస్తలులూ, పెద్దలూ నిర్ణయించిన నియమాలను బోధించారు.
\p
\v 5 కాబట్టి ఆయా పట్టణాల్లోని విశ్వాసులు యేసుప్రభువులో విశ్వాసంలో అంతకంతకు బలపడడానికి వాళ్ళు సహాయపడ్డారు. రోజురోజుకీ అనేకమంది విశ్వాసులుగా మారుతున్నారు.
\s5
\p
\v 6 పౌలు, అతని సహచరులను ఆసియా ప్రాంతంలో వాక్యం బోధించవద్దని పరిశుద్ధాత్మ వారించడం వలన వాళ్ళు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా వెళ్ళారు.
\v 7 వాళ్ళు ముసియ ప్రాంతానికి వచ్చి ఉత్తరాన బితూనియ గుండా వెళ్ళడానికి ప్రయత్నించారు గానీ యేసు ఆత్మ వాళ్ళని అడ్డగించాడు.
\v 8 కాబట్టి వాళ్ళు ముసియ గుండా సముద్రతీరాన ఉన్న త్రోయకు చేరుకున్నారు.
\s5
\v 9 ఆ రాత్రి పౌలుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దానిలో మాసిదోనియ ప్రాంతానికి చెందిన ఒకతనిని చూశాడు. అతడు పౌలును, "మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యండి" అని పిలిచాడు.
\p
\v 10 ఆ దర్శనం చూసిన తర్వాత అక్కడి ప్రజలకు సువార్త ప్రకటించమని దేవుడు మమ్మల్ని పిలిచాడని గ్రహించి మేము మాసిదోనియకు బయలుదేరాం.
\s5
\p
\v 11 మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమోత్రకే కు, మరుసటి రోజు నెయపోలికి వెళ్లాం.
\p
\v 12 తరవాత, నెయపోలినుండి ఫిలిప్పికి వెళ్లాం. మాసిదోనియలో ఫిలిప్పీ చాల ప్రాముఖ్యమైన పట్టణం. అక్కడ అనేకమంది రోమా పౌరులు నివాసం ఉన్నారు. ఫిలిప్పిలో మేము చాలా రోజులు గడిపాం.
\p
\v 13 విశ్రాంతి దినాన ఊరిబయట ద్వారం దాటి నదీ తీరానికి వెళ్ళాం. అక్కడ యూదులు ప్రార్థన కోసం సమావేశం అవుతారని ఎవరో చెప్పగా విన్నాం. మేము అక్కడికి చేరగానే, ప్రార్థనకు సమావేశమైన కొందరు స్త్రీలను చూశాం. అక్కడ కూర్చుని యేసు గురించి వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టాం.
\s5
\p
\v 14 పౌలు మాటలు వింటున్న స్త్రీలలో తుయతైర నుండి వచ్చిన లూదియ అనే ఆమె ఉంది. ఆమె ఊదా రంగు వస్త్రాల వ్యాపారి. ఆమె దేవుణ్ణి ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె విశ్వసించింది.
\p
\v 15 లూదియకు, ఆమె ఇంటివాళ్ళకి పౌలు సీలలు బాప్తీసం ఇచ్చిన తరవాత ఆమె వాళ్ళతో, "నేను ప్రభువులో విశ్వాసిని అని మీరు భావిస్తే మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి" అని కోరింది. ఆమె అలా అన్న తరవాత మేం ఆమె ఇంటికి వెళ్లాం.
\s5
\p
\v 16 మరొక రోజు, ప్రజలు ప్రార్థనకు సమావేశమయ్యే చోటకి వెళ్తూ ఉండగా, ఒక బానిస పిల్ల మాకు ఎదురైంది. ఆమె దయ్యాల శక్తితో సోది చెబుతూ ఉంది. భవిష్యత్తులో జరగబోయే దాన్ని అక్కడి మనుషులు ఆమెతో సోది చెప్పించుకొని దానికి ప్రతిఫలంగా ఆమె యజమానులకు డబ్బులు చెల్లించేవాళ్ళు.
\p
\v 17 ఈ యువతి పౌలును, మమ్మల్ని వెంబడిస్తూ, "వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు! వీరు రక్షణ మార్గం ప్రకటిస్తున్నారు" అని కేకలు వేసేది.
\p
\v 18 ఆమె చాలా రోజులు ఈ విధంగానే చేసింది. ఆఖరికి పౌలుకి చిరాకు వేసి ఆమె వైపు తిరిగి ఆమెలోని భూతంతో, "యేసుక్రీస్తు నామంలో ఈమెను వదిలి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు. ఆ వెంటనే దయ్యం ఆమెని వదిలిపోయింది.
\s5
\p
\v 19 అప్పుడు ఆమె యజమానులు ఆమె తమకు ఇంక డబ్బు సంపాదించి పెట్టడం కుదరదని, ఎందుకంటే ఆమె సోది చెప్పలేదనీ గ్రహించి కోపంతో ఊగిపోయారు. వాళ్ళు పౌలునూ, సీలనూ పట్టణంలోని న్యాయాధికారులు ఉండే రచ్చబండ దగ్గరికి ఈడ్చుకెళ్ళారు.
\v 20 వాళ్ళని న్యాయాధికారుల దగ్గరకు తీసుకొచ్చి, "ఈ మనుషులు యూదులు. మన పట్టణంలో ఉన్నవాళ్ళని అల్లకల్లోలం చేస్తున్నారు,
\v 21 రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తున్నారు" అన్నారు.
\s5
\p
\v 22 అప్పుడు, జనసమూహం అంతా దుర్భాషలాడుతూ దొమ్మీగా పౌలు, సీలల మీదకి వచ్చి వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు రోమా న్యాయాధికారులు వాళ్ళ బట్టలు లాగేసి, బెత్తాలతో కొట్టమని సైనికులకు ఆజ్ఞాపించారు.
\v 23 సైనికులు, పౌలు సీలలను బెత్తాలతో భయంకరంగా కొట్టారు. ఆ తరవాత వాళ్ళని జైలులో పడేశారు. వాళ్ళు బయటికి రాకుండా భద్రంగా కాయమని జైలు అధికారికి ఆజ్ఞాపించారు.
\v 24 వాళ్ళ ఆజ్ఞ ప్రకారం జైలు అధికారి పౌలునూ, సీలనూ జైల్లోని లోపలి గదిలోకి తోసి నేలమీద కూర్చోబెట్టి కాళ్ళు రెంటినీ చాపి పాదాలను రెండు కొయ్య దుంగల మధ్య పెట్టి, వాళ్ళు తమ కాళ్ళు కదపడానికి వీలు లేకుండా బిగించాడు.
\s5
\p
\v 25 మధ్యరాత్రిలో పౌలు, సీలలు ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇతర ఖైదీలు అందరూ వింటూ ఉన్నారు.
\v 26 అకస్మాత్తుగా పెద్ద భూకంపం జైలును కదిలించింది. ఆ భూకంపం కారణంగా జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీల సంకెళ్లన్నీ ఊడిపోయాయి.
\s5
\p
\v 27 జైలు అధికారి నిద్ర లేచి జైలు తలుపులన్నీ తెరచి ఉండడం చూశాడు. ఖైదీలంతా పారిపోయారని భావించి కత్తి తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే, ఖైదీలు పారిపోతే పట్టణ న్యాయాధికారులు తనను చంపేస్తారని అతనికి తెలుసు.
\v 28 అయితే పౌలు అతణ్ణి చూసి గట్టిగా, "నువ్వు ఏ హానీ చేసుకోవద్దు. ఖైదీలందరం ఇక్కడే ఉన్నాం!" అని అరిచాడు.
\s5
\p
\v 29 జైలు అధికారి ఎవరెవరు ఇంకా జైలులో ఉన్నారో చూడడానికి దీపం తెమ్మని గట్టిగా అరిచి, త్వరత్వరగా లోపలి వచ్చి భయంతో వణికిపోతూ పౌలు సీలలకు సాష్టాంగపడ్డాడు.
\v 30 అప్పుడు అతడు పౌలు సీలల్ని బయటికి తెచ్చి, "అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి?" అని వాళ్ళని అడిగాడు.
\v 31 అందుకు వాళ్ళు, "యేసుప్రభువులో విశ్వాసముంచు. అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు" అని చెప్పారు.
\s5
\p
\v 32 తరవాత పౌలు, సీలలు అతనికీ, అతని ఇంటివాళ్ళకీ, ప్రభువైన యేసు గురించి బోధించారు.
\v 33 ఆ రాత్రి సమయంలోనే ఆ చెరసాల అధికారి వాళ్ళ గాయాలన్నిటినీ కడిగాడు. వెంటనే అతనికీ, అతని ఇంటివాళ్ళకీ పౌలు సీలలు బాప్తిసమిచ్చారు.
\v 34 తర్వాత జైలు అధికారి, పౌలు సీలలను అతని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. యేసుప్రభువులో విశ్వాసముంచినందుకు జైలు అధికారీ, అతని ఇంటివారూ ఎంతగానో సంతోషించారు.
\s5
\p
\v 35 మరుసటి ఉదయం, "ఆ ఇద్దరు ఖైదీలను విడిచిపెట్టమని "జైలు అధికారికి తెలియజేయమని పట్టణ న్యాయాధికారులు సైనికుల్ని పంపారు.
\v 36 జైలు అధికారి ఇది విని, పౌలు దగ్గరకు వెళ్లి "పట్టణ న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు క్షేమంగా వెళ్ళండి" అని చెప్పాడు.
\s5
\v 37 అయితే పౌలు, జైలు అధికారితో, "మేము రోమా పౌరులం అయినప్పటికీ మమ్మల్ని అందరి ముందూ బహిరంగంగా సైనికులతో కొట్టించి జైలులో వేశారు, ఇప్పుడేమో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా బయటికి పంపాలని చూస్తున్నారు, దీనికి మేము అంగీకరించం. ఆ న్యాయాధికారులే వచ్చి మమ్మల్ని విడుదల చేయాలి" అని చెప్పాడు.
\v 38 కాబట్టి సైనికులు వెళ్ళి న్యాయాధికారులకు ఈ మాట తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని తెలుసుకొని ఆ న్యాయాధికారులు ఎంతో భయపడి తప్పు చేశామని గ్రహించారు.
\v 39 వాళ్ళు పౌలు సీలల దగ్గరకు వచ్చి తాము చేసిన పనికి క్షమాపణ అడిగారు. వాళ్ళు పౌలు సీలలను బయటికి తీసుకొచ్చి పట్టణం విడిచి వెళ్ళమని వాళ్ళని బతిమిలాడారు.
\s5
\p
\v 40 పౌలు సీలలు జైలునుండి విడుదల పొంది లూదియ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమెనూ విశ్వాసులనూ చూసి వాళ్ళని విశ్వాసంలో కొనసాగమని ప్రోత్సహించి ఫిలిప్పీ పట్టణం నుండి వెళ్ళిపోయారు.
\s5
\c 17
\p
\v 1 వాళ్ళు అంఫిపోలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనికకు వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
\v 2 పౌలు తన అలవాటు ప్రకారం అక్కడికి వెళ్ళాడు. ఆ విధంగా మూడు వారాలు ప్రతి విశ్రాంతి దినాన అక్కడికి వెళ్ళాడు. లేఖనాలు యేసే మెస్సీయ అని ఎలా తెలియజేస్తున్నాయో విడమర్చి అక్కడి వాళ్ళకి వివరించాడు.
\s5
\p
\v 3 క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం తప్పనిసరి అని ప్రవక్తలు రాసిన లేఖన భాగాలను వాళ్ళకి చూపిచాడు. "యేసు అనే ఈ వ్యక్తే మెస్సీయ. ప్రవక్తలు చెప్పినట్టు ఆయన మరణించి తిరిగి లేచాడు" అని అతడు వాళ్ళకి వివరించాడు.
\v 4 యూదులలో కొందరు పౌలు చెప్పిన మాటలు విశ్వసించి పౌలునూ సీలనూ కలవడం మొదలుపెట్టారు. అక్కడ దేవుని ఆరాధించే, యేసు సువార్తను విశ్వసించిన అనేకమంది యూదేతరులు, ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పౌలు సీలతో కలవడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 5 అయితే అనేకమంది పౌలు చెప్పిన దానిని నమ్మడంతో, కొందరు యూదు నాయకులకు కన్ను కుట్టి రచ్చబండకు వెళ్లి కొంతమంది పనీపాటా లేక తిరుగుతున్న అలగా జనాన్ని తమ వెంట రమ్మని ప్రేరేపించారు. ఆ విధంగా యూదు నాయకులు గుంపు కూడి గొప్ప అల్లరి సృష్టించారు. ఆ యూదులూ, ఇంకా ఇతరులూ, పౌలు సీలలు నివాసముంటున్న యాసోను ఇంట్లో చొరబడ్డారు. వాళ్ళు పౌలునూ, సీలనూ బహిరంగంగా జనం మధ్యలోకి తీసుకు రావాలనుకున్నారు.
\v 6 పౌలు సీలలు ఆ ఇంట్లో కనబడక పోయేసరికి, యాసోనును, పట్టుకుని బయటికి ఈడ్చుకు వచ్చారు. అతన్నీ, మరి కొందరు సోదరులనూ పట్టుకున్నారు. వాళ్ళు "భూలోకాన్ని తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు.
\v 7 ఈ యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు కైసరు చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వీరు యేసు అనే వ్యక్తి నిజమైన రాజు అని చెబుతున్నారు" అని కేకలు వేశారు.
\s5
\v 8 పట్టణ అధికారులు, జన సమూహం ఈ మాటలు విని కలవరపడి, కోపంతో మండిపడ్డారు.
\v 9 పట్టణ అధికారులు యాసోనుకు, కొందరు విశ్వాసులకు జరిమానా విధించి పౌలు సీలల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటేనే వాళ్ళకి ఆ సొమ్ము తిరిగి ఇస్తామని చెప్పారు. తరవాత పట్టణ అధికారులు యాసోనును, మిగిలిన విశ్వాసులను విడిచిపెట్టారు.
\s5
\p
\v 10 అదే రాత్రి, విశ్వాసులు పౌలును సీలను తెస్సలోనిక నుండి బెరయ అనే ఊరికి పంపించారు. వాళ్ళు బెరయలో ప్రవేశించి అక్కడి యూదుల సమాజమందిరంలోకి వెళ్ళారు.
\p
\v 11 తెస్సలోనిక లోని యూదులలో ఎక్కువమంది దేవుని సందేశాన్ని వినడానికి ఇష్టపడలేదు. అయితే బెరయలో నివసించే యూదులు మాత్రం యేసును గురించిన సువార్తను శ్రద్ధగా వినడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు చాల శ్రద్ధగా యేసును గురించి విన్నారు. ప్రతి రోజూ వాళ్ళు లేఖనాలను చదువుతూ యేసును గురించి పౌలు చెప్పిన మాటలు నిజమో కాదో అని పరిశీలిస్తూ వచ్చారు.
\p
\v 12 పౌలు బోధవల్ల, అనేకమంది యూదులూ, ప్రముఖులైన యూదేతర స్త్రీ పురుషులు యేసులో విశ్వాసముంచారు.
\s5
\p
\v 13 అయితే పౌలు బెరయలో యేసును ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు బెరయకు వెళ్లి అక్కడి ప్రజలకు అతనికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని కూడా రెచ్చగొట్టి అల్లరి రేపారు.
\p
\v 14 బెరయలోని కొందరు విశ్వాసులు వెంటనే పౌలును వేరే పట్టణం వెళ్ళడానికి సముద్రం వరకు సాగనంపారు. అయితే సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.
\p
\v 15 పౌలు, అతన్ని సాగనంపడానికి వెళ్ళినవాళ్ళు సముద్ర తీరం చేరుకొని ఒక నావ మీద ఏతెన్స్ నగరానికి చేరుకున్నారు. అప్పుడు పౌలు వాళ్ళతో, "సీలను, తిమోతిని సాధ్యమైనంత తొందరగా ఏతెన్స్ నగరానికి రమ్మని చెప్పమని" చెప్పాడు. ఆ విశ్వాసులు ఏతెన్స్ విడిచిపెట్టి బెరయకు వెళ్ళిపోయారు.
\s5
\p
\v 16 ఏతెన్సు లో పౌలు, సీల, తిమోతిల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య సమయంలో పట్టణం అంతా తిరిగాడు. ఆ పట్టణంలో ఎన్నో విగ్రహాలు ఉండడం చూసి చాలా కలత పడ్డాడు.
\p
\v 17 అందుచేత యూదుల సమాజ మందిరానికి వెళ్లి అక్కడి యూదులతో, దేవుణ్ణి ఆరాధించే గ్రీకులతో యేసును గురించి మాట్లాడాడు. అతడు ప్రతి రోజూ బహిరంగ స్థలంలోని రచ్చబండకు వెళ్లి, వచ్చే పోయే జనంతో మాట్లాడుతూ వచ్చాడు.
\s5
\p
\v 18 పౌలు అక్కడి ప్రజల నమ్మకాల గురించి మాట్లాడడానికి ఇష్టపడే కొందరు బోధకులతో మాట్లాడాడు. ఎపీకూరీయులు, స్తోయికులు అని పిలవబడే కొందరు తత్వవేత్తలు వాళ్ళు ఏమి నమ్ముతున్నారో పౌలుతో చెప్పారు. పౌలును కూడా తన నమ్మకం ఏమిటని అడిగారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడని పౌలు వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు "ఇతడు కొత్త దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 19 అందుచేత వాళ్ళు పౌలును పట్టణ నాయకులు సమావేశమయ్యే చోటికి తీసుకెళ్ళారు. వారక్కడికి చేరుకోగానే "నువ్వు ప్రజలకు ప్రకటిస్తున్న సమాచారం ఏమిటి? దయచేసి మాక్కూడా చెప్పు.
\v 20 నువ్వు చెబుతున్న వింత విషయాలు మాకర్ధం కావడం లేదు. కాబట్టి వాటిని మేము తెలుసుకోగోరుతున్నాం" అని వాళ్ళు పౌలును అడిగారు.
\v 21 ఏతెన్స్ ప్రజలకూ, ఇతర ప్రాంతాలనుండి వచ్చి అక్కడ నివసించే విదేశీయులకూ కొత్త విషయాలు వినడం, మాట్లాడడం ఒక సరదా.
\s5
\p
\v 22 పౌలు వాళ్ళ ఎదుట నిలబడి ఇలా చెప్పాడు, "ఏతెన్స్ ప్రజలారా, మీరు చాల భక్తిపరులని నాకు అర్థం అవుతున్నది.
\v 23 ఇలా ఎందుకు చెబుతున్నానంటే, నేను దారిన పోతున్నప్పుడు మీరు పూజించే విగ్రహాలను చూశాను. ఒక బలిపీఠాన్ని దానిమీద చెక్కిన మాటలు కూడా చూశాను. దానిమీద "తెలియని దేవునికి" అని రాసి ఉంది. ఇప్పుడు నేను మీరు తెలియకుండా పూజిస్తున్న ఆ తెలియని దేవుని గురించి చెబుతాను.
\s5
\v 24 ఆ దేవుడే విశ్వాన్ని అందులోని సమస్తాన్నీ చేశాడు. పరలోకంలో, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ పరిపాలిస్తున్న ఆ దేవుడు మనుషులు కట్టిన మందిరాలలో నివసించడు.
\v 25 ఆయన అందరికీ జీవాన్నీ, ఊపిరినీ, వాళ్ళకవసరమైన సమస్తాన్నీ దయచేసేవాడు. కాబట్టి ఆయన తనకు ఏదో అవసరం అన్నట్టు మనుషులు చేతులతో చేసే సేవలు ఆయనకు అక్కర లేదు."
\s5
\p
\v 26 "ఆదిలో ఒక్క జంటను సృష్టించి వాళ్ళనుండి లోకమంతా నివసించే అన్ని జాతులనూ చేశాడు. వాళ్ళకోసం కాలాలను, వాళ్ళు నివసించడానికి సరిహద్దులనూ ఏర్పరచాడు.
\v 27 వాళ్ళు తన అవసరాన్ని గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే వాళ్ళు తమకు తాము ఆయనను వెదికి కనుగొనాలని ఆయన అభిమతం. వాస్తవానికి ఆయన మనకెంతో సమీపంగా ఉన్నప్పటికీ మనమే ఆయనను వెదకి కనుక్కోవాలని దేవుడు కోరుతున్నాడు.
\s5
\q1
\v 28 ఆ దేవుని వల్లే మనం జీవిస్తున్నాం, తిరుగుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం.
\q1 మీలో ఒకరు చెప్పినట్టుగా, మనం ఆయన సంతానం."
\p
\v 29 "కాబట్టి మనం దేవుని సంతానం, దేవుడు బంగారం, వెండి, రాతితో మనుషులు చెక్కిన బొమ్మలాటివాడని మనం భావించకూడదు.
\s5
\v 30 దేవుడు మనుషులు ఏమి చేయాలని కోరుతున్నాడో తెలుసుకోలేని అజ్ఞాన కాలాలను ఆయన చూసీ చూడనట్టుగా ఉండి వాళ్ళు చేసినదానికి వాళ్ళని శిక్షించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అందరు తమ పాప క్రియలు విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయనవైపు తిరగాలని ఆజ్ఞాపిస్తున్నాడు.
\v 31 ఎందుకంటే, తాను నియమించిన వ్యక్తి ద్వారా మనందరినీ తీర్పు తీర్చే ఒక రోజు ఆయన నిర్ణయించాడు. మృతులలోనుండి ఆయనను లేపాడు కాబట్టి దీనిని నమ్మడానికి ఆయన అందరికీ ఆస్కారం కలిగించాడు."
\s5
\p
\v 32 ఒక మనిషి చనిపోయి మళ్ళీ బతికాడు అని చెప్పినప్పుడు వాళ్ళలో కొందరు అతణ్ణి ఎగతాళి చేశారు. అయితే కొంతమంది "మళ్ళీ ఇంకొక రోజు వచ్చి దీనిని గురించి చెప్పు. తీరికగా వింటాం" అన్నారు.
\p
\v 33 ఆ తరవాత పౌలు వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\v 34 అయితే కొంతమంది పౌలుతో కూడా వెళ్లి యేసు సువార్తను విశ్వసించారు. వాళ్ళలో మహాసభ సభ్యుడు అరెయోపగీతు వాడైన దియోనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితో బాటు మరికొందరు ఉన్నారు.
\s5
\c 18
\p
\v 1 ఆ తరవాత పౌలు ఏతెన్స్ నగరం విడిచి కొరింతు పట్టణం వచ్చాడు.
\v 2 అక్కడ పొంతు వంశానికి చెందిన అకుల గురించి తెలుసుకున్నాడు. ఆకుల, అతని భార్య ప్రిస్కిల్ల కొంతకాలం క్రితమే ఇటలీలో ఉన్న రోమా పట్టణం నుండి వచ్చారు. యూదులంతా రోమ్ నగరం వదిలి వెళ్ళిపోవాలని రోమా చక్రవర్తి క్లౌదియ ఆజ్ఞాపించడం వల్ల వీరు రోమ్ నగరాన్ని వదిలి వచ్చేశారు. పౌలు ఆకులనూ, ప్రిస్కిల్లనూ కలుసుకోడానికి వెళ్ళాడు.
\v 3 ఆకుల, ప్రిస్కిల్లలు పోషణ కోసం డబ్బు సంపాదనకు డేరాలు కుట్టేవాళ్ళు. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వాళ్ళతో నివసిస్తూ కలిసి పని చేశాడు.
\s5
\v 4 ప్రతి విశ్రాంతి దినాన పౌలు యూదుల సమాజ మందిరానికి వెళ్లి అక్కడ ఉన్న యూదులు, యూదేతరులతో యేసును గురించి బోధిస్తూ వచ్చాడు.
\p
\v 5 సీల, తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు పౌలు ఆత్మచేత బలంగా ప్రేరేపింపబడుతూ యూదులకు యేసే మెస్సీయ అని ప్రకటించడంలో నిమగ్నమయ్యాడు.
\v 6 అయితే యూదులు పౌలుకు వ్యతిరేకంగా తిరగబడి అతణ్ణి దూషించారు. అందుచేత పౌలు తన బట్టల దుమ్మును దులుపుకొని వాళ్ళతో ఇలా చెప్పాడు, "ఒకవేళ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తే అది మీ బాధ్యతే, ఇంక అది నా బాధ్యత కాదు. ఇక ఇప్పటినుండి యూదేతరులతోనే మాట్లాడతాను" అని
\s5
\v 7 వెంటనే యూదుల సమాజ మందిరంలోనుండి బయలుదేరి దానికి ఆనుకొని ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ బోధించాడు. ఆ ఇంటి యజమాని దైవభక్తి గల యూదేతరుడు. అతని పేరు తీతియు యూస్తు.
\v 8 ఆ తరవాత ఆ సమాజ మందిర అధికారి క్రిస్పు అతని కుటుంబంతో సహా ప్రభువులో విశ్వాసముంచాడు. కొరింతులోని అనేకమంది క్రిస్పు గురించి అతని కుటుంబం గురించి విని వాళ్ళు కూడా ప్రభువును విశ్వసించి బాప్తిసం పొందారు.
\s5
\p
\v 9 ఒక రాత్రి వేళ పౌలుకు కలిగిన ఒక దర్శనంలో ప్రభువు, "నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళ గురించి నువ్వు భయపడవద్దు. మాట్లాడుతూనే ఉండు. మౌనంగా ఉండవద్దు.
\v 10 నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి ఎవడూ నీ మీదికి రాదు. నాగురించి బోధిస్తూ ఉండు. ఎందుకంటే ఈ పట్టణంలో నాకు చెందినవాళ్ళు ఇంకా అనేకమంది ఉన్నారు" అని చెప్పాడు.
\p
\v 11 కాబట్టి పౌలు ఒకటిన్నర సంవత్సరాలు కొరింతులోనే ఉండి యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు.
\s5
\p
\v 12 గల్లియో అకయకు గవర్నర్ గా ఉన్న రోజుల్లో యూదు నాయకులంతా ఏకమై పౌలు మీదికి వచ్చి అతణ్ణి ముట్టడి వేశారు. వారతన్ని గవర్నర్ ఎదుటకు తీసుకెళ్ళి అతని మీద నేరారోపణ చేశారు.
\p
\v 13 వాళ్ళు, "వీడు మన యూదు చట్టాలకు వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు" అని ఆరోపించారు.
\s5
\p
\v 14 పౌలు మాట్లాడబోతుండగా, గల్లియో యూదులతో, "ఈ మనిషి మన రోమా చట్టాలను మీరి ఉంటే మీరేం చెప్పినా నేను వినేవాణ్ణి.
\v 15 అయితే మీరు ఏదో మతబోధ గురించో, పేరులు గురించో, ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకొని అతనితో మాట్లాడండి. ఇలాంటి వాటిని గురించి న్యాయం చెప్పడానికి నాకు మనసు లేదు" అని చెప్పాడు.
\s5
\p
\v 16 గల్లియో ఇలా చెప్పగానే అక్కడి కొందరు సైనికులు యూదు నాయకులను న్యాయపీఠం దగ్గరనుండి పంపివేశారు.
\p
\v 17 అప్పుడు అందరు యూదు నాయకుడైన సోస్తేనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే గల్లియో ఈ సంగతులేవీ పట్టించుకోలేదు.
\s5
\p
\v 18 పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉన్నాడు. తరవాత ప్రిస్కిల్ల, అకులతో బాటు కలిసి ఓడమీద సిరియాకు బయలుదేరాడు. అతనికి మొక్కుబడి ఉండడం వల్ల కేంక్రేయలో తన జుట్టు కత్తిరించుకున్నాడు.
\p
\v 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ అకుల, ప్రిస్కిల్ల బస చేశారు. పౌలు మాత్రం యూదుల సమాజ మందిరంలోకి ప్రవేశించి యేసును గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
\s5
\v 20 వారింకా కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమిలాడారు. కానీ ఉండడానికి అతడు అంగీకరించలేదు.
\v 21 కానీ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొనేటప్పుడు, "దేవుని చిత్తమైతే మరొకసారి వస్తాను" అని వాళ్ళతో చెప్పాడు. తరవాత ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
\s5
\p
\v 22 తరవాత ఓడ కైసరయకు చేరుకోగానే రేవులో దిగిపోయాడు. యెరూషలేము వెళ్లి అక్కడ సంఘ విశ్వాసులను పలకరించి సిరియా ప్రాంతంలో ఉన్న అంతియొకయ పట్టణానికి చేరుకున్నాడు.
\p
\v 23 పౌలు అక్కడి విశ్వాసులతో కొంత కాలం గడిపాడు. తరవాత అంతియొకయ వదిలి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరించాడు. దేవుని వాక్కులో అంతకంతకు బలపడాలని వాళ్ళని బతిమిలాడాడు.
\s5
\p
\v 24 పౌలు గలతీయ, ఫ్రుగియ గుండా వెళుతూ ఉండగా అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు అలెగ్జాండ్రియ పట్టణస్తుడు. లేఖనాల్లో గొప్ప ప్రావీణ్యత కలిగినవాడు. అతడు లేఖనాల గురించి బాగా మాట్లాడాడు.
\v 25 ఇతర విశ్వాసులు యేసు ప్రభువు తానేర్పరచుకున్న ప్రజలు ఎలా జీవించాలి అని కోరుతున్నాడో అనే సంగతులను అపొల్లోకు బోధించారు. ఎందుకంటే యేసు గురించిన విషయాలు అతనికి తెలియదు. కేవలం యోహాను బాప్తిసమే అతనికి తెలుసు.
\v 26 అతడు ప్రభువు మార్గంలో వాళ్ళచేత ఉపదేశం పొంది ఆత్మలో తీవ్రత కలిగి యేసును గురించి స్పష్టంగా మాట్లాడుతూ సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించడం మొదలుపెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల అతడి బోధ విని తమ ఇంటికి రమ్మని పిలిచి అతనికి యేసును గురించి ఇంకా ఎక్కువగా తెలియజేసారు.
\s5
\p
\v 27 ఆ తరవాత అపొల్లో అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అతని ఆలోచన ప్రకారమే చేయమని ఎఫెసు విశ్వాసులు అతణ్ణి ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళు అకయలో ఉన్న విశ్వాసులకు అపొల్లోను చేర్చుకోమని ఒక ఉత్తరం రాశారు. అతడు అక్కడికి వెళ్ళిన తరవాత, దైవ కృపచేత విశ్వసించిన వాళ్ళకి చాల సహాయం చేశాడు.
\v 28 అపొల్లో అనేకులు వింటూ ఉండగా బహిరంగంగా యూదు నాయకుల వాదనలను శక్తివంతంగా ఖండిస్తూ వచ్చాడు. లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అనీ, మెస్సీయ అనీ వాళ్ళకి రుజువు పరుస్తూ వచ్చాడు.
\s5
\c 19
\p
\v 1 అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఫ్రుగియ, గలతియను వదలి ఆసియా గుండా ఎఫెసుకు తిరిగి వచ్చాడు. అతడు విశ్వాసులని చెప్పుకుంటున్న కొంతమందిని కలిశాడు.
\v 2 అతడు వాళ్ళతో, "దేవుని సువార్తను మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?" అని అడిగాడు. వాళ్ళు, "లేదు, మేము పొందలేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలీదు" అని జవాబిచ్చారు.
\s5
\v 3 కాబట్టి పౌలు వాళ్ళతో, "మరి మీరు ఎప్పుడు బాప్తిసం పొందారు? మీకు ఏమి తెలుసు?" అని అడిగాడు. వాళ్ళు "బాప్తిసమిచ్చే యోహాను ఏది చెప్పాడో ఆ బోధనే మేము నమ్ముతున్నాం, యోహాను బాప్తిసం పొందాం" అన్నారు.
\v 4 అందుకు పౌలు, "ప్రజలు తమ పాపపు ఆలోచనలను, క్రియలను వదిలి మారుమనసు పొంది దేవునివైపు తిరిగిన దానికి గుర్తుగా యోహాను బాప్తిసం ఇవ్వబడింది. యోహాను, ‘నా వెనక వస్తున్న యేసులో విశ్వాసముంచండి’ అని కూడా చెప్పాడు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\v 5 వాళ్ళు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
\v 6 తరవాత పౌలు వారి ఒక్కొక్కరి తల మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళు ఎన్నడూ నేర్చుకోని భాషలు మాట్లాడే శక్తిని దయ చేశాడు. అంతే గాక పరిశుద్ధాత్మ వాళ్ళకి అందించిన ప్రవచనాలను పలకడం మొదలుపెట్టారు.
\v 7 పౌలు బాప్తిసమిచ్చిన వారూ, పరిశుద్ధాత్మను పొందినవారూ మొత్తం పన్నెండు మంది.
\s5
\p
\v 8 మూడు నెలల తరవాత ప్రతి విశ్రాంతి రోజున సమాజ మందిరాలలో ప్రవేశించి అక్కడివాళ్ళతో యేసును గురించి తర్కిస్తూ, ఒప్పింపజేస్తూ దేవుడు తనను తను రాజుగా ఏవిధంగా కనపరచుకున్నాడో వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు.
\v 9 కానీ కొంతమంది యూదులు మాత్రం యేసు సందేశాన్ని విశ్వసించకపోగా ఇంకా వాళ్ళు ఎన్నటికీ వినదలచుకోలేదు. పౌలు బోధనూ, క్రీస్తు మార్గాన్నీ దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వాళ్ళని విడిచిపెట్టి విశ్వాసులను తనతోబాటు తీసుకెళ్ళి ప్రతి రోజూ తురన్ను అనే అతని బడిలో సమావేశం అవుతూ వచ్చారు.
\p
\v 10 ఈ విధంగా పౌలు రెండు సంవత్సరాలు అక్కడ బోధించాడు. దీనివల్ల ఆసియా ప్రాంతంలో నివసించే యూదులు, యూదేతరులు చాలామట్టుకు యేసు సువార్త విన్నారు.
\s5
\v 11 దేవుడు పౌలుకు అద్భుతాలు చేసే శక్తిని కుడా దయచేశాడు.
\v 12 రోగులు పౌలు దగ్గరికి రాలేకపోయినట్లైతే అతని శరీరానికి తాకించిన గుడ్డ ముక్కలు తీసుకెళ్ళి రోగులకు తాకిస్తే రోగాలు పోయేవి, దురాత్మలు కూడా వదలిపోయేవి.
\s5
\p
\v 13 అక్కడ ఉన్న కొందరు యూదు మాంత్రికులు కూడా ఊరూరా తిరుగుతూ ఆ ప్రాంతాల్లో ఉన్న దురాత్మలను వదలిపొమ్మని ఆజ్ఞాపించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు "పౌలు ప్రకటించే యేసు తోడు, బయటికి రమ్మని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము" అని చెప్పి దురాత్మలు పట్టినవాళ్ళ మీద యేసు ప్రభువు పేరు ఉచ్చరించడానికి పూనుకున్నారు.
\p
\v 14 అక్కడ ఏడుగురు వ్యక్తులు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు తనను తాను ప్రధాన యాజకునిగా పిలుచుకునే స్కెవ అనే యూదుని కొడుకులు.
\s5
\p
\v 15 ఒక రోజు వాళ్ళు ఆ విధంగా చేస్తుండగా దురాత్మ ఆ వ్యక్తిలోనుండి బయటికి రాకపోగా, వాళ్ళతో, "నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు గానీ ఈ విధంగా చేయడానికి అధికారం మీకు ఎవరిచ్చారు?" అని అంది.
\p
\v 16 అలా చెప్పి అకస్మాతుగా ఆ దురాత్మ పట్టిన వ్యక్తి స్కెవ కుమారుల మీద ఎగిరి దూకి అందరినీ లొంగదీసుకొని వాళ్ళ బట్టలు చింపి వాళ్ళని గాయపరిచాడు. వాళ్ళు భయపడి ఆ ఇంటినుండి పారిపోయారు.
\p
\v 17 ఎఫెసులో నివసిస్తున్న యూదులూ, యూదేతరులూ అందరూ జరిగిన సంగతి గురించి విన్నారు. వారంతా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని వాళ్ళు చూశారు. అతడు చాలా బలవంతుడు. అదే సమయంలో యేసు ప్రభువు నామానికి ఘనత కలిగింది.
\s5
\p
\v 18 ఆ సమయంలో విశ్వసించిన అనేకమంది, వాళ్ళు చేసిన దుర్మార్గ క్రియలను విశ్వాసులందరూ వింటుండగా ఒప్పుకున్నారు.
\p
\v 19 అంతే కాదు, మాంత్రిక విద్యను అభ్యసించే కొంతమంది తమ పుస్తకాల చుట్టలను అందరూ చూస్తుండగా బహిరంగంగా కాల్చివేశారు. ఆ విధంగా కాల్చిన పుస్తకాల వెల లెక్కబెడితే అది యాభై వేల వెండి రూపాయలు అయ్యింది.
\v 20 ఈ విధంగా అనేకమంది యేసు ప్రభువు సువార్త విని ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\p
\v 21 ఎఫెసులో తన పని ముగిసిన తరవాత, ఆత్మ అతణ్ణి యెరూషలేము వెళ్ళడానికి నిర్ణయించాడు. కాని, పౌలు మొదట మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని విశ్వాసులను చూడాలని ఉద్దేశించి, "నేను యెరూషలేము వెళ్ళిన తరవాత రోమ్ నగరానికి కూడా వెళ్ళాలి" అని నిర్ణయించుకున్నాడు.
\v 22 అతడు తన సహచరులు తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియకు పంపాడు. పౌలు మాత్రం ఆసియా ప్రాంతంలోని ఎఫెసులోనే కొంతకాలం ఉండిపోయాడు.
\s5
\p
\v 23 ఇది జరిగిన వెంటనే యేసు గురించీ, ఆయన బోధల గురించీ ఎఫెసు ప్రజల్లో గొప్ప అల్లరి చెలరేగింది.
\v 24 అక్కడ దేమేత్రి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అర్తెమిదేవికి (డయానా) వెండితో విగ్రహాలు చేయిస్తూ అక్కడి పనివాళ్ళకి గొప్ప ఆదాయం కల్పించేవాడు.
\p
\v 25 దేమేత్రి విగ్రహాలు చేసే పనివారందరినీ పిలిచాడు. వాళ్ళతో అతడు, "ఈ పని చేయడం వలన మనం చాల డబ్బు సంపాదిస్తున్నాం.
\s5
\v 26 పౌలు ఎఫెసులో ఉన్నవారందరికీ మనం చేసే విగ్రహాలను కొనకూడదని చెబుతూ అందరినీ పెడదోవ పట్టిస్తున్నాడని మీకు తెలుసు. ఆఖరికి ఈ ప్రాంతంలో, ఈ చుట్టు పక్కల ఊర్లలో కూడా మనం చేసే విగ్రహాలు ఎవరూ కొనరు. మనం పూజించే దేవతను నిజమైన దేవుడు కాదనీ, విగ్రహాలను పూజించకూడదనీ పౌలు బోధిస్తున్నాడు.
\v 27 ప్రజలు అతని మాటలు వింటే మాత్రం మన వ్యాపారం నట్టేట్లో మునిగినట్ట్లే, వాళ్ళు ఇంకా అర్తెమీ దేవికి (డయానా) పూజించడానికి గుడికి రాకపోవచ్చు. అర్తెమీ దేవి గొప్ప మహిమలు కలిగినదని ఇంకా ప్రజలు నమ్మరు. గానీ ఆసియా ప్రాంతమంతా, లోకమంతా ఆమెను పూజిస్తుంది" అని చెప్పాడు.
\s5
\p
\v 28 దేమేత్రి చెప్పిన మాటలు విన్న పనివారంతా పౌలు మీద కోపంతో ఊగిపోయారు. వాళ్ళు, "ఎఫెసీయుల అర్తెమీ దేవి మహా దేవి, గొప్ప మహిమలు గలది!" అని గట్టిగా అరిచారు.
\v 29 పట్టణంలో చాలామంది పౌలు మీద కోపంతో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. పట్టణం గందరగోళంగా తయారైంది. వెంటనే వాళ్ళలో కొందరు గుంపులు గుంపులుగా పరిగెడుతూ పౌలుతో బాటు ప్రయాణమై వచ్చిన మాసిదోనియకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని పట్టణ నాటకశాలకు ఈడ్చుకుపోయారు.
\s5
\v 30 పౌలు ఆ జన సమూహం పోగైన నాటకశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాడు గాని తోటి విశ్వాసులు అతణ్ణి వెళ్ళనివ్వలేదు.
\v 31 పౌలు స్నేహితులైన కొందరు పట్టణ అధికారులు అక్కడి పరిస్థితులను గురించి విన్నారు. వాళ్ళు పౌలును ఆ రంగస్థలానికి వెళ్ళవద్దని కొంతమందితో కబురుపెట్టారు.
\p
\v 32 ఆ రంగస్థలంలో జనాలు అరుస్తూ ఉన్నారు. గందరగోళంగా ఏదేదో కేకలు వేస్తున్నారు. అయితే అక్కడ గుమిగూడిన వాళ్ళలో చాలామందికి అక్కడ ఏం జరుగుతుందో తెలియనే తెలియదు!
\s5
\v 33 అక్కడ ఉన్న యూదులలో అలెగ్జాండర్ అనే పేరున్న ఒకడిని కొంతమంది యూదులు గుంపులోనుండి జనంతో మాట్లాడ్డం కోసం ముందుకు తోశారు. అలెగ్జాండర్ తన చేతులు పైకెత్తి గుంపు అరుపులను ఆపడానికి సైగ చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చూశాడు. ఈ గందరగోళానికి యూదులు కారణం కాదని చెప్ప ప్రయత్నించాడు.
\v 34 అయితే అక్కడ ఉన్న యూదేతరులకు అలెగ్జాండర్ యూదుడని తెలుసు. యూదులు అర్తెమీ దేవిని పూజించరు. కాబట్టి యూదేతరులు రెండు గంటలు ఏకధాటిగా, "ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి!" అని నినాదాలు చేశారు.
\s5
\p
\v 35 అప్పుడు పట్టణ అధికారులు ఆ జన సమూహాన్ని సముదాయించి ఇలా అన్నారు, "సాటి పౌరులారా, అర్తెమీ దేవి మహాదేవి అనీ, మన అర్తెమీ దేవి విగ్రహం పవిత్రమనీ, ఆకాశం నుండి పడిందనీ ఈ లోకంలోని వారందరికీ తెలుసు.
\v 36 ఈ విషయాలు అసత్యమని ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీరిప్పుడు శాంతం వహించండి. మూర్ఖంగా ప్రవర్తించ వద్దు.
\v 37 మీరు ఈ వ్యక్తులను ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఎందుకంటే వీరు ఎలాంటి దుర్మార్గం చేయలేదు. వీరు మన గుడిలోకి వెళ్లి అక్కడ ఏమీ దోచుకుపోలేదు. మన దేవత గురించి చెడుగా ఏమీ మాట్లాడలేదు కూడా."
\s5
\p
\v 38 "కాబట్టి దేమేత్రికి, అతని పనివాళ్ళకీ ఎవరిమీదైనా ఆరోపణలు ఉంటే వాళ్ళు దాన్ని సరైన మార్గంలో చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన న్యాయాధికారులూ ఉన్నారు. అక్కడ మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు.
\v 39 మీరు ఏవైనా విషయాల గురించి ఆరోపణ చేయాలనుకుంటే మీ అధికారులకు చెప్పాలి. అలా అది క్రమమైన సభలోనే పరిష్కారం అవుతాయి.
\v 40 ఇలా గుంపుగూడటం బాగా లేదు. ఇలాంటి అల్లర్లను గురించి మనపై విచారణ జరుపుతారేమో, మనం ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోతాం. ఒకవేళ అధికారులు ఈ రోజు జరిగిన అల్లరి ఏమిటి? మీరెందుకు అరుచుకున్నారు అని అడిగితే మనం వాళ్ళకి తగిన కారణం ఏం చెప్తాం?" అన్నారు.
\v 41 ఈ విధంగా ఆ గుంపుతో పట్టణ అధికారి చెబుతూ వాళ్ళని ఎవరింటికి వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. వారంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s5
\c 20
\p
\v 1 ఆ అల్లరి సద్దుమణిగిన తరవాత పౌలు విశ్వాసులను సమావేశపరచి ప్రభువైన యేసులో విశ్వాసాన్ని కొనసాగించమని వాళ్ళని ప్రోత్సహించాడు. ఇలా చెప్పిన తరవాత వాళ్ళ దగ్గర సెలవు తీసికొని మాసిదోనియ కు బయలు దేరాడు.
\v 2 అక్కడికి చేరుకొని యేసులో విశ్వాసంలో కొనసాగమని వాళ్ళని హెచ్చరించి అక్కడినుండి గ్రీసు చేరుకున్నాడు.
\v 3 గ్రీసులో అతడు మూడు నెలలు గడిపాడు. తరవాత ఓడమీద సిరియాకు వెళ్ళాలని అనుకున్నాడు గానీ కొందరు యూదులు అతడు ప్రయాణంలో ఉండగా అతణ్ణి చంపాలని కుట్ర చేస్తున్నారని తెలిసి భూమార్గంలో తిరిగి మళ్ళీ మాసిదోనియ గుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
\s5
\p
\v 4 పౌలుతో బాటు యెరూషలేముకు ప్రయాణించేవాళ్ళు ఎవరంటే బెరయ ఊరికి చెందిన పుర్రు కుమారుడు సోపత్రు, తెస్సలోనికకు చెందిన అరిస్తార్కు సెకుందు, దెర్బే పట్టణానికి చెందిన గాయి, గలతీ ప్రాంతానికి చెందిన తిమోతి, ఆసియా ప్రాంతానికి చెందిన తుపికు, త్రోఫిము.
\v 5 ఈ ఏడుగురు మాకంటే (పౌలు, లూకా) ముందుగా మాసిదోనియ నుండి ఓడ ఎక్కి త్రోయ పట్టణంలో దిగి మాకోసం కనిపెడుతూ ఉన్నారు.
\v 6 యూదుల పండగ అయిన పులియని పిండితో చేసే రొట్టెల పండుగ దినాలు అయిన తరవాత మేము త్రోయకు వెళ్ళే ఓడ ఎక్కాము. ఐదు రోజుల తరవాత త్రోయకు చేరి మాకు ముందుగా వెళ్లి కనిపెడుతున్న వాళ్ళని కలుసుకున్నాం. అక్కడ ఏడు దినాలు వాళ్ళ దగ్గర గడిపాం.
\s5
\p
\v 7 వారంలో మొదటి రోజైన ఆదివారం నాడు మేమంతా ఇతర విశ్వాసులతో కలిసి భోజనం చేయడానికి సమావేశం అయ్యాం. అప్పుడు పౌలు అర్థ రాత్రి వరకు వాళ్ళతో మాట్లాడాడు. మరుసటి రోజే అతడు త్రోయను విడిచి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు.
\v 8 మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు వెలుగుతున్నాయి.
\s5
\v 9 ఐతుకు అనే ఒక యువకుడు అక్కడ ఉన్నాడు. అతడు మూడో అంతస్తులో కిటికీ దగ్గర కూర్చున్నాడు. పౌలు విస్తరించి మాట్లాడుతూ ఉండగా అతడు నిద్రలోకి జారుకున్నాడు. అలా గాడనిద్రలోకి జోగి, కిటికీ నుండి కింద పడిపోయాడు. వెంటనే కొందరు విశ్వాసులు అతణ్ణి పైకి లేపారు గానీ అతడు చనిపోయాడు.
\p
\v 10 పౌలు కిందికి దిగి అతని మీద పడుకొని, కౌగలించుకొని తన చుట్టూ నిలబడి చూస్తున్న వాళ్ళతో, "మీరిక గాబరా పడాల్సిన పని లేదు. ఇతడు మళ్ళీ బతికాడు!" అని చెప్పాడు.
\s5
\p
\v 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి తిని, తెల్లవారే వరకు ఎన్నో విషయాలు వాళ్ళతో మాట్లాడి, తరవాత బయలుదేరి వెళ్ళిపోయాడు.
\v 12 సజీవంగా లేచిన ఆ యువకుణ్ణి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎంతో గొప్ప ఆదరణ వాళ్ళకి కలిగింది.
\s5
\p
\v 13 మేము ఓడ ఎక్కి త్రోయలో పౌలును ఎక్కించుకోవాలని ముందుగా అక్కడికి వెళ్ళాం. కాని పౌలు అక్కడివరకు భూమార్గంలో కాలినడకను వెళ్ళితే ఇంకా తొందరగా అస్సు అనే ప్రాంతానికి వెళ్ళవచ్చని అతడు ఓడ ఎక్కలేదు. కాబట్టి మిగిలిన వారమంతా అస్సుకు ఓడలో ప్రయాణించాం.
\p
\v 14 అస్సులో మేము పౌలును కలుసుకున్నాం. మాతోబాటు అతడు అక్కడ ఓడలోకి ఎక్కాడు. మేమంతా కలిసి మితులేనే అనే పట్టణానికి బయలుదేరాం.
\s5
\p
\v 15 ఒక రోజు తరవాత మేము మితులేనే కి చేరుకున్నాం. అక్కడినుండి బయలుదేరి కియోసు అనే దీవికి దగ్గరగా వచ్చాం. తరవాతి రోజు సమోసు అనే దీవికి ప్రయాణించాం. ఆ తరవాత సమోసు వదిలి మిలేతు పట్టణానికి బయలుదేరాం.
\p
\v 16 మిలేతు ఎఫెసు పట్టణానికి దక్షిణాన కొద్ది దూరంలో ఉంది. పౌలుకు ఎఫెసు పట్టణంలో ఆగడానికి మనసు లేదు. ఎందుకంటే ఆసియలో కాలయాపన చేయడం అతనికి ఇష్టం లేదు. పెంతెకోస్తు పండగ దగ్గర పడుతుండడం వలన సాధ్యమైతే ఆ పండగ సమయానికి యెరూషలేము చేరుకోవాలనే తొందరలో ఉన్నాడు.
\s5
\p
\v 17 వాళ్ళు మిలేతుకు చేరుకొన్నప్పుడు పౌలు ఎఫెసులోని విశ్వాసులైన పెద్దలతో మాట్లాడడానికి వాళ్ళని రమ్మని కబురు పెట్టాడు.
\p
\v 18 ఆ పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళతో ఇలా అన్నాడు, "నేను ఆసియాలో కాలుపెట్టిన రోజు నుండి వెళ్ళిపోయే వరకు ఈ మధ్య ఎలా ఉన్నానో మీకే తెలుసు.
\v 19 నేను సంపూర్ణ వినయంతో కొన్నిసార్లు కన్నీళ్ళతో ప్రభువుకు ఎలా సేవ చేశానో మీకు తెలుసు. విశ్వాసులు కాని యూదులు చాలాసార్లు నాకు హాని తలపెట్టినప్పుడు నేను ఎంతగా శ్రమ పడ్డానో కూడా మీకు తెలుసు.
\v 20 నేను ప్రభువు సందేశాన్ని బోధించేటప్పుడు మీకు ప్రయోజనకరమైనది ఏదీ చెప్పకుండా దాచుకోలేదని మీకు తెలుసు. దేవుని సందేశాన్ని అనేకమంది హాజరైన బహిరంగ సమావేశాలలోను, ఇంటింటికీ తిరిగి వ్యక్తిగతంగానూ మీకు బోధించానని కూడా మీకు తెలుసు.
\v 21 యూదులకు, యూదేతరులకు ఇద్దరికీ ప్రభువు వైపు తిరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాలని బోధించాను."
\s5
\p
\v 22 "పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి ఇదిగో, ఇప్పుడు నేను యెరూషలేముకు తప్పక వెళ్ళాలి. నేను దానికి తప్పక లోబడాలి. అక్కడ నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు.
\v 23 కానీ నేను దర్శించే ప్రతి పట్టణంలో సంకెళ్ళు, హింసలు నాకోసం వేచి ఉన్నాయని యెరూషలేము ప్రజలు నన్ను సంకెళ్లకు, హింసలకు గురి చేస్తారని పరిశుద్ధాత్మ నాకు ముందుగానే తెలిపాడు.
\v 24 అయితే ప్రజలు నన్ను చంపినా నేనేమీ లెక్కచేయను. ముందు యేసు ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయగలిగితే చాలు. మనకి ఏమాత్రం అర్హత లేని గొప్ప కార్యాలు మనకోసం చేయడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడనే దేవుని కృపా సువార్తను ప్రజలందరికీ తెలిపే పని కోసం ఆయన నన్ను పిలిచాడు. దీనికోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు.
\s5
\v 25 ఇదిగో నేను దేవుని రాజ్యం గురించీ దేవుడెలా రాజుగా తనను తాను కనపరచుకున్నాడో అనే సందేశాన్నీ మీ మధ్య ఉండి మీకు ప్రకటించాను. అయితే ఇకమీదట మీరు నా ముఖం చూడరు. ఇదే ఆఖరి సారి.
\v 26 కాబట్టి ఎవరైనా నేను ప్రకటించిన యేసును గురించి విని నమ్మకుండా చనిపోయినట్లయితే వారందరి రక్తం విషయంలో నేను నిర్దోషిని అని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
\v 27 ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించాను. నేనేమీ దాచలేదు.
\s5
\v 28 నాయకులైన మీరు దేవుని సందేశాన్ని విశ్వసిస్తూ, విధేయత చూపుతూ దానిలోనే కొనసాగాలి. పరిశుద్ధాత్మ మీకు ఇచ్చిన విశ్వాసులందరికీ సహాయపడుతూ వాళ్ళని సంరక్షించాలి. మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తపడుతూ ప్రభువు యొక్క విశ్వాసుల గుంపును గొర్రెల మందను కాచినట్టుగా కాయాలి. సిలువపై చిందించిన తన కుమారుని రక్తం ద్వారా ఆయన వాళ్ళని కొన్నాడు.
\v 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే, క్రూరమైన తోడేళ్ళ వంటివాళ్ళు మీలో ప్రవేశిస్తారు. వాళ్ళు అబద్ధబోధలు చేస్తారు. విశ్వాసులకు గొప్ప హాని కలిగిస్తారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళలాగా ప్రవేశించి గొర్రెలను చంపుతారు. వాళ్ళు మంద మీద జాలి చూపరు.
\v 30 అంతేకాక మీ స్వంత విశ్వాసుల గుంపులోని నాయకులే దారిమళ్ళించే అబద్ద బోధలు చేస్తారు. మీలోనుండే వాళ్ళు బయలుదేరతారు. కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ అనుచరులుగా మారతారు.
\s5
\v 31 కాబట్టి మన ప్రభువైన యేసును గురించిన సత్యమైన సువార్తను విశ్వసించనీయకుండా మిమ్మల్ని ఎవరూ అడ్డుకోకుండా మెలకువగా ఉండండి. మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీటితో ఎడతెగక మీలో ప్రతి ఒక్కరికీ బుద్ధి చెబుతూ ఉన్నానని గుర్తు చేసుకొని మెలకువగా ఉండండి."
\p
\v 32 "ఇప్పుడు నేను వెళ్ళిపోతూ మిమ్మల్ని కాపాడమనీ, రక్షణ పొందడానికి అర్హత లేకపోయినా ఆయన మనల్ని రక్షించాడనే సందేశాన్ని మీరు ఎప్పుడూ విశ్వసించాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. మీరు గనక నేను చెప్పిన కృపా సందేశాన్ని నమ్ముతూ కొనసాగితే మీరు శక్తి గలవాళ్ళు అవుతారు. ఆయన తనకు చెందిన వాళ్ళకి వాగ్దానం చేసినవన్నీ అనుగ్రహించి మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు."
\s5
\p
\v 33 "నా అవసరాల నిమిత్తం నేను ఎవ్వరి ఆర్ధిక సహాయం గానీ బట్టలు గానీ ఆశించలేదు.
\v 34 నేను నా చేతులతో కష్టపడి పని చేసి నాకోసం నా స్నేహితుల అవసరాల కోసం సంపాదించానని మీకు తెలుసు.
\v 35 మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైంది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలవాలనీ నేను అలా చేశాను."
\s5
\p
\v 36 పౌలు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థించాడు.
\v 37 అప్పుడు వారంతా చాల ఏడ్చి పౌలును కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు.
\v 38 మరి ముఖ్యంగా, "మీరు ఇక మీదట నా ముఖం చూడరు" అని అతడు చెప్పిన మాటకు ఎంతో దుఖించారు. అప్పుడు వారందరూ అతణ్ణి ఓడ వరకూ సాగనంపారు.
\s5
\c 21
\p
\v 1 ఎఫెసులో ఉన్న పెద్దలకు వీడుకోలు చెప్పిన తరవాత మేము ఓడ ఎక్కి కోసు ద్వీపం దాకా సముద్రం మీద ప్రయాణించాం. అక్కడ రాత్రి కావడం చేత ఆ ఓడ నిలిపివేశారు. ఆ మరునాడు మేము ఓడలో కోసు నుండి రొదు ద్వీపానికి చేరుకున్నాం. అక్కడ ఓడ మళ్ళీ ఆగింది. ఆ తరవాతి రోజు మేము మళ్ళీ ప్రయాణించి పతర పట్టణం చేరుకున్నాం.
\v 2 పతరలో మేము ఓడను విడిచిపెట్టాము. అక్కడనుండి ఫోనికయకు వెళుతున్న ఓడ ఒకటి ఉన్నదని ఎవరో చెప్పారు. కాబట్టి మేమంతా ఆ ఓడ ఎక్కి బయలుదేరాం.
\s5
\v 3 కుప్ర ద్వీపం కనిపించేదాకా మేము సముద్రం మీద ప్రయాణిస్తూ వెళ్లాం. ఆ ద్వీపం దక్షిణం వరకూ వెళ్లి సిరియా రాష్ట్రంలోని తూరు నగరం దగ్గర ఫోనికయ ప్రాంతం చేరుకునే దాకా ముందుకు సాగాం. ఆ ఓడ పనివాళ్ళు ఓడ లోని సరుకులు అక్కడ దించవలసి ఉండడం చేత అది అక్కడే కొన్ని రోజులు నిలిచి ఉంటుంది.
\p
\v 4 తూరు నగరంలో విశ్వాసులు ఎక్కడ ఉంటారో ఎవరో చెబితే మేము వెళ్లి వాళ్ళ దగ్గర ఏడురోజులు గడిపాము. పౌలు యెరూషలేము వెళ్తే అక్కడి ప్రజలు అతనికి హాని తలపెడతారని దేవుని ఆత్మ వాళ్ళకి వెల్లడి చేయడం వలన వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు వెళ్ళవద్దని హెచ్చరించారు.
\s5
\v 5 ఇక ఆ ఓడ బయలుదేరే సమయం కావడం చేత మేము సిద్ధపడి యెరూషలేముకు మా ప్రయాణం కొనసాగించాం. మేము తూరు నగరం వదిలి వెళ్తుండగా అక్కడి విశ్వాసుల్లో పురుషులు, వాళ్ళ భార్యలు, పిల్లలతో సహా మమ్మల్ని సాగనంపడానికి సముద్ర తీరం దాకా వచ్చారు. ఆ తీరంలో ఇసుకలో మేమంతా మోకరించి ప్రార్థన చేశాం.
\v 6 వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని, పౌలు, అతని అనుచరులం అయిన మేము ఓడలో ఎక్కాం. వారంతా తమ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు.
\s5
\p
\v 7 మేము తూరు వదలిపెట్టి ఆ ఓడలో తొలిమాయి అనే నగరానికి వచ్చాం. అక్కడ కొందరు విశ్వాసులు ఉన్నారు. మేము వాళ్ళని పలకరించి వాళ్ళతో ఆ రాత్రి గడిపాం.
\v 8 తరవాతి రోజు మేము కైసరయ నగరానికి ప్రయాణించాం. అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజలకు యేసును వెంబడించడం ఎలాగో బోధిస్తున్న ఫిలిప్పు ఇంట్లో విడిది చేశాం. యెరూషలేములోని విధవరాళ్ళకు పరిచర్య చేయడానికి అక్కడి విశ్వాసులు ఎన్నుకొన్న ఏడుగురు వ్యక్తుల్లో అతడు ఒకడు.
\v 9 అతనికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి వివాహం కాలేదు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ తమకు బయలుపరచిన విషయాలను ప్రవచన రూపంలో పలికే వరం ఉన్నవాళ్ళు.
\s5
\p
\v 10 మేము చాలా రోజులు ఫిలిప్పు ఇంట్లో గడిపిన తరవాత యూదయ పరగణా నుండి అగబు అనే విశ్వాసి కైసరయకు వచ్చాడు. అతడు తరచుగా పరిశుద్ధాత్మ పలికించే ప్రవచనాలు చెప్పేవాడు.
\p
\v 11 అతడు మేమున్న చోటికి వచ్చి పౌలు నడికట్టు విప్పి దానితో తన స్వంత కాళ్ళు చేతులు కట్టేసుకుని, "పరిశుద్ధాత్మ చెబుతున్న దేమిటంటే ఈ నడికట్టు ఎవరిదో అతని చేతులనూ, కాళ్ళనూ యెరూషలేములోని యూదు నాయకులు ఈవిధంగా కట్టేసి ఖైదీగా యూదేతరులకు అప్పగిస్తారు" అన్నాడు.
\s5
\p
\v 12 ఆ మాటలు విన్న మేము, అక్కడ ఉన్న ఇతరులూ "దయచేసి యెరూషలేముకు వెళ్ళవద్దు" అని పౌలును వేడుకున్నాం.
\p
\v 13 అయితే పౌలు మాతో, "మీరు చేస్తున్నదేమిటి? దయచేసి మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నరేంటి?వెళ్ళ నీయకుండా నన్ను నిరుత్సాహపరచవద్దు. నేను సేవిస్తున్న యేసు ప్రభువు కోసం నేను జైలుకు వెళ్ళడానికీ ఆఖరికి యెరూషలేములో చనిపోడానికీ సిద్ధంగా ఉన్నాను" అన్నాడు.
\p
\v 14 అతడు యెరూషలేము వెళ్ళడానికి స్థిరంగా నిర్ణయించుకున్నాడని మేము గ్రహించి ఇక అతణ్ణి ఆపడానికి మరే ప్రయత్నమూ చేయలేదు. అతడు, "ప్రభువు చిత్తమే జరుగుతుంది గాక" అన్నాడు.
\s5
\p
\v 15 కైసరయలో కొన్ని రోజులు గడిపిన తరవాత మేము మా వస్తువులు సిద్ధం చేసుకొని యెరూషలేము వరకు భూమార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం.
\p
\v 16 కైసరయలోని కొందరు విశ్వాసులు కూడా మాతో వచ్చారు. వాళ్ళు మమ్మల్ని మ్నాసోను అనే అతని ఇంట్లో ఉండడానికి తీసుకెళ్ళారు. అతడు కుప్ర దీవికి చెందినవాడు. ప్రారంభంలో ప్రజలు యేసుప్రభువు గురించి విన్నప్పుడు విశ్వసించిన వాళ్ళలో అతడు ఒకడు.
\s5
\p
\v 17 మేము యెరూషలేము చేరుకున్నప్పుడు ఒక విశ్వాసుల గుంపు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది.
\p
\v 18 తరవాతి రోజు పౌలు, మేమంతా కలిసి అక్కడి సంఘ నాయకుడైన యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాం. యెరూషలేము సంఘ ఇతర నాయకులు కూడా అక్కడ ఉన్నారు.
\p
\v 19 అప్పుడు పౌలు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి యూదేతరుల మధ్య దేవుడు తనద్వారా జరిగించిన పరిచర్య గురించి వాళ్ళకి వివరించాడు.
\s5
\p
\v 20 వాళ్ళు అతని మాటలు విన్నప్పుడు, యాకోబు, ఇతర నాయకులు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళలో ఒకరు, "సోదరుడా, ఇక్కడ యేసు ప్రభువును నమ్మిన అనేక వేలమంది యూదులు ఉన్నారని నీకు తెలుసు. అలాగే మేమంతా మోషే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటిస్తామని కూడా నీకు తెలుసు.
\v 21 అయితే మా సాటి యూదు విశ్వాసులు విన్నదేమిటంటే నువ్వు యూదేతరుల మధ్య ఉన్నప్పుడు అక్కడ నివసించే యూదు విశ్వాసులకు వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని మానివేయాలని చెబుతున్నావట. ఆ యూదు విశ్వాసులు సున్నతి తీసుకోకూడదనీ, వాళ్ళ సంతానం మన ఇతర ఆచారాలను పాటించకూడదనీ బోధిస్తున్నావని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటలు మేము నమ్మలేదు.
\s5
\p
\v 22 "అయినా ఇక్కడున్న యూదులకు నువ్వు వచ్చావని తెలిసిపోతుంది. వాళ్ళకి నీపై కోపం వస్తుంది. కాబట్టి నీ గురించి వాళ్ళు విన్నది నిజం కాదని చెప్పడానికి రుజువుగా నువ్వు ఒక పని చేయాలి.
\v 23 ఇక్కడ దేవునికి తమను ప్రతిష్టించుకున్న నలుగురు మనుషులు ఉన్నారు.
\v 24 వాళ్ళతో కలిసి దేవాలయానికి వెళ్లి మీరు ఆరాధించ గలిగేలా నీకు, వాళ్ళకి సరిపడిన విధంగా కర్మకాండలు జరిగించు. వాళ్ళు బలులు అర్పించాల్సిన సమయానికి వాళ్ళు మొక్కుబడి చేసుకున్న దాన్ని నీవే చెల్లించు. ఆ తరవాత వాళ్ళు జుట్టు గొరిగించుకొని తాము మొక్కుబడి నెరవేర్చామని చూపించుకుంటారు. నువ్వు వాళ్ళతో ఉండడం చూసి యూదులు నీ గురించి విన్నది సత్యం కాదు అని గ్రహిస్తారు. అంటే, నువ్వు యూదా సంప్రదాయాలను తు చ తప్పకుండా పాటించే వాడివని వారంతా తెలుసుకుంటారు.
\s5
\p
\v 25 "ఇక యూదేతర విశ్వాసుల విషయంలో యెరూషలేములో ఉన్న మా పెద్దలంతా వాళ్ళు ధర్మశాస్త్రంలో ఏయే నియమాలను పాటించాలో అనే దాని గురించి ఇప్పటికే మాట్లాడాము. మేము చేసిన తీర్మానాలు వాళ్ళకి ఉత్తరం ద్వారా తెలియజేశాము. వాళ్ళు విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని గొంతు పిసికి చంపిన జంతువుల మాంసాన్ని తినకూడదనీ మేము వాళ్ళకి రాశాం. అలాగే జారత్వానికి దూరంగా ఉండాలని కూడా మేము వాళ్ళకి చెప్పాం" అన్నాడు.
\v 26 పౌలు వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించి, ఆ తరవాతి రోజు ఆ నలుగురు మనుషులను దేవాలయానికి తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి శుద్దీకరణాచారాల్లో పాల్గొన్నాడు. ఆ తరవాత అతడు దేవాలయంలోకి వెళ్ళి యాజకులతో తమను ఎప్పటికి శుద్ధి పరచుకుంటారో, వాళ్ళలో ఒక్కొక్కని కోసం జంతువులను బలి అర్పణ ఎప్పుడు చేస్తారో వాళ్ళకి చెప్పాడు.
\s5
\p
\v 27 తమను శుద్ధి చేసుకొనే ఏడురోజుల కాలం ముగిసినప్పుడు పౌలు మళ్ళీ దేవాలయం ఆవరణలోకి వచ్చాడు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు అతణ్ణి అక్కడ చూశారు. అతని మీద వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు పౌలుని పట్టుకోడానికి ఇంకా మరి కొందరు యూదులను సహాయం కోసం ఆ మందిర ఆవరణలోకి పిలిచారు.
\p
\v 28 వాళ్ళు, "సాటి ఇశ్రాయేలీయులారా, రండి, ఈ మనిషిని శిక్షించడానికి సహాయం చెయ్యండి. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడ యూదులను లెక్క చేయవద్దని అక్కడి ప్రజలకు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించనక్కర లేదనీ, ఈ పవిత్ర దేవాలయాన్ని గౌరవించాల్సిన పని లేదనీ బోధిస్తున్నాడు. ఇదిగో ఈ యూదేతరులైన మనుషుల్ని దేవాలయంలోకి తీసుకువచ్చి దీనిని అపవిత్రం చేశాడు!" అని కేకలు వేశారు.
\v 29 పౌలు ఎఫెసుకు చెందిన యూదేతరుడు త్రోఫింతో కలిసి యెరూషలేములో తిరగటం వలన వాళ్ళు ఈవిధంగా వ్యవహరించారు. వాళ్ళ చట్టం ప్రకారం యూదేతరులు దేవాలయంలో ప్రవేశించడానికి వీలు లేదు. ఆ రోజున త్రోఫిమును పౌలు తనతోబాటు దేవాలయంలోకి తోడుకొని వచ్చాడని వాళ్ళు భావించారు.
\s5
\p
\v 30 దేవాలయం ఆవరణంలో ఏదో గొడవ జరుగుతున్నదని తెలిసి ఆ ఊరి ప్రజలంతా అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. వాళ్ళు పౌలును పట్టుకుని అతణ్ణి దేవాలయం బయటికి ఈడ్చుకెళ్లారు. ప్రజలు దేవాలయం మధ్యలో అల్లరి చేయకుండా దేవాలయం ప్రధాన ద్వారం మూసివేశారు.
\p
\v 31 వాళ్ళు పౌలును చంపడానికి ప్రయత్నిస్తుండగా ఒకడు పరుగెత్తుకుంటూ దేవాలయం దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్లి యెరూషలేములో చాలా మంది దేవాలయంలో చేరి అల్లరి చేస్తున్నారని అక్కడి రోమా సైనిక ఆధిపతికి చెప్పాడు.
\s5
\p
\v 32 ఆ అధిపతి ఆలస్యం చెయ్యకుండా మరి కొందరు అధికారులను, చాల మంది సైనికులను తీసికొని దేవాలయం దగ్గర ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. పౌలుని కొడుతున్న ఆ గుంపు ఆ అధిపతిని చూసి పౌలును కొట్టడం ఆపారు.
\p
\v 33 ఆ అధిపతి పౌలు ఉన్న చోటికి వచ్చి అతణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. పౌలు చేతులు రెండింటినీ సంకెళ్ళతో బంధించమని అతడు సైనికులకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ జన సమూహాన్ని చూసి, "ఇతడెవరు? ఏం చేశాడు?" అని ప్రశ్నించాడు.
\s5
\p
\v 34 అక్కడ ఉన్నవాళ్ళలో కొందరు ఒక రకంగా మరికొందరు మరొక రకంగా కేకలు వేస్తున్నారు. వారంతా పెద్దగా కేకలు వేస్తూ ఉండడం చేత వారేం చెబుతున్నారో ఆ సైన్యాధికారికి అర్థం కాలేదు. కాబట్టి పౌలును ప్రశ్నించేటందుకు వీలుగా అతణ్ణి కోటలోకి తీసుకెళ్ళమని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 35 సైనికులు పౌలుని ఆ కోట మెట్ల దగ్గరకి తీసుకెళ్ళారు. అయితే చాలామంది పౌలుని చంపడానికి వాళ్ళ వెంటబడుతూనే ఉన్నారు. అప్పుడు పౌలుని మోసికొని కోటలోకి తీసుకెళ్ళమని ఆ అధిపతి సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 36 వాళ్ళని వెంబడిస్తున్న ఆ గుంపు, "అతణ్ణి చంపండి! చంపండి!" అని అరుస్తూనే ఉంది.
\s5
\p
\v 37 పౌలుని ఆ కోటలోకి తీసుకెళ్తూ ఉండగా, ఆ సైన్యాధికారితో పౌలు గ్రీకు భాషలో "నేను మీతో మాట్లాడవచ్చా?" అన్నాడు. అప్పుడా అధిపతి, "నువ్వు గ్రీకు భాష మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.
\v 38 నువ్వు కొంత కాలం క్రితం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి చూసి నాలుగు వేలమంది దురాక్రమణ దారులతో కలిసి మాకు దొరక్కుండా అరణ్యంలోకి పారిపోయిన ఈజిప్టుకు చెందిన మనిషివి గదా?" అన్నాడు.
\s5
\p
\v 39 అందుకు పౌలు, "కాదు, నేనా వ్యక్తిని కాదు. నేనొక యూదుణ్ణి. నేను కిలికియ లోని ప్రాముఖ్య పట్టణమైన తార్సుకి చెందినవాణ్ణి. దయచేసి నన్ను ఈ ప్రజలతో మాట్లాడనియ్యండి" అన్నాడు.
\v 40 ఆ అధిపతి పౌలుకు మాట్లాడటానికి అనుమతించాడు. అప్పుడు పౌలు ఆ మెట్ల మీద నిలబడి ఆ గుంపును నిశ్సబ్దంగా ఉండమని చేతితో సైగ చేశాడు. సద్దుమణిగినప్పుడు, పౌలు వాళ్ళ స్వంత భాష అయిన హీబ్రూ లో మాట్లాడడం మొదలెట్టాడు.
\s5
\c 22
\p
\v 1 పౌలు, "యూదు పెద్దలారా, తోటి సహోదరులారా, నన్ను నిందిస్తున్న వాళ్ళతో నేను చెప్పే మాటలు వినండి" అన్నాడు.
\v 2 పౌలు తమ స్వంత హెబ్రీ భాషలో మాట్లాడటం విని జనసమూహం అంతా నిశ్సబ్దంగా వినడం ప్రారంభించారు. అప్పుడు పౌలు వాళ్ళతో ఇలా అన్నాడు.
\s5
\p
\v 3 "నేనూ మీలాగే ఒక యూదుణ్ణి. నేను కిలికియ ప్రాంతంలో ఉన్న తార్సు పట్టణంలో పుట్టాను. అయితే పెరగటం అంతా యెరూషలేములోనే పెరిగాను. నేను చిన్నతనం నుండి మోషే మన పితరులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో శిక్షణ పొందాను. గమలియేలు నా గురువు. నేను దేవునికి విధేయత చూపాలనే ఆసక్తితో ధర్మశాస్త్రానికి కట్టుబడ్డాను. మీకు కూడా ఇలాంటి ఆసక్తే ఉంది అని అనుకుంటున్నాను.
\v 4 ఆ కారణం చేత యేసును గురించిన దేవుని సువార్తను ఎవరైతే నమ్ముతారో, వారందరినీ బంధించాలని ప్రయత్నించాను. వాళ్ళని చంపడం కోసం మార్గాలు వెదికాను. ఆ సువార్తను నమ్మిన వాళ్ళు ఎవరు ఎదురైనా, స్త్రీలు గానీ పురుషులు గానీ వాళ్ళని బంధించి ఈడ్చుకు పోయి కారాగారంలో పడేసేవాణ్ని.
\v 5 ఈ విషయం ప్రధాన యాజకునికీ, యూదు సమాజ పెద్దలందరికీ తెలుసు. నేను వాళ్ళ దగ్గర దమస్కు పట్టణంలోని మన యూదులకు లేఖలు తీసుకున్నాను. ఈ లేఖలు యేసును నమ్మినవాళ్ళని బంధించడానికి నాకు అధికారం ఇచ్చాయి. అప్పుడు వాళ్ళని నేను బంధించి ఖైదీలుగా యెరూషలేముకు తీసుకువస్తే పెద్దల సభ వాళ్ళకి శిక్ష విధిస్తారు."
\s5
\p
\v 6 "ఆ విధంగా నేను దమస్కుకు బయలుదేరాను. మధ్యాహ్న సమయంలో దమస్కును సమీపిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు ఆకాశంనుండి నా చుట్టూ ప్రకాశించింది.
\v 7 ఆ వెలుగు చాలా ప్రకాశంగా ఉండడం వలన నేను నేలమీద పడిపోయాను. అప్పుడు ఆకాశం నుండి ఒకరు నాతో ఇలా అన్నారు, "సౌలూ, ఎందుకయ్యా నన్ను హింస పెడుతున్నావు?"
\v 8 అందుకు నేను, "ప్రభూ! నీవెవరివి?" అని అడగగా ఆయన, "నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును" అని నాతో చెప్పాడు.
\s5
\v 9 నాతోబాటు ఉన్నవాళ్ళు, గొప్ప వెలుగు చూశారు గానీ ఆ స్వరం చెప్పింది మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు."
\p
\v 10 "అప్పుడు నేను "ప్రభూ, నీవు నేనేం చెయ్యాలి?" అని అడిగాను. ప్రభువు నాతో, "నీవు లేచి దమస్కుకు వెళ్ళు. అక్కడ నీవేం చేయాలని నిర్ణయించానో ఒక వ్యక్తి నీకు తెలియజేస్తాడు" అన్నాడు."
\p
\v 11 "కళ్ళు బైర్లు కమ్మించే ఆ వెలుగు ప్రభావం వల్ల నేను చూడలేక పోయాను. దానితో నాతో ఉన్నవాళ్ళు నన్ను నడిపించుకుంటూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
\s5
\v 12 అక్కడ అననీయ అనే ఒకాయన నన్ను చూడటానికి వచ్చాడు. అతడు భక్తిపరుడు, ధర్మశాస్త్రం విషయంలో నిష్ఠ కలిగినవాడు, అక్కడి యూదుల చేత మంచి పేరు పొందినవాడు."
\p
\v 13 "అతడు వచ్చి నా పక్కన నిలబడి నాతో, "సోదరుడా సౌలూ, చూపు పొందు!" అన్నాడు. అలా చెప్పగానే నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
\s5
\v 14 అప్పుడు అతడు నాతో, "మనమూ, మన పూర్వికులూ ఆరాధించే దేవుడు నిన్ను నియమించాడు, ఆయన నీ చేత ఏం చేయించాలని అనుకుంటున్నాడో నీకు తెలియజేస్తాడు. ఆయన సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడడానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు."
\p
\v 15 "నీవు చూసిన వాటి గురించీ, విన్నవాటి గురించీ ప్రజలందరి ఎదుట ఆయనకు సాక్షిగా ఉంటావు.
\v 16 కాబట్టి ఇంకా ఆలస్యం చేయకు. లేచి నిలబడు, నేను నీకు బాప్తిసం ఇస్తాను, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగివేసుకో" అన్నాడు. తరవాత నేను యెరూషలేము తిరిగి వచ్చేశాను."
\s5
\p
\v 17 "ఒకరోజు నేను దేవాలయ ఆవరణంలో ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం చూశాను.
\v 18 ఆ దర్శనంలో ప్రభువును చూశాను. ఆయన నాతో, "నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు! ఇప్పుడు ఇక్కడ నా గురించి చెప్పేవాటిని ఇక్కడి ప్రజలు నమ్మరు" అని చెప్పాడు.
\s5
\v 19 అయితే నేను ఆయనతో, "ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకం ఉంచినవాళ్ళని నేను కొడుతూ, జైలులో వేయిస్తూ ఉన్నానని వాళ్ళకి తెలుసు.
\v 20 స్తెఫను నీగురించి ప్రజలకు ప్రకటించినందుకు నేను కూడా అక్కడ నిలబడి వాళ్ళు చేస్తున్నదానికి సమ్మతించాను. ఆఖరికి అతని చంపినవాళ్ళ పైవస్త్రాలకు కూడా కాపలా ఉన్నాను!" అన్నాను.
\v 21 అయితే ప్రభువు నాతో, "వద్దు, నీవు ఇక్కడ ఉండవద్దు. యెరూషలేమును వదలివెళ్ళిపో. ఎందుకంటే నేను నిన్ను దూరంగా, యూదేతరుల దగ్గరికి పంపుతాను" అని చెప్పాడు."
\s5
\p
\v 22 ప్రజలు అంతవరకు పౌలు చెప్పేది అంతా చక్కగా వింటూ ఉన్నారు. కానీ, ఎప్పుడైతే అతడు యూదేతరుల దగ్గరికి దేవుడు తనను పంపాడని చెప్పాడో, వెంటనే వాళ్ళు, "ఇతన్ని చంపండి! ఇతడు బతకడానికి వీల్లేదు!" అని కేకలు వేశారు.
\v 23 వాళ్ళు అలా అరుస్తూ వాళ్ళ పై వస్త్రాలు తీసివేసి విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు. ఇది వారెంత కోపోద్రిక్తులయ్యారో తెలియజేస్తుంది.
\v 24 కాబట్టి సైనిక అధికారి అతణ్ణి జైలులోకి తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు. యూదులకు అంత కోపం తెప్పించిన కారణం ఏమిటో పౌలునుండి రాబట్టడానికి కొరడా దెబ్బలు కొట్టి విచారణ చేయమని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 25 అప్పుడు వాళ్ళు అతని చేతులు చాపి కొరడా దెబ్బలు కొట్టడానికి అనువుగా తాళ్ళతో కడుతున్న సైనికునితో పౌలు, "శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?" అని అడిగాడు.
\v 26 ఆ అధికారి ఆ మాట వినగానే సేనాపతి దగ్గరకి వెళ్లి, "నీవేం చేస్తున్నావు? అతడు రోమా పౌరుడు, తెలుసా?" అన్నాడు.
\s5
\p
\v 27 ఈ మాటలు విన్నప్పుడు సేనాపతి ఆశ్చర్యపోయాడు. స్వయంగా అతడే జైలు దగ్గరకు వెళ్లి పౌలుతో, "నీవు నిజంగా రోమా పౌరుడివా?" అని అడిగాడు. దానికి పౌలు, "అవును," అన్నాడు.
\v 28 అప్పుడు ఆ సేనాపతి, "నేను కూడా రోమా పౌరుడినే. అలా కావడానికి చాలా డబ్బు చెల్లించాను" అన్నాడు. దానికి పౌలు, "కానీ నేను పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి" అన్నాడు.
\v 29 సైనికులు అతణ్ణి కొరడాలతో కొట్టడానికి సిద్ధపడుతున్న సమయంలోనే పౌలును ఈ ప్రశ్నలు అడిగాడు. అయితే అతని జవాబులు విని వాళ్ళు అతణ్ణి వదిలి వెళ్ళిపోయారు. పౌలు రోమా పౌరుడని తెలియక అతని చేతులు తాళ్ళతో కట్టించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సేనాపతి చాలా భయపడ్డాడు.
\s5
\p
\v 30 అయినా సరే, పౌలు మీద యూదులు ఎందుకు నేరం మోపారో కచ్చితంగా తెలుసుకోవాలని సేనాపతి అనుకున్నాడు. తరవాతి రోజు అతడు పౌలు సంకెళ్ళను తీసివేయమని సైనికులకు ఆదేశించాడు. ప్రధాన యాజకుణ్ణి, మహా సభ పెద్దలందరినీ రావాలని ఆజ్ఞాపించి, పౌలును తెచ్చి వాళ్ళ ఎదుట నిలబెట్టాడు.
\s5
\c 23
\p
\v 1 పౌలు మహాసభ వాళ్ళని సూటిగా చూసి, "యూదు సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ఎదుట స్వచ్చమైన మనస్సాక్షితో నడుచుకొంటున్నాను. నేను ఏ తప్పూ చేశానని అనుకోవడం లేదు" అని చెప్పాడు.
\v 2 ప్రధాన యాజకుడు అననీయ, పౌలు చెప్పింది విని, అతని దగ్గర నిలబడిన వాళ్ళతో, "అతణ్ణి నోటిమీద కొట్టండి" అని ఆజ్ఞాపించాడు.
\v 3 అప్పుడు పౌలు అతణ్ణి చూసి, "సున్నం కొట్టిన గోడా! కపట వేషదారీ! దేవుడు నిన్ను కొడతాడు. దేవుడు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ కూర్చుని నన్ను విచారణ చేస్తూ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నన్ను కొట్టమని చెప్పి నువ్వే దానిని అతిక్రమిస్తున్నావు. ఎందుకంటే నేను తప్పు చేశానని నిరూపించకుండానే నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావు" అన్నాడు.
\s5
\p
\v 4 పౌలు దగ్గర నిలబడి ఉన్న మనుషులు అతనితో, "దేవుని పరిచారకుడైన మన ప్రధాన యాజకుని అలా దూషించ కూడదు" అన్నారు.
\v 5 అప్పుడు పౌలు, "సోదరులారా, నన్ను కొట్టమని మీతో చెప్పిన ఈ వ్యక్తి ప్రధాన యాజకుడని నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసి ఉంటే ప్రధాన యాజకుని దూషించే వాణ్ణి కాదు, ఎందుకంటే, ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు! అని మన ధర్మశాస్త్రంలో రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 6 అక్కడ ఉన్నవాళ్ళలో ఒకభాగం పరిసయ్యులూ, మరొక భాగం సద్దూకయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, "సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, మా వంశమంతా పరిసయ్యులే, మనకున్న నిరీక్షణను బట్టి, చనిపోయినవాళ్ళు తిరిగి లేవడం గురించీ నేను ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నాను" అని ఆ సభలో గొంతెత్తి చెప్పాడు.
\p
\v 7 అతడు అలా చెప్పగానే పరిసయ్యులకూ, సద్దూకయ్యులకూ మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. వాళ్ళు ఒకరితో ఒకరు వాదనలకు దిగారు.
\v 8 మనుషులు మరణించిన తరవాత తిరిగి పునరుత్థానం చెందుతారు అని సద్దూకయ్యులు నమ్మరు. అంతేకాదు, వాళ్ళు దేవదూతలు ఉన్నారనీ, ఆత్మలు ఉన్నాయనీ కూడా నమ్మరు. అయితే పరిసయ్యులు వీటన్నిటినీ నమ్ముతారు.
\s5
\p
\v 9 వాళ్ళు వాదించుకుంటూ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ధర్మశాస్త్ర బోధకులైన పరిసయ్యులు లేచి నిలబడ్డారు. వాళ్ళలో ఒకడు, "ఈ మనిషి ఏ తప్పూ చెయ్యలేదని మేము అనుకుంటున్నాం. ఒక దేవదూత గానీ, ఒక ఆత్మ గానీ ఇతనితో మాట్లాడి ఉండవచ్చు. అతడు చెప్పినదంతా సత్యమే" అని వాదించారు.
\p
\v 10 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యుల మధ్య పరిస్థితి విషమించింది. కాబట్టి వాళ్ళు పౌలును రెండుగా చీల్చేస్తారేమో అని సేనాధిపతి భయపడి, "వాళ్ళ మధ్యనుండి అతడిని బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకురండి" అని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 11 ఆ రాత్రి, ప్రభువు తన పక్కన నిలబడి ఉండడం పౌలు చూశాడు. ఆయన అతనితో, "ధైర్యంగా ఉండు! యెరూషలేములో ఇప్పుడు నా గురించి నువ్వెలా సాక్ష్యం చెప్పావో రోమ్ లో కూడా సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\p
\v 12 తెల్లవారిన తరవాత పౌలును ద్వేషించే కొంతమంది యూదులు సమావేశమై అతణ్ణి ఎలా చంపాలా అని మంతనాలు జరిపారు. వాళ్ళు తమలో తాము అతణ్ణి చంపేటంతవరకు అన్నపానాలు ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నారు. వాళ్ళు చేసుకున్న ప్రమాణం ప్రకారం గనక చేయలేకపోతే తమను శపించమని దేవుణ్ణి వేడుకున్నారు.
\p
\v 13 ఆ విధంగా పౌలును చంపాలి అనుకొన్న వాళ్ళు మొత్తం 40 మంది దాకా ఉన్నారు.
\s5
\v 14 వాళ్ళు ప్రధాన యాజకుని దగ్గరకూ, యూదా పెద్దల దగ్గరకూ వెళ్లి "మేము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టమని దేవుని దగ్గర ఒట్టు పెట్టుకున్నాం.
\v 15 కాబట్టి మీరు మహాసభ అంతటి తరపున వెళ్లి పౌలును క్షుణ్ణంగా విచారణ చేయాలనే వంకతో అతణ్ణి మీ దగ్గరకు తీసుకురమ్మని సేనాధిపతికి మనవి చేయండి. అతడు మీ దగ్గరకు రాకముందే దారిలోనే మేము అతణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు.
\s5
\p
\v 16 అయితే పౌలు మేనల్లుడు వాళ్ళ కుట్రను విని వెంటనే కోటలోకి వెళ్లి ఈ విషయం పౌలుకు తెలియజేశాడు.
\p
\v 17 ఇది విన్న పౌలు ఒక అధికారిని పిలిచి అతనితో, "దయచేసి ఈ యువకుణ్ణి సేనాధిపతి దగ్గరకి తీసుకెళ్ళు. ఇతడు ఆయనకు ఏదో ఒక విషయం చెప్పాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 18 అప్పుడు ఆ అధికారి ఆ యువకుణ్ణి సేనాధిపతి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ అధికారి సేనాధిపతితో, "ఖైదీగా ఉన్న పౌలు ఈ యువకుణ్ణి మీ దగ్గరకు తీసుకువెళ్ల మన్నాడు. ఇతడు మీకు ఏదో విషయం చెప్పాలంట" అన్నాడు.
\p
\v 19 ఆ సేనాధిపతి ఆ యువకుడి చేయి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, "నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏంటి?" అని ఒంటరిగా అడిగాడు.
\s5
\v 20 అప్పుడా యువకుడు, "కొంతమంది యూదులు రేపు పౌలును మహాసభ ఎదుటకు తీసుకురావాలి అనుకుంటున్నారు. వాళ్ళు అతణ్ణి క్షుణ్ణంగా విచారణ చేయాలి అని చెప్తారు. కాని అది నిజం కాదు.
\v 21 వాళ్ళు అడిగినదానిని మీరు అంగీకరించవద్దు. ఎందుకంటే, అక్కడ 40 కంటే ఎక్కువ మంది యూదులు మహాసభకు తీసుకువెళ్ళే దారిలో దాక్కొని అతణ్ణి చంపాలని కనిపెడుతున్నారు. పౌలును చంపేటంత వరకు తాము అన్నపానాలు ముట్టుకోమని వాళ్ళు దేవుని ఎదుట ఒట్టుపెట్టుకున్నారు. వాళ్ళు అలా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ విన్నపానికి మీరు ఒప్పుకోవద్దు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 అప్పుడు ఆ సేనాధిపతి ఆ యువకుడితో, "నువ్వు ఈ సంగతి నాతో చెప్పినట్టు ఎవరికీ తెలియనీయవద్దు" అని హెచ్చరించి పంపేశాడు.
\p
\v 23 సేనాధిపతి తన అధికారులలో ఇద్దరినీ పిలిచి, "రెండు వందల మంది సైనికులను ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. వాళ్ళతోబాటు డెబ్భైమంది గుర్రపు రౌతులూ, రెండు వందల మంది ఈటెలు విసిరేవాళ్ళనీ ప్రయాణానికి సిద్ధం చేయండి. మీరంతా రాత్రి తొమ్మిది గంటలకు కైసరయ పట్టణానికి బయలుదేరి పోవాలి.
\v 24 గుర్రాల మీద పౌలును ఎక్కించి భద్రంగా గవర్నర్ ఫేలిక్స్ మందిరానికి అతణ్ణి తీసుకు వెళ్ళండి" అని ఆదేశించాడు.
\s5
\p
\v 25 అతడు ఈ కింది విధంగా గవర్నర్ కి ఉత్తరం కూడా రాశాడు,
\v 26 "గౌరవనీయులైన గవర్నర్ కు, సేనాపతి క్లౌదియ లూసియ శుభాకాంక్షలతో రాస్తున్నది.
\v 27 పౌలు అనే వ్యక్తిని పంపుతున్నాను, ఇతనిని కొంతమంది యూదులు చుట్టుముట్టి చంపబోతున్నారు. ఇతడు రోమా పౌరుడని చెప్పారు. కాబట్టి నేను, మా సైనికులు వెళ్లి అతణ్ణి కాపాడాం.
\s5
\v 28 ఇతడు నేరం చేశాడని యూదులు చెప్తున్నారు. ఇతడు ఏమి నేరం చేశాడో క్షుణ్ణంగా విచారణ చేయాలనుకొని యూదు మహా సభకు ఇతన్ని తీసుకువెళ్ళాను.
\v 29 వాళ్ళు ఇతనికి ప్రశ్నలు వేస్తూ ఉండగా ఇతడు జవాబిస్తూ ఉన్నాడు. వాళ్ళు యూదా ధర్మశాస్త్రం విషయం గురించి అతని మీద ఏవో ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరణానికి గానీ, జైలులో పెట్టడానికి గానీ తగిన నేరం ఏమీ ఇతను చేయలేదు. రోమా చట్టాలను ఎప్పుడూ మీరలేదు కూడా. కాబట్టి మా అధికారులు ఇతని నేరాన్ని అమలు చేయడం గానీ జైలులో పెట్టడం గానీ చేయకూడదు.
\v 30 కొంతమంది యూదులు ఇతన్ని చంపాలని కుట్ర చేశారని కొంతమంది ద్వారా తెలిసింది. మీరు ఒక న్యాయమైన విచారణ చేస్తారని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇతని మీద నేరారోపణ చేసిన యూదులను కూడా కైసరయకు వెళ్లి మీ ముందే అతనిపై ఉన్న ఆరోపణలను చెప్పుకోమని వాళ్ళకి ఆజ్ఞాపించాను."
\s5
\p
\v 31 కాబట్టి సేనాధిపతి ఆజ్ఞాపించినట్టుగానే సైనికులు పౌలును ఆ రాత్రి అంతిపత్రికి తీసుకువెళ్ళారు.
\v 32 మరుసటి రోజు ఆ సైనికులు గుర్రపు రౌతులను పౌలుతో పంపి వెనక్కి తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయారు.
\v 33 వాళ్ళు కైసరయ పట్టణానికి చేరుకొని, గవర్నర్ కి ఉత్తరం చదివి వినిపించి, పౌలును అతని ఎదుట నిలబెట్టారు.
\s5
\v 34 గవర్నర్ ఉత్తరం చదివి పౌలును, "నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి?" అని అడిగాడు. పౌలు, "నేను కిలికియ నుండి వచ్చాను" అని జవాబిచ్చాడు.
\v 35 "నీ మీద నేరం మోపినవాళ్ళు కూడా వచ్చిన తరవాత మీ వ్యాజ్యం విని అప్పుడు విచారణ చేస్తాను" అని చెప్పి హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాడు.
\s5
\c 24
\p
\v 1 ఐదు రోజుల తరవాత యెరూషలేము నుండి ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది వచ్చారు. పౌలు మీద వాళ్ళు మోపిన ఫిర్యాదును గవర్నర్ కి తెలియజేశారు.
\v 2 గవర్నర్ పౌలును తీసుకొని రమ్మని సైనికులకు ఆజ్ఞాపించాడు. పౌలు రాగానే, తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ గవర్నర్ తో, "గౌరవనీయులైన ఫేలిక్స్ గారూ, చాలా కాలం నుండి మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. మీ పాలనలో మేము ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. మీ తెలివైన నిర్ణయాల వలన ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది.
\v 3 అందువల్ల మేము అన్ని విధాలా మీ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం."
\s5
\p
\v 4 "నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. దయచేసి నేను చెప్పే మాటలు విసుక్కోకుండా సహనంతో వినాలని వేడుకుంటున్నాను.
\v 5 ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా, యూదులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని మేము గ్రహించాం. ఇతడు ఒక చీడపురుగు లాంటివాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడు.
\v 6 ఆఖరికి యెరూషలేము దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని ప్రయత్నించాడు. కాబట్టి మేము అతణ్ణి నిర్బంధించాము.
\s5
\v 7 కానీ రోమ్ సేనాధిపతి లూసియ సైనికులతో వచ్చి అతణ్ణి మా దగ్గర నుండి తీసుకెళ్ళాడు.
\v 8 మీరు స్వయంగా అతణ్ణి విచారణ చేస్తే మేము చేసిన ఆరోపణలన్నీ నిజమని మీకే తెలుస్తుంది."
\v 9 యూదు పెద్దలంతా తెర్తుల్లు మాటలకు సమ్మతించి ఆ మాటలు నిజమే అని గవర్నర్ కు చెప్పారు.
\s5
\p
\v 10 అప్పుడు గవర్నర్ పౌలును మాట్లాడమని సైగ చేశాడు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు, "గవర్నర్ ఫేలిక్స్, మీరు అనేక సంవత్సరాల నుండి ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలుసు. కాబట్టి సంతోషంగా నా పక్షంగా నేను వాదించుకుంటాను. మీరు విని న్యాయంగా తీర్పు తీరుస్తారని నమ్ముతున్నాను."
\p
\v 11 "నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్లి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
\v 12 దేవాలయంలోగానీ సమాజ మందిరంలోగానీ పట్టణంలోగానీ నేను తర్కించడం, అల్లరి రేపడం, ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే నేను అలా చెయ్యను.
\v 13 నామీద ఇప్పుడు వాళ్ళు మోపిన నేరాలను ససేమిరా రుజువు చేయలేరు."
\s5
\p
\v 14 "అయితే ఒకటి మాత్రం నిజం. మా పూర్వికులు ఆరాధించిన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. యేసు మాకు ఏవిధంగా బోధించాడో వాటిని అనుసరిస్తున్న మాట వాస్తవమే. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో మోషే రాసిన నియమాలన్నిటినీ నేను నమ్ముతాను. అంతే కాక, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నేను నమ్ముతాను.
\v 15 మంచివాళ్ళని గానీ చెడ్డవాళ్ళని గానీ చనిపోయిన ప్రతివాళ్ళనీ ఒకానొక రోజున దేవుడు తిరిగి బతికిస్తాడని వీరు నమ్మినట్టుగానే నేనూ నమ్ముతాను.
\v 16 ఆ రోజు వస్తుందని నమ్ముతున్నాను. నేను దేవుని విషయంలో మనుషుల విషయంలో ఎప్పుడూ నా మనసాక్షి యథార్ధంగా ఉండేలా చూసుకుంటున్నాను."
\s5
\p
\v 17 "చాలా సంవత్సరాలు నేను వేరు వేరు ప్రాంతాల్లో ఉండి పేదలైన నా స్వంత యూదు ప్రజలకు కొంత డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను."
\p
\v 18 "నేను దేవాలయంలో శుద్ధి చేసుకొని ఆరాధించి వస్తుండగా ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు నన్ను చూశారు. నాతోబాటు ఎలాంటి గుంపూ లేదు. నేనేమీ అక్కడ అల్లరి రేపలేదు.
\v 19 ఆ యూదులే ప్రజల్లో అల్లరి రేపారు. నేను నేరం చేశానని వాళ్ళు భావిస్తే వారే మీ దగ్గరకు వచ్చి నేరం మోపి ఉండాల్సింది.
\s5
\v 20 కానీ వాళ్ళు అలా చేయకూడదు అనుకుంటే వాళ్ళ మహాసభలో నేను నిలబడి నా పక్షంగా నా వాదనలు వినిపిస్తున్నప్పుడైనా ఏ నేరం కనిపెట్టారో చెప్పాల్సింది.
\v 21 నేను మహా సభలో నిలబడినప్పుడు "దేవుడు చనిపోయిన వాళ్ళని ఒకానొక రోజున తిరిగి జీవింప జేస్తాడనే మృతుల పునరుత్థానాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పిన మాటను బట్టి నేను మీ ఎదుట విచారణ పాలవుతున్నాను" అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయం తప్ప నాలో ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు."
\s5
\p
\v 22 ఫేలిక్స్ కు ప్రజలు ఈ "మార్గం" అని పిలిచే దాని గురించి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళతో, "సేనాపతి లూసియ వచ్చిన తరవాత మీ సంగతి నిర్ణయిస్తాను" అని చెప్పి విచారణ నిలిపివేశాడు.
\v 23 తరవాత పౌలును జైలుకు తీసుకువెళ్ళమనీ నిత్యం జాగ్రత్తగా కావలి కాయమనీ కావలి కాసే అధికారిని ఆదేశించాడు. అయితే అతనికి సంకెళ్ళు వేయకూడదనీ, అతని స్నేహితులు అతణ్ణి పరామర్శించడానికి వస్తే వాళ్ళని అనుమతించి ఏ విధంగా అతనికి సహాయం చేయాలనుకుంటే ఆ విధంగా వాళ్ళని చేయనిమ్మనీ ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 24 కొన్ని రోజుల తరవాత ఫేలిక్స్ తన భార్యతో కూడా వచ్చాడు. ఆమె పేరు దృసిల్ల. ఆమె యూదురాలు. అతడు పౌలుతో మాట్లాడాలని అతణ్ణి పిలిపించాడు. ఫేలిక్స్ పౌలు చెప్పినదంతా విన్నాడు. మెస్సీయ అయిన యేసులో విశ్వాస ముంచడం గురించి పౌలు చెప్పగా అతడు విన్నాడు.
\v 25 దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనుషులు ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో ఆ విషయం గురించి పౌలు అతనితో మాట్లాడాడు. మనుషులు తమ ప్రవర్తనను అదుపులో పెట్టుకొవాలనీ దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంటుందనీ అతనికి వివరించాడు. ఫేలిక్స్ ఈ విషయాలు విన్నప్పుడు భయపడి, పౌలుతో, "ఇప్పటికి ఇంతవరకు చాలు, నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ నిన్ను పిలిపిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 26 పౌలు తనకేమైనా లంచం ఇస్తాడని ఆశతో అతణ్ణి మాటిమాటికీ పిలుస్తూ వచ్చాడు. పౌలు ఫేలిక్స్ తో ఎన్నోసార్లు మాట్లాడాడు గానే అతనికి డబ్బులు ఏమీ ఇవ్వలేదు. పౌలును విడిచిపెట్టమని సైనికులకు చెప్పకుండా ఫేలిక్స్ అతణ్ణి అలాగే జైలులో ఉంచేశాడు.
\p
\v 27 రెండు సంవత్సరాల తరవాత ఫేలిక్స్ స్థానంలో పోర్కియు ఫేస్తు గవర్నర్ గా వచ్చాడు. ఫేలిక్స్ యూదు నాయకులను సంతోషపెట్టడానికి పౌలు అలాగే జైలులో ఉంచేశాడు.
\s5
\c 25
\p
\v 1 ఫేస్తు గవర్నర్ గా కైసరయలో తన పరిపాలన ప్రారంభించాడు. మూడు రోజుల తరవాత యెరూషలేము వెళ్ళాడు.
\v 2 అక్కడ ప్రధాన యాజకులు, యూదు నాయకులు ఫేస్తు ఎదుట పౌలు మీద తాము చేసిన ఫిర్యాదు విషయం జ్ఞాపకం చేశారు.
\v 3 దయచేసి పౌలును విచారణ కోసం యెరూషలేముకు అత్యవసరంగా తెప్పించమని అతణ్ణి అడిగారు. అయితే వాళ్ళు మార్గమధ్యంలో పౌలుపై దాడిచేసి చంపాలని పథకం వేశారు.
\s5
\p
\v 4 ఫేస్తు, "పౌలు కైసరయ జైలులో ఉన్నాడు. అక్కడే ఉండనివ్వండి. నేను కూడా త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
\v 5 అయితే, పౌలు మీద ఏదైనా నేరారోపణ చేయాలనుకుంటే మీలో సమర్ధులైన వాళ్ళు నాతో రండి" అన్నాడు.
\s5
\p
\v 6 ఫేస్తు యెరూషలేములో దేవాలయ నాయకులతో ఎనిమిది నుండి పది రోజులవరకు గడిపాడు. తరవాత ఎఫెసు పట్టణానికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఫేస్తు న్యాయపీఠం మీద కూర్చొని పౌలును తన ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
\v 7 పౌలు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ గుమిగూడి ఎన్నో తీవ్రమైన నేరాలు మోపారు గానీ వాటిని వాళ్ళు రుజువు చేయలేకపోయారు.
\v 8 అప్పుడు పౌలు తన వాదన వినిపిస్తూ, "నేను యూదుల ధర్మశాస్త్రానికి గానీ, దేవాలయానికి గానీ, కైసరుకు గానీ విరుద్ధంగా ఏపనీ చేయలేదని మీకు బాగా తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 9 అయితే ఫేస్తు యూదు నాయకుల చేత మంచివాడనిపించుకోవాలని పౌలును, "నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా న్యాయపీఠం ఎదుట విచారణకు నిలవడం నీకిష్టమేనా?" అని అడిగాడు.
\p
\v 10 పౌలు, "లేదు, నేను ఇప్పుడు నిలబడి ఉన్నది కైసరుకు ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఎదుట. నేనిక్కడే న్యాయం తీర్చబడాలి. ఇదే సరైన స్థలం. నేను యూదు ప్రజలకు వ్యతిరేకంగా ఏవిధమైన నేరం చేయలేదని మీకు బాగా తెలుసు.
\s5
\p
\v 11 "ఒకవేళ నేను మరణశిక్షకు తగిన నేరం చేసి ఉంటే మరణానికి నేనేమీ భయపడను; అయితే వీరు నామీద అరోపించేవి ఏవీ అలాంటి శిక్షకు తగినవి కావు. వాళ్ళని తృప్తిపరచడానికి ఎవరూ నాకు శిక్ష విధించలేరు, నన్ను ఎవరికీ అప్పగించడానికి వీలు లేదు. నేను కైసరు ముందే చెప్పుకుంటాను" అన్నాడు.
\p
\v 12 అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, "నీవు కైసరు ఎదుట చెప్పుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరకే పంపిస్తాను!" అన్నాడు.
\s5
\p
\v 13 కొన్ని రోజుల తరవాత, రాజైన హేరోదు అగ్రిప్ప, అతని సోదరి బెర్నీకేతో కలిసి కైసరయకు వచ్చాడు. ఫేస్తును గౌరవపూర్వకంగా కలవడానికి వాళ్ళు వచ్చారు.
\v 14 వారిద్దరూ అక్కడ చాలా రోజులు ఉన్నారు. కొన్ని రోజుల తరవాత ఫేస్తు పౌలు గురించి అగ్రిప్పకు చెప్పాడు. అతడు, "ఫేలిక్స్ జైలులో పెట్టిన ఒకతను ఇక్కడ ఉన్నాడు.
\v 15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదు నాయకులు నా దగ్గరకి వచ్చి అతనికి మరణశిక్ష విధించమని నన్ను అడిగారు.
\v 16 అయితే నేను వాళ్ళతో, "ఎవరైనా తీవ్రమైన ఆరోపణలు అతని మీద చేస్తేనే గానీ రోమ్ సంప్రదాయంలో ఒక వ్యక్తికి అప్పటికప్పుడు మరణశిక్ష విధించలేము. దానికి బదులు ఒకటి చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వాళ్ళతో, అతడు ముఖాముఖిగా వాదించుకునే ఏర్పాటు చేయవచ్చు" అని అన్నాను."
\s5
\p
\v 17 "కాబట్టి ఆ యూదులు కైసరయకు వచ్చారు, నేను విచారణను తాత్సారం చేయలేదు. వాళ్ళు రాగానే నేను న్యాయపీఠం ఎదుట కూర్చొని ఖైదీని తెమ్మని చెప్పాను.
\v 18 అయితే యూదు నాయకులు అతని మీద చేసిన ఆరోపణలు నాతో చెప్పినప్పుడు, అవి అంత తీవ్రమైనవిగా లేవు.
\v 19 అంతే కాదు, వాళ్ళు చేసే ఆరోపణలన్నీ వాళ్ళ మతానికి చెందినవి. వాళ్ళు ఎవరో యేసు అనే వ్యక్తి చనిపోయాడు అంటుంటే ఈ పౌలు అనే వ్యక్తి ఆయన తిరిగి లేచాడు అంటున్నాడు.
\v 20 నాకీ విషయాలు ఏమీ అర్థం కాలేదు. నిజాన్ని ఎలా రాబట్టాలో తెలియలేదు. కాబట్టి నేను పౌలుతో, "నీవు యెరూషలేము వెళతావా? నేను అక్కడ న్యాయ విచారణ చేయవచ్చా" అని అడిగాను.
\s5
\v 21 అయితే, పౌలు మాత్రం కైసరు మాత్రమే న్యాయ విచారణ చేయాలని అన్నాడు. కాబట్టి నేను కైసరు దగ్గరికి పంపే వరకు గట్టి కాపలాలో అతణ్ణి ఉంచాను" అని చెప్పాడు.
\v 22 అప్పుడు అగ్రిప్ప ఫేస్తుతో, "అతడు చెప్తున్నదేమిటో నాక్కూడా వినాలని ఉంది" అన్నాడు. అప్పుడు ఫేస్తు, "రేపు వినవచ్చు" అన్నాడు.
\s5
\p
\v 23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా అధికార మందిరంలోకి ప్రవేశించి అక్కడి పుర ప్రముఖులందరి గౌరవాన్ని అందుకున్నారు. కైసరయ లోని కొంతమంది రోమా సేనాపతులు, ప్రముఖులు కూడా వాళ్ళతో వచ్చారు. అప్పుడు ఫేస్తు పౌలును తీసుకు రమ్మని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 24 పౌలు వచ్చిన తరవాత ఫేస్తు, "రాజైన అగ్రిప్పా, ఇక్కడ ఉన్న ప్రముఖులారా, మీరు ఈ మనిషిని చూశారు. యెరూషలేము, ఎఫెసులో ఉన్న యూదు నాయకులందరూ ఇతడు ఇంకా బతకకూడదని ఆరోపిస్తున్నారు."
\s5
\p
\v 25 "అయితే ఇతనిలో మరణానికి తగిన కారణం ఏమీ నాకు కనిపించలేదు. అయినా సరే, ఇతడు కైసరు ఎదుట తన వాదన చెప్పుకుంటానని అడిగాడు కాబట్టి ఇతన్ని రోమ్ కు పంపాలని నిర్ణయించాను.
\v 26 అందుకే ఇతన్ని ఇక్కడికి తెప్పించాను. ఇతడు మీతో, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజుతో మాట్లాడతాడు! మీరేమైనా ప్రశ్నలు ఉంటే ఇతన్ని అడగవచ్చు. ఈ విచారణ తరవాత నాకు కైసరుకు ఏమని రాసి పంపాలో తెలుస్తుంది.
\v 27 ఖైదీ మీద మోపిన నేరాలను కచ్చితంగా వివరించకుండా కైసరు దగ్గరికి పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 26
\p
\v 1 అప్పుడు అగ్రిప్ప పౌలుతో, "ఇక నువ్వు నీ పక్షంగా ఏమైనా చెప్పుకోవచ్చు" అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టుగా తన చేతులు పైకి చాచి, ఇలా అన్నాడు,
\v 2 "అగ్రిప్ప రాజా, నేను దుష్ట కార్యాలు చేశానని చెప్పే ఈ యూదు నాయకుల ఆరోపణలు ఎందుకు సరైనవి కావో మీ ఎదుట వివరించగలిగే అవకాశాన్ని నాకొక ఆధిక్యతగా ఎంచుకొంటున్నాను.
\v 3 మరి ముఖ్యంగా మీకు మన యూదా సంప్రదాయాలు, మనం వాదిస్తున్న విషయాల గురించి బాగా తెలుసు కాబట్టి నేను మరీ సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఓపికతో వినాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను."
\s5
\p
\v 4 "నేను నా చిన్నతనం నుండి నా జీవితాన్ని ఎలా గడిపానో నా సాటి యూదులకు బాగా తెలుసు. నేను పుట్టిన ఊరిలోనూ, ఆ తరవాత యెరూషలేములోనూ నేను ఎలా జీవించానో వాళ్ళకి తెలుసు.
\v 5 నా ప్రారంభం నుండీ నేను వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోరుకుంటే నా చిన్నతనం నుండీ నేను మన మత సంప్రదాయాలను ఎంత నిష్టగా పాటించానో వాళ్ళు చెప్పగలరు. ఇతర అందరు పరిసయ్యుల లాగానే నేను కూడా జీవించాను."
\s5
\p
\v 6 "మన పితరులకు దేవుడు దేనినైతే వాగ్దానం చేశాడో దానిని ఆయన నెరవేరుస్తాడని నమ్మకంగా ఎదురు చూడడం బట్టి నేను ఈ రోజు ఈ విచారణను ఎదుర్కొంటున్నాను.
\v 7 తాను వాగ్దానం చేసిన దానిని దేవుడు నెరవేరుస్తాడని దివారాత్రులు ఆయన్ని పూజిస్తూ, గౌరవించే మన పన్నెండు గోత్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఘనమైన రాజా, దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేరుస్తాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అయితే నేను దేవుడు చేయబోతున్నాడని నమ్ముతున్నదానిని బట్టి వాళ్ళు నన్ను తప్పు పడుతున్నారు.
\v 8 దేవుడు మృతులను జీవింప జేయలేడని మీలో ఎవరైనా ఎందుకు భావిస్తారు?"
\s5
\p
\v 9 "నజరేతు గ్రామానికి చెందిన యేసును విశ్వసించకుండా ప్రజలను అడ్డుకోడానికి నేను చేయగలిగినంత మట్టుకు చేయాలని గతంలో నేను చూసిన మాట వాస్తవమే."
\p
\v 10 "నేను యెరూషలేములో ఉన్నప్పుడు చేసిన పని అదే. అక్కడి ప్రధాన యాజకులు నాకు ఇచ్చిన అధికారంతో విశ్వాసుల్లో అనేకమందిని నేను చెరసాలల్లో బంధించాను. వాళ్ళ మనుషులు విశ్వాసుల్ని చంపినప్పుడు వాళ్ళ పక్షంగా నిలబడ్డాను."
\p
\v 11 "ప్రతి సమాజమందిరం లోనూ నేను ఎదుర్కొన్న ఆ యూదుల్ని నేను శిక్షించాను. నా కోపాన్నంతా వాళ్ళపైన చూపించి వాళ్ళు దేవుణ్ణి అవమానించి, ఆయన పేరును దూషించేలా వాళ్ళపై వత్తిడి తెచ్చాను. పైగా వాళ్ళని వెదుకుతూ నేను దూర ప్రాంతపు నగరాలకు కూడా వెళ్లి వాళ్ళని అడ్డుకోడానికి నేను చేయగలిగినదంతా చేశాను."
\s5
\p
\v 12 "దమస్కులో ఉన్న విశ్వాసుల్ని బంధించి తేవడానికి ప్రధాన యాజకులు నాకు అధికారం ఇచ్చారు. నేను అక్కడికి వెళ్లాను. అయితే నేను వెళుతూ ఉండగా,
\v 13 రాజా, సుమారు మధ్యాహ్నం వేళ ఆ మార్గంలో ఆకాశంలో ఒక ప్రకాశించే వెలుగును చూశాను. అది సూర్యునికంటే ప్రకాశవంతంగా ఉంది. అది నా చుట్టూ, నాతోబాటు ప్రయాణిస్తున్న వాళ్ళ చుట్టూ ఆవరించింది.
\v 14 మేమంతా నేలమీద పడిపోయాం. అప్పుడు ఒకరు నాతో హెబ్రీ భాషలో మాట్లాడడం నేను విన్నాను. ఆయన నాతో, "సౌలూ, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మునుకోలలకు ఎదురు తన్నడం నీకు అసాధ్యం" అన్నాడు."
\s5
\p
\v 15 "నేను ఆయన్ని "నువ్వు ఎవరివి ప్రభూ" అని అడిగాను. అప్పుడు ప్రభువు "నేను యేసుని! నువ్వు ఎవరితో పోరాడుతున్నావో అది నేనే.
\v 16 ఇక లేచి నీ కాళ్ళ మీద నిలబడు. నిన్ను ఒక సేవకునిగా, ఇప్పుడు నువ్వు చూసిన దానికీ, ఇంకా ముందు నేను చూపించబోయే దానికీ సాక్షిగా చేయడానికి నేను నీకు ప్రత్యక్షమయ్యాను.
\v 17 నేను నిన్ను ప్రజలనుండీ నేను నిన్ను పంపబోయే యూదేతరుల నుండీ నిన్ను కాపాడతాను.
\v 18 తద్వారా వాళ్ళ కన్నులు తెరిచేలా, వాళ్ళని చీకటి నుండి వెలుగులోకి, దేవుని శత్రువు ప్రభావం నుండీ తప్పిస్తాను. ఆ విధంగా దేవుడు వాళ్ళ పాపాలను క్షమించి, నా ప్రజలకు చెందిన శాశ్వతమైన వాటన్నిటినీ పొందగలిగేలా, విశ్వాసం ద్వారా నాకు చెందిన ప్రజలుగా చేస్తాను" అన్నాడు."
\s5
\p
\v 19 "కాబట్టి అగ్రిప్ప రాజా, దేవుడు నాకు ఆ దర్శనం ద్వారా దేనిని చేయమని చెప్పాడో అదే చేశాను.
\v 20 మొదట నేను దమస్కులో, యెరూషలేములో, యూదయ ప్రాంతమంతటిలో ఉన్న యూదులతో, యూదేతరులతో మాట్లాడాను. వారంతా పాపం చేయడం మాని, దేవుని సహాయం కోరాలని వాళ్ళని హెచ్చరించాను. అంతేగాక వాళ్ళు పాపం చేయడం మానుకున్నామని సూచించే పనులు జరిగించాలి అని కూడా వాళ్ళకి బోధించాను."
\p
\v 21 "నేను ఈ విషయాలు బోధించడం వలన కొందరు యూదులు నేను దేవాలయం ఆవరణలో ఉన్నప్పుడు నన్ను పట్టుకుని చంపాలని చూశారు.
\s5
\v 22 ఏదేమైనా, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఈ రోజు వరకూ ఈ సంగతులను ప్రకటిస్తూ ఉన్నాను. ఏమి జరగబోతుంది అని ప్రవక్తలు, మోషే చెప్పిన మాటలనే నేను సాధారణ ప్రజలకు, గొప్పవాళ్ళకీ ప్రకటించడం మానలేదు.
\v 23 మెస్సీయ బాధలు అనుభవించి మరణిస్తాడనీ, మృతులలోనుండి మొదటిగా తిరిగి లేస్తాడనీ వాళ్ళు ప్రకటించారు. దేవుడు వాళ్ళని నిజంగా రక్షిస్తాడని ఆయన తన స్వంత ప్రజలకూ, యూదేతరులకూ ప్రకటిస్తాడని కూడా వాళ్ళు చెప్పారు."
\s5
\p
\v 24 పౌలు ఇంకా ముందుకు మాట్లాడబోతుండగా ఫేస్తు "పౌలూ, నీకు పిచ్చి పట్టింది! నువ్వు మరీ ఎక్కువగా చదువుకున్నావు, అది నీ మతి చెడగొట్టింది" అని అరిచాడు.
\v 25 కానీ, దానికి జవాబుగా పౌలు, "ఘనమైన ఫేస్తుగారూ, నాకేం మతి చలించలేదు! దానికి వ్యతిరేకంగా, నేను చెప్పేదంతా సత్యమైనదీ, తెలివితో కూడినదీ!
\v 26 అగ్రిప్ప రాజుకు నేను మాట్లాడే ఈ విషయాలన్నీ బాగా తెలుసు. నేను వాటి గురించి ఆయనతో స్వేచ్చగా మాట్లాడగలను. ఈ సంగతుల్లో కొన్ని వాళ్ళ దృష్టికి రాకపోయి ఉండవచ్చు, ఎందుకంటే అవి రహస్యంగా జరిగాయి" అన్నాడు.
\s5
\p
\v 27 "అగ్రిప్ప రాజా, ప్రవక్తలు రాసిన విషయాలు మీరు నమ్ముతున్నారా? అవును, ఆ విషయాలు మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు" అన్నాడు.
\v 28 అప్పుడు అగ్రిప్ప పౌలుతో "ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా చేయాలని చూస్తున్నావే!" అన్నాడు.
\v 29 దానికి పౌలు జవాబిస్తూ, "అది సులభమా తేలికా అది ముఖ్యం కాదు. మీరు, నేను చెప్పిన మాటలు వింటున్న వీరంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగా ఉండాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను!" అన్నాడు.
\s5
\p
\v 30 రాజు లేచి నిలబడ్డాడు. గవర్నర్, బెర్నీకే, ఇంకా మిగిలినవాళ్ళు కూడా లేచి
\v 31 బయటికి వెళ్లిపోయారు. బయటికి వెళ్ళిన తరవాత, "ఇతడు మరణానికి గానీ, బంధకాలకు గానీ తగిన నేరం ఏమీ చేయలేదు" అని తమలో తాము చెప్పుకున్నారు.
\v 32 అగ్రిప్ప ఫేస్తుతో, "ఇతడు కైసరుకు దరఖాస్తు చేసుకొని ఉండకపోతే ఇతడిని విడుదల చెయ్యొచ్చు" అన్నాడు.
\s5
\c 27
\p
\v 1 మేము ఓడలో ఇటలీకి వెళ్లాలని గవర్నర్ నిర్ణయించి పౌలునీ, ఇంకా కొంతమంది ఖైదీలనీ జూలియస్ అనే ఒక సైనికాధికారి పర్యవేక్షణకు అప్పగించాడు. అతడు శతాధిపతి. చక్రవర్తి నేరుగా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతని అధికారం కింద ఇంకా అనేకమంది సైనికులు ఉన్నారు.
\v 2 ఆసియాలోని అద్రముత్తియ అనే రేవులో మేము ఓడ ఎక్కాం. ఆ ఓడ ఆసియా తీరం వెంబడి ఉన్న చాలా పట్టణాలను తాకుతూ ప్రయాణిస్తుంది. ఆ మార్గంలోనే మేము ఆసియాకు వెళ్లాం. మాసిదోనియలోని తెస్సలోనిక నుండి అరిస్తార్కు మాతో వచ్చాడు.
\s5
\p
\v 3 తరవాతి రోజు మేము సీదోను చేరుకున్నాం. జూలియస్ పౌలు పట్ల దయతో వ్యవహరించాడు. అతడు బయటికి వెళ్లి తన స్నేహితుల్నీ, తన విషయం శ్రద్ధ కలిగిన వాళ్ళనీ కలుసుకోడానికి అనుమతి ఇచ్చాడు.
\v 4 ఆ తరవాత అక్కడినుండి మళ్ళీ బయలుదేరాం. ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
\v 5 తరవాత మేము కిలికియ, పంఫులియ తీరం దగ్గరగా సముద్రం దాటి అవతలికి చేరుకున్నాం. ఓడ లూసియ లో ఉన్న మైరా పట్టణానికి చేరింది. మేము అక్కడ ఓడ దిగిపోయాం.
\v 6 మైరాలో జూలియస్ అలెగ్జాండ్రియ నుండి వచ్చిన ఒక ఓడ ఉండడం చూశాడు. అది ఇటలీకి తిరిగి వెళ్తుంది. కాబట్టి అతడు మేము ఆ ఓడ ఎక్కి వెళ్ళే ఏర్పాట్లు చేయడంతో మేము దానిలో ఎక్కి ప్రయాణం కొనసాగించాం.
\s5
\p
\v 7 గాలి మాకు ఎదురుగా వీస్తూ ఉండడం వలన మేము చాలా నెమ్మదిగా ప్రయాణిస్తూ చాల కష్టంగా క్నీదుకు దగ్గరగా వచ్చాం. ఆ తరవాత గాలి మరీ బలంగా వీస్తుండడంతో ఓడ పడమరకు నేరుగా సాగనివ్వలేదు. దానితో మేము గాలి అంత ధాటిగా లేని క్రేతు ద్వీపం తీరాన్ని ఆనుకొని నెమ్మదిగా ప్రయాణం సాగించి నీటిలో ముందుకు చొచ్చుకువచ్చినట్టు ఉన్న సల్మోనే పక్కగా సాగాము.
\v 8 గాలి ఇంకా బలంగా వీస్తుండడం వలన వేగంగా కదలడానికి వీలు లేకపోయింది. కాబట్టి మేము క్రేతు తీరం వెంబడి నెమ్మదిగా ప్రయాణించి లాసియ దగ్గర ఉన్న మంచి రేవులు అనే పట్టణానికి చేరుకున్నాం.
\s5
\p
\v 9 అప్పటికే సమయం మించిపోయింది. యూదుల ఉపవాస కాలం తరవాత సముద్రం మరీ అల్లకల్లోలంగా మారుతుంది. మేము ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరంగా మారింది. అప్పుడు పౌలు ఆ ఓడలోని వాళ్ళకు ఇలా చెప్పాడు.
\p
\v 10 "మనం గనక ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తే అది చాలా ప్రమాదకరం. ఓడలోని సరుకు నష్టపోవడమే కాకుండా మన ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది."
\p
\v 11 కానీ రోమా అధికారి పౌలు మాటలు నమ్మలేదు. ఆ ఓడ నావికుడు, యజమాని చెప్పిన మాటలపై నమ్మకముంచి వారేమి చెప్పారో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించాడు.
\s5
\p
\v 12 చలికాలంలో ఆ రేవులో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి ఎక్కువమంది నావికులు సముద్రంలోకి వెళ్ళడానికే మొగ్గు చూపారు. వాళ్ళు ఫేనీకే చేరుకొని అక్కడ చలికాలం గడపవచ్చని ఆశించారు. ఫేనీకే క్రేతు ద్వీపంలో ఒక పట్టణం. నైరుతి, వాయువ్య దిక్కులనుండి గాలులు ఆ పట్టణం మీదుగా వీస్తాయి.
\p
\v 13 దక్షిణం నుండి మెల్లని గాలులు వీస్తుండడం చేత ఆ ఓడ సిబ్బంది తాము కోరుకున్న విధంగా ప్రయాణం కొనసాగించవచ్చని ఆశించారు. కాబట్టి వాళ్ళు లంగరు ఎత్తి క్రేతు తీరం పక్కగా ఓడ నడిపించారు.
\s5
\p
\v 14 కొద్ది సమయం గడిచిన తరవాత ఒడ్డువైపు నుండి తీవ్రమైన గాలులు వీయడం ప్రారంభించాయి. ఆ గాలులు ఉత్తర దిక్కునుండి ఆ ద్వీపం మీదుగా వచ్చి ఆ ఓడను డీకొన్నాయి. ఆ గాలుల్ని ఊరకులోను అని పిలుస్తారు, అంటే, "ఉత్తరపు గాలి" అని అర్థం.
\p
\v 15 అది ఓడ ముందు భాగానికి బలంగా తగలడం వలన మేము ముందుకు సాగలేకపోయాం. కాబట్టి ఓడ నావికులు గాలి ఎటు వీస్తుందో ఆ వైపుకు ఓడను వెళ్ళిపోనిచ్చారు.
\p
\v 16 కౌద అనే చిన్న ద్వీపం తీరం పక్కగా ఓడ ప్రయాణించింది. మేము అతి కష్టంతో మా పడవను ఓడనుండి విడిపోకుండా కాపాడుకోగలిగాం.
\s5
\p
\v 17 వాళ్ళు పడవను పైకెత్తి కట్టిన తరవాత దాని తాళ్ళను ఓడను బలంగా నిలిపి ఉండడం కోసం దాని చుట్టూ బిగించి కట్టారు. ఆ విధంగా వెళితే సూర్తిస్ అనే ఇసకతిప్పలో చిక్కుకొని పోతామేమో అని భయపడి ఓడ లంగరు కిందికి దింపి గాలి విసరుతున్న వైపుగా ఓడను కొట్టుకుపోనిచ్చారు. గాలి, అలలు ఓడను అటూ ఇటూ కొట్టుమిట్టాడేలా చేశాయి. అందువలన తరవాతి రోజు ఆ నావికులు ఓడలోని సరుకును సముద్రంలో పారెయ్యసాగారు.
\p
\v 18 పెనుగాలులు, అలలు ఓడను ఇంకా అటూ ఇటూ ఊపేస్తున్నాయి. కాబట్టి తరవాతి రోజు నావికులు ఆ ఓడలోని సామానంతటినీ సముద్రంలోకి పడెయ్యడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 19 ఆ తుపాను మూడవ రోజున నావికులు ఆ ఓడపై ఉన్న త్రాళ్ళు, దుంగలు మొదలైన వస్తువులన్నిటినీ పారవేసి ఓడను తేలిక చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు తమ చేతులారా వాటిని పారవేయాల్సి వచ్చింది.
\v 20 ఆ విధంగా చాలా రోజుల పాటు గాలి వీస్తూనే ఉంది. పగలనక రాత్రనక ఆకాశం దట్టమైన మేఘాలతో చీకటిగా ఉండడం వలన మాకు సూర్యుడు గానీ, నక్షత్రాలు గానీ కనిపించలేదు. మేము బతికి బట్ట కడతామన్న ఆశ మాలో లేకుండా పోయింది.
\s5
\p
\v 21 చాలా రోజుల పాటు ఓడలో ఉన్న మాలో ఎవరూ భోజనం చేయలేదు. చివరికి ఒక రోజు పౌలు లేచి మా అందరి ఎదుట నిలబడి, "స్నేహితులారా, మనం క్రేతు నుండి బయలుదేరడం మంచిది కాదు అని నేను చెప్పిన మాట మీరు విని ఉండాల్సింది. అలా చేసి ఉంటే మనకీ నష్టం, కష్టం కలిగి ఉండేవి కాదు.
\v 22 అయితే, ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే, భయపడవద్దు, ఎందుకంటే మనలో ఎవ్వరం చనిపోము. ఈ తుపాను ఈ ఓడను ధ్వంసం చేస్తుందేమోగాని మనల్ని కాదు.
\s5
\v 23 నాకిది బాగా తెలుసు. ఎందుకంటే గత రాత్రి నేను ఎవరికి చెందిన వాడినో, ఎవరిని నేను పూజిస్తున్నానో ఆ దేవుడు నా దగ్గరకి తన దూతను పంపించాడు.
\v 24 ఆ దేవదూత నాతో, "పౌలా, భయపడకు. నువ్వు రోమ్ నగరానికి వెళ్లి చక్రవర్తి ఎదుట న్యాయవిచారణ లో నిలబడాలి. ఈ ఓడలో నీతోబాటు ప్రయాణిస్తున్న వారంతా తమ ప్రాణాలు దక్కించుకునేలా దేవుడు అనుగ్రహించాడు అని నీవు తెలుసుకోవాలి" అన్నాడు.
\v 25 కాబట్టి నా స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. ఆ దూత చెప్పిన విధంగా దేవుడు దీన్ని తప్పకుండా జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను.
\v 26 అయితే ఈ ఓడ మాత్రం ఏదో ఒక ద్వీపానికి కొట్టుకొని ముక్కలైపోతుంది, మనం ఆ ఒడ్డుకు చేరుకుంటాం."
\s5
\p
\v 27 తుపాను ప్రారంభమైన పద్నాలుగో రోజుకి ఓడ ఇంకా అద్రియ సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంది. అర్థరాత్రి సమయానికి ఆ ఓడ ఏదో ఒడ్డుకు సమీపంగా ఉన్నదని నావికులు గ్రహించారు.
\v 28 అప్పుడు వాళ్ళు ఒక తాడును నీటిలోకి వదిలి అక్కడ ఎంత లోతు ఉన్నదో కొలవడానికి చూశారు. వాళ్ళు దానిని పైకి లాగి చూసినప్పుడు అక్కడ 40 మీటర్లు లోతు ఉందని తెలిసింది. కొంత సమయం తరవాత వాళ్ళు మళ్ళీ చూసినప్పుడు అక్కడ 30 మీటర్లు లోతు ఉంది.
\v 29 ఓడ ఏదైనా శిలకు గుద్దుకుంటుందేమో అని వాళ్ళు భయపడ్డారు. కాబట్టి వాళ్ళు ఓడకున్న నాలుగు లంగరులను నీటిలోకి దింపారు. చేసేదేమీ లేక త్వరగా తెల్లవారితే ఓడ ఎక్కడికి వెళ్తున్నదో చూడవచ్చని వారంతా దేవుడిపై భారం వేసి ఉండిపోయారు.
\s5
\p
\v 30 వాళ్ళలో కొంతమంది నావికులు ఆ ఓడనుండి దూకి తప్పించుకు పోవాలని ఆలోచించారు. కాబట్టి వాళ్ళు సముద్రంలోకి పడవను దించారు. వాళ్ళు చేస్తున్న పని ఎవరూ తెలుసుకోకుండా ఉండేలా వాళ్ళు ఓడ ముందు భాగం నుండి లంగరులు దింపుతున్నట్టు నటించారు.
\v 31 అయితే పౌలు ఆ అధిపతితో, మిగిలిన సైనికులతో, "నావికులు ఓడలో నుండి తప్పించుకుంటే ఇక మనం ప్రాణాలతో ఉండడం అసాధ్యం" అని చెప్పాడు.
\v 32 ఆ వెంటనే సైనికులు ఆ పడవ తాళ్ళను కోసేసి అది నీళ్ళలో పడిపోయేలా చేశారు.
\s5
\p
\v 33 తెల్లవారుతూ ఉన్న సమయంలో పౌలు అందరూ ఎదో కొంత తినమని ఆ ఓడలోని వారందరినీ బతిమిలాడాడు. అతడు వాళ్ళతో, "గత పద్నాలుగు రోజులుగా మీరు పస్తులున్నారు.
\v 34 ఇప్పుడైనా లేచి కొంచెం ఆహారం తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ప్రాణాలు నిలుపుకోవాలంటే ఇది తప్పనిసరి. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలాడు అని నేను హామీ ఇస్తున్నాను" అన్నాడు.
\v 35 పౌలు ఆ మాటలు పలికిన తరవాత అందరూ చూస్తుండగా అతడు ఒక రొట్టె ముక్క తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తరవాత దానిని విరిచి తినడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 36 దానితో వారంతా హుషారు తెచ్చుకుని కొంచెం ఆహారం తీసుకున్నారు.
\v 37 ఆ ఓడలో మొత్తం 276 మందిమి ఉన్నాం.
\v 38 ప్రతి ఒక్కరూ చాలినంత తిన్న తరవాత మిగిలిన గోదుమలన్నీ సముద్రంలో పారేసి ఓడను తేలిక చేశారు.
\s5
\p
\v 39 తెల్లారిన తరవాత మాకు భూభాగం కనిపించింది. అయితే అది ఏ దేశమో నావికులకి తెలియలేదు. అయితే అక్కడ ఒక సముద్రపు పాయ, నీటి అంచున విశాలమైన ఇసక మైదానం కనిపించింది. ఓడను ఆ తీరం మీదికి నడిపించడానికి చూశారు.
\v 40 కాబట్టి వాళ్ళు లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. అదే సమయంలో వాళ్ళు చుక్కానుల కట్లు విప్పి ఓడ ముందు భాగంలోని తెరచాపను పైకెత్తారు. అలా ఓడని ఒడ్డుకు నడిపించే ప్రయత్నం చేశారు.
\v 41 కానీ ఓడ అల్లకల్లోలంగా ఉన్న ఆ నీటిలోకి ప్రవేశించి ఆ అలల కింద ఉన్న ఇసక దిబ్బలపైకి కొట్టుకుపోయింది. ఓడ ముందుభాగం ఆ ఇసుకలో కూరుకుపోయి ముందుకు కదలలేదు. పెద్ద పెద్ద అలలు ఓడ వెనుక భాగంపై గట్టిగా తగలడంతో ఆ ఓడ పగిలిపోసాగింది.
\s5
\p
\v 42 ఖైదీలు సముద్రంలోకి దూకి ఒడ్డుకు ఈది తప్పించుకుంటారేమో అని అనుమానించిన సైనికులు వారందరినీ చంపాలని ఆలోచించారు.
\v 43 అయితే సైనికాధికారి పౌలును కాపాడాలని నిర్ణయించుకుని ఆ విధంగా చేయకుండా సైనికుల్ని వారించాడు.
\v 44 ఈత వచ్చిన వారంతా సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవాలనీ, మిగిలిన వాళ్ళు ఆ ఓడలో ఉన్న చెక్కలు, ఇతర వస్తువులు పట్టుకుని వాటి సహాయంతో ఒడ్డుకు చేరుకోవాలనీ ఆదేశించాడు. మేమంతా అతడు చెప్పినట్టు చేశాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాం.
\s5
\c 28
\p
\v 1 మేము క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న తరవాత అది మెలితే ద్వీపం అని మాకు తెలిసింది.
\v 2 ఆ ద్వీపం లోని అనాగరికులైన ప్రజలు మాకు చేసిన సపర్యలు అంత ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడం వలన వాళ్ళు చలిమంట వేసి మా అందరినీ చలికాసుకొమ్మని పిలిచారు.
\s5
\p
\v 3 అప్పుడు పౌలు కొన్ని పుల్లలు ఏరి నిప్పుల మీద వేస్తుండగా ఆ వేడికి ఒక పాము బయటికి వచ్చి పౌలు చేయి పట్టుకుంది.
\v 4 ఆ ప్రజలు ఆ పాము అతని చేతికి వేలాడడం చూసి, "ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రంలో మునిగిపోతూ తప్పించుకున్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బ్రతకనీయదు" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 5 కానీ పౌలు మామూలుగా ఆ పామును మంటల్లోకి విసిరేశాడు. అతనికి ఏ హానీ జరగలేదు.
\v 6 అయితే ప్రజలు ఇంకా అతనికి జ్వరం వచ్చి శరీరం అంతా వాచిపోతుందనీ లేకపోతే అకస్మాతుగా పడిపోయి చనిపోతాడనీ కనిపెడుతున్నారు. వాళ్ళు చాలా సేపు కనిపెట్టిన తరవాత కూడా అతనికి ఏమీ జరగలేదు. అప్పుడు వాళ్ళు తమ అభిప్రాయం మార్చుకొని, "ఇతడు హంతకుడు కాదు, ఒక దేవుడు!" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 7 పొబ్లియస్ అనే అతడు ఆ ద్వీపంలో ముఖ్యమైన అధికారి. అక్కడికి దగ్గరలోనే అతనికి పొలాలు ఉన్నాయి. అతనితో మూడు రోజులు ఉండడానికి మమ్మల్ని ఆహ్వానించాడు. ఆ మూడు రోజులూ ఎంతో శ్రద్ధగా స్నేహభావంతో మాకు ఆతిధ్యమిచ్చాడు.
\v 8 ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలుతో బాధ పడుతూ పండుకొని ఉన్నాడు. పౌలు అతని దగ్గరకు వెళ్లి ప్రార్థన చేశాడు. తరవాత అతనిపై చేతులుంచి అతణ్ణి స్వస్తపరిచాడు.
\v 9 పౌలు ఈవిధంగా చేయగానే ఆ ద్వీపంలోని మిగిలిన రోగులు కూడా అతని దగ్గరకు వచ్చాడు. అతడు వాళ్ళని కూడా స్వస్థపరిచాడు.
\p
\v 10 వాళ్ళు అనేక బహుమానాలతో మాకెంతో మర్యాద చేశారు. మేము మూడు నెలల తరవాత బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఓడలోకి కావలసిన వస్తువులు, ఆహారపదార్థాలు తెచ్చి ఓడలో పెట్టారు.
\s5
\p
\v 11 అలెగ్జాండ్రియా పట్టణం నుండి కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలం అంతా నిలిచిపోయింది. మూడు నెలలు అక్కడ ఉన్న తరవాత ఆ ఓడ ఎక్కి బయలుదేరాం. ఆ ఓడ ఇటలీ కి వెళ్తుంది.
\p
\v 12 మేము సురకూసై నగరానికి చేరి అక్కడ మూడు రోజులు గడిపాం.
\s5
\p
\v 13 అక్కడనుండి బయలుదేరి చుట్టూ తిరిగి ఇటలీ లోని రేగియుకు వచ్చాం. మరుసటి రోజు దక్షిణపు గాలి విసరడంతో రెండు రోజుల్లో పోతియోలికి వచ్చాం. అక్కడ మేము ఓడ దిగాం.
\p
\v 14 పోతియోలిలో కొందరు విశ్వాసులు మమ్మల్ని ఏడు రోజులు వాళ్ళతో ఉండమని కోరారు. ఆ తరవాత చివరిగా రోమ్ నగరానికి వచ్చాం.
\p
\v 15 రోమ్ లో కొందరు విశ్వాసులు మేము వచ్చామని విని మమ్మల్ని కలవడానికి వచ్చారు. కొంతమంది అప్పీయా సంతపేట దగ్గరికీ, ఇంకొందరు మూడు సత్రాలు అని పిలిచే ఊరి దగ్గరకు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. పౌలు ఆ విశ్వాసులను చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఎంతో ధైర్యం తెచ్చుకొని ప్రోత్సాహం పొందాడు.
\s5
\p
\v 16 మేము రోమ్ చేరుకున్న తరవాత పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉండడానికి అనుమతించారు. అయితే సైనికులు మాత్రం ఎప్పుడూ అతణ్ణి కాపలా కాస్తూ ఉండాలి.
\p
\v 17 మూడు రోజుల తరవాత అక్కడి యూదు నాయకులు వచ్చి తనతో మాట్లాడమని పౌలు కబురుపెట్టాడు. వాళ్ళు అతని దగ్గరకు వచ్చినప్పుడు పౌలు వాళ్ళతో, "సోదరులారా, నేను మన ప్రజలకు పూర్వీకుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా మన నాయకులు యెరూషలేములో నన్ను బంధించారు. వాళ్ళు నన్ను చంపబోతుండగా ఒక రోమా సేనాపతి నన్ను కాపాడి, కైసరయ ప్రాంతానికి రోమా అధికారుల విచారణకు పంపించాడు.
\v 18 వాళ్ళు నన్ను విచారించి నాలో మరణశిక్షకు తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు."
\s5
\p
\v 19 "అయితే రోమా అధికారులు నన్ను విడుదల చేయడం యూదు పెద్దలకు ఇష్టం లేక అడ్డు తగిలారు. ఇంకా చేసేది లేక నేను రోమ్ లో కైసరుకు నా వాదన వినిపిస్తాను అనాల్సి వచ్చింది. ఇలా అనడానికి కారణం మన యూదు నాయకులపై దేని గురించో ఫిర్యాదు చేయాలన్న ఉద్దేశం కాదు.
\v 20 నేనెందుకు ఖైదీని అయ్యానో దానికి కారణం మీతో చెప్పాలని మిమ్మల్ని పిలిపించాను. దేవుడు మనకు చేస్తానని చెప్పిన దానిని తప్పకుండా జరిగిస్తాడు అని నేను నమ్ముతున్నాను. ఇశ్రాయేలు ప్రజల ఆ నిరీక్షణ కోసం నేను ఈ గొలుసులతో కట్టబడ్డాను" అని చెప్పాడు.
\s5
\p
\v 21 అప్పుడు యూదు నాయకులు, "యూదయలో మన తోటి యూదులనుండి నీ గురించి మేము ఎలాంటి ఉత్తరాలు అందుకోలేదు. మన తోటి యూదులలో ఎవరూ నీ గురించి చెడ్డగా చెప్పుకోలేదు, ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకోలేదు కూడా.
\v 22 ఈ విషయంలో నీ అభిప్రాయం నీ నోటినుండే వినాలని అనుకుంటున్నాం. ఈ మతభేదం గురించి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 23 కాబట్టి వాళ్ళు ఇంకొక రొజు కూడా పౌలుతో మాట్లాడడానికి రావాలని నిర్ణయించుకున్నారు. తరవాత వాళ్ళు వచ్చిన రోజు చూస్తే ఇంతకు ముందుకంటే ఎక్కువమంది పౌలు నివాసానికి వచ్చారు. పౌలు దేవుని పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళకి చెబుతున్నాడు. మోషే ధర్మశాస్తం, ప్రవక్తలు, యేసును గురించి ముందుగా ఎలా ప్రవచించారో వాళ్ళతో మాట్లాడాడు. ఉదయం నుండీ సాయంత్రం వరకూ మాట్లాడుతూనే ఉన్నాడు.
\v 24 అతడు చెప్పిన యేసును గురించిన సంగతులు సత్యమని కొంతమంది నమ్మారు. కొంతమంది మాత్రం నమ్మలేదు.
\s5
\p
\v 25 వాళ్ళలో ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు కలిగాయి. వాళ్ళు వెళ్లిపోతుండగా పౌలు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. "పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మన పూర్వికులతో చెప్పిన మాట నిజమైంది.
\q
\v 26 మీరు ఈ మాటలు ప్రజలతో చెప్పండి:
\q మీరు వింటారుగానీ దేవుడేం చెప్తున్నాడో అర్థం చేసుకోరు.
\q మీరు కంటితో చూస్తారుగానీ దేవుడు చేసేదాన్ని నిజంగా చూడరు."
\s5
\p
\v 27 "ఈ ప్రజలు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ హృదయాలు బండబారి పోయాయి. నా దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా వాళ్ళ చెవులు పూర్తిగా ముసుకున్నాయి. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి చూడటం ఇష్టం లేదు. వాళ్ళు చెవులతో వినడానికి గానీ, హృదయంతో అర్థం చేసుకోడానికి గానీ వాళ్ళకిష్టం లేదు. వాళ్ళు గనుక నా దగ్గరకు వస్తే వాళ్ళని స్వస్తపరుస్తాను."
\s5
\p
\v 28 "కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరకు తరలిపోతున్నదని మీరు తెలుసుకుంటారు.
\v 29 దేవుడు యూదేతరులకు దీనిని అందుబాటులో ఉంచారు. వాళ్ళు దీనిని అంగీకరిస్తారు." ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు.
\s5
\p
\v 30 పౌలు రెండు సంవత్సరాలు ఆ అద్దె ఇంట్లో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ కుశల ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి బోధించేవాడు.
\v 31 దేవుడు తనను తాను రాజుగా కనపరచుకున్నాడు అనే విషయాలను, యేసు ప్రభువే మెస్సీయ అనే విషయాలను గొప్ప ధైర్యంతో, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అతణ్ణి ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు.