Door43-Catalog_te_iev/43-LUK.usfm

2194 lines
394 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id LUK - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h లూకా సువార్త
\toc1 లూకా సువార్త
\toc2 లూకా సువార్త
\toc3 luk
\mt1 లూకా సువార్త
\s5
\c 1
\p
\v 1 గౌరవనీయులైన తియోఫి గారికి,
\p ఈ మధ్య మన ప్రాంతాల్లో జరిగిన అద్భుత సంఘటనల గురించి చాలా మంది వివరంగా రాశారు.
\v 2 మొదటి నుండి ఈ సంఘటనలు జరగడం చూసిన వాళ్ళ ద్వారా మనం విన్నాము. వీళ్ళే దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించారు.
\v 3 నేను కూడా వీళ్ళు రాసి, బోధించిన ప్రతి విషయం గురించి కూలంకషంగా పరిశీలించిన మీదట, ఓ ఘనులైన తియోఫిలా గారూ, ఈ విషయాలు గురించిన కచ్చితమైన సమాచారం మీకు రాయడం మంచిదనిపించింది.
\v 4 మీరు విన్న సంగతులు వాస్తవాలేనని మీరు తెలుసుకోవాలని ఇలా చేస్తున్నాను.
\s5
\p
\v 5 హేరోదు రాజు యూదయ దేశాన్ని పరిపాలించిన కాలంలో అక్కడ జెకర్యా అనే యూదీయ అర్చకుడు ఉండేవాడు. అతడు అబీయా అనే యాజక వర్గానికి చెందినవాడు. అతడు, అతని భార్య ఎలీసబెత్, ఇద్దరూ అహరోను వంశీయులు.
\v 6 దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకూ తూ చ తప్పకుండా విధేయత చూపారు కాబట్టి దేవుడు ఈ ఇద్దరినీ నీతి గలవారుగా ఎంచాడు.
\v 7 కాని వాళ్ళకి పిల్లలు లేరు. ఎలీసబెత్ గొడ్రాలు. అంతేగాకుండా ఆమె, ఆమె భర్త వయసు మీరిన వృద్ధులు.
\s5
\p
\v 8 యెరూషలేము దేవాలయంలో యాజకుల అర్చనలకు సంబంధించి జెకర్యా యాజక వర్గం వారి వంతు వచ్చింది. ఒకరోజు జెకర్యా ఆలయంలో అర్చనాదికాలు జరిగిస్తున్నాడు.
\v 9 వాళ్ళ సంప్రదాయం ప్రకారం దేవాలయం లోపలికి వెళ్లి ధూపం వేయడానికి యాజకులు చీట్లు వేసుకుంటే జెకర్యా వంతు వచ్చింది.
\p
\v 10 అతడు ధూపం వేస్తున్న చోట ఆ సమయంలో దేవాలయం బయటి ఆవరణంలో చాలామంది ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
\s5
\v 11 అప్పుడు ప్రభువు పంపిన ఒక దేవదూత జకర్యాకు కనిపించాడు. ఆ దేవదూత ధూపం వేసే బలిపీఠం కుడి వైపున నిలబడి ఉన్నాడు.
\v 12 జెకర్యా ఆ దూతను చూసి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా భయం వేసింది.
\p
\v 13 కాని ఆ దేవదూత జెకర్యాతో, "భయపడొద్దు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీ విన్నపం విన్నాడు. నీ భార్య ఎలీసబెత్ నీ కోసం ఒక కొడుకును కంటుంది. ఆ బిడ్డకు నువ్వు యోహాను అని పేరు పెట్టాలి.
\s5
\v 14 ఆ బిడ్డ పుట్టినందుకు నువ్వూ, ఇంకా చాలామంది సంతోషిస్తారు.
\v 15 అతడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడుగా ఉంటాడు. అతడు ఎప్పుడూ ద్రాక్షారసం గానీ, ఎలాటి సారాయి గానీ తాగకూడదు. అతడు తల్లి కడుపులో పడినప్పటి నుండే పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉంటాడు.
\s5
\v 16 అతడు ఇశ్రాయేల్ జాతిలో అనేకమందిని పాపం చెయ్యవద్దనీ ప్రభువైన దేవునికి మళ్ళీ విధేయత చూపాలనీ ఒప్పిస్తాడు.
\v 17 నీకు పుట్టబోయే కుమారుడు ప్రభువుకు ముందుగా వెళుతూ, ఏలీయా ప్రవక్తలాగా ఆత్మలో శక్తితో నిండి ఉంటాడు. అతడు తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ కలిగేలా చేస్తాడు. అవిధేయులను కూడా దేవుని పట్ల విధేయత గల సజ్జనుల్లాగా జ్ఞానంతో జీవించేలా చేస్తాడు. ఈ విధంగా అతడు ప్రభువు రాకడ కోసం అనేకమందిని సమాయత్తపరుస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 18 అప్పుడు జెకర్యా దేవదూతతో "నేను చాలా ముసలివాణ్ణి, నా భార్య కూడా వృద్ధాప్యంలో ఉంది. మరి నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయని నేనెలా నమ్మగలను?" అన్నాడు.
\p
\v 19 అప్పుడు దేవదూత అతనితో, "నేను గాబ్రియేల్ ని. దేవుని సన్నిధిలో నిలబడి ఉండే వాణ్ణి. నీ జీవితంలో జరిగే శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు.
\v 20 దేవుడు నిర్ణయించిన సమయంలో నేను నీకు చెప్పిందంతా కచ్చితంగా జరుగుతుంది. కానీ నువ్వు నా మాటలు నమ్మడం లేదు కాబట్టి ఇప్పటినుంచి నీ కొడుకు పుట్టే వరకు నువ్వు ముగావాడుగా ఉంటావు" అన్నాడు.
\s5
\p
\v 21 దేవాలయంలో జెకర్యా, దేవదూత మాట్లాడుకుంటూ ఉండగా, బయట ఆవరణంలో ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అతడు అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలియక అయోమయంలో ఉన్నారు.
\v 22 జెకర్యా దేవాలయంలో నుండి బయటికి వచ్చినపుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. లోపల ఏమి జరిగిందో చెప్పడానికి చేతులతో సైగలు చేశాడు. అప్పుడు అతడు దేవాలయంలో దేవుని దివ్యదర్శనం చూసాడని ప్రజలు గ్రహించారు.
\p
\v 23 దేవాలయంలో యాజకుడిగా జెకర్యా సేవాకాలం పూర్తయ్యాక, అతడు యెరూషలేము నుండి ఇంటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 24 ఇది జరిగిన కొంత కాలానికి అతని భార్య ఎలీసబెత్ నెల తప్పింది. కాని ఐదు నెలల వరకు ఆమె ఇతరుల కంట పడలేదు.
\v 25 ఆమె తనలో తాను, "దేవుడు నా కడుపు పండించాడు. ఈ విధంగా నాపై ఆయన కనికరం చూపించాడు. మనుషుల్లో నాపై ఉన్న మచ్చ తొలగించాడు" అనుకుంది.
\s5
\p
\v 26 ఎలీజబెత్ ఆరో నెల కడుపుతో ఉండగా గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామానికి దేవుడు గాబ్రియేలు దూతను పంపాడు.
\v 27 అక్కడ దావీదు రాజు వంశంలో పుట్టిన యోసేపు అనే మనిషితో నిశ్చితార్థం జరిగిన ఒక కన్య ఉంది. ఆమెతో మాట్లాడడానికి ఆ దూత వెళ్ళాడు. ఆ కన్య పేరు మరియ.
\p
\v 28 దూత ఆమెతో, "దైవానుగ్రహ పూర్ణురాలా, నీకు శుభం. దేవుడు నీతో ఉన్నాడు" అన్నాడు.
\v 29 ఈ శుభ వచనం విని మరియ ఉక్కిరిబిక్కిరైపోయింది. దూత మాటలకు అర్థం ఏమిటో అనుకుంటూ విస్తుబోయింది.
\s5
\p
\v 30 అప్పుడు దూత ఆమెతో, "మరియా, భయం లేదు. నువ్వు దేవుని అనుగ్రహానికి నోచుకున్నావు.
\v 31 నువ్వు గర్భవతివౌతావు. నీకు కొడుకు పుడతాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి.
\v 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని అంతా మహోన్నతుడైన దేవుని కుమారుడు అంటారు. ప్రభువైన దేవుడు ఆయన్ను తన పూర్వికుడైన దావీదులాగా తన ప్రజలపై రాజుగా చేస్తాడు.
\v 33 అయన సర్వదా యాకోబు సంతతిని పరిపాలిస్తాడు. ఆయన రాజ్య పాలనకు అంతం ఉండదు" అని చెప్పాడు.
\s5
\p
\v 34 అప్పుడు మరియ "నేను కన్యను గదా, ఇది ఎలా జరుగుతుంది?" అని అడిగింది.
\v 35 అందుకు దేవదూత "పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీకు పుట్టబోయే బిడ్డ పవిత్రుడు. ఆయన్ని దేవుని కుమారుడు అంటారు.
\s5
\v 36 ఇది కూడా విను. మీ బంధువు ఎలీసబెత్ ముసలితనంలో నెల తప్పింది. ఇప్పుడు ఆమెకు ఆరవ నెల.
\v 37 దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు" అని చెప్పాడు.
\v 38 అప్పుడు మరియ, "సరే. నేను దేవుని పాద దాసిని. నువ్వు చెప్పినది నాకు జరుగు గాక" అంది. అప్పుడు దూత వెళ్లిపోయాడు.
\s5
\p
\v 39 ఇది జరిగిన తరువాత కొన్ని రోజులకు మరియ ప్రయాణమై శీఘ్రంగా యూదయ మన్య ప్రాంతంలో జెకర్యా ఉండే ఊరికి వెళ్ళింది.
\v 40 ఆమె జెకర్యా ఇంటికి వెళ్ళి అతని భార్య ఎలీసబెత్ ను పలకరించింది.
\v 41 మరియ పలకరింపును విన్న వెంటనే ఎలీసబెత్ గర్భంలో ఉన్న బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. వెంటనే దేవునికి స్తుతి చెల్లించేలా పరిశుద్ధాత్మ ఎలీసబెత్ ను ప్రేరేపించాడు.
\s5
\v 42 ఆమె సంబర పడిపోతూ మరియతో,
\q "దేవుడు నిన్ను స్త్రీలందరికన్నా మిన్నగా దీవించాడు.
\q నువ్వు గర్భాన మోస్తున్న బిడ్డను ఆయన దీవించాడు.
\q
\v 43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం ఎంత అదృష్టం!
\q
\v 44 నువ్వు నన్ను పలకరించగానే నా కడుపులో ఉన్న బిడ్డ గంతులేశాడు.
\q నువ్వు రావడం వాడికెంత సంతోషంగా ఉందో!
\q
\v 45 ప్రభువు చెప్పినది నెరవేరుతుందని నమ్మి నువ్వు ధన్యురాలివయ్యావు" అంది.
\s5
\p
\v 46 అప్పుడు మరియ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇలా అంది.
\q ఏమని ప్రభువును స్తుతించగలను!
\q
\v 47 నన్ను రక్షించిన దేవుని గురించి ఆనందంతో ఉప్పొంగి పోతున్నాను.
\s5
\q
\v 48 ఆయన తన దాసిని విస్మరించలేదు.
\q కాబట్టి అన్ని కాలాల్లో మనుషులు నన్ను ధన్య అంటారు.
\q
\v 49 సర్వ శక్తిశాలి నా పట్ల గొప్ప కార్యాలు చేసాడని వారంటారు.
\q ఆయన పవిత్రుడు.
\s5
\q
\v 50 ఆయనపై భక్తిశ్రద్ధలు నిలిపే వాళ్ళ పట్ల తరతరాలకు ఆయన కరుణ చూపుతాడు.
\q
\v 51 మహా శక్తి శాలిగా తనను కనపరచుకుంటాడు.
\q హృదయంలో గర్వపు ఆలోచనలు ఉన్నవాళ్ళను చెదరగొడతాడు.
\s5
\q
\v 52 ఏలుబడి చేసే రాజులను గద్దె నుండి దించి,
\q వేధింపులకు లోనైన ప్రజలకు మన్నన కలిగిస్తాడు.
\q
\v 53 ఆకలితో ఉన్నవాళ్ళకి మంచి భోజనం పెట్టి,
\q ధనికులను వట్టి చేతుల్తో పంపేసాడు.
\s5
\q
\v 54 ఆయన తనను సేవించే ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు.
\q చాలా కాలం క్రితం ఆయన మన పూర్వీకులకు
\q కరుణ చూపిస్తానని వాళ్లకి మాట ఇచ్చాడు.
\q
\v 55 అబ్రాహాము, అతని సంతానమంతటికీ
\q నిరంతరం తన దయను కనపరుస్తూ
\q తన మాట నిలబెట్టుకున్నాడు.
\s5
\p
\v 56 మరియ మూడు నెలలు ఎలీసబెత్ దగ్గర గడిపి ఇంటికి తిరిగి వెళ్ళింది.
\p
\v 57 ఎలీసబెత్ నెలలు నిండి కొడుకుని కన్నది.
\v 58 ఆమె చుట్టపక్కాలు ఆమె పట్ల దేవుడు చూపించిన దయ గురించి విని ఎలీసబెత్ తో కలిసి సంతోషించారు.
\s5
\p
\v 59 ఎనిమిదో రోజున బిడ్డ సున్నతి వేడుకకు బంధువులు వచ్చారు. తండ్రి పేరు జెకర్యా కాబట్టి బిడ్డకు అదే పేరు పెట్టాలని వాళ్ళు అనుకున్నారు.
\v 60 కాని బిడ్డ తల్లి ఎలీసబెత్ వాళ్ళతో, "అలా కాదు. వీడి పేరు యోహాను" అంది.
\v 61 "కానీ యోహాను అనే పేరు గలవాళ్ళు మీ బంధువుల్లో ఎవరూ లేరు గదా" అని వాళ్ళు ఆమెతో అన్నారు.
\s5
\v 62 అప్పుడు వాళ్ళు ఆ బిడ్డ తండ్రికి సైగ చేసి తన బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నాడో చెప్పమన్నారు.
\v 63 అతడు రాయడానికి పలక తెమ్మని సైగ చేసాడు. వాళ్ళు అతనికి పలక ఇచ్చారు. అతడు "ఈ బిడ్డ పేరు యోహాను" అని రాసాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 64 వెంటనే జెకర్యాకు నోరు వచ్చింది. అతడు దేవుణ్ణి కీర్తించడం మొదలు పెట్టాడు.
\v 65 దేవుడు చేసింది చూసి ఇరుగుపొరుగు వాళ్ళు నిర్ఘాంతపోయారు. జరిగిన దాన్ని వాళ్ళు చాలా మందికి చెప్పారు. యూదయ కొండ ప్రాంతం అంతా ఈ వార్త పాకిపోయింది.
\v 66 ఇది విన్న ప్రతి ఒక్కరూ దీన్ని గురించి ఆలోచించసాగారు. "ఈ పసివాడు ఎదిగాక ఏం చేస్తాడో అని చాలా కుతూహలంగా ఉంది" అని అందరూ అన్నారు. జరిగినదంతా చూసాక దేవుడు ఆ బిడ్డకు ఆసరాగా ఉంటాడని వాళ్ళకి అర్థమై పోయింది.
\s5
\p
\v 67 కొడుకు పుట్టాక జెకర్యా పరిశుద్దాత్మ స్వాధీనంలో ఉండి, దేవుని మాటలు ఇలా పలికాడు.
\q
\v 68 తన ప్రజలను విడిపించడానికి వచ్చిన
\q మన ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించే దేవుడైన ప్రభువుకు స్తోత్రం!
\s5
\q
\v 69 మనల్ని తన మహా శక్తితో రక్షించడానికి
\q తన సేవకుడైన దావీదు రాజు సంతతిలో
\q ఒకణ్ణి ఆయన పంపుతున్నాడు.
\q
\v 70 పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు దీన్ని పలికించాడు.
\q
\v 71 ఈ శక్తిశాలియైన రక్షకుడు మనల్ని మన
\q శత్రువుల నుండి విడిపించి,
\q మనల్ని ద్వేషించే వాళ్ళ బారి నుండి రక్షిస్తాడు.
\s5
\q
\v 72 మన పూర్వీకుడు అబ్రాహాముకు ఇచ్చిన మాటతో,
\q ఆయన చేసిన ప్రమాణంతో
\q
\v 73 ఆయన పవిత్రమైన నిబంధన గుర్తు చేసుకుంటూ,
\q మన పితరుల పట్ల కరుణ కలిగి దీన్ని చేసాడు.
\q
\v 74 బెదరకుండా ఆయనను సేవించేలా
\q మన శత్రువుల బలం నుండి మనల్ని కాపాడతానని దేవుడు మాట ఇచ్చాడు.
\q
\v 75 మన జీవితాలన్నీ నీతిని అనుసరిస్తూ
\q పూర్తిగా ఆయనకు సమర్పించాలని ఆయన ఇలా చేసాడు.
\s5
\p
\v 76 తరువాత జెకర్యా తన బిడ్డకు ఇలా చెప్పాడు.
\q కుమారా, నిన్ను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అని పిలుస్తారు.
\q నువ్వు ప్రభువుకు ముందుగా వెళుతూ
\q ఆయన వచ్చేకాలానికి ప్రజలను సిద్ధం చేస్తావు.
\q
\v 77 ఆయన ప్రజలను పాపశిక్ష నుండి విడిపిస్తాడనీ
\q ఆయన వాళ్ళని క్షమిస్తాడనీ నువ్వు వాళ్ళకి తెలియచేస్తావు.
\s5
\q
\v 78 దేవుడు దయ, కరుణ కలిగినవాడు కాబట్టి
\q ఆయన మనల్ని క్షమిస్తాడు.
\q దీని కారణంగా ఈ రక్షకుడు ఉదయించే సూర్యుడిలా ఉంటాడు.
\q ఆయన పరలోకం నుండి మన దగ్గరికి వచ్చి మనకు సాయం చేస్తాడు.
\q
\v 79 మరణ భయంతో ఉన్నవాళ్ళ మీద,
\q ఆత్మసంబంధమైన చీకటిలో ఉన్నవాళ్ళ మీద ఆయన ప్రకాశిస్తాడు.
\q మనం శాంతిసమాధానాలతో మనుగడ సాగించేలా ఆయన నడిపిస్తాడు.
\s5
\p
\v 80 కొంత కాలానికి జెకర్యాా, ఎలీసబెత్ ల బిడ్డ పెరిగి పెద్దవాడై, ఆత్మీయంగా బలం పుంజుకున్నాడు. అప్పుడతడు ఏకాంత ప్రదేశంలో జీవించాడు. ఇశ్రాయేలులో దేవుని ప్రజలకు బహిరంగంగా బోధించడం మొదలుపెట్టినప్పుడు కూడా అక్కడే నివసించాడు.
\s5
\c 2
\p
\v 1 ఆ రోజుల్లో రోమా సామ్రాజ్య పాలనలో ఉన్న ప్రాంతాలన్నిటిలో జనాభా లెక్కలు సేకరించాలని సీజర్ అగస్టస్ ఆజ్ఞాపించాడు.
\v 2 ఇది సిరియా దేశానికి కురేనియస్ గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగిన మొదటి జనసంఖ్య.
\v 3 అందులో పేరు నమోదు చేయించుకోడానికి అందరూ తమ స్వగ్రామాలకు వెళ్లారు.
\s5
\p
\v 4 యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు గనక ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి యూదయలోని బేత్లెహేం అనే ఊరికి వెళ్ళాడు. అది దావీదు స్వగ్రామం.
\v 5 యోసేపు తనకు ప్రదానం జరిగి, గర్భవతిగా ఉన్న మరియను కూడా తీసుకుని వెళ్ళాడు.
\s5
\v 6 వాళ్ళు బేత్లెహేము చేరుకునే సమయానికి మరియకు నెలలు నిండాయి.
\v 7 అక్కడ ఉండడానికి సత్రంలో వాళ్ళకి చోటు దొరకలేదు. ఆ రాత్రి వాళ్లు పశువుల కొట్టంలో తలదాచుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, మరియ తన తొలిచూలు కానుపుగా మగబిడ్డను ప్రసవించి, మెత్తటి గుడ్డలతో చుట్టి పశువుల మేత తొట్టిలో పడుకోపెట్టింది.
\s5
\p
\v 8 ఆ రాత్రి కొంతమంది గొర్రెల కాపరులు బేత్లెహేము పొలాల్లో మందలు కాచుకుంటున్నారు.
\v 9 హటాత్తుగా ప్రభువు దూత వాళ్ళకు ప్రత్యక్షం అయ్యాడు. మిరుమిట్లు గొలిపే కాంతి వాళ్ళ చుట్టూ ప్రకాశించింది. వాళ్ళు భయభ్రాంతులయ్యారు.
\s5
\v 10 కాని ఆ దూత వాళ్ళతో, "భయం లేదు. నేను మీకు ఒక శుభవార్త చెప్పటానికి వచ్చాను. దాని వల్ల మీతో సహా మనుషులందరికీ గొప్ప మేలు కలుగుతుంది. అందరికీ పరమానందం కలుగుతుంది.
\v 11 మీ పాపాల నుంచి కాపాడే రక్షకుడు దావీదు ఊరిలో మీకోసం ఈరోజు పుట్టాడు. ఈయన క్రీస్తు ప్రభువు.
\v 12 మీకు ఒక కొండ గుర్తు చెబుతా వినండి. ఒక పసికందును మెత్తటి గుడ్డలతో చుట్టి పశువుల మేత తొట్టిలో పండుకోబెట్టి ఉండటం మీరు చూస్తారు."
\s5
\p
\v 13 ఉన్నట్టుండి అసంఖ్యాకమైన దూతల సమూహం పరలోకం నుండి దిగి వచ్చి ఆ దూతతోబాటు దేవుణ్ణి ఈ విధంగా స్తుతించారు.
\q
\v 14 "సర్వోన్నత లోకంలో దేవదూతలు అందరూ దేవుణ్ణి కీర్తిస్తారు గాక. ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక."
\s5
\p
\v 15 ఆ దూతలు వాళ్ళ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత, ఆ గొర్రెల కాపరులు, "ఈ వార్త ప్రభువు మనకు తెలియచేసాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి ఈ అద్భుతాన్ని చూద్దాం పదండి" అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
\v 16 పరుగుపరుగున వెళ్ళి మరియ, యోసేపు ఉన్నచోటు వెతికి, పశువుల మేత తొట్టిలో పడుకుని ఉన్న బిడ్డను చూసారు.
\s5
\v 17 ఆ బిడ్డను గురించి దేవదూత తమతో చెప్పిన మాటలను అందరికీ ప్రచారం చేసారు.
\p
\v 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఆశ్చర్యపోయారు.
\v 19 మరియ మాత్రం ఈ సంగతులు అన్నీ ఆలోచించుకుంటూ తన మనసులో పదిలపరచుకుంది.
\v 20 ఆ గొర్రెల కాపరులు తమ పొలాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఐతే వాళ్ళు దూత తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు.
\s5
\p
\v 21 ఎనిమిదవ రోజున, ఆ బిడ్డకు సున్నతి ఆచారం జరిగినప్పుడు, వాళ్ళు ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. ఆయన కడుపులో పడక ముందు దేవదూత వాళ్ళకి చెప్పింది ఈ పేరే.
\s5
\p
\v 22 మోషే ధర్మశాస్త్రం ప్రకారం బాలెంత రాలి మైల రోజులు పూర్తి అయినాయి.
\v 23 "ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకి సమర్పణ చేయాలి" అని ధర్మశాస్త్రం లో రాసి ఉంది.
\v 24 ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా జత గువ్వలు గానీ రెండు పావురం పిల్లల్ని గాని బలిగా అర్పించడానికి వాళ్ళు ఆయనను యెరూషలేముకు తీసుకువెళ్ళారు.
\s5
\p
\v 25 ఆ రోజుల్లో యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఉండేవాడు. ఇశ్రాయేలు జాతికి రక్షణ కలగాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వున్నాడు. పరిశుద్ధాత్మ అతణ్ణి నడిపిస్తున్నాడు.
\v 26 అతడు ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్దాత్మ తెలియజేశాడు.
\s5
\p
\v 27 ధర్మశాస్త్ర ఆనవాయితీ ప్రకారం, ఆలయంలో కొన్ని కర్మకాండలు జరిగించడానికి యోసేపు, మరియలు బాల యేసును అక్కడికి తీసుకువచ్చారు. ఆ రోజు సుమెయోను ఆత్మప్రేరణ వల్ల దేవాలయంలోకి వచ్చాడు
\v 28 అప్పుడు సుమెయోను తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు.
\p
\v 29 "ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున నన్ను ప్రశాంతంగా కడతేరి పోనిస్తున్నావు గదా!"
\s5
\q1
\v 30 "యూదేతరులకు నిన్ను చూపించే వెలుగుగా,
\q1
\v 31 నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా,
\q1
\v 32 నీవు అందరి ఎదుటా సిద్ధం చేసిన నీ రక్షణను నేనిప్పుడు కళ్ళారా చూశాను."
\s5
\p
\v 33 యేసు గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆయన తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు.
\v 34 సుమెయోను వాళ్ళని దీవించి, యేసు తల్లి మరియతో అన్నాడు. "ఇశ్రాయేలులో చాలా మంది పడిపోవడానికి, చాలామంది రక్షణ పొందడానికి దేవుడు ఈ బాలుణ్ణి నియమించాడు. ఈయన దేవుడు పంపిన సూచన. అనేక మంది ఈ సూచనను వ్యతిరేకిస్తారు.
\v 35 ఫలితంగా అనేకమంది హృదయాలోచనలు బట్టబయలు అవుతాయి. అంతేకాక నీ గుండెల్లోకి ఒక కత్తి దూసుకుపోతుంది" అన్నాడు.
\s5
\p
\v 36 అన్నాఅనే ఒక ప్రవక్త ఆ దేవాలయంలో ఉంది. ఆమె పండు ముసలి. ఆమెది ఆషేరు గోత్రం. ఆమె తండ్రి పేరు ఫనూయేలు. ఆమె పెళ్ళి అయిన ఏడేళ్లకు భర్త చనిపోయాడు.
\v 37 ఆ తరవాత ఎనభై నాలుగేళ్ళ వయసు దాకా వితంతువుగా ఉంది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది.
\v 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి, ఆ బిడ్డను గురించి దేవుణ్ణి స్తుతించింది. ఇంకా యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ పసికందును గురించి మాట్లాడుతూ వచ్చింది.
\s5
\p
\v 39 తరువాత యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ ఊరు నజరేతుకు వెళ్ళిపోయారు.
\v 40 ఆ పసివాడు పెరుగుతూ, బలపడుతూ జ్ఞానవంతుడయ్యాడు. దేవుని అనుగ్రహం ఆయనపై ఉంది.
\s5
\p
\v 41 ఏటేటా యేసు తలిదండ్రులు పస్కా పండక్కి యెరూషలేము వెళ్ళేవాళ్ళు.
\v 42 యేసుకు పన్నెండేళ్ళు వచ్చినప్పుడు ఎప్పటిలానే వారంతా పండక్కి యెరూషలేము వెళ్ళారు.
\v 43 పండగ అన్ని రోజులూ అయిపోయాక, ఆయన తలిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. కాని యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన అక్కడే ఉండిపోయిన విషయం తలిదండ్రులకు తెలియదు.
\v 44 వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న వేరే గుంపులో ఉన్నాడనుకున్నారు. ఒక రోజు ప్రయాణం తరువాత పిల్లవాడు కనిపించకపోయే సరికి కంగారుగా చుట్టాలు, తెలిసిన వాళ్ళ మధ్య ఆయన కోసం వెదికారు.
\s5
\v 45 ఆయన కనిపించక ఆయన కోసం వెతుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
\p
\v 46 మూడు రోజుల తరువాత ఆయన దేవాలయ ప్రాంగణంలో యూదీయ మత నాయకుల మధ్య కూర్చొని ఉండడం చూసారు. ఆయన ఆ పండితులు బోధించేది వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు.
\v 47 ఆయన చెప్పింది విని, ఆయన ప్రజ్ఞకు బోధకులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చే జవాబులకూ అక్కడ కూర్చున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
\s5
\p
\v 48 ఆయన తలిదండ్రులు ఆయన్ని చూసి, చాలా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి ఆయనతో, "బాబూ, ఇలా చేసావేంటి? నేను, మీ నాన్న నీ కోసం చాలా కంగారుగా వెదుకుతున్నాం" అన్నది.
\v 49 ఆయన వాళ్ళతో, "మీరు నా కోసం ఎందుకు వెదుకుతున్నారు? నా తండ్రి పనిలో నేనుండాలని మీకు తెలీదా?" అన్నాడు.
\v 50 ఆయన మాటల్లో అర్ధాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు.
\s5
\p
\v 51 అప్పుడు ఆయన తన తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు తిరిగి వెళ్ళాడు. వాళ్ళ మాట వింటూ వారితో కలిసి ఉన్నాడు. ఆ సంగతులన్నిటినీ ఆయన తల్లి మనస్సులో తలపోసుకుంటూ వచ్చింది.
\v 52 ఏళ్ళు గడుస్తుండగా, యేసు నానాటికీ జ్ఞానవంతుడయ్యాడు. ఎదిగాడు. దేవుడి దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దినదిన ప్రవర్థమానం అవుతూ ఉన్నాడు.
\s5
\c 3
\p
\v 1 అప్పటికి సీజరు తిబెరియ రోమ్ సామ్రాజ్యాన్ని పదిహేనేళ్ళుగా పరిపాలిస్తున్నాడు. పొంతి పిలాతు యూదయ మండలం గవర్నర్. హేరోదు అంతిప గలిలయ పరగణాల పరిపాలకుడు. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీతి ప్రాంతాలను పాలించేవాడు. లుసానియానేమో అబిలేనే పరగణాల అధికారి.
\v 2 అన్న, కయప అనేవాళ్ళు ప్రధాన యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కొడుకు యోహానుతో దేవుడు మాట్లాడాడు. ఆ సమయంలో యోహాను ఎడారి ప్రదేశంలో ఉంటున్నాడు.
\s5
\p
\v 3 అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా సంచరిస్తూ మనుషులతో, "దేవుడు మీ పాపాలు క్షమించాలంటే మీరు పశ్చాత్తాపపడాలి. ఆపైన నేను మీకు బాప్తిసం ఇస్తాను" అని చెప్పేవాడు.
\s5
\v 4 పూర్వకాలం యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథం చుట్టలో ఇలా రాసి ఉంది,
\q1 "అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.
\q1 ఆయన కోసం బాటలు తిన్నగా చేయండి.
\s5
\q1
\v 5 మనుషులు ప్రతి పల్లాన్నీ పూడ్చి ప్రతి మెరకనూ సాఫీగా చేసి
\q1 వంకరదారులను నిటారుగా చేసి గతుకుల బాటలను నునుపు చేస్తారు గదా.
\q1 అలానే దేవుడు మిమ్మల్ని దీవించడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్నీ తీసి పారెయ్యాలి.
\q1
\v 6 అప్పుడు దేవుడు మనుషులను రక్షించే తీరును అందరూ కళ్ళారా చూస్తారు."
\s5
\p
\v 7 యోహాను తన చేత బాప్తిసం పొందడానికి తండోపతండాలుగా వస్తున్న వాళ్ళని చూశాడు. "మీరు నాగుపాముల్లాగా విషపు మనుషులు! "దేవుడు ప్రతి ఒక్కరినీ ఒకానొక రోజున వాళ్ళ పాపాలను బట్టి దండిస్తాడని మాకెవరూ చెప్పలేదు గదా, మేము తప్పించుకుంటాములే" అనుకుంటున్నారేమో.
\s5
\v 8 మీ చెడు ప్రవర్తన నుండి నిజంగా మారిపోయారని బాహ్య సూచనలు మీ బ్రతుకుల్లో కనిపించాలి. "మేము అబ్రాహాము సంతానం గదా" అని మీలో మీరు చెప్పుకుంటున్నారేమో. దేవుడు ఈ రాళ్లను సైతం అబ్రాహాము సంతానంగా చెయ్యగలడని మీతో చెప్తున్నాను" అని హెచ్చరించాడు.
\s5
\p
\v 9 "చెట్టును కూకటివేళ్ళతో పెళ్ళగించి నరికి వేయడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి కాయలు కాయని చెట్టును నరికి తగలబెట్టినట్టే, మీ పాపాల నుండి తొలగకపొతే దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 అప్పుడు గుంపులో కొంతమంది, "అలాగైతే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు.
\v 11 అతడు, "రెండు చొక్కాలు ఉన్నవాడు ఒక్కటి కూడా లేని వాడికి ఒకటివ్వాలి, అలానే భోజనపదార్థాలు ఉన్నవాడు లేని వాడికి కొంత పెట్టాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 12 కొందరు పన్ను వసూలు చేసే వాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చి, "బోధకా, మేమేం చేయాలి?" అని అడిగారు.
\v 13 అతడు, "రోమా ప్రభుత్వం ప్రజలనుండి మిమ్మల్ని ఎంత వసూలు చేయమన్నదో దాని కంటే ఎక్కువ వసూలు చెయ్యొద్దు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\p
\v 14 "మరి మా సంగతేంటి? మేమేం చేయాలి?" అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గరా బెదిరించి డబ్బు గుంజవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని అతడు వాళ్ళతో చెప్పాడు.
\s5
\p
\v 15 క్రీస్తు వస్తాడని ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. యోహానే క్రీస్తేమో అని చాలామంది లోలోపల అనుకుంటున్నారు.
\v 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, "అబ్బే, నేను కాదు. క్రీస్తు నాకన్నా చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకన్నా శక్తిసంపన్నుడు వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు."
\s5
\p
\v 17 "ఆయన తన కళ్ళంలో ఊకనూ ధాన్యం గింజలనూ వేరుచేయడానికి తూర్పారబట్టే పంటికోల చేత పట్టుకున్నాడు. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో తగలబెడతాడు."
\s5
\p
\v 18 అతడు ఇంకా ఇలానే చాలా మాటలు చెప్పి తమ పాపాలకు పరితాపపడి దేవుని వైపు తిరగాలని ప్రజలను హెచ్చరిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
\p
\v 19 ఆ రోజుల్లో హేరోదు రాజు అతని సోదరుడు బతికి ఉండగానే అతని భార్య హేరోదియను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం, ఇంకా అతడు చేసిన చెడు పనులన్నిటి విషయం యోహాను అతన్ని మందలించాడు.
\v 20 హేరోదు అంతవరకూ తాను చేసిన దుండగాలు చాలవన్నట్టు యోహానును బంధించి కారాగారంలో పెట్టాడు.
\s5
\p
\v 21 యోహానును జైల్లో పెట్టకముందు ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరుచుకుంది.
\v 22 పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో ఆయన మీద వాలాడు. అప్పుడు ఆకాశం నుండి దేవుడు యేసుతో "నీవు నేనెంతగానో ప్రేమించే నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం" అన్నాడు.
\s5
\p
\v 23 యేసు దేవుని పని మొదలుపెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్ఫై ఏళ్ళు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
\p
\v 24 హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
\s5
\p
\v 25 మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
\p
\v 26 నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
\s5
\p
\v 27 యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
\p
\v 28 నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
\p
\v 29 ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
\s5
\p
\v 30 లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
\p
\v 31 ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
\p
\v 32 దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
\s5
\p
\v 33 నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
\p
\v 34 యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
\p
\v 35 నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
\s5
\p
\v 36 షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
\p
\v 37 లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
\p
\v 38 కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.
\s5
\c 4
\p
\v 1 యేసు యోర్దాను నదీ లోయను వదిలి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకుపోయాడు.
\v 2 పరిశుద్ధాత్మ నలభై రోజుల వరకు ఆయనను అరణ్యంలోనే ఉంచాడు. అక్కడ ఉండగా సాతాను ఆయనను పరీక్షలకు గురి చేశాడు. అరణ్యంలో ఉన్నంత కాలం యేసు ఏమీ తినలేదు. నలభై రోజుల తరువాత ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు సాతాను యేసుతో "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే రొట్టెలుగా మారమని ఈ రాళ్ళకు ఆజ్ఞాపించి వాటిని తినొచ్చుగా" అన్నాడు.
\v 4 దానికి యేసు, "లేదు. నేను అలా చెయ్యను. లేఖనాల్లో,
\q1 "మనిషి కేవలం ఆహారం వల్ల మాత్రమే బతకడు" అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 5 అప్పుడు సాతాను యేసును ఎత్తైన పర్వతం శిఖరం పైకి తీసుకుపోయి, లోకంలోని దేశాలన్నిటినీ ఒక్క క్షణంలో చూపించాడు.
\v 6 అప్పుడు సాతాను యేసుతో, "ఈ దేశాలన్నీ ఏలే సర్వాధికారం నేను నీకు ఇవ్వగలను. ఈ సంపదలు, శోభ నీవి అవుతాయి. అవన్నీ దేవుడు నాకు ఇచ్చేశాడు గనక నేను వాటిని ఎవరికివ్వాలంటే వాళ్ళకి ఇవ్వగలను.
\v 7 కాబట్టి నువ్వు నన్ను పూజిస్తే ఇదంతా నీకే" అన్నాడు.
\s5
\v 8 కాని యేసు, "లేదు. నేను నిన్ను పూజించను. లేఖనాలలో,
\q1 "నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించాలి.
\q1 నువ్వు సేవించదగిన వాడు ఆయన ఒక్కడే" అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 9 అప్పుడు సాతాను యేసును యెరూషలేము దేవాలయ గోపురం పైకి తీసుకుపోయి, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందకు దూకు."
\q1
\v 10 "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
\q1
\v 11 పడిపోతుంటే వాళ్ళు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు. నీకు గాయం కాదు. నీ పదం సైతం రాయికి తగలదు" అని రాసి ఉంది గదా” అని ఆయనతో అన్నాడు.
\s5
\p
\v 12 కాని యేసు, "లేదు, అలా ఒక్కనాటికీ చెయ్యను. లేఖనాల్లో
\q1 "నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించడానికి ప్రయత్నించ వద్దు" అని రాసి ఉంది" అని జవాబిచ్చాడు.
\p
\v 13 సాతాను యేసును అన్ని రకాలుగా పరీక్షించడం అయ్యాక కొంతకాలం ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 14 దీని తరువాత యేసు అరణ్య ప్రాంతం విడిచి గలిలయ జిల్లాకు తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనకి శక్తి నిచ్చాడు. ఆ ప్రాంతమంతా ప్రజలు యేసును గురించి విని, ఆయన గురించి ఇతరులకి చెప్పారు.
\v 15 వాళ్ళ సమాజ మందిరాల్లో ఆయన బోధించాడు, ఆయన బోధల గురించి వారందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు.
\s5
\p
\v 16 తరువాత యేసు తాను పెరిగిన నజరేతుకు వెళ్ళాడు. విశ్రాంతి రోజున ఆయన ఎప్పటిలాగా సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన లేఖనాల నుండి చదివి విన్పించడానికి లేచి నిలబడ్డాడు.
\v 17 చాలా కాలం క్రితం యెషయా ప్రవక్త మాటలు రాసి ఉన్న తోలు చుట్టను సమాజమందిరం మనిషి ఆయన చేతికి అందించాడు. యేసు దాన్ని విప్పి చూసినప్పుడు,
\s5
\q1
\v 18 "ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.
\q1 పేదలకు దేవుని శుభవార్త చెప్పడానికి ఆయన నన్ను నియమించాడు.
\q1 బందీలుగా ఉన్నవాళ్ళకి విడుదల ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.
\q1 గుడ్డి వాళ్ళకు చూపు, వేధింపుల్లో ఉన్నవాళ్ళకి స్వేచ్ఛ కలుగుతుందని,
\q1
\v 19 ప్రజల పట్ల అనుకూలంగా ప్ర్రభువు పని చేయడానికి ఇదే సమయమని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు" అనే మాటలు రాసి ఉన్న పేజీ కనిపించింది.
\s5
\p
\v 20 ఆయన ఆ చుట్టను మడిచి, అక్కడి మనిషికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజమందిరంలోని వాళ్ళంతా ఆయన్నే చూస్తున్నారు.
\v 21 ఆయన వాళ్ళతో, "మీరు విన్న ఈ లేఖనం ఈ రోజు మీ కళ్ళెదుట నెరవేరింది" అన్నాడు.
\v 22 ప్రతి ఒక్కరూ ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయారు. అంతా కలవరపడ్డారు. వాళ్ళలో కొందరు "ఇతను యోసేపు కొడుకే గదా!" అనుకున్నారు.
\s5
\v 23 ఆయన వాళ్ళతో, "మీలో కొందరు కచ్చితంగా నాకు "వైద్యుడా, నిన్ను నువ్వు స్వస్థపరచుకో" అనే సామెత చెబుతారు. "కపెర్నహోంలో చేసిన అద్భుతాలు నీ స్వంత ఊరిలో, అంటే ఇక్కడ చెయ్యి" అని మీరంటారు" అన్నాడు.
\p
\v 24 తరువాత ఆయన "పెరటి తోటకూర వైద్యానికి పనికి రాదన్నట్టు ప్రవక్త ఉపదేశాలను అతని స్వంత ఊరు జనం అంగీకరించరు అనేమాట నిజమే.
\s5
\v 25 కాని ఇది ఆలోచించండి. ప్రవక్త ఏలీయా జీవించిన రోజుల్లో మూడున్నర సంవత్సరాలు అనావృష్టి వల్ల దేశమంతా భయంకరమైన కరువు వచ్చింది.
\v 26 కాని ఇశ్రాయేలు దేశం లో చాలా మంది వితంతువులు ఉండగా ఏ ఇశ్రాయేలీ వితంతువు దగ్గరికీ దేవుడు ఏలీయాను పంపలేదు. సీదోనులో వితంతువుకు సాయం చెయ్యడానికి సారెపతు ఊరికి పంపాడు.
\v 27 ప్రవక్త ఎలీషా జీవించిన కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠు రోగులు ఉన్నారు. కాని ఎలీషా వాళ్ళెవ్వరినీ స్వస్థపరచలేదు. సిరియా వాడైన నయమానునే బాగుచేశాడు" అన్నాడు.
\s5
\p
\v 28 సమాజ మందిరంలోఇది విన్న వాళ్ళందరికీ పట్టరాని కోపం వచ్చింది.
\v 29 లేచి ఆయన్ని ఊరి బయటికి తోసుకుంటూ పోయారు. కొండ అంచుకు తీసుకెళ్ళి, తలక్రిందులుగా పడదోసి చంపేయాలనుకున్నారు.
\v 30 కాని ఆయన వాళ్ళ మధ్య నుండి తప్పుకుని వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 31 ఒక రోజు ఆయన గలిలయ సీమలోని కపెర్నహోం వెళ్ళాడు. తరువాతి రోజు విశ్రాంతి. ఆయన సమాజ మందిరంలో ప్రజలకు బోధించాడు.
\v 32 ప్రజలకు ఆజ్ఞాపిస్తూ చెప్పే ఆయన బోధల ధోరణికి వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు.
\s5
\p
\v 33 ఆ రోజు దయ్యం పట్టిన ఒకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు గట్టిగా అరుస్తూ,
\v 34 "ఓ నజరేతువాడా యేసూ, దయ్యాలతో నీకేం సంబంధం? మమ్మల్నందర్నీ నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరివో నాకు తెలుసులే. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన పవిత్రమూర్తివి" అన్నాడు.
\s5
\v 35 అప్పుడు యేసు, "నోరు మూసుకో. అతనికేమీ హాని చెయ్యక అతనిలోనుండి బయటికి రా" అన్నాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది.
\v 36 అది చూసి సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా నివ్వెరపోయారు. వాళ్ళు ఒకరితో ఒకరు, "ఆయన చాలా ధైర్యంగా మాట్లాడతాడు. ఆయన మాటల్లో చాలా ప్రభావం ఉంది. దురాత్మలు కూడా ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించగానే మనిషిని వదిలి బయటికి వస్తున్నాయి" అనుకున్నారు.
\v 37 ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు చేసిన దాన్ని గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
\s5
\p
\v 38 యేసు సమాజ మందిరం నుంచి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్తగారు అప్పుడు తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉంది. అక్కడ ఉన్న కొందరు ఆమెను బాగు చెయ్యమని యేసును అడిగారు.
\v 39 ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరానికి ఆజ్ఞ ఇవ్వగానే ఆమెలోని జ్వరం పోయింది. వెంటనే ఆమె లేచి వాళ్ళకి భోజనం వడ్డించింది.
\s5
\p
\v 40 ఆ రోజు పొద్దుగుంకే వేళకు చాలామంది తమకు తెలిసిన వారినీ, చుట్టాలనూ రకరకాల జబ్బులు నయం చేయించుకోవడం కోసం ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన వాళ్ళపై చేతులుంచి అందర్నీ స్వస్థపరిచాడు.
\v 41 చాలా మందిలో నుండి దయ్యాలను బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు. అవి వాళ్ళని వదిలి పోతున్నప్పుడు "నువ్వు దేవుని కుమారుడివి" అని అరిచాయి. కాని అలా అందరికీ చెప్పొద్దని ఆయన ఆ దయ్యాలకు ఆజ్ఞాపించాడు. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు.
\s5
\p
\v 42 మరుసటి ఉదయం యేసు ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయన ఉన్న చోటికి వెతుక్కుంటూ వచ్చారు. తమను విడిచి పోకుండా ఆయన్ని ఆపడానికి చూసారు.
\v 43 కాని ఆయన వాళ్ళతో, "దేవుడు ప్రజలను ఎలా ఏలుతాడో మిగిలిన ఊర్లలో కూడా చెప్పాలి. అది చేయడానికే దేవుడు నన్ను పంపాడు" అన్నాడు.
\v 44 కాబట్టి ఆయన యూదయ ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నాడు.
\s5
\c 5
\p
\v 1 ఒక రోజు యేసు మాట్లాడుతుండగా చాలా మంది ప్రజలు గుంపుగా ఆయన చుట్టూ చేరి వింటున్నారు. ఆయన గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు.
\v 2 సరస్సు ఒడ్డున రెండు చేపలను పట్టే పడవలు ఉన్నాయి. జాలరులు పడవలను వదిలి వలలు కడుక్కుంటున్నారు.
\v 3 యేసు ఆ రెండు పడవల్లో ఒక దానిపై ఎక్కాడు (ఆ పడవ సీమోనుది). ఒడ్డు నుండి నీళ్ళలోకి కొంత దూరం పడవను తోయమని యేసు సీమోనును అడిగి, పడవలో కూర్చుని బోధించడం కొనసాగించాడు.
\s5
\p
\v 4 ఆయన బోధించడం పూర్తయ్యాక సీమోనుతో, "పడవను కొంచెం లోతుకు పోనిచ్చి, వలలు వేసి కొన్ని చేపలు పట్టు" అన్నాడు.
\v 5 సీమోను "అయ్యా, రాత్రంతా చాలా కష్టపడ్డాం. అయినా ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ వలలు వేసి చూస్తాను" అన్నాడు.
\v 6 సీమోను, అతని మనుషులు వలలు వేశారు. వలలు పిగిలిపోయేలా చేపలు పడ్డాయి.
\v 7 వాళ్ళు తమతో కలిసి చేపలు పట్టే వాళ్ళని కూడా వచ్చి సాయం చేయమని పిలిచారు. పడవ మునిగిపోయేంతగా చేపలు పడ్డాయి. వాటితో రెండు పడవలు నింపారు.
\s5
\p
\v 8 ఇది చూసి సీమోను పేతురు యేసు కాళ్ళపై పడి, "ప్రభూ, దయ చేసి నన్ను వదిలి వెళ్ళిపో. నేను పాపాత్ముణ్ణి" అన్నాడు.
\v 9 లెక్క లేనన్ని చేపలు పడడం చూసి పేతురు ఆశ్చర్యపోయి అలా అన్నాడు. జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను ఇద్దరూ సీమోనుకు చేపల వ్యాపారంలో భాగస్తులు.
\v 10 యేసు మాత్రం "సీమోనూ ఏం భయం లేదు. ఇప్పటివరకు నువ్వు చేపలు పట్టావు. కాని, ఇప్పటి నుండి నా శిష్యుడుగా నువ్వు మనుషులను సమకూర్చుతావు" అన్నాడు.
\p
\v 11 కాబట్టి పడవలు ఒడ్డుకు చేర్చాక వాళ్ళు చేపల వ్యాపారాన్ని, తమకు ఉన్నదంతా వదిలి యేసు వెంట వెళ్లారు.
\s5
\p
\v 12 యేసు అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఊరిలో ఉండగా ఒక కుష్ఠు రోగి ఆయనను చూసి, దగ్గరికి వచ్చి ఆయన ఎదుట నేలను తాకేలా వంగి బతిమాలుతూ, "ప్రభూ, దయచేసి నన్ను బాగుచెయ్యి. నీకిష్టమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవు" అన్నాడు.
\v 13 అప్పుడు యేసు అతని చెయ్యి పట్టుకుని, "నాకు ఇష్టమే. ఇప్పుడే స్వస్థత పొందు" అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి బాగుపడ్డాడు.
\s5
\v 14 యేసు "ఇప్పడు నువ్వు బాగైన విషయం వెంటనే ఎవరికీ చెప్పొద్దు. ముందు యెరూషలేములోని యాజకుడికి కనపడు. అతడు నీకు కుష్ఠు లేదని పరీక్షించి చెబుతాడు. మోషే ఆజ్ఞాపించినట్టు కుష్టురోగానికి అర్పించాల్సిన అర్పణ యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 15 ఆ వ్యక్తిని యేసు ఎలా స్వస్థపరిచాడో చాలామంది విన్నారు. దాని ఫలితంగా యేసు బోధలు వినడానికి, రోగాల నుండి స్వస్థత పొందడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
\v 16 అయినా ఆయన తరచుగా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు.
\s5
\p
\v 17 ఒకరోజు యేసు బోధిస్తూండగా, పరిసయ్యుల శాఖ వాళ్ళు కొందరు దగ్గరలో కూర్చున్నారు. వాళ్ళలో కొందరు యూదీయ ధర్మశాస్త్రం బోధించే పండితులు. గలిలయ జిల్లాలోని గ్రామాల నుండి, యూదయ ప్రాంతంలోని యెరూషలేము నుండి కొందరు వచ్చారు.
\s5
\p
\v 18 యేసు అక్కడ ఉన్నప్పుడు పక్షవాత రోగిని కొందరు మంచంపై పడుకోబెట్టి ఆయన దగ్గరికి మోసుకొచ్చారు. ఆ రోగిని యేసు ఎదుటికి తేవాలని ఇంట్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
\v 19 కాని ఇంటి నిండా జనం ఉండడం వల్ల వాళ్ళు అతన్ని లోపలికి తీసుకు రాలేక పోయారు. కాబట్టి వాళ్ళు బయటి మెట్లెక్కి, కప్పు పైకి చేరుకుని ఆ ఇంటిపై పెంకులు తీసి, పై కప్పులోనుండి మంచంతో సహా ఆ రోగిని యేసు ఎదుట దించారు.
\s5
\p
\v 20 తాను ఆ రోగిని స్వస్థపరుస్తానని వాళ్ళు నమ్మారు అని యేసు గ్రహించి అతనితో, "మిత్రమా, నేను నీ పాపాలు క్షమిస్తున్నాను" అన్నాడు.
\v 21 ధర్మశాస్త్రం బోధించే పండితులు, మిగిలిన పరిసయ్యులు ఇది విని వాళ్ళ మనసుల్లో "ఈ మనిషి గర్విష్టి. అందుకే ఇలాటి మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానిస్తున్నాడు. దేవుడు తప్ప మరెవరూ పాపాలు క్షమించలేరని మనందరికీ తెలుసు" అనుకున్నారు.
\s5
\v 22 వాళ్ళేమి అనుకుంటున్నారో యేసుకు తెలుసు. ఆయన వాళ్ళతో "నేను పలికిన దాని గురించి మీలో మీరు ఎందుకు ప్రశ్నించుకుంటున్నారు? ఇది ఆలోచించండి.
\v 23 ఈ వ్యక్తి పాప క్షమాపణ పొందాడో లేదో ఎవరూ చూడలేరు గదా. కాబట్టి "నువ్వు క్షమాపణ పొందావు" అని చెప్పడం సులువే. కాని స్వస్థత పొందిందీ లేనిదీ ప్రజలు వెంటనే కళ్ళతో చూస్తారు గనక "లేచి నడువు" అని చెప్పడం అంత తేలిక కాదు.
\v 24 నేను ఈ మనిషిని బాగుచేస్తాను. భూమి మీద మనుషుల పాపాలు క్షమించే అనుమతిని దేవుడు మనుష్య కుమారుడైన నాకు కూడా ఇచ్చాడని మీకు నిరూపిస్తాను" అని చెప్పి పక్షవాతం వచ్చిన మనిషితో, "నీ పరుపు చుట్టుకుని లేచి ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 25 వెంటనే ఆ రోగికి వ్యాధి నయమైంది. వాళ్ళందరి ఎదుట లేచి నిల్చున్నాడు. తనను మోసుకు వచ్చిన పరుపును చుట్టుకుని దేవునికి స్తుతులర్పిస్తూ ఇంటికి వెళ్ళాడు.
\v 26 అక్కడి వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. యేసు చేసినది చూసి నివ్వెరపోతూ దేవుణ్ణి స్తుతించారు. "ఈ రోజు నమ్మశక్యం గానీ విషయాలు చూశాము గదా!" అనుకున్నారు.
\s5
\p
\v 27 అప్పుడు యేసు అక్కడినుండి బయలుదేరి రోమా ప్రభుత్వం తరుపున పన్ను వసూలు చేసే లేవి అనే వ్యక్తిని చూసాడు. పౌరులు ప్రభుత్వం విధించిన పన్నులు కట్టే చోట అతడు కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నాతో రా. నా శిష్యుడిగా ఉండు" అన్నాడు.
\v 28 కాబట్టి లేవీ తన ఉద్యోగం వదిలేసి యేసుతో వెళ్ళాడు.
\s5
\p
\v 29 తరువాత లేవి తనకు తానుగా యేసుకు, ఆయన శిష్యులకు విందు ఏర్పాటు చేసాడు. అక్కడ చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, మరికొంతమంది కలిసి భోజనం చేస్తున్నారు.
\v 30 పరిసయ్యుల శాఖకు చెందిన కొందరు ధర్మశాస్త్ర పండితులు యేసు శిష్యులతో "ఘోర పాపులతో, పన్ను వసూలు చేసే వాళ్ళతో, మీరు భోజనం చేస్తున్నారేంటి" అన్నారు.
\v 31 అప్పుడు యేసు వాళ్ళతో, "వైద్యుడి అవసరం రోగులకు మాత్రమే తెలుసు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు తెలీదు.
\v 32 అలాగే నేను వచ్చింది మేము నీతిపరులం అనుకోనే వాళ్ళ కోసం కాదు. మేము పాపులం అనుకునే వాళ్ళను పరివర్తనం చెంది నా దగ్గరకు రమ్మని ఆహ్వానించడానికే వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 33 ఆ యూదీయ నాయకులు యేసుతో, "బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారు. పరిసయ్యుల శిష్యులూ అంతే. కాని, నీ శిష్యులు తింటూ, తాగుతూ ఉంటారు. ఇతరుల్లాగా ఉపవాసం ఉండరు. ఎందుకు?" అని ప్రశ్నించారు.
\v 34 యేసు, "పెళ్లికొడుకుతో ఉన్న స్నేహితులకు ఉపవాసం చేయమని మీరు చెప్పరు కదా.
\v 35 ఒక రోజున పెళ్ళికొడుకు తన స్నేహితుల దగ్గర నుండి వెళ్ళిపోయే తరుణం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు" అని జవాబు చెప్పాడు.
\s5
\p
\v 36 తన ఉద్దేశం వారికి వంటబట్టేలా చెయ్యడానికి యేసు ఇంకొక ఉదాహరణ చెప్పాడు. "పాత గుడ్డకి కొత్తగుడ్డ మాసిక వెయ్యరు. అలా చేస్తే కొత్త గుడ్డ చినిగిపోతుంది. పాత గుడ్డ కొత్తగుడ్డకు అతకదు.
\s5
\v 37 మరొకటి. కొత్త ద్రాక్షరసం పాత తోలు సంచుల్లో నిలవ చెయ్యరు. అలా చేస్తే తిత్తులు చినిగి పోతాయి. ఎందుకంటే కొత్త ద్రాక్షారసం పులిసినప్పుడు చర్మం సాగాలి. పాత చర్మం సాగదు గనక పాత సంచి అయితే పిగిలి పోతుంది. రసం కూడా నేలపాలవుతుంది.
\v 38 అందువల్ల కొత్త ద్రాక్షరసం కొత్త సంచుల్లోనే పొయ్యాలి."
\p
\v 39 "పాత ద్రాక్షరసం తాగిన తరువాత కొత్తదాన్ని ఎవరూ ఇష్టపడరు. పాతదే బాగుందని అంటారు."
\s5
\c 6
\p
\v 1 ఒక విశ్రాంతి రోజున యేసు, ఆయన శిష్యులు పంట చేలలో నడిచి వెళ్తూండగా శిష్యులు కొన్ని కంకులు తెంపి, ధాన్యం గింజలు చేతులతో నలిపి పొట్టు తీసి నోట్లో వేసుకుంటున్నారు.
\v 2 ఇది గమనించిన పరిసయ్యులు, "మీరు ఇలా చేయకూడదు. విశ్రాంతి రోజున పని చేయకూడదని మన ధర్మశాస్త్రం చెప్పింది కదా" అన్నారు.
\s5
\v 3 ఆ పరిసయ్యులకు యేసు జవాబిస్తూ, "రాజు కాకముందు దావీదుకు, అతని మనుషులకు ఆకలేసినపుడు ఏమి చేసారో మీరు లేఖనాలలో చూడలేదా.
\v 4 దావీదు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి తినడానికి ఏమైనా కావాలని అడిగాడు. యాజకుడు దేవుని సన్నిధిలో పెట్టి ఉంచిన నైవేద్యం రొట్టెలు వాళ్ళకిచ్చాడు. ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తినాలని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. దావీదు, అతని మనుషులు యాజకులు కాకపోయినా దావీదు కొంత తిని, తన మనుషులకు ఇచ్చాడు. ఇది మీకు తెలుసు కదా.
\v 5 అలాగే విశ్రాంతి రోజున ఏమి చెయ్యాలో నిర్దేశించే అధికారం మనుష్యకుమారుడికి ఉంది."
\s5
\p
\v 6 ఇంకొక విశ్రాంతి రోజున సమాజమందిరంలో యేసు బోధ చేస్తూ ఉండగా కుడి చెయ్యి చచ్చుబడిపోయిన మనిషి అక్కడ ఉన్నాడు.
\v 7 ధర్మశాస్త్ర పండితులు, అక్కడ ఉన్న పరిసయ్యులు యేసును గమనిస్తున్నారు. ఆయన ఎవరినైనా స్వస్థపరిస్తే చూసి, విశ్రాంతి రోజున పని చేసినందుకు, వాళ్ళ నియమాలు మీరినందుకు తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
\v 8 వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసుకు తెలుసు. ఆయన అవిటి చెయ్యి ఉన్న వాణ్ణి చూసి, "ఇటు వచ్చి అందరి ఎదుటా నిలబడు" అని చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళి నిలబడ్డాడు.
\s5
\v 9 అప్పుడు యేసు, "ప్రజలకు మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు విశ్రాంతి రోజున మేలు చేయడానికా, లేక కీడు చేయడానికా? విశ్రాంతి రోజు ఉన్నది ప్రాణాన్ని రక్షించడానికా, లేక ప్రాణం తియ్యడానికా? అని మిమ్మల్ని అడుగుతున్నాను" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 10 ఎవరూ జవాబు ఇవ్వలేదు. యేసు ఒకసారి అందరినీ చూసి, ఆ మనిషితో, "నీ చచ్చుబడిన చెయ్యి చాపు" అన్నాడు. ఆ వ్యక్తి చాపగానే అతని చెయ్యి పూర్తిగా బాగుపడింది.
\v 11 కాని మత నాయకులు వెర్రి కోపంతో నిండిపోయి, యేసును వదిలించుకోడానికి ఏమి చెయ్యాలబ్బా అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
\s5
\p
\v 12 కొంత కాలమయ్యాక ఒక రోజు యేసు ప్రార్థన చేసుకోడానికి కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఆ రాత్రంతా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
\p
\v 13 తరువాత రోజు ఆయన తన శిష్యులందరినీ పిలిచి, వాళ్ళలో పన్నెండు మందిని ఎంపికచేసి, వాళ్ళకి అపోస్తలులు అని పేరు పెట్టాడు.
\s5
\v 14 వాళ్ళు ఎవరంటే సీమోను- ఇతనికి యేసు పెట్టిన కొత్త పేరు పేతురు, అంద్రెయ- పేతురు తమ్ముడు, యాకోబు, అతని తమ్ముడు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి,
\v 15 మత్తయి- ఇతని ఇంకొక పేరు లేవీ, తోమా, ఇంకొక యాకోబు- ఇతను అల్ఫయి కొడుకు, సీమోను - ఇతను దేశ భక్తుల వర్గం వాడు,
\v 16 యూదా- ఇతని తండ్రి పేరు కూడా యాకోబే, ఇస్కరియోతు యూదా- యేసుకు నమ్మక ద్రోహం చేసినవాడు.
\s5
\p
\v 17 కొండపై నుండి యేసు తన శిష్యులతో కలసి దిగి వచ్చి మైదానంలో నిలబడ్డాడు. అక్కడ ఆయన శిష్యుల గుంపు ఉంది. యెరూషలేము నుండి చాలా మంది జనం అక్కడికి వచ్చారు. యూదయలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తూరు సీదోను పట్టణ ప్రాంతాల నుండి జనం కూడా వచ్చారు.
\v 18 వారంతా యేసు బోధ వినడానికి వచ్చారు. వాళ్ళ రోగాలను ఆయన స్వస్థపరిచాడు. దయ్యాల పీడ కింద ఉన్న వాళ్ళను కూడా ఆయన బాగు చేసాడు.
\v 19 జన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను ముట్టుకోవాలని తహతహలాడుతున్నారు. ఆయన తన ప్రభావంతో ప్రతి ఒక్కరినీ బాగుచేసాడు.
\s5
\p
\v 20 తరువాత ఆయన తన శిష్యులను చూసి,
\q1 "పేదలుగా ఉండడం మంచిది, దేవుడే మిమ్మల్ని ఏలుతున్నాడు.
\q1
\v 21 మీరు ఆకలిగా ఉండడం మంచిది, దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు.
\q1 మీరు దుఃఖించడం మంచిది, ఒక రోజున దేవుడు మీకు ఆనందాన్నిచ్చి నవ్వు పుట్టిస్తాడు.
\s5
\q1
\v 22 ఇతరులు మిమ్మల్ని తృణీకరించి, ద్వేషిస్తే మీకు మంచిది.
\q1 మనుష్య కుమారుణ్ణి మీరు వెంబడించిన కారణంగా మిమ్మల్ని వాళ్ళు చులకన చేసి, మిమ్మల్ని చెడ్డవాళ్ళు అంటారు.
\q1
\v 23 అలా జరిగితే సంతోషించండి. ఆనందంతో చిందులు వెయ్యండి.
\q1 దేవుడు గొప్ప ప్రతిఫలం పరలోకంలో మీకిస్తాడు. పూర్వం ప్రవక్తల పట్ల వాళ్ళ పితరులు కూడా అలానే చేశారని మర్చిపోవద్దు."
\s5
\p
\v 24 "అయ్యో ధనికులారా, మీకు విచారమే. మీ ధనం ఇప్పటికే మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చేసింది.
\v 25 అయ్యో, నాకు కావలసినదంతా ఉందని ఎవరన్నా అనుకుంటే అతనికి యాతన. ఇవి మీకు తృప్తి ఇవ్వవని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు సంతోషంగా ఉండే మీరు రేపు ఏడుస్తారు.
\s5
\p
\v 26 ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగుడుతుంటే మీకు వేదనే. దేవుని ప్రవక్తలని చెప్పుకొనే అబద్ధ ప్రవక్తలను మీ పితరులు కూడా అలాగే పొగిడారు.
\s5
\v 27 కానీ నేను చెప్పేది వినే ప్రతి ఒక్కరూ మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు మేలు చేయండి.
\v 28 మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించమని దేవుని అడగండి. మిమ్మల్ని బాధించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి."
\s5
\p
\v 29 "నిన్ను చెంపదెబ్బ కొట్టేవాడికి రెండవ చెంప చూపించు. ఎవరైనా నీ కోటు లాక్కుపోతూ నీ చొక్కా కూడా కావాలంటే అది కూడా ఇచ్చెయ్యి.
\v 30 ఎవరు ఏమి అడిగితే అది ఇచ్చెయ్యి. నీ వస్తువులు ఇమ్మని ఎవరైనా అడిగితే తిరిగి ఇమ్మని అడగవద్దు."
\s5
\p
\v 31 "ఇతరులు నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటావో అలాగే వాళ్ళకి నువ్వు చెయ్యాలి.
\v 32 మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకోవద్దు. పాపులు కూడా తమను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు కదా!
\v 33 మీకు మంచి చేసే వాళ్ళకే మంచి చేస్తే దేవుని దగ్గరనుండి మెప్పు కోరుకోవద్దు. పాపులు కూడా అదే చేస్తారు.
\v 34 తిరిగి వెనక్కి ఇచ్చేవాళ్ళకే మీరు అప్పుగాని, ఆస్తిగాని ఇస్తే దేవుని మెప్పు కోరవద్దు. పాపులు కూడా అప్పిస్తారు, తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు."
\s5
\p
\v 35 "మీరు శత్రువులను ప్రేమించండి. వాళ్ళకి మంచి చేయండి. అప్పిచ్చి తిరిగి చెల్లించాలని ఆశించవద్దు. అప్పుడు దేవుడు మీకు మంచి ఫలితం ఇస్తాడు. మీరు మహోన్నతుడైన దేవుని పిల్లలు. ఆయన కృతజ్ఞతలేని వాళ్ళ మీద, చెడ్డవాళ్ళమీద తన దయ చూపిస్తున్నాడు.
\v 36 కాబట్టి మీ పరలోకపు తండ్రి అందరిపై కరుణ చూపుతున్నట్టు, మీరు తరుల పట్ల కరుణ చూపించాలి."
\s5
\p
\v 37 "ఇతరుల్ని కఠినంగా విమర్శించవద్దు. అప్పుడు దేవుడు నిన్ను కఠినంగా విమర్శించడు. ఇతరుల్ని నిందించొద్దు. చెడు చేసే వాళ్ళని క్షమించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు.
\s5
\v 38 ఇతరులకు మంచివి ఇవ్వండి. అప్పుడు దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు. ఎలానంటే ధాన్యం బుట్టలో అదిమి, కుదించి, అది పూర్తిగా నిండి, పక్కలకు జాలువారేటంతగానన్నమాట. గుర్తుంచుకోండి. మీరు ఇతరులను ఏ స్థాయిలో చూస్తారో, సంతోషపెడతారో అదే స్థాయిలో దేవుడు మిమ్మల్ని చూస్తాడు, సంతోషపెడతాడు."
\s5
\p
\v 39 ఆయన తన శిష్యులకు ఈ పోలిక చెప్పాడు. "గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అలా చేస్తే ఇద్దరూ గుంటలో పడతారు.
\v 40 గురువు కంటే శిష్యుడు గొప్ప కాదు. కాని పూర్తి శిక్షణ పొందాక అతడు తన గురువులా అవుతాడు. కాబట్టి మీరు నాలాగా అవ్వాలి."
\s5
\p
\v 41 "ఇతరులు చేసిన తప్పిదాలను పట్టించుకోవద్దు. అది చేస్తే నీ కంట్లో కొయ్య దుంగను ఉంచుకుని కూడా పట్టించుకోకుండా ఎదుటివాడి కంట్లో నలకను ఎత్తి చూపుతున్నట్టు.
\v 42 నువ్వు నీ కంట్లోని కొయ్య దుంగను చూసుకోకుండా వేరే వాడితో "మిత్రమా, నీ కంట్లో ఉన్న నలక తీసేస్తాను రా" అనకూడదు. అలా చేస్తే నువ్వు కపటివి. మొదట నువ్వు పాపాలు చెయ్యడం మానాలి. అది నీ కంట్లో కొయ్య దుంగను తీసివెయ్యడం లాంటిది. అలా చెయ్యగలిగితే ఆత్మ సంబంధమైన అంతర దృష్టి నీకు ఉంటుంది. అప్పుడు ఇతరుల కంట్లో నలక పోయేలా సాయం చేయగలవు."
\s5
\p
\v 43 "మంచి చెట్టు పనికిరాని కాయలివ్వదు, పనికిమాలిన చెట్టు మంచి కాయలివ్వదు అని అందరికీ తెలుసు.
\v 44 చెట్టు కాయను చూసి చెట్టు ఎలాంటిదో ఎవరైనా చెప్పగలరు. ఉదాహరణకు ముళ్ళ పొదలో అంజూరు కాయల కోసం ఎవరూ చూడరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోసుకోవాలని చూడరు.
\s5
\v 45 మంచివాళ్ళు మంచి పనులు చేస్తారు. అవి వాళ్ళ మంచి ఆలోచనా పద్ధతిని తెలుపుతాయి. చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. అవి వాళ్ళ చెడు ఆలోచనా పద్ధతిని తెలుపుతాయి. మనుషుల ఆలోచనలే వాళ్ళ ప్రవర్తన, మాటతీరును తెలుపుతాయి."
\s5
\p
\v 46 యేసు ప్రజలతో, "నా మాటకు లోబడి, నేను చెప్పింది చేయకుండా నన్నెందుకు "ప్రభూ, ప్రభూ" అని పిలుస్తున్నారు?
\v 47 నా ఉపదేశం విని విధేయత చూపుతూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు
\v 48 ఇల్లు కట్టడానికి రాతి చట్టు మీద లోతైన పునాది వేసుకునే వాళ్ళు. అప్పుడు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఇంటిని కదల్చ లేవు. ఎందుకంటే అతడు రాతి మీద పునాది వేసాడు.
\s5
\v 49 కానీ నా బోధలు విని నా మాటలకు లోబడకుండా ఉంటే, వాళ్ళు పునాది వేయకుండా ఇల్లు కట్టేవాళ్ళతో సమానం. వరదలు వచ్చి, నది పొంగినప్పుడు ఇల్లు కుప్పగూలి ధ్వంసమై పోతుంది."
\s5
\c 7
\p
\v 1 యేసు ప్రజలతో మాట్లాడడం పూర్తయ్యాక కపెర్నహోం వెళ్ళాడు.
\s5
\v 2 ఆ ఊరిలో రోమా సైన్యంలో వందమంది సైనికులపై అధికారి అయిన సేనానికి ఇష్టమైన పనివాడు ఒకడున్నాడు. ఆ పనివాడు చాలా జబ్బుపడి, చనిపోయేలా ఉన్నాడు.
\v 3 శతాధిపతి యేసు గురించి విని యూదీయ పెద్దలను ఆయన దగ్గరకు పంపి "అయ్యా, వచ్చి నా పనివాణ్ణి స్వస్థపరచండి" అని అడిగించాడు.
\p
\v 4 వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి శతాధిపతి పనివాణ్ణి బాగు చెయ్యమని బతిమాలారు. వాళ్ళు యేసుతో, "నీ నుండి ఈ సాయం పొందడానికి అతడు అర్హుడు.
\v 5 మన ప్రజల్ని అతడు బాగా చూసుకుంటాడు. మన కోసం సమాజమందిరాలను కట్టించాడు కూడా" అని చెప్పారు.
\s5
\v 6 కాబట్టి యేసు వాళ్ళతో ఆ అధిపతి ఇంటికి బయలుదేరాడు. అతని ఇంటికి అల్లంత ఉండగా ఆ అధికారి మళ్ళీ కొందరిని యేసు దగ్గరకు పంపి, "ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోకు. నువ్వు నా ఇంటికి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.
\v 7 అందుకే నాకు నేనుగా నీ దగ్గరికి రాలేకపోయాను. కాని నువ్వు ఒక్క మాట చెప్పు. నా పనివాడు బాగవుతాడు.
\v 8 నాకు ఈ సాయం చేస్తావని నాకు తెలుసు. నేను కూడా అధికారుల ఆజ్ఞలకు లోబడేవాడినే. నా ఆజ్ఞకు లోబడే సైనికులూ నాకున్నారు. నేను వాళ్ళతో "వెళ్ళు" అంటే వెళ్తారు, "రా" అంటే వస్తారు. నా పనివాణ్ణి "ఇది చెయ్యి" అంటే చేస్తాడు" అని కబురు పంపాడు.
\s5
\p
\v 9 ఆ అధిపతి చెప్పింది యేసు విని ఆశ్చర్యపోయాడు. జనసమూహం వైపు తిరిగి, "మీకు చెబుతున్నాను, ఈ యూదేతరుడిలో కనిపించిన విశ్వాసం ఇశ్రాయేలీయులలో సైతం నేను చూడలేదు సుమా" అన్నాడు.
\v 10 శతాధిపతి దగ్గర నుండి వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి పోయి ఆ పనివాడు ఆరోగ్యంగా ఉండడం చూసారు.
\s5
\p
\v 11 దీని తరువాత వెంటనే యేసు నాయీను అనే గ్రామానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, పెద్ద జన సమూహం ఆయనతో వెళ్లారు.
\v 12 ఆ ఊరి పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడు, పెద్ద గుంపు ఆ ఊరిలోనుండి బయటికి వస్తున్నది. వాళ్ళు అప్పుడే చనిపోయిన మనిషిని మోసుకొస్తున్నారు. చనిపోయిన వాడి తల్లి విధవరాలు. ఆమెకు అతడు ఒక్కడే కొడుకు. ఆమె ఆ గుంపులో ఉంది. వాళ్ళు శవాన్ని పాతిపెట్టడానికి వెళ్తున్నారు.
\v 13 ప్రభువు ఆమెను చూసి కనికరపడి ఆమెతో, "ఏడవ్వద్దమ్మా" అన్నాడు.
\v 14 ఆయన వాళ్ళకి దగ్గరగా వచ్చి శవాన్ని పడుకోబెట్టిన పాడెను ముట్టుకున్నాడు. పాడెను మోసుకుపోతున్న వాళ్ళు ఆగారు. ఆయన, "అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే" అన్నాడు.
\v 15 ఆ కుర్రవాడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసు అతనిని తల్లికి అప్పగించాడు.
\s5
\v 16 అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుని స్తుతిస్తూ ఒకరికొకరు "ఆ గొప్ప ప్రవక్త మన మధ్య వెలిశాడు. తన ప్రజలను కాపాడడం కోసం దేవుడు వచ్చాడు!" అనీ చెప్పుకున్నారు.
\v 17 ఈ వార్త యూదయ ప్రాంతమంతా, దగ్గరలోని ఇతర ప్రాంతాలన్నిటికీ దావానలంలా పాకిపోయింది.
\s5
\p
\v 18 బాప్తిసమిచ్చే యోహానుతో అతని శిష్యులు ఈ విషయాలన్నీ చెప్పారు.
\v 19 అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని "మీరు వెళ్ళి దేవుడు వాగ్దానం చేసినట్టు రావలసిన వాడివి నువ్వేనా, లేక మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? అని ప్రభువును అడిగి తెలుసుకోండి" అని చెప్పి పంపాడు.
\v 20 ఆ ఇద్దరు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, "బాప్తిసమిచ్చే యోహాను మమ్మల్ని పంపాడు. దేవుడు వాగ్దానం చేసింది నీ గురించేనా, లేక వేరొకరి కోసం మేము ఎదురు చూడాలా?" అని అడిగారు.
\s5
\p
\v 21 సరిగ్గా అదే సమయంలో యేసు అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
\v 22 ఆ ఇద్దరికీ ఆయన జవాబిస్తూ, "తిరిగి వెళ్ళి మీరు చూసినవీ విన్నవీ యోహానుతో చెప్పండి. గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. కుంటివాళ్ళు నడుస్తున్నారు. కుష్ట రోగులు బాగుపడుతున్నారు. చెవిటివారు వింటున్నారు. చనిపోయినవాళ్ళు బతుకుతున్నారు. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతున్నది.
\v 23 నేను చేసేది చూసేవాళ్ళని దేవుడు దీవిస్తాడు. నేను చెప్పేది వినేవాళ్ళు నా నుండి వెళ్ళిపోరు" అన్నాడు.
\s5
\p
\v 24 యోహాను శిష్యులు వెళ్ళిపోయాక యోహాను గురించి జనంతో యేసు మాట్లాడడం ప్రారంభించాడు. "ఏమి చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగుతూ ఉండే గడ్డిపోచనా?
\v 25 లేక పోతే ఏమి చూడడానికి వెళ్ళారు? సుతారమైన బట్టలు వేసుకున్నవాడినా? చూడండి, విలువైన బట్టలు వేసుకొనేవాళ్ళు, సుఖ భోగాలు అనుభవించే వాళ్ళు రాజ భవనాల్లో ఉంటారు.
\v 26 మరి అక్కడికి దేన్ని చూడడానికి వెళ్లారు? ప్రవక్తనా? ఔను. ఆ మాటకొస్తే సాధారణ ప్రవక్త కంటే యోహాను గొప్పవాడు.
\s5
\v 27 చాలా కాలం క్రితం ప్రవక్తలు అతని గురించి-
\q1 "చూడు, నీకు ముందుగా నేను నా దూతను పంపుతున్నాను.
\q1 నీ రాక కోసం ప్రజలను అతడు సిద్ధం చేస్తాడు" అని రాశారు.
\p
\v 28 "ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు లేదు. అయినప్పటికీ దేవునితో జీవిస్తూ, ఆయనతోనే ఉండే అల్పుడు సైతం యోహాను కంటే గొప్పవాడు" అన్నాడు.
\s5
\p
\v 29 యోహాను చేత బాప్తిసం పొందిన వాళ్ళందరూ పన్ను వసూలు చేసేవాళ్ళతో సహా, యేసు చెప్పింది విన్నారు. బాప్తిసం పొందడం ద్వారా దేవుడు న్యాయ వంతుడని వాళ్ళు అంగీకరించారు.
\v 30 కాని పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యోహాను చేత బాప్తిసం పొందలేదు. తమ విషయంలో దేవుని చిత్తాన్ని తిరస్కరించారు.
\s5
\p
\v 31 యేసు ఇంకా మాట్లాడుతూ "ఈ కాలం మనుషులు ఎలా ఉన్నారో చెప్పమంటారా, చూడండి.
\v 32 వాళ్ళు మైదానంలో ఆడుకొనే చిన్న పిల్లల్లా ఉన్నారు. ఒకరినొకరు పిలుచుకుంటూ, "మేము వేణువు ఊది సంగీతం వినిపించాం, మీరు నాట్యం చెయ్యలేదు. ఏడుపు పాట పాడాము, మీరేమీ ఏడవలేదు" అంటున్నారు.
\s5
\v 33 అలానే యోహాను మీ దగ్గరికి వచ్చాడు. అతడు అందరూ తినేవి తినలేదు, ద్రాక్షరసం తాగలేదు. మీరు అతణ్ణి తిరస్కరించి "దయ్యం పట్టినవాడు" అన్నారు.
\v 34 మనుష్య కుమారుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇతరులు తినే మామూలు ఆహారం తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు. మీరు ఆయన్ని కూడా తిరస్కరించి, "చూడండి, ఇతడు తిండిపోతు, తాగుబోతు. పన్ను వసూలుదార్లతో, పాపులతో కలిసిమెలిసి ఉంటాడు" అంటున్నారు.
\v 35 అయితే దేవుని నిజమైన పిల్లలు మాత్రం యోహాను, నేను చేసేవి జ్ఞానపూరిత విషయాలని గ్రహిస్తారు."
\s5
\p
\v 36 ఒకరోజు సీమోను అనే పరిసయ్యుడు యేసును భోజనానికి పిలిచాడు. యేసు అతని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
\v 37 అదే ఊళ్ళో అందరికీ తెలిసిన వేశ్య ఒకామె ఉంది. పరిసయ్యుడి ఇంటికి యేసు భోజనానికి వస్తాడని తెలిసి, ఆమె పాలరాతి బుడ్డిలో అత్తరు తీసుకొని అక్కడికి వెళ్ళింది.
\p
\v 38 యేసు భోజనం చెయ్యబోతుండగా ఆమె యేసు పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు జలజలా యేసు పాదాలపై పడ్డాయి. ఆమె తన జుట్టుతో యేసు పాదాలు తుడుస్తూనే ఉంది. యేసు పాదాలు ముద్దు పెట్టుకుంటూ తాను తెచ్చిన అత్తరు ఆయన పాదాలపై ఒలకబోసింది.
\s5
\p
\v 39 యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు ఆమె చేసింది చూసి, "ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుకున్న ఈ కులట ఎవరో, ఎలాంటిదో తెలుస్తుంది గదా" అనుకున్నాడు.
\p
\v 40 యేసు అతనితో, "సీమోనూ! నేను నీకు చెప్పాల్సింది ఒకటుంది" అన్నాడు. అతడు, "బోధకా ఏమిటది?" అని అడిగాడు.
\s5
\v 41 యేసు అతనికి ఒక కథ చెప్తూ, "వడ్డీ వ్యాపారి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు ఐదొందలు వెండి నాణాలు, ఇంకొకడు యాభై వెండి నాణాలు బాకీ ఉన్నారు.
\v 42 అప్పు తీర్చడం వాళ్ళవల్ల కాలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇద్దరికీ రుణ మాఫీ చేశాడు. కాబట్టి వాళ్ళల్లో ఎవరికి అతడంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది?" అని అడిగాడు.
\v 43 సీమోను "ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్న వాడే అనుకుంటా" అన్నాడు. అప్పుడు యేసు, "నువ్వు సరిగ్గా చెప్పావు" అని,
\s5
\p
\v 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, "ఈమె ఏమి చేసిందో ఒకసారి ఆలోచించు. నేను నీ ఇంట్లో అడుగు పెట్టగానే సాధారణంగా అతిధులను ఆహ్వానించే వాళ్ళు ఏమి చేస్తారో అది నువ్వు చేయలేదు. కాళ్ళకు నీళ్ళియ్యలేదు. కాని, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తన జుట్టుతో తుడిచింది.
\v 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు. కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
\s5
\v 46 నువ్వు నా తలకు ఒలీవ నూనె రాయలేదు. కాని ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.
\v 47 కాబట్టి నేను చెబుతున్నాను చూడు. ఆమె చేసిన చాలా ఎక్కువ పాపాలకు క్షమాపణ కలిగింది. అందుకే ఆమె ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నది. కాని తాను తక్కువ పాపాలు చేశాననీ వాటికి క్షమాపణ వచ్చిందనీ భావించే వాడు నన్ను తక్కువగానే ప్రేమిస్తాడు."
\s5
\v 48 తరువాత ఆయన ఆమెతో, "నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అని చెప్పాడు.
\p
\v 49 ఆయనతో భోజనానికి కూర్చున్న వాళ్ళు తమలో తాము, "పాపాలు క్షమించడానికి ఇతనెవరు?" అనుకున్నారు.
\v 50 కాని యేసు ఆ స్త్రీతో, "నువ్వు నాపై విశ్వాసముంచడం వలన దేవుడు నిన్ను రక్షించాడు. ఇక వెళ్ళు. దేవుడు నీకు శాంతిని ప్రసాదిస్తాడు" అన్నాడు.
\s5
\c 8
\p
\v 1 ఆ తరువాత ఆయన పన్నెండు మంది శిష్యులతో కలిసి వివిధ పట్టణాలకు, గ్రామాలకు తిరిగాడు.
\v 2 ఆయన స్వస్థపరచిన, దురాత్మల బారి నుండి విడిపించిన చాలా మంది ఆడవాళ్లు ఆయనతో ప్రయాణం చేశారు. వీళ్ళల్లో మగ్దల గ్రామంలో ఏడు దయ్యాల నుండి విడుదల పొందిన మరియ,
\v 3 హేరోదు రాజు అంతిప దగ్గర నిర్వాహకుడుగా పనిచేసే కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా, ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళు యేసుకూ ఆయన శిష్యులకూ సహకారంగా ఉంటూ తమ సొంత డబ్బుతో వారి అవసరాలు చూసుకునే వాళ్ళు. కొన్ని నిధులు అందించేవాళ్ళు.
\s5
\p
\v 4 యేసును చూడడానికి చాలా పల్లెల నుండి వచ్చిన వాళ్ళు ఒక రోజు పెద్ద జన సమూహంగా సమకూడారు. అప్పుడు ఆయన వాళ్లకు ఈ కథ చెప్పాడు.
\v 5 "ఒక మనిషి విత్తనాలు చల్లడానికి తన పొలానికి వెళ్ళాడు. అతడు చల్లుతుండగా కొన్ని మనుషులు నడిచే దారిలో పడ్డాయి. అప్పుడు వాటిలో కొన్నిటిని మనుషులు తొక్కేస్తే, కొన్నిటిని పక్షులు తినేశాయి.
\v 6 కొన్ని విత్తనాలు మట్టి తక్కువ ఉన్న రాతి నేల మీద పడ్డాయి. ఆ విత్తనాలు మొలకెత్తగానే ఆ నేలలో తేమ లేక ఆ మొక్కలు ఎండిపోయాయి.
\s5
\v 7 కొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కలు ఉన్న నేలపై పడ్డాయి. చల్లిన విత్తనాలతోబాటు ఆ ముళ్ళ మొక్కలు కలసి పెరిగి వాటిని అణచి వేయడంతో అవి పెరగలేదు."
\p
\v 8 కాని చల్లిన కొన్ని విత్తనాలు సారవంతమైన నేల మీద పడి చక్కగా పెరిగి, నూరంతల పంట పండాయి. ఈ విషయాలు చెప్పాక, యేసు వాళ్ళందరితో, "మీలో ప్రతి ఒక్కరూ నేను చెప్పినది జాగ్రత్తగా ఆలోచించాలి" అన్నాడు.
\s5
\v 9 అప్పుడు యేసు శిష్యులు ఆ కథ భావం చెప్పమని అడిగారు.
\p
\v 10 అందుకు ఆయన, "దేవుడు రాజుగా ఎలా ఏలుతాడో తెలుసుకునే భాగ్యం మీకు దొరికింది. కాని నేను అందరితో ఉపమాన పద్ధతిలోనే మాట్లాడతాను కాబట్టి"
\q "వాళ్ళు చూసినా గానీ నిజంగా చూడలేరు.
\q విన్నా గానీ వాళ్ళకి అర్థం కాదు."
\s5
\p
\v 11 ఈ కథ అర్థం ఏమిటంటే, విత్తనాలు దేవుని వాక్యానికి సూచన.
\v 12 దేవుని వాక్యం మనుషులు వింటారు గానీ సాతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో నుంచీ, వాళ్ళ మనస్సుల్లో నుంచీ దేవుని వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఫలితంగా వాళ్ళు వాక్యాన్ని నమ్మరు, రక్షణ పొందరు. దారిలో పడిన విత్తనాలు తెలిపే సంగతి ఇదే.
\v 13 కొందరు దేవుని వాక్యాన్ని సంతోషంగా విని అంగీకరిస్తారు గానీ వాళ్ళకి లోతైన వేర్లు ఉండవు. ఫలితంగా కొంత కాలం మాత్రమే నమ్ముతారు. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మడం మానేస్తారు. ఇది రాతి నేల మీద పడిన విత్తనాల విషయం.
\s5
\v 14 కొందరు దేవుని వాక్యం వింటారు గానీ వాళ్ళ జీవితంలో ధనవ్యామోహం ప్రాపంచిక చింతలకు సంబంధించిన కలతలు దేవుని వాక్యాన్ని వాళ్ళలో నిలవనివ్వవు. ఫలితంగా వాళ్ళు ఆత్మీయంగా ఎదగ లేరు. ఇది ముళ్ళ మొక్కల మధ్య ఎదిగిన విత్తనాలకు సూచన.
\p
\v 15 దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని ఘనమైనదిగా ఎంచి సరైన హృదయంతో అంగీకరించి, దేవుని వాక్యానికి లోబడి నిలకడైన నమ్మకం కలిగిన మనుషులు మంచి ఆత్మ ఫలాన్ని అందిస్తారు. ఇది సారవంతమైన నేలపై పడిన విత్తనాల్ని సూచిస్తుంది.
\s5
\p
\v 16 ఎవరూ దీపం వెలిగించి బుట్టతో కప్పిపెట్టరు. మంచం కింద పెట్టరు. ఇంట్లోకి వచ్చేవాళ్ళకి వెలుగిచ్చేలా దీపస్థంభం మీద ఉంచుతారు.
\v 17 దీన్ని బట్టి ఒకానొక రోజు దాచిపెట్టిన ప్రతిదీ బయటపడుతుంది. రహస్యంగా ఉంచిన ప్రతిదీ బట్టబయలు అవుతుంది.
\v 18 కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా, స్పష్టంగా వినాలి. తన సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి దేవుడు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కాని ఎవరైతే వాళ్ళకి అర్ధమైన కొద్ది విషయాన్ని నమ్మలేకపోతారో ఉన్నది కూడా వాళ్ళ దగ్గర నుండి దేవుడు తీసేస్తాడు.
\s5
\p
\v 19 ఒకరోజు యేసు తల్లీ సోదరులూ ఆయనను చూడాలని వచ్చారు. కానీ జనం గుంపుగా ఉండడం వల్ల ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు.
\v 20 అప్పుడు, "నిన్ను చూడాలని మీ అమ్మా తమ్ముళ్ళూ వచ్చారు" అని ఎవరో ఆయనతో చెప్పారు.
\v 21 అందుకు యేసు, "దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేసే వారే నా తల్లీ, నా సోదరులూనూ" అన్నాడు.
\s5
\p
\v 22 మరొక రోజు యేసు తన శిష్యులతో "సరస్సు అవతల తీరానికి వెళ్దాం పదండి" అని చెప్పాడు. వారంతా ఒక పడవ ఎక్కారు.
\v 23 పడవలో వెళ్తుండగా, యేసు నిద్రపోయాడు. ఉన్నట్టుండి సరస్సులో భయంకరమైన గాలివాన మొదలై, పడవలోకి నీళ్ళు వచ్చేసి, చాలా ప్రమాదకరంగా మారింది.
\s5
\v 24 యేసు శిష్యులు ఆయన్ని లేపారు. వాళ్ళు ఆయనతో, "అయ్యా, అయ్యా, మేము చచ్చి పోతున్నాం" అన్నారు. అప్పుడు ఆయన లేచి గాలినీ ఉవ్వెత్తున లేచే అలలను ఆగమని ఆజ్ఞాపించాడు. అవి అణిగిపోయాయి. అంతా నెమ్మది అయ్యింది.
\v 25 అప్పుడు ఆయన వాళ్ళతో, "మీ విశ్వాసం ఇంత బలహీనంగా ఉందేమిటి?" అన్నాడు. అక్కడ జరిగినది చూసిన శిష్యులకు భయం, ఆశ్చర్యం కలిగాయి. వాళ్ళు ఒకరితో ఒకరు, "గాలినీ, నీళ్ళనూ కూడా ఆజ్ఞాపించే ఈయనెవరో గదా" అనుకున్నారు.
\s5
\p
\v 26 యేసు, ఆయన శిష్యులు పడవ ప్రయాణం కొనసాగించి, గలిలయ జిల్లా నుండి సరస్సుకు అవతలి వైపు ఉన్న గెరాసేను ప్రజలు నివసించే ప్రాంతానికి వచ్చారు.
\v 27 అప్పుడు యేసు పడవ దిగగానే ఆ ప్రాంతపు మనిషి ఒకడు ఆయనకు ఎదురయ్యాడు. ఆ మనిషికి దయ్యాలు పట్టాయి. చాలా కాలం నుండి అతడు బట్టలు వేసుకోలేదు. ఇంట్లో ఉండడం లేదు. సమాధులే అతని నివాసం.
\s5
\v 28 అతడు యేసును చూసి గట్టిగా కేకలు పెట్టాడు. ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. "మహోన్నతుడైన దైవ కుమారా యేసూ, నా జోలి నీకెందుకు? దయచేసి నన్ను హింస పెట్టొద్దు" అన్నాడు.
\p
\v 29 యేసు అతనిలోని దురాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపించినందు వల్ల అతడు అలా అన్నాడు. ఆ మనిషి చేతులకీ కాళ్ళకీ గొలుసులు వేసి కాపలా కాస్తున్నప్పటికీ చాలా సార్లు హటాత్తుగా దురాత్మ అతణ్ణి బలంగా పట్టి ఆ మనిషి గొలుసులు తెంచుకొనేవాడు. దయ్యాలు అతన్ని ఎడారి ప్రాంతాల్లోకి తీసుకెళ్ళిపోయేవి.
\s5
\p
\v 30 అప్పుడు యేసు అతన్ని, "నీ పేరేంటి?" అని అడిగాడు. అతడు "నా పేరు సైన్యం" అన్నాడు. ఎందుకంటే అతనిలో చాలా దయ్యాలు ఉన్నాయి.
\v 31 దేవుడు శిక్షించే అఖాతంలోకి తమను పంపొద్దని ఆ దయ్యాలు యేసును బతిమాలాయి.
\s5
\v 32 ఆ దగ్గరలో కొండ వాలులో పందుల మంద మేస్తున్నది. ఆ పందుల్లో దూరడానికి దయ్యాలు తమకు అనుమతి ఇమ్మని బతిమాలాయి. ఆయన అనుమతించాడు.
\v 33 ఆ భూతాలు ఆ మనిషిని వదిలి పందుల్లో దూరాయి. దాంతో ఆ పందులు గుట్టపై నుండి సరస్సు వాలులోకి వడిగా పరిగెత్తి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి.
\s5
\p
\v 34 పందులు కాసేవాళ్ళు జరిగింది చూసి పారిపోయారు. ఊర్లోకి వెళ్ళి తాము చూసినదంతా ఊరివాళ్ళకి చెప్పారు.
\v 35 అప్పుడు ఊరి జనం జరిగింది చూడడానికి వచ్చారు. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాలు వదిలిన వాడు బట్టలు వేసుకొని, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వింటూ ఉండడం చూసారు. అతడు చక్కగా మతిస్థిమితంగా ఉన్నాడు. ఊరి వాళ్ళకి భయమేసింది.
\s5
\v 36 అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళకి దయ్యాలు పట్టిన ఆ మనిషిని యేసు ఎలా స్వస్థపరిచాడో, ఏమి జరిగిందో చూసిన మనుషులు వివరించారు.
\p
\v 37 అప్పుడు గెరాసేను చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు భయపడి, యేసును అక్కడినుంచి వెళ్ళిపొమ్మని అన్నారు. యేసు, ఆయన శిష్యులు సరస్సు దాటి పోవడానికి పడవ ఎక్కారు.
\s5
\v 38 వాళ్ళు వెళ్ళే ముందు దయ్యాలు వదిలిన ఆ మనిషి "దయచేసి, నీతో నన్ను రానివ్వు" అని బతిమాలాడు. కాని యేసు,
\v 39 "లేదు, మీ ఇంటికి వెళ్ళి, నీకు దేవుడు చేసినవి ప్రజలందరికీ చెప్పు" అన్నాడు. ఆ మనిషి వెళ్ళి, ఆ ఊరంతా యేసు తనకు ఏమి చేసాడో చెప్పాడు.
\s5
\p
\v 40 తరవాత యేసు, ఆయన శిష్యులు సరస్సు దాటి కపెర్నహోం తిరిగి వెళ్ళారు. అక్కడ జన సమూహం ఆయన కోసం కనిపెడుతూ ఆయనను ఆహ్వానించారు.
\v 41 సమాజమందిరం నాయకుల్లో యాయీరు అనే పేరు గల ఒకడు యేసు దగ్గరికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి,
\v 42 చావుబతుకుల మధ్య ఉన్న తన పన్నెండేళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని బాగు చెయ్యడానికి తన ఇంటికి రమ్మని ఆయనను వేడుకున్నాడు. యేసు వెళుతుండగా చాలా మంది గుంపుగా ఆయన్ని చుట్టుముట్టారు.
\s5
\p
\v 43 ఆ గుంపులో పన్నెండేళ్ళ నుండి ఆగకుండా రక్తం స్రవించే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. వైద్యం కోసం ఆమె తన డబ్బంతా ఖర్చు చేసింది. కాని ఎవ్వరూ ఆమెని స్వస్థపరచ లేకపోయారు.
\p
\v 44 ఆమె యేసు వెనకగా వెళ్ళి ఆయన అంగీ అంచు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
\s5
\v 45 యేసు, "నన్నెవరు ముట్టుకున్నారు?" అని అడిగాడు. అందరూ ఆయన చుట్టూ ఉన్నా, వాళ్ళెవరూ తనను ముట్టుకోలేదని ఆయన ఉద్దేశం. పేతురు, "ప్రభూ నీ చుట్టూ జనం తొడతొక్కిడిగా నీ మీద పడుతున్నారు. వాళ్ళల్లో ఎవరైనా నిన్ను ముట్టుకొని ఉండొచ్చు అన్నాడు.
\v 46 కాని యేసు, "నాకు తెలుసు. కావాలని నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి నాలోనుండి ప్రభావం బయటికి వెళ్ళింది" అన్నాడు.
\s5
\p
\v 47 ఆ స్త్రీ తానిక దాగలేనని గ్రహించి, వణుకుతూ ఆయన ఎదుటికి వచ్చి, పాదాలపై పడి అందరూ వింటూ ఉండగా తాను ఆయన్ని ఎందుకు ముట్టుకుందో చెప్పి, వెంటనే తాను బాగైన సంగతి చెప్పింది.
\v 48 యేసు ఆమెతో, "అమ్మా, నేను నిన్ను బాగు చెయ్యగలనని నమ్మావు కాబట్టి బాగుపడ్డావు. నా దేవుని శాంతి నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక వెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే యాయీరు ఇంటి నుండి ఒక మనిషి వచ్చి యాయీరుతో, "మీ అమ్మాయి చనిపోయింది. కాబట్టి బోధకుణ్ణి ఇక బాధ పెట్టొద్దు" అన్నాడు.
\v 50 యేసు అది విని, "భయం లేదు. నమ్మకముంచు. ఆమె బ్రతుకుతుంది" అన్నాడు.
\s5
\v 51 ఆయన ఆ ఇంటికి చేరాక తనతో పేతురునూ, యోహానునూ, యాకోబునూ, చనిపోయిన అమ్మాయి తలిదండ్రులనూ తప్ప ఇంకెవ్వరినీ రానివ్వలేదు.
\v 52 అమ్మాయి చనిపోయిందని అక్కడి వారందరూ గట్టిగా శోకాలు పెడుతున్నారు. కాని యేసు, "ఏడవొద్దు. పాప చనిపోలేదు. నిద్రపోతోంది" అన్నాడు.
\v 53 ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్ళకి తెలుసు గనక వాళ్ళు ఆయన్ని చూసి నవ్వారు.
\s5
\v 54 యేసు ఆమె చెయ్యి పట్టుకుని, "పాపా, లే" అన్నాడు.
\v 55 వెంటనే, ఆమె ఆత్మ ఆమెలోకి వచ్చి, ఆమె లేచింది. యేసు ఆమెకి తినడానికి ఏదైనా పెట్టమని చెప్పాడు.
\v 56 ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కాని జరిగిన సంగతి ఎవరితోనూ చెప్పొద్దని యేసు వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 9
\p
\v 1 యేసు తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, వాళ్ళకి అన్ని రకాల రోగాలు స్వస్థపరచడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం, శక్తి ఇచ్చాడు.
\v 2 ఆయన వాళ్ళని స్వస్థ పరచడానికి, దేవుడు తనను రాజుగా ఎలా చూపించుకుంటాడో బోధించడానికి పంపాడు.
\s5
\p
\v 3 వాళ్ళు వెళ్ళే ముందు, "మీ ప్రయాణం కోసం ఏమీ తీసుకు వెళ్లొద్దు. చేతి కర్రగాని, సంచిగాని, డబ్బులు కాని, ఆహారం కాని, అదనంగా బట్టలు కూడా తీసుకు పోవద్దు.
\v 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆ ఇంట్లోనే ఉండండి.
\s5
\v 5 ఏ ఊరి వాళ్లైనా మిమ్మల్ని రానివ్వకపోతే మీరు అక్కడే ఉండనక్కర లేదు. ఆ ఊరు వదిలేటప్పుడు మీ పాదాల దుమ్ము దులిపేయండి. వాళ్ళు తిరస్కరించినందుకు వాళ్ళకది హెచ్చరిక."
\p
\v 6 అప్పుడు యేసు శిష్యులు బయలు దేరి చాలా గ్రామాలు పర్యటించారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటా దేవుని సువార్త చెప్పి, రోగుల్ని స్వస్థపరిచారు.
\s5
\p
\v 7 గలిలయ జిల్లాను ఏలుతున్న హేరోదు జరుగుతున్న విషయాలన్నీ విన్నాడు. కొందరు బాప్తిసమిచ్చే యోహాను మళ్ళీ బ్రతికాడని చెప్పడంతో హేరోదు కంగారుపడ్డాడు.
\v 8 కొందరు ఏలీయా ప్రవక్త మళ్ళీ వచ్చాడని, ఇంకొందరు ఆయన చాలా కాలం క్రితం వచ్చిన ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు.
\v 9 కాని హేరోదు, "అతడు యోహానై ఉండడు. అతని తల తీయించాము గదా! మరి నేను వింటున్న ఈ వ్యక్తి ఎవరు?" అనుకున్నాడు. యేసును చూసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 10 అపోస్తలులు తిరిగి వచ్చి వాళ్ళు చేసినవన్నీ యేసుకు చెప్పారు. అప్పుడు ఆయన వాళ్ళను వెంటబెట్టుకొని బేత్సయిదాకు ఏకాంతంగా వెళ్ళాడు.
\v 11 కాని యేసు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్న జనం ఆయన్ని వెంబడించారు. ఆయన వాళ్ళని ఆహ్వానించి, దేవుడు తనను రాజుగా ఎలా వెల్లడిచేసుకుంటాడో వాళ్ళతో మాట్లాడి, స్వస్థత అవసరమయ్యే వాళ్ళని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 12 ఆ రోజు బాగా ఆలస్యమైపోయింది కాబట్టి పన్నెండుమంది శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, "దయచేసి ఈ పెద్ద జనసమూహాన్ని పంపించేస్తే చుట్టుపక్కల ఉన్న పల్లెపట్టుల్లో తినడానికేమైనా చూసుకుని ఉండడానికి ఏర్పాటు వెదుక్కుంటారు. ఇది నిర్జన ప్రదేశం గదా అన్నారు.
\v 13 కాని ఆయన వాళ్ళతో, "మీరే వాళ్ళకి ఏమైనా పెట్టండి" అన్నాడు. వాళ్ళు, "మనకున్న దంతా ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే. వీళ్ళందరికీ సరిపడే ఆహారం కొని తేవడం అసాధ్యం."
\v 14 అక్కడ దాదాపు ఐదు వేలమంది పురుషులు ఉన్నారు మరి. అప్పుడు యేసు శిష్యులతో, "యాభై మంది చొప్పున గుంపులుగా అందరినీ కూర్చోమని చెప్పండి" అన్నాడు.
\s5
\v 15 శిష్యులు అలాగే చేశారు. ప్రజలు కూర్చున్నారు.
\v 16 అప్పుడు ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకున్నాడు. ఆకాశం వైపు చూసి వాటి కోసం దేవునికి కృతఙ్ఞతలు చెప్పాడు. తరువాత ముక్కలు చేసి వాటిని శిష్యులకిచ్చి పంచమన్నాడు.
\v 17 అందరూ తిన్నారు. అందరికీ సరిపడేంత అందింది. తరువాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని సేకరించారు. అవి పన్నెండు గంపలయ్యాయి.
\s5
\p
\v 18 ఒక రోజు యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళతో, "ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 19 వాళ్ళు "కొందరు బాప్తిసమిచ్చే యోహానని, కొందరు ఏలీయా ప్రవక్త అని, మిగిలిన వాళ్ళు పూర్వకాలం ప్రవక్తలలో ఒకరు తిరిగి బ్రతికాడని అంటున్నారు" అన్నారు.
\s5
\v 20 ఆయన "మరి మీరేమనుకుంటున్నారు?" అని అడిగాడు. పేతురు "నువ్వు క్రీస్తువు. దేవుని దగ్గర నుండి వచ్చావు" అన్నాడు.
\v 21 అప్పుడు యేసు ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దని వాళ్ళను గట్టిగా హెచ్చరించాడు.
\v 22 అప్పుడు ఆయన వాళ్ళతో, "మనుష్య కుమారుడినైన నేను చాలా హింసలు పొందవలసి ఉంది. పెద్దలు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు నన్ను తిరస్కరించి ఆ తరువాత నన్ను చంపుతారు. తరువాత నేను మూడో రోజున తిరిగి బ్రతుకుతాను. ఇది తప్పక జరుగుతుంది" అన్నాడు.
\s5
\p
\v 23 ఆయన వాళ్ళకి యింకా "మీలో ఎవరైనా నా శిష్యులుగా నన్ను వెంబడించాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. ప్రతి రోజూ హింస అనుభవించాలి. మీ ప్రాణాలివ్వాల్సి ఉంటుంది కూడా.
\v 24 ఎవరైతే తమ ప్రాణాలు రక్షించు కోవాలనుకుంటారో వాళ్ళు నిత్య జీవం కోల్పోతారు. నా శిష్యులుగా ఉండడం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టేవాళ్ళు నిత్యం జీవిస్తారు.
\p
\v 25 ఈ లోకంలో అంతా సంపాదించుకొని తనను తాను పోగొట్టుకుంటే, అంటే తానే నాశనం అయిపోతే ఏమి లాభం?
\s5
\v 26 ఎవరైనా నా సందేశం తిరస్కరించి, నాకు చెందిన వాడినని అంగీకరించకపోతే నేను నా మహిమతో, తండ్రి మహిమతో, దేవ దూతలతో వచ్చినప్పుడు నేను కూడా అతణ్ణి అంగీకరించను.
\v 27 ఒక వాస్తవం చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉన్నవాళ్ళు కొందరు దేవుడు తనను రాజుగా కనపరచుకునేంత వరకు బ్రతికే ఉంటారు."
\s5
\p
\v 28 యేసు ఆ మాటలు చెప్పిన ఎనిమిది రోజులకి ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటపెట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి కొండ పైకి వెళ్ళాడు.
\v 29 ఆయన ప్రార్థన చేసుకుంటూండగా ఆయన ముఖం మారిపోయింది. ఆయన బట్టలు ధగధగా కళ్ళు మిరుమిట్లుగొలిపేలా మెరిసిపోయాయి.
\s5
\v 30 అకస్మాత్తుగా, పూర్వకాలపు ప్రవక్తలు ఇద్దరు కనిపించి యేసుతో మాట్లాడారు. వాళ్ళు మోషే, ఏలీయా.
\v 31 వాళ్ళు గొప్పతేజస్సుతో కనిపించి, యెరూషలేములో నేరవేరబోయే ఆయన మరణం గురించి యేసుతో ముచ్చటిస్తున్నారు.
\s5
\v 32 పేతురు, తక్కిన శిష్యులు నిద్రమత్తులో ఉన్నారు. మెలకువ వచ్చాక వాళ్ళు యేసు తేజాన్ని చూసారు. ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా చూసారు.
\p
\v 33 మోషే ఏలీయాలు యేసుని విడిచి వెళ్తుండగా, పేతురు యేసుతో, "స్వామీ, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు, మోషేకు, ఏలీయాకు మూడు ఆశ్రమాలు కడదాం" అన్నాడు. అసలు తానేమి అంటున్నాడో తనకే తెలియదు.
\s5
\p
\v 34 ఇలా మాట్లాడుతుండగానే ఒక మేఘం వాళ్ళని కమ్ముకుంది. శిష్యులు అది చూసి భయపడ్డారు.
\v 35 మేఘంలో నుండి దేవుని దివ్యవాణి వినిపించింది. "ఈయన నేను ఎన్నుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి."
\v 36 ఆ స్వరం వినిపించిన తరువాత ఆ ముగ్గురు శిష్యులు చూస్తే యేసు మాత్రమే ఉన్నాడు. చాలాకాలం పాటు వాళ్ళు చూసింది ఎవరికీ చెప్పలేదు.
\s5
\p
\v 37 ఆ తరువాతి రోజు వాళ్ళు కొండ దిగి రాగా పెద్ద గుంపు యేసుని కలుసుకుంది.
\v 38 హటాత్తుగా ఆ గుంపులో ఒకడు, "నా కొడుకుని ఆదుకోవా. నిన్ను ప్రాధేయ పడుతున్నాను.
\v 39 ఉన్నట్టుండి ఒక దయ్యం వాణ్ణి పట్టుకుంటుంది. వెంటనే వాడు భయంకరంగా అరుస్తాడు. అది వాణ్ణి విలవిల్లాడిస్తూ, నోటివెంట నురగలు కక్కేలా చేస్తుంది. వాణ్ణి పట్టి పీడిస్తుంది. వదిలే ముందు వాణ్ణి చాలా గాయపరుస్తుంది.
\v 40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగాను గానీ వాళ్ళు చేయలేకపోయారు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 అప్పుడు యేసు, "విశ్వాసం లేనిఈ తరం వాళ్ళ ఆలోచనలన్నీ భ్రష్టమైపోయాయి. మీకు విశ్వాసం అలవడాలంటే నేనెంత కాలం మీతో ఉండాలి?" అని శిష్యులతో అన్నాడు. "నీ కొడుకుని ఇటు తీసుకురా" అని ఆ తండ్రితో చెప్పాడు.
\v 42 వాళ్ళు ఆ పిల్లవాణ్ణి తీసుకొస్తుండగా, దయ్యం వాణ్ణి కింద పడేసి భయంకరగా అల్లాడించింది. కాని యేసు ఆ దయ్యాన్ని గదిమాడు. ఆ పిల్లవాణ్ణి బాగుచేసి, ఆ తండ్రికి అప్పగించాడు.
\s5
\v 43 దేవుని ప్రభావానికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యచకితులౌతూ ఉంటే యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు.
\p
\v 44 "నేను చెప్పేది జాగ్రతగా వినండి. మనుష్య కుమారుడనైన నేను త్వరలో శత్రువుల చేతికి చిక్కబోతున్నాను."
\v 45 కాని శిష్యులు ఈ మాటలు అర్థం చేసుకోలేదు. దేవుడే వాళ్ళకి అర్థం కాకుండా చేసాడు. అందుకనే వాళ్ళు తెలుసుకోలేక పోయారు. ఆ మాట ఆయనను అడిగేందుకు భయపడ్డారు.
\s5
\p
\v 46 తరువాత తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం శిష్యుల్లో వచ్చింది.
\v 47 యేసు వాళ్ళ ఆలోచన తెలుసుకుని, ఒక చిన్న బిడ్డను తెచ్చి తన దగ్గర నిలబెట్టుకున్నాడు.
\v 48 ఆయన వాళ్ళతో, "ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరు స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరిస్తే నన్ను పంపిన దేవుడిని స్వీకరించినట్టే. మీలో ఎవరు అందరికంటే చిన్నవాడిగా ఉంటారో వాడే గొప్పవాడు."
\s5
\p
\v 49 ఒకసారి యోహాను యేసుతో, "ప్రభూ, ఎవరో నీ పేరట దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనవాడు కాదు. అందుకని అతన్ని మేము అడ్డుకున్నాం" అన్నాడు.
\v 50 అందుకు యేసు, "మీరు అతణ్ణి అడ్డుకోకండి. అతని వలన మీకు హాని లేనప్పుడు, అతడు మీకు సహాయం చేస్తున్నట్టే."
\s5
\p
\v 51 దేవుడు తనను తిరిగి పరలోకానికి తీసుకువెళ్ళే రోజు దగ్గర పడుతున్నదని యేసు గ్రహించి, యెరూషలేముకు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
\v 52 ఆయన తనకంటే ముందుగా కొంతమంది దూతలను యెరూషలేముకు పంపాడు. వాళ్ళు ఆయన వెళ్ళడానికి అంతా సిద్దం చేయడానికి సమరియ అనే ప్రాంతానికి చేరుకున్నారు.
\v 53 ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడని, సమరయులు యేసును వాళ్ళ గ్రామాల్లోకి రానివ్వలేదు.
\s5
\v 54 శిష్యులు యాకోబు, యోహానులు ఇది చూసి "ప్రభూ, ఆకాశం నుండి మంటలు కురిపించి వీళ్ళని నాశనం చేయమని దేవుడిని అడగమా" అని యేసుని అడిగారు.
\v 55 కాని యేసు వాళ్ళను కఠినంగా మందలించాడు.
\v 56 తరువాత వాళ్ళు మరో గ్రామానికి వెళ్లారు.
\s5
\p
\v 57 తరువాత యేసు ఆయన శిష్యులు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు వచ్చి "నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే వస్తాను" అన్నాడు.
\v 58 అందుకు యేసు, నక్కలకు నేలలో రంధ్రాలు ఉన్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కాని, మనుష్యకుమారుడు పడుకోవడానికి కూడా తావు లేదు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 59 ఆయన ఇంకో వ్యక్తితో, "నాతో రా" అన్నాడు. ఆ వ్యక్తి "స్వామీ, ముందు నేను వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి రావచ్చా" అన్నాడు.
\v 60 అందుకు యేసు, "చచ్చిన వాళ్ళే చచ్చిన తమ వాళ్ళని పాతిపెట్టుకుంటారులే. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని అందరికీ ప్రకటించు" అన్నాడు.
\s5
\v 61 మరొకడు వచ్చి, "ప్రభూ, నీ వెంటే వస్తాను గానీ మా ఇంట్లోని వాళ్ళని అడిగి వస్తాను" అన్నాడు.
\v 62 అందుకు యేసు, భూమి దున్నే వాడు నాగలిపై చేయి పెట్టి వెనక్కి తిరుగుతాడా? అలాటివాడు దేవుని రాజ్యానికి తగడు" అనిఅతనితో చెప్పాడు.
\s5
\c 10
\p
\v 1 ఆ తరువాత యేసు ప్రభువు ఇంకా డెబ్భై మందిని సువార్తకు పంపడానికి నియమించాడు. ఆయన ఉద్దేశం ప్రకారం నిర్ణయించిన ప్రతి ఊరికి ఇద్దరిద్దరిని పంపాడు.
\p
\v 2 వాళ్ళని పంపుతూ ఆయన "పంటకోత ఎక్కువ. పనివాళ్ళు తక్కువ. కాబట్టి పంట కోయడానికి పనివాళ్ళని పంపమని యజమానిని బతిమాలుకోండి."
\s5
\p
\v 3 "ఇక వెళ్ళండి. కానీ గుర్తుంచుకోండి. మిమ్మల్ని వద్దనుకోవాలనుకునే వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని పంపుతున్నాను. మీరు తోడేళ్ళ మధ్య గొర్రెపిల్లల్లా ఉంటారు.
\v 4 వెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెళ్ల వద్దు. ప్రయాణం సంచులు తీసుకెళ్ల వద్దు. ఇంకో చెప్పుల జత పెట్టుకోవద్దు. దారి మధ్యలో ఎవ్వరినీ కుశల ప్రశ్నలు వేయవద్దు."
\s5
\p
\v 5 "ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటివాళ్ళతో ముందుగా "ఈ ఇంట్లోవాళ్ళకి దేవుడు శాంతినిచ్చు గాక" అని చెప్పండి.
\v 6 వాళ్ళు దేవుని శాంతి కావాలనుకుంటే మీ ద్వారా ఆ శాంతిని పొందుతారు. దేవుడిచ్చే శాంతి వాళ్ళు వద్దనుకుంటే మీరు ఇవ్వాలనుకున్న శాంతి మీరే అనుభవిస్తారు, వాళ్ళు కాదు."
\p
\v 7 "ఆ గ్రామం వదిలే వరకూ అదే ఇంట్లో ఉండండి. ఒక ఇంటింటికీ మార వద్దు. వాళ్ళు మీకు ఏది పెడితే అది తినండి, తాగండి. ఎందుకంటే పనిచేసే వాడికి జీతం రావాలి గదా.
\s5
\v 8 ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి వాళ్ళు ఏది పెడితే అది తినండి.
\v 9 రోగులను స్వస్థపరచండి. త్వరలో దేవుడు రాజుగా ఏలుతాడని వాళ్ళకి చెప్పండి.
\s5
\v 10 మీరు ప్రవేశించిన ఊరి వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపొమ్మంటే ఆ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళి,
\v 11 "ఇదే మీకు హెచ్చరిక. మా కాళ్ళకు అంటిన దుమ్ము కూడా దులిపేసి వెళ్ళిపోతున్నాము. అయినా మీరు ఇది తెలుసుకోవాలి. దేవుడు తప్పకుండా అందరిపైనా రాజుగా ఏలుతాడు, అని చెప్పండి."
\p
\v 12 "నేను మీకు చెప్తున్నాను, తీర్పుదినం ఒకటి ఉంది. ఆ రోజు దేవుడు అందరికీ తీర్పు తీర్చే సమయంలో ఆ ఊరి వాళ్ళు శిక్ష పొందుతారు. పూర్వం సొదోమ పట్టణంలోని దుర్మార్గులు పొందిన శిక్ష కంటే అది ఘోరంగా ఉంటుంది."
\s5
\p
\v 13 "కొరాజీన్ పురమా, బెత్సయిదా పురమా, ఆ పట్టణాల ప్రజలారా, రాబోయే కాలంలో మీ గతి ఎంత భయంకరమో! మీరు పశ్చాతాప పడడానికి తిరస్కరించారు. మీ ఎదుట జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, వాళ్ళు ఎప్పుడో గోనెపట్ట కట్టుకొని, తలపై దుమ్మెత్తి పోసుకుని, కటిక నేలమీద కూర్చుని పాపాలు ఒప్పుకుని ఎప్పుడో మనస్సు మార్చుకునేవాళ్ళు."
\p
\v 14 "నేను అద్భుతాలు చేయటం చూసినా మీరు పశ్చాత్తాప పడలేదు. నన్ను నమ్మలేదు. కడపటి తీర్పు రోజున ప్రతి ఒక్కరికీ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తూరు, సీదోను పట్టణంలోని దుష్టుల కంటే కూడా మీకే ఘోరమైన శిక్ష పడుతుంది.
\v 15 కపెర్నహోం లో నివసించే ప్రజలకు ఒక మాట చెప్పాలి. పరలోకంలో మీకు సన్మానం చేస్తారనుకుంటున్నారా? అదేం కాదు, మిమ్మల్ని నిన్ను పాతాళానికి తొక్కెయ్యడం జరుగుతుంది."
\s5
\p
\v 16 యేసు ఇంకా మాట్లాడుతూ, "మీ మాట ఎవరు వింటే వాళ్ళు నా మాట విన్నట్టే. మీ మాటలు ఎవరు తిరస్కరిస్తే, వాళ్ళు నా మాటలు తిరస్కరించినట్టే. నన్ను ఎవరు కాదంటారో వాళ్ళు నన్ను పంపిన నా దేవుణ్ణి కాదన్నట్టే."
\s5
\p
\v 17 యేసు నియమించిన 72 మంది వెళ్ళి ఆయన చెప్పినట్టే చేశారు. వాళ్ళు చాలా ఆనందంగా తిరిగి వచ్చారు. వాళ్ళు "ప్రభూ, నువ్విచ్చిన అధికారంతో ఆజ్ఞాపించగానే దయ్యాలు కూడా మాకు లొంగి పారిపోయాయి" అన్నారు.
\p
\v 18 ఆయన జవాబిస్తూ, "మీరు ఈ పనిమీద వెళ్ళినప్పుడు సాతాను మెరుపులా ఆకాశం నుండి కింద పడడం చూశాను.
\v 19 వినండి, దయ్యాలను గద్దించడానికి నేను మీకు అధికారమిచ్చాను. అవి మిమ్మల్ని ఏమీ చేయవు. మన శత్రువైన సాతాను కంటే బలంగా ఉండే స్థితి నేను మీకు ఇచ్చాను. మీకు ఏదీ హాని చెయ్యనే చెయ్యదు.
\v 20 కాని దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించే కంటే పరలోకంలో మీ పేర్లు రాసి ఉన్నందుకు సంతోషించండి."
\s5
\p
\v 21 అప్పుడు యేసు పరిశుద్దాత్మలో పరవశమై పోయాడు. ఆయన "తండ్రీ, భూమి ఆకాశాల ప్రభూ, కొందరు పండితులు తమకే అన్నీ తెలుసుననుకుంటారు. కాని వాళ్ళు ఈ విషయాలను తెలుసుకోనియ్యకుండా చేసినందుకు నీకు స్తోత్రం. దానికి బదులుగా నీ సత్యాన్ని చిన్న పిల్లల్లాగా ఒప్పుకునే వాళ్ళకి నువ్వు తెలియచేస్తున్నావు. ఔను తండ్రీ, అలా చేయడం నీకు ఇష్టం."
\s5
\p
\v 22 యేసు మళ్ళీ శిష్యులతో, "నా తండ్రి నాకు అన్నీఇచ్చాడు. నా తండ్రికి మాత్రమే తన కుమారుడినైన నేను ఎవరో తెలుసు. తండ్రి ఎవరో కుమారుడికి అంటే నాకు మాత్రమే, కేవలం నాకు మాత్రమే తెలుసు. నాకూ నేను ఎవరికి వెల్లడి చేసానో వారికీ మాత్రమే తండ్రి తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 23 తరువాత ఆయన తన శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు, "నేను చేసిన పనులు దేవుడు మిమ్మల్ని చూడనివ్వడం మీకు గొప్ప అదృష్టం.
\v 24 ఇది మీరు తెలుసుకోవాలి. మీరు చూస్తున్న ఈ కార్యాలు చూడాలని పూర్వం ప్రవక్తలూ రాజులూ ఆశించారు, కాని చూడలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఈ సంఘటనలు జరగలేదు. నేను చెప్పగా మీరు వినిన సంగతులు తామూ వినాలని తహతహలాడారు. అయితే ఆ కాలంలో నేను ఈ విషయాలు బయట పెట్టలేదు" అన్నాడు.
\s5
\p
\v 25 ఒక రోజు యేసు ప్రజలకు బోధిస్తుండగా, యూదీయ ధర్మశాస్త్ర బోధకుడు అక్కడ ఉన్నాడు. అతడు కష్టమైన కొన్ని ప్రశ్నలు యేసును అడిగి పరీక్షించాలని అనుకున్నాడు. కాబట్టి అతడు లేచి నిలబడి, "ఉపదేశకా, దేవునితో నిత్యం జీవించాలంటే ఏమి చెయ్యాలి?" అని అడిగాడు.
\v 26 అందుకు యేసు అతనితో," దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రం నువ్వు చదివావు కదా. ఆజ్ఞలు ఏమి చెప్తున్నాయి?" అని అడిగాడు.
\v 27 అతడు,
\q1 "నీ పరిపూర్ణ హృదయంతో, నీ పరిపూర్ణ శక్తితో, నీ పరిపూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.
\q1 నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ సాటి మనిషిని అలా ప్రేమించాలి" అన్నాడు.
\p
\v 28 యేసు "నువ్వు సరిగ్గానే చెప్పావు. అదంతా చెయ్యి. దేవునితో నిత్యం జీవిస్తావు," అన్నాడు.
\s5
\p
\v 29 కాని ఇతరుల విషయంలో తాను మంచిగానే ఉంటున్నాను అని చూపించుకోవాలని అతడు "నేను ప్రేమించాల్సిన నా సాటి మనిషి అంటే ఎవరు?" అని యేసును అడిగాడు.
\v 30 అందుకు యేసు "ఒక రోజు ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. దారిలో దోపిడి దొంగలు అతని మీద దాడి చేశారు. అతని బట్టలు, అతనివన్నీ దోచుకుని, అతన్ని కొట్టి, కొన ప్రాణంతో వదిలేసారు."
\s5
\p
\v 31 "ఆ దారిలో యూదుల అర్చకుడు ఒకడు వెళ్తూ, ఆ వ్యక్తిని చూసి సహాయం చేయడానికి బదులు పక్కగా దాటి వెళ్ళిపోయాడు
\v 32 అలాగే దేవాలయంలో పనిచేసే లేవీయుడు అటుగా వచ్చి అతన్ని చూశాడు. కాని అతడు కూడా తప్పుకుని వెళ్ళిపోయాడు.
\s5
\v 33 తరువాత సమరయ ప్రాంతం వాడొకడు ఒకడు అటుగా వచ్చి ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు.
\v 34 అతణ్ణి సమీపించి గాయాలకు ఒలీవ నూనె ద్రాక్షరసం రాసి కట్టుకట్టాడు. తన గాడిద పై అతన్ని ఎక్కించుకుని సత్రానికి తీసుకెళ్ళి అతని బాగోగులు చూశాడు."
\p
\v 35 "తరువాత ఉదయం రెండు వెండి నాణాలు ఆ సత్ర యజమానికి ఇచ్చి, "ఇతనిని జాగ్రత్తగా చూసుకోండి. ఒక వేళ ఇంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చయితే నేను తిరిగి వచ్చినప్పుడు కట్టేస్తాను" అన్నాడు."
\s5
\p
\v 36 ఇదంతా చెప్పి యేసు "బందిపోట్లు అతనిపై దాడిచేసి, కొట్టి వెళ్ళిపోయాక ముగ్గురు మనుషులు అతణ్ణి చూసారు. ఆ ముగ్గురిలో అతణ్ణి ఎవరు అసలైన సాటి మనిషిగా చూశారు?" అని అడిగాడు.
\v 37 ధర్మశాస్త్ర బోధకుడు "అతని పట్ల జాలిపడ్డ వాడే" అన్నాడు. అప్పుడు యేసు అతనితో, "ఔను. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ సహాయం అవసరం అయిన వాళ్ళకు నువ్వు కూడా అలా చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 38 యేసు శిష్యులతో ప్రయాణం సాగిస్తూ యెరూషలేము దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాడు. మార్త అనే స్త్రీ తన ఇంట్లోకి వాళ్ళని ఆహ్వానించింది.
\v 39 ఆమె చెల్లెలు పేరు మరియ. ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటున్నది.
\s5
\v 40 కాని మార్త వంటలో మునిగిపోయింది. ఆమె గబగబా వెళ్ళి యేసుతో "ప్రభూ, వంట పనంతా మా చెల్లి నా మీద వదిలేసింది. నువ్వు పట్టించుకోవా? దయచేసి నాకు పనిలో సాయం చెయ్యమని దానితో చెప్పు" అంది.
\p
\v 41 కాని ప్రభువు, "మార్తా, మార్తా నువ్వు చాలా పనులు పెట్టుకుని హైరానా పడుతున్నావు.
\v 42 కాని నిజంగా అన్నిటికన్నా అవసరమైనది నా బోధ వినడమే. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె అలా చేసి పొందిన దీవెన ఆమె నుండి ఎవరూ తీసివేయలేరు" అన్నాడు.
\s5
\c 11
\p
\v 1 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయ్యాక ఆయన శిష్యుల్లో ఒకడు, "ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మేము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చెయ్యాలో నేర్పించు" అని అడిగాడు.
\s5
\p
\v 2 ఆయన వాళ్ళకి "మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెప్పండి.
\q1 తండ్రీ, నీ పేరు అందరూ పవిత్రంగా గౌరవించాలి. త్వరలో నువ్వు అంతటా అందర్నీ పాలించాలి.
\s5
\q1
\v 3 ప్రతి రోజూ మాకు అవసరమయ్యే ఆహారం దయచెయ్యి.
\q1
\v 4 మా పట్ల ఇతరులు చేసిన తప్పులు మేము క్షమించినట్టు మేము చేసిన తప్పులు క్షమించు.
\q1 మేము శోధనలో పడినప్పుడు పాపం చేయకుండా సహాయం చెయ్యి."
\s5
\p
\v 5 తరువాత ఆయన వాళ్ళతో, "మీలో ఒకడు అర్ధరాత్రి మీ స్నేహితుని ఇంటికి వెళ్ళాడనుకో. బయట నిలబడి "మిత్రమా, మూడు రొట్టెలు బదులివ్వు.
\v 6 నా స్నేహితుడొకడు ప్రయాణం చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు" అని అడిగాడనుకో.
\v 7 అతడు లోపలే ఉండి, "నన్ను విసికించొద్దు. చిన్న పిల్లలు నాతో పడుకున్నారు. తలుపు వేసి ఉంది. నేను లేచి ఇవ్వలేను" అంటాడు.
\v 8 నువ్వు అతని స్నేహితుడివైనా అతనికి లేవడం ఇష్టం లేకపోవచ్చు. కాని నేను చెప్తున్నాను. నువ్వు అతన్ని వదలకుండా అడుగుతూ ఉంటే అతడు కచ్చితంగా లేచి నీకు కావలసింది ఇస్తాడు."
\s5
\p
\v 9 కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నీకు కావలసింది దేవుణ్ణిని అడుగుతూనే ఉండు. అప్పుడు అది మీకు ఇస్తాడు. ఆయన చిత్తాన్ని వెదకండి. ఆయన మీకు తెలియజేస్తాడు. తలుపు కొడుతున్నట్టు అత్యవసరంగా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండండి. మీరు అడిగింది పొందేలా దేవుడు దారి చూపిస్తాడు.
\p
\v 10 గుర్తుంచుకోండి! అడిగిన వాళ్ళు తాము అడిగినది పొందుతారు. వెతికిన వాళ్ళకి దొరుకుతుంది. తట్టిన వాళ్ళకు తలుపు తెరుచుకుంటుంది.
\s5
\p
\v 11 మీలో ఒకరికి కొడుకు ఉంటే వాడు తినడానికి చేప అడిగితే దానికి బదులు పామును ఇయ్యవు గదా.
\v 12 లేదా గుడ్డుకోసం అడిగితే దానికి బదులు తేలును ఇవ్వవు కదా
\v 13 మీరు పాపులైనా మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు కదా! మరి మీ పరలోకపు తండ్రిని మీరు పరిశుద్ధాత్మనిమ్మని అడిగితే తప్పకుండా ఇవ్వడా?
\s5
\p
\v 14 ఒక రోజు దయ్యం పట్టి మూగవాడై పోయిన వాడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగానే అతడు మాట్లాడాడు. అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
\v 15 కాని కొంత మంది, "దయ్యాలరాజు బయల్జేబూలు యేసులో ఉండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగేలా చేశాడు" అన్నారు.
\s5
\p
\v 16 కొందరు ఆయన దేవుని దగ్గర నుండి వచ్చాడని నిరుపించుకోడానికి ఒక అద్భుతం చేయమని అడిగారు.
\v 17 కాని వాళ్ళు ఏమి అనుకుంటున్నారో ఆయనకి తెలుసు. అందుకే ఆయన, "ఒకే రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు గొడవపడరు. అలా చేస్తే ఆ రాజ్యం నాశనమైపోతుంది. ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరికొకరు వ్యతిరేకమైతే ఆ కుటుంబం నాశనమైపోతుంది.
\s5
\v 18 అదేవిధంగా సాతాను, వాడి దయ్యాలు పోట్లాడుకుంటే వాళ్ళ పాలన ఎక్కువ కాలం నిలవదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను దయ్యాల అధిపతి శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నానన్నారు.
\v 19 ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడానికి నాకు సాతానే అధికారం ఇవ్వడం నిజమైతే, మీ శిష్యులు కూడా అదే సాతాను శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నారా ఏంటి? కానే కాదు. ఆ మాట సరికాదని వాళ్ళే నిర్ధారిస్తున్నారు.
\v 20 దయ్యాలను వెళ్ళగొట్టడం దేవుని శక్తితోనే అయితే దేవుడు తన పరిపాలన మొదలు పెట్టాడని నేను చూపిస్తున్నాను."
\s5
\p
\v 21 "ఒక బలవంతుని ఇంట్లో ఎవరూ ఏమీ దొంగిలించకుండా చాలా ఆయుధాలు, సంరక్షకులు ఉన్నారు.
\v 22 అంతకంటే బలవంతులు వచ్చి వాళ్ళపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకంటేనే కదా ఆ వ్యక్తి ఆ ఇంటి నుండి ఏదైనా దోచుకుని దానితో తన ఇష్టం వచ్చినట్టు చేయగలిగేది?
\v 23 నన్ను వైపు లేని వాడు నాకు విరోధే. వాడు నా దగ్గరికి మనుషులను రానివ్వడు. వాళ్ళను నానుండి వెళ్ళగొడతాడు."
\s5
\p
\v 24 ఇంకా యేసు మాట్లాడుతూ, "కొన్ని సార్లు దురాత్మ ఎవరినైనా వదిలి వెళ్ళి, అటు ఇటు తిరుగుతూ దానికి అనుకూలమైన స్థలం దొరకక తనలో తాను, "ఇంతకు ముందు నేను నివసించిన మనిషిలోనే వెళ్ళి ఉంటాను అనుకొని
\v 25 తిరిగి వెనక్కి వెళ్ళి, ఆ వ్యక్తి కడిగిన ఇంటిలా మరింత శుభ్రంగా ఉండి, ఇంకా ఖాళీగా ఉండడం చూస్తుంది.
\v 26 అప్పుడు ఈ దురాత్మ వెళ్ళి ఇంకా ఏడు చెడ్డ దయ్యాలను తెస్తుంది. అవన్నీ ఆ వ్యక్తిలోకి దూరి హాయిగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి పరిస్థితి ఇంతకు ముందు కంటే ఇంకా అధ్వాన్నంగా మారుతుంది.
\s5
\p
\v 27 యేసు ఇది చెప్పడం విన్న ఒక స్త్రీ బిగ్గరగా, "నిన్ను తొమ్మిది నెలలు మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు - ఎంత ధన్యమో కదా!" అంది.
\v 28 ఆయన జవాబిస్తూ, "దేవుని సందేశం విని, దానికి లోబడినవాళ్ళు మరింత ధన్యులు" అన్నాడు.
\s5
\p
\v 29 యేసు చుట్టూ ఇంకా ఎక్కువ జనం చేరినప్పుడు ఆయన "ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు. నేను దేవుని దగ్గర నుండి వచ్చానో లేదో రుజువు చెయ్యడానికి ఒక అద్భుతం చేయమంటున్నారు. కానీ యోనాకు ఏమి జరిగిందో అది ఒక్కటే వాళ్ళు నిర్ధారించుకోడానికి సూచన.
\v 30 పూర్వ కాలం నీనెవె ప్రజలకు సాక్ష్యంగా ఉన్న యోనా విషయంలో జరిగిన అద్భుతం లాగానే మనుష్యకుమారుని విషయంలో దేవుడు చేసే అద్భుతం మాత్రమే మీకు సాక్ష్యం."
\s5
\p
\v 31 "పూర్వం షెబా దేశం రాణి సొలోమోను జ్ఞానం గురించి విని, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సొలోమోను కంటే గొప్పవాడైన నేను ఉన్నాను. కాని నేను చెప్పేది వీళ్ళు వినరు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ రాణి అక్కడ నిలబడి ఇప్పుడు ఉన్న ప్రజలపై నేరం మోపుతుంది."
\s5
\p
\v 32 "నీనెవెలో నివసించిన ప్రజలు యోనా బోధించినప్పుడు మనస్సు మార్చుకున్నారు. ఇప్పుడు యోనా కంటే గొప్పవాణ్ణి వచ్చి మీకు బోధిస్తున్నాను. కాని మీ పాపపు పద్ధతులు మార్చుకోవడం లేదు. దేవుడు ప్రజలందరికీ తీర్పు ఇచ్చేటప్పుడు నీనెవే ప్రజలు నిలబడి, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళ మీద నేరం మోపుతారు."
\s5
\p
\v 33 "దీపం వెలిగించి దాన్ని బుట్ట క్రింద కప్పెట్టరు. దీప స్థంభం మీద పెట్టినపుడు ఆ గది అంతా వెలుగు నిండిపోతుంది.
\v 34 నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాక నీ కన్ను మసకబారితే నీ దేహమంతా చీకటే.
\v 35 కాబట్టి మరిన్ని అద్భుతాలు చూడడం ముఖ్యం కాదు. నేను ఇప్పటికే చెప్పినది జాగ్రత్తగా నెమరు వేసుకోండి. అలా చేస్తే వేరే వాళ్ళు మీకు చెప్పేవి మీలో అత్మసంబంధమైన చీకటి నింపవు.
\v 36 నీ శరీరమంతా వెలుగుతో నిండి ఎక్కడా చీకటి ఉండదు. దీపకాంతిలో అన్నీ స్పష్టంగా కనిపించినట్టు నీ శరీరమంతా వెలుగుమయంగా ఉంటుంది."
\s5
\p
\v 37 యేసు ఇదంతా చెప్పిన తరువాత తనను భోజనానికి పిలిచిన పరిసయ్యుడి ఇంట్లో భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు.
\v 38 భోజనానికి ముందు యేసు చేతులు కడుక్కోకపోవడం ఆ పరిసయ్యుడు గమనించి ఆశ్చర్యపోయాడు.
\s5
\v 39 యేసు అతనితో, "మీ పరిసయ్యులు భోజనం తినేముందు బయట మాత్రమే శుభ్రం చేస్తారు. మీలోపల మాత్రం అసూయ, కుళ్ళు ఉంటాయి.
\v 40 తెలివితక్కువ మనుషులారా, బయటి దాన్ని చేసిన దేవుడు లోపలి భాగం కూడా చేయలేదా?"
\p
\v 41 "ఆచార బద్ధంగా గిన్నెలు శుభ్రం చెయ్యడం గురించి చాదస్తంగా ఉండడమేనా? పాత్ర లోపలి భాగం కూడా శుభ్రంగా ఉందో లేదో చూసుకోవద్దా? జాలి గుండెగలవారై మీ గిన్నె లో ఉన్నది అవసరంలో ఉన్నవాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీరు లోపలా బయటా కూడా బాగుంటారు."
\s5
\p
\v 42 "అయ్యో పరిసయ్యులారా, ఇదెంత ఘోరం! మీ తోటలో పెరిగే ఆకు కూరల్లో కూడా మీరు పదవ భాగం చెల్లిస్తారు. దేవుణ్ణి మాత్రం ప్రేమించరు. ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు. దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు. ఇతరుల పట్ల న్యాయంగా ఉండాలి."
\s5
\p
\v 43 "పరిసయ్యులారా ఇదెంత ఘోరం! సమాజమందిరాల్లో కూర్చోడానికి మీరు ఉన్నత స్థానం కోరుకుంటారు. వీధుల్లో ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని, మీకు వందనాలు చెబుతూ ఉండాలని కోరుకుంటారు."
\p
\v 44 "ఇదెంత ఘోరం! మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి కనిపించక మనుషులు వాటిపై నడిచి మైల బడతారు" అన్నాడు.
\s5
\p
\v 45 వాళ్ళలో ఉన్న యూదీయ బోధకులలో ఒకడు, "బోధకా! ఇలా చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నావు కదా" అన్నాడు.
\p
\v 46 దానికి యేసు, "ధర్మశాస్త్రాన్ని బోధించే మీ స్థితి ఎంత ఘోరమో! మీరు మనుషులపై పెను భారాలు మోపుతారు. మీరు మాత్రం వాళ్ళ బరువులు మోయడానికి చిటికెన వేలైనా కదపరు.
\s5
\v 47 ప్రవక్తల సమాధులపై రమ్యమైన కట్టడాలు నిర్మిస్తారు. కానీ వాళ్ళని చంపింది మీ పూర్వికులే. మీకు ఎంత యాతన!"
\p
\v 48 మీరు ఈ సమాధులు కట్టడం ద్వారా ప్రవక్తలను చంపడంలో మీ పితరులు చేసింది ఆమోదిస్తూ ప్రకటిస్తున్నారు.
\s5
\v 49 కాబట్టి అత్యంత జ్ఞాని అయిన దేవుడు అంటున్నాడు. "నా ప్రవక్తలనూ, అపోస్తలులనూ మిమ్మల్ని నడిపించడానికి పంపుతాను. కాని మీరు వాళ్ళని హింసిస్తారు. కొందరిని చంపుతారు కూడా.
\v 50 దీని ఫలితంగా సృష్టి ఆరంభం నుండి దేవుని ప్రవక్తలను చంపిన వాళ్ళ నేరం ఇప్పటి ప్రజలైన మీపై పడుతుంది.
\v 51 ఈ ధోరణి అన్న చేతిలో హతమైన హేబెలు మొదలుకుని పరిశుద్ధ స్థలానికీ, బలిపీఠం ఉన్న చోటికీ మధ్యన వాళ్ళు చంపిన జెకర్యా ప్రవక్త వరకూ కొనసాగింది. ఆ ప్రవక్తల హత్యల నేరం ఈ కాలం వాళ్ళపై పడుతుంది."
\s5
\p
\v 52 "ధర్మ శాస్త్ర బోధకులకి ఎంత యాతన! మీ కారణంగా దేవుడు తమను పాలించడం అంటే ఏమిటో ప్రజలకి తెలియడం లేదు. మీరు దేవుణ్ణి మీపై ప్రభుత్వం చేయనివ్వరు. తమ జీవితాలపై దేవుని పరిపాలన ఇష్టపడే వాళ్ళకీ మీరు అడ్డుపడతారు."
\s5
\p
\v 53 యేసు ఈ విషయాలు చెప్పిన తరువాత అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులూ, పరిసయ్యులు కక్షగట్టి ఆయనకు వ్యతిరేకమయ్యారు. చాలా విషయాల గురించి ఆయనను పదే పదే ప్రశ్నించే వారు.
\v 54 ఆయనతో ఏదైనా పొరపాటు మాట పలికించి నింద మోపాలని కాచుక్కూర్చున్నారు.
\s5
\c 12
\p
\v 1 ఈలోగా ఇసకేస్తే రాలనంతమంది జనం యేసు చుట్టూ పోగయ్యారు. తొక్కిసలాట జరుగుతూ ఉంది. ఆయన శిష్యగణంతో "మీరూ పరిసయ్యుల్లాగా అయిపోతారేమో జాగ్రత్త సుమా! వాళ్ళు వీధిలో భక్తులూ, ఇంట్లో దుష్టులూనూ. కొద్దిగా ఈస్టు పదార్థం గోదుమ పిండి ముద్ద మొత్తాన్నీ పొంగేలా చేస్తుంది గదా. అలానే వాళ్ళ చెడునడత వేరే వాళ్ళని కూడా వాళ్ళలాగే చెడగొడుతుంది."
\s5
\p
\v 2 "ఎవరూ తమ పాపాలను కప్పిపుచ్చుకోలేరు. మనుషులు దాచిపెట్టాలని చూసే వాటన్నిటినీ ఒకానొక రోజు దేవుడు బట్టబయలు చేస్తాడు.
\v 3 మీరు చీకట్లో చెప్పుకునే మాటల్ని ఒక దినాన పట్టపగలు మనుషులంతా వింటారు. గదుల్లో గుసగుసలాడుకునే మాటలు రాబోయే రోజుల్లో కోడి ఇల్లెక్కి కూసినట్టే ఉంటాయి."
\s5
\p
\v 4 "మిత్రులారా, జాగ్రత్తగా వినండి. మనుషులకు భయపడొద్దు. వాళ్ళు మహా అయితే ఏం చేస్తారు? చంపుతారు అంతేగా, అంతకన్నా ఏం చేస్తారు?
\v 5 మీరు నిజంగా ఎవరికి భయపడాలో చెబుతా వినండి. దేవుడికి భయపడాలి, ఎందుకంటే ఆయన మనుషుల్ని చంపగలగడమే కాకుండా ఆపైన వాళ్ళని నరకకూపంలో కూడా పడెయ్యగలడు. అవును మరి, మనం భయపడాల్సింది ఆయనకే."
\s5
\p
\v 6 "పిచ్చుకలు చూడండి. వాటి విలువెంత? రెండు పైసలకు ఐదు పిచ్చుకలు వస్తాయి గదా? కానీ దేవుడు వాటిని ఒక్కొక్క దాన్నీ గుర్తు పెట్టుకుంటాడు.
\v 7 నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు. భయమెందుకు? ఎన్నో పిచ్చుకలకంటే మీరు దేవుడి దృష్టిలో ఎన్నో రెట్లు ఎక్కువ కాదా?"
\s5
\p
\v 8 "ఇంకోటి, "మేము యేసు శిష్యులం" అని చెప్పుకునే వాళ్ళ గురించి నేను కూడా దేవదూతలతో "వాళ్ళు నా శిష్యులు" అని చెబుతాను,
\v 9 కానీ "మేము ఆయన శిష్యులం కాదు" అని చెప్పే వాళ్ళ గురించి దేవదూతలతో నేను కూడా "వాళ్ళు నా శిష్యులు కాదు" అని చెబుతాను."
\p
\v 10 "మరో మాట, ఎవరైనా మానవ పుత్రుడు అయిన నా గురించి కాని మాటలు మాట్లాడితే దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ ఎవరన్నా పరిశుద్ధాత్మ గురించి అవాకులూ చెవాకులూ పేలితే దేవుడు అలాటి వాళ్ళని ఎంత మాత్రం క్షమించడు."
\s5
\p
\v 11 "కాబట్టి మనుషులు మిమ్మల్ని న్యాయస్థానాల్లో మతనాయకుల ఎదుటా అధికారుల ఎదుటా విచారణ కోసం నిలబెడితే ఎలా జవాబివ్వాలో ఏమి చెప్పాలో అని కంగారు పడకండి.
\v 12 ఎందుకంటే సరిగ్గా ఆ సమయానికి ఏం చెప్పాలో పరిశుద్ధాత్మే మీకు చెప్తాడు."
\s5
\p
\v 13 ఆ గుంపులో ఉన్న ఒక శిష్యుడు యేసుతో, "గురువుగారూ, మా నాన్న ఆస్తిలో నా భాగం నాకిమ్మని మా అన్నతో చెప్పు" అన్నాడు.
\v 14 అతనితో యేసు, "మీ ఆస్తుల పంపకాల విషయాల్లో నాకు మధ్యవర్తి ఉద్యోగం ఎవరిచ్చారయ్యా?"అన్నాడు.
\v 15 జనంతో ఆయన "జాగ్రత్త, ఏ రకంగా కూడా పేరాశలో పడకుండా చూసుకోండి. ఒక మనిషి విలువ అతనికి ఎంత ఆస్తి ఉంది, అనే దాన్ని బట్టి లెక్కగట్టకండి" అని చెప్పాడు.
\s5
\p
\v 16 ఆయన వాళ్ళకి ఈ చిన్న కథ చెప్పాడు. "ఒక ధనవంతుడి పొలాల్లో ఆ యేడు విపరీతమైన పంట పండింది.
\v 17 అతడు "అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ధాన్యమంతా నిలవజేయడానికి గోదాములు లేవే" అనుకుని
\v 18 బాగా ఆలోచించి "సరే, పాత గోదాములు పడగొట్టి పెద్దవి కట్టిస్తే పోతుంది. అప్పుడు నా పంటంతా, మిగిలినవి కూడా వాటిల్లో నింపుకోవచ్చు.
\v 19 ఆహా, ఎన్నేళ్ళు తిన్నా తరగని తిండిగింజలు ఉన్నాయి. ఇక హాయిగా కాలు మీద కాలేసుకుని కడుపారా తినొచ్చు, తాగొచ్చు, కులాసాగా ఉండొచ్చు!" అనుకున్నాడు."
\s5
\p
\v 20 "అయితే దేవుడు అతనితో, "బుర్ర లేని వాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. నీ కోసం కూడబెట్టుకున్న దంతా నీకు ప్రాప్తం లేదు. అవన్నీ పరుల పాలౌతాయి" అన్నాడు."
\p
\v 21 యేసు తన ఉదాహరణ ముగిస్తూ "దేవుడు దేన్ని విలువైనవిగా ఎంచుతాడో వాటిని పట్టించుకోకుండా తమకోసమే కూడబెట్టుకునే వాళ్ళ సంగతి ఇలానే ఉంటుంది" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు తన శిష్యులతో "మీతో ఒకటి చెప్పాలి. బతకడానికి అవసరమైన వాటి గురించి హైరానా పడకండి. తినడానికి చాలినంత తిండి, కట్టుకోడానికి బట్టలూ ఉంటాయో లేదోనని దిగులు పెట్టుకోకండి.
\v 23 మీరు తినే భోజనం కన్నా మీ జీవం గొప్పది. కట్టుకునే బట్టలకన్నా మీ శరీరం గొప్పది.
\s5
\v 24 పక్షులను చూడండి, అవి విత్తనాలు చల్లవు. పంట కోసుకోవు. ధాన్యం నిలవ చేసుకోడానికి వాటికి ఇళ్ళు, గోదాములు లేవు. అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే తప్పని సరిగా గొప్పవాళ్ళే.
\v 25 మీరు దిగులు పెట్టుకుంటే ఏమి లాభం? దిగులు పడడం వల్ల జీవితాన్ని ఒక్క నిమిషమైనా పొడిగించగలరా?
\v 26 దానివల్ల ప్రయోజనం లేదు గనక దేని విషయంలోనూ దిగులు పెట్టుకోవద్దు."
\s5
\p
\v 27 "పువ్వులెలా పూస్తున్నాయో చూడండి. డబ్బు సంపాదనకై అవి పని చెయ్యవు. తమ బట్టలు తయారు చేసుకోవు. అయితే నేను అనేదేమిటంటే పూర్వకాలం సోలోమోను రాజు అందమైన బట్టలు ధరించే వాడు గదా, అతని బట్టలు సైతం ఈ గడ్డి పువ్వుల ఎదుట దిగదుడుపే.
\v 28 మొక్కలు కొంచెం కాలమే ఉంటాయి. వాడిపోయాక వాటిని తగలబెట్టేస్తారు. దేవుడు వాటిని భలే ముస్తాబు చెయ్యడా! అయితే మీరంటే దేవునికి చాలా ఇష్టం. గడ్డి మొక్కలకంటే మిమ్మల్నే ఆయన ఎక్కువగా పట్టించుకుంటాడు. మీకు ఆ పాటి నమ్మకం కూడా లేదు."
\s5
\p
\v 29 "ఏమి తింటాం, ఏమి తాగుతాం, అని బెంగ పెట్టుకోకండి.
\v 30 దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఇలాటి వాటికోసం దిగులు పడుతుంటారు. అయితే పరలోకంలో ఉండే మీ తండ్రికి మీకేది అవసరమో తెలుసు.
\s5
\v 31 కాబట్టి మీ ఆలనా పాలనా చూసే దేవుణ్ణి అంగీకరించడం అనే దాన్ని మీ జీవితాల్లో అతి ప్రాముఖ్యంగా ఎంచండి. అప్పుడు ఆయన కూడా మీకు కావలసినవన్నీ ఇస్తాడు."
\p
\v 32 "చిన్న మందా, భయం వద్దు. పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకోసం దాచి ఉంచిన అన్ని మేళ్ళు మీకివ్వాలని చూస్తున్నాడు.
\s5
\v 33 కాబట్టి ఇక మీకున్నవన్నీ అమ్మేయండి. తిండీ బట్టా ఉండడానికి గూడు లేనివాళ్ళకి ఇవ్వండి. పాతబడిపోని డబ్బు సంచులు సంపాదించుకోండి. అప్పుడు మీకు పరలోకంలో సంపదలు ఉంటాయి. అక్కడ అవి ఎప్పుడూ భద్రంగా ఉంటాయి. అక్కడ ఏ దొంగా ఉండడు. ఏ చెదపురుగూ మీ బట్టలు పాడు చెయ్యదు.
\v 34 మీరు దేన్ని విలువైనదిగా భావిస్తారో దాన్నే మనసులో స్మరించుకుంటూ ఉంటారు."
\s5
\p
\v 35 "దేవుడి పనికోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. పని చేసేటప్పుడు వేసుకునే బట్టలతో ఉండండి. మీ దీపాలు వెలిగించి ఉంచుకోండి.
\v 36 అయ్యగారు పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తున్నాడని కనిపెట్టుకుని చూసే పనివాళ్ళలాగా నేను రావడం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అయ్యగారు వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
\s5
\v 37 ఆయన వచ్చినప్పుడు ఈ పనివాళ్ళు మెలకువగా ఉంటే ఆయన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. మీతో చెబుతున్నాను వినండి. అతడు వడ్డించే బట్టలు వేసుకుని వాళ్ళని కూర్చోమని తానే వాళ్ళకి భోజనం వడ్డిస్తాడు.
\v 38 తాను అర్ధరాత్రివేళ, తెల్లవారిపోతుండగా వచ్చినా తన సేవకులు మెలకువగా తన కోసం సిద్ధంగా ఉంటే అతడు చాలా ఆనందపడతాడు."
\s5
\p
\v 39 "అయితే మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి. దొంగ వచ్చే సమయం ఇంటి యజమానికి తెలిస్తే అతడు నిద్రపోకుండా కాచుకుని ఉండి దొంగను చొరబడనియ్యడు.
\v 40 కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మానవ పుత్రుడినైన నేను మీరు అస్సలు ఉహించని సమయంలో వస్తాను."
\s5
\v 41 పేతురు ఆయన్ని అడిగాడు, "స్వామీ, ఈ ఉదాహరణ మాకే చెబుతున్నావా, అందరికీనా?"
\v 42 అందుకు ఆయన "నమ్మకంగా వివేకంతో యజమాని ఇంటిని చూసుకునే ప్రతి ఒక్కరితోనూ చెబుతున్నాను. అతని యజమాని అతనికి ఇంటి మీద పెత్తనం ఇస్తాడు. సేవకులందరికీ సరిగా భోజనం అందుతుందో లేదో చూసుకునే బాధ్యత ఇస్తాడు.
\v 43 యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు ఇలాటి బాధ్యతలు చక్కగా చూసుకుంటూ కనిపిస్తే యజమాని అతనికి బహుమతి ఇస్తాడు.
\v 44 మీకు చెబుతున్నాను, యజమాని తన ఆస్తి అంతటిమీదా అతణ్ణి నియమిస్తాడు."
\s5
\p
\v 45 "అయితే సేవకులను అజమాయిషీ చేసే ఆ నిర్వాహకుడు "అయ్యగారు వెళ్లి చాలాకాలం అయిందిలే" అనుకుని తక్కిన ఆడ, మగ సేవకులను కొడుతూ పీకలదాకా మెక్కుతూ తాగి తందనాలాడుతూ ఉన్నాడనుకోండి.
\v 46 వాడు అస్సలు ఉహించని సమయంలో యజమాని తిరిగి వస్తాడు. అతణ్ణి కఠినంగా శిక్షించి తన మాట లెక్క చెయ్యని వాళ్ల దగ్గర పడేస్తాడు.
\s5
\v 47 యజమానికి ఏది ఇష్టమో తెలిసి కూడా చెయ్యడానికి సిద్ధపడని వాడికి పెద్ద శిక్ష పడుతుంది.
\v 48 యజమాని ఏమి చెయ్యాలని కోరుతున్నాడో గ్రహించక పొరపాట్లు చేస్తే ఆ సేవకుడికీ పడేది తక్కువ శిక్షే. ఎక్కువ పొందినవాడి దగ్గర నుండి ఎవరైనా ఎక్కువే ఆశిస్తారు. మొత్తం ఒకడి చేతుల్లో పెడితే అలాటి వాడు ఎంతో బాధ్యత తీసుకోవాలని చూస్తారు."
\s5
\p
\v 49 "నేను భూమిని తగలబెట్టడానికి వచ్చాను. అసలు అది ఇప్పటికే తగలబడి పోతూ ఉంటే బావుణ్ణు.
\v 50 త్వరలోనే నేను చిత్ర హింసలు అనే బాప్తిసం తీసుకోవాలి. నా హింసలు పూర్తి అయ్యే వరకూ నాకు నెమ్మది లేదు.
\s5
\v 51 నేను ఈ లోకంలోకి రావడం వల్ల మనుషులు శాంతిసమాధానాలతో జీవిస్తారనుకుంటున్నారా? కాదు. మనుషులు వేరువేరు గుంపులుగా విడిపోతారని చెబుతున్నాను.
\v 52 ఎందుకో తెలుసా? ఒక ఇంట్లో కొందరు నాపై విశ్వాసం పెట్టుకుంటారు. కొందరు అలా చెయ్యరు. కుటుంబం చీలిపోతుంది. ఒక ఇంట్లో నన్ను నమ్మని ముగ్గురు నమ్మే ముగ్గురిని ఎదిరిస్తారు.
\v 53 ఒకడికి తన కొడుకే శత్రువౌతాడు. కొడుకు తండ్రికి ఎదురు తిరుగుతాడు. ఒక స్త్రీ తన కూతురితో విభేదిస్తుంది. కూతురు తల్లి మాట వినదు. అత్త తన కోడలికీ, కోడలు తన అత్తకీ విరోధులౌతారు."
\s5
\p
\v 54 యేసు ప్రజానీకంతో కూడా చెప్పాడు, "పశ్చిమ దిక్కున కారుమబ్బు కనిపిస్తే మీరు వెంటనే "వర్షం వస్తుంది" అంటారు గదా.
\v 55 దక్షిణం నుండి గాలి వీస్తే "అబ్బో, ఈ రోజు బాగా వడగాలి ఉంటుంది" అంటారు గదా. నిజమే.
\v 56 మేకవన్నె పులుల్లారా, మబ్బులు, గాలి వాటు చూసినంత మాత్రాన వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతున్నారు గదా. ప్రస్తుతం దేవుడు ఏమి చేస్తున్నాడో ఆమాత్రం గ్రహించలేరా?"
\s5
\p
\v 57 "మీలో ప్రతివాడు, కాలం మించిపోక ముందే చేయవలసినది చెయ్యాలని నిర్ణయించుకోవాలి.
\v 58 సమయం మించిపోక ముందే కోర్టుకు వెళ్ళే దారిలోనే మీపై కేసు వేసిన వాడితో రాజీ పడాలి. జడ్జీ ఎదుట నిలబడ్డాక ఇక లాభం లేదు. జడ్జీ నిన్ను దోషిగా నిర్ణయించి అధికారుల వశం చేస్తాడు. వాళ్ళు నిన్ను జైల్లో పెడతారు.
\v 59 నిజం చెబుతున్నాను. నువ్వు గనక జైలుకి వెళితే నీవు ఎంత పరిహారం చెల్లించాలని జడ్జీ చెప్పాడో అణాపైసలతో సహా అంత మొత్తం కడితే తప్ప బయటికి రావు."
\s5
\c 13
\p
\v 1 ఆ మధ్య రోమ్ సైనికులు కొందరు గలిలయ ప్రజలను ఊచకోత కోసిన సంగతి కొందరు యేసుకు చెప్పారు. ఈ గలిలయులు గుడిలో బలులు అర్పిస్తుండగా రోమ్ గవర్నర్ పిలాతు వాళ్ళని చంపమని సైనికుల్ని పంపించాడు.
\p
\v 2 యేసు అక్కడున్న వాళ్ళతో, "ఇలాటి ఘోరం ఈ గలిలయ వాళ్ళకు జరిగిందని వీళ్ళు మిగతా గలిలయుల కన్నా పాపాత్ములని మీరు అనుకుంటున్నారా?
\v 3 సందేహం లేకుండా చెబుతున్నాను. కారణం అది కాదు. మీ చెడుమార్గం నుండి బయటికి రాక పొతే ఆయన మిమ్మల్ని కూడా అలానే శిక్షిస్తాడని గుర్తుంచుకోండి.
\s5
\v 4 మరొకటి. యెరూషలేము శివార్లలో సిలోయం గోపురం కూలి 18 మంది చనిపోయారే, వాళ్ళ సంగతో? వీళ్ళు యెరూషలేము మొత్తంలోకీ పాపాత్ములు గనక ఇది వాళ్ళకి జరిగిందనుకుంటున్నారా?
\v 5 మీకు గట్టిగా చెబుతున్నాను. కారణం అది కాదు. మీ చెడు ప్రవర్తన నుండి మీరు మళ్ళుకోక పొతే దేవుడు మిమ్మల్ని కూడా అలానే దండిస్తాడు."
\s5
\p
\v 6 అప్పుడు యేసు వాళ్ళకి ఈ కథ చెప్పాడు, "ఒక వ్యక్తి తన తోటలో అంజూరు చెట్టు పెంచాడు. ఏటేటా అంజూరు కాయలు కోసుకోడానికి వస్తుండేవాడు. కానీ అది ఎప్పుడూ కాయలు కాయలేదు.
\v 7 అప్పుడు అతడు తోటమాలితో "ఈ చెట్టు చూడు, మూడేళ్ళ నుండి ఈ చెట్టు కాస్తుందేమోనని చూసాను. లాభం లేదు. దీన్ని నరికెయ్యి. అనవసరంగా నేలలోని సారాన్ని ఇది పీల్చుకుంటూ ఉంది గదా" అన్నాడు.
\s5
\v 8 అందుకు తోటమాలి "అయ్యగారూ, మరొక్క ఏడు ఉండనిద్దాం. దీనికి పాదు తవ్వి ఎరువు వేస్తాను.
\v 9 వచ్చే ఏడు కాస్తే కాస్తుంది. అప్పటికీ కాయకపోతే నరికేద్దాం" అన్నాడు."
\s5
\p
\v 10 యూదుల విశ్రాంతి దినం నాడు వాళ్ళ సమాజ కేంద్రంలో యేసు బోధిస్తూ ఉన్నాడు.
\v 11 పద్దెనిమిది ఏళ్లుగా దయ్యం పట్టి అవిటిదైపోయిన ఒకామె అక్కడ ఉంది. ఆమె వంగిపోయి ఉండేది. నిటారుగా నిలబడం కుదిరేది కాదు.
\s5
\v 12 యేసు ఆమెను చూసి, దగ్గరికి పిలిచాడు. ఆమెతో, "అమ్మా, నీ రోగం పోయి ఆరోగ్యం పొందు" అన్నాడు.
\v 13 ఆమె మీద చేతులు పెట్టగానే ఆమె నిటారుగా నిలబడి దేవుణ్ణి స్తుతించసాగింది.
\p
\v 14 కానీ అది చూసి సమాజకేంద్రం పెద్ద మండిపడ్డాడు. ఎందుకంటే యేసు ఆమెను యూదుల విశ్రాంతి రోజున బాగు చేశాడు. అతడు అక్కడున్న వాళ్ళతో, "వారంలో ఆరు రోజులున్నాయి గదా. ఆ ఆరు రోజులు పని చేసుకోవచ్చని మన ధర్మశాస్త్రం అనుమతి ఇచ్చింది. మీకు రోగాలు నయం కావాలంటే సమాజకేంద్రానికి రావలసింది ఆ ఆరు రోజులు. విశ్రాంతి దినాన రావద్దు!"
\s5
\p
\v 15 అప్పుడు ప్రభువు అతనికి "నువ్వూ, తక్కిన మతనాయకులంతా కపట భక్తులు. కొన్ని సార్లు మీరు కూడా విశ్రాంతి రోజున పని చెయ్యరా? విశ్రాంతి రోజున మీ ఎద్దుని, గాడిదని విప్పి మేత గాటి దగ్గరికీ, నీళ్ళు తాగడానికీ తీసుకుపోరా?
\v 16 ఈమె యూదురాలు. అబ్రాహాము వంశస్తురాలు. సాతాను ఈమెను 18 ఏళ్ళు అవిటితనంతో కట్టి పడేశాడు. ఆమెను నేను సాతాను గొలుసుల నుండి విడిపించడం తగదా, అది విశ్రాంతి రోజైతే ఏంటి."
\s5
\v 17 ఆయన ఇలా అన్నపుడు ఆయన శత్రువులు సిగ్గు పడ్డారు. తక్కిన వారంతా ఆయన చేస్తున్న అద్భుతాలను చూసి ఎంతో ఆనందించారు.
\s5
\p
\v 18 "దేవుని రాజ్యం ఎలా ఉంటుందని చెప్పను? ఇలా ఉంటుంది.
\v 19 ఒక మనిషి తన పొలంలో ఒక చిన్న ఆవ గింజ పాతాడు. అది పెరిగి పెద్దదై, చెట్టు అవుతుంది. దాని కొమ్మల్లో పిట్టలు గూళ్ళు పెట్టుకుంటాయి."
\s5
\p
\v 20 ఆయన ఇంకా అన్నాడు, "దేవుడు రాజుగా ఉండే స్థితి ఎలా ఉంటుందో చెబుతా వినండి.
\v 21 ఇరవై ఐదు కిలోల గోదుమ పిండి ముద్దలో ఒకామె కొద్దిగా ఈస్టు పదార్థం కలిపినట్టు ఆ రాజ్యం ఉంటుంది. ఆ కొంచెం ఈస్టు పిండి ముద్ద మొత్తాన్నీ పొంగేలా చేస్తుంది."
\s5
\v 22 యేసు యెరూషలేముకు సాగిపోతూ దారిలో అన్ని ఊళ్ళలో, గ్రామాల్లో ఆగుతూ ప్రజలకు దైవోపదేశం చేస్తూ ఉన్నాడు.
\p
\v 23 ఒక వ్యక్తి ఆయన్నిలా అడిగాడు, "ప్రభూ, దేవుడు రక్షించేది కొద్దిమందినేనా?"
\v 24 అందుకు యేసు "ఇరుకు దారి గుండా పోవడానికి మీరు మరింత కష్టపడాలి. చాలామంది వేరే దారిన రావడానికి ప్రయత్నిస్తారు. కానీ అలాటి వాళ్ళు లోపలి రాలేరు."
\s5
\p
\v 25 "ఇంటి యజమాని తలుపు తాళం వేసుకున్నాక నువ్వు బయట నిలబడి తలుపు కొడతావు. ఆ యజమానిని "ప్రభూ, తలుపు తెరవండి" అని బతిమాలుతావు. కానీ అతడు "కుదరదు. నువ్వెవరో, ఎక్కడినుండి వచ్చావో నాకేం తెలుసు?" అంటాడు.
\v 26 అప్పుడు మీరంటారు. "ప్రభూ, మర్చిపోయారా? మేము మీతో కలిసి భోజనం చేశాము. మా ఊళ్ళలో మీరు మాకు బోధించారు."
\v 27 కానీ అతడు "మళ్ళీ చెబుతున్నాను. మీరెవరో ఎక్కడినుంచి వచ్చారో నాకు తెలియదు. దుర్మార్గులారా, అవతలికి పొండి" అంటాడు."
\s5
\p
\v 28 యేసు ఇంకా అన్నాడు, "మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దూరం నుండి చూస్తారు. పూర్వకాలం నాటి ప్రవక్తలు కూడా అక్కడ ఉంటారు. దానంతటిమీదా దేవుడే రాజుగా పరిపాలిస్తుంటాడు. కానీ మీరు మాత్రం బయటే ఉంటారు. ఏడుస్తూ, బాధతో పళ్ళు కొరుకుతూ ఉంటారు.
\v 29 అంతేకాదు, యూదులు కాని వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు. తూర్పూ పడమరా ఉత్తరం, దక్షిణం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. దేవుడి రాజ్యంలో విందువినోదాలలో మునిగితేలుతూ ఉంటారు.
\v 30 ఇది ఆలోచించండి. ఇప్పుడు అనామకులుగా కనిపించేవాళ్ళు అప్పుడు ప్రముఖులుగా ఉంటారు. ఇప్పుడు గొప్పవాళ్ళుగా కనిపించేవాళ్ళు అక్కడ అనామకులుగా ఉంటారు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలౌతాయి."
\s5
\p
\v 31 అదే రోజు కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో అన్నారు, "ఇక్కడి నుంచి వెళ్లిపో, హేరోదు అంతిపా నిన్ను చంపాలని చూస్తున్నాడు" అన్నారు.
\v 32 ఆయన వాళ్లతో "హేరోదు జిత్తులమారి నక్క. అదే సమయంలో నక్కలాగా అల్పుడు. అతడంటే నాకేమీ లెక్క లేదు. అయితే దేవుడు రాసిపెట్టిన సమయం, ప్రదేశం వచ్చేదాకా ఎవరూ నన్ను ముట్టుకోలేరు అని అతనికి అర్థం కావాలి గనక, పోయి ఈ మాట అతనికి చెప్పండి. చూడు, నేను ఈ రోజు దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. మహిమలు ప్రదర్శిస్తున్నాను. ఇంకా కొంతకాలం చేస్తాను. ఆపైన నా పని పూర్తి అవుతుంది.
\v 33 కానీ రాబోయే రోజుల్లో నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాలి. యెరూషలేములో గాక ప్రవక్తను చంపేది మరెక్కడ?
\s5
\v 34 యెరూషలేము ప్రజలారా, గతకాలంలో ప్రవక్తలను మీరు చంపారు. దేవుడు మీ దగ్గరికి పంపిన వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపారు. తల్లి కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి తెచ్చుకుని కాపాడినట్టు నేను మిమ్మల్ని కాపాడాలని ఎన్ని సార్లు ప్రయత్నం చేశానో! కానీ మీకది ఇష్టం లేక పోయింది.
\v 35 యెరూషలేము ప్రజలారా, ఇప్పుడు చూడండి. దేవుడు ఇకపై మిమ్మల్ని కాపాడడు. ఇంకోటి కూడా చెబుతున్నా. మీ పట్టణానికి మరొక్క సారి మాత్రం వస్తాను. ఆ తరువాత నేను మళ్ళీ వచ్చేదాకా నన్నిక చూడవు. ఆ సమయంలో నా గురించి "దేవుని అధికారంతో వచ్చే ఇతన్ని దేవుడు దీవించుగాక" అంటావు."
\s5
\c 14
\p
\v 1 మళ్ళీ ఒక విశ్రాంతి రోజున యేసు పరిసయ్యుల నాయకుల్లో ఒకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారంతా ఆయన్ని కనిపెట్టి చూస్తున్నారు.
\v 2 యేసు ఎదురుగుండా వ్యాధి వల్ల చేతులూ కాళ్ళు వాచిపోయిన మనిషి ఒకడు ఉన్నాడు.
\v 3 యూదుల ధర్మశాస్త్రం బాగా తెలిసిన అక్కడున్న వాళ్ళని యేసు అడిగాడు, "విశ్రాంతి రోజున మనిషి రోగం నయం చేయడం ధర్మ సమ్మతమేనా, కాదా."
\s5
\v 4 వారేమీ మాట్లాడలేదు. యేసు ఆ మనిషిపై చేతులు వేసి అతణ్ణి బాగు చేసి "ఇక వెళ్ళు" అన్నాడు.
\v 5 ఆయన అక్కడున్న వాళ్ళతో, విశ్రాంతి రోజున మీ పిల్లవాడు గానీ ఎద్దు గానీ బావిలో పడితే పోయి వెంటనే బయటికి తీస్తారా, తియ్యరా.
\v 6 దీనిక్కూడా వాళ్ళేమీ చెప్పలేదు.
\s5
\p
\v 7 భోజనానికి పిలిచిన కొందరు ఎక్కువ గౌరవనీయులు కూర్చునే చోటే కూర్చోవాలని వెంపర్లాడడం యేసు చూశాడు. వాళ్ళకి ఈ సలహా ఇచ్చాడు.
\v 8 "మిమ్మల్ని ఎవరన్నా పెళ్లి భోజనాలకు పిలిస్తే ముఖ్యులు కూర్చునే చోట కూర్చోవద్దు. ఏమో, నీకన్నా ముఖ్యమైన మరొకణ్ణి పిలిచారేమో.
\v 9 అతడు వచ్చినప్పుడు నిన్నూ అతణ్ణి కూడా ఆహ్వానించిన వాడు వచ్చి, "ఈ కుర్చీ ఆయనికి ఇచ్చి ఈ వెనక వరసలో కూర్చో" అని నీతో అంటే ఏంటి పరిస్థితి?
\s5
\v 10 భోజనానికి వెళ్ళినప్పుడు తక్కువ ప్రాముఖ్యమైన చోట కూర్చో. అందరినీ ఆహ్వానించిన వాడు వచ్చి "మిత్రమా, ఇక్కడ కూర్చున్నావేమిటి? రా, ముందు వరసలో కూర్చో" అని నీతో అంటాడు. నీతో భోజనానికి కూర్చున్న వారందరికీ అతడు నిన్ను గౌరవిస్తున్నాడని అర్థమౌతుంది.
\v 11 తనని గొప్ప చేసుకునే వాణ్ణి దేవుడు తోక కత్తిరిస్తాడు. నమ్రతగా ఉండే వాళ్ళని గొప్ప చేస్తాడు."
\s5
\p
\v 12 యేసు తనని ఆహ్వానించిన పరిసయ్యుడితో మళ్ళీ ఇలా అన్నాడు, "మీరు మధ్యాహ్న భోజనానికి గానీ, రాత్రి భోజనానికి గానీ ఎవరినన్నా పిలవదలుచుకుంటే వాళ్ళు నిన్ను మళ్ళీ పిలుస్తారు గనక కేవలం నీ బంధుమిత్రులను, బాగా డబ్బున్న వాళ్ళని మాత్రమే పిలవకండి.
\s5
\v 13 మీరేం చెయ్యాలంటే విందు చేసేటప్పుడు పేదవాళ్ళనీ అంగవైకల్యం గల వాళ్ళనీ, కుంటి, గుడ్డి వాళ్ళనీ పిలవండి.
\v 14 అలాటి వాళ్ళు నువ్వు చేసిన దానికి బదులుగా ఏమీ చెయ్యలేరు గదా. అందుకని దేవుడు న్యాయవంతులందరినీ మళ్ళీ బతికించే సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు."
\s5
\p
\v 15 యేసుతో కూర్చుని భోంచేస్తున్న వాళ్ళలో ఒకడు ఈ మాట విని ఆయనతో, "దేవుడు అన్నిటిమీదా రాజ్య పరిపాలన చేసే కాలంలో ఆ విందు భోజనంలో కూర్చునే వారందరినీ దేవుడు దీవించాడు" అన్నాడు.
\v 16 దానికి జవాబుగా యేసు అతనితో, "ఒక సారి ఒక మనిషి చాలా పెద్ద విందు భోజనం ఏర్పాటు చేశాడు. దానికి చాలా మందిని పిలిచాడు.
\v 17 విందు రోజున అతడు తాను పిలిచిన వాళ్ళందరికీ జ్ఞాపకం చెయ్యాలని సేవకులను పంపి "విందుకి అంతా సిద్ధంగా ఉంది, రండి" అని చెప్పించాడు.
\s5
\v 18 కానీ సేవకులు వెళ్ళినప్పుడు విందుకి పిలిచిన వారంతా "మేము రాలేము" అనడం మొదలు పెట్టారు. మొదటి వాడు "ఈ మధ్యనే పొలం కొన్నాను. వెళ్లి దాన్ని చూడాలి. రాలేనందుకు మీ అయ్యగారిని క్షమించమన్నానని చెప్పు" అని సేవకుడితో అన్నాడు.
\v 19 మరొకడు "ఐదు జతల ఎద్దులు కొన్నాను. వాటిని చూసుకోడానికి వెళ్తున్నాను. రానందుకు ఏమనుకోవద్దని మీ అయ్యగారితో చెప్పు" అన్నాడు.
\v 20 ఇంకొకడు నాకీమధ్యనే పెళ్లయింది. రాలేను" అన్నాడు.
\s5
\v 21 సేవకులు తిరిగి వచ్చి పిలిచిన వారంతా చెప్పిన మాటలు యజమానికి చెప్పారు. అతనికి చాలా కోపం వచ్చింది. సేవకులతో, "తొందరగా వీధివీధికీ సందుసందుకీ వెళ్లి బీదాబిక్కీ, అవిటి, కుంటి, గుడ్డి అందర్నీ నా ఇంటికి తీసుకురండి" అన్నాడు.
\p
\v 22 సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి "అయ్యగారూ, మీరు చెప్పినట్టే చేశాం. కానీ ఇంకా చోటు ఉంది" అన్నాడు.
\s5
\v 23 అప్పుడు యజమాని "అలాగైతే ఊరి బయటికి వెళ్ళండి. రహదారుల్లో వెదకండి. కాలిబాటల్లో, కంచెల్లో కూడా వెదకండి. అలాటి చోట్ల కనిపించే వాళ్ళని నా ఇంటికి రమ్మని బలవంతం చెయ్యండి. నా ఇల్లు నిండిపోవాలి.
\v 24 పైగా నేను చెప్పేదేమిటంటే పిలిచిన వాళ్ళకి విందులో కూర్చునే ప్రాప్తం లేదు. ఎందుకంటే వాళ్ళు రాము అన్నారు."
\s5
\p
\v 25 యేసుతో కలిసి చాలా మంది నడుస్తున్నారు. యేసు వాళ్ళతో అన్నాడు.
\v 26 "ఎవరన్నా నా దగ్గరకి వచ్చి కూడా తన తల్లిదండ్రుల్ని భార్యాబిడ్డల్ని, తోబుట్టువుల్ని నన్ను ఇష్టపడిన దానికంటే ఎక్కువగా ఇష్టపడితే అలాటి వాడు నా శిష్యుడు కాలేడు. తన ప్రాణం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించాలి.
\v 27 తన సిలువను మోసుకుంటూ నా మాట వినే వాడు కాకపోతే నా శిష్యుడు కాలేడు.
\s5
\v 28 మీరెవరైనా ఏదో ఒక గోపురం కట్టించాలనుకుంటే మొదట కూర్చుని దానికి ఎంత అవుతుంది అని లెక్కలు వేసుకోరా? అప్పుడు దాన్ని పూర్తి చేయడానికి సరిపోయిన డబ్బు ఉందో లేదో అంచనా వేసుకోగలుగుతారు.
\v 29 అలా కాకుండా పునాది వేసి మిగతా కట్టడం పూర్తి చెయ్యలేకపొతే చూసినవారంతా నవ్వరా?
\v 30 "ఇతడు గోపురం మొదలు పెట్టాడు, పూర్తి చెయ్యలేక పోయాడు" అంటారు గదా.
\s5
\v 31 లేకపోతే ఒక రాజు వేరొక రాజుపైకి యుద్ధానికి సైన్యాన్ని పంపాడనుకోండి. అతడు తప్పకుండా తన మంత్రులతో కూర్చుని, తన పది వేలమంది సైన్యం ఇరవై వేలమంది శత్రు సైన్యాన్ని ఓడించగలదా, అని లెక్క చూసుకోడా?
\v 32 తన సైన్యం శత్రుసైన్యంపై గెలవలేదనుకుంటే శత్రు సైన్యం ఇంకా దూరంలో ఉన్నప్పుడే రాయబారిని పంపి "సంధి చేసుకోవాలంటే మీ షరతులు ఏమిటి?" అని ఆ శత్రు రాజుని అడుగుతాడు గదా.
\v 33 అలానే మీలో ఎవరికైనా ఉన్నదంతా మొదట వదులుకోడానికి ఇష్టం లేకపోతే మీరు నా శిష్యులు కాలేరు."
\s5
\p
\v 34 మళ్ళీ యేసు చెప్పాడు, "మీరు ఉప్పులాంటివాళ్ళు. ఉప్పు చాలా ఉపయోగం. అయితే ఉప్పులోని ఉప్పదనం పోతే దాన్ని మళ్ళీ ఉప్పగా చేయడం ఎలా?
\v 35 ఉప్పు ఉప్పగా లేకపోతే అది బయట పారెయ్యడానికి తప్ప దేనికీ పనికిరాదు. మనుషులు దాన్ని చెత్త కుప్పలో విసిరేస్తారు. నేనిప్పుడు మీకు చెప్పినది ప్రతివాడు జాగ్రత్తగా ఆలోచించాలి."
\s5
\c 15
\p
\v 1 ఒకసారి చాలామంది పన్నువసూలుదారులు, అస్తమానం పాపం చేస్తూ ఉంటారని అందరూ అనుకునే ఇతరులూ యేసు మాటలు వినడానికి వచ్చారు.
\v 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి "ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వాళ్ళతో కలసి భోజనం చేస్తున్నాడు" అని గుసగుసలాడుకున్నారు.
\s5
\p
\v 3 కాబట్టి యేసు వాళ్ళకి ఒక కథ చెప్పాడు.
\v 4 మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి. వాటిల్లో ఒకటి పోయింది. నువు తప్పకుండా 99 గొర్రెలను అడివిలో వదిలి ఆ పోయిన గొర్రె దొరికేదాకా వెతుకుతావు గదా?
\v 5 మీకు అది దొరికినప్పుడు సంతోషంగా దాన్ని భుజాలపై వేసుకుని ఇంటికి తెస్తారు గదా.
\s5
\v 6 ఇల్లు చేరాక స్నేహితుల్నీ ఇరుగుపొరుగు వాళ్ళనీ పిలిచి "నాతోబాటు సంతోషంగా ఉండండి. పోయిన నా గొర్రె దొరికింది" అంటారు గదా.
\v 7 ఇది వినండి. అదే విధంగా ఒక్క పాపి తన పాపాల విషయం పశ్చాత్తాప పడితే పరలోకంలో ఎంత సంతోషమో! దేవుడితో సరైన సంబంధంలో ఉండి, పశ్చాత్తాపపడే అవసరం లేని వాళ్ళందరికన్నా అదే ఎక్కువ సంతోషం.
\s5
\p
\v 8 "లేకపోతే ఒకామె దగ్గర పది ఖరీదైన వెండి నాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొతే, ఆమె తప్పకుండా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకూ దేవులాడదా?
\v 9 అది కనిపించగానే తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వాళ్ళనీ పిలిచి, "నాతో కలిసి సంతోషించండి. పోయిన నాణెం దొరికింది" అనదా?
\v 10 అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతలు సంబరాలు చేసుకుంటారని మీకు చెబుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 11 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఒక మనిషికి ఇద్దరు కొడుకులున్నారు
\v 12 ఒకరోజు చిన్నకొడుకు "నాన్నా, నీ తదనంతరం నీ ఆస్తిలో నాకు వచ్చే వాటా నాకు ఇచ్చెయ్యి" అన్నాడు. అతడు తన ఇద్దరు కొడుకులకు ఆస్తి పంపకాలు చేశాడు.
\s5
\v 13 కొన్ని రోజులకు చిన్న కొడుకు తనకున్నదంతా చేతబట్టుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ సుఖభోగాలకు డబ్బంతా విచ్చలవిడిగా చేజేతులా నాశనం చేశాడు."
\p
\v 14 అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. తింటానికి తిండి కరువైంది.
\s5
\v 15 దాంతో అతడు అక్కడ ఒకడి దగ్గర కూలికి చేరాడు. ఆ వ్యక్తి అతణ్ణి పందులు మేపడానికి తన పొలానికి పంపాడు.
\v 16 ఆకలి మంటలకు తాళలేక పందులు తినే ఆ చిక్కుడు గింజల పైపొట్టన్నా తినాలని చూశాడు. కానీ అతనికేమీ దొరకలేదు.
\s5
\p
\v 17 మొత్తానికి తాను చేసింది ఎంత బుద్ధితక్కువ పనో అతనికి అర్థం కాసాగింది, "మా నాన్న దగ్గర ఎందరో కూలి వాళ్ళు కడుపారా తింటున్నారు. నాకేమో ఇక్కడ తినడానికి ఏమీ లేక ఆకలికి చచ్చిపోతున్నాను
\v 18 మరేం చెయ్యాలి? నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. నాన్నా, నేను దేవునికీ నీకూ విరోధంగా పాపం చేశాను.
\v 19 ఇక నుండి నీ కొడుకు అనిపించు కోడానికి తగను. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను."
\s5
\p
\v 20 ఇలా అనుకుని అతడు కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. అతడింకా దూరంగా ఉండగానే వాళ్ళ నాన్న చూశాడు. అతనికి కొడుకుపై వల్లమాలిన జాలి పుట్టుకొచ్చింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి వాటేసుకుని బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు.
\v 21 అప్పుడు ఆ కొడుకు "నాన్నా, నేను నీకూ దేవుడికీ వ్యతిరేకంగా పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి తగను" అన్నాడు.
\s5
\p
\v 22 కానీ ఆ తండ్రి తన పనివాళ్ళతో "తొందరగా పోయి నా కొడుక్కి శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి తొడగండి. వేలికి ఉంగరం పెట్టండి. కాళ్ళకు చెప్పులు తొడగండి.
\v 23 బాగా కొవ్వు పట్టిన దూడను కోసి వండండి. మనం తిని సంబరాలు చేసుకుందాం.
\v 24 నా కొడుకు చచ్చి బతికాడు. తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు. అప్పుడు వారంతా వేడుక చేసుకోవడం మొదలు పెట్టారు.
\s5
\p
\v 25 ఇదిలా ఉండగా ఆ మనిషి పెద్దకొడుకు పొలంలో పనిచేస్తున్నాడు. పని అయిపోయాక ఇంటి దరిదాపులకు వచ్చేసరికి వాయిద్యాల, నాట్యాల చప్పుడు వినిపించింది.
\v 26 అతడు ఒక పనివాణ్ణి "ఏంటి సంగతి?" అని అడిగాడు.
\v 27 ఆ పనివాడు అతనితో, "నీ తమ్ముడొచ్చాడు. అతడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు మీ నాన్నగారు కొవ్విన దూడను వండించాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 28 పెద్ద కొడుక్కి కోపం వచ్చింది. ఇంట్లోకి పోలేదు. వాళ్ళ నాన్న బయటికి వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
\v 29 కాని అతడు, "ఇన్నేళ్ళ నుండి నీకు బానిసలాగా ఊడిగం చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాట లేదు. అయినా నా స్నేహితులతో కలసి విందు చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు
\v 30 కానీ ఇదుగో, నీ ఆస్తిని వేశ్యలకు తగలేసిన చిన్నకొడుకు వచ్చాడే, వాడు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వండి వార్చమని పనివాళ్ళతో చెప్పావు" అంటూ నిష్టూరంగా మాట్లాడాడు."
\s5
\p
\v 31 "అందుకతని తండ్రి, "నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే గదా.
\v 32 కానీ ఇప్పుడు మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చచ్చి బతికాడు. తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు."
\s5
\c 16
\p
\v 1 మళ్ళీ యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, "ఒక ధనవంతుడి దగ్గర ఒక మేనేజర్ పనిచేసేవాడు. అంటే ఆ ధనవంతుని ఆర్థిక లావాదేవీలు చూసుకునేవాడు. ఒక సారి ఆ ధనికుడికి ఒక సంగతి వినబడింది. తన మేనేజర్ తన ఆస్తిని పాడు చేస్తూ తనకు నష్టం కలిగిస్తున్నాడు.
\v 2 అతడు మేనేజర్ని పిలిచి "నువ్వు చేస్తున్నది ఏమిటి? నీ పనికి సంబంధించిన లెక్క అంతా రాసి ఇవ్వు. ఇక పైన నువ్వు మేనేజర్ గా ఉండడానికి వీల్లేదు" అన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు ఆ మేనేజర్ ఏమనుకున్నాడంటే "యజమాని నన్ను డిస్మిస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తవ్వకం వంటి కాయకష్టం చెయ్యలేను. ఇంతా బతుకు బతికి అడుక్కు తినగలనా!
\v 4 ఆ అర్థమయింది! డిస్మిస్ అయ్యాక నలుగురూ తమ ఇళ్ళలోకి నన్ను ఆహ్వానించి నన్ను ఆదుకోవాలంటే ఏంచేయాలో నాకు తెలుసులే" అనుకున్నాడు.
\s5
\v 5 కాబట్టి ఒక్కొక్కరిగా అతడు యజమానికి బాకీ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఒకడితో, "మా అయ్యగారికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు? అని అడిగాడు
\v 6 ‘మూడు వేల లీటర్ల ఆలివ్ నూనె" అని అతడన్నాడు. మేనేజర్ "నీ బిల్లులో పదిహేను వందల లీటర్లని రాసుకో" అన్నాడు.
\v 7 మరొకణ్ణి "నువ్వెంత బాకీ?" అని అడిగితే అతడు, "వంద మానికల గోదుమలు" అన్నాడు. మేనేజర్ "నీ బిల్లులో ఎనభై మానికలని రాసుకో" అన్నాడు.
\s5
\v 8 మేనేజర్ చేసిన పని యజమానికి తెలిసింది. ఆ నిజాయితీ లేని మేనేజర్ తెలివైన పని చేశాడని ఆ యజమాని మెచ్చుకున్నాడు. లౌక్యం తెలిసిన వాళ్ళు ఎంతో తెలివిగా తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇలాటి విషయాల్లో వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళ కంటే తెలివైన వాళ్ళు."
\p
\v 9 "మీతో చెబుతున్నాను, లోకంలో మీ డబ్బుతో అయిన వాళ్ళను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ డబ్బంతా పోయినప్పుడు వాళ్ళు తమ శాశ్వత గృహాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు.
\s5
\v 10 చిన్న మొత్తాల విషయంలో నమ్మకంగా ఉన్నవాళ్ళని పెద్ద మొత్తాల విషయంలో కూడా నమ్మవచ్చు. చిన్న చిన్న బాధ్యతల విషయంలో మనుషులు నిజాయితీ చూపకపోతే అలాటివాళ్ళు ముఖ్యమైన వాటిల్లో కూడా అలానే ఉంటారు.
\v 11 కాబట్టి లోకంలో దేవుడు మీకిచ్చిన డబ్బును నిజాయితీగా వాడలేక పోతే ఇక పరలోకంలో ఉన్న నిజమైన ధనం దేవుడు మీకు ఎందుకు ఇస్తాడు?
\v 12 ఇతరుల ఆస్తిని మీరు జాగ్రత్తగా కాపాడలేక పోతే మీ సొంత ఆస్తి మీకు ఎవరిస్తారు?
\s5
\p
\v 13 ఏ సేవకుడైనా ఒకేసారి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేయడానికి ప్రయత్నిస్తే అతడు ఒక యజమానిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకడికి కట్టుబడి ఉండి రెండవ వాణ్ణి చిన్న చూపు చూస్తాడు. మీరు పొద్దస్తమానమూ డబ్బు సంపాదనలో మునిగి తేలుతూ ఉంటే దేవుణ్ణి సేవించడం కుదరదు."
\s5
\p
\v 14 యేసు ఇలా అనడం పరిసయ్యులు విని ఆయన్ని ఎగతాళి చెయ్యసాగారు. ఎందుకంటే డబ్బు సంపాదన వాళ్ళకి ఎంతో ఇష్టం.
\v 15 యేసు వాళ్ళతో, "మీరేదో నీతిపరులని అందరూ అనుకోవాలని మీరు చూస్తారు. కానీ లోపల ఏముందో దేవుడికి తెలుసు. ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలామంది ఏది ప్రాముఖ్యం అనుకుంటారో అది దేవుడికి పరమ అసహ్యం."
\s5
\p
\v 16 "దేవుడు మోషేకు ఇచ్చిన న్యాయ చట్టాలూ ప్రవక్తల రాతలూ బాప్తిసం ఇచ్చే యోహాను కాలం దాకా ఉన్నాయి. అప్పటి నుండి దేవుడే రాజుగా పాలించే కాలాన్ని గురించిన సందేశం ప్రకటన జరుగుతూనే ఉంది. చాలామంది ఆ సందేశం అంగీకరించి దేవుణ్ణి తమ జీవితాలపై రాజుగా నిలుపుకోవాలని ఆత్రుతగా ఉన్నారు.
\v 17 దేవుని చట్టాలన్నీ అవి ఎంత చిన్నవైనా సరే అకాశాలకన్నా భూమి కన్నా అవే శాశ్వతం."
\s5
\p
\v 18 "ఎవరన్నా భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే భర్త నుండి విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు కూడా వ్యభిచారం చేస్తున్నాడు."
\s5
\p
\v 19 యేసు ఇంకా ఇలా చెప్పాడు, "ఒక ధనికుడు ఉండేవాడు. అతడు ఖరీదైన ఊదారంగు పట్టు బట్టలు ధరించేవాడు. ప్రతి రోజూ సుఖ విలాసాలతో పొద్దు పుచ్చేవాడు.
\v 20 లాజరు అనే నిరుపేద కూడా ఆ ధనికుని ఇంటి గుమ్మం ఎదుట పడి ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు.
\v 21 ఆకలేసి ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే మెతుకులు తిని ఆకలిమంట చల్లార్చుకోవాలని చూసేవాడు. వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
\s5
\v 22 కొంతకాలానికి ఆ పేదవాడు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి వాళ్ళ పూర్వీకుడు అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనికుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
\p
\v 23 చనిపోయిన వాళ్ళుండే చోట ఆ ధనికుడు ఘోర యాతన పడుతున్నాడు. పైకి చూసి దూరాన అబ్రాహామునీ, అతని సరసన లాజరునీ చూశాడు.
\s5
\v 24 తండ్రీ అబ్రాహామూ, నీకు జాలి లేదా. నేను ఈ మంటల్లో అల్లాడిపోతున్నాను. లాజరు తన వేలిని నీళ్ళలో ముంచి నా నాలుకను తాకి చల్లబరచడానికి అతణ్ణి పంపవా! అని కేకలు పెట్టాడు.
\s5
\v 25 అందుకు అబ్రాహాము, "నాయనా, గుర్తుందా? నువ్వు బతికి ఉన్న రోజుల్లో ఎన్నో సుఖాలు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో బాధలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు ఆనందంగా ఉన్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
\v 26 అదీగాక మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది. మా దగ్గరనుండి మీ దగ్గరికి రావాలంటే కుదరదు. అక్కడి వాళ్ళు మా దగ్గరికి రావడమూ అసాధ్యం" అన్నాడు.
\s5
\v 27 అప్పుడా ధనికుడు, "తండ్రీ, అలాగైతే ఆ లాజరుని ఒక్కసారి మా ఇంటికి పంపించు.
\v 28 నాకు ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు కూడా ఈ భయానకమైన యాతన స్థలానికి రాకుండా వాళ్ళని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకుంటున్నాను" అన్నాడు.
\s5
\v 29 అందుకు అబ్రాహాము, "అలా కుదరదు. ఎందుకంటే పూర్వకాలం మోషే, ప్రవక్తలూ రాసినవన్నీ వాళ్ళకి తెలుసు. నీ సోదరులు వాళ్ళ మాటలు వినాలి" అన్నాడు
\v 30 కానీ ధనికుడు, "అలాకాదు తండ్రీ, అబ్రాహామూ, చనిపోయిన వారెవరన్నా వెళ్లి హెచ్చరిస్తే వాళ్ళు తప్పక తమ పాపపు ప్రవర్తన విడిచిపెడతారు" అన్నాడు.
\v 31 అబ్రాహాము, "మోషే, ప్రవక్తలూ రాసిన మాటలు వాళ్ళు వినకపోతే ఎవరైనా చనిపోయి బ్రతికి వెళ్ళినా నమ్మరు. పాపాలు చెయ్యడం మానుకోరు" అన్నాడు."
\s5
\c 17
\p
\v 1 యేసు తన శిష్యులతో, "మనుషులు పాపం చేసేలా పరీక్షలు తప్పకుండా వస్తాయి. కాని, అవి జరగడానికి కారణమైన వాడి పరిస్థితి ఎంత ఘోరం!
\v 2 ఎవరైనా విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాడు పాపం చేసేందుకు కారణమయ్యే ఆ వ్యక్తి మెడకి పెద్ద బండ కట్టి, సముద్రంలోకి విసిరేస్తే అతనికి మంచిది.
\s5
\v 3 నీ ప్రవర్తన జాగ్రత్త. నీ సోదరుల్లో ఒకడు పాపం చేస్తే నువ్వు అతన్ని గద్దించు. అతడు పాపం చేసినందుకు విచారించి, తనను క్షమించమని అడిగితే, అప్పుడు నువ్వు వాణ్ణి క్షమించాలి.
\v 4 నీకు విరోధంగా రోజుకి ఏడుసార్లు తప్పు చేసినప్పటికీ, తప్పు చేసిన ప్రతిసారీ, "నేను చేసిన దానికి బాధపడుతున్నాను" అంటే క్షమిస్తూ ఉండాల్సిందే."
\s5
\p
\v 5 అప్పుడు అపొస్తలులు ప్రభువుతో," మాకు ఎక్కువ విశ్వాసాన్ని పెంచు" అని అడిగారు.
\v 6 అందుకు ప్రభువు, "మీకు విశ్వాసం ఉంటే అది ఈ ఆవ గింజ కంటే పెద్దదేమీ కాదు. అయినా మీరు ఈ మల్బరీ చెట్టుతో, "వేళ్ళతో సహా నువ్వు భూమి నుండి పెకలించుకు పోయి సముద్రంలో నాటుకో" అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 7 యేసు మళ్ళీ చెప్తూ, "మీ గొర్రెల్ని కాసేవాడో మీ పొలం దున్నే పాలేరో ఉన్నాడనుకోండి. అతడు పొలం నుండి ఇంటికి వచ్చాక, "రావోయ్, ఇలా కూర్చో. వెంటనే భోజనం చెయ్యి" అనవు గదా.
\v 8 అతనితో, "నాకు భోజనం వండు, వడ్డించడానికి పైబట్ట కట్టుకొని నాకు భోజనం వడ్డించి, నేను తినే దాకా ఉండు. ఆ తరువాత నువ్వు భోజనం చేయవచ్చు" అంటావు.
\s5
\v 9 తనకు చెప్పిన పనులు చేసినందుకు నీ పనివాడికి నువ్వు కృతజ్ఞతలు చెప్పవు.
\v 10 అలాగే, దేవుడు చెప్పిందంతా మీరు చేసినప్పుడు, "మనం దేవుని పనివాళ్ళం మాత్రమే. ఆయన మనకు కృతజ్ఞతలు చెప్పడానికి మనం అర్హులం కాదు. ఆయన మనకు చెప్పిన పనులను మాత్రమే మనం చేసాం" అనాలి."
\s5
\p
\v 11 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము దారిలో పోతూ సమరయ, గలిలయ ప్రాంతాల మధ్య ప్రాంతం చేరుకున్నారు.
\v 12 యేసు ఒక గ్రామంలోకి వెళ్తుండగా పదిమంది కుష్ఠు రోగులు ఆయన దగ్గరికి వచ్చి, కొంత ఎడంగా నిల్చున్నారు.
\v 13 వాళ్ళు, "యేసయ్యా, మాపై జాలి చూపించు" అన్నారు.
\s5
\v 14 ఆయన వాళ్ళతో "మీరు పోయి యాజకునికి కనపడండి" అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు వెళుతుండగా బాగుపడ్డారు.
\v 15 వాళ్ళలో ఒకడు తాను స్వస్థపడడం చూసుకొని, వెనక్కి తిరిగి వచ్చి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించాడు.
\v 16 అతడు యేసు దగ్గరికి వచ్చి, నేలపై పడి, యేసు పాదాలపై తల ఆనించి ఆయనకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వ్యక్తి సమరయ జాతివాడు.
\s5
\v 17 అప్పుడాయన, "నేను పదిమంది కుష్ఠు రోగుల్ని బాగు చేసాను. మిగిలిన తొమ్మిదిమంది ఏమయ్యారు?
\v 18 ఈ పరదేశి ఒక్కడు మాత్రమే దేవునికి వందనాలు చెప్పడానికి తిరిగి వచ్చాడేమిటి? మిగిలినవాళ్ళు వెనక్కి రాలేదేం" అన్నాడు.
\v 19 అప్పుడు ఆయన అతనితో, "లేచి, నీ దారిన వెళ్ళు. నువ్వు నాపై నమ్మకం ఉంచినందుకు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు" అన్నాడు.
\s5
\p
\v 20 ఒక రోజు యేసును కొందరు పరిసయ్యులు, "దేవుడు అందరినీ ఏలడం ఎప్పుడు?" అని అడిగారు. ఆయన, "అది మనుషులు కళ్ళతో చూడగలిగే సూచనల్లా కాదు.
\v 21 "ఆయన ఇక్కడ పాలిస్తున్నాడు, అక్కడ పాలిస్తున్నాడు" అని మనుషులు చెప్పలేరు. ఎందుకంటే నీవు ఆలోచించే దానికి భిన్నంగా దేవుడు పరిపాలించడం ఎప్పుడో ప్రారంభించాడు.
\s5
\p
\v 22 యేసు తన శిష్యులతో, "మనుష్య కుమారుడైన నేను శక్తివంతంగా ఏలుతుండగా మేము చూడాలి అని మీరు అనుకునే సమయం ఒకటి వస్తుంది. కాని మీరు నన్ను చూడలేరు.
\v 23 మనుషులు మీతో, "క్రీస్తు అక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు చూడండి" అన్నప్పుడు మీరు ఆ మాటలు నమ్మకండి.
\v 24 ఆకాశంలో మెరుపు మెరిసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెలుగు కనిపించినట్టు ప్రతి ఒక్కరూ నన్ను చూడగలుగుతారు. అలాగే మనుష్యకుమారుడైన నేను, తిరిగి రావడం ప్రతి ఒక్కరూ చూస్తారు.
\s5
\v 25 కానీ అది జరగడానికి ముందు నేను ఎన్నో హింసల పాలౌతాను."
\p
\v 26 "నోవహు బ్రతికిన కాలంలోని ప్రజలు చేసినట్టు ఇప్పటి ప్రజలూ చేస్తారు.
\v 27 నోవహు తన భార్యాబిడ్డలతో ఓడలోకి ప్రవేశించేంత వరకూ ఆ కాలం ప్రజలు యదాలాపంగా తింటూ తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తరువాత వరద వచ్చింది, ఓడలో లేని వాళ్ళందర్నీ నాశనం చేసింది.
\s5
\v 28 అదే విధంగా సొదొమ పట్టణంలో లోతు నివసిస్తున్నప్పుడు ప్రజలు తిని, తాగుతూ ఉండేవారు. వాళ్ళు వస్తువులు కొంటూ, అమ్ముతూ ఉన్నారు, పంటలు పండించారు, ఇల్లు కట్టుకున్నారు.
\v 29 కాని లోతు సొదొమ వదిలి వెళ్ళిపోయాక ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందర్నీ నాశనం చేసింది.
\s5
\v 30 అలాగే నేను మనుష్యకుమారుణ్ణి, ప్రజలు సిద్ధంగా లేనప్పుడు భూమికి తిరిగివస్తాను.'
\p
\v 31 "ఆ రోజు బయట ఉన్న వాళ్ళందరూ తమ వస్తువులు ఇళ్ళల్లో ఉన్నాకూడా వాటిని తీసుకోడానికి ఇంట్లోకి వెళ్ళకూడదు. అలాగే పొలంలో పని చేసే వాళ్ళు దేన్నైనా తెచ్చుకోడానికి వెనక్కి వెళ్ళకూడదు. తొందరగా పారిపోవాలి."
\s5
\p
\v 32 "లోతు భార్యకు సంభవించింది గుర్తు తెచ్చుకోండి.
\v 33 తన సొంత దారిలో బ్రతకడం కొనసాగించే ప్రతి వాడు చస్తాడు. కాని నా కారణంగా తన పద్ధతి మార్చుకున్నవాడు శాశ్వతకాలం బ్రతుకుతాడు."
\s5
\p
\v 34 "నేను తిరిగి వచ్చిన రాత్రి ఒక మంచం మీద ఇద్దరు నిద్రపోతుంటే, నాలో విశ్వాసం ఉంచినవాణ్ణి దేవుడు పరలోకానికి తీసుకు పోతాడు, ఇంకొకడు ఉండిపోతాడని నేను మీకు చెప్తున్నాను.
\v 35 ఇద్దరు ఆడవాళ్లు తిరగలి విసురుతుంటే, ఒకామె వెళ్ళిపోతుంది. మరొకామె ఉండిపోతుంది" అన్నాడు.
\p
\v 36 ఆయన శిష్యులు ఆయనతో, "స్వామీ, ఇవి ఎక్కడ జరుగుతాయి?"
\s5
\v 37 అని అడిగారు. ఆయన జవాబిస్తూ, "శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు దాన్ని తినడానికి పోగవుతాయి" అన్నాడు.
\s5
\c 18
\p
\v 1 యేసు వెంటనే జవాబు రాని ప్రార్థనలకు నిరుత్సాహ పడకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలని తన శిష్యులకు చెప్పడానికి ఇంకొక కథ వాళ్ళకి చెప్పాడు.
\v 2 "ఒక ఊరిలో దేవుడంటే గౌరవించని, ప్రజల్ని పట్టించుకోని పొగరుబోతు న్యాయాధిపతి ఉన్నాడు.
\s5
\v 3 ఆ ఉళ్ళో ఒక వితంతువు ఆ న్యాయాధిపతి దగ్గరికి మాటిమాటికీ వస్తూ, "న్యాయస్థానంలో నామీద కేసు వేసిన మనిషి నుండి నాకు న్యాయం తీర్చండి" అని అడుగుతూ ఉండేది.
\v 4 చాలా కాలం ఈ న్యాయాధిపతి ఆమెను పట్టించుకోలేదు. కాని తరువాత అతడు తనలో, "నేను దేవుణ్ణి లెక్కచెయ్యను, మనుషులను పట్టించుకోను.
\v 5 మరయితే ఈ వితంతువు నా ప్రాణాలు తోడేస్తున్నది. ఏం జేస్తాం, ఆమెకి న్యాయంగా తీర్పు చెప్పేస్తే, పీడ విరగడ అవుతుంది, మాటిమాటికీ ఆమె నా దగ్గరకు రాకుండా, విసిగించకుండా ఉంటుంది గదా" అనుకున్నాడు."
\s5
\p
\v 6 యేసు ఇలా చెప్పి, "ఈ అన్యాయమైన న్యాయాధిపతి ఏమన్నాడో జాగ్రత్తగా ఆలోచించండి.
\v 7 న్యాయం తీర్చే దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలు రాత్రింబవళ్ళు తనను ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి మరింత ఖాయంగా న్యాయం తీర్చడా? వాళ్ళ విషయంలో ఆయన ఎప్పుడూ సహనంతో ఉంటాడు.
\v 8 దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళకి ఇంకా తొందరగా న్యాయం చేస్తాడని నేను చెప్తున్నాను. మనుష్య కుమారుణ్ణి అయిన నేను తిరిగి భూమికి వచ్చినప్పుడు ఇంకా నన్ను నమ్మనివాళ్ళు చాలామంది ఉంటారు" అన్నాడు.
\s5
\p
\v 9 తరువాత తామే నీతిమంతులమనుకుని, ఇతరుల్ని చిన్నచూపు చూసే వాళ్ళ గురించి కూడా యేసు ఈ కథ చెప్పాడు.
\v 10 "ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి రోమన్ ప్రభుత్వం తరుపున ప్రజల నుండి పన్నులు వసూళ్లు చేసేవాడు.
\s5
\v 11 ఆ పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థన చేసుకున్నాడు, "ఓ దేవా, ఇతరుల్లా నేను లేనందుకు వందనాలు. కొందరు దొంగతనం చేస్తారు. కొందరు అన్యాయం చేస్తారు. కొందరు వ్యభిచారం చేస్తారు. నేను అవేవీ చేయను. ప్రజల్ని మోసగించే పాపాత్ములైన పన్ను వసూలుదారుల వంటి వాణ్ణి కాదు నేను.
\x -
\xo 18.11
\xt
\x*
\v 12 నేను వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు దేవాలయంలో చెల్లిస్తాను."
\s5
\p
\v 13 "మరోవైపు ఒక పన్ను వసూలుదారుడు దేవాలయ ప్రాంగణంలో తక్కిన వాళ్లకి దూరంగా నిలబడ్డాడు. అతడు ఆకాశం వైపు కూడా చూడడానికి సాహసించలేదు. గుండెలు బాదుకుంటూ, "దేవా, నాపై జాలి చూపి నన్ను క్షమించు. నేను భయంకరమైన పాపిని" అని ప్రార్థన చేసాడు."
\v 14 ఇలా చెప్పి యేసు, "పన్ను వసూలుదారుడు క్షమాపణ పొంది ఇంటికి పోయాడు. పరిసయ్యుడికి క్షమాపణ దొరకలేదు. ఇది ఎందుకు చెప్పానంటే తనను గొప్ప చేసుకొనే వాణ్ణి దేవుడు తగ్గిస్తాడు. తనను తగ్గించుకొనేవాణ్ణి ఘనపరుస్తాడు."
\s5
\p
\v 15 ఒక రోజు యేసు తమ చిన్న పిల్లలపై చెయ్యి వేసి దీవించాలని ప్రజలు వాళ్ళ బిడ్డల్ని తెచ్చారు. శిష్యులు చూసి, వాళ్ళను ఆపారు.
\v 16 కాని యేసు చిన్న పిల్లలను తన దగ్గరికి తెమ్మన్నాడు. ఆయన, "చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానీయండి. వాళ్ళని ఆపకండి! ఈ పిల్లల్లా నమ్రతగా ఉండి, నమ్మిక ఉంచిన వాళ్ళని దేవుడు పాలించడానికి ఇష్టపడతాడు.
\v 17 నిజానికి చిన్న బిడ్డలా తగ్గింపుతో తమపై దేవుడు ప్రభుత్వం చెయ్యడానికి అంగీకరించకపోతే అలాటి వ్యక్తిని దేవుడు అంగీకరించడు. నేను మీకు చెప్తున్నాను వినండి" అన్నాడు.
\s5
\p
\v 18 ఒకసారి ఒక యూదీయ నాయకుడు యేసును, "సద్బోధకా, నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చెయ్యాలి?" అని అడిగాడు.
\v 19 యేసు అతనితో, "నన్ను మంచివాడు అని ఎందుకంటున్నావు? నిజంగా మంచివాడు దేవుడు ఒక్కడే.
\v 20 ఇక నీ ప్రశ్నకు జవాబు. దేవుడు మోషే ద్వారా మనకు ఇచ్చిన ఆజ్ఞలు నీకు బాగా తెలుసుగా. వ్యభిచారం చెయ్యొద్దు, హత్య చెయ్యొద్దు, దొంగిలించొద్దు, తప్పుడు సమాచారం ఇవ్వొద్దు, నీ తలిదండ్రుల్ని గౌరవించాలి, అనేవి."
\v 21 అతడు, "తెలుసు. చిన్నప్పటి నుండి నేను ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను" అన్నాడు.
\s5
\v 22 అది విని యేసు "నువ్వు మరొక్కటి చెయ్యాలి. నీకు ఉన్నదంతా అమ్మి, ఆ డబ్బు పేదలకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం వస్తుంది. తరువాత నా శిష్యుడిగా వచ్చెయ్యి" అన్నాడు.
\p
\v 23 అతడు చాలా ధనవంతుడు గనక అది విని హతాశుడయ్యాడు.
\s5
\v 24 అతడలా మొహం మాడ్చుకోవడం చూసి యేసు కూడా చాలా బాధపడ్డాడు. ఆయన, "దేవుని పరిపాలన కిందికి ఐశ్వర్య వంతులు రావడం చాలా కష్టం,
\v 25 నిజానికి ధనికుల జీవితాలు దేవుని ఏలుబడి క్రిందికి రావడం కంటే సూది కన్నంలో ఒంటె దూరడం సులువు."
\s5
\p
\v 26 యేసు చెప్పిన ఈ మాటలు విన్నవాళ్ళు, "అలాగైతే ఇక రక్షణ పొందేది ఎవరు మరీ?" అన్నారు.
\v 27 కాని యేసు, "మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే"అన్నాడు.
\s5
\v 28 అప్పుడు పేతురు, "చూడు, మేము అన్నీ వదిలి నీ శిష్యులుగా ఉండడానికి వచ్చాము" అన్నాడు.
\v 29 యేసు వాళ్ళతో, "ఔను. నేను కూడా చెప్తున్నాను. తమ ఇల్లూవాకిలీ వదులుకున్న వాళ్ళు, భార్యాబిడ్డలనూ, సోదరులనూ తలిదండ్రులనూ వదులుకున్న వాళ్ళు, తమను దేవుని ఇష్టానికి సమర్పించుకున్న వాళ్ళు,
\v 30 వీళ్ళంతా వదులుకున్న దాని కంటే ఎన్నో రెట్లు తమ జీవితాల్లో పొందుతారు. తరువాతి కాలంలో నిత్య జీవం పొందుతారు.
\s5
\p
\v 31 యేసు పన్నెండు మంది శిష్యుల్ని ఒక పక్కకి పిలిచి, "జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం. మనం అక్కడ ఉండగా నా గురించి అంటే మనుష్య కుమారుణ్ణి గురించి చాలా కాలం క్రితం ప్రవక్తలు రాసినవి నెరవేరబోతున్నాయి.
\v 32 నా శత్రువులు నన్ను యూదేతరులకు పట్టిస్తారు. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, నా పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు.
\v 33 వాళ్ళు నన్ను కొరడాలతో కొట్టి, నన్ను చంపుతారు. తరువాత మూడవ రోజు నేను తిరిగి సజీవంగా లేస్తాను" అని చెప్పాడు.
\s5
\v 34 కాని ఆయన చెప్పిన సంగతులేవీ శిష్యులకు అర్థం కాలేదు. ఆయన చెప్పినవి వాళ్లకు అర్థం కాకుండా దేవుడు చేసాడు.
\s5
\p
\v 35 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుడ్డి వాడు దారి ప్రక్కన కూర్చునీ ఉన్నాడు. అతడు దారి పక్కన కూర్చుని అడుక్కుంటున్నాడు.
\v 36 అతడు దారిన పోయే జనం సందడి విని, వాళ్ళను "ఏం జరుగుతోంది బాబయ్యా?" అని అడిగాడు.
\v 37 వాళ్ళు, "నజరేతు ఊరివాడు యేసు వస్తున్నాడు" అని చెప్పారు.
\s5
\v 38 అతడు వెంటనే "దావీదు కుమారా యేసయ్యా, నాపై జాలి చూపించు" అని గొంతు చించుకుని అరవసాగాడు.
\v 39 ఆ గుంపులో నడిచేవాళ్ళు అతన్ని నోరు మూసుకోమని తిట్టారు. కాని అతడు అంతకంటే గట్టిగా అరుస్తూ, "దావీదు రాజు సంతతి వాడా, నాపై జాలి చూపించు" అని గగ్గోలు పెట్టాడు.
\s5
\p
\v 40 యేసు ఆగి, అతన్ని తన దగ్గరికి తెమ్మని ఆజ్ఞాపించాడు.
\v 41 ఆ గుడ్డ్డివాడు దగ్గరికి వచ్చినప్పుడు యేసు అతన్ని, "ఏం కావాలి?" అని అడిగాడు. అతడు, "స్వామీ, నేను చూడగలిగేలా చెయ్యి" అన్నాడు.
\s5
\v 42 యేసు అతనితో, "నువ్వు నాలో విశ్వాసం ఉంచావు గాబట్టి నేను నిన్ను స్వస్థపరిచాను" అన్నాడు.
\v 43 వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసుతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించారు.
\s5
\c 19
\p
\v 1 యేసు యెరికో అనే ఊరు చేరి దారి వెంట నడుస్తున్నాడు.
\v 2 అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు పన్నుల వసూలుదారు, చాలా ధనవంతుడు.
\s5
\v 3 జక్కయ్య పొట్టివాడు. అతనికి యేసును చూడాలని ఉంది కాని జనం చుట్టూ మూగి ఉండడంతో చూడలేకపోయాడు. యేసు చుట్టూ చాలామంది గుమికూడి ఉన్నారు.
\v 4 కాబట్టి దారిలో కొంచెం ముందుకు వెళ్ళి, యేసు అక్కడికి వచ్చే సరికల్లా తనకు కనిపించేలా ఒక మేడి చెట్టు ఎక్కాడు.
\s5
\v 5 యేసు అక్కడికి వచ్చినప్పుడు, ఆగి కి చూసి, "జక్కయ్యా, త్వరగా చెట్టు దిగిరా, ఈ రాత్రికి నేను నీ ఇంట్లో ఉంటాను" అన్నాడు.
\v 6 కాబట్టి అతడు వెంటనే చెట్టు దిగాడు. సంబరపడుతూ యేసును ఇంటికి తీసుకుపోయాడు.
\v 7 కాని ఆయన్ని అక్కడ చూసిన వాళ్ళందరూ,"ఆయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు!" అని సణుక్కున్నారు
\s5
\p
\v 8 వాళ్ళు భోజనం చేస్తూండగా జక్కయ్య నిలబడి యేసుతో, "ప్రభూ! నాకు ఉన్న దానిలో సగభాగం బీద వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను మోసంగా డబ్బు గుంజిన వాళ్ళకి నాలుగు రెట్లు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాను" అన్నాడు.
\v 9 యేసు అతనితో, "ఇతడు తాను నిఖార్సైన అబ్రాహాము సంతానం వాడని చూపించుకున్నందుకు ఈ రోజు దేవుడు ఈ ఇంటిల్లిపాదినీ రక్షించాడు.
\v 10 ఇది గుర్తుంచుకో. నేను మనుష కుమారుణ్ణి, దేవుని నుండి దారి తప్పిన నీలాంటి వాళ్ళని కనిపెట్టి రక్షించడానికే వచ్చాను."
\s5
\p
\v 11 యేసు చెప్పిందంతా ప్రజలు వింటున్నారు. యెరూషలేము పరిసరాల్లోకి వస్తుండగా యేసు వాళ్ళకి ఇంకొక కథ చెప్పాలనుకున్నాడు. యెరూషలేము చేరిన వెంటనే దేవుని ప్రజల పై ఆయన రాజుగా ఏలుతాడు అనుకొనే వాళ్ళ ఉద్దేశం సరిచేయడానికి ఈ కథ చెప్పాలని ఆయన ఉద్దేశం.
\p
\v 12 "ఒక యువరాజు తను నివసించే దేశ ప్రజలను రాజుగా పరిపాలించే అధికారం కోసం దూర దేశంలో తన పైన అధికారిగా ఉన్న రాజు నుండి హక్కును అడిగి సంపాదించుకోడానికి వెళ్ళాడు.
\s5
\v 13 వెళ్ళే ముందు తన సేవకుల్లో పదిమందిని పిలిచాడు. వాళ్ళందరికీ సమానంగా డబ్బు ఇచ్చి, "నేను వచ్చేంత వరకు ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
\v 14 కాని అతని దేశ ప్రజలు చాలామందికి అతడంటే ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు అతని పై అధికారిగా ఉన్న రాజుకు, "ఇతడు మాకు రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు" అని చెప్పడానికి రాయబారుల్ని పంపారు.
\p
\v 15 కాని ఎలా అయితేనే అతడు రాజయ్యాడు. తిరిగి కొత్త రాజుగా అతడు స్వదేశం వెళ్ళాడు. తాను డబ్బు ఇచ్చిన సేవకుల్ని పిలిచాడు. తను ఇచ్చిన డబ్బుతో ఎంత వ్యాపారం చేసారో తెలుసుకోడానికి వారిని పిలిచాడు.
\s5
\p
\v 16 మొదటి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, "అయ్యగారూ, మీరిచ్చిన డబ్బుతో అంతకు పది రెట్లు సంపాదించాను" అన్నాడు.
\v 17 ఆ రాజు అతనితో, "సెభాష్, నువ్వు మంచి సేవకుడివి. చాలా బాగా చేసావు. నీకిచ్చిన కొద్ది డబ్బు జాగ్రత్త చేసి, నమ్మకంగా పనిచేసావు. నువ్వు పరిపాలించడానికి పది ఉర్లు ఇస్తాను" అన్నాడు.
\s5
\p
\v 18 తరువాత రెండవ సేవకుడు వచ్చి, "అయ్యగారూ, మీరు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఐదు రెట్లు అయ్యింది" అన్నాడు.
\v 19 అతడు ఆ సేవకుడితో, "బాగా చేసావు. నిన్ను ఐదు ఊర్లపై నియమిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 20 అప్పుడు ఇంకొక సేవకుడు వచ్చి, "అయ్యగారూ, ఇదుగో మీ డబ్బు. గుడ్డలో చుట్టి భద్రంగా దాచిపెట్టాను.
\v 21 వ్యాపారం సాగకపోతే నువ్వు నన్ను ఏం చేస్తావో అని భయపడ్డాను. నువ్వు నీది కానిది ఇతరుల నుండి లాక్కొనేంత కఠినాత్ముడివనీ, ఇంకొకళ్ళు నాటిన పంటను కోసుకునే వాడివనీ నాకు తెలుసు" అన్నాడు.
\s5
\v 22 ఆ రాజు వాడితో, "ఓరీ దుష్టుడా, నీ మాటల మీదనే నిన్ను శిక్షిస్తాను. నేను కఠినాత్ముడినని నీకు తెలుసు. నాది కానిది నేను తీసుకుంటాననీ, నేను నాటని పంటను కోస్తాననీ నీకు తెలుసు.
\v 23 మరి అలాంటప్పుడు నా డబ్బును వడ్డీకి ఇవ్వొచ్చు గదా. నేను వచ్చి అసలూ వడ్డీ కూడా పుచ్చుకునే వాణ్ణి గదా" అన్నాడు.
\s5
\v 24 తన దగ్గర నిలబడిఉన్న వాళ్ళతో, "వీడి దగ్గరున్న డబ్బు తీసేసుకుని పది రెట్లు సంపాదించిన వాడికి ఇవ్వండి" అన్నాడు.
\p
\v 25 వాళ్ళు, "అయ్యా, సరేగానీ అతనికి ఇప్పటికే చాలా డబ్బు ఉంది కదా?" అన్నారు.
\s5
\v 26 అప్పుడు రాజు, "తన దగ్గరున్న దాన్ని బాగా వినియోగించే వాళ్ళకి నేను ఇంకా ఇస్తాను. కానీ ఉన్నది ఉపయోగించని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి ఉన్నది కూడా తీసేస్తాను.
\v 27 నా అధికారం ఇష్టం లేదని పై రాజుకు కబురు పంపిన నా శత్రువులను ఇప్పుడు నా దగ్గరికి తీసుకువచ్చి, నేను చూస్తుండగా వాళ్ళని వధించండి" అన్నాడు."
\s5
\p
\v 28 ఈ విషయాలు యేసు చెప్పాక, ఆయన యెరూషలేము వెళ్ళే దారిలో శిష్యులకు ముందుగా నడక కొనసాగించాడు.
\s5
\v 29 ఒలీవల కొండ దగ్గర బేత్పగే, బేతనీ గ్రామాల దగ్గరికి వెళ్తూండగా
\v 30 ఆయన తన శిష్యులలో ఇద్దరితో, "మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే ఎవరూ ఎక్కని ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది. దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురండి.
\v 31 ఎవరైనా మిమ్మల్ని "గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగితే, "ప్రభువుకు కావాలి" అని చెప్పండి" అన్నాడు.
\s5
\v 32 ఆ ఇద్దరు శిష్యులు ఆ గ్రామానికి వెళ్లారు. యేసు చెప్పినట్టే ఆ గాడిద కనిపించింది.
\v 33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా ఆ గాడిద సొంతదారు "మా గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగాడు.
\v 34 వాళ్ళు, "ఇది ప్రభువుకు అవసరం" అన్నారు.
\p
\v 35 అప్పుడు శిష్యులు గాడిదను యేసు దగ్గరికి తెచ్చారు. వాళ్ళ పైబట్టల్ని గాడిద మీద వేసి, యేసును దానిపై ఎక్కించారు.
\v 36 అప్పుడు ఆయన దానిపై స్వారీ చేస్తూ వెళ్తూండగా ప్రజలు వాళ్ళ పైబట్టలు దారి పొడవునా గౌరవార్ధంగా ఆయన ఎదుట రోడ్డు మీద పరిచారు.
\s5
\p
\v 37 ఒలీవల కొండ పైనుండి దిగి వెళ్ళే దారిలో వాళ్ళు వస్తూండగా ఆయన శిష్యుల సమూహమంతా ఉత్సాహంతో యేసు చేసిన అద్భుతాలు తాము చూసినందుకు దేవునికి బిగ్గరగా స్తుతి చెల్లించారు.
\v 38 "దేవుని అధికారంతో వచ్చిన మన రాజును దేవుడు దీవించును గాక! దేవునికి, ఆయన ప్రజలైన మనకు మధ్య శాంతి ఉండును గాక! ప్రతి వారూ దేవుని స్తుతించండి!" అని చెప్పారు.
\s5
\p
\v 39 ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు ఆయనతో, "బోధకా, అలా చెప్పకుండా నీ శిష్యుల్ని ఆపు" అన్నారు.
\v 40 ఆయన, "నేను మీతో చెప్తున్నాను. ఈ ప్రజలు మౌనంగా ఉంటే రాళ్ళు వాటికవే నన్ను స్తుతిస్తూ హర్షధ్వానాలు చేస్తాయి" అన్నాడు.
\s5
\p
\v 41 యేసు యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఉండగా ఆయన ఆ ప్రజల విషయంలో విలపించాడు.
\v 42 "దేవుని శాంతిని ఎలా పొందాలో నేటికి మీకు తెలుస్తుందనుకున్నాను. కాని ఇప్పుడు మీకు తెలియలేదు.
\s5
\v 43 త్వరలో మీ శత్రువులు వచ్చి, మీ పట్టణం చుట్టూ ముట్టడి వేస్తారు. పట్టణాన్ని చుట్టుముట్టి, అన్ని వైపుల నుండి దాడి చేస్తారు.
\v 44 కోట గోడలు పడగొట్టి, సమస్తం నాశనం చేస్తారు. మిమ్మల్ని, మీ పిల్లల్ని హతమారుస్తారు. వాళ్ళు అంతా నాశనం చేయడం పూర్తయ్యాక అక్కడ ఒక్క రాయి కూడా ఒక దానిపై ఒకటి మిగలదు. మరి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చినప్పుడు మీరు గ్రహించలేదు కదా."
\s5
\p
\v 45 యేసు యెరూషలేములోకి ప్రవేశించాక దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు. అక్కడ సరుకులు అమ్మే వాళ్ళను వెళ్ళగొట్టడం మొదలుపెట్టాడు.
\v 46 ఆయన,
\q1 "నా ఇల్లు జనులు ప్రార్థన చేసేదిగా ఉండాలి అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగలు దాక్కునే స్థావరంగా మార్చేసారు" అన్నాడు.
\s5
\p
\v 47 ఆ వారం అంతా యేసు దేవాలయ ప్రాంగణంలో బోధించాడు. ప్రధాన యాజకులు, మతాధికారులు, ఇతర యూదీయ నాయకులు ఆయన్ని చంపడానికి ఉపాయం కోసం చూస్తున్నారు.
\v 48 కాని సామాన్య ప్రజలు ఆయన చెప్పేది వినడానికి వేగిర పడుతుండడంతో వాళ్ళకి దారీ తెన్నూ తోచలేదు.
\s5
\c 20
\p
\v 1 యేసు ఒక రోజు దేవుని సువార్త చెప్తూ, దేవాలయ ప్రాంగణంలో ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు, యూదీయ నాయకులు, ఇతర పెద్దలూ ఆయన దగ్గరికి వచ్చారు.
\v 2 వాళ్ళు ఆయనతో, "ఈ పనులు చేయడానికి నీకు హక్కు ఉందా? ఈ హక్కు ఎవరిచ్చారు?" అని అడిగారు.
\s5
\p
\v 3 ఆయన జవాబిస్తూ, "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.
\v 4 యోహానుకు బాప్తిసం ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించాడా, మనుషులు ఆజ్ఞాపించారా? చెప్పండి" అన్నాడు.
\s5
\v 5 అప్పుడు వాళ్ళు తమలోతాము కూడబలుక్కున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు అంటే మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు? అంటాడు.
\v 6 యోహాను బాప్తిసం మనుషులు సృష్టించుకున్నది అంటే ప్రజలంతా యోహానును దేవుడు పంపిన మనిషిగా చూస్తున్నారు కాబట్టి మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు.
\s5
\v 7 కాబట్టి వాళ్ళు "యోహానుకు బాప్తిసం ఇమ్మని ఎవరు చెప్పారో మాకు తెలియదు," అన్నారు.
\v 8 అప్పుడు యేసు, "అలాగైతే ఈ పనులు నన్ను ఎవరు చెయ్యమన్నారో నేను కూడా చెప్పను" అన్నాడు.
\s5
\p
\v 9 తరువాత యేసు ప్రజలతో ఈ కథ చెప్పాడు. "ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటించాడు. దాన్ని కౌలుకు ఇచ్చి, అతడు వేరే దేశం వెళ్ళి చాలా కాలం ఉన్నాడు.
\v 10 ద్రాక్ష పంట కోత కాలం వచ్చింది. ద్రాక్ష పంటలో తన వాటా ఇమ్మని కౌలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి అతడు తన పనివాణ్ణి పంపాడు. కాని వాళ్ళు ద్రాక్షపళ్ళు ఇవ్వకుండా ఆ సేవకుణ్ణి కొట్టి పంపేశారు."
\s5
\p
\v 11 "తరువాత యజమాని మరొక పనివాణ్ణి పంపాడు. వాళ్ళు అతన్ని కూడా కొట్టి అవమానించారు. ద్రాక్ష పళ్ళు ఇవ్వకుండానే పంపేశారు.
\v 12 అయినాసరే, యజమాని ఇంకొక పనివాణ్ణి పంపాడు. వాళ్ళు ఈ మూడవ పనివాణ్ణి కూడా గాయపరచి, ద్రాక్ష తోట బయటికి తన్నితగలేసారు."
\s5
\p
\v 13 "అప్పుడు ద్రాక్ష తోట యజమాని తనలో, "ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఎంతో ప్రియమైన నా కొడుకుని పంపుతాను. అప్పుడు వాళ్లు అతన్ని గౌరవించొచ్చు" అనుకున్నాడు.
\v 14 అలా అనుకుని అతడు తన కొడుకుని పంపాడు. యజమాని కొడుకు రావడం చూసి కౌలుదార్లు ఒకడితో ఒకడు, "ద్రాక్ష తోట వారసుడు. వాణ్ణి చంపితే ఈ ద్రాక్ష తోట మన సొంతమై పోతుంది." అనుకున్నారు.
\s5
\v 15 కాబట్టి వాళ్ళు యజమాని కొడుకుని ద్రాక్ష తోట బయటికి ఈడ్చుకుపోయి, చంపేశారు. ఇప్పుడు ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడో చెప్పనా?
\v 16 అతడు వెళ్ళి ద్రాక్ష తోట కౌలుదార్లను చంపేస్తాడు. వేరే వాళ్ళను ద్రాక్ష తోటను చూసుకోవడానికి నియమిస్తాడు." యేసు చెప్పింది విని ప్రజలు, "ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు" అన్నారు.
\s5
\v 17 యేసు వాళ్ళనే చూస్తూ, "మీరు అలా అనొచ్చు కానీ లేఖనాల్లో రాసిన ఈ మాటలు ఆలోచించండి.
\q1 ఇల్లు కట్టే మేస్త్రీలు వద్దని వదిలేసిన రాయి
\q1 మొత్తం నిర్మాణానికే కీలకమైన రాయి అయింది.
\q1
\v 18 ఈ రాయిమీద పడేవాళ్ళు ముక్కలు ముక్కలు అవుతారు,
\q1 అది ఎవరి మీద పడుతుందో వాళ్ళని తుత్తునియలు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 19 యేసు తమను నిందించడం కోసమే ఆ చెడ్డ కౌలు దారుల గురించిన కథ చెప్పాడని ప్రధాన యాజకులు, యూదీయ బోధకులు గ్రహించారు. అయితే ఆయన్ని పట్టుకుంటే ప్రజలు తమను ఏమి చేస్తారోనని భయపడి, ఆయన్ని ఎలాగైనా చెరపట్టే ఉపాయం వెదుకుతున్నారు.
\p
\v 20 వాళ్ళు ఆయనపై నిఘా ఉంచారు. నిజాయితీపరుల్లా నటించే మనుషుల్ని పంపారు. వాళ్లకు కావలసింది వాళ్ళు యేసును నిందించడానికి ఏదో ఒక వంక, ఆయన తప్పు మాట్లాడేలా చేసి నేరం మోపి ప్రాంతీయ అధిపతి దగ్గరికి తీసుకుపోవడం.
\s5
\v 21 వాళ్ళల్లో ఒక గూఢచారి, ఒకసారి ఆయనతో "నువ్వు ఎప్పుడూ చాలా న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. పై వాళ్ళకి నచ్చకపోయినా నువ్వు నిజమే చెప్తావు. మనం ఏమి చెయ్యాలని దేవుడు అనుకుంటాడో, అది నువ్వు న్యాయంగా బోధిస్తావు.
\v 22 కాబట్టి ఈ విషయంలో నువ్వు ఏమి అనుకుంటున్నావో చెప్పు. రోమన్ ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించడం సరైనదేనా కాదా?" అని అడిగాడు.
\s5
\v 23 కాని పన్ను కట్టడానికి ఇష్టపడని యూదుల తరుపున మాట్లాడాలో, లేక రోమన్ ప్రభుత్వం తరుపున మాట్లాడాలో తేల్చుకోలేక తాను ఇరుకున పడాలనే వాళ్ళు అలా అడిగారని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళతో,
\v 24 "నాకు రోమన్ నాణెం ఒకటి చూపించి, దానిపై ఎవరి బొమ్మ ఉందో ఎవరి పేరు ఉందో చెప్పండి" అన్నాడు. వాళ్ళు ఆయనకి ఒక నాణెం చూపించి, "రోమన్ ప్రభుత్వ అధిపతి సీజర్ బొమ్మ, పేరు ఉన్నాయి" అని చెప్పారు.
\s5
\v 25 ఆయన వాళ్ళతో, "ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికీ, దేవునికి చెందింది దేవునికీ ఇవ్వండి" అన్నాడు.
\v 26 ఆ గూఢచారి ఆయన జవాబుకు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ నోరెత్తలేక పోయాడు. వాళ్ళు తప్పు పట్టగలిగే మాటలు ఏమీ తన చుట్టూ ఉన్న ప్రజల ఎదుట యేసు అనలేదు.
\s5
\p
\v 27 ఆ తరువాత కొందరు సద్దూకయులు యేసు దగ్గరికి వచ్చారు. వీళ్ళు చనిపోయినవాళ్ళు తిరిగి బతకరు అనీ నమ్మే వర్గం.
\v 28 వీళ్ళు కూడా యేసును ఒక ప్రశ్న అడగాలనుకున్నారు. వాళ్ళల్లో ఒకడు "బోధకా, ఎవరైనా పిల్లలు లేకుండా చనిపోతే , అతని సోదరుడు అతని భార్యను అంటే ఆ వితంతువును పెళ్ళి చేసుకోవాలి. అప్పుడు అతని ద్వారా ఆమె పిల్లల్ని కనవచ్చు. ఈ విధంగా ఆ పిల్లవాడు చనిపోయిన వ్యక్తి సంతానమని ప్రజలు పరిగణిస్తారు, అని మోషే రాసాడు గదా.
\s5
\v 29 ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములున్నారు. పెద్దవాడు ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు, కాని పిల్లలు కలగకుండానే చనిపోయాడు. ఆమెను విధవరాలు అయిపోయింది.
\v 30 అతని మొదటి తమ్ముడు ఈ ఆజ్ఞ ప్రకారం ఆ వితంతువును పెళ్ళి చేసుకున్నాడు. కాని అతడు కూడా అలాగే చనిపోయాడు.
\v 31 అప్పుడు రెండవ తమ్ముడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు కూడా చనిపోయాడు. అలాగే ఏడుగురు అన్నదమ్ములు ఒకరి తరువాత ఒకరు ఆ స్త్రీని పెళ్ళిచేసుకున్నారు. కాని పిల్లలు కలగలేదు. ఒకరి తరువాత ఒకరు చనిపోయారు.
\v 32 ఆ తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 33 ఒకానొక సమయంలో చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతుకుతారనేది నిజమైతే చనిపోయి బ్రతికిన తరువాత ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? అన్నదమ్ములందర్నీ ఆమె పెళ్ళి చేసుకుందని మనస్సులో పెట్టుకో" అని ప్రశ్నించారు.
\s5
\p
\v 34 యేసు వాళ్ళకు జవాబిస్తూ, "ఈ లోకంలో తండ్రులు తమ కూతుళ్ళకు వివాహం చేస్తారు. పురుషులకు భార్యలు ఉంటారు.
\v 35 కాని దేవుడు ఎవరినైతే పరలోకంలో ఉండడానికి అర్హులుగా పరిగణిస్తాడో, చనిపోయి తిరిగి లేచాక వాళ్ళు పెళ్ళి చేసుకోరు.
\v 36 వాళ్ళు చనిపోరు కూడా. దేవుని దేవదూతల్లా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. వాళ్ళు దేవుని పిల్లలు. నూతన జీవంతో దేవుడు ఎవరినైతే లేపుతాడో వాళ్ళు దేవుని పిల్లలు."
\s5
\p
\v 37 "మండుతున్న పొద దగ్గర జరిగిన సంభాషణలో మోషే కూడా చనిపోయిన వాళ్ళని దేవుడు ఎలా బ్రతికిస్తాడో రాసాడు. అక్కడ దేవుణ్ణి, "అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు" అని పిలిచాడు. దేవుని ప్రజల నాయకులు చనిపోయాక ఇంకా వాళ్ళు ఇంకా దేవుణ్ణి కొనియాడుతూ ఆరాధిస్తూ ఉన్నారని మోషే తెలియచేసాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో సజీవంగానే ఉన్నారు. దీన్ని బట్టి చనిపోయిన వాళ్ళను దేవుడు బ్రతికిస్తాడని తెలుస్తున్నది.
\v 38 ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. మనందరం దేవునితో ఉండగలిగేలా మళ్ళీ ప్రాణం పొందుతాము. ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని సన్నుతిస్తాము" అని వారికి జవాబిచ్చాడు.
\s5
\p
\v 39 యూదీయ బోధకులు కొంతమంది "బోధకా, నువ్వు చాలా బాగా జవాబిచ్చావు" అన్నారు.
\v 40 ఆ తరువాత ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చెయ్యలేదు.
\s5
\v 41 తరువాత యేసు వాళ్లతో "క్రీస్తు దావీదు రాజు సంతతి వాడు మాత్రమే అని ప్రజలు చెప్పేది తప్పు అని నేను మీకు చూపిస్తాను."
\p
\v 42 "దావీదు కీర్తనల గ్రంథంలో క్రీస్తును గురించి,
\q1 "నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ,
\q1
\v 43 నీవు నా కుడి వైపున, అంటే నీకు ఘనతనిచ్చే చోట కూర్చోమని
\q1 ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు" అని రాశాడు."
\p
\v 44 "దావీదు రాజు క్రీస్తును "నా ప్రభువు" అంటున్నాడు. కాబట్టి క్రీస్తు కేవలం దావీదు రాజు సంతతికి చెందినవాడు మాత్రమే కాదు. నేను చెప్పినట్టు ఆయన దావీదు కంటే ఎంతో గొప్పవాడని రుజువౌతున్నది గదా" అన్నాడు.
\s5
\p
\v 45 అంతా వింటుండగా యేసు తన శిష్యులతో, "యూదీయ పండితుల్లా ఉండకుండా జాగ్రత్త పడండి. ప్రజలు తమను పెద్దమనుషులుగా అనుకోవాలని, పొడవాటి అంగీలు వేసుకొని తిరుగుతారు.
\v 46 వ్యాపార స్థలాల్లో ప్రజలు తమకు మర్యాదగా దండాలు పెట్టాలని చూస్తారు. వాళ్ళు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థలం ఆశిస్తారు. విందుల్లో ఘనతగలవాళ్ళు కూర్చొనే చోట కూర్చోవాలని చూస్తారు.
\v 47 వాళ్ళు విధవరాళ్ళ ఆస్తులను కూడా కబ్జా చేస్తారు. బహిరంగంగా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. దేవుడు కచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడు."
\s5
\c 21
\p
\v 1 యేసు తాను కూర్చున్న చోట నుండి ధనవంతులు దేవాలయం హుండీలో కానుకలు వేయడం గమనిస్తున్నాడు.
\v 2 ఒక పేదవితంతువు చాలా తక్కువ విలువున్న రెండు నాణాలు హుండీలో వేయడం చూసాడు.
\v 3 ఆయన తన శిష్యులతో "నిజం చెప్పమంటారా, ఈ ధనవంతులందరి కంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది.
\v 4 వాళ్ళందరికీ చాలా డబ్బుంది. కాని వాళ్ళకి ఉన్నదానిలో చాలా కొద్దిగా మాత్రమే ఇచ్చారు. కాని ఈమె పేదది ఐనా తన అవసరాలకు దాచుకున్నదంతా ఇచ్చేసింది."
\s5
\p
\v 5 "దేవాలయాన్ని అందమైన రాళ్ళతో, భక్తులు ఇచ్చిన కానుకలతో ఎంత బాగా అలంకరించారో గదా" అని యేసు శిష్యుల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
\v 6 అది విని యేసు వాళ్ళతో "మీరు చూసే ఈ కట్టడాలు పూర్తిగా ధ్వంసమైపోతాయి. ఆ సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఒకదాని మీద ఒకటిగా పెట్టిన ఒక్క రాయి కూడా ఉండదు" అన్నాడు.
\s5
\p
\v 7 అప్పుడు వాళ్ళు ఆయన్ని "బోధకా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరుగుతాయని ఎలా తెలుస్తుంది?" అని అడిగారు.
\v 8 యేసు జవాబిస్తూ, "మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా చూసుకోండి. చాలామంది వచ్చి, "నేనే ఆయన్ని" అంటారు. ప్రతి వాళ్ళూ "నేనే క్రీస్తును" అంటారు. వాళ్ళు, "దేవుడు రాజుగా ఏలే కాలం వచ్చేసింది" అంటారు. అలాటి వారికి శిష్యులుగా వాళ్ళను వెంబడించొద్దు.
\v 9 జాతులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. యుద్ధాల గురించి కూడా మీరు వింటారు, భయపడొద్దు. యుగాంతంలో ఇవన్నీ జరుగుతాయి.
\s5
\v 10 వివిధ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. వివిధ దేశాల రాజులు ఒకరితో ఒకరు పోరాడతారు."
\p
\v 11 "కొన్ని చోట్ల పెను భూకంపాలు, కరువులు, ఘోరమైన తెగుళ్ళు వస్తాయి. ప్రజలను భయభ్రాంతుల్ని చేసే అరిష్టాలు కలుగుతాయి. ఏదో అనుహ్యమైనది జరగబోతుందని సూచించే విధంగా ఆకాశంలో ఉత్పాతాలు మీరు చూస్తారు."
\s5
\p
\v 12 "కానీ ఇవన్నీ జరగక ముందు మిమ్మల్ని బంధిస్తారు. హింసిస్తారు. మిమ్మల్ని పరీక్షించడానికి సమాజ మందిరాలలో అప్పగించి, జైల్లో పెట్టిస్తారు. నన్ను వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి రాజులూ ఉన్నత ప్రభుత్వ అధికారుల సమక్షంలో మీపై విచారణ జరుగుతుంది.
\v 13 మీరు నా గురించి నిజం చెప్పే సమయం అదే."
\s5
\p
\v 14 "అలాటి సమయంలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని కంగారు పడకండి.
\v 15 మీకు జ్ఞానమిచ్చి, మీరు ఏమి చెప్పాలో సరైన మాటలు అందిస్తాను. దాని ఫలితంగా తప్పు చేసారని మిమ్మల్ని ఎవ్వరూ నిందించరు.
\s5
\v 16 మీలో కొందరికీ మీ స్వంత తలిదండ్రులు, సోదరులు, ఇతర బంధువులు నమ్మక ద్రోహం చేస్తారు.
\v 17 మొత్తం మీద నాపై విశ్వాసం ఉంచి నందుకు ప్రతివాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 18 కాని మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
\v 19 మీరు కష్ట సమయాల్లో ఉన్నపుడు దేవుడిపై మీ విశ్వాసాన్ని నిరూపించుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు."
\s5
\p
\v 20 "యెరూషలేమును సైన్యం చుట్టుముట్టడం మీరు చూసినప్పుడు వాళ్ళు పట్టణాన్ని ధ్వంసం చేస్తారని మీకు తెలుస్తుంది.
\v 21 ఆ సమయంలో యూదయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవాళ్ళు పట్టణాన్ని విడిచిపెట్టాలి. దగ్గర ప్రాంతంలో ఉన్నవాళ్ళు తిరిగి పట్టణంలోకి రాకూడదు.
\v 22 అది దేవుడు పట్టణాన్ని శిక్షించే కాలం. ఆయన అలా చేసినప్పుడు లేఖనాలు నెరవేరతాయి.
\s5
\v 23 దేవుని ఉగ్రత వాళ్ళపై ఉంటుంది కాబట్టి గొప్ప వేదన కలుగుతుంది. కాబట్టి ఆ రోజుల్లో గర్భవతుల, బాలింతల పరిస్థితి ఎంత ఘోరమో!"
\p
\v 24 "సాయుధ సైనికుల దాడుల్లో చాలామంది ప్రాణాలు పోతాయి. కొందర్ని బందీలుగా ప్రపంచమంతటా తరలిస్తారు. యూదేతరులను దేవుడు అనుమతించినంత కాలం వాళ్ళు తమ దళాలతో యెరూషలేము వీధులన్నీ తిరుగుతారు."
\s5
\p
\v 25 "ఈ కాలంలో సూర్య, చంద్ర నక్షత్రాల్లో విచిత్రమైన పోకడలు కనిపిస్తాయి. భూప్రజల గుండెలు అవిసిపోతాయి. సముద్ర ఘోషకి, ఉవ్వెత్తున లేచే తరంగాలకీ మనుషులు జడిసిపోయి చెల్లాచెదరు అవుతారు.
\v 26 తరువాత లోకంపైకి ఏమి ముంచుకు వస్తుందోనని వేచి చూస్తూ ప్రజలు గుండె చెదరి మూర్చపోతారు. ఆకాశంలో నక్షత్రాలు స్థానాలు తప్పుతాయి."
\s5
\p
\v 27 "అప్పుడు మనుష్య కుమారుడైన నేను కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో, మేఘాల్లో బలప్రభావాలతో రావడం ప్రజలు చూస్తారు.
\v 28 కాబట్టి ఆ భయంకర సంఘటనలు జరిగినప్పుడు దేవుడు తొందరలో మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి ధైర్యంగా నిలబడి ముందుకి సాగాలి."
\s5
\p
\v 29 అప్పుడు యేసు ఒక ఉపమానం చెప్పాడు. "అంజూరం చెట్లు, ఇతర చెట్లు చూడండి.
\v 30 వాటి ఆకులు చిగురించినప్పుడు ఎండాకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది.
\v 31 అదే విధంగా నేను వివరించినవి జరగడం చూసి, దేవుడు తొందరలో తనను రాజుగా కనుపరచుకుంటాడని మీకు తెలుస్తుంది.
\s5
\v 32 నేను మీకు నిజం చెప్తున్నాను, నేను మీకు వివరించినవన్నీ జరగక ముందు అంతం రాదు.
\v 33 నేను చెప్పిన సంగతులన్నీ కచ్చితంగా జరుగుతాయి. భూమి, ఆకాశం ఎప్పుడూ ఉంటాయని చెప్పలేం కాని, నేను చెప్పినవి మాత్రం జరిగి తీరుతాయి."
\s5
\p
\v 34 "మిమ్మల్ని మీరు హద్దుల్లో ఉంచుకోవాలి. తాగి తందనాలాడుతూ, విచ్చలవిడిగా ఉండే విందులకు వెళ్లొద్దు. మీ జీవితం గురించి చింతపడొద్దు. ఇలా జీవిస్తుంటే, నేను తిరిగి రావడానికి మీరు కనిపెడుతూ ఉండరు. ఆ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాను. ఒక జంతువు ఉచ్చులో ఇరుక్కున్నట్టు హెచ్చరిక లేకుండా నేను అకస్మాత్తుగా వస్తాను.
\v 35 నిజానికి నన్ను చూడడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు నేను ఎలాటి హెచ్చరికా లేకుండా వస్తాను.
\s5
\v 36 కాబట్టి మీరు నా రాక కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ కష్టాలగుండా సురక్షితంగా ముందుకు సాగాలన్నా, మనుష్య కుమారుడైన నేను లోకానికి తీర్పు ఇవ్వడానికి వచ్చినప్పుడు నిన్నునిరపరాధిగా ప్రకటించాలన్నా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి."
\s5
\p
\v 37 ప్రతి రోజూ యేసు పగలు దేవాలయంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రతి సాయంత్రం పట్టణం బయటికి వెళ్ళి ఒలీవల కొండపైన రాత్రంతా ఉండేవాడు.
\v 38 ప్రతి రోజూ ఉదయాన్నే ప్రజలందరూ ఆయన బోధ వినడానికి దేవాలయానికి వచ్చేవాళ్ళు.
\s5
\c 22
\p
\v 1 పస్కా అనే పొంగని రొట్టెల పండగ దగ్గర పడింది.
\v 2 యేసును ప్రజలు వెంబడించడం చూసి భయపడి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును చంపడానికి కుట్రలు పన్నుతున్నారు.
\s5
\p
\v 3 పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు అనే యూదాలోకి సాతాను చొరబడ్డాడు.
\v 4 యేసును వాళ్లకు అప్పగించడం గురించి అతడు ప్రధాన యాజకుల, దేవాలయ సంరక్షణ అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు.
\s5
\v 5 అందుకు అతణ్ణి వాళ్ళు మెచ్చుకుని, డబ్బిస్తామన్నారు.
\v 6 యూదా దానికి అంగీకరించి, ఆయన చుట్టూ ప్రజల సమూహం లేనప్పుడు యేసును వాళ్ళు బంధించేలా సాయం చేయడానికి దారి వెదుకుతున్నాడు.
\s5
\p
\v 7 పొంగని రొట్టెల పండగ వచ్చింది. అది పస్కా గొర్రెలను వధించాల్సిన రోజు.
\v 8 కాబట్టి యేసు పేతురు, యోహానులతో, "అందరం కలిసి పస్కా పండగ భోజనం చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యండి." అన్నాడు.
\v 9 వాళ్ళు "భోజనం ఎక్కడ సిద్ధపరచాలి?" అని అడిగారు.
\s5
\v 10 ఆయన, "జాగ్రత్తగా వినండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు నీటి కుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు ఎదురౌతాడు. అతడు వెళ్ళే ఇంట్లోకి మీరు కూడా వెళ్ళండి.
\v 11 ఆ ఇంటి యజమానితో, "మా గురువు గారు ఆయన శిష్యులమైన మాతో కలసి పస్కా భోజనం చేయడానికి గది చూపించమని అడుగుతున్నాడు" అని చెప్పండి.
\s5
\v 12 అతడు ఇంటి మిద్దె పై ఉన్న విశాలమైన గది చూపిస్తాడు. అతిథులకి కావలసినవి అన్నీఅక్కడ అమర్చి ఉంటాయి. అక్కడ మనకు భోజనం సిద్ధపరచండి" అన్నాడు.
\p
\v 13 ఇద్దరు శిష్యులు ఊర్లోకి వెళ్ళారు. యేసు చెప్పినట్టే వాళ్ళకి అన్నీ సమకూరాయి. పస్కా పండుగ భోజనాన్ని వాళ్ళు అక్కడ సిద్ధపరిచారు.
\s5
\p
\v 14 భోజన సమయం అయినప్పుడు యేసు అపొస్తలులతో కలిసి కూర్చున్నాడు.
\v 15 ఆయన వాళ్ళతో, "నేను హింస పొంది, చనిపోకముందు మీతో కలిసి ఈ భోజనం చెయ్యాలని ఎంతగానో అనుకున్నాను.
\v 16 దేవుడు పస్కాలో చేయడానికి మొదలుపెట్టింది ముగించాక, ప్రతి ఒక్కరినీ ప్రతి చోటా ఏలే సమయం వచ్చే వరకూ మళ్ళీ నేను ఈ భోజనం చేయనని మీతో చెప్తున్నాను" అన్నాడు. భోజనం అయ్యాక
\s5
\p
\v 17 ఆయన ఒక గిన్నెలో ద్రాక్షరసం తీసుకొని, దేవునికి వందనాలు చెప్పాడు. శిష్యులతో ఆయన, "ఇది తీసుకొని, మీరందరూ తాగండి.
\v 18 దేవుడు అందర్నీ అన్ని చోట్లా ఏలే కాలం వచ్చే దాకా నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్తున్నాను.
\s5
\v 19 తరువాత ఆయన రొట్టె తీసుకొని దేవునికి వందనాలు చెప్పాడు. ఆయన దాన్ని ముక్కలు చేసి, వాళ్ళకి తినడానికి ఇచ్చాడు. ఇలా చేసి ఆయన, "ఈ రొట్టె మీ కోసం అర్పించే నా శరీరం. తరువాత కూడా నన్ను ఘనపరచడానికి ఇది చేయండి.
\v 20 వాళ్ళు భోజనం తిన్నాక, ఆయన ద్రాక్షరసం గిన్నె తీసుకొని," ఇది మీ కోసం నేను చిందించే నా రక్తంతో చేసే కొత్త నిబంధన" అన్నాడు.
\s5
\p
\v 21 "కానీ చూడండి! నన్ను నా శత్రువులకి అప్పగించే వాడు నాతో కలిసి తింటున్నాడు.
\v 22 నిజానికి, మనుష్య కుమారుడైన నేను దేవుని ఏర్పాటు ప్రకారం చనిపోతాను. కానీ, నా శత్రువుల చేతికి నన్ను అప్పగించే వాడికి ఘోరమైన గతి పడుతుంది" అన్నాడు.
\p
\v 23 తరువాత అపొస్తలులు ఒకరినొకరు, "మనలో ఎవరు అలా చేస్తున్నారు?" అని అడగడం మొదలుపెట్టారు.
\s5
\v 24 ఆ తరువాత అపొస్తలులు ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలుపెట్టారు. "యేసు రాజు అయినప్పుడు మనలో ఎవరికి పెద్ద పదవి దక్కుతుంది?" అని మాట్లాడుకున్నారు.
\p
\v 25 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "యూదేతర దేశాల రాజులు మేమే బలవంతులమని ప్రజలకి చూపించుకోవడానికి తమకు తాము "ధర్మదాతలు" అని బిరుదులు ఇచ్చుకుంటారు.
\s5
\v 26 కాని మీరు వాళ్ళలా ఉండకూడదు. మీలో ఎక్కువ ఘనత ఉన్న వాళ్ళు తక్కువవాడిలా ఉండాలి. నాయకుడు సేవకుడిలా ఉండాలి."
\p
\v 27 ప్రాముఖ్యమైన వ్యక్తి భోజనం బల్ల దగ్గర తింటాడుగానీ భోజనం వడ్డించే సేవకుడు తినడు. కాని నేను మీ సేవకుణ్ణి.
\s5
\v 28 నా బాధలన్నిటిలో నాతో ఉన్నది మీరే.
\v 29 కాబట్టి దేవుడు అందరినీ ఏలడం మొదలుపెట్టాక, రాజుగా ఏలడానికి దేవుడు నన్ను నియమించినట్టు నేను మిమ్మల్ని శక్తివంతులైన అధిపతులుగా నియమిస్తాను.
\v 30 నేను రాజునయ్యాక మీరు నాతో కూర్చొని భోజనం చేస్తారు. నిజానికి మీరు సింహాసనాలపైన కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు తీర్పు చెప్పుతారు.
\s5
\p
\v 31 సీమోనూ! సీమోనూ! విను. ధాన్యాన్ని జల్లెడ పట్టినట్టు నిన్ను పరీక్ష చేయడానికి సాతాను దేవుణ్ణి అనుమతి కోరాడు. దేవుడు అనుమతించాడు కూడా.
\v 32 కాని నేను నీ కోసం ప్రార్థన చేసాను. సీమోనూ, నాపై విశ్వాసం కొంచెమైనా నీలో నిలిచే ఉంటుంది. కాబట్టి నువ్వు నా వైపుకు తిరిగినప్పుడు నీ సోదరులైన వీళ్ళకి నువ్వు ధైర్యం చెప్పు.
\s5
\v 33 పేతురు ఆయనతో," ప్రభూ, నేను నీతో చెరసాలకైనా సరే, వెళ్ళడానికి సిద్ధం. నీతో చనిపోవడానికి సైతం సిద్ధమే." అన్నాడు.
\v 34 యేసు, "పేతురూ, నీకు ఒకటి చెప్పాలి. ఈ రాత్రి కోడి కూయక ముందు నీకు నేను తెలియదని మూడు సార్లు అబద్ధమాడతావు" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 35 తరువాత యేసు శిష్యులను "నేను మిమ్మల్నిగ్రామాలకు పంపినప్పుడు మీరు డబ్బు తీసుకెళ్ళలేదు. ఆహారం, చెప్పులు కూడా. అయినా మీ అవసరాలు తీరనివి ఏవైనా ఉన్నాయా?" అని అడిగాడు. వాళ్ళు "లేదు" అని చెప్పారు.
\v 36 ఆయన, "కానీ ఇప్పుడు మీలో ఎవరిదగ్గరైనా కొంచెం డబ్బు ఉంటే అతడు దాన్ని తనతో తీసుకువెళ్ళాలి. ఎవరిదగ్గరైనా ఆహారం ఉంటే మీతో తీసుకెళ్ళాలి. ఎవరికి కత్తి లేదో వాళ్ళు పై బట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
\s5
\v 37 నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే లేఖనాల్లో ప్రవక్త నా గురించి రాసింది జరుగుతుంది. "ప్రజలు అతన్ని నేరస్తుడిగా చూస్తారు" అనేదే ఆ లేఖనం. లేఖనాల్లో నా గురించి రాసినది అంతా నెరవేరుతుంది." అన్నాడు.
\v 38 శిష్యులు, "ప్రభూ, చూడు, మా దగ్గర రెండు కత్తులున్నాయి" అన్నారు. ఆయన "చాలు. ఇక ముందు ఇలా మాట్లాడ వద్దు" అన్నాడు.
\s5
\p
\v 39 యేసు పట్టణం వదిలి ఎప్పటిలా ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన కూడా వెళ్లారు.
\v 40 ఆయన వెళ్ళాలనుకున్న చోటికి వచ్చినప్పుడు వాళ్ళతో, "పాపం చేసే శోధనలో పడకుండా దేవుని సాయం కోసం ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\v 41 తరువాత ఆయన వాళ్ళ నుండి దాదాపు ముప్పై మీటర్ల దూరం వెళ్ళి, మోకరించి ప్రార్థన చేసాడు.
\v 42 ఆయన," తండ్రీ, నాకు సంభవించే భయంకర సంఘటనలు నీ ఇష్ట ప్రకారం జరగాల్సి ఉంటే జరగనివ్వు. నాకు ఇష్టం కాదు, నీకు ఇష్టమే జరగాలి" అన్నాడు.
\s5
\v 43 అప్పుడు పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయన్ని ధైర్య పరచాడు.
\v 44 ఆయన చాలా వేదన పడ్డాడు. చాలా బలంగా ప్రార్థన చేసాడు. ఆయన చెమట రక్తంలా బొట్లు బొట్లుగా కారింది.
\s5
\p
\v 45 ఆయన ప్రార్థన నుండి లేచి తన శిష్యుల దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వాళ్ళు విచారంతో అలసిపోయి నిద్రపోతూ ఆయనకు కనిపించారు.
\v 46 ఆయన వాళ్ళను లేపి, "మీరు నిద్రపోకూడదు. లేవండి. ఏదీ మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా దేవుని సహాయం కోసం ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\p
\v 47 యేసు అలా మాట్లాడుతుండగానే ఒక గుంపు ఆయన దగ్గరికి వచ్చింది. వాళ్ళను పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా తీసుకొచ్చాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు.
\v 48 యేసు అతన్ని, "యూదా! నన్ను శత్రువులకు అప్పగించే క్రమంలో నిజంగానే మనుష్య కుమారుని ముద్దు పెట్టుకున్నావా?" అని అడిగాడు.
\s5
\v 49 జరుగుతున్నది శిష్యులు గ్రహించి, "ప్రభూ, మన కత్తులతో వాళ్ళని నరుకుదామా?" అన్నారు.
\v 50 వాళ్ళల్లో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి నరికేసాడు.
\v 51 కాని, యేసు "అలాంటిదేమీ చెయ్యొద్దు" అని, ఆ సేవకుడి చెవిని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 52 అప్పుడు యేసు తనను బంధించడానికి వచ్చిన ప్రధాన యాజకులతో, దేవాలయ సంరక్షణ అధికారులతో, యూదీయ పెద్దలతో, "మీరు నన్ను పట్టుకోడానికి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో , దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా.
\v 53 ప్రతి రోజూ నేను దేవాలయంలో మీతో ఉన్నాను. కాని అప్పుడు నన్ను పట్టుకోడానికి మీరు ప్రయత్నం చెయ్యలేదు. ఈ సమయంలోనే మీకు కావలసింది చేస్తున్నారు. ఇది సాతాను చేయాలనుకొనే చెడ్డ పనులు చేసే చీకటి సమయం కూడా" అన్నాడు.
\s5
\p
\v 54 వాళ్ళు యేసును బంధించి తీసుకుపోయారు. ఆయన్ని వాళ్ళు ప్రధాన యాజకుని ఇంటికి తెచ్చారు. పేతురు కొంత దూరంతో వాళ్ళని వెంబడించాడు.
\v 55 అక్కడ లోగిట్లో కొందరు చలిమంట వేసుకుని కూర్చుని ఉన్నారు. పేతురు వాళ్ళతో కూర్చున్నాడు.
\s5
\p
\v 56 మంట వెలుగులో పేతురును అక్కడి పనిపిల్ల చూసింది. ఆమె అతన్ని జాగ్రత్తగా పరిశీలించి, "ఈ మనిషి కూడా బందీగా వచ్చిన వాడితో ఉన్నవాడే" అంది.
\v 57 పేతురు, "అమ్మాయ్, అతడెవరో నాకు తెలియదు" అన్నాడు.
\v 58 కాసేపు అయ్యాక మరొకడు పేతుర్ని చూసి, "వాళ్ళు బంధించిన వాడితో నువ్వు కూడా ఉన్నావు గదా?" అని అడిగాడు. పేతురు "ఇదిగో చెప్తున్నాను. నేను వాళ్ళల్లో ఒకడిని కాదు" అన్నాడు.
\s5
\v 59 ఒక గంట తరువాత ఒకడు గట్టిగా "ఇతని యాస చూస్తుంటే గలిలయ ప్రాంతం వాడిలానే ఉంది. కచ్చితంగా వాళ్ళు బంధించిన వాడితో ఉన్నవాడే అనుకుంటా" అన్నాడు.
\v 60 కాని, పేతురు, "ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు" అన్నాడు. అతడు అలా అంటుండగానే కోడి కూసింది.
\s5
\v 61 యేసు వెనక్కి తిరిగి పేతురు వైపు చూసాడు. అప్పుడు పేతురు, "ఈ రాత్రి కోడి కూయక ముందు మూడు సార్లు నేను నీకు తెలియదని చెప్తావు" అని ప్రభువు తనతో చెప్పింది జ్ఞాపకం చేసుకున్నాడు.
\v 62 వాకిలి బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s5
\p
\v 63 యేసుకు కాపలా ఉన్నవాళ్ళు ఆయన్ని హేళన చేసి కొట్టారు.
\v 64 వాళ్ళు ఆయన కళ్ళకు గంతలు కట్టి "నువ్వు ప్రవక్త అని నిరూపించుకో వచ్చుగా! నిన్ను కొట్టింది ఎవ్వరో చెప్పు" అన్నారు.
\v 65 వాళ్ళు ఆయన్ని చాలా దుర్భాషలాడారు. ఆయన్ని అవమానించారు.
\s5
\p
\v 66 ఉదయం చాలామంది యూదీయ నాయకులు గుమికూడారు. ఈ గుంపులో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. వాళ్ళు యేసును యూదీయ పాలకుల గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆయనతో,
\v 67 "నువ్వు క్రీస్తువైతే చెప్పు" అన్నారు. కాని ఆయన, "నేనే ఆయననని చెప్తే మీరు నమ్మరు.
\v 68 క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారని నేను అడిగితే మీరు జవాబు చెప్పరు.
\s5
\v 69 కాని ఇప్పటి నుండి మనుష్య కుమారుడైన నేను సర్వోన్నతుడైన దేవుని పక్కన కూర్చొని పరిపాలిస్తాను" అన్నాడు.
\v 70 వారందరూ ఆయన్ని, "అలాగైతే నువ్వు దేవుని కుమారుడినని చెప్తున్నావా?" అని అడిగారు. ఆయన," ఔను. మీరు చెప్పినట్టే" అన్నాడు.
\p
\v 71 అప్పుడు వాళ్ళు "ఇక సాక్షులతో పనేముంది? ఇతడు తనను దేవునితో సమానం చేసుకోవడం స్వయంగా విన్నాం గదా" అన్నారు.
\s5
\c 23
\p
\v 1 అప్పుడు వాళ్ళంతా లేచి యేసును రోమ్ గవర్నర్ పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు.
\v 2 గవర్నర్ ఎదుట ఆయనపై నేరాలు మోపసాగారు. "వీడు కల్లబొల్లి మాటలు చెబుతూ మా ప్రజల్లో అలజడి రేపడం మేము చూసాము. రోమ్ చక్రవర్తి సీజరుకు పన్నులు కట్టవద్దని ఇతడు చెబుతున్నాడు. అంతేకాక తాను మెస్సీయను, అంటే రాజును అని చెప్పుకుంటున్నాడు" అన్నారు.
\s5
\p
\v 3 అప్పుడు పిలాతు "నువ్వు యూదుల రాజువా?" అని అడిగాడు. యేసు "నువ్వే అంటున్నావు కదా" అన్నాడు.
\v 4 అప్పుడు పిలాతు ప్రధాన యాజకులతో జనంతో "ఈ మనిషి ఏ నేరం చెయ్యలేదు" అని చెప్పాడు.
\v 5 కానీ వాళ్ళు మాత్రం అదే పనిగా యేసుపై నేరాలు మోపారు. "ఇతడు ప్రజలను విప్లవానికి ప్రేరేపిస్తున్నాడు. యూదయ ప్రాంతమంతా తన ఆలోచనలు ప్రచారం చేస్తున్నాడు. గలిలయలో మొదలు పెట్టి ఇక్కడిదాకా ఈ ప్రచారం సాగిస్తున్నాడు" అన్నారు.
\s5
\p
\v 6 పిలాతు వాళ్ళ మాటలు విని "ఈ మనిషి గలిలయ జిల్లా వాడా?" అన్నాడు.
\v 7 గలిలయ హేరోదు పాలన కింద ఉంది. యేసు గలిలయ వాడని తెలిసి పిలాతు ఆయన్ను హేరోదు దగ్గరికి పంపాడు. ఆ సమయంలో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
\s5
\p
\v 8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. చాలా కాలంగా యేసును చూడాలనుకుంటున్నాడు. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు
\v 9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన దేనికీ జవాబు చెప్పలేదు.
\v 10 ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
\s5
\v 11 హేరోదు, అతని సైనికులు ఆయనను గేలి చేశారు. ఆయనకు రాజవస్త్రాలు తొడిగి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు.
\v 12 అప్పటిదాకా హేరోదూ పిలాతూ శత్రువులు. కానీ ఆ రోజు వాళ్ళద్దరూ మిత్రులయ్యారు.
\s5
\p
\v 13 అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ మళ్లీ పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు.
\v 14 అతడు వాళ్ళతో "ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీరు వింటుండగానే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
\s5
\v 15 హేరోదు కూడా ఇతడు దోషి కాదు అంటున్నాడు. హేరోదు మళ్లీ నా దగ్గరకే తిప్పి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదన్నది స్పష్టం.
\v 16 కాబట్టి ఇతన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చెయ్యమని నా సైనికులతో చెబుతాను" అన్నాడు.
\v 17 (పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కాబట్టి అతడిలా చెప్పాడు).
\s5
\p
\v 18 అయితే జనమంతా "వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి" అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
\v 19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటుకు నాయకుడు. అతడు హంతకుడు కూడా. ఈ నేరాలకై మరణశిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు.
\s5
\p
\v 20 కానీ పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి జనంతో మళ్ళీ మాట్లాడాడు
\v 21 కాని వాళ్ళంతా "వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి" అని మరింతగా కేకలు వేశారు
\v 22 మూడవ సారి అతడు, "ఎందుకు? ఇతడేమి నేరం చేశాడు? ఇతడు మరణ శిక్షకు తగిన నేరమేదీ చెయ్యలేదు. అందుచేత ఇతణ్ణి కొరడాలతో కొట్టించి వదిలేస్తాను" అన్నాడు.
\s5
\v 23 కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేస్తూ యేసును సిలువ వేయాల్సిందేనన్నారు. చివరికి వాళ్ళ కేకల వల్ల పిలాతుకు ఇక గత్యంతరం లేకపోయింది.
\v 24 వాళ్ళు కోరినట్టే జరగాలని అతడు నిర్ణయించాడు.
\v 25 ప్రభుత్వంపై తిరుగుబాటు, హత్యలు చేసి చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదలచేశాడు. యేసును జనం కోరిన విధంగా చెయ్యమని సైనికులకు అప్పగించాడు.
\s5
\p
\v 26 ఆఫ్రికాలో కురేనే అనే ప్రాంతానికి చెందిన సీమోను అక్కడ ఉన్నాడు. అతడు పల్లెప్రాంతం నుండి యెరూషలేముకు వస్తున్నాడు. సైనికులు ఆయన్ని తీసుకు పోతూ సీమోనును పట్టుకుని, సిలువ మోయమని దాన్ని అతని భుజం మీద పెట్టారు.
\s5
\p
\v 27 పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
\v 28 యేసు వాళ్ళను చూసి "యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీకు దాపురించబోతున్న విపత్తును బట్టి మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
\s5
\v 29 మీరు ఈ సంగతి తెలుసుకోవాలి. ఒక రోజు రాబోతోంది, గొడ్రాళ్ళు ఎంత ధన్యులు! కానుపు ఎరుగని గర్భాలూ బిడ్డలకు పాలియ్యని స్తనాలూ ఎంత ధన్యం! అని ఆ రోజున అంటారు.
\p
\v 30 అప్పుడు ఈ నగర ప్రజలు "ఈ కొండల మామీద పడి, ఈ పర్వతాలు మమ్మల్ని కప్పివేస్తే ఎంత బావుణ్ణు!" అంటారు.
\v 31 నేను ఏ తప్పూ చెయ్యకపోయినా నేను చావ వలసి వస్తున్నదంటే, అసలు చావుకు అర్హులైన వాళ్ళకి మరి ఇంకెన్ని ఘోర శిక్షలు వస్తాయో!"
\s5
\p
\v 32 ఇద్దరు ఖూనీకోరులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
\s5
\v 33 వాళ్ళు "పుర్రె" అనే చోటికి వచ్చినప్పుడు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
\p
\v 34 అప్పుడు యేసు, "తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు" అన్నాడు. వాళ్ళు ఆయన బట్టలు ఎవరికేది రావాలో పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
\s5
\v 35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. యూదు అధికారులు సైతం, "వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 36 ఇక సైనికులు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిన ద్రాక్షారసం ఇవ్వబోతూ,
\v 37 "నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అన్నారు.
\v 38 "ఇతడు యూదుల రాజు" అని ఒక చెక్కపై రాసి ఆయన తలకు పైగా సిలువ కొయ్యకు కొట్టారు.
\s5
\p
\v 39 సిలువకు వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దుర్భాషలాడుతూ, "నువ్వు నిజంగా క్రీస్తువైతే మరింకేం? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
\v 40 కాని వాణ్ణి రెండోవాడు చీవాట్లు పెట్టాడు. "ఒరే, దేవుడికి భయపడరా. అతనికి వేసిన శిక్షే వాళ్ళు నీకూ నాకూ వేస్తున్నారు గదా?
\v 41 మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన శాస్తి జరిగింది. కానీ ఈ మనిషి నిర్దోషి" అన్నాడు.
\s5
\v 42 తరవాత ఆయనతో "యేసూ, నువ్వు రాజుగా వచ్చినప్పుడు నన్ను రక్షించాలని గుర్తు పెట్టుకో" అన్నాడు.
\v 43 అందుకాయన, "ఈ రోజు నువ్వు నాతో పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలుముకుంది
\v 45 సూర్యుడు వెలుతురు ఇవ్వలేదు. దేవాలయంలో మందమైన గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
\s5
\v 46 అది జరగగానే యేసు "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను" అని గావుకేక పెట్టాడు. ఆయన ఇలా కేక వేసి ప్రాణం విడిచాడు.
\p
\v 47 జరిగిందంతా అక్కడున్న సైనికుల శతాధిపతి చూసి, "ఈ వ్యక్తి నిజంగా ఏ తప్పూ చెయ్యలేదు" అన్నాడు. అతడు అన్న మాట వల్ల దేవునికి కీర్తి కలిగింది.
\s5
\v 48 ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి దుఖంతో గుండెలు బాదుకుంటూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
\v 49 ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనవెంట వచ్చిన ఆడవాళ్లు దూరంగా నిలబడి జరిగినదంతా చూస్తున్నారు.
\s5
\p
\v 50 అక్కడికి వచ్చినవాళ్ళలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు యూదయలో ఉన్న అరిమతయి గ్రామం వాడు. అతడు మంచిమనిషి, నీతిపరుడు. యూదుల చట్ట సభలో సభ్యుడు.
\v 51 యేసును చంపాలని చట్ట సభ నిర్ణయించినప్పుడు, అదెలా చెయ్యాలో పథకం వేసినప్పుడు వాటికి ఇతడు అంగీకరించలేదు. చేసిన తీర్మానాలకూ ఇతడు సమ్మతించనూలేదు. ఇతడు దేవుడు మనుషులను పరిపాలించడానికి రాజును పంపేది ఎప్పుడెప్పుడా అని ఎదురుతెన్నుల్లో ఉన్నాడు.
\s5
\p
\v 52 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని సమాధి చెయ్యడానికి తనకు అనుమతి ఇమ్మని అడిగాడు. పిలాతు అనుమతి ఇచ్చాడు.
\v 53 తరువాత వాళ్ళు ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్నని నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.
\s5
\v 54 అది యూదులు వాళ్ళ విశ్రాంతి దినం కోసం సిద్ధపడే రోజు. ఇంకాసేపటికి సూర్యాస్తమయం కాబోతున్నది. అది విశ్రాంతి దినానికి మొదలు.
\p
\v 55 అప్పుడు గలిలయ నుండి యేసుతో వచ్చిన స్త్రీలు కూడా యోసేపు, అతని మనుషుల వెంట వెళ్ళి ఆ సమాధిని చూశారు. యేసు దేహాన్ని ఆ మనుషులు ఎలా ఉంచారో చూశారు.
\v 56 తామున్న చోటికి తిరిగి వెళ్ళి, యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత యూదు ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
\s5
\c 24
\p
\v 1 ఆదివారం తెల్లవారక ముందే ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. యేసు దేహానికి పూయడానికి తాము సిద్ధం చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చారు.
\p
\v 2 వాళ్ళు అక్కడికి చేరుకోగానే సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం కనిపించింది.
\v 3 వాళ్ళు సమాధి లోపలికి వెళ్ళారు. యేసు దేహం అక్కడ లేదు.
\s5
\v 4 దాంతో వాళ్ళకేమీ తోచలేదు. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షం అయ్యారు.
\v 5 వాళ్ళని చూసి ఈ స్త్రీలు వణికిపోయారు. ముఖాలు నేలకు దించుకుని ఉండగా ఆ ఇద్దరూ వాళ్ళతో "బ్రతికి ఉన్నవాణ్ణి మీరు చనిపోయిన వాళ్ళుండే చోట ఎందుకు వెదుకుతున్నారు?
\s5
\v 6 ఆయన ఇక్కడ లేడు, ఆయన మళ్ళీ బ్రతికాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు ఆయన మీతో,
\v 7 "మానవ పుత్రుడినైన నన్ను వాళ్ళు పాపాత్ములైన మనుషుల చేతికి అప్పజెపుతారు. వాళ్ళు ఆయన్ని సిలువ వేసి చంపుతారు. మూడవ రోజున నేను మళ్ళీ బ్రతుకుతాను" అన్నాడు గదా" అన్నారు.
\s5
\v 8 అప్పుడు ఆ ఆడవాళ్లు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.
\p
\v 9 సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి జరిగిన విషయాన్ని పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వాళ్ళకందరికీ చెప్పారు.
\v 10 ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన ఆడవాళ్లు మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వాళ్ళతో ఉన్న ఇతర స్త్రీలూ.
\s5
\v 11 అయితే అపోస్తలులు వాళ్ళ మాటలను అర్థం లేనివిగా కొట్టిపారేసారు.
\v 12 కానీ పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వంగి సమాధిలోకి తొంగి చూశాడు. యేసును చుట్టిన నారబట్టలు కనిపించాయి. యేసు మాత్రం లేడు. అతడు జరిగిన దాన్ని గురించి తబ్బిబ్బులౌతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 13 అదే రోజు యేసు శిష్యులు ఇద్దరు యెరూషలేముకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు
\v 14 యేసుకు జరిగిన ఈ విషయాలన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
\s5
\v 15 అలా వాళ్ళు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు తానే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా నడుస్తూ ఉన్నాడు.
\v 16 కానీ వాళ్ళు ఆయన్ను గుర్తు పట్టలేకుండా దేవుడు చేశాడు.
\s5
\v 17 ఆయన, "మీరు నడుస్తూ చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?" అని వాళ్ళని అడిగాడు. దాంతో వాళ్ళు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
\v 18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు, "యెరూషలేముకు వచ్చి కూడా ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వాడివి నువ్వు ఒక్కడివే అనుకుంటా" అన్నాడు.
\s5
\v 19 ఆయన, "ఏ విషయాలు?" అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "నజరేతు వాడైన యేసును గురించిన విషయాలయ్యా. ఆయన ప్రవక్త. చాలా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన బోధలు చేసే సామర్థ్యం దేవుడు ఆయనకు ఇచ్చాడు.
\v 20 కానీ మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను రోమ్ అధికారుల వశం చేసి మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిన వైనం నీకు తెలియదా?
\s5
\v 21 ఇశ్రాయేలు ప్రజను శత్రువుల బారి నుండి విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. కానీ ఇది ఇప్పుడిక అసాధ్యం. ఆయన చనిపోయి ఇప్పటికి మూడు రోజులైపోయింది.
\s5
\v 22 అయినా మాలో కొందరు అడ వాళ్ళు చెప్పినది మాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు తెల్లవారి సమాధి దగ్గరికి వెళ్ళి,
\v 23 అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. అక్కడ దేవదూతల దర్శనం చూసామని చెప్పారు. ఆ దూతలు యేసు బతికే ఉన్నాడని చెప్పారంట.
\v 24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు" అని ఆయనకు చెప్పారు.
\s5
\v 25 అందుకాయన, "తెలివి తక్కువ మనుషులారా, క్రీస్తును గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మడంలో మీరు చురుకుగా లేరు.
\v 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి చనిపోయి తన పరలోక మహిమ గృహానికి పోవడం తప్పనిసరి అని మీకు తెలిసి ఉండాలి కదా" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 27 ఆపైన ఆయన ప్రవక్తలందరూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వాళ్ళకి తెలియజేశాడు. మోషేతో మొదలు పెట్టి ప్రవక్తలంతా రాసిన మాటలు వివరించాడు.
\s5
\v 28 ఇంతలో వాళ్ళ గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది.
\v 29 దాంతో వాళ్ళు, "పొద్దు వాలుతున్నది. చీకటి కమ్ముతున్నది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు" అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వాళ్ళతో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.
\s5
\v 30 ఆయన వాళ్ళతో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, తుంచి కొన్ని ముక్కలు తినడానికి వాళ్ళకిచ్చాడు.
\v 31 వాళ్ళు ఆయన్ను గుర్తు పట్టేలా దేవుడు చేశాడు. కానీ ఆయన వెంటనే అదృశ్యమయ్యాడు.
\p
\v 32 అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు, "దారిలో నడుస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు అదేమిటో అర్థం కాకపోయినా మంచి భావన మనలో నిండి పోయినట్టు అనిపించ లేదూ" అనుకున్నారు.
\s5
\v 33 అప్పుడే వాళ్ళు బయలుదేరి మళ్ళీ యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులనూ, వాళ్ళతో ఉన్నవాళ్ళనీ కలుసుకున్నారు.
\v 34 వాళ్ళు ఆ ఇద్దరితో "ప్రభువు మళ్ళీ బ్రతికిన సంగతి నిజమే. ఆయన సీమోనుకు కనిపించాడు" అని చెప్పారు.
\v 35 అప్పుడు ఆ ఇద్దరూ దారిలో తాము నడుస్తున్నప్పుడు జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తాము ఆయన్ని గుర్తు పట్టిన విషయం తెలియజేశారు.
\s5
\p
\v 36 వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా హటాత్తుగా యేసే వాళ్ళ మధ్య నిలబడి, "దేవుడు మీకు శాంతినిచ్చు గాక" అన్నాడు.
\v 37 అయితే వాళ్ళు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు.
\s5
\v 38 అప్పుడాయన, "మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో నేను బ్రతికానా లేదా అని ఎందుకు సందేహపడుతున్నారు?
\v 39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులకూ పాదాలకూ ఉన్న గాయాలు చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నేను నేనేనని గుర్తిస్తారు. నాకు ఉన్నట్టుగా ఆత్మకు శరీరం ఉండదు గదా" అని చెప్పాడు.
\v 40 అలా చెప్పి తన చేతులకూ, కాళ్ళకూ ఉన్న గాయాలు వాళ్ళకి చూపించాడు.
\s5
\v 41 అయితే వాళ్ళు సంతోషంతో తలమునకలైపోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, "మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా?" అని అడిగాడు.
\v 42 వాళ్ళు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
\v 43 ఆయన దాన్ని తీసుకుని వాళ్ళ కళ్ళ ఎదుటే తిన్నాడు.
\s5
\p
\v 44 తరువాత ఆయన, "నేను మీతో ఉన్నప్పుడు చెప్పినది మళ్ళీ చెబుతున్నాను. మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలి."
\s5
\v 45 అప్పుడు లేఖనాల్లో తన గురించి రాసిన వాటిని గ్రహించగలిగేలా ఆయన వాళ్ళ మనసులు తెరిచాడు.
\v 46 ఆయన వాళ్ళతో "మీరు లేఖనాల్లో చదివింది ఇదే, క్రీస్తు హింసల పాలై చనిపోతాడు. కానీ మూడవ రోజున మళ్ళీ బ్రతుకుతాడు.
\v 47 లేఖనాల్లో ఇంకా ఇలా రాసి ఉంది. నమ్మిన వాళ్ళు అన్ని చోట్లా మనుషులు పాపాలు చెయ్యడం మానుకుని దేవుని వైపు తిరగాలని ప్రకటించాలి. అప్పుడు ఆయన వాళ్ళ పాపాలు క్షమిస్తాడు. క్రీస్తును నమ్మిన వాళ్ళు ఈ సందేశాన్ని ప్రచారం చెయ్యాలి. దేవుడు అందుకే వాళ్ళని పంపించాడు. వాళ్ళు యెరూషలేములో మొదలు పెట్టి బయలుదేరి పోయి అన్ని జాతులకూ దీన్ని ప్రకటించాలి.
\s5
\v 48 ఇక్కడ జరిగినవన్నీ నిజమేనని మీకు తెలిసిన వాటిని మీరు అందరికీ చెప్పాలి.
\v 49 నా తండ్రి వాగ్దానం చేసినట్టుగా మీకోసం పరిశుద్ధాత్మను పంపుతాను. కానీ మీరు మాత్రం దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపే దాకా ఈ పట్టణం లోనే ఉండాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 50 ఆయన బేతనియ గ్రామం వరకూ వాళ్ళని తీసుకు పోయి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు
\v 51 అలా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వాళ్ళలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
\s5
\v 52 వాళ్ళు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
\p
\v 53 అనుదినం దేవాలయం ఆవరణలో దేవుణ్ణి కీర్తించడంలో నిమగ్నమయ్యారు.