Door43-Catalog_te_iev/41-MAT.usfm

2058 lines
418 KiB
Plaintext

\id MAT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h మత్తయి సువార్
\toc1 మత్తయి సువార్
\toc2 మత్తయి సువార్
\toc3 mat
\mt1 మత్తయి సువార్
\s5
\c 1
\p
\v 1 అబ్రాహాము, దావీదుల వంశం వాడైన యేసు క్రీస్తు పూర్వీకుల జాబితా.
\p
\v 2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
\p
\v 3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
\s5
\p
\v 4 ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.
\p
\v 5 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.
\p
\v 6 యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.
\s5
\p
\v 7 సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.
\p
\v 8 ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.
\s5
\p
\v 9 ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.
\p
\v 10 హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
\p
\v 11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.
\s5
\p
\v 12 బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి.
\p యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
\p
\v 13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.
\p
\v 14 అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.
\s5
\p
\v 15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.
\p
\v 16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె యేసుకు తల్లి. ఈ యేసునే క్రీస్తు అని పిలిచారు.
\p
\v 17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.
\s5
\p
\v 18 ఇది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమి జరిగింది అనే దాని వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో నిశ్చితార్థం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి నివసించక ముందే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆమె గర్భవతి అయిందని వాళ్ళకి తెలిసింది.
\v 19 ఆమెను పెళ్ళాడనున్న యోసేపు దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకునే ముక్కుసూటి మనిషి. కానీ ఆమెను నలుగురిలో పరువు తీసే పాపం నాకెందుకులే అనుకున్నాడు. అందువల్ల గుట్టు చప్పుడు కాకుండా వివాహ ప్రయత్నం విరమించుకుందామనుకున్నాడు.
\s5
\p
\v 20 అతడు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ప్రభువు దూత ఒకడు అతనికి కలలో కనిపించాడు. "యోసేపూ, దావీదు రాజు వంశస్తుడా, మరియను పెళ్ళి చేసుకోడానికి వెనకాడవద్దు. ఆమె గర్భవతిగా ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది.
\v 21 ఆమె కొడుకును కంటుంది. తన ప్రజలను పాపం నుండి రక్షించేది ఆయనే గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు.
\s5
\v 22 పూర్వకాలం దేవుడు యెషయా ద్వారా పలికించిన మాట నిజమయ్యేలా ఇది జరుగుతుంది. యెషయా ఇలా రాశాడు.
\q1
\v 23 "వినండి, కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.
\q1 ఆయనకు "దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థమిచ్చే "ఇమ్మానుయేలు" అనే పేరు పెడతారు."
\s5
\p
\v 24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.
\v 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
\s5
\c 2
\p
\v 1 మహా హేరోదు రాజు పరిపాలించే కాలంలో యూదయలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టాడు. కొంతకాలం గడిచిన తరువాత తూర్పున ఉన్న సుదూర ప్రాంతం నుండి, నక్షత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఉండే కొందరు యెరూషలేముకు వచ్చారు.
\v 2 వాళ్ళు అక్కడి వాళ్ళతో "యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టాడని తెలియచేసే నక్షత్రాన్ని మేము తూర్పు దిక్కున చూసాము. ఆయనను ఆరాధించడానికి వచ్చాం" అన్నారు.
\p
\v 3 వాళ్ళు అడుగుతున్న విషయాన్ని గురించి హేరోదు రాజు విని చాలా కంగారుపడ్డాడు. యెరూషలేములో చాలామంది కూడా కంగారుపడ్డారు.
\s5
\v 4 అప్పుడు రాజు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు అందరినీ పిలిపించాడు. "క్రీస్తు ఎక్కడ పుడతాడని ప్రవక్తలు ముందుగా చెప్పారో చూడండి" అని వారిని అడిగాడు.
\v 5 అందుకు వాళ్ళు "యూదయలోని బేత్లేహేము అనే గ్రామంలోనే ఆయన పుట్టాలి. ఎందుకంటే చాలాకాలం కిందట మీకా అనే ప్రవక్త ముందుగానే రాశాడు.
\v 6 యూదయలోని బేత్లేహేము గ్రామమా, యూదా పట్టణాలన్నిటికీ నువ్వేమీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను పాలించేవాడు నీలో నుండే వస్తాడు."
\s5
\p
\v 7 అప్పుడు హేరోదు నక్షత్రాల సూచనలు చూసే ఆ శాస్త్రజ్ఞులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలాలను వాకబు చేశాడు.
\v 8 తరువాత వారిని బేత్లేహెముకు పంపిస్తూ "మీరు వెళ్ళి ఆ పిల్లవాడి కోసం బాగా వెదకండి. మీరు ఆయనను చూశాక నాకూ చెప్పండి. నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 9 రాజు చెప్పింది విన్న తరువాత ఆ మనుషులు బేత్లెహేము వైపుకు బయలుదేరారు. ఆశ్చర్యం! తూర్పున వాళ్ళు చూసిన నక్షత్రం మళ్లీ వాళ్ళకి ముందుగా వెళుతూ కనపడింది.
\v 10 ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎగిరి గంతేసి దాన్ని వెంబడించారు. అది ఆ పిల్లవాడు ఉన్న ఇంటిపైగా ఆగింది.
\s5
\p
\v 11 వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడినీ, తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి నమస్కరించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, ఖరీదైన సాంబ్రాణి , బోళం అనే పరిమళ ద్రవ్యం కానుకలుగా ఆయనకు సమర్పించారు.
\v 12 దేవుడు వాళ్ళకి కలలో కనపడి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని హెచ్చరించాడు. కాబట్టి వాళ్ళు వేరే దారిలో తమ దేశం వెళ్ళిపోయారు.
\s5
\p
\v 13 వాళ్ళు బేత్లేహేమును వదిలి వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, "పిల్లవాడినీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపో. నేను నీకు మళ్ళీ చేప్పేవరకు అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ పిల్లవాడిని చంపాలని తన సైనికులను పంపిస్తున్నాడు" అని చెప్పాడు.
\v 14 ఆ రాత్రివేళ యోసేపు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండి, తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు.
\q
\v 15 "ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచాను." అని హోషేయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
\s5
\p
\v 16 జ్ఞానులు తనను మోసం చేసారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా తన దగ్గరకు వచ్చిన కాలాన్ని లెక్కగట్టి ఆ పిల్లవాడి వయస్సును అంచనా వేసుకున్నాడు. దాని ప్రకారం బెత్లెహేములో, చుట్టూ ఉన్న గ్రామాల్లో రెండేళ్ళు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపమని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
\s5
\v 17 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఈ విధంగా నెరవేరాయి.
\q
\v 18 రామాలో స్త్రీలు శోకిస్తూ ఉన్నారు. రాహేలు చనిపోయిన తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
\q పిల్లలందరూ చనిపోవటం వల్ల ఎంత ఆదరించాలని చూసినా ఆమె ఓదార్పు పొందలేకపోయింది.
\s5
\p
\v 19 హేరోదు చనిపోయిన తరవాత ప్రభువు దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో కనపడి,
\v 20 "పిల్లవాడి ప్రాణం తీయాలని ప్రయత్నించిన వాళ్ళు చనిపోయారు. కనుక నువ్వు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు" అని చెప్పాడు.
\v 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణి, తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళాడు.
\s5
\p
\v 22 అయితే అర్కేలా తన తండ్రి హేరోదుకు బదులుగా యూదయ ప్రాంతాన్ని ఏలుతున్నాడని యేసేపు విని, అక్కడికి వెళ్ళటానికి భయపడ్డాడు. తరువాత దేవుడు కలలో అతడితో చెప్పటంతో యోసేపు, మరియ, ఆ పిల్లవాడు గలిలయలోని నజరేతుకు వెళ్ళారు.
\v 23 యేసును నజరేయుడు అంటారని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
\s5
\c 3
\p
\v 1 యేసు నజరేతులో ఉన్నప్పుడు, బాప్తిసమిచ్చే యోహాను యూదయ అరణ్యంలో ఒంటరిగా ఉంటూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు పరలోకరాజ్యం గురించి చెపుతూ ఉన్నాడు.
\v 2 "పాపం చేయకండి. పరలోకరాజ్యం దగ్గరగా ఉంది. మీరు ఇంకా పాపం చేస్తూ వుంటే దేవుడు మిమ్మల్ని తిరస్క రిస్తాడు" అని బోధిస్తూ ఉన్నాడు.
\v 3 చాలాకాలం క్రితం యెషయా ప్రవక్త, "అరణ్యంలో ఒక స్వరం ఘోషిస్తూ ఉంది. ప్రభువు వస్తున్నాడు. అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆయన కోసం అన్నీ సిద్ధం చెయ్యండి" అని రాసింది ఇతని గురించే.
\s5
\p
\v 4 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు బెల్టు కట్టుకునేవాడు. అడవిలో దొరికే మిడతల్నీ తేనెనూ తినేవాడు.
\v 5 యెరూషలేము, యూదయ, యోర్దాను నదీ ప్రాంతాల వారంతా యోహాను బోధ వినడానికి వచ్చేవారు.
\v 6 అతని బోధ విన్న తరవాత వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నారు. యోహాను వారందరికీ బాప్తిసం ఇచ్చేవాడు.
\s5
\p
\v 7 చాలామంది పరిసయ్యులూ, సద్దూకయ్యూలూ ఆయన దగ్గరకు బాప్తిసం పొందడానికి రావడం యోహాను చూసి వారితో, "మీరు పాముపిల్లలు. మీ పాపాలను బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని మిమ్మల్ని ఎవరూ హెచ్చరించలేదా? దేవుని నుండి తప్పించుకోవచ్చని మీరు ఎప్పటికీ అనుకోవద్దు.
\v 8 మీరు నిజంగా పాపం చేయడం మానేస్తే, దానికి రుజువుగా మంచి పనులు చెయ్యండి.
\v 9 అబ్రాహాము సంతానానికి తోడుగా తాను ఉన్నానని దేవుడు చెప్పిన సంగతి నాకు తెలుసు. కాని "మేము అబ్రాహాము సంతానం, మేము పాపం చేసినా కూడా దేవుడు మమ్మల్ని శిక్షించడు" అని మీరు అనుకోవద్దు. మీకు తెలుసా? దేవుడు ఈ రాళ్ళ నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు.
\s5
\v 10 మంచి కాయలు కాయని ప్రతి చెట్టును నరికి మంటల్లో పడేస్తారు. అలాగే దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు" అని చెప్పాడు.
\p
\v 11 "నా వరకు నేను అంత ముఖ్యమైనవాణ్ణి కాదు. ఎవరైనా తమ పాపాలను ఒప్పుకుంటే నేను కేవలం నీళ్ళతో బాప్తిసం ఇస్తాను. కాని గొప్ప శక్తిమంతుడు తొందరలో రాబోతున్నాడు. అతడు నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులను మోయటానికి కూడా నేను పనికిరాను. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసం ఇస్తాడు.
\v 12 మంచి గోదుమలను పొట్టు నుండి వేరు చేయటానికి తూర్పారబట్టే చేట ఆయన పట్టుకుని ఉన్నాడు. రైతు మంచి గోదుమలను తన గిడ్డంగిలో దాచుకున్నట్టు దేవుడు కూడా నీతిమంతులను పరలోకానికి తీసుకు పోతాడు. పొట్టును మంటల్లో వేసి కాల్చినట్టుగా ఆయన చెడ్డవారిని ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు."
\s5
\p
\v 13 ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం తీసుకోటానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చాడు.
\v 14 యేసు యోహానును బాప్తిసం ఇమ్మని అడిగాడు. యోహాను "అసలు నేను నీచేత బాప్తిసం తీసుకోవాలి. నువ్వు పాపివి కాదు గదా, అలాటిది నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి?" అన్నాడు.
\v 15 అందుకు యేసు, "ప్రస్తుతానికి బాప్తిసం ఇవ్వు. మనం ఇద్దరం ఈ విధంగా చేయడం దేవుని సంకల్పం" అన్నాడు. దాంతో యోహాను ఆయనకు బాప్తిసమిచ్చాడు.
\s5
\p
\v 16 యేసు బాప్తిసం తీసుకొని ఒడ్డుకి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం లాగా తన మీదకి వాలడం ఆయన చూశాడు.
\v 17 "ఈయన నా ఇష్టమైన కుమారుడు. నేను ఈయనను ప్రేమిస్తున్నాను. ఈయనంటే నాకెంతో సంతోషం" అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
\s5
\c 4
\p
\v 1 తరువాత దేవుని ఆత్మ యేసుని అపవాది శోధనలను ఎదుర్కోవటానికి ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళాడు.
\v 2 అప్పటికి ఆయన నలభై రాత్రింబగళ్ళు ఏమీ తినకపోవడంతో ఆయనకు చాలా ఆకలిగా ఉంది.
\v 3 ఆయనను శోధించటానికి సాతాను ఆయన దగ్గరకు వచ్చాడు. "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, తింటానికి ఈ రాళ్ళను రొట్టెలుగా మారమని చెప్పు" అన్నాడు.
\v 4 కాని యేసు, "నేను అలా ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే
\q1 మనిషి కేవలం తిండి వల్ల మాత్రమే బతకడు.
\q1 దేవుడు మాట్లాడే ప్రతి మాట వినడం వల్ల బతుకుతాడు" అని దేవుని వాక్యంలో రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 5 తరవాత సాతాను యేసును దేవుని పట్టణమైన యెరుషలేముకు తీసుకెళ్ళాడు. గుడి గోపురం మీద ఆయనను నిలబెట్టాడు.
\v 6 "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే కిందకు దూకు. దూకినా నీకేమీ కాదు ఎందుకంటే,
\q "ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు.
\q వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకొంటారు" అని లేఖనాలలో రాసి ఉంది కదా" అన్నాడు.
\s5
\p
\v 7 అందుకు యేసు "లేదు. నేను అలా దూకను.
\q "నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు" అని కూడా రాసి ఉంది" అని చెప్పాడు.
\p
\v 8 తరువాత సాతాను ఆయనను ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్ళాడు. అక్కడనుండి ప్రపంచ దేశాలనూ, వాటి వైభోగాలనూ ఆయనకు చూపించాడు.
\v 9 "నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను పూజిస్తే ఈ దేశాలన్నింటినీ వాటిలో ఉన్న అద్భుతమైన వస్తువులనూ నీకిచ్చేస్తాను" అన్నాడు.
\s5
\p
\v 10 యేసు "సాతానూ అవతలికి పో. నేను నిన్ను ఎప్పటికీ పూజించను.
\q నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే పూజించాలి.
\q ఆయనకే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని రాసి ఉంది" అని చెప్పాడు.
\p
\v 11 దాంతో సాతాను ఆయనను వదిలి వెళ్ళాడు. వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు.
\s5
\p
\v 12 యేసు యూదయ ప్రాంతంలో ఉన్నప్పుడు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి హేరోదు రాజు యోహానును జైల్లో పెట్టించాడని చెప్పారు. అందుకని యేసు తిరిగి గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయాడు.
\v 13 తరువాత నజరేతును విడిచి కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించాడు. అది గలిలయ సరస్సు తీరంలో జెబులూను, నఫ్తాలి తెగలు నివసించిన ప్రాంతం.
\s5
\v 14 యెషయా ప్రవక్త చాలా కాలం క్రితం రాసిన మాటలు నెరవేరేలా యేసు అక్కడికి వెళ్ళాడు.
\q
\v 15 జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న
\q1 యూదేతరులు నివసించే గలిలయ ప్రాంతాల్లో
\q1
\v 16 చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.
\q1 చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.
\s5
\p
\v 17 యేసు కపెర్నహూములో ఉన్నప్పుడే, "పరలోకం నుండి దేవుని రాజ్య పాలన సమీపిస్తూ ఉంది. ఆయన పరిపాలనలో మీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పాపం చేయడం మానండి" అని బోధించడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 18 ఒకరోజు యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నాడు. అక్కడ ఇద్దరు మనుషులు కనిపించారు. వారిలో ఒకడు సీమోను, ఇంకొకడు అతని తమ్ముడు అంద్రెయ. వాళ్ళు సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు.
\v 19 యేసు వారితో, "నాతో రండి. నాకు శిష్యులుగా చేయడం కోసం మనుషులను ఎలా తీసుకురావాలో నేను మీకు నేర్పుతాను. మనుషులను పట్టే జాలరులనుగా నేను మిమ్మల్ని చేస్తాను" అన్నాడు.
\v 20 వెంటనే వాళ్ళు తాము చేస్తున్న పనిని వదిలి, ఆయనతో వెళ్ళారు.
\s5
\p
\v 21 అక్కడనుండి వాళ్ళు ముగ్గురూ వెళ్తుండగా యేసు మరి ఇద్దరిని చూశాడు. వాళ్ళు యాకోబూ అతని తమ్ముడు యోహానూ. వాళ్ళు తమ తండ్రితో కూడా పడవలో తమ వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు వాళ్ళను కూడా పిలిచాడు.
\v 22 వాళ్ళు కూడా వెంటనే తమ తండ్రినీ వలలనూ విడిచి యేసుతో వెళ్ళారు.
\s5
\p
\v 23 యేసు ఆ నలుగురితో కలిసి గలిలయ ప్రాంతం అంతా తిరిగాడు. సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ దేవుని రాజ్య శుభవార్తను ప్రకటిస్తూ, రోగులను నయం చేస్తూ ఉన్నాడు.
\v 24 సిరియాలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఈయన చేస్తున్నది విని రోగులందరినీ నానా విధాల వ్యాధుల చేతా యాతనలచేతా బాధలు పడుతున్న వారినీ దయ్యాలు పట్టినవారినీ మూర్ఛరోగులనూ పక్షవాత రోగులనూ ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు.
\p
\v 25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 5
\p
\v 1 యేసు ఆ జనాలను చూసి కొండ ఎక్కి కూర్చుని తన శిష్యులతో మాట్లాడసాగాడు.
\v 2 ఆయన వాళ్ళకి ఇలా బోధించడం మొదలుపెట్టాడు.
\q
\v 3 "దేవుని అవసరత తమకు ఉంది అని ఒప్పుకునే మనుషులను చూసి దేవుడు ఆనందిస్తాడు. పరలోకం నుండి దేవుడు వాళ్ళను పరిపాలిస్తాడు.
\q1
\v 4 ఈ లోకంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను భరించలేక దుఃఖించే వారంటే దేవుడికి ఇష్టం. ఆయన వారిని ఆదరిస్తాడు.
\s5
\q1
\v 5 నమ్రత కలిగిన వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. త్వరలో చేయబోయే కొత్త భూమికి వాళ్ళు వారసులు అవుతారు.
\q
\v 6 అన్నపానాలకు ఆశ పడినట్టుగా నీతిగా బతకాలని ఆశ పడే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఆయన వారికి నీతిగా బతికే సామర్థ్యం ఇస్తాడు.
\q
\v 7 ఇతరులను కరుణించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు కూడా వారిని దయగా చూస్తాడు.
\q
\v 8 దేవుడికి సంతోషం కలిగించాలని చూసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. వాళ్ళు దేవునితో ఉంటారు, ఆయన్ని చూస్తారు.
\s5
\q
\v 9 ఇతరులు శాంతి సమాధానాలతో జీవించటానికి సాయపడే వారిని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అలాంటి వారిని తన బిడ్డలుగా చేసుకుంటాడు.
\q
\v 10 నీతి న్యాయాలతో జీవించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. మనుషులు వారి నీతిని చూసి వారిని అవమానించి, దూషించినప్పుడు దేవుడు గౌరవం పొందుతాడు. ఇలాంటి నీతిగల మనుషులను దేవుడు పరలోకం నుండి ఏలుతాడు.
\s5
\q
\v 11 మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు.వారు మిమ్మల్ని హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు దేవునికి గౌరవం కలుగుతుంది.
\q
\v 12 అప్పుడు సంతోషించండి. ఉప్పొంగి పొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు."
\s5
\p
\v 13 "ఉప్పు ఆహారానికి ఎంత రుచి ఇస్తుందో మీరు ఈ లోకానికి అంత ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ ఉప్పు తన రుచిని పోగొట్టుకుంటే దాన్ని బాగుచేయటం ఎవరి వల్లా కాదు. మనుషులు దాన్ని బయట పారేసి దాన్ని తొక్కుతూ నడుస్తారు.
\v 14 చీకటిలో ఉన్న మనుషులకు వెలుగు ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఈ లోకానికి అలాంటి వెలుగుగా ఉండాలి. కొండమీద కట్టిన ఊరును మనుషులు అందరూ ఎలా చూస్తారో, అలాగే మిమ్మల్ని చూడాలి.
\s5
\v 15 ఎవరు కూడా దీపాన్ని వెలిగించి బుట్ట కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే కదా అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది?
\v 16 అలాగే మీరేం చేస్తారో మనుషులు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ మంచి పనులే చెయ్యాలి. అప్పుడు వాళ్ళు పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు."
\s5
\p
\v 17 "దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ నేను రద్దు చేయటానికి వచ్చానని మీరు అనుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను.
\v 18 నేను కచ్చితంగా చెబుతున్నాను. దేవుడు ఆకాశాన్నైనా భూమినైనా తొలగిస్తాడు కాని ధర్మశాస్త్రం అంతా నెరవేరేవరకు దాంట్లో నుండి ఒక్క సున్నా అయినా ఒక్క పొల్లు అయినా తొలగించడు.
\s5
\v 19 ఎందుకంటే ఈ ఆజ్ఞలలో ఎంత చిన్నదానినైన సరే పాటించకుండా పైగా ఇతరులకు అలా చేయమని చెప్పేవాణ్ణి పరలోకరాజ్యంలోఅతి తక్కువవాడిగా చూస్తారు. కానీ ఎవడైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తాడో వాణ్ణి పరలోకరాజ్యంలో గొప్పవాడిగా చూస్తారు.
\v 20 నేను మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్ర పండితుల కంటే కూడా ఎక్కువగా మీరు ఆ ఆజ్ఞలకు లోబడాలి. ఇంకా మీ మనసుకి ఏది సరైనదిగా అనిపిస్తుందో అది మీరు తప్పక చేయాలి."
\s5
\p
\v 21 "హత్య చెయ్యకూడదు. హత్య చేస్తే ఉరిశిక్ష పడుతుంది, అని మన పితరులు చెప్పింది మీరు విన్నారు కదా. ఐతే నేను చెప్తున్నాను. మీరు ఎవరితోనైనా కోపంగా ఏమన్నా అంటే చాలు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు.
\v 22 మీరు ఎవరిమీదనైనా కోప్పడితే దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరినైనా "చవటా" అని తిడితే మీమీద కోర్టులో కేసు పెట్టొచ్చు. ఎవరినైనా "తెలివి తక్కువ దద్దమ్మా" అంటే, దేవుడు మిమ్మల్ని నరకంలోకి తోస్తాడు."
\s5
\p
\v 23 "దేవుడికి నువ్వు కానుక సమర్పించే ముందు ఎవరితోనైనా గొడవ ఉన్నట్టు నీకు గుర్తుకు వస్తే
\v 24 నీ కానుకను అక్కడే వదిలి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. నువ్వు అతనికి చేసిన దాన్ని గురించి అతణ్ణి క్షమాపణ అడగాలి. ఆపైన వచ్చి నీ కానుకను అర్పించ వచ్చు.
\s5
\p
\v 25 నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాడనుకో. దారిలోనే నువ్వు వాడితో రాజీ పడిపో. లేకపోతే వాడు నిన్ను జడ్జీకి అప్పగిస్తాడు. అతడు నిన్ను జైల్లో పెడతాడు.
\v 26 ఇంకా ఇది కూడా మనసులో పెట్టుకో. ఒకవేళ నువ్వు గనక జైల్లో పడితే చచ్చినా బయటికి రావు. ఎందుకంటే జడ్జీ నువ్వు కట్టాల్సిన జరిమానా డబ్బు మొత్తం చెవులు పిండి వసూలు చేసే దాకా నిన్ను వదలడు. కాబట్టి నీ సాటి మనుషులతో ఎప్పుడూ శాంతి సమాధానాలతో ఉండాలని గుర్తుపెట్టుకో."
\s5
\p
\v 27 "వ్యభిచారం చేయకూడదు, అని దేవుడు మన పూర్వికులతో చెప్పిన మాట నువ్వు వినే ఉంటావు కదా.
\v 28 కాని నేను చేప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే చాలు అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టుగానే దేవుడు పరిగణిస్తాడు."
\s5
\p
\v 29 "నువ్వు పాపం చేయడానికి నీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారెయ్యి. పాపం చేయడానికి నీ రెండు కళ్ళు కారణం అయితే వాటిని పీకేసెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే గుడ్డివాడిగా ఉండి పాపం లేకుండా ఉండడం ఎంతో మేలు.
\v 30 నువ్వు పాపం చేయడానికి నీ చెయ్యి కారణమైతే దాన్ని నరికి పారెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మేలు."
\s5
\p
\v 31 "భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి, అని చెప్పడం కూడా మీరు విన్నారు.
\v 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకొనేవాడూ వ్యభిచారం చేస్తున్నాడు."
\s5
\p
\v 33 "నువ్వు అసత్య ప్రమాణం చేయకూడదు. మీ ప్రమాణాలను ప్రభువు మీ ఎదుట నిలబడి ఉంటే చేసినట్టుగానే ఉండాలి, అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
\v 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే అసలు ఏ కారణంగానైనా ఒట్టు పెట్టుకోవద్దు. మీరు ప్రమాణం చేసిన వాటికి హామీ ఇవ్వటానికి దేవుని నివాస స్థలమైన పరలోకాన్ని ప్రస్తావించ వద్దు. ఎందుకంటే అది దేవుని సింహాసనం. అక్కడ నుండే ఆయన అన్ని విషయాలను శాసిస్తాడు.
\v 35 భూమి తోడు అని ఒట్టు పెట్టుకో వద్దు. ఎందుకంటే అది దేవుడి పాద పీఠం. యెరూషలేము తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. అది మన మహారాజు దేవుని నగరం."
\s5
\p
\v 36 "ఇంకా ఎవరికైనా ఏదైనా పని చేస్తానని నా తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. ఒక్క వెంట్రుకను సైతం తెల్లగాగానీ నల్లగా గానీ నువ్వు మార్చలేవు గదా, అలాంటప్పుడు అంత ముఖ్యమైన పని చేస్తానని ఎలా మాటిస్తావు?
\v 37 ఏదైనా పని చెయ్యాలనుకుంటే మీరు "అవును, నేను చేస్తాను" లేదా "కాదు, నేను చెయ్యలేను" అన్నట్టే ఉండాలి. మీరు అంతకన్నా ఎక్కువ ఏదైనా అంటే మీచేత అలా మాట్లాడించినవాడు సాతానే."
\s5
\p
\v 38 "మన పూర్వీకులు చెప్పిన మాట మీరు వినే ఉంటారు. ఎవరైనా మీ కంటికి గాయం చేస్తే మీరు అతని కంటికి గాయం చెయ్యాలి. ఒకవేళ నీ పన్ను రాలగొడితే వాడి పన్ను రాలగొట్టాలి.
\v 39 కానీ ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీరు ఆపాలని ప్రయత్నించినా మీకు హాని కలిగించాలని చూసే వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అవమానించాలని మీ చెంప మీద కొడితే రెండవ చెంపమీద కొట్టడానికి వీలుగా అతని వైపు తిప్పు.
\s5
\p
\v 40 ఎవరైనా మీ చొక్కా కావాలని కోర్టులో దావా వేస్తే అతనికి దానితోపాటు నీ పైబట్టను కూడా ఇచ్చెయ్యి.
\v 41 ఒక రోమన్ సైనికుడు తన సరంజామాను ఒక మైలు దూరం మొయ్యమని నిన్ను బలవంతం చేస్తే రెండు మైళ్ళు మోసుకెళ్ళు.
\p
\v 42 ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే అతనికి ఇవ్వండి. ఎవరైనా అప్పు అడిగితే లేదనకుండా ఇవ్వండి."
\s5
\p
\v 43 "మీ సాటి ఇశ్రాయేలీయుణ్ణి ప్రేమించి శత్రువులైన విదేశీయులను ద్వేషించు అని దేవుడు మీ పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా.
\v 44 కాని ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీ శత్రువులనూ స్నేహితులనూ సమానంగా ప్రేమించండి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్ధించండి.
\v 45 ఇలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవునిలా మీరు ఉన్నట్టు. ఆయన అందరినీ దయగా చూస్తాడు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా సూర్యుణ్ణి సమానంగా ఉదయింపచేస్తాడు. తనకు లోబడేవారిపైనా లోబడని వారిపైనా కూడా వర్షం కురిపిస్తాడు.
\s5
\v 46 మిమ్మల్ని ప్రేమిస్తున్న మనుషులను మాత్రమే మీరు ప్రేమిస్తే దేవుడు మెచ్చి మేకతోలు కప్పుతాడని చూడవద్దు. పన్నులు కట్టించుకునే వాళ్ళు చేసే పాతకాల వంటివి చేసే వాళ్ళు కూడా తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మీరు వారికంటే మెరుగ్గా ఉండాలి."
\p
\v 47 "ఇంకా మీరు మీ స్నేహితులను మాత్రమే యోగ క్షేమాలు కనుక్కుంటూ వారిని దీవించమని దేవుని కోరితే అందులో గొప్పేముంది? దేవునికి లోబడని యూదేతరులు సైతం అలాగే చేస్తారు గదా.
\v 48 అందుకని పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీపట్ల నమ్మకంగా ఉన్నట్టే మీరు కూడా పూర్తిగా ఆయనపట్ల నమ్మకంగా ఉండాలి."
\s5
\c 6
\p
\v 1 మనుషులు చూడాలని వాళ్ళ ఎదుట మంచి పనులను చెయ్యొద్దు. అలా చెయ్యాలనుకుంటే మాత్రం పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీకు ఎలాంటి బహుమానమూ ఇవ్వడు.
\v 2 కాబట్టి, మీరు దానం చేసేటప్పుడు కపట భక్తులలాగా ఇతరులు మిమ్మల్ని చూడాలని సొంత డబ్బా కొట్టుకోకండి. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపటభక్తులు సమాజ మందిరాల్లో ప్రధాన వీధుల్లో అలా చేస్తారు.
\s5
\v 3 వాళ్ళు చేసినట్టుగా మీరు అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా పేదవారికి మీరు ఏదైనా సాయం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చెయ్యండి.
\v 4 ఎప్పుడైతే మీరు ఎవరికీ తెలియకుండా దానం చేస్తారో అప్పుడే మీ తండ్రి అయిన దేవుడు మీకు బహుమానం ఇస్తాడు.
\s5
\p
\v 5 ఆలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా కపట భక్తుల్లాగా ఉండొద్దు. మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\p
\v 6 ఐతే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\v 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. ఎక్కువగా మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు.
\s5
\v 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు
\v 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
\q “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామాన్ని అందరూ ఘనపరుస్తారు గాక.
\q2
\v 10 ప్రతి ఒక్కరిపై , ప్రతిదానిపై పూర్తిగా నీ అధికారం చెల్లు గాక.
\q2 పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
\s5
\q2
\v 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ప్రసాదించు.
\q2
\v 12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
\q2
\v 13 శోధన పాలైనప్పుడు మేము తప్పటడుగు వెయ్యకుండా చెయ్యి.
\q2 మాకు హాని చెయ్యాలని చూసే సాతాను నుండి మమ్మల్ని కాపాడు.
\s5
\p
\v 14 మీకు వ్యతిరేకంగా మనుషులెవరైనా తప్పులు చేస్తే వారిని క్షమించండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్నీ క్షమిస్తాడు.
\v 15 మీరు మనుషుల తప్పులు క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ తప్పులు క్షమించడు.
\s5
\p
\v 16 దేవుని సంతోషపెట్టాలని మీరు ఉపవాసం ఉన్నప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు ఉసూరుమంటూ పెట్టుకోవద్దు. తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను నీరసంగా చేసుకుంటారు. గుర్తుంచుకోండి. అదే ఆ మనుషులకు దొరికే బహుమానం.
\v 17 మీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఉపవాసం చేసినప్పుడు ఎప్పటిలాగానే తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కోండి.
\v 18 అప్పుడు మీరు ఉపవాసం ఉన్నట్టు మనుషులు గమనించరు. కానీ ఎవరికీ కనిపించని మీ తండ్రి అయిన దేవుడు మీరు ఉపవాసం ఉన్నారని గమనిస్తాడు. ఎవరూ మిమ్మల్ని చూడకపోయినా ఆయన చూస్తాడు. మీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\p
\v 19 పెద్దమొత్తంలో ధనాన్నీ వస్తువులనూ స్వార్ధంతో మీకోసం భూమి మీద కూడబెట్టుకోకండి. ఎందుకంటే భూమి మీద ఉన్నదంతా నశించిపోయేదే. చెదలు బట్టలను నాశనం చేస్తాయి. లోహాలు తుప్పు పట్టి పాడైపోతాయి. దొంగలు దొంగిలిస్తారు.
\v 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు.
\v 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
\s5
\p
\v 22 “నీ శరీరానికి దీపం నీ కన్నే. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
\v 23 నీ కన్ను పాడైతే నువ్వు ఇంక దేన్నీ సరిగ్గా చూడలేవు. ఇదే గనక జరుగుతూ ఉంటే కొంతకాలానికి అస్సలు ఏదీ చూడలేవు. అదే కొనసాగితే కొంత కాలానికి నువ్వసలు ఏమీ చూడలేని గుడ్డివాడివైపోతావు. పూర్తిగా చీకటిలో ఉంటావు. ఆలాగే, నువ్వు అత్యాశపరుడివిగా ఉంటే ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉంటావు. నీ కళ్ళు చూసేవీ నీ మనస్సు ఆలోచించేదీ అత్యాశాపూరితమైన కోరికలతో నిండిన ఈ లోక సంపద గురించే అయితే నువ్వు చేస్తున్నదంతా దుర్మార్గమే.
\p
\v 24 ఇద్దరు యజమానులకు ఎవరూ ఒకేసారి సేవ చేయలేరు. అలా చెయ్యాలని ప్రయత్నిస్తే అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవుడికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.
\s5
\p
\v 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయో లేదోనని దిగులు పెట్టుకోకండి. మీరు తినే భోజనం కన్నా మీ జీవం గొప్పది. కట్టుకునే బట్టలకన్నామీ శరీరం గొప్పది.
\v 26 పిట్టలను చూడండి. అవి విత్తనాలు చల్లవు. పంట కోయవు, ధాన్యం నిలవ చేసుకోలేవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే తప్పకుండా గొప్పవాళ్ళే. మీకేది అవసరమో దేవుడు మీకు ఇస్తాడని నమ్మండి.
\s5
\p
\v 27 మీరు బెంగ పెట్టుకుంటే లాభమేమిటి? బెంగ పెట్టుకోవడం వల్ల జీవితకాలానికి ఒక్క నిమిషమైనా కలుస్తుందా. కాబట్టి దేని విషయంలోనూ దిగులు పెట్టుకోవద్దు.
\p
\v 28 కట్టుకోడానికి బట్టల గురించి కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పువ్వులెలా పూస్తున్నాయో చూడండి. సంపాదనకై అవి పనిచేయవు. తమ బట్టలు తయారు చేసుకోలేవు.
\v 29 అయితే నేను అనేదేమిటంటే పూర్వకాలం సొలోమోను రాజు అందమైన బట్టలు ధరించేవాడు గదా, అతని బట్టలు సైతం ఈ గడ్డి పువ్వుల ముందు దిగదుడుపే.
\s5
\p
\v 30 గరిక మొక్కలు కొంచెం కాలమే ఉంటాయి. వాడిపోయాక వాటిని తగలబెట్టేస్తారు. దేవుడు వాటిని భలే ముస్తాబు చేస్తాడు గదా. అయితే గడ్డిమొక్కల కంటే మీరే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆయన మిమ్మల్నే ఎక్కువగా పట్టించుకుంటాడు. మీకు ఆపాటి నమ్మకం కూడా లేదు.
\v 31 కాబట్టి ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి కట్టుకుంటాం అని బెంగ పెట్టుకోకండి.
\s5
\v 32 దేవుని ఎరగని వాళ్ళు ఇలాంటి వాటి కోసం దిగులుపడుతుంటారు. అయితే పరలోకంలో ఉండే మీ తండ్రికి మీకేది అవసరమో తెలుసు.
\v 33 కాబట్టి మీ ఆలనా పాలనా చూసే దేవుని మీ వాడుగా చేసుకోవడం అనేదాన్ని మీ జీవితాల్లో అతి ముఖ్యమైనదిగా ఎంచండి. అప్పుడు ఆయన కూడా మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు.
\v 34 కాబట్టి రేపు ఏమి జరుగుతుందా అని దిగులుపడొద్దు. దాని కష్టాలు దానికే ఉంటాయి. ఏ రోజు కష్టాలు ఆ రోజుకు చాలు.
\s5
\c 7
\p
\v 1 "ఇతరులు చేసిన తప్పుల గురించి పాపాల గురించి మీరు ఎప్పుడూ వేలెత్తి చూపించొద్దు. అప్పుడు దేవుడు మీ పాపాల గురించీ మాట్లాడడు.
\v 2 మీరు ఇతరులను ఖండిస్తే దేవుడు మిమ్మల్నీ ఖండిస్తాడు. మీరు ఎంతవరకు వారిని తోసిపుచ్చుతారో, దేవుడు కూడా అంతవరకు మిమ్మల్నీ తోసిపుచ్చుతాడు.
\s5
\v 3 మీలో ఎవరూ ఇతరులలో ఉన్న చిన్న చిన్న తప్పుల గురించి పట్టించుకోనక్కర లేదు. అది ఎలా ఉంటుందంటే ఎదుటివాడి కంట్లో ఒక చిన్న గడ్డిపోచను చూసినట్టుగా ఉంటుంది. కాని మీరు మాత్రం పెద్ద తప్పుల గురించి పట్టించుకుంటూ ఉండాలి. నీ కంట్లోని కొయ్య దుంగను నువ్వు చూసుకోవు.
\v 4 నీ కంట్లో పెద్ద దుంగను ఉంచుకుని నువ్వు ఇతరులతో "నీ కంట్లో నలుసు తీయనివ్వు" అని చెప్పకూడదు.
\v 5 నీ కంట్లో ఉన్న దుంగను మొదట తీసేసుకో. అప్పుడు నీ సాటిమనిషి కంట్లో ఉన్న నలుసు తీసివేయవచ్చు."
\s5
\p
\v 6 "మీపై దాడి చేసే కుక్కలకు దేవునికి చెందిన వస్తువులను ఇవ్వొద్దు. మీ ముత్యాలను పందుల ఎదుట వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో. అలాగే, దేవుని గురించిన అద్భుతమైన సంగతులను దుర్మార్గులకు చెప్పకండి. వాళ్ళు తిరిగి మీకు హాని చేయవచ్చు."
\s5
\p
\v 7 "మీకు ఏది అవసరమో అది దేవుని అడుగుతూనే ఉండండి. ఆయన మీకు తప్పక ఇస్తాడని నమ్మండి.
\v 8 దేవుని అడిగి దాన్ని ఆయన ఇస్తాడని నమ్మే ప్రతివాడికీ అది దొరుకుతుంది.
\p
\v 9 నీ కొడుకు నిన్ను రొట్టె ఇమ్మని అడిగితే వాడికి రాయినిస్తావా?
\v 10 వాడు చేప కోసం అడిగితే పామునిస్తావా?
\s5
\v 11 మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచివి ఇవ్వాలన్న సంగతి మీకు తెలుసు. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వాళ్ళకి అంతకంటే మంచివి కచ్చితంగా ఇస్తాడు."
\p
\v 12 "కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వాళ్ళకి చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, చాలా కాలం క్రితం ప్రవక్తలు రాసిన వాటి అర్థం ఇదే."
\s5
\p
\v 13-14 "పరలోకంలో దేవునితో కలిసి జీవించాలంటే చాలా కష్టం. అది చాలా కష్టమైన దారిలో వెళుతున్నట్టుగా ఉంటుంది. చాలా మంది మనుషులు నడిచే దారి ఇంకోటి ఉంది. అది చాలా విశాలంగా ఉంటుంది. కాని దానిలో ఉన్నది మరణమే. అందుకే నేను చెప్తున్నాను. పరలోకంలో దేవునితో కలిసి ఎప్పటికీ జీవించాలంటే కష్టమైన దారిలో నడిచి ఇరుకుగా ఉన్న గేటులోనుంచి ప్రవేశించాలి."
\s5
\p
\v 15 "అబద్దాలు చెప్పే వారిని జాగ్రతగా గమనించండి. దేవుడు చెప్పాడని ఏవేవో కల్పించి మీకు చెప్తుంటారు. వాళ్ళు గొర్రె తోలు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు, మేకవన్నె పులులు.
\v 16 చెట్టుకు కాసిన పండ్లు చూసి అది ఏమి చెట్టో సులువుగా తెలుసుకోగలుగుతాం. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరుపండ్లు గానీ కోసుకోలేము గదా."
\p
\v 17 "ఇంకొక ఉదాహరణ. ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది
\s5
\v 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
\v 19 పనివాళ్ళు మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు
\v 20 చెట్టుకు కాసిన పండ్లను చూసి అది ఏ రకమైన చెట్టో మనం తెలుసుకున్నట్టుగానే మనకెదురైన మనుషులు చేసేది చూసి వాళ్ళు మంచివారా కాదా అనేది మనం గుర్తించాలి.
\s5
\p
\v 21 చాలామంది నన్ను అలవాటుగా ప్రభూ ప్రభూ అని నా అధికారాన్ని అంగీకరించినట్టే పిలుస్తారు కాని అలా పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇష్ట ప్రకారం చేసేవారు కాదు. పరలోకంలో దేవుని ఇష్ట ప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.
\v 22 దేవుని తీర్పు రోజున చాలామంది నాతో, "ప్రభూ, ప్రభూ మేము నీ పేరున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?" అంటారు.
\v 23 అప్పుడు నేను "దుర్మార్గులారా, మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి పొండి" అంటాను."
\s5
\p
\v 24 "కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
\v 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
\s5
\v 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
\v 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. కాబట్టి నేను చెప్పేది మీరు తప్పక వినాలి."
\s5
\p
\v 28 యేసు ఈ మాటలు చెప్పడం ముగించినప్పుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
\v 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాకుండా అధికారం గల వాడిలాగా వాళ్ళకి బోధించాడు.
\s5
\c 8
\p
\v 1 యేసు కొండ దిగి వచ్చాక ప్రజలు గుంపులుగా ఆయన్ని వెంబడించారు.
\v 2 యేసు ఆ జనాన్నివదిలి వస్తుండగా కుష్టు వ్యాధి ఉన్న ఒక రోగి వచ్చి ఆయన ముందు మోకరించాడు. అతడు యేసుతో, "ప్రభూ దయచేసి నన్ను బాగుచెయ్యి. నీకిష్టమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవు" అన్నాడు.
\v 3 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకాడు. ఆయన అతనితో, "నిన్ను స్వస్థపరచడానికి నేను ఇష్ట పడుతున్నాను. ఇప్పుడే నిన్ను బాగుచేస్తాను" అన్నాడు. వెంటనే అతను స్వస్థపడ్డాడు.
\s5
\v 4 అప్పుడు యేసు అతనితో, "యాజకునికి తప్ప నేను నిన్ను స్వస్థపరచినట్టు ఎవరికీ చెప్పొద్దు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మోషే ఆజ్ఞాపించినట్టు కానుక చెల్లించు. అప్పుడు ప్రజలే దీని గురించి తెలుసుకుంటారు" అని చెప్పాడు.
\s5
\p
\v 5 యేసు కపెర్నహోం పట్టణానికి వెళ్ళినప్పుడు వందమంది రోమన్ సైనికులకు అధికారిగా ఉన్నవాడు యేసు దగ్గరికి వచ్చాడు. తనకు సాయం చెయ్యమని బ్రతిమాలాడు.
\v 6 ఆ అధికారి ఆయనతో, "ప్రభూ, ఇంటి దగ్గర నా పనివాడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అతడు చాలా నొప్పి అనుభవిస్తున్నాడు" అన్నాడు.
\v 7 యేసు అతనితో, "నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను" అన్నాడు.
\s5
\v 8 కానీ ఆ అధికారి ఆయనతో, "నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. నా పనివాడు స్వస్థపడ్డాడని నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, అతను స్వస్థపడతాడు.
\v 9 నేను ఒక సైనికుణ్ణి. నేను నా అధికారుల ఆజ్ఞలకి లోబడాలి. అలాగే నా కింద నా ఆజ్ఞలకి లోబడే సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకణ్ణి "వెళ్ళు" అంటే వెళ్తాడు. ఇంకొకడితో "రా" అంటే వస్తాడు. నా పనివాడితో "ఇది చెయ్యి" అంటే చేస్తాడు" అన్నాడు.
\p
\v 10 యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. తనతోపాటు నడిచే వాళ్ళతో ఆయన, "ఇది వినండి. ఇతడు యూదుడు కాకపోయినా నా మీద అతనికి ఉన్న విశ్వాసం ఇంకెవరిలోనూ, నాపై విశ్వాసం ఉంచుతారని నేను ఎదురుచూసిన ఇశ్రాయేలు వారిలో కూడా చూడలేదు.
\s5
\v 11 నేను నిజంగా చెప్తున్నాను. ఇంకా చాలా మంది యూదులు కానివాళ్ళు నాలో విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు వేరు వేరు దేశాల నుండి వస్తారు. తూర్పు నుండీ, పడమర నుండీ, వస్తారు. ప్రతి వారిపై, ప్రతి దానిపై పరలోకం నుండి దేవుని పరిపాలన మొదలు కాగానే వీళ్ళందరూ వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి విందులో కూర్చుంటారు."
\p
\v 12 "కానీ దేవుడు తాను ఏలుదామని అనుకున్న యూదుల్నినరకంలోకి తోసేస్తాడు. అక్కడ కారుచీకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు పడే బాధకు ఏడుస్తూ ఉంటారు. తీవ్రమైన నొప్పితో పళ్ళు నూరుతూ ఉంటారు" అన్నాడు.
\v 13 తరవాత ఆ అధికారితో యేసు, "ఇంటికి వెళ్ళు. నువ్వు నమ్మింది నీకు జరుగుతుంది" అన్నాడు. అప్పుడు ఆ అధికారి ఇంటికి వెళ్ళి, యేసు తనతో ఆమాట చెప్పిన సమయంలోనే తన పనివాడు స్వస్థపడ్డాడని తెలుసుకున్నాడు.
\s5
\p
\v 14 యేసు, ఆయన శిష్యుల్లో కొందరు పేతురు ఇంటికి వెళ్ళారు. యేసు పేతురు అత్తగారిని చూశాడు. ఆమె జ్వరంతో పడుకుని ఉంది.
\v 15 యేసు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమెకి జ్వరం తగ్గి పోయింది. అప్పుడు ఆమె లేచి వాళ్లకు భోజనం వడ్డించింది.
\s5
\p
\v 16 ఆ సాయంత్రం విశ్రాంతి దినం గడిచి పోయినప్పుడు ప్రజలు దయ్యాలు పట్టిన వాళ్ళని, ఇతర రోగుల్ని తీసుకు వచ్చారు. ఆయన కేవలం మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగులందరినీ స్వస్థపరిచాడు.
\v 17 ఈ విధంగా యెషయా ప్రవక్త మాటలు,
\q1 "ఆయన ప్రజలను రోగాల నుండి విడిపించాడు, వాళ్ళను బాగుచేసాడు" అని రాసినవి నిజమయ్యాయి.
\s5
\p
\v 18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, తన శిష్యులతో పడవలో సరస్సుకు అవతలి వైపుకు తీసుకెళ్ళమన్నాడు.
\p
\v 19 వాళ్ళు పడవ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక యూదుల ధర్మశాస్త్ర పండితుడు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో, "బోధకా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నేనూ అక్కడికే వచ్చి, నీతోనే ఉంటాను" అన్నాడు.
\v 20 యేసు జవాబిస్తూ, "నక్కలకి గుంటలు ఉంటాయి, పిట్టలకి గూళ్ళు ఉంటాయి. నేను మనుష కుమారుణ్ణి అయినా నాకు తల వాల్చుకునే స్థలం కూడా లేదు" అన్నాడు.
\s5
\p
\v 21 తరవాత యేసును అనుసరించే వాళ్ళల్లో ఒకడు, "ప్రభూ, ముందు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. మా నాన్న చనిపోయాక పాతిపెట్టి , ఆ తరవాత నేను నీతో వస్తాను" అన్నాడు.
\v 22 కానీ యేసు అతనితో, "నాతో ఇప్పుడే రా. చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ మనుషులు చనిపోయే వరకూ ఎదురు చూడనివ్వు" అన్నాడు.
\s5
\p
\v 23 తరవాత యేసు పడవ ఎక్కాడు. శిష్యులు ఆయన్ని వెంబడించారు.
\v 24 అకస్మాత్తుగా బలంగా గాలి వీచింది. పెద్ద అలలు రావడంతో పడవలోకి నీరు చేరి పడవ నిండిపోసాగింది. యేసు నిద్రపోతున్నాడు.
\v 25 శిష్యులు వెళ్ళి ఆయన్ని లేపి ఆయనతో, "ప్రభూ, రక్షించు. మేము మునిగిపోతున్నాం" అన్నారు.
\s5
\v 26 ఆయన వాళ్ళతో, "భయమెందుకు? నేను మిమ్మల్ని రక్షిస్తానని మీరు పూర్తిగా నమ్మడం లేదు" అన్నాడు. ఆయన లేచి గాలిని గద్దించి, అలలకు సద్దుమణిగి పొమ్మని చెప్పాడు. వెంటనే గాలి ఆగిపోయింది, అలలు ఎగిసి పడటం ఆగిపోయింది.
\v 27 పడవలోని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు "ఈయన అసాధ్యుడు! ప్రకృతి సైతం ఈయన మాట వింటున్నది. గాలీ నీళ్ళు కూడా ఆయనకి లోబడుతున్నాయి" అనుకున్నారు.
\s5
\p
\v 28 వాళ్ళు సరస్సుకు తూర్పు వైపుకు చేరుకున్నారు. గదరేనీ ప్రాంతం వారు నివసించే చోటికి వచ్చారు. అక్కడ దయ్యం పట్టిన ఇద్దరు వ్యక్తులు ఊరి బయట సమాధి గుహల్లో ఉంటున్నారు. వాళ్ళు అటు వచ్చిన వాళ్ళపై దాడి చేసేవారు. ఆ దారిలో ఎవరూ ప్రయాణించే ధైర్యం చెయ్యడం లేదు.
\v 29 వాళ్ళు యేసును చూసి, అకస్మాత్తుగా కేకలు పెడుతూ "నువ్వు దేవుని కుమారుడివి. నీకూ మాకూ ఏం సంబంధం? మమ్మల్ని వదిలెయ్యి. దేవుడు మమ్మల్ని శిక్షించక ముందే మమ్మల్ని నువ్వు వేధించడానికి వచ్చావా?" అన్నారు.
\s5
\p
\v 30 అక్కడ దగ్గరలో పందుల మంద మేస్తూ ఉంది.
\v 31 ఆ దయ్యాలు , "నువ్వు ఎలాగూ మమ్మల్ని వీళ్ళల్లో నుండి బయటికి పంపించి వేస్తావు కాబట్టి ఆ పందుల్లోకి వెళ్లనివ్వు" అని యేసును బ్రతిమాలాయి.
\v 32 యేసు వాటితో "మీకు అదే కావాలంటే అలాగే, పొండి" అన్నాడు. అప్పుడు దయ్యాలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని వదిలి పందుల్లోకి దూరాయి. అప్పుడు ఉన్నట్టుండి ఆ పందుల మంద దొర్లుకుంటూ పోయి కొండ వాలులో ఉన్న లోతైన నీటిలో పడి మునిగి చచ్చాయి.
\s5
\p
\v 33 ఆ పందుల్ని కాసేవాళ్ళు బెదిరిపోయారు. ఊళ్ళోకి వెళ్ళి దయ్యం పట్టిన ఆ ఇద్దరు మనుషులకి జరిగిన విషయంతో సహా అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు.
\v 34 అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా యేసును కలవడానికి వచ్చారు. వాళ్ళు ఆయన్ని, ఆ దయ్యాల అదుపు నుండి బయటపడిన వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు యేసును ఆ ప్రాంతం వదిలి పొమ్మని బ్రతిమాలారు.
\s5
\c 9
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కారు. వారు ఉంటున్న కపెర్నహోము నుండి సరస్సు అవతల వైపుకు వెళ్ళారు.
\v 2 అక్కడ పక్షవాతం వచ్చిన మనిషిని పరుపు పైన కొందరు మనుషులు తీసుకువచ్చారు. తాను ఆ పక్షవాత రోగిని స్వస్థపరుస్తాడనే విశ్వాసం వాళ్లకు ఉన్నదని గ్రహించిన యేసు, "అబ్బాయ్, ధైర్యం తెచ్చుకో. నేను నీ పాపాలు క్షమిస్తున్నాను" అన్నాడు.
\s5
\v 3 యూదు పండితుల్లో కొందరు తమలో తాము "తాను దేవుడినని అనుకుంటున్నాడా ఏమిటి. ఇతడు పాపాలనెలాక్షమిస్తాడు?" అనుకున్నారు.
\p
\v 4 వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్న యేసు "మీరు చెడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు?
\v 5 ఏది సులువు? నీ పాపాలు క్షమించాను అనడమా? నువ్వు లేచి నడువు అని చెప్పడమా?
\v 6 పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి, అంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడని మీరు తెలుసుకొనేలా చేస్తాను" అని, ఆ పక్షవాత రోగితో, "లేచి నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 7 వెంటనే ఆ మనిషి లేచి, తన పరుపు చుట్టుకుని వెళ్ళిపోయాడు.
\v 8 జన సమూహం ఇది చూసి అవాక్కయ్యారు. మనుషులకు అలాంటి అధికారం ఇస్తున్నందుకు దేవుని స్తుతించారు.
\p
\v 9 అక్కడి నుండి యేసు వెళ్ళిపోతూ, "మత్తయి" అనే పేరు గల మనిషిని చూశాడు. రోమన్ ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే బల్ల దగ్గర అతను కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నాతో రా, నా శిష్యుడిగా ఉండు" అన్నాడు. అప్పుడు మత్తయి లేచి ఆయనతో వెళ్ళాడు.
\s5
\p
\v 10 యేసు, ఆయన శిష్యులు ఒక ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నారు. వాళ్ళు తింటూ ఉండగా వాళ్ళతో పాటు చాలా మంది పన్ను వసూలుదార్లూ ఇతరులూ భోజనం చేస్తూ ఉన్నారు.
\v 11 పరిసయ్యులు అది చూసి, శిష్యులతో, "మీ బోధకుడు అలాంటి పన్ను వసూలుదార్లతో, తక్కిన వాళ్లతో స్నేహంగా భోజనం చేయడం బాగోలేదు" అన్నారు.
\s5
\v 12 వాళ్ళు అన్నది యేసు విని వాళ్ళకి ఈ ఉదాహరణ చెప్పాడు. "జబ్బు పడ్డ వాళ్ళకే డాక్టర్ అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి కాదు.
\v 13 "బలులు అర్పించడమే కాదు, మనుషుల పట్ల కనికరం చూపండి" అనే మాటల అర్థం తెలుసుకోండి. మేము నీతిమంతులం అనుకునే వాళ్ళు పాప జీవితాలను వదిలి నా దగ్గరికి రమ్మని పిలవడానికి నేను రాలేదు. మేము పాపులం అని తెలుసుకున్న వాళ్ళని పిలవడం కోసం వచ్చాను. ఇది మనస్సులో పెట్టుకోండి."
\s5
\p
\v 14 బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వచ్చి "మేము పరిసయ్యులు తరచుగా దేవుని మెప్పించడం కోసం ఉపవాసం ఉంటాం. మరి మీ శిష్యులు చెయ్యరెందుకు?" అని అడిగారు.
\v 15 యేసు జవాబిస్తూ, "పెళ్ళి వేడుకల్లో పెళ్ళికొడుకు తన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు విలపించరు. అవునా? ఎందుకంటే ఆ సమయంలో వారికి విచారం ఉండదు. కానీ పెళ్ళికొడుకు వాళ్ళను వదిలి వెళ్ళిపోయినప్పుడు విచారంగా ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉంటారు."
\s5
\p
\v 16 "చిరుగు పూడ్చడానికి కొత్త గుడ్డకు పాత గుడ్డ అతుకు వెయ్యొద్దు. అలా చేస్తే ఆ బట్ట ఉతికినప్పుడు కుచించుకుపోయి, బట్టను చింపేస్తుంది. ఆ చినుగు పెద్దదవుతుంది.
\s5
\v 17 అలాగే పాత చర్మంతో చేసిన సంచుల్లో కొత్త ద్రాక్షరసం పొయ్యరు. అలా చేస్తే ఆ ద్రాక్షరసం పులిసి వ్యాకోచించినప్పుడు సంచులు సాగి పిగిలిపోతాయి. ఆ ద్రాక్షరసం సారాయిగా మారుతున్నప్పుడు ఆ ద్రాక్ష సంచులు చిల్లులుపడి రసం కారిపోతుంది. తాజా ద్రాక్షరసం కొత్త సంచుల్లో పోస్తే అది పులిసినప్పుడు ఆ సంచులు సాగుతాయి. ఈ రకంగా రసమూ సంచులూ రెండూ భద్రంగా ఉంటాయి" అన్నాడు.
\s5
\p
\v 18 యేసు ఇలాచెబుతున్నప్పుడు ఊరి అధికారి ఒకడు ఆయన ఎదుటికి వచ్చి కాళ్ళపై పడ్డాడు. ఆయనతో, "నా కూతురు ఇప్పుడే చనిపోయింది. కానీ నువ్వు వచ్చి ఆమెపై చేతులు వేస్తే, ఆమె బ్రతుకుతుంది" అన్నాడు.
\v 19 యేసు లేచి తన శిష్యులతో కలిసి అతనితో వెళ్ళాడు.
\s5
\p
\v 20 అప్పుడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుకు దగ్గరగా వచ్చింది. వెనకగా వచ్చి ఆయన వేసుకున్న అంగీ అంచు తాకింది.
\v 21 ఆమె "ఆయన వస్త్రం తాకితే చాలు, నేను స్వస్థపడతాను" అనుకుంది.
\v 22 అప్పుడు యేసు తనను ఎవరు తాకారో అని చుట్టూ చూశాడు. ఆయన ఆ స్త్రీని చూసి ఆమెతో, "అమ్మా, ధైర్యంగా ఉండు. నేను నిన్ను బాగుచేస్తానని నువ్వు నమ్మావు కాబట్టి నిన్ను స్వస్థపరిచాను" అన్నాడు. ఆ క్షణంలోనే ఆమె బాగుపడింది.
\s5
\p
\v 23 యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి సమాధి చేసే సమయంలో సంగీతం వాయించే వాళ్ళను, చనిపోయిన అమ్మాయి కోసం శోకాలు పెడుతున్న వాళ్ళను చూశాడు.
\v 24 "ఈ శోకాలు, సంగీతం చాలించండి. వెళ్ళిపొండి. ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతూ ఉంది, అంతే" అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళకి ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసు గనక ఆయన్ని చూసి నవ్వారు.
\s5
\v 25 యేసు వాళ్ళందర్నీ బయటికి పంపేసి, ఆ అమ్మాయి పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి బ్రతికి లేచి కూర్చుంది.
\v 26 ఆ ప్రాంత ప్రజలంతా ఈ వార్త విన్నారు.
\s5
\p
\v 27 యేసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇద్దరు గుడ్డివాళ్ళు "దావీదు కుమారా, మాపై దయ చూపు, మమ్మల్ని బాగుచెయ్యి" అని కేకలేస్తూ వెంటబడ్డారు.
\v 28 యేసు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ గుడ్డివాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. యేసు "నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని మీరు అనుకుంటున్నారా?" అని అడిగాడు. వాళ్ళు ,"ఔను ప్రభూ" అన్నారు.
\s5
\v 29 అప్పుడు ఆయన వాళ్ళ కళ్ళు ముట్టుకుని, "మీ కళ్ళు నేను బాగు చెయ్యగలనని మీరు నమ్మారు కాబట్టి బాగుచేస్తున్నాను" అన్నాడు.
\v 30 వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు ఆయన్ని చూడగలిగారు. ఆయన "మిమ్మల్ని బాగుచేసిన ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు" అని గట్టిగా చెప్పాడు.
\v 31 కానీ వాళ్ళు బయటికి పోయి ఆ ప్రాంతమంతా ఈ విషయాన్ని చాటించారు.
\s5
\p
\v 32 ఆ ఇద్దరూ వెళ్తుండగానే మూగ దయ్యం వశపర్చుకున్న ఒకడిని కొందరు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు.
\v 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మనిషి మాట్లాడడం మొదలుపెట్టాడు. జన సమూహం ఇది చూసి ఆశ్చర్యపోతూ "ఇశ్రాయేలులో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాటి అద్భుతం చూడలేదు" అని చెప్పుకున్నారు.
\v 34 పరిసయ్యులు మాత్రం, "దయ్యాల రాజు సాతానే, దయ్యాలను వదిలించడానికి ఇతనికి అధికారం ఇచ్చాడు" అన్నారు.
\s5
\p
\v 35 తరువాత యేసు, ఆయన శిష్యులు గలిలయ లోని చాలా గ్రామాలకు వెళ్ళారు. పరలోకం నుండి దేవుని ఏలుబడి గురించిన శుభవార్త ప్రకటిస్తూ సమాజ మందిరాలలో యేసు బోధించాడు. ఆయన ప్రజల్లో ఉన్న రకరకాల వ్యాధుల్ని కూడా స్వస్థపరిచాడు.
\v 36 జన సమూహాన్ని ఆయన చూసినప్పుడు వాళ్ళంతా కలతగా దిగాలుగా ఉండడం చూసి జాలిపడ్డాడు. వాళ్ళు కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.
\s5
\p
\v 37 తరువాత ఆయన తన శిష్యులతో, "నా సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలం వంటివాళ్ళు. కానీ ఆ పంట కోసి సమకూర్చడానికి ఎక్కువమంది లేరు.
\v 38 కాబట్టి ప్రభువైన దేవుని ఇంకా కోత పనివాళ్ళని పంపమని ప్రార్థన చెయ్యండి" అన్నాడు.
\s5
\c 10
\p
\v 1 యేసు తన పన్నెండుమంది శిష్యులను తన దగ్గరికి పిలిచాడు. మనుషులను అదుపులో పెట్టుకొనే దురాత్మల్ని వదిలించే శక్తినీ, అన్ని రకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థ పరిచే అధికారాన్నీ వాళ్ళకి ఇచ్చాడు.
\s5
\v 2 ఆయన పిలిచిన పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి- పేతురు అనే కొత్త పేరు పొందిన సీమోను, పేతురు తమ్ముడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని తమ్ముడు యోహాను,
\v 3 ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, పన్ను వసూలుదారుడు మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి,
\v 4 తీవ్ర వాది సీమోను, ద్రోహబుద్ధితో యేసును అధికారులకు పట్టిచ్చిన ఇస్కరియోతు యూదా.
\s5
\p
\v 5 వేరు వేరు చోట్ల శుభవార్త ప్రకటించడానికి ఆ పన్నెండు మంది అపొస్తలుల్ని పంపే ముందు యేసు ఈ సూచనలు ఇచ్చాడు. "యూదులు కానివారు ఉండే చోటికీ సమరయులుండే చోటికీ పోవద్దు.
\v 6 గొర్రెల కాపరి లేక చెదిరిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి.
\v 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి దేవుడు తొందరలో ఏలడం మొదలు పెడతాడు అని చెప్పండి.
\s5
\v 8 రోగుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళను బ్రతికించండి. కుష్టురోగుల్ని బాగుచేసి మళ్ళీ సమాజంలో కలిసేలా చెయ్యండి. దయ్యాల అదుపులో ఉన్నవాళ్ళను విడిపించండి. దేవుడు మీకు ఉచితంగా సాయం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రజలకి ఉచిత సాయం చెయ్యండి.
\v 9 మీతో డబ్బులు తీసుకు పోవద్దు.
\v 10 చేతిసంచీ, అదనంగా చెప్పుల జత, చేతికర్రా కూడా తీసుకు పోవద్దు. పనిచేసే ప్రతివాడూ జీతం తీసుకుంటాడు కదా. అలాగే మీరు వెళ్ళిన వాళ్ళ దగ్గర భోజనం తినే అర్హత మీకు ఉంది."
\s5
\p
\v 11 "మీరు ప్రవేశించిన ఊళ్ళో మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించే వాళ్ళను చూసుకోండి.
\v 12 మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్లకి మేలు చెయ్యమని దేవుని అడగండి. మీరు ఆ ఊరు వదిలి పోయే దాకా ఆ ఇంట్లోనే ఉండండి.
\v 13 మిమ్మల్ని ఆ ఇంటివాళ్ళు సంతోషంతో రానిస్తే దేవుడు నిజంగా వాళ్లకి మేలు చేస్తాడు. కాని వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అంగీకరించకపోతే వాళ్ళకు మీ ప్రార్థన ఏమాత్రం సాయపడదు. దేవుడు వాళ్లకి మేలు చేయడు.
\s5
\v 14 ఏ ఇంటి వాళ్లైనా మిమ్మల్ని రానివ్వకపోతే మీ మాటల్ని ఒప్పుకోకపోతే అక్కడినుంచి వెళ్ళిపొండి. వెళ్ళే ముందు మీ కాలి దుమ్ము అక్కడ దులిపేయండి. అలా చెయ్యడంలో వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించినట్టే దేవుడు కూడా వాళ్ళను తిరస్కరిస్తాడని హెచ్చరించండి."
\p
\v 15 "ఇది జాగ్ర్రత్తగా గుర్తుంచుకోండి. దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చేటప్పుడు సొదొమ, గొమొర్రా పట్టణాల్లోని చెడ్డవాళ్లను శిక్షిస్తాడు. కానీ మిమ్మల్ని తిరస్కరించిన వాళ్లకి పడే శిక్ష ఇంకా తీవ్రంగా ఉంటుంది."
\s5
\p
\v 16 "గమనించండి. తోడేళ్ళ వంటి మనుషుల మధ్యకు అమాయకమైన గొర్రెల్లా మిమ్మల్ని పంపుతున్నాను. పాముల్లాగా చురుకుగా ఉండండి. పావురాల్లాగా సాధు జీవులుగా ఉండండి.
\v 17 మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బంధించి, న్యాయ స్థానాలకు అప్పగించి, న్యాయ విచారణకు గురి చేస్తారు. సమాజమందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.
\v 18 మీరు నాకు చెందినవాళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రాజుల దగ్గరికీ గవర్నర్ల దగ్గరికీ తీసుకు వెళ్ళి విచారణ జరిపి శిక్ష విధిస్తారు. కానీ మీరు నా గురించి యూదులు కాని వాళ్లకీ పాలకులకీ సాక్ష్యమిస్తారు.
\s5
\p
\v 19 వాళ్ళు మిమ్మల్ని బంధించినప్పుడు ఏమి చెప్పాలీ అని కంగారు పడొద్దు. మీరు ఏమి చెప్పాలో అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది.
\v 20 అది మీరు అనుకోవడం వల్ల కాదు, మీ పరలోకపు తండ్రి ఆత్మ మీకు తెలిపినది మీరు మాట్లాడతారు."
\s5
\p
\v 21 "నాలో విశ్వాసం ఉంచినందుకు అధికారులు మీకు మరణ శిక్ష విధిస్తారు. మనుషులు తమ సోదరులకు ఇలా చేస్తారు. తండ్రులు తమ పిల్లలకి చేస్తారు. పిల్లలు తలిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళ చావుకు దారి తీస్తుంది.
\v 22 నన్ను నమ్మినందుకు చాలామంది మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ ఎవరైనా చనిపోయేంత వరకూ నమ్మకంగా నాలో విశ్వాసం ఉంచితే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు.
\v 23 ఇది గుర్తుంచుకోండి. ఒక ఊరి వాళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే ఇంకొక ఊరికి వెళ్ళిపొండి. ఒక ఊరినుండి ఇంకొక ఊరికి వెళ్తూ నా గురించి చెప్పడం పూర్తయ్యే లోపలే మనుష్య కుమారుణ్ణి అయిన నేను తిరిగి వస్తాను."
\s5
\p
\v 24 "గురువు కంటే గొప్పవాణ్ణని శిష్యుడు అనుకోకూడదు. యజమానికంటే సేవకులు ఎక్కువ కాదు.
\v 25 గురువు కన్నా విద్యార్థి మెరుగైన వాడుగా ఉంటాడని ఎవరూ అనుకోరు గదా! అలాగే నేను మీ యజమానిని, గురువును. మనుషులు నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారనే మీరు అనుకోవాలి. వాళ్ళ దృష్టిలో సాతాను ఇంటికి నేను యజమానిని. నా పట్ల వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మీ విషయంలో మరింకెంత దుర్మార్గంగా ఉంటారో గదా!"
\s5
\p
\v 26 "వాళ్ళ గురించి మీకు భయంవద్దు. కప్పిపెట్టిన ప్రతిదీ బయట పడకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు.
\v 27 భయపడడానికి బదులుగా రాత్రిపూట చెప్పినట్టు నేను రహస్యంగా మీతో చెప్పింది మనుషులు పగలు చేసే పనుల్లా బాహాటంగా చెప్పండి. మనుషులు గుసగుసలుగా చెప్పుకున్నట్టు నేను ఏకాంతంలో చెప్పినవి ఇల్లెక్కి ప్రచారం చెయ్యండి."
\s5
\p
\v 28 "శరీరాన్ని చంపే వాళ్లకు భయపడకండి. వాళ్ళు మీ ఆత్మను నాశనం చేయలేరు. కానీ నరకంలో మీ శరీరాన్నీ ఆత్మనూ కూడా దేవుడు నాశనం చేయగలడు కాబట్టి ఆయనకి భయపడండి.
\v 29 పిచ్చుకలు చూడండి. రెండు పైసలకు రెండు పిచ్చుకలు కొనొచ్చు. వాటి విలువ చాలా తక్కువే. కానీ పరలోక తండ్రి అయిన నీ దేవుడికి తెలియకుండా ఏ పిచ్చుకైనా నేలరాలదు. ఆయనకు తెలియనిదేమీ లేదు.
\v 30 నీ గురించి కూడా అంతా తెలుసు. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు.
\v 31 పిచ్చుకల కంటే నిన్ను విలువైన వాడిగా దేవుడు చూస్తాడు. కాబట్టి చంపుతానని బెదిరించే వాళ్లకి భయపడకండి."
\s5
\p
\v 32 "ఎవరైనా నాకు చెందిన వాళ్ళుగా చెప్పుకోడానికి ఇష్టపడితేనే నేను కూడా పరలోక తండ్రి అయిన దేవుడికి నాకు చెందిన మనుషులుగా వాళ్ళ గురించి చెప్తాను.
\v 33 కానీ నాకు చెందిన మనుషులని ఇతరులకి చెప్పుకోడానికి భయపడే వాళ్ళ గురించి నేను కూడా పరలోకంలో నా తండ్రి దగ్గర వాళ్ళు నా వాళ్ళు కాదని చెప్తాను."
\s5
\p
\v 34 "మనుషులు ప్రశాంతంగా ఉండేలా చేయడానికి నేను భూమికి వచ్చానని అనుకోవద్దు. నేను వచ్చిన కారణంగా నన్ను వెంబడించే కొందరు చనిపోతారు.
\v 35 నేను భూమికి వచ్చినందువల్ల నాపై విశ్వాసం ఉంచని వాళ్ళు నాపై విశ్వాసం ఉంచిన వాళ్లకు వ్యతిరేకమౌతారు. ఉదాహరణగా కొందరు తమ తండ్రులకు వ్యతిరేకమౌతారు, కొందరు తమ కూతుళ్ళకు వ్యతిరేకమౌతారు. కొందరు కోడళ్ళు వాళ్ళ అత్తలకు వ్యతిరేకమౌతారు.
\v 36 ఒకే ఇంట్లో సభ్యులు వాళ్ళల్లో వాళ్ళే శత్రువులౌతారు."
\s5
\p
\v 37 "నాకంటే ఎక్కువగా తమ తలిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళకు నా వాళ్ళు అయ్యే అర్హత లేదు.
\v 38 నా సంబంధిగా చనిపోవడానికి సిద్ధంగా లేకపోతే నా వాడుగా ఉండే అర్హత నీకు లేదు.
\v 39 చావు తప్పించుకోడానికి నన్ను తిరస్కరిస్తే అలాటి వాళ్ళకు నిత్య జీవం లేదు. నాపై విశ్వాసం ఉంచి అందుకోసం ప్రాణాలు వదులుకోడానికి ఇష్టపడితే వాళ్ళు దేవునితో నిత్యం జీవిస్తారు."
\s5
\p
\v 40 "మిమ్మల్నిఆహ్వానించే ప్రతివాడు నన్ను ఆహ్వానించినట్టే. నన్ను ఆహ్వానించే ప్రతివాడు దేవుని ఆహ్వానించినట్టే.
\v 41 ప్రవక్త అని ప్రవక్తను ఆహ్వానించే వాళ్ళకు ఆ ప్ర్రవక్తకు దేవుని నుండి దక్కే ప్ర్రతిఫలం దక్కుతుంది. నీతిమంతుడని తెలుసుకుని నీతిమంతుణ్ణి ఆహ్వానించే వాళ్ళంతా ఆ నీతిమంతుడు పొందే ప్ర్రతిఫలాన్నే పొందుతారు."
\s5
\p
\v 42 "ఇది గమనించుకోండి. మీరు ప్రాముఖ్యమైన వాళ్ళు కానప్పటికీ మీరు నా శిష్యుల్లో ఒకరు కాబట్టి మీకు దాహంగా ఉన్నప్పుడు చూసి ఎవరైనా మీకు తాగడానికి చల్లని నీళ్ళు ఇస్తే, అలా చేసిన వాళ్లకి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు."
\s5
\c 11
\p
\v 1 యేసు తన పన్నెండు మంది శిష్యులకి సూచనలు ఇవ్వడం ముగించిన తరువాత ఆయన వాళ్ళను వివిధ ఇశ్రాయేలీ పట్టణాలకు పంపించాడు. తక్కిన ఇశ్రాయేలీ పట్టణాల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బోధించి, నేర్పించడానికి ఆయన స్వయంగా వెళ్ళాడు.
\p
\v 2 బాప్తిసమిచ్చే యోహాను జైల్లో ఉండి క్రీస్తు చేస్తున్నవన్నీ విన్నాడు. తన శిష్యుల్లో కొందరిని ఆయన దగ్గరికి పంపించాడు.
\v 3 "ప్రవక్తలు వస్తాడని చెప్పిన క్ర్రీస్తువు నువ్వేనా? లేకపోతే ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలా?" అని అడిగించాడు.
\s5
\p
\v 4 యోహాను శిష్యులతో యేసు, "మీరు వెళ్ళి ప్రజలు నా గురించి చెప్పుకుంటూ ఉండగా మీరు విన్నవీ నేను చేయగా మీరు చూసినవీ యోహానుకి చెప్పండి.
\v 5 కుంటివాళ్ళు నడుస్తున్నారు. గుడ్డివాళ్ళు చూస్తున్నారు. కుష్ఠు రోగులు స్వస్థపడుతున్నారు. చెవిటి వాళ్ళు వింటున్నారు. చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు. పేదలకు దేవుని శుభవార్త ప్రకటన జరుగుతున్నది.
\v 6 యోహానుతో ఇది కూడా చెప్పండి, నాలో విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండే వాళ్ళను చూసి దేవుడు సంతృప్తిపడతాడు. ఎందుకంటే నేను చేసేది క్రీస్తు ఏమి చెయ్యాలని వాళ్ళనుకుంటున్నారో అది కాదు" అని చెప్పాడు.
\s5
\p
\v 7 యోహాను శిష్యులు వెళ్ళిపోయాక యేసు యోహాను గురించి ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన వాళ్ళతో, "యోహానును చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడాలనుకున్నారు? ఎత్తుగా పెరిగి గాలికి ఊగుతున్న గడ్డిని చూడడానికి అక్కడికి మీరు వెళ్ళలేదు. ఔనా?
\v 8 ఎలాంటి వ్యక్తిని చూడాలనుకుని మీరు వెళ్ళారు? ఖరీదైన బట్టలు వేసుకున్న వాణ్ణి చూడడానికి మాత్రం కచ్చితంగా కాదు. అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు రాజులు ఉండే కోటల్లో ఉంటారని మీకు బాగా తెలుసు."
\s5
\p
\v 9 "మరి ఎలాంటి వాణ్ణి చూడాలనుకున్నారు? ప్రవక్తనా? ఔను. నిజమే, కానీ మీకు ఒక సంగతి చెప్పాలి. యోహాను మామూలు వ్యక్తి కాదు.
\v 10 దేవుడు రాయించిన లేఖనాల్లో,
\q "ఇది గమనించండి. నీ రాక కోసం ప్రజల్ని సిద్ధ పరచడానికి
\q నీకంటే ముందుగా నా వార్తాహరుణ్ణి పంపుతున్నాను" అని ఎవరి గురించి రాసారో అతడే ఈ యోహాను."
\s5
\p
\v 11 "ఇది గమనించండి. బాప్తిసమిచ్చే యోహాను కంటే ఇంతవరకు ఈ లోకంలో పుట్టిన వాళ్ళెవ్వరూ గొప్పవాళ్ళు కాదు. కానీ ఆయన రాజ్యంలో ముఖ్యం కాకపోయినా పరలోకం నుండి దేవుడు ఎవరినైతే ఏలుతున్నాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో యోహాను కంటే గొప్పవాడు.
\v 12 బాప్తిసమిచ్చే యోహాను బోధించిన కాలం నుండి ఇంతవరకు కొందరు వాళ్ళ సొంత పద్ధతిలో పరలోకం నుండి దేవుడు తమను ఏలాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోజనం కోసం వాళ్ళు తమ సొంత శక్తిని వాడుతున్నారు."
\s5
\p
\v 13 "బాప్తిసమిచ్చే యోహాను కాలం వరకు అతని గురించి నేను చెప్తూ ఉన్నదంతా ధర్మశాస్త్రం చెప్పిందీ ప్రవక్తలు రాసిందీ మాత్రమే. అది మీరు చదవొచ్చు.
\v 14 అంతేకాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు చెప్తున్నాను. నిజానికి యోహాను భవిష్యత్తులో రావాల్సిన రెండవ ఏలీయా.
\v 15 ఇది మీకు అర్థం కావాలంటే నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి."
\s5
\p
\v 16 "ఇప్పుడున్న మీరూ ఇంకా ఇతరులు వీధుల్లో ఆటలాడుకునే పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు
\v 17 "మీకోసం వేణువు మీద ఉషారు పాట వాయించాం, కాని మీరు చిందులెయ్యలేదు. ఏడుపు పాట వాయించాం, కాని మీరు ఏడవలేదు" అంటారు."
\s5
\p
\v 18 "ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు యోహానును చూసినా నన్ను చూసినా తృప్తి లేదు. యోహాను వచ్చి మీకు బోధిస్తున్నప్పుడు అతడు అందరిలాగా మంచి భోజనం తినడం లేదు, ద్రాక్షరసం తాగడం లేదు అన్నారు. అతన్ని తిరస్కరించి దయ్యం పట్టినవాడు అన్నారు.
\v 19 యోహానులా కాకుండా మనుష్య కుమారుణ్ణి అయిన నేను మీరు తినే భోజనమే తింటున్నాను, మీలా ద్రాక్షరసం తాగుతున్నాను. కాని నన్ను కూడా మీరు తిరస్కరించి, "చూడండి, ఇతడు తిండిబోతు, తాగుబోతు. పన్ను వసూలుదారులూ పాపులూ అతని స్నేహితులు" అంటారు. కానీ ఎవడైనా నిజంగా తెలివైన వాడైతే, మంచి పనులు చేయడంలో తెలివితేటలు చూపిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 20 యేసు ఎక్కువగా అద్భుతాలు చేసిన పల్లెల్లో ప్రజలు ఇంకా దేవుని వైపు తిరగడం లేదు. కాబట్టి ఆయన వాళ్ళను గద్దిస్తూ
\v 21 "కొరాజీను బేత్సయిదా ప్రజలారా! మీ స్థితి ఎంతో ఘోరం. మీ వీధుల్లో నేను గొప్ప అద్భుతాలు చేసాను. కానీ మీరు పాపం చేయడం మానలేదు. ఎప్పటినుండో ఇక్కడ చేసినవే తూరు, సీదోనుల్లో చేసినట్టైతే అక్కడి పాపులు కచ్చితంగా పాపం చేయడం మానేసేవారు. పాపం చేసినందుకు పాతబట్టలు కట్టుకుని, బూడిదలో కూర్చుని విచారం వెళ్ళబుచ్చే వాళ్ళు.
\v 22 మీకు చెప్తున్నాను. దేవుడు తూరు, సీదోను పట్టణాల్లో ఉన్న చెడ్డవాళ్ళను శిక్షిస్తాడు కానీ ఆయన మనుషులపై తీర్పు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా శిక్షిస్తాడు."
\s5
\p
\v 23 "కపెర్నహోం పట్టణంలో నివసించే వాళ్లకు కూడా నేను చెప్పాల్సింది ఉంది. ఇతరులు నిన్ను పొగిడినట్టు నువ్వు తిన్నగా పరలోకం వెళ్తావని అనుకుంటున్నావా? అది జరగదు. చనిపోయిన తరవాత దేవుని శిక్షగా నువ్వు పాతాళానికి పోతావు. చాలా కాలం క్రితం నేను సొదొమలో ఇవే అద్భుతాలు చేసి ఉన్నట్టయితే అక్కడి చెడ్డవాళ్ళు పాపం చెయ్యడం తక్షణం మానేసే వారు. మీరు మాత్రం పాపం చెయ్యడం మానలేదు.
\v 24 నేను ఇంకా చెప్తున్నాను. సొదొమలో ఉన్న చెడ్డవాళ్లను దేవుడు శిక్షిస్తాడు. కానీ ప్రజలందరినీ ఆయన శిక్షించే అంతిమ దినాన నిన్ను ఆయన మరీ ఎక్కువగా శిక్షిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 25 ఆ సమయంలో యేసు ప్రార్థన చేస్తూ, "తండ్రీ! నువ్వు భూమీ పరలోకాల్లో అన్నిటి మీదా రాజ్యమేలుతున్నావు. మేమే తెలివైన వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం అనుకునే వాళ్ళని ఈ విషయాలు తెలుసుకోకుండా అడ్డుకున్నందుకు వందనాలు. పెద్దలు చెప్పినప్పుడు చిన్న పిల్లలు నమ్మినట్టు నీ సత్యాన్ని అంగీకరించిన వాళ్లకి నువ్వు వాటిని బయలు పరిచావు.
\v 26 ఔను తండ్రీ, అలా చేయడం మంచిదని నువ్వు అలా చేసావు" అన్నాడు.
\p
\v 27 తరువాత యేసు ప్రజలతో, "నా పని నేను చేసుకునేలా నా తండ్రి అయిన దేవుడు నేను తెలుసుకోవలసినవి అన్నీ నాకు బయలుపరిచాడు. నిజంగా నేనెవరో నా తండ్రికే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే నేను వెల్లడిస్తానో వాళ్లకి మాత్రమే తండ్రి తెలుసు."
\s5
\p
\v 28 "మీ నాయకులు మీకు చెప్పిన ఆజ్ఞలన్నీపాటించడానికి ప్రయత్నం చేసి, అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరికి రండి. వాటన్నిటి నుండి మీకు విశ్రాంతిని ఇస్తాను.
\v 29 ఎద్దు తన కాడికి కిందకు వచ్చినట్టు మీరు నాకు లోబడండి. నేను అణకువ, సున్నితత్వం ఉన్న వాణ్ణి. మీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది.
\v 30 నేను మీపై పెట్టే భారం చాలా తేలిక. మోయలేని బరువు మీ మీద పెట్టను."
\s5
\c 12
\p
\v 1 అది విశ్రాంతి దినం. ఆ సమయంలో యేసు, తన శిష్యులు పంట చేలల్లో నడిచి వెళ్తున్నారు. ఆయన శిష్యులకు ఆకలేసి కంకులు తుంచి తింటున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం దీనికి అభ్యంతరం లేదు.
\v 2 శిష్యులు ఇలా చేయడం కొందరు పరిసయ్యులు చూసి యేసుతో, "చూడూ, నీ శిష్యులు విశ్రాంతి దినం అయినా పనిచేస్తున్నారు. ధర్మశాస్త్రం దీన్ని ఒప్పుకోదు" అన్నారు.
\s5
\p
\v 3 దానికి యేసు, "మన పితరుడు దావీదు రాజు, ఆయన మనుషులు ఆకలిగా ఉన్నప్పుడు ఏమి చేసారో లేఖనాల్లో ఉంది.
\v 4 దేవుణ్ణి ఆరాధించే పవిత్ర గుడారంలో దావీదు దేవుడి ముందు పెట్టిన రొట్టెను తిన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కేవలం యాజకులకి మాత్రమే ఆ రొట్టె తినే అనుమతి ఉంది. కానీ దావీదు, అతని మనుషులు కలిసి ఆ రొట్టెలు తిన్నారు.
\s5
\v 5 మోషే రాసింది మీరు కచ్చితంగా చదివే ఉంటారు. విశ్రాంతి రోజున యాజకులైనా సరే దేవాలయంలో పనిచేస్తే, వాళ్ళు విశ్రాంతిదినానికి సంబంధించిన ఆజ్ఞలకు లోబడకపోయినా, వాళ్ళు తప్పు చేసినట్టు కాదు."
\p
\v 6 "దీని అర్థం నేను చెప్తాను. నేను మీ దగ్గరికి వచ్చాను. నేను దేవాలయం కంటే గొప్ప వాణ్ణి.
\s5
\v 7 లేఖనాల్లో ఉన్న ఈ దైవవాక్కుల గురించి మీరు ఆలోచించాలి. "మీరు బలులు అర్పించడం మాత్రమే కాదు, కనికరం చూపించాలని కోరుతున్నాను." దీని అర్థం మీకు తెలిసి ఉంటే ఏ తప్పూ చెయ్యని నా శిష్యుల్ని మీరు నిందించరు.
\v 8 నేను మనుష కుమారుణ్ణి. విశ్రాంతి రోజున ఏమి చెయ్య వచ్చో ప్రజలకు చెప్పే అధికారం నాకు ఉంది" అన్నాడు.
\s5
\p
\v 9 ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు.
\v 10 అక్కడ ఊచ చెయ్యి ఉన్న వ్యక్తి కనిపించాడు. అక్కడ ఉన్న పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి వాదం పెట్టుకోవాలని ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఆయనతో, "విశ్రాంతి రోజున ఎవరినైనా స్వస్థపరచడానికి దేవుడు అనుమతిస్తాడా?" అని అడిగాడు. యేసు ఏదొక తప్పు మాట్లాడి పొరపాటు చేస్తాడని వాళ్ళు అనుకున్నారు.
\s5
\v 11 ఆయన వాళ్లకు జవాబిస్తూ, "మీకు ఒక గొర్రె ఉందనుకోండి. అది విశ్రాంతి రోజున గుంటలో పడింది. దాన్ని అక్కడే వదిలేస్తారా? కచ్చితంగా వదలరు. దాన్ని జాగ్రత్తగా బయటికి తీస్తారు గదా."
\p
\v 12 "కానీ గొర్రె కంటే మనిషి విలువైన వాడు. కాబట్టి ఒక మనిషిని మంచి ఉద్దేశంతో స్వస్థపరచడం ఏ రోజైనా చెయ్యొచ్చు. అది విశ్రాంతి దినమైనా సరే" అని చెప్పాడు.
\s5
\v 13 అప్పుడు ఆయన ఆ వ్యక్తితో, "నీ చెయ్యి చాపు" అన్నాడు. ఆ వ్యక్తి తన ఊచ చెయ్యి చాపాడు. అది రెండో చెయ్యిలా మామూలుగా అయ్యింది.
\v 14 అప్పుడు పరిసయ్యులు సమాజ మందిరం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి యేసుని ఎలా చంపుదామా అని కుట్రలు మొదలు పెట్టారు.
\s5
\p
\v 15 పరిసయ్యులు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని గ్రహించి, ఆయన శిష్యుల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది రోగులతో సహా పెద్ద ఎత్తున జనం గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. ఆయన వాళ్ళని స్వస్థపరిచాడు.
\v 16 కానీ తన గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్లకి గట్టిగా చెప్పాడు.
\p
\v 17 ఇలా చెయ్యడం వల్ల పూర్వం యెషయా ప్రవక్త రాసింది నెరవేరింది. అదేమిటంటే,
\s5
\q
\v 18 "నేను ప్రేమించిన వాడు, నన్ను సంతృప్తి పరచినవాడు,
\q నేను ఎన్నుకున్న నా సేవకుడు ఇక్కడ ఉన్నాడు.
\q నా ఆత్మను ఆయనలో ఉంచుతాను,
\q ఆయన యూదులు కానివారికి రక్షణ తెచ్చి, న్యాయం చేస్తాడు.
\s5
\q
\v 19 ఆయన మనుషులతో పోట్లాడడు, కేకలు వేయడు. ఆయన వీధుల్లో అరవడు.
\q
\v 20 ఆయన బలహీనులతో సున్నితంగా వ్యవహరిస్తాడు,
\q కొన ప్రాణంతో ఉన్న వాణ్ణి ఆయన చంపడు.
\q ప్రజలకి న్యాయంగా తీర్పు తీర్చి వారిని నిరపరాధులుగా ప్రకటిస్తాడు.
\q
\v 21 కాబట్టి యూదులు కానివారు ఆయనలో నమ్మకం ఉంచుతారు."
\s5
\p
\v 22 ఒక రోజు కొందరు మనుషులు దయ్యం పట్టి గుడ్డి, మూగ అయిన వాణ్ణి తీసుకు వచ్చారు. యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టి అతన్ని బాగు చేసాడు. అప్పుడు అతను చూడగలిగాడు, మాట్లాడగలిగాడు.
\v 23 అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళల్లో ఒకరితో ఒకరు, "ఈయన దావీదు వంశంలో మనం కనిపెడుతున్న క్రీస్తు అయి ఉండొచ్చు" అనుకున్నారు.
\s5
\v 24 కానీ పరిసయ్యులు ఈ అద్భుతం గురించి విని, "ఆయన దేవుడు కాదు. బయల్జెబూలు. దయ్యాలరాజు. అందుకే దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు" అన్నారు.
\p
\v 25 యేసుకు పరిసయ్యులు అనుకునేవన్నీ తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళతో, "ఒకే రాజ్యంలోని ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే తమ రాజ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు గదా! ఒకే ఊరి వాళ్లుగాని, ఒకే ఇంట్లోని వాళ్ళు గానీ పోట్లాడుకుంటుంటే వాళ్ళు కచ్చితంగా ఒకటిగా, కుటుంబంగా నిలవలేరు.
\s5
\v 26 అదే విధంగా సాతాను తన సొంత దయ్యాల్ని బయటికి పంపేస్తే తనకుతానే విరోధం అవుతున్నట్టు గదా. అలాంటప్పుడు తన సేవకుల మీద అతడెలా ఏలుబడి చేయగలుగుతాడు?
\v 27 ఇంకా చెప్పాలంటే, సాతాను వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ శిష్యులు కూడా అదే సాతాను వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నారా? వాళ్ళ పని వెనుక సాతాను శక్తి ఉంది అనే మీ మాటకు వాళ్ళే మీకు బుద్ధి చెబుతారు.
\s5
\v 28 దేవుని ఆత్మ వలన మాత్రమే నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని ఇప్పటికే పరలోకం నుండి దేవుడు చేస్తున్న పాలన నిర్ధారిస్తుంది."
\p
\v 29 "నేను దయ్యాల్ని ఎలా వెళ్ళగొట్టగలుగుతున్నానో మీకు చెప్తాను. సాతాను లాంటి బలవంతుడి ఇంట్లోకి ఎవరూ చొరబడ లేడు. ఆ బలవంతుణ్ణి కట్టేయకుండా వాడి ఆస్తుల్ని దోచుకోలేడు. వాణ్ణి కట్టేస్తేనే అది సాధ్యం."
\p
\v 30 "అటోఇటో ఉండాలి తప్ప తటస్థంగా ఎవరూ ఉండలేరు. నన్ను వ్యతిరేకిస్తున్న దయ్యాల్ని పవిత్రాత్మ వలన మాత్రమే వెళ్ళగొడుతున్నానని గుర్తించనివాడూ నా శిష్యులు కావడానికి మనుషులను పోగుచెయ్యనివాడూ నా నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోయేలా చేస్తున్నట్టే.
\s5
\v 31 దయ్యాల్నివెళ్ళగొట్టింది పరిశుద్ధాత్మ వలన కాదు అని మీరు అంటున్నారు. కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా ఇతరుల్ని అవమానించి, కోపం తెప్పించి, అలా చేసినందుకు విచారించి దేవుని క్షమించమని అడిగితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను అవమానించిన వాణ్ణి మాత్రం దేవుడు క్షమించడు.
\v 32 మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను విమర్శించే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. కానీ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేసే పనుల్ని చెడ్డగా చేసి చెప్పే వాళ్ళని దేవుడు క్షమించడు. ఇప్పుడే కాదు రాబోయే లోకంలో కూడా దేవుడు క్షమించడు."
\s5
\p
\v 33 "ఒక చెట్టు పండు చూసినప్పుడు ఆ పండు మంచిదో కాదో చెప్ప వచ్చు. పండు మంచిదైతే దాని చెట్టూ మంచిదని తెలుస్తుంది. నేను మంచి పనులు చేస్తుంటే నేను మంచి వాణ్ణి ఔనో కాదో మీకు తెలుస్తుంది."
\p
\v 34 "మీరు పాము పిల్లల్లాంటి వాళ్ళు. మీరు చెడ్డవాళ్ళు కాబట్టి మంచిది ఏదీ మాట్లాడలేరు. ఒకడు చెప్పేది అతని మనస్సులో నుండి వస్తుంది.
\v 35 మంచి వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు. ఎలాగంటే మంచిమాటలు ఒక చోట పదిలంగా దాచి ఉంచి, ఏ సమయంలోనైనా వాటిని బయటికి తీయగలరు. అయితే దుష్టులు చెడు మాటలు పలుకుతారు. ఎందుకంటే వాళ్ళు అలాటి మాటలను దాచి ఉంచి ఎదో ఒక సమయంలో వాటిని బయటికి తెస్తారు."
\s5
\p
\v 36 "నేను మీకు చెప్తున్నాను. దేవుడు న్యాయం తీర్చే రోజున మనుషులు మాట్లాడిన ప్రతి పనికి రాని మాటనీ లెక్కలోకి తీసుకుంటాడు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన తీర్పునిస్తాడు.
\v 37 మీరు మాట్లాడిన మాటల ఆధారంగా మీ మాటలు నీతిగా ఉన్నాయో లేవో మీరు దోషులో కాదో దాన్ని బట్టి దేవుడు అప్పుడు ప్రకటిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 38 అప్పుడు కొందరు పరిసయ్యులు, యూదు పండితులు యేసు మాటలకి స్పందిస్తూ "బోధకా, నిన్ను దేవుడు పంపాడని సూచనగా మేము చూస్తుండగా ఒక అద్భుతం చెయ్యి" అన్నారు.
\v 39 దానికి యేసు, "నేను అద్భుతాలు చెయ్యగా మీరందరూ చూసిన వాళ్ళే. చెడు ఉద్దేశంతో మీరు దేవుని నమ్మకంగా పూజించలేరు. దేవుడు నన్ను పంపాడని నిరూపించడానికి మీరు నన్ను అద్భుతం చెయ్యమంటున్నారు కానీ దేవుడు ఒకే అద్భుతాన్ని మీకు చూపిస్తాడు. అది యోనా ప్రవక్తకు జరిగిన అద్భుతం వంటిది."
\p
\v 40 "యోనాను దేవుడు బయటికి రప్పించే వరకు మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఉన్నాడు. అలాగే మూడు పగళ్ళు మూడు రాత్రులూ మనుష్య కుమారుడినైన నేను భూగర్భంలో ఉంటాను. తరువాత దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు.
\s5
\v 41 దేవుడు అందరికీ తీర్పు ఇచ్చేటప్పుడు నీనెవె పట్టణంలో నివసించిన ప్రజలు ఆయన ఎదురుగా మీ పక్కన నిలబడతారు. యోనా హెచ్చరించినప్పుడు వాళ్ళు పాపం చెయ్యడం మానేశారు. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. నేను యోనా కంటే గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు కాబట్టి దేవుడు మీకు తీర్పు ఇస్తాడు."
\s5
\p
\v 42 "ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్న షేబా దేశంలో, చాలా కాలం క్రితం జీవించిన ఆ దేశం రాణి సొలోమోను జ్ఞానవాక్కులు వినడానికి చాలా దూరం నుండి వచ్చింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సొలోమోను కంటే చాలా గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు. కాబట్టి దేవుడు ప్రతి వాళ్లకి తీర్పు తీర్చేటప్పుడు షేబా దేశం రాణి ఆయన ఎదురుగా మీపక్కన నిలబడి మీపై నింద వేస్తుంది."
\s5
\p
\v 43 "కొన్ని సార్లు దురాత్మ ఒక వ్యక్తిని వదిలి పోయి, నిర్జన ప్రదేశాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడానికి ఎవరు దొరుకుతారా అని వెదుకుతుంది. దానికి ఎవరూ దొరకక
\v 44 ఇంతకుముందు నేను ఉన్న వాడి దగ్గరికే వెళ్తాను అనుకుని, అక్కడికి తిరిగి వెళ్ళి అతని జీవితం కడిగిన ఇంటిలాగా అంతా శుభ్రంగా, పద్ధతిగా అమర్చి ఖాళీగా ఉండడం చూసింది. అతని వ్యక్తిగత జీవితం దేవుని ఆత్మ స్వాధీనంలో లేకపోవడం గమనించింది.
\v 45 అప్పుడు ఆ దురాత్మ వెళ్ళి, ఇంకా చెడ్డవి ఏడు ఆత్మల్ని తీసుకు వచ్చి అతనిలో ప్రవేశించి, అక్కడే ఉంటాయి. కాబట్టి అతని పరిస్థితి ముందు కంటే ఇంకా ఘోరంగా అయ్యింది. చెడ్డ వాళ్లైన మీరు కూడా నేను బోధించింది అనుభవంలో చూస్తారు" అన్నాడు.
\s5
\p
\v 46 యేసు ఇంకా జనాలతో మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ తమ్ముళ్ళూ వచ్చారు. ఆయనతో మాట్లాడాలని బయట నిల్చున్నారు.
\v 47 ఆయనతో ఒకరు,"మీ అమ్మా, తమ్ముళ్ళూ నీతో మాట్లాడాలని బయట నిల్చుని ఉన్నారు" అని చెప్పారు.
\s5
\v 48 అప్పుడు యేసు అతనితో, "నా నిజమైన తల్లీ తమ్ముళ్ళూ ఎవరో మీకు చెప్తాను" అని,
\v 49 తన శిష్యులను చూపిస్తూ, "నా తల్లీ తమ్ముళ్ళు వీళ్ళే.
\v 50 పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టమైనట్టు ఎవరు ఉంటారో వాళ్ళే నా తమ్ముళ్ళూ నా తల్లీ" అన్నాడు.
\s5
\c 13
\p
\v 1 అదే రోజు యేసు అప్పటి వరకూ బోధిస్తున్న ఇంట్లోనుంచి గలిలయ సరస్సు తీరానికి వెళ్ళి, అక్కడ కూర్చున్నాడు.
\v 2 జనం చాలా పెద్ద గుంపుగా ఆయన ఉపదేశం వినడానికి ఆయన చుట్టూ చేరారు. ఆయన ఒక పడవ ఎక్కి బోధించడానికి కూర్చున్నాడు. జనం మాత్రం ఒడ్డున ఉండి, ఆయన చెప్పింది విన్నారు.
\s5
\p
\v 3 ఆయన చాలా ఉదాహరణలు ఉపయోగిస్తూ వాళ్లకి బోధించాడు. ఆయన చెప్తూ, "వినండి! ఒక మనిషి విత్తనాలు చల్లడానికి పొలం వెళ్ళాడు.
\v 4 నేలపై విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి. కొన్ని పిట్టలు వచ్చి ఆ విత్తనాల్ని తినేశాయి.
\v 5 కొన్ని విత్తనాలు పై పైనే మట్టిపొర ఉన్న రాతి నేల మీద పడ్డాయి. అవి తొందరగా మొలకెత్తాయి.
\v 6 అయితే మొలకల వేర్లు లోతుగా లేక ఎండ వేడికి ఎండిపోయాయి."
\s5
\p
\v 7 "కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. మొక్కలతో పాటు ముళ్ళకంపలు కూడా ఎదిగి మొక్కల్ని అణిచేసాయి.
\v 8 మిగిలిన విత్తనాలు మంచి నేలపై పడి ఏపుగా ఎదిగి మంచి పంటనిచ్చాయి. విత్తిన దానికి నూరు రెట్లు ఫలసాయం ఇచ్చాయి. కొన్ని మొక్కలు అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఉత్పత్తి చేసాయి.
\v 9 ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది ఆలోచిస్తారు" అన్నాడు.
\s5
\p
\v 10 తర్వాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు జనంతో మాట్లాడినప్పుడు ఉపమానాలు ఎందుకు వాడతావు?" అని అడిగారు.
\v 11 ఆయన జవాబిస్తూ, "ఇంతకు ముందు మీకు దేవుడు బయలు పరచని విషయం ఇప్పుడు ఆయన పరలోకం నుండి ఎలా ఏలుతాడో బయలుపరుస్తున్నాడు. కానీ ఇవి ఇతరులకి బయలు పరచలేదు.
\v 12 నేను చెప్పింది ఆలోచించి, అర్థంచేసుకుంటే దేవుడు ఇంకా ఎక్కువ అర్థం అయ్యేలా చేస్తాడు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోలేని వాళ్ళు ,వాళ్లకు తెలిసింది కూడా మర్చిపోతారు.
\s5
\v 13 అందుకే నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు ఉపమానాలు వాడతాను. నేను చేసేవి వాళ్ళు చూసినా దాని వాళ్ళకి కాదు. నేను చెప్పేది వాళ్ళు వింటున్నా, దాని అసలు అర్థం చేసుకోలేరు" అన్నాడు.
\q
\v 14 పూర్వం యెషయా ప్రవక్త ద్వారా;
\q "నేను చెప్పింది మీరు వింటారు కానీ అర్థం చేసుకోలేరు.
\q నేను చేసేది చూస్తారు కాని అది ఏమిటో తెలుసుకోలేరు."
\q అని దేవుడు చెప్పింది పూర్తిగా నెరవేరేలా ఈ ప్రజలు చేస్తున్నారు.
\s5
\p
\v 15 దేవుడు యెషయాతో ఇలా కూడా చెప్పాడు;
\q "ఈ ప్రజలు నేను చెప్పింది వింటారు కానీ నా సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు.
\q వాళ్లకి చూడగల కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూసేది ఏమిటో స్పష్టంగా చూడలేరు.
\q వాళ్ళు కళ్ళు మూసేసుకున్నారు. వాళ్ళ కళ్ళతో చూడలేరు,
\q వాళ్ళ చెవులతో వినలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు.
\q వాళ్ళు చూడగలిగీ వినీ , అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు నావైపు తిరుగుతారు.
\q నేను వాళ్ళని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు."
\s5
\p
\v 16 "మిమ్మల్ని అయితే సామర్ధ్యంగల వాళ్ళుగా దేవుడు చేసాడు ఎందుకంటే మీరు నేను చేసేవి గ్రహించగలరు, నేను చెప్పేవి అర్థం చేసుకోగలరు.
\v 17 ఇది గమనించండి. చాలా కాలం క్రితం బ్రతికిన చాలా మంది ప్రవక్తలూ నీతిమంతులూ నేను చేసేవీ మీరు చూస్తున్నవీ వాళ్ళు చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ చూడలేక పోయారు. నేను చెప్తుండగా మీరు వింటున్నది వాళ్ళు వినాలని ఎంతో అనుకున్నారు కానీ వాళ్ళు వినలేక పోయారు, మీరు వింటున్నారు."
\s5
\p
\v 18 ఇప్పుడు నేను వివరించే ఉపమానం వినండి. రకరకాల నేలల్లో విత్తనాలు విత్తిన మనిషి గురించిన ఉపమానం.
\v 19 కొందరు దేవుడు ఏలడం గురించి వింటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు దారిలో పడిన విత్తనం లాంటి వాళ్ళు. సాతాను చెడ్డవాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి విన్నది మర్చిపోయేలా చేస్తాడు.
\s5
\v 20 కొందరు దేవుని సందేశాన్ని ఆనందంతో అంగీకరిస్తారు. వాళ్ళు రాతి నేలపైన పడిన విత్తనం లాంటి వాళ్ళు.
\v 21 వాక్యం వాళ్ళ హృదయం లోపలికి చొచ్చుకుపోక చాలా కొద్దికాలమే నమ్ముతారు. వాళ్ళు లోతుగా వేర్లు లేని వాళ్ళు. నేను చెప్పింది నమ్ముతారు కానీ ఇతరులు వాళ్ళని బాధపెట్టి, హింసించగానే వాళ్ళు విశ్వాసంలో ఉండక తోసిపుచ్చడం ద్వారా పాపం చేస్తారు.
\s5
\p
\v 22 కొందరు దేవుని సందేశం వింటారు. కానీ వాళ్ళు ధనవంతులుగా ఉండాలని బలంగా కోరిక ఉండి, డబ్బుతో ఏమి కొందామా అని ఆలోచిస్తూ కేవలం డబ్బు కోసమే ఆందోళన పడుతూ ఉంటారు. దాని ఫలితంగా దేవుని సందేశాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు చేయాలని దేవుడు ఆశించిన వాటిని చేయరు. వీళ్ళు ముళ్ళకంపల్లో పడిన విత్తనాల్లాంటి వాళ్ళు.
\v 23 కొందరు నా సందేశాన్ని విని అర్థం చేసుకున్న వాళ్ళు. వీళ్ళల్లో కొందరు దేవుని సంతృప్తి పరచడానికి చాలా చేస్తారు. కొందరు దేవుని సంతోషపెట్టడానికి ఇంకా ఎక్కువ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువగా , కొందరు ఇంకా చాలా ఎక్కువగా దేవున్ని సంతోష పెట్టడానికి చేస్తారు. వీళ్ళు మంచి నేలపై పడిన విత్తనాల్లాంటి వాళ్ళు.
\s5
\p
\v 24 యేసు ఆ సమూహానికి ఇంకొక ఉపమానం చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడమనేది, ఒక రైతు పొలంలో మంచి విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
\v 25 అతని పనివాళ్ళు పొలం దగ్గర కాపలా కాయడానికి వెళ్ళి నిద్రపోతుండగా రైతు శత్రువు వచ్చి గోదుమల మధ్యలో కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళి పోయాడు.
\v 26 ఆ మొక్కలు పచ్చగా పెరిగి కంకులు వేసి నప్పుడు కలుపు మొక్కలు కూడా పెరిగాయి.
\s5
\v 27 రైతు పనివాళ్ళు వచ్చి, "అయ్యా! మీరు మాకు విత్తడానికి మంచి విత్తనాలే ఇచ్చారు. మేము ఆ విత్తనాలే చల్లాం కూడా. వాటిలో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అన్నారు.
\v 28 "ఇది నా శత్రువు చేసిన పని" అని రైతు అన్నాడు. పనివాళ్ళు అతన్ని, "కలుపు మొక్కలు పీకేయమంటారా?" అని అడిగారు.
\s5
\p
\v 29 "ఆ పని మాత్రం చెయ్యొద్దు. పొరపాటున గోదుమ మొక్కలు కూడా మీరు పీకేయవచ్చు.
\v 30 పంట కోసే కాలం వరకూ గోదుమ మొక్కల్ని , కలుపు మొక్కల్ని కూడా పెరగనివ్వండి. నేను పంట కొయ్యమని చెప్పినప్పుడు ముందు కలుపుమొక్కల్ని తీసి కాల్చేయడానికి కట్టలు కట్టండి. తరువాత గోదుమల్ని పోగుచేసి గిడ్డంగిలో పెట్టండి."
\s5
\p
\v 31 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక మనిషి పొలంలో నాటిన ఆవగింజ మొక్కలా ఉంటుంది.
\v 32 మనుషులు విత్తే విత్తనాలు అన్నిటిలో ఆవగింజ చిన్నది. ఇశ్రాయేలు దేశంలో అవి చాలా పెద్ద మొక్కలుగా ఎదుగుతాయి. అవి పూర్తిగా ఎదిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో ఎత్తుగా అవుతుంది. చెట్లలా ఎదుగుతాయి. వాటి కొమ్మల్లో పక్షులు గూడు కట్టుకుంటాయి."
\s5
\p
\v 33 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక స్త్రీ చేస్తున్న రొట్టెలా ఉంటుంది. నలభై కిలోల పిండి తీసుకుని, అందులో చిటికెడు ఈస్ట్ కలిపినప్పుడు పిండి పొంగుతుంది."
\s5
\p
\v 34 యేసు ప్రజలకి ఉపమానాలు చెప్పి విషయాలన్నీ బోధించాడు.
\v 35 అలా చెప్పడం వల్ల చాలా కాలం క్రితం ప్రవక్తల్లో ఒకరి ద్వారా దేవుడు చెప్పింది జరిగింది. "నేను ఉపమానాల్లో మాట్లాడతాను. నేను లోకం సృష్టించింది మొదలు నేను రహస్యంగా ఉంచింది ఉపమానాలుగా చెప్తాను."
\s5
\p
\v 36 యేసు జన సమూహాన్ని పంపేసిన తరవాత ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "గోదుమ పంటలో కలుపు మొక్కల గురించి వివరించు" అని అడిగారు.
\v 37 ఆయన జవాబిస్తూ, మంచి విత్తనాలు విత్తే వాణ్ణి నేనే, మనుషకుమారుణ్ణి.
\v 38 పొలం మనుషులు బ్రతుకుతున్న ఈ లోకాన్ని సూచిస్తుంది. బాగా పెరిగిన విత్తనాలు దేవుడు తండ్రిగా ఉన్నవాళ్ళను సూచిస్తాయి. కలుపు మొక్కలు సాతాన్నితండ్రిగా పెట్టుకున్న వాళ్ళని సూచిస్తాయి.
\v 39 కలుపు మొక్కల విత్తనాలు చల్లిన శత్రువు సాతాన్నిసూచిస్తాడు. గోదుమ పంట కోసే సమయం యుగాంతాన్ని సూచిస్తుంది. పంట కోసే వాళ్ళు దేవ దూతల్ని సూచిస్తారు.
\s5
\v 40 సేకరించిన కలుపు మొక్కల్ని కాల్చేశారు. అది యుగాంతంలో దేవుని తీర్పు సమయంలో ప్రజలకి జరిగేది సూచిస్తుంది.
\p
\v 41 అది ఇలా ఉంటుంది. "మనుష్యకుమారుణ్ణి అయిన నేను, నా దూతల్ని పంపుతాను. నేను ఏలుతున్న వాళ్ళందరిలో దేవుని చిత్తానికి భంగం కలిగించే వాళ్ళని, ఇతరులతో పాపం చేయించే వాళ్ళని దూతలు పోగుచేస్తారు.
\v 42 వాళ్ళని దూతలు నరకంలోని మంటల్లోకి విసిరేస్తారు. అక్కడ వాళ్ళు నొప్పినీ బాధనూ భరించ లేక ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ ఉంటారు.
\v 43 ఏది ఎలా ఉన్నా, ప్రభువుకు నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు మాత్రం సూర్యుడు ప్రకాశించినట్టు మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళు అలా మెరవడానికి కారణం వాళ్ళ తండ్రిగా ఉన్న దేవుడు వాళ్ళను ఏలుతాడు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి."
\s5
\p
\v 44 "పరలోకం నుండి దేవుడు ఏలడం చాలా విలువైంది. అది చాలా కాలం క్రితం ఎవరో దాచిపెట్టిన నిధి ఒక వ్యక్తికి దొరికితే, అతను ఆ నిధిని భూమిలో పాతి పెట్టడం లాంటిది. అతను నిధిని తవ్వి చూసి, తిరిగి ఎవరూ అది కనిపెట్టకుండా పాతిపెట్టాడు. తరువాత అతను ఆ పొలం కొనడానికి తన ఆస్తులన్నీ అమ్మి, ఆ పొలాన్ని కొని, ఆ నిధిని సంపాదించుకుంటాడు."
\p
\v 45 "పరలోకం నుండి దేవుడు ఏలడం ఎంత విలువైనదంటే, మంచి నాణ్యత ఉన్న ముత్యాలను కొనడానికి వ్యాపారి వెదకడం లాంటిది.
\v 46 అతను బాగా ఖరీదైన ముత్యం అమ్మకంలో ఉండడం చూసి, ఆ ముత్యం కొనడానికి ఆస్తులన్నీ అమ్మి డబ్బు సంపాదించి, వెళ్ళి దాన్ని కొంటాడు."
\s5
\p
\v 47 "దేవుడు పరలోకం నుండి ఏలడం పెద్ద వలతో సరస్సులో చేపలు పట్టిన చేపలు పట్టే విధంగా ఉంటుంది. పనికి వచ్చేవి, పనికి రానివి అన్ని రకాల చేపల్ని వాళ్ళు పడతారు.
\v 48 వల నిండినప్పుడు ఒడ్డుకు వలను లాగి, కూర్చొని, పనికిరానివి పడేసి, మంచి చేపల్ని బుట్టలో వేసుకోవడం లాంటిది."
\s5
\p
\v 49 "యుగాంతంలో మనుషులకి ఇలాగే జరుగుతుంది. మనుషులకి తీర్పు ఇచ్చేటప్పుడు అక్కడికి దేవ దూతలు వస్తారు. నీతిమంతుల నుండి చెడ్డవాళ్లను వేరు చేస్తారు.
\v 50 నరకంలోని మంటల్లోకి చెడ్డ వాళ్ళను విసిరేస్తారు. వాళ్ళు ఆ నొప్పి, బాధ తట్టుకోడానికి ఏడుస్తూ, పళ్ళు కొరుకుతారు."
\s5
\p
\v 51 యేసు తన శిష్యుల్ని, "నేను చెప్పిన ఈ ఉపమానాలన్నీ అర్థం అయ్యాయా" అని అడిగాడు. వాళ్ళు, "మేము అర్థం చేసుకున్నాం" అన్నారు.
\v 52 అప్పుడు ఆయన, "బోధకులూ వ్యాఖ్యానించే వాళ్ళూ ఈ ఉపమానాల్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం ఉంటూ పరలోకం నుండి దేవుని ఏలిక క్రింద ఉండడం గదిలోనుండి కొత్త బట్టలూ పాత బట్టలూ బయటికి తెచ్చి పంచిన ఇంటి ఓనర్ లాంటిది.
\v 53 యేసు ఈ ఉపమానాలు చెప్పడం పూర్తయ్యాక తన శిష్యుల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు."
\s5
\p
\v 54 తరవాత యేసు సొంత ఊరు నజరేతుకు వాళ్ళు వెళ్ళారు. సమాజమందిరాల్లో సబ్బాతు రోజున బోధించడం మొదలు పెట్టాడు. అయన మాటలకు అక్కడి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ కొందరు ఇతడు మనలానే మామూలు మనిషి. ఇంత అవగాహనా, జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఇలాంటి అద్భుతాలు ఎలా చెయ్యగలుగుతున్నాడు?
\v 55 ఇతడు వడ్రంగి కొడుకే గదా! ఇతని తల్లి మరియే గదా! ఇతని తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కదా!
\v 56 ఇతని చెల్లెళ్ళు అందరూ మన ఊరిలోనే ఉంటారు కదా! మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు, ఎలా బోధించ గలుగుతున్నాడు? అనుకున్నారు.
\s5
\p
\v 57 యేసుకు అలాంటి అధికారం ఉండడాన్ని ఆ ఊరివాళ్ళు అంగీకరించలేక పోయారు. దానికి యేసు వాళ్ళతో, "నన్నూ ఇతర ప్రవక్తల్ని ఎక్కడికి వెళ్ళినా గౌరవించారు. కానీ మన ఊరిలో గౌరవించడం లేదు. మన సొంత కుటుంబాలు కూడా మనల్ని గౌరవించరు!" అన్నాడు.
\v 58 యేసుకు అలాంటి అధికారముందని ఆ ఊరి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చెయ్యలేదు.
\s5
\c 14
\p
\v 1 ఆ కాలంలో హేరోదు అంతిప దేశాన్ని ఏలుతున్నాడు. అతడు యేసు చేసిన అద్భుతాలు గురించి వార్తలు విన్నాడు.
\v 2 అతను తన సేవకులతో, "అతడు బాప్తిసమిచ్చే యోహానై ఉంటాడు. చనిపోయినవాడు బ్రతికి ఉంటాడు. అందుకే అతనికి అద్భుతాలు చేసే శక్తి వచ్చింది" అన్నాడు.
\s5
\p
\v 3 హేరోదు విషయంలో జరిగింది ఇది - హేరోదు తన సోదరుడు ఫిలిప్పు ఇంకా బ్రతికి ఉండగానే, అతని భార్య హేరోదియను పెళ్ళిచేసుకున్నాడు.
\v 4 కాబట్టి యోహాను నువ్వు దేవుని నియమానికి వ్యతిరేకంగా చేసావు అని హేరోదుతో అన్నాడు. ఆ మాట హేరోదియకు రుచించలేదు. హేరోదు ఆమెను సంతోషపెట్టడానికి యోహానును సైనికులను పంపి బంధించాడు. వాళ్ళు యోహానును గొలుసులతో బంధించి, చెరసాలలో వేశారు.
\v 5 యోహాను తల నరికేయాలని హేరోదు తన మనుషులకి ఆజ్ఞ జారీ చేయాలనుకున్నాడు కాని, దేవుని తరుపున మాట్లాడే ప్రవక్తగా యోహానును సాధారణ జనం నమ్మారు. కాబట్టి హేరోదు వాళ్లకి భయపడ్డాడు.
\s5
\p
\v 6 ఒకరోజు హేరోదు తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉండగా హేరోదియ కూతురు అతిథుల కోసం నాట్యం చేసింది. ఆ నాట్యం హేరోదుని ఎంతో సంతోషపెట్టింది.
\v 7 నీకు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇచ్చాడు. పైగా దేవుని సాక్షిగా ప్రమాణం చేసాడు.
\s5
\v 8 హేరోదియ కూతురు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏమి అడగమంటావని సలహా అడిగింది. ఏమి అడగాలో చెప్పింది. అప్పుడు హేరోదియ కూతురు హేరోదు దగ్గరికి వెళ్ళి, "బాప్తిసమిచ్చే యోహాను తల నరికి, నిజంగా చనిపోయాడో లేదో తెలియడానికి అతని తల పళ్ళెంలో పెట్టి, తెచ్చి ఇవ్వండి" అంది.
\p
\v 9 హేరోదియ కూతురుకి ఏమి కావాలో అది ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసినందుకు చాలా బాధపడ్డాడు. అతిధులందరూ అలా ప్రమాణం చెయ్యడం విన్నారు కాబట్టి అలా చెయ్యక తప్పలేదు. తన సేవకులకు ఆమె అడిగింది చెయ్యమని ఆజ్ఞ జారీ చేసాడు.
\s5
\v 10 యోహాను తల నరికి తెమ్మని సైనికులను పంపాడు.
\v 11 వాళ్ళు ఆ ప్రకారమే యోహాను తల పళ్ళెంలో పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది.
\v 12 తరవాత యోహాను శిష్యులు జైలుకు వెళ్ళి యోహాను శరీరాన్ని తెచ్చి పాతిపెట్టారు. తరవాత వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు.
\s5
\p
\v 13 యేసు ఆ వార్త విన్న తరవాత తన శిష్యుల్ని మాత్రమే వెంటబెట్టుకుని గలిలయ సరస్సు పడవలోదాటి ఎవ్వరూ లేని ప్రదేశానికి బయలుదేరాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ప్రజలు తెలుసుకుని, కాలినడకన అక్కడికి వెళ్ళారు.
\v 14 యేసు ఒడ్డుకు చేరేసరికి చాలా పెద్ద ఎత్తున జన సమూహం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళల్లో ఉన్న రోగుల్ని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 15 సాయంత్రం అవుతుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది ఎవ్వరూ నివసించే ప్రదేశం కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. జనాన్ని పంపించేస్తే దగ్గరలో ఉన్న గ్రామాల్లో తినడానికి ఏమైనా కొనుక్కుంటారు" అన్నారు.
\s5
\v 16 కానీ యేసు తన శిష్యులతో, "భోజనం కోసం వాళ్ళు వెళ్లక్కరలేదు. వాళ్ళు తినడానికి మీరే ఏమన్నా ఇవ్వండి" అన్నాడు.
\v 17 దానికి శిష్యులు, "కానీ మన దగ్గర ఇప్పుడు ఐదు రొట్టెలు, రెండు వండిన చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి" అన్నారు.
\v 18 ఆయన, "వాటిని నా దగ్గరికి తీసుకురండి" అని,
\s5
\v 19 జన సమూహాన్ని అక్కడ ఉన్న గడ్డి మీద కూర్చోమని చెప్పాడు. ఐదు రొట్టెలు, రెండు చేపల్ని చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు చూసి దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు శిష్యులకు ఇచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్పాడు. వారు ఆయన చెప్పినట్టే చేశారు.
\v 20 అందరూ ఆకలి తీరే వరకూ తిన్నారు. మిగిలిన ముక్కల్ని కొందరు పోగుచేస్తే, మొత్తం పన్నెండు గంపలు అయ్యాయి.
\v 21 స్త్రీలు పిల్లలు కాకుండా లెక్క బెడితే ఇంచు మించు ఐదు వేలమంది పురుషులు అక్కడ తిన్నారు.
\s5
\p
\v 22 ఇది జరిగిన తరవాత యేసు ఆ జనాన్ని ఇంటికి పంపించేస్తూ తన శిష్యులతో పడవ ఎక్కి తన కంటే ముందు గలిలయ సముద్రం అవతలి వైపుకు వెళ్ళమని చెప్పాడు.
\v 23 వాళ్ళను పంపించేశాక ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోడానికి కొండల్లోకి వెళ్ళాడు. సాయంత్రమైపోయినా ఆయన ఇంకా అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
\p
\v 24 ఆ సమయానికి శిష్యులు తీరంనుండి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయారు. శిష్యులు పడవ నడుపుతుంటే ఎదురు గాలి బలంగా వీస్తూ ఉంది. గాలికి చాలా పెద్ద అలలు ఏర్పడి, అలల తాకిడికి పడవ విపరీతంగా ఊగిసలాడుతూ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది.
\s5
\p
\v 25 అప్పుడు యేసు కొండల్లోనుండి సరస్సు దగ్గరికి వచ్చాడు. తెల్లవారు జామున మూడు, ఆరు గంటల మధ్యలో పడవ దగ్గరికి నీటి మీద నడుస్తూ వచ్చాడు.
\v 26 ఆయన నీటి మీద నడవడం శిష్యులు చూసి భూతం అనుకున్నారు. వాళ్ళు హడలిపోయి, భయంతో గగ్గోలు పెట్టారు.
\v 27 వెంటనే యేసు వాళ్ళను వారిస్తూ, "నేనే, భయంలేదు. ధైర్యం తెచ్చుకోండి" అన్నాడు.
\s5
\p
\v 28 పేతురు ఆయనతో, "ప్రభూ, నువ్వే అయితే నీ దగ్గరికి నేను నడిచి రావచ్చా?" అన్నాడు.
\v 29 యేసు పేతురుతో "రా!" అన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసు వైపు వెళ్ళాడు.
\v 30 కానీ పేతురు దృష్టి బలంగా వీచే గాలి మీదకు మళ్ళినప్పుడు అతనికి భయం వేసింది. నీళ్ళల్లో మునిగిపోతూ "ప్రభూ రక్షించూ!" అని అరిచాడు.
\s5
\v 31 వెంటనే యేసు అతని దగ్గరికి చేరి, పేతురును పైకి లాగాడు. ఆయన పేతురుతో, "నువ్వు నా శక్తిని కొంతవరకే నమ్మావు. నువ్వు మునిగిపోడానికి నేను వదిలేస్తానని ఎందుకు అనుమానించావు?" అన్నాడు.
\v 32 తరువాత యేసూ పేతురూ పడవ ఎక్కారు. వెంటనే అప్పటి వరకూ బలంగా వీస్తున్న గాలి ఆగిపోయింది.
\v 33 పడవలో ఉన్న శిష్యులందరూ వంగి యేసుకు నమస్కారం చేసి, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివే!" అన్నారు.
\s5
\p
\v 34 వాళ్ళు సరస్సు చుట్టు తిరిగి గెన్నేసరెతు తీర ప్రాంతానికి చేరుకున్నారు.
\v 35 అక్కడి వాళ్ళు యేసును గుర్తుపట్టారు. యేసు వచ్చాడనే వార్తను ఆ ప్రాంతమంతా తెలిపారు. అక్కడి ప్రజలు యేసు దగ్గరికి రోగుల్ని తీసుకుని వచ్చారు.
\v 36 రోగులు ఆయన్ని ఒకసారి ముట్టుకోనిమ్మని, ఆయన అంగీ అంచు అయినా సరే ముట్టుకుంటే స్వస్థపడతామని వాళ్ళని బతిమాలారు. ఆయన్ను, కనీసం ఆయన అంగీ అంచును ముట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందారు.
\s5
\c 15
\p
\v 1 కొందరు పరిసయ్యులూ యూదు పండితులూ కొందరు యెరూషలేము నుండి యేసుతో మాట్లాడడానికి వచ్చారు.
\v 2 వాళ్ళు, "మన పూర్వీకుల దగ్గరనుండి ఆచరిస్తున్న సంప్రదాయాన్ని మీ శిష్యులు పాటించడం లేదు. భోజనం చేసే ముందు చేతులు కడిగే ఆచారాన్ని పాటించడం లేదు" అన్నారు.
\p
\v 3 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "మీరు మీ పితరులు నేర్పించినవి పాటిస్తూ, దేవుడి ఆజ్ఞలకి లోబడడం తోసిపుచ్చుతున్నారు.
\s5
\v 4 దేవుడు ఈ రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. "మీ తలిదండ్రుల్ని గౌరవించాలి, తలిదండ్రులను గురించి చెడ్డగా మాట్లాడే వాళ్లకు మరణ శిక్ష వేయాలి" అని.
\v 5 కానీ ప్రజలకు మీరేమి చెప్తారంటే, "నేను మీకు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేస్తానని ప్రమాణం చేసాను" అని తమ తలిదండ్రులకి చెప్పొచ్చు.
\v 6 మీరు అలా చేస్తే మీ తలిదండ్రులకి ఏమీ ఇవ్వక్కరలేదు అంటారు. ఇలా దేవుడు ఆజ్ఞాపించింది పట్టించుకోరు కానీ మీ పూర్వికులు చెప్పింది చెప్పినట్టే తప్పకుండా పాటిస్తారు."
\s5
\p
\v 7 మీరు మంచి వాళ్ళల్లా మాత్రమే నటిస్తారు. మీ పితరుల గురించి దేవుడి ఆలోచన యెషయా ప్రవక్త చెప్పినప్పుడు మీ గురించి నిజాన్ని మాట్లాడుతూ,
\v 8 "వీళ్ళు నన్ను గౌరవించినట్టు మాట్లాడతారు కానీ వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరు.
\v 9 ప్రజలు అనుకున్నవే సిద్ధాంతాలుగా బోధిస్తారు కాబట్టి వాళ్ళు నన్ను ఆరాధించడం వ్యర్థం" అన్నాడు.
\s5
\v 10 అప్పుడు యేసు జనాన్ని తన దగ్గరికి పిలిచాడు. ఆయన వాళ్ళతో, "నేను మీతో చెప్పేది విని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి.
\v 11 ఒక వ్యక్తి తినడానికి నోటిలో పెట్టుకున్నదేదీ అతన్ని కలుషితం చెయ్యదు కాని, నోటి నుండి వచ్చే మాటలు మనిషిని దిగజారుస్తాయి" అన్నాడు.
\s5
\p
\v 12 తరవాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు చెప్పిన మాటలు పరిసయులకు కోపం తెప్పించాయి. నీకు తెలుసా?" అన్నారు.
\v 13 అప్పుడు యేసు వాళ్లకు ఈ ఉపమానం చెప్పాడు. "ఒక రైతు తను నాటని మొక్కని ఎలా వ్రేళ్ళతో సహా పీకి పడేస్తాడో, అలా పరలోకంలో ఉన్న నా తండ్రి తను చెప్పిన వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళని వదిలించేసుకుంటాడు."
\p
\v 14 "పరిసయుల్ని ఏమీ పట్టించుకోవద్దు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. అలా చేస్తే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు. అలాగే దేవుని ఆజ్ఞల్ని ప్రజలు అర్థం చేసుకోడానికి వాళ్ళు సాయం చెయ్యలేరు."
\s5
\v 15 ఒక వ్యక్తి తినే భోజనం గురించి చెప్పిన ఉదాహరణ వివరించమని యేసును పేతురు అడిగాడు.
\v 16 యేసు వాళ్ళకు ఇలా జవాబు చెప్పాడు, "నేను మీకు బోధించేది కచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోలేక పోవడం నన్ను నిరాశ పరిచింది."
\p
\v 17 "మీరు తప్పక అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మనుషులు ఏది తిన్నా అది వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. తరవాత శరీరంలో నిలిచిపోయింది బయటికి వచ్చేస్తుంది.
\s5
\v 18 నోటితో మాట్లాడే చెడ్డమాటలు దేవుడు ఆ వ్యక్తిని తృణీకరించేలా చేస్తుంది. హృదయంలో మనిషి చేసే చెడు ఆలోచనల నుండి అవి వస్తాయి.
\v 19 చెడు ఆలోచనలు, హత్య, వ్యభిచారం, ఇతర లైంగిక పాపాలు, దొంగతనం, అబద్ద సాక్ష్యం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం హృదయంలోనుండే వస్తాయి.
\v 20 దేవుడు మనుషుల్ని అంగీకరించకుండా చేసేవి అవే. కానీ చేతులు కడుక్కోకుండా తినడం దేవుడు తృణీకరించడానికి కారణం కాదు."
\s5
\p
\v 21 యేసు శిష్యుల్ని తీసుకుని గలిలయ జిల్లాకు వెళ్ళి, తూరు సీదోను పట్టణాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు.
\v 22 ఆ ప్రాంతంలో ఉంటున్న కానాను గుంపుకు చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. ఆమె గట్టిగా అరుస్తూ, "ప్రభూ నువ్వు దావీదు మహారాజు సంతతికి చెందిన వాడివి. నువ్వు క్రీస్తువు. నా మీద, నా కూతురు మీద జాలి చూపించు. ఆమె దయ్యం అదుపులో ఉండి, చాలా బాధపడుతుంది" అంది.
\v 23 కానీ యేసు ఆమెకి జవాబు చెప్పలేదు. శిష్యులు ఆయనతో, "ఆమె అరుచుకుంటూ, మన వెనకే వస్తూ ఇబ్బంది పెడుతుంది. వెళ్ళిపొమ్మని చెప్పు" అన్నారు.
\s5
\v 24 "తప్పిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసమే దేవుడు నన్ను పంపాడు" అని యేసు ఆమెతో చెప్పాడు.
\v 25 కానీ ఆ స్త్రీ యేసుకు ఇంకా దగ్గరికి వచ్చి, ఆయన ముందు మోకరించి, బ్రతిమాలుతూ, "ప్రభూ, సాయం చెయ్యవా" అని అడిగింది.
\p
\v 26 అప్పుడు ఆయన ఆమెతో, "పిల్లల కోసం సిద్ధపరచిన ఆహారాన్ని ఇంట్లోని కుక్క పిల్లలకి వెయ్యడం భావ్యం కాదు" అన్నాడు.
\s5
\v 27 కాని ఆ స్త్రీ జవాబిస్తూ, "ప్రభూ! మీరు చెప్పింది సబబే. కానీ కుక్కపిల్లలు కూడా యజమాని భోజనం చేసే బల్ల మీద నుండి క్రింద పడిన రొట్టె ముక్కల్ని తింటాయి కదా" అంది.
\v 28 అప్పుడు యేసు ఆమెతో, "ఓ స్త్రీ! నా మీద నీకు స్థిరంగా నమ్మకముంది కాబట్టి నువ్వు కోరుకున్నట్టే నీ కూతుర్ని స్వస్థపరుస్తాను" అన్నాడు. ఆ క్షణమే ఆమె కూతుర్ని దయ్యం వదిలి పోయింది. ఆమె బాగయ్యింది.
\s5
\p
\v 29 తరవాత యేసు , ఆయన శిష్యులు ఆ ప్రదేశం వదిలి, గలిలయ సముద్రం దగ్గరలో ఉన్న కొండ పైకి ఎక్కి ప్రజలకి బోధించడానికి కూర్చున్నాడు.
\v 30 అక్కడ తరవాతి రెండు రోజులూ జనం పెద్ద గుంపులుగా వస్తూనే ఉన్నారు. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, మూగవాళ్ళని, ఇతర వ్యాధులతో ఉన్నవాళ్ళని యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. బాగు చెయ్యడానికి వాళ్ళని ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళని బాగుచేసాడు.
\v 31 మూగవాళ్ళు మాట్లాడడం, కుంటివాళ్ళు నడవడం, వికలాంగులు బాగుపడడం, గుడ్డివాళ్లకు చూపు రావడం చూసి అక్కడివాళ్లు ఆశ్చర్యపడ్డారు. "ఇశ్రాయేలు దేశంలో మన మీద ఏలిక చేస్తున్న దేవునికి స్తోత్రం!" అన్నారు.
\s5
\p
\v 32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి, "వాళ్ళందరూ నాతో మూడు రోజులుగా ఉంటున్నారు. వాళ్లకి తినడానికి ఏమీ లేదని విచారంగా ఉంది. ఆకలితో వాళ్ళని పంపివేయడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే మధ్యలో వాళ్ళు మూర్చపోవచ్చు" అన్నాడు.
\v 33 అప్పుడు శిష్యులు, "ఇది ఎవరూ నివసించే స్థలం కాదు. ఇంత పెద్ద జన సమూహానికి సరిపడేంత ఆహారం తేవడం కష్టం" అన్నారు.
\v 34 "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి" అని యేసు వాళ్ళని అడిగాడు. వాళ్ళు, "ఏడు చిన్న రొట్టెలు, వండిన రెండు చిన్న చేపలు ఉన్నాయి" అన్నారు.
\v 35 అప్పుడు యేసు జనాన్ని నేల మీద కూర్చోమన్నాడు.
\s5
\p
\v 36 ఆయన ఏడు రొట్టెలు, రెండు వండిన చేపల్ని తీసుకుని, దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేసి, వాళ్లకి ఇస్తూ ఉండమని శిష్యులకి చెప్పాడు. అప్పుడు శిష్యులు జనానికి పంచసాగారు.
\v 37 యేసు అద్భుతంగా ఆహారాన్ని విస్తారం చేసాడు. వాళ్ళందరూ కావలసినంత తృప్తిగా తిన్నారు. శిష్యులు మిగిలిన ముక్కల్ని పోగుచేశారు. అవి ఏడు పెద్ద గంపలు అయ్యాయి.
\v 38 అక్కడ భోజనం చేసిన పురుషులు నాలుగు వేల మంది. స్త్రీలని, పిల్లల్ని లెక్కపెట్టిన వాళ్ళు లేరు.
\p
\v 39 యేసు ప్రజలందరినీ పంపించేసి, ఆయన, శిష్యులు పడవ ఎక్కి సరస్సు మీద పడవ నడుపుకుంటూ మగదాను ప్రాంతానికి వెళ్ళారు.
\s5
\c 16
\p
\v 1 ఒకసారి కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, "యేసూ, నువ్వు నిజంగా దేవుడే నిన్ను పంపాడని మాకు నమ్మకం కుదిరేలా దేవుడి శక్తిని ఉపయోగించి ఒక అద్బుతం చేసి చూపించు" అన్నారు.
\v 2 అందుకు యేసు వాళ్ళతో, "మన దేశంలో సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా కనబడితే "రేపంతా వాతావరణం చక్కగా ఉంటుంది" అని చెబుతాం."
\s5
\p
\v 3 "అదే పొద్దున పూట ఆకాశం ఎర్రగా కనిపిస్తే, "ఈ రోజు మబ్బులతో గాలివాన కురుస్తుందేమో" అని చెబుతాం. ఆకాశంలోకి చూసి మన చుట్టుపక్కల ఏమి జరగబోతుందో మీరు చెప్పగలుగుతున్నారు గానీ దేవుడు చేసే పనులను గురించి మీరు అర్థం చేసుకోలేరు.
\v 4 చెడ్డవాళ్లైన మీరు సూచక క్రియలు అడుగుతున్నారు గాని మీరు దేవుని మనసారా పూజింపరు. కాబట్టి ఒక పెద్ద చేప కడుపులో మూడు రోజులు గడిపి తిరిగి వచ్చిన యోనా ప్రవక్తను గురించిన సూచక క్రియ తప్పించి మీకు ఎలాంటి సూచనా ఇవ్వడం జరగదు" అన్నాడు.
\s5
\p
\v 5 తరువాత యేసు శిష్యుల్ని వెంటబెట్టుకుని గలిలయ సముద్రం ఒడ్డుకు బయలుదేరాడు. అక్కడకు చేరిన తరువాత, తినడానికి ఏమీ తమతోపాటు తెచ్చుకోలేదన్నసంగతి శిష్యులకు గుర్తుకు వచ్చింది.
\v 6 అదే సమయంలో యేసు, "పొంగజేసే పదార్థం లాంటి పరిసయ్యుల, సద్దూకయ్యుల పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు.
\v 7 యేసు చెప్పిన ఈ మాటలను శిష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. తినడానికి ఏమీ తేలేదని యేసు ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు.
\v 8 యేసు వాళ్ళు మాట్లాడుకుంటున్నది తెలుసుకుని, "నేను పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి మాట్లాడుతుంటే మీరేమో మనం రోజూ తినే రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. నాకెంతో బాధ కలుగుతుంది. నేను చిన్న చిన్నపనులు మాత్రమే చేస్తానని నమ్ముతున్నారు."
\s5
\p
\v 9 "నేను తిండి గురించి కంగారు పడుతున్నానని అస్సలు అనుకోవద్దు. నేను ఒకసారి ఐదు రొట్టెలను దీవించి ఐదు వేలమంది ఆకలి తీర్చాను. అప్పుడు మిగిలిపోయిన రొట్టెలు మీరే గంపల్లోకి పోగుచేశారు.
\v 10 ఇంకోసారి ఏడు రొట్టె ముక్కలతో నాలుగు వేలమంది ఆకలి తీర్చానన్న సంగతి మీరు మర్చిపోయారా? అప్పుడు కూడా మిగిలిపోయిన రొట్టెలు గంపల్లోకి ఎత్తింది మీరే కదా.
\s5
\p
\v 11 "నేను రొట్టెల గురించి మాట్లాడడం లేదని మీరు అర్థం చేసుకోవాలి. పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి నేను మాట్లాడుతున్నాను."
\v 12 అప్పుడు శిష్యులు, యేసు రొట్టేలలో వేసే పొంగజేసే పిండి గురించి మాట్లాడడం లేదనీ, పరిసయ్యులు, సద్దూకయ్యులు బోధించే తప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్నారు.
\s5
\p
\v 13 తరువాత యేసు తన శిష్యులతో కలసి కైసరయ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. "నేను నిజంగా మనుష్యకుమారుడినని ప్రజలు చెప్పుకుంటున్నారా?" అని శిష్యుల్ని అడిగాడు.
\v 14 అప్పుడు వాళ్ళు, "కొందరు నువ్వు మళ్ళీ బ్రతికి వచ్చిన బాప్తిసమిచ్చే యోహానువనీ, మరికొందరు దేవుడు చెప్పినట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఏలీయావనీ, కొందరేమో పూర్వం జీవించిన యిర్మీయా లాంటి ప్రవక్తలలో ఒకడివని చెప్పుకుంటున్నారు" అని చెప్పారు.
\p
\v 15 "అలాగైతే నా గురించి మీరు ఏమనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు.
\v 16 అప్పుడు సీమోను పేతురు "నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన మెస్సీయవి" అన్నాడు.
\s5
\v 17 అప్పుడు యేసు, "యోనా కొడుకువైన సీమోనూ, నువ్వు ఈ మాట చెప్పి దేవుడికి సంతోషం కలిగించావు. వేరే మనుషులెవ్వరూ నీకు ఈ విషయం చెప్పలేదు. పరలోకంలో ఉన్న దేవుడే నువ్వు ఈ విషయం గ్రహించేలా చేశాడు.
\v 18 ఇదిగో చెప్తున్నా విను: నువ్వు పేతురువు. అంటే నువ్వు రాయిలాంటి వాడివి. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది రాయి ఎంత ముఖ్యమో నువ్వు అలాంటివాడివి. నన్ను నమ్మిన వాళ్ళందరికీ నువ్వు అండగా ఉంటావు. మృత్యు బలం కూడా నీ ముందు నిలబడలేదు."
\s5
\p
\v 19 యేసు ఇంకా ఇలా అన్నాడు, "ఈ మనుషులు దేవుని రాజ్యంలో ప్రవేశించే తలుపులు తీయడానికి, మూయడానికి నీకు అధికారం ఇవ్వబడుతుంది. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నవాటిని పరలోకంలో దేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు కాదన్నవాటిని దేవుడు కాదంటాడు."
\p
\v 20 తరువాత యేసు, తానే మెస్సీయ అన్నవిషయం ఎవ్వరికీ చెప్పవద్దని తన శిష్యులను గట్టిగా హెచ్చరించాడు.
\s5
\p
\v 21 ఇక అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళవలసి ఉన్నదనీ, అక్కడ అధికారులైన పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, యూదు చట్టాలు బోధించే పండితుల ద్వారా హింసించబడి చనిపోతాననీ, తరువాత మూడవ రోజున మళ్ళీ బ్రతికి తిరిగి లేస్తాననీ చెప్పడం మొదలుపెట్టాడు.
\v 22 ఇది విన్న పేతురు యేసును పక్కకు తీసుకువెళ్ళాడు. "ప్రభూ, దేవుడు ఇలా జరగకుండా చెయ్యాలి. ఇది నీకు ఎట్టి పరిస్థితిలో జరగకూడదు" అని గద్దింపు స్వరంతో అన్నాడు.
\p
\v 23 అప్పుడు యేసు పేతురు వైపు చూసి, "నా దగ్గర నుండి వెళ్ళిపో! సాతాను నీలో ప్రవేశించి ఇలా మాట్లాడిస్తున్నాడు. నువ్వు నాచేత పాపం చేయించాలని చూస్తున్నావు, నువ్వు దేవుడు ఆలోచిస్తున్నట్టు కాకుండా మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు."
\s5
\p
\v 24 తరువాత యేసు శిష్యులతో, "ఎవరైనా నన్ను నమ్మి నా అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటే వాళ్ళు తమకున్నవన్నీ విడిచిపెట్టి, తమ సొంత సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి."
\v 25 తన ప్రాణం కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాడు అందుకు బదులు తన ప్రాణం పోగొట్టుకుంటాడు. అయితే నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
\v 26 ఒక మనిషి ఈ లోకంలో తాను కోరుకున్నదంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి దక్కుతుంది? తన ప్రాణంకన్నా విలువైనది మనిషి ఏమి ఇవ్వగలడు?
\s5
\p
\v 27 జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడినైన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం నుండి దూతలతో కలసి ఈ లోకానికి తిరిగి వస్తాను. అప్పుడు తండ్రి మహిమ వెలుగు నాపై ఉంటుంది. నేను ఈ లోకంలో ప్రతివారికీ వాళ్ళు చేసిన అన్ని రకాల పనులబట్టి వాళ్లకు బహుమతులు ఇస్తాను.
\v 28 ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తున్నవాళ్ళలో కొందరు వాళ్ళు చనిపోకముందే నేను రారాజుగా పరలోకం నుండి దిగి రావడం చూస్తారని మీతో కచ్చితంగా చెప్తున్నాను.
\s5
\c 17
\p
\v 1 ఒక వారం రోజులు గడిచిన తర్వాత యేసు పేతురు, యాకోబు, యాకోబు తమ్ముడు యోహానులను వెంటబెట్టుకుని మనుషులకు దూరంగా ఒక ఎత్తైన కొండ పైకి తీసుకువెళ్ళాడు.
\v 2 వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో శిష్యులు ముగ్గురూ చూస్తూ ఉండగానే యేసు రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వేసుకున్న బట్టలు వెలుగుతో ధగధగలాడాయి.
\s5
\p
\v 3 ఉన్నట్టుండి పూర్వ కాలంలో జీవించిన ప్రవక్తలు మోషే, ఏలీయాలు అక్కడికి దిగివచ్చి యేసుతో మాట్లాడుతున్నారు.
\v 4 ఇది చూసిన పేతురు యేసుతో, "ప్రభూ, మనం ఇక్కడే ఉండిపోతే చాలా బాగుంటుంది. నువ్వు చెప్తే నీకు ఒకటీ, మోషేకి ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పాకలు వేస్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 పేతురు అలా మాట్లాడుతూ ఉండగానే, గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వాళ్ళను కమ్మివేసింది. ఆ మేఘంలో నుంచి దేవుడు పలికిన మాటలు వినబడ్డాయి, "ఈయన నేను ప్రేమించే నా కుమారుడు. ఈయన గురించి నేను ఆనందంగా ఉన్నాను. మీరు ఈయన మాట తప్పకుండా వినండి."
\p
\v 6 దేవుని మాటలు విన్న ఆ ముగ్గురు శిష్యులు భయంతో వణికిపోయారు. నేల మీద బోర్లా పడిపోయారు.
\v 7 యేసు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళను తట్టి లేపాడు. "ఏమీ భయం లేదు, లేచి నిలబడండి" అని చెప్పాడు.
\v 8 వాళ్ళు లేచి చూసినప్పుడు అక్కడ యేసు తప్పించి ఇంకెవ్వరూ వాళ్లకు కనబడలేదు.
\s5
\p
\v 9 వాళ్ళు కిందికి దిగి వచ్చేటప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచే రోజుదాకా మీరు చూసిన ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు."
\v 10 అప్పుడు శిష్యులు, "నువ్వు చెప్తున్నది నిజమైతే, యూదు చట్టాలు బోధించే బోధకులు మెస్సీయ రాక ముందు మొదట ఏలీయా రావాలని చెప్తున్నారు కదా. ఏది నిజం?" అని అడిగారు.
\s5
\p
\v 11 యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మీరు అంటున్నది నిజమే, మెస్సీయ రాకను సిద్ధం చేయడానికి ఏలీయాను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు.
\v 12 అయితే ఇది గమనించండి: ఏలీయా ఇప్పటికే వచ్చాడు. మన నాయకులు అతణ్ణి చూశారు గానీ, అతడే మెస్సీయా కంటే ముందుగా పంపబడినవాడని వాళ్ళు గుర్తించలేదు. బదులుగా వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు అతణ్ణి బాధించారు. అదే విధంగా వాళ్ళు పరలోకం నుండి వచ్చిన నన్ను కూడా శ్రమలపాలు చేస్తారు."
\v 13 యేసు, ఏలీయాను బాప్తిసమిచ్చే యోహానుతో పోల్చి చెబుతున్నాడని శిష్యులు అర్థం చేసుకున్నారు.
\s5
\p
\v 14 తరువాత యేసు తన ముగ్గురు శిష్యులతో దిగి వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు, జన సమూహాలు వాళ్ళతో కలిశారు. అప్పుడు ఒక వ్యక్తి యేసు ఎదుటికి వచ్చి ఆయన ముందు మోకరించి, ఇలా చెప్పాడు,
\v 15 "అయ్యా, నా కొడుకుని కనికరించి, వాణ్ణి బాగుచెయ్యి. వాడు మూర్చరోగంతో బాధపడుతున్నాడు. ఈ రోగంవల్ల వాడు పదే పదే నీళ్ళలో, నిప్పుల్లో పడిపోతూ ఉన్నాడు.
\v 16 నీ శిష్యులు బాగుచేస్తారని వాళ్ళ దగ్గరకి తీసువెళ్ళాను, వాళ్లకు వీలవ్వలేదు."
\s5
\p
\v 17 అప్పుడు యేసు, "దేవుని శక్తిని నమ్మలేని గందరగోళ పరిస్థితిలో ఉన్న ఈ తరం మనుషులారా, నేను చేస్తున్నట్టు మీరు ఎప్పటికి చేయగలుగుతారు? నేను ఎంతకాలం మీతోపాటు ఉంటాను? ఆ పిల్లవాణ్ణి నా దగ్గరికి తీసుకురండి" అన్నాడు.
\v 18 వాళ్ళు ఆ బాలుణ్ణి తీసుకువచ్చినప్పుడు యేసు అతణ్ణి పట్టి పీడుస్తున్న దురాత్మను తీవ్రంగా గద్దించాడు. ఆ దురాత్మ పిల్లవాణ్ణి విడిచిపెట్టింది. వెంటనే పిల్లవాడు బాగుపడ్డాడు.
\s5
\p
\v 19 తరువాత కొందరు శిష్యులు యేసు ఒక్కడే ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చి, "మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం?" అని అడిగారు.
\p
\v 20 ఆయన ఇలా జవాబిచ్చాడు, "మీరు దేవుని శక్తి మీద పూర్తి నమ్మకం ఉంచలేదు. ఇది ఆలోచించండి. ఆవగింజలు చూడండి, అవి చాలా చిన్నవి. అవి పెరిగినప్పుడు మొక్కలుగా అవుతాయి.
\v 21 అదే విధంగా మీ విశ్వాసం కొంచెంగా ఉన్నప్పటికీ మీరు దేవుని ఏది అడిగినా ఆయన తప్పకుండా మీకు చేస్తాడు. ఈ కొండను చూసి, "ఇక్కడినుంచి అవతలికి వెళ్ళు" అని మీరు చెప్తే, అది మీరు చెప్పినట్లు పక్కకు వెళ్తుంది."
\s5
\p
\v 22 గలిలయ ప్రాంతంలో వాళ్ళంతా ఉన్నప్పుడు యేసు, "త్వరలో మనుష్య కుమారుడు విరోధుల చేతికి చిక్కుతాడు.
\v 23 వాళ్ళు నన్ను చంపుతారు. అయితే నేను చనిపోయిన మూడవ రోజున దేవుడు నన్ను బ్రతికిస్తాడు." ఇది విన్న శిష్యులు ఎంతో విచారంలో మునిగిపోయారు.
\s5
\p
\v 24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూముకు చేరుకున్నారు. దేవాలయం పన్ను కట్టించుకునే వ్యక్తి పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువుగారు దేవాలయం పన్ను కట్టడా ఏంటి?" అని అడిగాడు.
\p
\v 25 అందుకు పేతురు "తప్పకుండా కడతాడు" అని చెప్పి యేసు ఉన్న గదిలోకి వచ్చే లోపుగానే యేసు సీమోనుతో, "సీమోనూ, రాజులు పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ సొంత దేశ ప్రజల నుండా, లేక ఆక్రమించుకున్న ఇతర దేశాల ప్రజల నుండా?" అని అడిగాడు.
\s5
\p
\v 26 అందుకు పేతురు "ఇతర దేశాల ప్రజల నుండే" అని చెప్పాడు. యేసు, "కాబట్టి సొంత దేశ ప్రజలు పన్ను కట్టనవసరం లేదు కదా?
\v 27 అయినప్పటికీ వెళ్ళి మనందరి కోసం ఆలయం పన్ను కట్టు. లేకపోతే వాళ్ళకు కోపం వస్తుంది. పన్ను కట్టడానికి డబ్బు కోసం నువ్వు గలిలయ సముద్రానికి వెళ్ళు. అక్కడ గాలం వేసి చేపలు పట్టు. మొదటగా దొరికిన చేపను తీసుకుని దాని నోట్లో దొరికిన వెండి నాణెం తీసుకుని పన్ను వసూలుదారునికి చెల్లించు. దాని విలువ మనం కట్టాల్సిన పన్ను మొత్తానికి సరిపోతుంది" అని చెప్పాడు.
\s5
\c 18
\p
\v 1 రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చారు. "దేవుడు నిన్ను పరలోకానికి రాజుగా చేసినప్పుడు మాలో ఎవరిని గొప్పవాడుగా ఎంచుతావు?" అని యేసును అడిగారు.
\v 2 అప్పుడు యేసు ఒక పిల్లవాణ్ణి పిలిచి మధ్యలో నిలబెట్టాడు.
\v 3 "నిజం చెప్తున్నాను వినండి. మీరు మార్పు చెంది ఇలాంటి చిన్నపిల్లల వంటి తగ్గింపు మనస్సు పొందకపోతే మీరు ఎన్నటికీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు."
\s5
\p
\v 4 "చిన్నపిల్లవాడిలాగా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు.
\v 5 ఇంకా, ఇలాంటి పిల్లల్ని నా పేరట ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టుగానే దేవుడు చూస్తాడు."
\p
\v 6 "నన్ను నమ్మినవాళ్ళను, లేదా చిన్నపిల్లలను అల్పులుగా భావించి వాళ్ళను పాపం చేయమని పురిగొల్పే వ్యక్తిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. అలాంటి వాడి మెడకు ఒక పెద్ద బరువైన రాయి కట్టి లోతుగా ఉన్న సముద్రంలో పడవేయడమే అలాంటివాడికి తగిన శిక్ష."
\s5
\p
\v 7 "ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపించడం ఎంత దారుణం! పాపంలో పడేసే అనేక శోధనలు ఎదురౌతాయి. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తిని పాపంలో పడేలా చేయడం క్షమించరాని నేరం.
\v 8 కాబట్టి నీ చేతులు గానీ, కాళ్ళు గానీ పాపం చేయాల్సివస్తే వాటిని వాడడం మానేయండి. తప్పని పరిస్థితిలో పాపం చేయాల్సివస్తే పాపం చెయ్యకుండా ఉండేందుకు వాటిని నరికివేయండి. ఒకవేళ నువ్వు రెండు కాళ్ళు, రెండు చేతులు కలిగి ఉండి దేవుడి చేత నరకంలో త్రోయబడి నానా యాతనలు పడేకంటే, ఒక చెయ్యి ఒక కాలుతో పరలోకంలో కలకాలం జీవించడం మంచిది కదా."
\s5
\p
\v 9 "అవును, నీ కళ్ళతో పాపపు పనులు చూడాల్సివస్తే అలాంటి పనులు చూడకు. తప్పనిసరి అయితే పాపం చూడకుండా, చెయ్యకుండా ఉండేందుకు నీ కంటిని పెరికి వెయ్యి. రెండు కళ్ళు కలిగి ఉండి నిత్యమైన నరక శిక్ష అనుభవించేకంటే, ఒంటి కన్నుతో దేవునితో కలసి పరలోకంలో కలకాలం జీవించడం మేలు కదా."
\s5
\p
\v 10 "చిన్నపిల్లలలో ఎవరినీ తక్కువగా చూడవద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరలోకంలో దూతలు పిల్లల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు.
\v 11 మీలో ఎవరైనా చిన్న పిల్లలకు హాని కలిగిస్తే దూతలు మీపై దేవుడికి ఫిర్యాదు చేస్తారు."
\s5
\p
\v 12 "ఒక విషయం చెబుతాను, ఆలోచించండి. నీకు వంద గొర్రెలు ఉన్నాయనుకో. వాటిల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను వెదకడానికి వెళ్తావు కదా.
\v 13 ఆ గొర్రెపిల్ల కనబడినప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు నీకు కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది.
\v 14 అదే విధంగా తప్పిపోయిన గొర్రె విషయం గొర్రెల కాపరి ఆనందించినట్టు ఈ చిన్నపిల్లల్లో ఎవ్వరూ తప్పిపోయి నరకంలో పడకుండా ఉండాలని పరలోకంలోని తండ్రియైన దేవుడు కోరుకుంటున్నాడు."
\s5
\p
\v 15 "నీ తోటి విశ్వాసి ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతణ్ణి కలుసుకుని అతనితో మాట్లాడు. అతడు నువ్వు చెప్పినది విని చేసిన తప్పును గ్రహించి క్షమాపణ కోరితే నువ్వు మంచి స్నేహితుణ్ణి సంపాదించుకున్నవాడివౌతావు.
\v 16 ఒకవేళ అతడు నీ మాట వినకపోతే ఇద్దరు విశ్వాసులను వెంటబెట్టుకు వెళ్ళు. ప్రతి విషయం ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ఎదుట రుజువు కావాలి గనక ఈ విధంగా చెయ్యి."
\s5
\p
\v 17 "అప్పుడు కూడా నీ విషయంలో తప్పు చేసిన వ్యక్తి మాట వినకపోతే అతణ్ణి సరిదిద్దమని మీ సంఘం అంతటికీ విషయం చెప్పు. అప్పుడు కూడా అతడు వాళ్ళ మాట వినకపోతే ఇక అతణ్ణి సమాజం నుంచి వెలివేయబడిన వాడుగా, మనసు లేని కసాయివాడిగా ఎంచు."
\s5
\p
\v 18 "ఈ విషయం గుర్తు పెట్టుకోండి. మీ సమాజంలో ఎవరినైతే మీరు దండించాలని కోరుకుంటారో, లేదా మెచ్చుకుంటారో అదే విధంగా పరలోకంలో కూడా జరుగుతుంది.
\v 19 మరో విషయం, ఈ లోకంలో కనీసం ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కువమంది కూడుకుని కలసి ఏక మనసుతో దేని గురించైనా ప్రార్ధిస్తే దాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు.
\v 20 ఇది నిజం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నన్ను నమ్మి కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను."
\s5
\p
\v 21 తరువాత పేతురు యేసు దగ్గరకు వచ్చి, "నా తోటి విశ్వాసి నాపట్ల తప్పు చేసి క్షమాపణ కోరితే నేను అతణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లు సరిపోతుందా?" అని అడిగాడు.
\v 22 అందుకు యేసు, "ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్భై ఏడు సార్ల వరకైనా క్షమించాలని నేను నీతో చెప్తున్నాను" అని చెప్పాడు.
\s5
\p
\v 23 దీనిని పరలోక రాజ్యాన్ని తన సేవకులతో డబ్బు లెక్కలు సరిచూసుకునే రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు తనకు బాకీ ఉన్న సేవకుల నుండి డబ్బు వసూలు చేసుకోవాలని కోరుకున్నాడు.
\p
\v 24 సేవకులు తమ తమ లెక్కలు సరిచూసుకునేందుకు రాజు దగ్గరకు వచ్చారు. రాజు సేవకుడు బాకీ ఉన్న ఒకణ్ణి తీసుకువచ్చాడు. వాడు రాజుగారికి మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు.
\v 25 అయితే బాకీ తీర్చడానికి వాడి దగ్గర అంత డబ్బు లేదు. రాజు వాడి భార్యా పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 26 అంత పెద్ద మొత్తం తీర్చే స్తోమత వాడికి లేదు. కాబట్టి వాడు రాజుగారి కాళ్ళమీద పడి, "అయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను బాకీ తప్పకుండా తీరుస్తాను" అని బతిమాలుకున్నాడు.
\p
\v 27 వాడు తన బాకీ తీర్చలేడని రాజు గ్రహించాడు. వాడి మీద జాలిపడ్డాడు. వాడు ఇవ్వాల్సిన బాకీ మొత్తం రద్దు చేసి వాణ్ణి విడిచిపెట్టాడు.
\s5
\p
\v 28 "అప్పుడు వాడు తనకు చిన్న మొత్తం బాకీ ఉన్న మరొక సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. వాడి పీక పట్టుకుని "నా బాకీ వెంటనే తీర్చు"అంటూ అతణ్ణి వేధించడం మొదలుపెట్టాడు.
\v 29 అందుకు ఆ సేవకుడు వాడి కాళ్ళు పట్టుకుని "కొంచెం ఓపిక పట్టు. నీ బాకీ నెమ్మదిగా తీర్చుకుంటాను" అని వేడుకున్నాడు."
\s5
\p
\v 30 "అయితే ఆ మొదటి సేవకుడు ఏ మాత్రం జాలి చూపకుండా బాకీ రద్దు చేయడానికి నిరాకరించాడు. అందుకు బదులు అతణ్ణి గురించి అధికారులకు ఫిర్యాదు చేసి తన బాకీ తీర్చేవరకు జైలులో పెట్టించాడు.
\v 31 ఇదంతా గమనించిన మిగిలిన పనివాళ్ళు వాడు చేసిన పనికి బాధపడ్డారు. వాళ్ళు రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా రాజుకు వివరించారు."
\s5
\p
\v 32 "రాజుకి కోపం వచ్చింది. వెంటనే రాజు తన సేవకుల్ని పంపించాడు, వాళ్ళు రాజుకు పెద్ద మొత్తం బాకీ ఉన్న ఆ సేవకుణ్ణి బంధించి తీసుకువచ్చారు. అప్పుడు రాజు, "నీ నీచమైన బుద్ది బయటపెట్టావు. దుర్మార్గుడా, నువ్వు బతిమాలుకున్నావని నీమీద జాలిపడి నీ బాకీ మొత్తం రద్దు చేశాను.
\v 33 అలాగే నేను చేసినట్టు నువ్వు కూడా నీకు బాకీ ఉన్నవాడిపై జాలి చూపించి వాణ్ణి వదిలిపెట్టాలి కదా, అని చెప్పి,
\s5
\v 34 "తన సైనికులని పిలిచి వాడు తనకు బాకీ ఉన్న మొత్తం చెల్లించే వరకు వాణ్ణి తీవ్రంగా హింసించి చెరసాలలో ఉంచమని ఆజ్ఞాపించాడు."
\p
\v 35 "మీలో ప్రతి ఒక్కరూ మీ సాటి విశ్వాసుల విషయంలో నిజాయితీ కలిగి, కనికరం చూపించకపోతే దేవుడు కూడా మీ విషయంలో అలాగే ప్రవర్తిస్తాడు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 19
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కలసి గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది పక్కన ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు.
\v 2 అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. వాళ్ళలో జబ్బు పడి ఉన్న చాలా మందిని యేసు బాగుచేశాడు.
\s5
\p
\v 3 కొందరు పరిసయ్యులు యేసుకు చిరాకు కలిగించి ఆయనతో వాదులాట పెట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుని, "ఎలాంటి కారణం వలనైనా ఒక పురుషుడు తన భార్యను వదిలెయ్యడాన్ని యూదుల చట్టం ఆమోదిస్తుందా?" అని అడిగారు.
\v 4 అప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "దేవుడు సృష్టి కార్యం తరువాత మొదటగా పురుషుడినీ, తరువాత స్త్రీనీ చేశాడని మీరు గ్రంథాలలో చదివారు కదా.
\s5
\v 5 అందుకే పురుషుడు తన తల్లినీ తండ్రినీ విడిచిపెట్టి తన భార్యను పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిలాగా కలిసి జీవిస్తారు, అని చెప్పాడు.
\v 6 అదేవిధంగా మొదట వేరు వేరుగా ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు కలసి ఏక శరీరులుగా ఉంటారు. ఇది సత్యం గనుక, దేవుడు ఏకం చేసిన వీళ్ళను ఏ మనిషీ విడదీయకూడదు."
\s5
\p
\v 7 అందుకు పరిసయ్యులు, "అదే నిజమైతే, ఒకడు తన భార్య నుంచి విడిపోవాలని కోరుకుంటే అందుకు కారణం తెలుపుతూ విడాకుల పత్రం రాసి ఇవ్వొచ్చు అని మోషే ఆజ్ఞాపించాడు గదా" అన్నారు.
\v 8 అందుకు యేసు, "మీ పూర్వీకుల హృదయకాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పి ఉండవచ్చు గానీ మొదటగా దేవుడు స్త్రీ పురుషుడ్ని సృష్టించినప్పుడు వారిద్దరూ కలిసి ఉండాలి గానీ విడిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు.
\v 9 నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒకడు తన భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, తన భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే అతడు వ్యభిచారం అనే పాపం చేసినట్టుగా దేవుడు ఎంచుతాడు."
\s5
\p
\v 10 శిష్యులు "అదే నిజమైతే పురుషులు పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే మంచిది" అన్నారు.
\v 11 అందుకు యేసు, "దేవుడు అనుమతించిన వాళ్ళు తప్ప మరి ఇంకెవ్వరూ ఈ బోధను అంగీకరించరు.
\v 12 పుట్టినప్పటి నుంచి పురుషత్వం లోపం కారణంగా పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. నపుంసకులుగా మార్చబడిన వాళ్ళు, అలాగే పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళూ పెళ్ళికి దూరంగా ఉన్నారు. పెళ్ళి గురించి నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకున్నవాడు వాటిని అంగీకరించి పాటిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 13 తరువాత కొందరు యేసు తమ పిల్లల తలలపై చేతులుంచి ప్రార్ధించాలని ఆశించి పిల్లలను యేసు దగ్గరకు తీసుకువచ్చారు. అయితే శిష్యులు వాళ్ళను యేసు దగ్గరకు రానీయకుండా అడ్డుకున్నారు.
\v 14 అది చూసిన యేసు, "ఆ పిల్లలను ఆపకండి. నా దగ్గరకు రానీయండి. పరలోక రాజ్య పాలనలో వినయం, నమ్మకత్వం ఉన్న ఇలాంటి పిల్లలకే స్థానం దక్కుతుంది" అని చెప్పాడు.
\v 15 ఆ పిల్లలపై చేతులు వేసి వాళ్ళను దీవించాడు. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 16 యేసు వీధిలో నడుస్తూ ఉండగా ఒక యువకుడు యేసును కలుసుకుని, "నేను దేవుడి రాజ్యంలో కలకాలం ఉండాలంటే ఎలాంటి మంచి పనులు చెయ్యాలి?" అని అడిగాడు.
\p
\v 17 అందుకు యేసు, "మంచి పనులను గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నిజంగా మంచి వాడు దేవుడొక్కడే. అయితే నిత్య జీవం కోసం నీ ప్రశ్నకు జవాబేమిటంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 18 ఆ యువకుడు "ఏ ఆజ్ఞలు నేను నెరవేర్చాలి?" అని అడిగాడు. యేసు, "నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, దొంగతనం చెయ్యవద్దు, దొంగ సాక్ష్యం చెప్పవద్దు,
\v 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పక్కన ఉన్నవాణ్ణి కూడా ప్రేమించు" అని చెప్పాడు.
\s5
\p
\v 20 ఆ యువకుడు, "ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను. నిత్య జీవం కోసం ఇంకా నేనేం చెయ్యాలి" అని అడిగాడు.
\p
\v 21 అప్పుడు యేసు, "అయితే నువ్వు తప్పకుండా చెయ్యాలని దేవుడు కోరేది ఒకటుంది. ఇంటికి వెళ్ళి, నీకు ఉన్నదంతా అమ్మివేసి, వచ్చినదంతా పేదవాళ్ళకు పంచిపెట్టు. అప్పుడు పరలోకంలో నీకు ఆస్తి సమకూరుతుంది. తరువాత నా శిష్యుడిగా మారి నన్ను వెంబడించు" అన్నాడు.
\v 22 ఆ యువకుడు బాగా ఆస్తిపరుడు. తన ఆస్తి ఇతరులకు పంచడం అతనికి ఇష్టం లేదు. అందువల్ల ఈ మాటలు విన్న అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
\s5
\p
\v 23 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఇది మనసులో ఉంచుకోండి, ధనవంతులు తమ జీవితాలను దేవుని పాలనకు లోబరచుకోవడం ఎంతో కష్టం.
\v 24 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జం గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక" అని చెప్పాడు.
\s5
\p
\v 25 ఈ మాటలు విన్న శిష్యులు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ధనవంతులను దేవుడు ఎక్కువగా దీవిస్తాడని వాళ్ళు అనుకునేవాళ్లు. అప్పుడు వాళ్ళు, "అలాగైతే మరి ఎవ్వరూ రక్షింపబడలేరు" అన్నారు.
\p
\v 26 యేసు వాళ్ళకేసి తీక్షణంగా చూశాడు. "అవును, మనుషులు తమను తాము రక్షించుకోవడం అసాధ్యమే. అయితే దేవుడు వాళ్ళను రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడికి అంతా సాధ్యమే" అని చెప్పాడు.
\v 27 అప్పుడు పేతురు, "అయ్యా, మేము మాకున్నదంతా విడిచిపెట్టి నీ శిష్యులంగా నీతోపాటు ఉంటున్నాము. ఈ సంగతి నీకూ తెలుసు. మరైతే దీనివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?" అని అడిగాడు.
\s5
\p
\v 28 అందుకు యేసు, "ఇది మీ మనస్సుల్లో ఉంచుకోండి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. దేవుడు నిర్మించే కొత్త లోకంలో మనుష్య కుమారుడినైన నేను మహిమ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను వెంబడిస్తున్న మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు తీర్పు తీరుస్తారు."
\s5
\p
\v 29 "నా శిష్యులైన మీరు నా కోసం మీ ఇళ్ళను, భూములను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, భార్యా పిల్లలను నా కోసం విడిచిపెట్టి వచ్చారు గనుక దేవుడు తగిన బహుమతి ఇస్తాడు. మీలో ప్రతివాడూ ఇంతకు వంద రెట్లు ప్రతిఫలం పొందుతారు. దాంతోపాటు దేవుడితోపాటు కలకాలం జీవిస్తారు.
\v 30 ఈ లోకంలో ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు అనేకమంది భవిషత్తులో సామాన్యులు అవుతారు, ముఖ్యులు కానివారు చాలామంది ముఖ్యులు అవుతారు."
\s5
\c 20
\p
\v 1 దేవుడు పరిపాలించే పరలోకరాజ్యం ఒక తోట యజమాని చేసిన పనిలాగా ఉంది. ఎలాగంటే, ప్రతిరోజూ పొద్దున్నే తోట యజమాని మార్కెట్టుకి వెళ్ళి అక్కడ కూర్చుని ఉండే పనివాళ్ళను తన ద్రాక్ష తోటలోకి పనికి కుదుర్చుకున్నాడు.
\v 2 ఒక్కొక్కరికి వంద రూపాయలు కూలీ ఇచ్చేలా బేరం కుదుర్చుకుని వాళ్ళను పనిలోకి పంపించాడు.
\s5
\p
\v 3 "ఉదయం తొమ్మిది గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ చేయడానికి పని ఏమీ లేకుండా ఉన్న కొంతమంది పనివాళ్ళను చూశాడు.
\v 4 అతడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "పొద్దున్న వెళ్ళినవాళ్ళ లాగా మీరు కూడా నా ద్రాక్షతోటకి వెళ్ళి పనిచెయ్యండి. మీకు న్యాయమైన కూలీ ముట్టజెప్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 "మధ్యాహ్నం పన్నెండు గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ ఉన్న పనివాళ్ళను సరియైన కూలీ ఇస్తానని చెప్పి తోటకు పంపించాడు.
\v 6 మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మార్కెట్టుకి వెళ్ళి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్న పనివాళ్ళను చూశాడు. అతడు వాళ్ళతో, "పనేమీ చేయకుండా రోజంతా ఇలా ఉన్నారేమిటి?" అని అడిగాడు.
\v 7 అందుకు వాళ్ళు "మమ్మల్ని ఎవ్వరూ పనిలోకి పెట్టుకోలేదు" అని చెప్పారు. "నేను మీకు పని ఇస్తాను. మీరు నా ద్రాక్షతోటకి వెళ్ళి అక్కడున్నవాళ్ళతో కలిసి పనిచెయ్యండి" అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు."
\s5
\p
\v 8 "పని సమయం ముగిసిన తరువాత యజమాని తన మేనేజర్ ని పిలిచాడు. "పనివాళ్ళందరినీ పిలిపించు. చివర వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి మొదట వచ్చిన వాళ్ళందరికీ కూలీ డబ్బులు ఇవ్వు" అని చెప్పాడు.
\v 9 ఆ మేనేజర్ సాయంత్రం ఐదు గంటలకు పనికి వచ్చిన వాళ్ళతో కలిపి అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చాడు.
\v 10 పొద్దున్నే పని మొదలుపెట్టిన కూలీ డబ్బుల కోసం వెళ్ళినప్పుడు తమకు చెప్పిన కూలీ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కానీ వాళ్లకు ముందుగా చెప్పిన డబ్బులే అందాయి."
\s5
\p
\v 11 "అందువల్ల వాళ్ళంతా ద్రాక్షతోట యజమాని దగ్గరికి వెళ్ళి తమకు అన్యాయం జరిగిందని వాపోయారు.
\v 12 వాళ్ళు యజమానితో "ఇదేం బాగోలేదు. చివరగా వచ్చిన వీళ్ళు ఒక్క గంట మాత్రమే పనిచేశారు. మేమైతే పొద్దుటినుంచి ఎండలో కష్టపడి పనిచేశాం. నువ్వేమో అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చావు" అన్నారు."
\s5
\p
\v 13 "అందుకు ద్రాక్షతోట యజమాని, "మిత్రమా, నేనేమీ మీకు అన్యాయం చెయ్యలేదు. నేను చెప్పిన జీతానికి పనిచెయ్యడానికి నువ్వు ఒప్పుకున్నావు.
\v 14 నీ కూలీ నువ్వు తీసుకుని వెళ్ళిపో! మీరంతా పని మొదలు పెట్టిన తరువాత వచ్చిన వీరికి మీతోపాటు సమానంగా కూలీ ఇవ్వడం నా ఇష్టం.
\s5
\v 15 నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు నాకు ఉంది. అవునా, కాదా? నా మంచితనాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా?" అన్నాడు.
\v 16 ఇదేవిధంగా దేవుడిచ్చే బహుమతులు కూడా ఇలాగే ఉంటాయి. తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు కొందరికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతో ముఖ్యమైన వాళ్ళుఅనుకునే కొందరికి ఆయన ఏ ప్రతిఫలాన్నీ ఇవ్వడు."
\s5
\p
\v 17 యేసు యెరూషలేముకు వెళ్లబోయేటప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఒకచోటికి తీసుకువెళ్ళి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాడు.
\v 18 "జాగ్రత్తగా వినండి! మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళబోతున్నాం. అక్కడ యూదు అధికారులు, యూదు చట్టాలు బోధించే పండితులూ మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను బంధిస్తారు. నాకు తీర్పు తీర్చి మరణ శిక్ష విధిస్తారు.
\v 19 నన్ను అవమానపరచి , హింసించి మేకులతో సిలువకు వేలాడదీసి చంపడానికి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు. అయితే చనిపోయిన నన్ను దేవుడు మూడవ రోజున తిరిగి బ్రతికేలా చేస్తాడు."
\s5
\p
\v 20 అప్పుడు జెబెదయి కొడుకులైన యాకోబు, యోహానుల తల్లి ఈ ఇద్దరినీ వెంటబెట్టుకుని యేసు దగ్గరికి వచ్చి యేసుకు నమస్కరించి తన కోసం ఒక పని చేసిపెట్టమని అడిగింది.
\v 21 అదేమిటో చెప్పమని యేసు ఆమెతో అన్నాడు. అందుకామె, "యేసూ, నువ్వు రాజుగా తిరిగి వచ్చినప్పుడు నా కొడుకులిద్దరినీ నీ కుడిపక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుంటావని నాకు మాట ఇవ్వు" అంది.
\s5
\p
\v 22 అప్పుడు యేసు ఆమెతో, ఆమె కొడుకులిద్దరితో ఇలా చెప్పాడు, "మీరు అడుగుతున్నదేమిటో మీకు అర్థం కావడం లేదు. నేను హింసలు పొందబోతున్నట్టుగా మీరు హింసలు పొందుతారా?" అని అడిగాడు. అందుకు వాళ్ళు "హింసలు భరించగలం" అని చెప్పారు.
\v 23 యేసు, "అవును, నేను హింసలు పొందినట్టు మీరు కూడా పొందగలరు. అయితే కుడి పక్కన, ఎడమ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుని పాలించే అధికారం నాకు లేదు. నా తండ్రియైన దేవుడు వీటిని ఎవరి కోసం నియమించాడో వాళ్ళకే దక్కుతాయి."
\p
\v 24 మిగిలిన పది మంది శిష్యులు యాకోబు యోహానుల కోరిక విని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా యేసు పక్కన కూర్చునే మహా భాగ్యం తమకు కూడా దక్కాలని కోరుకుంటున్నారు.
\s5
\p
\v 25 యేసు వాళ్ళను తన దగ్గరికి పిలిచి, "యూదులు కాని ప్రజల్లో అధికారులు ప్రజలపై పెత్తనం చెలాయిస్తారని మీకు తెలుసు. అలాగే ప్రముఖులైన అధికారులు తమ క్రిందివాళ్ళమీద అధికారం చూపిస్తారు.
\v 26 మీరు వాళ్ళలాగా ఉండకూడదు. అందుకు భిన్నంగా మీలో గొప్పవాడుగా ఉండాలని కోరుకునేవాడు మీకు సేవకుడుగా ఉండాలి."
\p
\v 27 "అవును, మీలో ఎవరిని దేవుడు గొప్పవాడిగా ఎంచాలని కోరుకుంటాడో వాడు మిగిలినవాళ్ళందరికీ దాసుడుగా ఉండాలి.
\v 28 నాలాగా చెయ్యండి. నేను మనుష్య కుమారుడినైనప్పటికీ నేను ఇతరుల చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు. అందుకు బదులుగా ఇతరులకి సేవ చేయడానికీ, వాళ్ళ చేతుల్లో ప్రాణం కోల్పోయి అనేకమంది పాపాల కోసం నా ప్రాణం ఇవ్వడానికీ వచ్చాను."
\s5
\v 29 వాళ్ళు యెరికో పట్టణం దాటిపోతూ ఉన్నప్పుడు జనులు పెద్ద గుంపుగా ఆయనను వెంబడించారు.
\v 30 వాళ్ళు నడుస్తూ ఉండగా దారి పక్కన ఇద్దరు గుడ్డివాళ్ళు కూర్చుని ఉండడం చూశారు. ఆ గుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వెళ్తున్నాడని విని, "ప్రభూ, దావీదు కుమారా, నువ్వే మెస్సీయ్యవు. మమ్మల్ని కనికరించు" అంటూ కేకలు వేశారు.
\v 31 గుంపులో ఉన్న మనుషులు వాళ్ళపై కోపగించుకుని నెమ్మదిగా ఉండమని వాళ్ళను హెచ్చరించారు. అయితే ఆ గుడ్డివాళ్ళు ఇంకా గట్టిగా "ప్రభూ, దావీదు కుమారా, మెస్సీయా, మమ్మల్ని కనికరించు!" అని కేకలు వేశారు.
\s5
\p
\v 32 యేసు అక్కడే ఆగిపోయి వాళ్ళను తన దగ్గరకు తీసుకురమ్మని పిలిచాడు. వాళ్ళను "నేను మీకేం చెయ్యాలి?" అని అడిగాడు.
\v 33 అందుకు వాళ్ళు "ప్రభూ, మేము చూడగలిగేలా మా కళ్ళు బాగుచెయ్యి" అని అడిగారు.
\v 34 యేసు వాళ్ళను చూసి జాలిపడి తన చేతులతో వాళ్ళ కళ్ళు తాకాడు. వెంటనే వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. యేసుని వెంబడిస్తూ ముందుకు సాగారు.
\s5
\c 21
\p
\v 1 వాళ్ళు యెరూషలేము దగ్గరలో ఉన్న ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే ఊళ్ళోకి వచ్చారు.
\v 2 యేసు తన ఇద్దరు శిష్యులను పిలిచాడు. వాళ్ళతో "మీరు ఎదురుగా ఉన్న ఊళ్ళోకి వెళ్ళండి. ఊరు మొదట్లోనే కట్టేసి ఉన్న ఒక గాడిద, దాని పిల్ల కనబడతాయి. వాటి కట్లు విప్పి నా దగ్గరికి తోలుకురండి.
\v 3 ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, "ఇవి ప్రభువుకు కావాలి"అని చెప్పండి. అప్పుడు అతడు వాటిని మీతో పోనిస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 4 ఇద్దరు శిష్యులు వెళ్ళి యేసు చెప్పినట్టు చేశారు.
\v 5 గాడిదను, దాని పిల్లను యేసు దగ్గరికి తీసుకువచ్చారు.
\s5
\v 6 యేసు కూర్చునేందుకు వీలుగా తమ బట్టలు తీసి దాని పైన వేశారు.
\v 7 యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు.
\p
\v 8 జనులు గుంపులుగా యేసు చుట్టూ సమకూడి తమ బట్టలు దారి పొడవునా పరిచారు. మరికొందరు ఒలీవ చెట్టు కొమ్మలు నరికి వాటిని దారిలో పరిచారు.
\s5
\v 9 జనులు యేసు ముందూ వెనుకా నడుస్తూ,
\q "దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!"
\q "దేవుడి ప్రతినిధిగా అధికారంతో వస్తున్న ఈయనను దేవుడు దీవిస్తాడు గాక!"
\q "ఉన్నత స్థలంలో ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక!"
\p అంటూ కేకలు వేశారు.
\v 10 యేసు యెరూషలేములోనికి రాగానే ప్రజలు అనేకులు "వీళ్ళు ఈయనను ఇలా ఎందుకు పొగుడుతున్నారు?" అంటూ కలవరం చెందారు.
\p
\v 11 యేసుతో ఉన్న జనులు "ఈయన యేసు, గలిలయలోని నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 12 తరువాత యేసు కోవెలలోకి వెళ్ళి గుమ్మం దగ్గర రకరకాల వస్తువులు అమ్ముతున్న, కొంటున్న వాళ్ళనందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకి రోము నాణేల మారకం చేసేవాళ్ళ బల్లలనూ, అర్పణల కోసం పావురాలు అమ్మేవాళ్ళ పీటలను పడద్రోశాడు.
\v 13 అప్పుడు ఆయన వాళ్ళతో, "దేవుడు ప్రవక్త ద్వారా పలికించినట్టు "నా ఆలయం ప్రార్థనలకు నిలయం" అని ఉంది. కాని మీరు దాన్ని దొంగల నిలయంగా చేశారు."
\p
\v 14 తరువాత అనేకమంది గుడ్డివాళ్ళూ, కుంటివాళ్ళూ యేసు దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళందరినీ బాగుచేశాడు.
\s5
\p
\v 15 ప్రధాన యాజకులు, యూదు చట్టాలు బోధించే పండితులు యేసు చేసిన ఈ అద్భుత కార్యాలన్నీ చూశారు, ఇంకా చిన్న పిల్లలు యేసు గురించి "దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!" అని వేస్తున్న కేకలు విన్నారు.
\v 16 వాళ్లకు కోపం వచ్చింది. "వీళ్ళు వేస్తున్న కేకలు వింటున్నావా? అలా చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు?" అని అడిగారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, "అవును, వింటున్నాను. మీరు లేఖనాల్లో, చిన్న పిల్లలు నన్ను స్తుతిస్తారని, అందునుబట్టి దేవుడు ఆనందిస్తాడని రాసిన మాటలు మీరు మర్చిపోయారా? కీర్తనకారుడు తన కీర్తనలలో "చిన్న పిల్లలకు, చంటి బిడ్డలకు నిన్ను స్తుతించడం నేర్పించావు" అని రాశాడు కదా."
\p
\v 17 తరువాత యేసు ఆ ఊరిని విడిచిపెట్టి బయలుదేరి బేతనియ చేరుకొని అక్కడే ఆ రాత్రి గడిపాడు.
\s5
\p
\v 18 తెల్లవారగానే లేచి తిరిగి పట్టణంలోకి వస్తూ ఉండగా ఆయనకు ఆకలి వేసింది.
\v 19 దారి పక్కనే అంజూరుు చెట్టు కనిపించింది. ఆ పండ్లు తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలేమీ లేవు. అందుకని ఆయన ఆ చెట్టుకేసి చూసి, "ఇక ముందు నువ్వు ఎన్నటికీ కాపు కాయవు" అని చెప్పాడు. ఫలితంగా ఆ అంజూరుు చెట్టు ఎండిపోయింది.
\s5
\p
\v 20 తరువాతి రోజు ఆ అంజూరు చెట్టు పూర్తిగా ఎండిపోయి ఉండడం శిష్యులు చూశారు. "ఈ చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో కదా" అని యేసుతో అన్నారు.
\p
\v 21 అందుకు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "ఇది వినండి: మీరు దేవుడిని నమ్మినప్పుడు సందేహం లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యగలరు. ఈ అంజూరు చెట్టు విషయంలో నేను చేసినది మీరు చూశారు కదా. అంతే కాదు, మీకు పూర్తి నమ్మకం ఉంటే నాలాగా అద్భుతాలు మీరు కూడా చేయగలరు. ఆ కొండను చూడండి, దానితో "నువ్వు లేచి ఆ సముద్రంలో పడిపో" అని మీరు చెప్తే అది తప్పక జరుగుతుంది.
\v 22 దీనికి తోడు మీరు దేనికోసమైనా దేవుడికి ప్రార్థించినప్పుడు దాన్ని దేవుడు ఇస్తాడనీ, దాన్ని మీరు పొందారని నమ్మండి."
\s5
\p
\v 23 ఆ తరువాత యేసు కోవెల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న మనుషులకు బోధించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కొందరు ప్రధాన యాజకులు, మత పెద్దలు అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుతో, "నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? నిన్న నువ్వు చేసిన పనులకు నీకు అధికారం ఎవరిచ్చారు?" అని అడిగారు.
\v 24 అందుకు యేసు, "నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. అప్పుడు నేను ఈ పనులు ఏ అధికారంతో చేస్తున్నానో చెప్తాను.
\s5
\v 25 బాప్తిసమిచ్చే యోహానుకు తన మాటలు నమ్మిన వాళ్లకు బాప్తిసం ఇచ్చే అధికారం ఎక్కడినుంచి వచ్చింది? అతడు ఆ అధికారం దేవుడినుంచి పొందాడా లేక మనుషులు ఇచ్చారా?"
\p వాళ్ళు ఏమి జవాబు చెప్పాలో తమలో తాము చర్చించుకున్నారు. "ఇప్పుడు గనక మనం దేవుడి నుంచే అని చెప్తే, అందుకు ఆయన అలాగైతే మీరు అతడి సందేశం నమ్మవలసినది గదా, అంటాడు.
\v 26 అలా కాక, మనుషుల నుంచి, అని చెప్తే జనం మనపై తిరగబడతారు." ఎందుకంటే ప్రజలు యోహాను దేవుడు పంపిన ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు.
\v 27 అందుకని వాళ్ళు "యోహాను ఆ అధికారం ఎక్కడినుంచి పొందాడో మాకు తెలియదు" అని చెప్పారు. అప్పుడు యేసు, "నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు గనక నిన్న నేను చేసిన పనులకు ఎవరు అధికారం ఇచ్చారన్నదానికి నేను కూడాజవాబు చెప్పను" అన్నాడు.
\s5
\p
\v 28 ఆయన ఇంకా మాట్లాడుతూ, "నేను చెప్పబోయేదాని గురించి మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. అతడు తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, "బాబూ, మన ద్రాక్షతోటకు వెళ్ళి పనిచెయ్యి" అని చెప్పాడు.
\v 29 అప్పుడు వాడు, "నాన్నా నేను వెళ్ళను" అని చెప్పాడు. తరువాత వాడు తన మనసు మార్చుకుని తోటకు వెళ్ళి పనిచేశాడు.
\v 30 తరవాత ఆ తండ్రి చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి పెద్ద కొడుకుకు చెప్పినట్టు చెప్పాడు. అయితే చిన్న కొడుకు, "సరే నాన్నా, తోటకి వెళ్తాను" అని చెప్పాడు గానీ ఆ పని చెయ్యలేదు."
\s5
\p
\v 31 "కాబట్టి ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రి మాట విన్నట్టు?" అని అడిగినప్పుడు వాళ్ళు "పెద్ద కొడుకే" అని చెప్పారు. అప్పుడు యేసు, "అయితే వినండి, మీరు పన్నులు వసూలు చేసేవాళ్ళను, వ్యభిచారులను వాళ్ళు మోషే నియమించిన చట్టాలను ఆచరించరని వాళ్ళను చిన్నచూపు చూస్తుంటారు గానీ దేవుడు వాళ్ళనే మొదటగా చేర్చుకుంటాడు.
\v 32 నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిసమిచ్చే యోహాను మంచి మార్గంలో నడవాలని చెప్పిన మాటలు మీరు వినలేదు. అయితే పన్ను వసూలు చేసేవాళ్ళు, వ్యభిచారులు అతని మాటలు నమ్మి, తమ పాప స్వభావాన్ని మార్చుకున్నారు. దాన్ని చూసి కూడా మీరు అతని మాటలు వినలేదు, పాపం చెయ్యడం మానలేదు."
\s5
\p
\v 33 "మరొక ఉపమానం చెప్తా వినండి. ఒక ద్రాక్ష తోట నాటించిన ఒక యజమాని ఉన్నాడు. అతడు తన తోట చుట్టూ ప్రహరీ గోడ కట్టించి ఒక ద్రాక్ష గానుగ ఏర్పాటు చేశాడు. ఒక ఎత్తైన గోపురం కట్టించి తోటకు కాపలా నియమించాడు. ప్రతి యేడూ పంట తనకు అప్పగించేలా కొంతమందికి తన తోట కౌలుకు ఇచ్చాడు. తరువాత అతడు వేరే దేశానికి వెళ్ళాడు."
\p
\v 34 "కొంత కాలం గడచిన తరువాత పంట చేతికొచ్చే సమయంలో ఆ యజమాని తన వంతు తీసుకురమ్మని కొందరు పనివాళ్ళను కౌలుదారుల దగ్గరికి పంపించాడు.
\s5
\v 35 ఆ కౌలుదారులు ఆ సేవకులను బంధించి ఒకణ్ణి కొట్టారు. ఒకణ్ణి చంపివేశారు, మరొకడిని రాళ్ళతో కొట్టి చంపారు."
\p
\v 36 "తరువాత ఆ యజమాని ఇంకా ఎక్కువమంది సేవకులను పంపాడు. ఆ కౌలుదారులు ముందు వచ్చిన వాళ్ళకు చేసినట్టుగానే వీళ్ళ పట్ల కూడా ప్రవర్తించారు.
\v 37 ఇది విన్న యజమాని "నా కొడుకునైతే వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారు, ఎలాంటి హానీ తలపెట్టరు"అనుకుని తోటలో భాగం కోసం తన కొడుకుని పంపించాడు."
\s5
\p
\v 38 "యజమాని కొడుకు వస్తూ ఉండడం చూసిన కౌలుదారులు "ఆ వచ్చేవాడు ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. మనం వీణ్ణి గనక చంపేస్తే ఇక ఈ ఆస్తి అంతా మనం పంచుకోవచ్చు" అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు.
\v 39 వాళ్ళు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటకు ఈడ్చుకువెళ్లి చంపి పడేశారు."
\s5
\p
\v 40 "నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ యజమాని వచ్చి ఆ కౌలుదారుల్ని ఏమి చేస్తాడని మీరు అనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు.
\p
\v 41 అందుకు వాళ్ళు, "యజమాని ఆ దుర్మార్గుల్ని నాశనం చేస్తాడు. తనకు సక్రమంగా పంటలో భాగమిచ్చే వేరే కౌలుదారులకు అతని తోటను అప్పగిస్తాడు" అని బదులిచ్చారు.
\s5
\p
\v 42 అప్పుడు యేసు, "మీరు లేఖనాల్లో చదివిన ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానం చెయ్యండి.
\q ఇల్లు కట్టేవాళ్ళు తీసి పడవేసిన రాయి చివరికి ఇతరులు కట్టుకునే ఇళ్ళకి అదే ముఖ్యమైన పునాది రాయి అయింది.
\q ప్రభువే దీనిని చేశాడు, ఇది మనకెంతో ఆశ్చర్యకరం."
\s5
\p
\v 43 "కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి ప్రజలను దేవుడు తనవాళ్ళుగా ఉండనీయకుండా తీసివేస్తాడు. తాను కోరుకున్న విధంగా ఉండే ప్రజలను తన సొంత ప్రజలుగా స్వీకరిస్తాడు.
\v 44 ఎవడైనా ఒక బండ రాయి మీద పడితే వాడు ముక్కలు ముక్కలు అవుతాడు, అదే రాయి వాడి మీద పడితే వాడు నజ్జు నజ్జు అయిపోతాడు."
\s5
\p
\v 45 ఈ ఉదాహరణ విన్న పరిసయ్యులు, యూదుల పెద్దలు తాము ఈ యేసును మెస్సీయ అని నమ్మకపోవడం వలన ఇది తమ గురించే చెప్పాడని అనుకున్నారు.
\p
\v 46 వాళ్ళు యేసును పట్టుకుని బంధించాలని చూశారు. అయితే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తూ ఆయన చెప్పే మాటలు వింటున్నారు గనుక ఆ ప్రజలు తిరగబడతారని భయపడ్డారు.
\s5
\c 22
\p
\v 1 యేసు యూదు నాయకులకు అనేక ఉపమానాలు చెప్పాడు. వాటిల్లో ఇది ఒకటి.
\v 2 "పరలోక రాజ్య పాలన ఒక రాజు తన కొడుకు పెళ్ళికి విందు భోజనాలు ఏర్పాటు చేసినట్టు ఉంది.
\v 3 ఆ విందు సిద్ధం అయినప్పుడు భోజనానికి పిలిచిన వాళ్ళనందరినీ ఆహ్వానించమని తన సేవకులను పురమాయించాడు. సేవకులు ఆ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా విందుకు రాకుండా సాకులు చెప్పసాగారు."
\s5
\p
\v 4 "అప్పుడు అతడు వేరే సేవకులను వాళ్ళ దగ్గరకు పంపుతూ, "ఆహ్వానితులందరికీ ఇలా చెప్పండి. రాజు మీతో ఇలా చెప్పమన్నాడు, నేను మీ కోసం విందు సిద్ధం చేశాను. కొవ్విన దూడల మాంసం, ఎద్దుల మాంసం వండించాను. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందు మొదలయ్యే సమయం అయింది."
\s5
\p
\v 5 "సేవకులు ఈ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా రకరకాల సాకులు చెప్పారు. కొందరేమో పొలానికి వెళ్ళాలనీ, మరి కొందరేమో వ్యాపారం నిమిత్తం వెళ్ళాలనీ చెప్పి రాకుండా మానివేశారు.
\v 6 మిగిలినవాళ్ళు రాజు సేవకులను పట్టుకుని అవమానపరిచి చంపివేశారు.
\v 7 జరిగినది తెలుసుకున్న రాజుకు చాలా కోపం వచ్చింది. వాళ్ళందరినీ చంపివేసి ఆ ఊరంతటినీ తగలబెట్టమని తన సైనికులను పంపించాడు.
\s5
\v 8 సేవకులు ఆ పని చేసినప్పుడు, రాజు మరికొంతమంది సేవకులను పిలిచి "నేను పెళ్ళి విందు సిద్ధం చేశాను. కానీ వాళ్ళంతా విందు ఆరగించడానికి యోగ్యులు కారు.
\v 9 కాబట్టి మీరు వెళ్ళండి, దారి వెంట మీకు కనిపించిన వాళ్ళందరినీ పెళ్ళి విందుకు తీసుకురండి" అని చెప్పాడు.
\v 10 సేవకులు వెళ్ళారు, తమకు కనిపించిన వాళ్ళందరినీ పోగుచేశారు. వాళ్ళలో కొందరు మంచివాళ్ళూ, కొందరు చెడ్డవాళ్ళూ ఉన్నారు. వాళ్ళందరినీ విందు జరిగే భోజనాల గదికి తీసుకువచ్చారు. ఆ హాలంతా నిండిపోయింది."
\s5
\p
\v 11 "రాజు అక్కడ కూర్చున్న అతిధులను చూడడానికి లోపలికి వచ్చాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి విందు బట్టలు వేసుకోకుండా ఉన్న ఒకడు కనిపించాడు.
\v 12 రాజు అతనితో, "మిత్రమా, పెళ్ళి విందుకు అతిథులు వేసుకోవలసిన బట్టలు వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ఆ వ్యక్తికి ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా ఉండిపోయాడు.
\s5
\v 13 అప్పుడు రాజు సైనికులను పిలిచి, "ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటి గదిలో పడవేయండి. అక్కడ మనుషులు ఏడుస్తూ, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు" అని ఆజ్ఞాపించాడు."
\p
\v 14 తరువాత యేసు, "ఈ ఉపమానం ఉద్దేశం ఏమిటంటే దేవుడు తన దగ్గరికి రమ్మని అందరినీ పిలుస్తున్నాడు. అయితే ఆయన దగ్గర ఉండేందుకు అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమందే" అన్నాడు.
\s5
\p
\v 15 ఈ సంగతి చెప్పిన తరువాత, పరిసయ్యులు పోగయ్యారు. యేసు చేత ఏదైనా తప్పు మాటలు పలికించి ఆయనను ఇరికించాలని పథకం వేశారు.
\v 16 కొంతమంది హేరోదు వర్గానికి చెందిన మనుషులతోపాటు తమ అనుచరులను యేసు దగ్గరికి పంపించారు. వాళ్ళు యేసుతో, "బోధకా, నువ్వు నీతిమంతుడవనీ, దేవుడు కోరినట్టు జీవించాలనే సత్యాలు బోధిస్తున్నావనీ మాకు తెలుసు. నీ బోధల్లో ఎలాంటి లోపమూ లేదనీ, ఎవ్వరి విషయంలోనూ పక్షపాతం చూపించవనీ మాకు తెలుసు.
\v 17 అయితే ఒక విషయం చెప్పు. రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం న్యాయమేనా, కాదా?"
\s5
\p
\v 18 వాళ్ళు మనసులో చెడు ఆలోచన పెట్టుకుని తనను ఇరికించాలని చూస్తున్నారని యేసు గ్రహించాడు. తాను ఇచ్చే జవాబు వల్ల అటు రోమా అధికారుల ద్వారా గానీ, ఇటు యూదు అధికారుల ద్వారా గానీ తనను ఇబ్బందులపాలు చెయ్యాలని వీళ్ళు చూస్తున్నారు. యేసు ఇలా చెప్పాడు, "మోసగాళ్ళారా, మీరు నా చేత తప్పుడు మాటలు పలికించాలని చూస్తున్నారు.
\v 19 ఏదీ రోమా పన్ను చెల్లించే ఒక నాణెం చూపించండి." వాళ్ళు ఒక నాణెం చూపించారు.
\s5
\p
\v 20 "ఈ నాణెం మీద ఉన్న బొమ్మ ఎవరిదీ?" యేసు అడిగాడు.
\v 21 వాళ్ళు "రోమ ప్రభుత్వ అధికారి సీజరుది" అని చెప్పారు. "అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి."
\v 22 యేసు చెప్పిన ఈ జవాబుకి వాళ్ళు అవాక్కయ్యారు. ఇక నోరెత్తలేక పోయారు. ఆయన్ని విడిచిపెట్టి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
\s5
\p
\v 23 అదేరోజు కొందరు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చారు. వీళ్ళు చనిపోయినవాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకరు అని నమ్మే యూదులలో ఒక గుంపుకు చెందినవాళ్ళు. వాళ్ళు యేసుతో ఇలా అన్నారు,
\v 24 "బోధకా, మోషే రాసిన గ్రంథాల్లో "ఒక పురుషుడు తనకు పిల్లలు లేకుండా చనిపోతే అతని తమ్ముడు చనిపోయిన వ్యక్తి భార్య ద్వారా పిల్లల్ని కనాలి. ఆ విధంగా ఆ పిల్లలు చనిపోయిన వ్యక్తికి వారసులు అవుతారు" అని ఉంది కదా."
\s5
\p
\v 25 "ఒక కుటుంబంలో ఏడుగురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో పెద్దవాడు పెళ్ళి చేసుకుని తనకు పిల్లలు లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు మొదటివాడి భార్యని పెళ్ళి చేసుకున్నాడు గానీ అతడు కూడా పిల్లల్ని కనకుండానే చనిపోయాడు.
\v 26 అలాగే మూడవవాడు, తరువాత మిగిలిన నలుగురూ ఆమెను పెళ్ళి చేసుకుని పిల్లలు లేకుండానే చనిపోయారు.
\v 27 చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 28 దేవుడు చనిపోయినవాళ్ళను మళ్ళీ బ్రతికించినప్పుడు ఆ ఏడుగురు అన్నదమ్ములలో ఆ స్త్రీకి ఎవరు భర్తగా ఉంటారు? ఇక్కడ బతికి ఉన్నప్పుడు అందరూ ఆమెకు భర్తలయ్యారు కదా."
\s5
\p
\v 29 అందుకు యేసు, "మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లేఖనాల్లో రాసి ఉన్నది మీరు గ్రహించలేదు. దేవుడికి చనిపోయినవాళ్ళను తిరిగి బ్రతికించే శక్తి ఉన్నదని మీకు తెలియదు.
\v 30 ఆ స్త్రీ ఎవ్వరికీ భార్యగా ఉండదు. ఎందుకంటే దేవుడు బ్రతికించిన వాళ్ళు పరలోకంలో దేవదూతలుగా మారిపోతారు. అక్కడ ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు."
\s5
\p
\v 31 "అయితే తిరిగి బ్రతికిన వాళ్ళను గురించి దేవుడు మాట్లాడాడు. దీనిని మీరు చదివే ఉంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయిన చాలాకాలం తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ,
\v 32 "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కొలిచిన దేవుణ్ణి" అన్నాడు. చనిపోయిన వాళ్ళు దేవుని ఆరాధించలేరు. బ్రతికి ఉన్నవాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు. కనుక చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంకా బ్రతికి ఉన్నాయని మనం నమ్మాలి" అన్నాడు.
\p
\v 33 యేసు చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 34 సద్దూకయ్యులు యేసుతో వాదించడానికి వెళ్ళి యేసు ఇచ్చిన జవాబులకు ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చారని పరిసయ్యులు తెలుసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. యేసుని కలుసుకుని ఆయనతో ఏ ఏ విషయాలు మాట్లాడాలో సిద్ధం చేసుకున్నారు.
\v 35 దేవుడు మోషేకి ఇచ్చిన చట్టాలు బాగా చదివిన న్యాయవాది ఒకడు వాళ్ళలో ఉన్నాడు. అతడు యేసుతో వాదించడానికి సిద్ధపడ్డాడు.
\p
\v 36 అతడు యేసుతో, "బోధకా, దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞల్లో అత్యంత ముఖ్యమైనది ఏది?" అని అడిగాడు.
\s5
\p
\v 37 రాసిఉన్న ఆజ్ఞలను యేసు అతనికి గుర్తుచేస్తూ, "నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ కోరికల్లో, నీ ఆలోచనల్లో, నీ పనుల్లో ఆయన ప్రేమను చూపించాలి.
\v 38 ఇదే దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైనది."
\s5
\p
\v 39 "తరువాతి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, "నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి."
\v 40 ఈ రెండు ఆజ్ఞలు మోషే రాసిన పుస్తకాల్లో, ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో ప్రధానమైనవి."
\s5
\p
\v 41 పరిసయ్యులు ఒకచోట గుమిగూడి ఉన్నప్పుడు యేసు వాళ్ళను ఇలా అడిగాడు,
\v 42 "మెస్సీయ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎవరి వంశానికి చెందినవాడు?" అందుకు వాళ్ళు, "ఆయన దావీదు వంశంవాడు" అని బదులిచ్చారు.
\s5
\v 43 అప్పుడు యేసు, "మెస్సీయ దావీదు వంశానికి చెందినవాడైతే దావీదు ఆయనను "ప్రభూ" అని పిలువనక్కరలేదు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనను అలా పిలిచాడు.
\v 44 దావీదు మెస్సీయ గురించి రాస్తూ, "దేవుడు నా ప్రభువుతో, నేను నీ శత్రువులను నీ కాళ్ళకింద ఉంచేవరకూ నేను నిన్ను ఘనపరిచే విధంగా నా కుడిపక్కన కూర్చో" అని పలికాడు."
\s5
\p
\v 45 "కాబట్టి దావీదు మెస్సీయను "నా ప్రభూ" అని పిలిచాడంటే ఆయన దావీదు వంశం వాడు ఎలా అవుతాడు? ఆయన దావీదు కంటే గొప్పవాడు."
\v 46 యేసు మాటలు విన్నవారిలో ఎవరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. దీని తరువాత ఆయనను ఇరకాటంలో పెట్టాలని చూసే ఎలాంటి ప్రశ్నా అడగడానికి వాళ్ళు సాహసించలేదు.
\s5
\c 23
\p
\v 1 అప్పుడు యేసు గుంపు గూడిన జనంతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 "మన యూదు ధర్మశాస్త్ర నియమాలను బోధించే పరిసయ్యులూ, వాళ్ళ మనుషులూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం మోషేకిచ్చిన ధర్మశాస్త్రం అర్థం చెప్పడం కోసం మాత్రమే తామున్నట్టు అనుకుంటారు.
\v 3 మీరు ఒకటి చెయ్యండి, వాళ్ళు మీకు ఏది బోధిస్తే దాన్ని తప్పకుండా పాటించండి గానీ, వాళ్ళు చేసే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేయమని చెప్తారు గానీ వాటిని వాళ్ళే చేయరు."
\s5
\p
\v 4 "చెయ్యడానికి కష్టమైనా ఎన్నో నియమాలు పాటించమని వాళ్ళు మీకు చెప్తారు. గానీ ఆ చెప్పిన నియమాల్ని అనుసరించడంలో కొంచెం కూడా సహాయం చెయ్యరు. ఇదెలా ఉందంటే మోయలేనంత బరువు మోపులు కట్టి మోయమని ఒక మనిషి భుజాల మీద పెట్టినట్టుంది. అయితే వాళ్ళు అది మోసేందుకు సహాయానికి మాత్రం తమ చిటికెన వేలు కూడా కదిలించరు.
\v 5 వాళ్ళు ఏ పని చేసినా, మనుషులకు కనబడాలనే, తమను చూసి మెచ్చుకోవాలనే చేస్తారు. ఉదాహరణకు, తమ చేతులపై రాసిన రక్ష రేకులను ఇంకొంచెం వెడల్పుగా చేసుకుంటారు. దేవుణ్ణి గౌరవించేవాళ్ళు అని మనుషులు అనుకోవాలని తమ అంగీల కుచ్చులు పెద్దగా చేసుకుంటారు."
\s5
\p
\v 6 " మనుషులంతా తమను గొప్ప చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఉదాహరణకు, విందుల్లో బాగా గొప్ప వాళ్ళు కూర్చునే చోట కూర్చుంటారు. సమాజ మందిరాల్లో కూడా గొప్ప ఆసనాలే కోరుకుంటారు.
\v 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, "బోధకా, బోధకా" అని పిలిపించుకోవడం వీళ్ళకి చాలా ఇష్టం."
\s5
\p
\v 8 "కాబట్టి శిష్యులారా, మీరు మాత్రం ఆ యూదు బోధకుల్లాగా "బోధకా, బోధకా" అని పిలిపించుకోవద్దు. నేను మాత్రమే మీ బోధకుణ్ణి. అంటే అర్థం మీరందరూ సోదరీ సోదరులు, అందరూ సమానమే.
\v 9 ఈ భూమి మీద, "తండ్రి" అని ఎవ్వరూ పిలిపించుకోవద్దు. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడే మీ అసలైన తండ్రి.
\v 10 అంతే కాదు, మనుషుల చేత మీరు "గురువు" అని పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తే మీ ఏకైక గురువు."
\s5
\p
\v 11 "దేవుడు మీ అందరిలో మిమ్మల్నే ముఖ్యులుగా గుర్తించాలనుకుంటే మీరు సేవకుల్లాగా ఇతరులకు సేవ చేసేవారి లాగా ఉండాలి.
\v 12 తనకు తానే గొప్పవాడిని అని గొప్పలు చెప్పుకునే వాణ్ణి దేవుడు అణిచి వేస్తాడు, ఎవరైతే మేము చాలా తక్కువ వాళ్ళం అనుకుంటారో వాళ్ళని దేవుడు నిజంగా గౌరవిస్తాడు."
\s5
\p
\v 13-14 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! ఎందుకంటే పరలోక రాజ్య అధికారం కిందికి మీరు రారు, ఇతరులను కూడా రానివ్వరు. మీరూ వెళ్లరు, వాళ్ళనీ రానివ్వరు."
\p
\v 15 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషదారులు! అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరు చెప్పే బోధల్ని ఒక్క మనిషితో నమ్మించడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. ఎంతో కష్టపడితే గానీ ఒక వ్యక్తిని కూడా మీ బోధలు నమ్మేలా చేయలేరు. ఎట్టకేలకు మీరు బోధించిన దాన్ని ఎవరైనా నమ్మి మీ దగ్గరకి వస్తే, అతణ్ణి మీకంటే రెండింతలు ఎక్కువ నరకపాత్రుడుగా చేస్తారు."
\s5
\p
\v 16 "యూదు నాయకుల్లారా, అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరే గుడ్డి వాళ్ళు, అయినా మీరు ఇతరులను నడిపించాలని చూస్తున్నారు. మీరు, "కోవెల ఏదో ఒక మనిషి అన్నట్టుగా దానిమీద ఒట్టు పెట్టుకొని ఒక పని చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ కోవెలలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం అతడు ఆ మాటకి కట్టుబడి ఉండాలని మీరు చెప్తారు.
\v 17 మీరు బుద్ధి లేని వాళ్ళలా, గుడ్డివాళ్ళలా ఉన్నారు. కోవెలలోని బంగారం గొప్పదే గానీ, కోవెల అంతకన్నా గొప్పది కదా! ఎందుకంటే దేవుని కోసం ఆ బంగారాన్ని పవిత్ర పరిచేది దేవాలయమే కదా!"
\s5
\p
\v 18 "అలాగే బలిపీఠం ఒక వ్యక్తి అన్నట్టు దాని మీద ఒట్టు పెట్టుకొని అలా చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం ఆ మాటకి కట్టుబడి తీరాల్సిందే అని కూడా మీరు చెప్తారు.
\v 19 మీరు గుడ్డివాళ్ళులా ఉన్నారే! బలిపీఠం మీద ఉన్న అర్పణ గొప్పదే గానీ ఆ అర్పించిన అర్పణను దేవునికోసం పవిత్ర పరిచే బలిపీఠం అంతకన్నా గొప్పది కదా!"
\s5
\p
\v 20 "బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, బలిపీఠం తోడనే కాకుండా దానిపై ఉన్న అర్పణ తోడని కూడా ఒట్టుపెట్టుకుంటున్నాడు.
\v 21 అవును, అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునే వాడు దేవాలయం తోడనీ, దానిలో నివసించే దేవుని తోడని కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడన్న మాట.
\v 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునేవాడు, దేవుని సింహాసనం తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో దానిపై కూర్చున్న దేవుని తోడనీ ఒట్టు పెట్టుకుంటున్నాడు."
\s5
\p
\v 23 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, అయ్యో, మిమ్మల్ని దేవుడు ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు కపట వేషదారులు. ఎందుకంటే, పుదీనా, సోంపు, జీలకర్రల్లో దేవునికి పదో వంతు ఇస్తారు గానీ, వీటికంటే ఎంతో ప్రాముఖ్యమైన దేవుని నియమాలకు మాత్రం లోబడరు. ఉదాహరణకు, మీరు పక్కవారి విషయంలో న్యాయంగా ఉండరు, జాలీ, కరుణా చూపించరు. వాళ్ళ వస్తువుల్ని బలవంతంగా లాగేసుకుంటారు. పుదీనాలో, సొంపులో పదో వంతు దేవునికి ఇవ్వడం మంచిదే గానీ, దేవుని ఆజ్ఞలు పాటించడం మరీ ముఖ్యం.
\v 24 మీరు గుడ్డివాళ్ళు. అయినాగానీ మీకేదో కనపడుతున్నట్టు పక్కవాడికి దారి చూపడానికి ప్రయత్నిస్తారు. దేవుడికి కోపం తెప్పించ కూడదని మంచి నీళ్ళు తాగేటప్పుడు చిన్న పురుగును కూడా వడకట్టి చూసుకుంటూ జాగ్రత్తగా తాగుతారు. కానీ మీ ప్రవర్తన ఎంత అధ్వాన్నంగా ఉందంటే, మీరు ఒంటెల్ని మింగేసేవాళ్ళ లాగా ఉన్నారు."
\s5
\p
\v 25 "కపట వేషదారులైన ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు బయటికి చాలా మంచివాళ్ళలాగా కనిపిస్తారు. చాలా నిజాయితీపరులని ఇతరులు అనుకునేలా బయటి వాళ్ళకి గొప్పగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే నిజానికి వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేస్తూ అత్యాశతో మీ స్వంత సుఖభోగాల కోసం వాళ్లకు చెందినవాటన్నిటినీ లాగేసుకుంటారు. మీరు బయట శుభ్రంగా ఉన్న గిన్నె, పళ్ళెం లాంటి వాళ్ళు. అవి బయట చాలా శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, లోపలంతా మురికిగా ఉంటాయి.
\v 26 గుడ్డి వాళ్లైన పరిసయ్యులారా, ముందు మీరు పక్కవాడి దగ్గర దోచుకోవడం మానెయ్యండి. అప్పుడు లోపలా, బయటా, రెండు వైపులా శుభ్రంగా ఉన్న పాత్రల్లాగా నిజాయితీగా ఉండగలుగుతారు."
\s5
\p
\v 27 "కపట వేషదారులారా, ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు సమాధుల మీద ఉన్న కట్టడాల్లాటి వాళ్ళు. అవి సున్నం వేసి ఉండటం వలన మనుషులు వాటిని చూసి, సమాధులని గమనించి వాటిని ముట్టి మైల పడకుండా పక్కనుండి వెళ్ళిపోతారు. అవి బయటికి అందంగా కనిపిస్తాయి గానీ, వాటి లోపలంతా చనిపోయిన వారి ఎముకలతో, కుళ్ళు వాసనతో నిండి ఉంటుంది.
\v 28 మీరు ఆ సమాధుల్లాటి వాళ్ళు. మనుషులు మీ వైపు చూసినప్పుడు మీరు చాలా నిజాయితీగా, నీతిమంతుల్లాగా కనిపిస్తారు. గానీ, లోపల మీరు కపట వేషధారులు. ఎందుకో తెలుసా, మీరు దేవుని ఆజ్ఞలకు లోబడనే లోబడరు."
\s5
\p
\v 29 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు. దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! పూర్వ కాలంలో ఎవరో చంపిన ప్రవక్తల సమాధులు తిరిగి మళ్ళీ కట్టిస్తున్నారు. నీతిమంతుల స్తూపాలను అలంకరిస్తున్నారు.
\v 30 మీరు "మా పూర్వికులు జీవించిన కాలంలో మేము ఉండి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో మేము వాళ్ళతో కలిసే వాళ్ళమే కాదు" అంటారు.
\v 31 ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపినవాళ్ళ సంతానం నుండి వచ్చామని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళ లాటి వాళ్ళే."
\s5
\p
\v 32 "ఇంకేంటి, మీరు కూడా మీ పూర్వీకులు చేసిన పాపాలను పూర్తి చేసేయండి.
\v 33 మీరు దుష్టులు. విష సర్పాల కంటే కూడా ప్రమాదకరమైన వాళ్ళు. మీరు తప్పకుండా దేవుని శిక్షనుండి, అంటే నరక శిక్ష నుండి తప్పించుకుంటామని బుద్ధిహీనంగా అనుకుంటారు."
\s5
\p
\v 34 "కాబట్టి వినండి, అందుకే నేను ప్రవక్తలనూ, పండితుల్నీ, బోధకుల్నీ పంపుతాను. వాళ్ళల్లో మీరు కొందరిని సిలువ వేసీ, కొందరిని మరో రకంగానూ చంపుతారు. కొంతమందినేమో సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొంతమందిని ఊరినుండి తరిమి తరిమి కొడతారు.
\v 35 ఆదాము కొడుకూ నీతిమంతుడూ అయిన హేబెలు మొదలు, పరిశుద్ధ స్థలానికీ, బలిపీఠానికీ మధ్యలో మీ పూర్వికులు చంపిన బరక్యా కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధం అంతా మీ మీదికి వస్తుంది.
\v 36 నా పరిచర్యను గమనిస్తున్న మీరు దీని గురించి ఆలోచించండి. ఆ ప్రవక్తలను చంపినందుకు దేవుని శిక్ష వారి మీదికి కచ్చితంగా వస్తుందని మీతో చెబుతున్నాను."
\s5
\p
\v 37 "యెరూషలేము ప్రజలారా, పూర్వకాలం నుండీ ప్రవక్తలను చంపుతూ, దేవుడు మీ దగ్గరకు పంపిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపినవాళ్ళు మీరు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్టు ఎన్నో సార్లు నేను మిమ్మల్ని పోగుచేసి కాపాడాలని అనుకున్నాను కానీ మీరు నన్ను అలా చేయనివ్వ లేదు.
\v 38 కాబట్టి ఇక వినండి. మీ పట్టణం మనుషులు నివసించడానికి వీలు లేనిదిగా తయారవుతుంది.
\v 39 ఇది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ తిరిగి రావడం మీరు చూస్తారు. అప్పుడు "దేవుని అధికారంతో వస్తున్న ఈ మనిషి దేవునికెంతో ప్రియమైనవాడు" అని మీరు నా గురించి చెప్పుకుంటారు."
\s5
\c 24
\p
\v 1 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో నడుస్తూ, ఈ దేవాలయ భవనాలు ఎంత అందంగా ఉన్నాయో అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.
\v 2 అప్పుడాయన, "మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భవనాల గురించి ఒక నిజాన్ని చెబుతున్నాను వినండి. ఒక సైన్యం వీటిని కచ్చితంగా సమూల నాశనం చేసేస్తుంది. ఈ భవనాల్లో ఉన్న ప్రతీ రాయినీ ఒకదానిపై ఒకటి ఉండకుండా కూలగొట్టేస్తారు" అని వారితో అన్నాడు.
\s5
\p
\v 3 తరువాత, యేసు ఒలీవకొండ మీద ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో శిష్యులు ఆయన దగ్గరికెళ్ళి, "కోవెల గురించి నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమి జరుగుతుంది? లోకాంతం అయ్యేటప్పుడు ఎలా తెలుస్తుంది? మాకు చెప్పు" అని అడిగారు.
\p
\v 4 యేసు, "నేను చెప్పేదేమిటంటే లోకాంతంలో ఏమి జరుగుతుంది అనే విషయాల్లో ఎవ్వరు మిమ్మల్నిమోసం చేయకుండా చూసుకోండి!
\v 5 చాలా మంది నా పేరు చెప్పి వచ్చి "నేనే క్రీస్తుని" అని చెబుతారు. మరీ ముఖ్యంగా, "నేనే మెస్సీయని" అని చెబుతారు. అలా వాళ్ళు చాలా మందిని దారి తప్పేలా చేస్తారు."
\s5
\p
\v 6 "మీరు యుద్ధాల గురించీ, యుద్ధ వార్తల గురించీ వింటారు. కాబట్టి మీరు కంగారు పడకండి. ఇవన్నీ జరిగి తీరాలని దేవుడే చెప్పాడని మనసులో ఉంచుకోండి. అయితే ఇవి జరిగినప్పుడు లోకం అంతమయ్యే కాలం వచ్చేసిందని మాత్రం కాదు. అంతం వెంటనే రాదు.
\v 7 మనుషుల్లో గుంపుల మధ్య ఘర్షణలూ, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం కాలు దువ్వడాలూ, కరవులూ, భూకంపాలూ కలుగుతాయి.
\v 8 ఇవన్నీ బిడ్డ పుట్టటానికి ముందు గర్భిణీ స్త్రీకి వచ్చే ప్రసూతి నొప్పుల్లాటివి. ఇవి కష్టాలకు ఆరంభం మాత్రమే."
\s5
\p
\v 9 "చాలా ఘోరాలు జరుగుతాయి. మనుషులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు. మీరు నన్ను విశ్వసించడం వల్ల నా గురించి మనుషులంతా మిమ్మల్ని అసహ్యించుకుంటారు.
\v 10 అంతే కాదు, ఆ హింసలు చూసి అనేకమంది వెనక్కి తగ్గుతారు. వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని తమ సాటి విశ్వాసుల్ని శత్రువులకు పట్టిస్తారు.
\v 11 కపట ప్రవక్తలు అనేకమంది వచ్చి, ప్రవక్తలం అని అబద్ధాలు చెప్పి ఎంతో మందిని మోసం చేస్తారు."
\s5
\p
\v 12 "దేవుని ఆజ్ఞలకు లోబడక పోవడం వల్ల ఎక్కువమందిలో అన్యాయం పెరిగిపోయి విశ్వాసులు చాలామందిలో ప్రేమ అణగారిపోతుంది. ఒకరి నొకళ్ళు ప్రేమించుకోవడం మానేస్తారు.
\v 13 అయితే ఎవరు చివరి వరకు దేవునిపై నమ్మకం ఉంచి నిలబడతారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు.
\v 14 రాబోయే రోజుల్లో దేవుడు లోకాన్నంతటినీ ఎలా పరిపాలిస్తాడో తెలిపే శుభవార్తను విశ్వాసులు లోకమంతా తెలియజేస్తారు. ఆ తరవాత లోకం అంతరించిపోతుంది."
\s5
\p
\v 15 "అయితే, లోకం అంతరించక ముందు ఒక అసహ్యాన్ని పుట్టించే వినాశనకారి పరిశుద్ధ దేవాలయాన్ని మైలపడేలా చేసే ఒక హేయమైన వస్తువును దేవాలయంలో ఉంచి ప్రజలను లోపలి రాకుండా అడ్డుకుంటాడు. దీనిగురించి చాలా కాలం క్రితమే దానియేలు ప్రవక్త రాశాడు. ఇప్పుడు దీన్ని చదువుతున్న వారందరూ ఒకసారి దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఇది నా హెచ్చరిక.
\v 16 దేవాలయంలో ఇలా జరగ్గానే యూదా ప్రాంతంలో ఉన్నవాళ్ళందరూ ఎత్తైన కొండలకి పారిపోవాలి.
\v 17 పారిపోయే ముందు ఇంటి బయట ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోడానికి లోపలి వెళ్ళకూడదు.
\v 18 పొలంలో పని చేసేవాళ్ళు పారిపోయే ముందు తమ బట్టలు తీసుకెళ్ళడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు."
\s5
\p
\v 19 "అయ్యో, ఆ రోజుల్లో గర్భవతుల పరిస్థితీ, చంటిపిల్లల తల్లుల పరిస్థితీ ఎంత ఘోరంగా ఉంటుందో! ఎందుకంటే వాళ్ళు మహా బాధలకు గురౌతారు. వాళ్ళకి పారిపోవడం ఎంతో కష్టం.
\v 20 ఆ పారిపోయే సమయం శీతాకాలం గానీ, విశ్రాంతి దినం గానీ రాకుండా చూసుకోండి.
\v 21 ఎందుకంటే ఆ సమయంలో మనుషులందరూ తీవ్రమైన శ్రమలకు గురౌతారు. సృష్టి మొదలైనప్పటి నుంచీ ఇంత బాధలు ఎప్పుడూ పొందలేదు, భవిష్యత్తులో పొందరు కూడా.
\v 22 దేవుడు గనుక ఆ రోజుల్ని తగ్గించకపోతే ప్రతి ఒక్కళ్ళూ చనిపోతారు. అయితే ఆయన ఎన్నుకున్న ప్రజల కోసం ఆ రోజులు తగ్గించడానికి తీర్మానించుకున్నాడు."
\s5
\p
\v 23 "ఆ సమయంలో మీతో ఎవరైనా, ఇదిగో మెస్సీయ ఇక్కడ ఉన్నాడనీ, అదుగో అక్కడ ఉన్నాడనీ మీతో చెప్తే మీరు నమ్మవద్దు.
\v 24 వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి రక రకాల అద్భుతాలూ, నోరు వెళ్ళబెట్టి చూసే ఎన్నెన్నో మాయలూ, మీ కళ్ళముందు కనపరుస్తారు. ఆఖరికి దేవుడెన్నుకున్న మిమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
\v 25 ఇదిగో, ఇవన్నీ జరక్క ముందే నేను మీతో చెబుతున్నానని మర్చిపోవద్దు."
\s5
\p
\v 26 "కాబట్టి ఎవరైనా మీతో, ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడనీ, గది లోపల ఉన్నాడనీ చెప్పినా సరే మీరు నమ్మొద్దు.
\v 27 మెరుపు తూర్పున తళుక్కుమని మెరిసి పడమర వైపు అందరూ చూసేటట్టు ఎలా కన్పిస్తుందో, అలాగే మనుషకుమారుడి రాక ఉంటుంది.
\v 28 రాబందులన్నీ ఒకే చోట పోగైతే ఎదో ఒక జంతు కళేబరం అక్కడ ఉండి ఉంటుందని సులువుగా తెలిసినట్టే. ఆయన రాక అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.
\s5
\v 29 మనుషులకు బాధలు అయ్యిపోయిన వెంటనే సూర్యుని చీకటి కమ్ముతుంది. చంద్రుడు ఇంక కాంతిని ఇవ్వలేడు. ఆకాశం నుండి నక్షత్రాలన్నీరాలిపోతాయి. ఆకాశంలో ఉన్నవస్తువుల స్థానాలన్నిటినీ దేవుడు కదిలించేస్తాడు."
\s5
\p
\v 30 "తరువాత, ఆకాశంలో మనుషకుమారుడు వచ్చే కదలికలు అందరూ స్పష్టంగా చూస్తారు. భూమి మీద ఉన్న ఆయన్ని నమ్మని అన్నిరకాల జాతుల ప్రజలూ ఆయన్ని చూసి గుండెలు బాదుకుని ఏడుస్తారు. వాళ్ళు మనుషకుమారుడు మేఘాల్లో, మహా శక్తితో, మహా మహిమతో రావడం చూస్తారు.
\v 31 ఆయన పరలోకం నుండి తన దూతల్ని భూమి నాలుగు పక్కలకి పంపుతాడు. ఆ దూతలు గొప్ప బూర శబ్దం వినీ వినగానే భూమి మీద దేవుడు ఎన్నుకొన్నఆయన ప్రజలందర్నీ ఒకచోటికి సమకూరుస్తారు."
\s5
\p
\v 32 "అంజూరుు చెట్టు ఎదిగే విధానం గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకోండి. దాని కొమ్మలు లేతగా ఉండి దాని ఆకులు చిగిరిస్తూ ఉంటే గనక వేసవి కాలం దగ్గర పడిందని అర్థం అవుతుంది.
\v 33 అలాగే మీరు ఈ సంగతులన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన రాక సమీపంగా ఉందని మీరు గ్రహించాలి."
\s5
\p
\v 34 "ఈ సంగతులన్నీ ముందునుండీ గమనించిన వాళ్ళు చనిపోక ముందే ఇవన్నీ జరుగుతాయని కచ్చితంగా చెబుతున్నాను.
\v 35 నేను చెప్పిన ఈ సంగతులు కచ్చితంగా జరగబోతున్నాయి. ఆకాశమూ, భూమీ ఒకానొక రోజు గతించిపోతాయి గానీ, నేను చెప్పే మాటలు మాత్రం ఎప్పుడూ నిజమౌతాయి."
\s5
\p
\v 36 "అయితే ఇదెప్పుడు జరుగుతుంది అనే విషయం, అంటే, ఆ రోజు గానీ ఆ గంట గానీ, ఏ మనిషికీ గానీ, పరలోకంలో ఉన్న దూతలకు గానీ, చివరికి కుమారుడికి కూడా తెలియదు. ఒక్క తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు."
\s5
\p
\v 37-39 "నోవహు జీవించిన రోజుల్లో ఎలా ఉండేదో అలాగే రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నది. ఆ మనుషులకు జలప్రళయం వచ్చేవరకు కూడా తమకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనే ఆలోచన కూడా లేదు. ఎప్పటి లాగానే వాళ్ళు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తల్లిదండ్రులు వారి కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు. నోవహు, అతని కుటుంబం, ఓడలోకి వెళ్ళే రోజు వరకు కూడా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి ఓడలో ఉన్నవారు తప్ప మిగిలినవాళ్ళంతా కొట్టుకుపోయే వరకూ వాళ్ళ కళ్ళు తెరుచుకోలేదు. అచ్చం అలాగే దేవుని నమ్మని వాళ్ళు కూడా మనుష కుమారుని రాకను తెలుసుకోలేరు."
\s5
\p
\v 40 "ఆయన రాక సంభవించినప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళలేరు. ఉదాహరణకు, పొలంలో ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళలో ఒక్కడు మాత్రమే వెళ్ళిపోతాడు. ఇంకొకడు శిక్ష పొందడానికి మిగిలిపోతాడు.
\v 41 అలాగే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తిరగలి విసురుతూ ఉండగా ఒకామె వెళ్ళిపోతుంది. ఇంకొకామె మిగిలిపోతుంది.
\v 42 కాబట్టి ఏరోజున ప్రభువు భూమి మీదకు వస్తాడో మీకు తెలియదు కాబట్టి అన్ని సమయాల్లో మెలకువగా ఉండండి."
\s5
\p
\v 43 "దొంగలు రాత్రి ఏ సమయంలో వస్తారో ఆ ఇంటి యజమానికి తెలిసిపోతే, అతడు మెలకువగా ఉండి, దొంగతనం చేయనివ్వడు కదా! అలాగే మనుష్యకుమారుడు అనుకోని సమయంలో ఒక దొంగ లాగా వస్తాడు.
\v 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్యకుమారుడు భూమి మీదకి వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి."
\s5
\p
\v 45 "ఒక నమ్మకమైన, తెలివైన సేవకుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న ఒక సేవకుణ్ణి, మిగిలిన సేవకులందరి మీదా మేనేజర్ గా నియమించాడు. అతడు వారందరికీ సమయానికి భోజనం పెట్టమని చెప్పాడు. తరవాత అతడు దూర ప్రయాణమై పోయాడు.
\v 46 యజమాని చాలా కాలం తరవాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు తన పని నమ్మకంగా చేసినట్టు గమనిస్తే అతడు చాలా సంతోషిస్తాడు.
\v 47 అతడు ఆ సేవకుణ్ణి తన ఆస్తి అంతటి మీదా మేనేజర్ గా నియమిస్తాడు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను."
\s5
\p
\v 48 "అయితే అలా కాకుండా, అతడు ఒక దుష్టుడైన కపట సేవకుడైతే తనలో తాను, "ఆ, ఏముందిలే, నా యజమాని చాలా దూరం ప్రయాణమై వెళ్ళాడు, ఇప్పట్లో రాడు, నేనేమి చేసినా అతడు కనుక్కోలేడు" అనుకొని
\v 49 తన తోటి సేవకులందరినీ కొడుతూ తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ జల్సా చేస్తూ ఉంటాడు.
\v 50 అప్పుడు అతడు ఊహించని సమయంలో, అతడు ఎదురు చూడని రోజున అతని యజమాని తిరిగి వస్తాడు.
\v 51 అతడు ఆ సేవకుణ్ణి చూసి, కఠినంగా శిక్షించి కపట వేషధారులుండే చోట అతణ్ణి పడవేస్తాడు. అక్కడి మనుషులు యాతన తట్టుకోలేక ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు."
\s5
\c 25
\p
\v 1 "పరలోకం నుండి దేవుని పరిపాలనను ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి ఒక పెళ్ళివిందుకు వెళ్ళారు. వాళ్ళు దీపాలు పట్టుకుని పెళ్ళికొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు.
\v 2 ఇందులో ఐదుగురు తెలివి గలవాళ్ళు, ఐదుగురు తెలివి తక్కువ వాళ్ళు.
\v 3 అయితే, తెలివి తక్కువ కన్యలు దీపాలు పట్టుకున్నారు గానీ వాటిలో నూనె అయిపోతే అదనంగా కావలసిన ఒలీవ నూనె తీసుకెళ్ల లేదు.
\v 4 అయితే తెలివి గల కన్యలు మాత్రం దీపాలలో కావలసిన నూనెతో బాటు, సీసాల్లో కూడా అదనంగా నూనె వేసి తెచ్చుకున్నారు."
\s5
\p
\v 5 "పెళ్ళి కొడుకు రావడానికి చాల సమయం తీసుకున్నాడు. రాత్రి చాలా ఆలస్యమైపోయింది. అయితే కన్యలందరూ అలసిపోయి మత్తుగా నిద్ర పోయారు.
\v 6 అర్ధ రాత్రి వేళ, "ఇదిగో, పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆయన్ని కలుసుకోండి!" అని కొందరు అరుస్తూ వాళ్ళని నిద్ర లేపారు."
\s5
\p
\v 7 "అమ్మాయిలు అందరూ లేచి తమ దీపాలను సరి చేసుకొని వెలిగించుకున్నారు.
\v 8 అప్పుడు తెలివి తక్కువ కన్యలు తెలివైన వారితో, "మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి, మీ నూనె కొంచెం మాకిస్తారా?" అని అడిగారు.
\v 9 దానికి వాళ్ళు, "మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి" అని చెప్పారు.
\s5
\v 10 అయితే, ఈ తెలివి తక్కువ కన్యలు నూనె కొనుక్కోడానికి వెళ్తుండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు కన్యలు పెళ్ళికొడుకుతో కలిసి పెళ్ళికూతురు కనిపెడుతూ ఉన్న పెళ్ళి హాల్లోకి వెళ్ళారు. వెంటనే తలుపు మూసేశారు."
\p
\v 11 "ఆ తరవాత మిగిలిన కన్యలు పెళ్ళి వేడుక దగ్గరికి వచ్చి "ప్రభూ, తలుపు తెరవండి" అని పెళ్ళి కొడుకుని అడిగారు.
\v 12 కానీ, పెళ్ళి కొడుకు వారితో, "మీరెవరో నిజంగా నాకు తెలీదు. కాబట్టి నేను మీకోసం తలుపు తీయను" అన్నాడు."
\p
\v 13 యేసు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు, "ఈ విధంగా మీకు జరక్కూడదు కాబట్టీ, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆ గంటైనా, రోజైనా మీకు తెలీదు కాబట్టీ, మెలకువగా ఉండండి."
\s5
\p
\v 14 "మనుష్యకుమారుడు రాజుగా ఏలడానికి పరలోకం నుండి తిరిగిరావడం దూర ప్రయాణం వెళ్ళబోతున్న ఒక మనిషి పోలికగా ఉంది. అతడు ప్రయాణానికి వెళ్ళే ముందు తన సేవకులందరినీ పిలిచి, వాళ్ళకి తన ఆస్తిలో కొంత సొమ్ము ఇచ్చి, తాను తిరిగి వచ్చేంతవరకు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి తనకోసం మరింత సంపాదించమని చెప్పాడు.
\v 15 అతడు ఆ ఆస్తిని ఉపయోగించడంలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి పంచి ఇచ్చాడు. ఉదాహరణకు, ఒక సేవకునికి 165 కిలోల బరువైన 5 సంచుల బంగారం ఇస్తే, ఇంకొక సేవకునికి 66 కిలోల బరువైన రెండు సంచుల బంగారాన్నీ, ఇంకొకడికి 33 కిలోల బరువైన ఒక సంచి బంగారాన్నీ ఇచ్చాడు. తరవాత అతడు ప్రయాణమై వెళ్ళిపోయాడు.
\v 16 ఐదు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వెంటనే వెళ్ళి, దానితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు సంచుల బంగారాన్ని సంపాదించాడు."
\s5
\p
\v 17 అలాగే, రెండు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వ్యాపారం చేసి, ఇంకో రెండు సంచుల బంగారాన్ని సంపాదించాడు.
\v 18 అయితే ఒక్క సంచి బంగారం తీసుకున్న సేవకుడు వెళ్ళి, నేలలో గుంట తవ్వి, జాగ్రత్తగా ఉంటుందని అక్కడ దాచిపెట్టాడు."
\s5
\p
\v 19 "చాలా కాలం తరవాత ఆ యజమాని తిరిగి వచ్చాడు. తన సేవకులందరినీ పిలిచి, తానిచ్చిన డబ్బుతో ఎలా వ్యాపారం చేశారు అని లెక్కలడిగాడు.
\v 20 ఐదు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు 10 సంచులు తెచ్చాడు. అతడు, "అయ్యగారూ, మీరు నాకు ఐదు సంచుల బంగారం ఇచ్చారు. చూడండి, వాటితో వ్యాపారం చేసి, ఇంకా అదనంగా ఐదు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు.
\v 21 దానికి ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులమీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."
\s5
\p
\v 22 "రెండు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు కూడా వచ్చి, యజమానితో, "అయ్యగారూ, మీరిచ్చిన రెండు సంచుల బంగారాన్ని జాగ్రత్తగా వాడాను. చూడండి, వాటితో వ్యాపారం చేసి అదనంగా రెండు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు.
\v 23 అందుకు ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులకు నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."
\s5
\p
\v 24 "ఒక సంచి బంగారం తీసుకున్న సేవకుడు వచ్చి యజమానితో, "అయ్యగారూ, మీరు నన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను. మీరు మీది కానిదీ, పెట్టుబడి ఏమీ పెట్టని పెద్ద మొత్తాలనూ, ఇతరులనుండి లాక్కునేంత కఠినాత్ములనీ, వేరేవారు నాటిన పంటను కోసుకొనే వాళ్ళనీ నాకు తెలుసు.
\v 25 ఈ డబ్బు పోతే మీరేం చేస్తారో అని భయపడి దీనిని భూమిలో పాతిపెట్టాను. ఇదిగో, దయచేసి తీసేసుకోండి" అన్నాడు.
\s5
\v 26 అప్పుడు ఆ యజమాని, "నువ్వు సోమరిపోతువి, పనికిమాలిన చెడ్డ సేవకుడివి. నేను పెట్టుబడి కూడా పెట్టకుండా ఎక్కువ మొత్తాన్ని లాక్కునేంత కఠినాత్ముడననీ, ఎవడో నాటిన పంటను కోసుకొనేవాడిననీ నీకు తెలుసు కదా.
\v 27 అలాంటప్పుడు కనీసం నా డబ్బులు బ్యాంక్ లో వేసి ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు వాటిని వడ్డీతో సహా తీసుకొనేవాడిని కదా."
\s5
\v 28 అప్పుడు ఆ యజమాని తన సేవకులతో, "అతని దగ్గర ఉన్న సంచెడు బంగారాన్ని తీసేసి పది సంచీలు బంగారం సంపాదించిన సేవకునికి ఇచ్చెయ్యండి.
\v 29 దేవుడు ఉన్నదానిని సరిగ్గా ఉపయోగించేవానికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. వాళ్లకి ఎంతో సమృద్ధి ఉంటుంది. కానీ తన దగ్గర ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉపయోగించని వాడి దగ్గరనుండి వాడికి ఇంతకు ముందు ఉన్నది కూడా తీసేస్తాడు.
\v 30 ఆ పనికిమాలిన సేవకుణ్ణి బయట చీకటిలోకి విసిరేయండి. అక్కడ హాహాకారాలు చేస్తూ బాధలు తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటున్నవారితో ఉంటాడు."
\s5
\p
\v 31 "మనుష్యకుమారుడు తన అద్భుతమైన కాంతితో తన దూతలందరితో తిరిగివచ్చి మహా రాజుగా సింహాసనం మీద కూర్చుని ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడు.
\v 32 ప్రజలందరూ సమూహాలుగా ఆయన ముందు నిలబడతారు. అప్పుడు ఒక గొల్లవాడు మేకలనూ గొర్రెలనూ వేరు చేసినట్టు వాళ్ళని వేరుచేస్తాడు.
\v 33 ఆయన మంచివాళ్ళని కుడివైపూ, చెడ్డవారిని ఎడమవైపూ నిలబెడతాడు."
\s5
\p
\v 34 "అప్పుడాయన, కుడివైపున ఉన్నవాళ్ళతో, "నా తండ్రి ఆశీర్వదించిన వాళ్లలారా రండి, లోకాన్ని సృష్టించినప్పటినుండీ మీకోసం సిద్ధం చేస్తున్న మంచి వాటన్నిటినీ, ఆయన రాజ్యాన్నీ మీరు స్వాధీనం చేసుకోండి.
\v 35 ఇవన్నీ మీకోసమే, ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళిచ్చారు. మీ ఊరికి కొత్తగా వస్తే నన్ను పిలిచి మీ ఇళ్ళల్లో ఉండనిచ్చారు.
\v 36 నాకు వేసుకోడానికి బట్టలు లేకపోతే మీరు బట్టలు ఇచ్చారు, నాకు జబ్బు చేస్తే నాగురించి శ్రద్ధ తీసుకున్నారు. నేను జైల్లో ఉంటే, వచ్చి నన్ను పరామర్శించారు" అంటాడు."
\s5
\p
\v 37 "అప్పుడు మంచివాళ్ళు అని దేవుడు పిలిచినవాళ్ళు, "ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేస్తే మేము తినడానికి ఇచ్చాం? ఎప్పుడు దాహం వేస్తే తాగడానికి నీళ్ళిచ్చాం?
\v 38 ఎప్పుడు మా ఊరికి నువ్వు కొత్తగా వస్తే మేము మా ఇంట్లో ఉండనిచ్చాం? ఎప్పుడు నీకు వేసుకోడానికి బట్టలు లేకపోతే బట్టలిచ్చాం?
\v 39 ఎప్పుడు నువ్వు జబ్బు పడ్డావు? ఎప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు? ఎప్పుడు మేము నిన్ను పరామర్శస చేశాం? ఇవేమీ మాకు గుర్తు లేవే!" అంటారు.
\v 40 అప్పుడు రాజు ఇలా అంటాడు, "మీ సహ విశ్వాసులు ఎవరికైనా, లోకంలో బీదా బిక్కీకి ఇలా చేసినా కచ్చితంగా మీరు నాకు చేసినట్టే."
\s5
\p
\v 41 "అయితే రాజు ఎడమవైపు ఉన్నవారిని చూసి, "దేవుడు శపించిన వాళ్ళలారా, నన్ను వదిలిపొండి. దేవుడు సాతానుకూ, అతని దూతలకూ సిద్ధం చేసిన నిత్యం మండే అగ్నిగుండంలోకి పొండి.
\v 42 మీకు అదే సరైంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు తాగడానికి ఏమీ ఇవ్వలేదు.
\v 43 మీ ఊరికి కొత్తగా వస్తే మీ ఇంట్లోకి నన్ను రానీయలేదు, నేను వేసుకోడానికి బట్టలు లేకుండా ఉంటే నాకు బట్టలియ్యలేదు, నేను జబ్బు పడ్డప్పుడూ, జైల్లో ఉన్నప్పుడూ కూడా నన్ను చూడ్డానికి రాలేదు" అంటాడు."
\s5
\p
\v 44 "అప్పుడు వాళ్ళు, "ప్రభూ, నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే మేం భోజనం పెట్టలేదు? ఎప్పుడు దాహంగా ఉంటే మేం నీళ్ళివ్వలేదు? ఎప్పుడు కొత్తగా ఊరికొస్తే మా ఇంట్లోకి రానివ్వలేదు? ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే మేం నీకు బట్టలివ్వలేదు? నువ్వెప్పుడు జబ్బుగా ఉంటే, ఎప్పుడు జైల్లో ఉంటే మేము పరామర్శించలేదు?" అని అడుగుతారు."
\p
\v 45 "ఆయన వాళ్లకి ఇలా జవాబిస్తాడు, "నిజానికి నా ప్రజలకూ, ఆఖరికి మీ దగ్గర ఉన్న బీదా బిక్కీకీ ఎలాంటి సాయం చేసినా అది కచ్చితంగా నాకు చేసినట్టే. మీరు వాళ్లకి చేయలేదు కాబట్టి నాక్కూడా మీరు చేయనట్టే."
\p
\v 46 "కాబట్టి నా ఎడం వైపు ఉన్నవాళ్ళు దేవుని నిత్య శిక్ష అయిన అగ్నిగుండంలోకీ, నా కుడివైపు ఉన్నవాళ్ళు దేవునితో కలిసి నిత్యం నివసించే పరలోకానికీ వెళ్ళండి."
\s5
\c 26
\p
\v 1 యేసు ఈ విషయాలన్నీ చెప్పడం ముగించిన తరవాత, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 "రెండు రోజుల తరవాత మనం పస్కా పండగ చేసుకుంటామని మీకు తెలుసు కదా. ఆ సమయంలోనే మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు."
\s5
\p
\v 3 అదే సమయంలో ముఖ్య యాజకులూ, యూదు పెద్దలూ కైఫా అనే ప్రధాన యాజకుడి ఇంట్లో సమావేశమయ్యారు.
\v 4 అక్కడ వాళ్ళు యేసుని ఎలా మోసపూరితంగా, యుక్తిగా పట్టుకుని చంపాలో పథకం రచించారు.
\v 5 అయితే "ఇది పస్కా పండుగ సమయం. మనం ఆ పని ఇప్పుడు చేస్తే ప్రజల్లో అల్లర్లు జరగవచ్చు" అని తమలో తాము అనుకున్నారు.
\s5
\p
\v 6 యేసు, ఆయన శిష్యులు, బేతనియ గ్రామంలో సీమోను ఇంట్లో భోజనం చేస్తున్నారు. యేసు ఇంతకు ముందు సీమోనుకు ఉన్న కుష్టరోగాన్ని బాగుచేశాడు.
\v 7 వాళ్ళు భోజనం చేస్తుండగా ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చింది. ఆమె అందమైన, రాతితో చేసిన ఒక కూజాలో చాలా ఖరీదైన అత్తరును పట్టుకొచ్చింది. ఆమె యేసు భోజనం చేస్తూ ఉండగా, ఆయన దగ్గరకి వెళ్ళి, తలమీద నుండి ఆ అత్తరును పోసింది.
\v 8 అది చూసి శిష్యులకు చాల కోపం వచ్చింది. వాళ్ళలో ఒకడు, "ఈ అత్తరు ఇలా వృధా చేయడం ఏమిటి? ఇది చాలా ఘోరం. ఎంతో నష్టం.
\v 9 దీన్ని గనక మనం అమ్మి ఉంటే ఎంతో డబ్బు వచ్చేది. అప్పుడది పేదవాళ్ళకు దానం చేసేవాళ్ళం కదా!" అన్నాడు.
\s5
\p
\v 10 వాళ్ళు అంటున్న మాటలు యేసు గ్రహించి, "ఈ స్త్రీని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నాకోసం ఎంతో అద్భుతమైన పని చేసింది.
\v 11 పేదవాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉంటారని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి మీరు సాయం చేయొచ్చు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను."
\s5
\p
\v 12 "ఈమె ఈ అత్తరును నా శరీరంపై పోయడం ఎలా ఉందంటే నేను తొందరలో చనిపోతున్నానని ఈమెకు తెలిసిందేమో అన్నట్టుగా ఉంది. అంతే కాదు, ఈ అత్తరు నాపై పోసి నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది.
\v 13 ఈ లోకంలో నా గురించిన సువార్త ప్రకటిస్తున్నప్పుడెల్లా ఈమె చేసిన పని గుర్తు చేసికొని ఈమెనూ, ఈమె చేసిన పనినీ లోకమంతా ప్రశంసిస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
\v 15 అతడు వారిని, "ఒకవేళ నేను యేసును మీకు పట్టిస్తే, మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు?" అని అడిగాడు. వాళ్ళు అతనికి ముప్ఫై వెండి నాణేలు ఇవ్వడానికి ఒప్పుకుని ఆ నాణేలు లెక్కబెట్టి అతనికి ఇచ్చారు.
\v 16 అప్పటినుండి యూదా ఆయన్ని వాళ్ళకి పట్టిచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 17 వారమంతా జరిగే పొంగని రొట్టెల పండగ మొదటి రోజున శిష్యులు యేసు దగ్గరకి వచ్చి, "మనం కలిసి పస్కా పండుగ భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?" అని అడిగారు.
\v 18 యేసు, శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వాళ్ళేం చేయాలో చెప్పాడు. వారితో, "మీరు పట్టణంలోని పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో, "సమయం దగ్గర పడుతోంది. నేను నా శిష్యులతో కలిసి మీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను. భోజనం తయారు చేయడానికి ఈ ఇద్దరినీ పంపుతున్నాను" అని మా గురువు చెబుతున్నాడు అని చెప్పండి" అన్నాడు.
\v 19 యేసు చెప్పినట్టుగా ఆ శిష్యులు చేశారు. వాళ్ళు వెళ్ళి అతని ఇంట్లో యేసు ఆజ్ఞాపించినట్టుగా పస్కా భోజనం తయారు చేశారు.
\s5
\p
\v 20 యేసు సాయంకాలం తన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు.
\v 21 వారందరూ కలిసి భోజనం చేస్తుండగా ఆయన, "జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న ఒకడు కచ్చితంగా నన్ను శత్రువులకు అప్పగిస్తాడు" అన్నాడు.
\v 22 శిష్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళలో ప్రతి ఒక్కడూ "ప్రభువా, అది నేనా?" అని అడగటం మొదలుపెట్టారు.
\s5
\v 23 అప్పుడాయన, "నాతోబాటు భోజనం పాత్రలో చేయి పెట్టి, భోజనం చేస్తున్నవాడే కచ్చితంగా నన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడు.
\v 24 మనుష్యకుమారుడు చనిపోవడం ఖాయం. ఎందుకంటే లేఖనాలు కూడా నా గురించి ఆ విషయాన్ని చెబుతున్నాయి. అయితే, నన్ను శత్రువుల చేతికి అప్పగించిన మనిషికి మాత్రం ఘోరమైన శిక్ష పడుతుంది. అతనికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టకపోయి ఉంటే ఎంతో బాగుండేది" అని జవాబిచ్చాడు.
\v 25 అప్పుడు, ఆయన్ని అప్పగింపబోతున్న యూదా, ఆయనతో, "బోధకా, కచ్చితంగా నేను కాదు కదా?" అన్నాడు. యేసు అతనితో "నువ్వు చెప్పకనే చెప్తున్నావు కదా" అని అన్నాడు.
\s5
\p
\v 26 భోజనం చేస్తుండగా, యేసు ఒక రొట్టె తీసుకుని, దేవునికి స్తుతులు చెప్పి దాన్ని విరిచి ముక్కలు చేసి, తన శిష్యులకు ఇస్తూ, "ఈ రొట్టెను తీసికొని తినండి. ఇది నా శరీరం" అన్నాడు.
\s5
\v 27 తరవాత ద్రాక్షరసం పాత్రను పట్టుకుని దేవునికి స్తుతులు చెప్పి వాళ్ళకిచ్చి, "మీరందరూ ఈ పాత్రలో ఉన్నది తాగండి.
\v 28 ఈ ద్రాక్ష రసం నా రక్తం. తొందరలోనే నా శరీరం నుండి నేనే దాన్ని చిందింపబోతున్నాను. ఈ రక్తం ప్రజలందరి పాపక్షమాపణకు గుర్తుగా దేవుడు చేసిన కొత్త ఒడంబడిక.
\v 29 జాగ్రత్తగా వినండి. ఒక కొత్త అర్థంతో ఈ విధంగా మీతో కలిసి మళ్ళీ ద్రాక్షరసం తాగేంత వరకు నేను దాన్ని తాగను. ఆ విధంగా నా తండ్రి పరిపాలనలోనే జరుగుతుంది" అన్నాడు.
\s5
\p
\v 30 తరవాత వాళ్ళు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు బయలుదేరారు.
\v 31 వెళ్ళే దారిలో యేసు వారితో ఇలా చెప్పాడు, "ఈ రాత్రి నాకు జరిగేదాన్ని బట్టి మీరంతా నన్ను వదిలి పారిపోతారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే, "నేను కాపరిని దెబ్బ తీస్తాను. మందలోని గొర్రెలన్నిటినీ చెదరగొడతాను" అని లేఖనాల్లో దేవుడు రాయించి ఉంచాడు కదా.
\v 32 అయితే నేను మరణం నుండి తిరిగి లేచిన తరవాత మీకంటే ముందుగా గలలియకు వెళతాను."
\s5
\p
\v 33 అప్పుడు పేతురు, "మిగిలిన శిష్యులందరూ నీకు జరిగిన దాన్ని చూసి వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం కచ్చితంగా నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను" అన్నాడు.
\v 34 యేసు అతనితో, "నిజమేమిటంటే, ఈ రాత్రే కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడు సార్లు చెప్తావు" అన్నాడు.
\v 35 పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నేను మాత్రం నిన్ను ఎరుగను అని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఇదే విషయం చెప్పారు.
\s5
\p
\v 36 యేసు శిష్యులతో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. అక్కడ వారితో, "నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరిక్కడే ఉండండి" అని చెప్పి,
\v 37 పేతురు, యాకోబు, యోహానులను తనతోబాటు తీసుకెళ్ళాడు. ఆయన తీవ్రమైన దుఖంతో, కలతతో నిండిపోయాడు.
\v 38 తరవాత ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది. మీరిక్కడే నాతోబాటు మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\p
\v 39 ఆయన కొంత దూరం వెళ్ళి, నేలమీద సాష్టాంగపడి ముఖం నేలమీద ఆనించి, "నా తండ్రీ, వీలైతే ఇలా శ్రమ పడకుండా చేయి. కానీ నా ఇష్ట ప్రకారం కాక నీ ఇష్ట ప్రకారమే చేయి" అని ప్రార్థించాడు.
\v 40 తరవాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి, వాళ్ళు నిద్ర పోతుండగా చూసి, "నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు నిద్ర పోతుంటే, నాకు చాలా నిరుత్సాహంగా ఉంది.
\v 41 ఎవ్వరూ పాపం గురించి మిమ్మల్ని పరీక్షకు గురి చేయకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నేను చెప్పేది చేయాలనుకుంటున్నారు గానీ తీరా చేయబోయేటప్పటికి మీకు శక్తి చాలడం లేదు" అని అన్నాడు.
\s5
\p
\v 42 రెండో సారి మళ్ళీ దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను శ్రమ పడడం తప్పని సరి అయితే, నీ ఇష్టమే జరగనివ్వు" అని ప్రార్థించాడు.
\p
\v 43 ఆయన ఆ ముగ్గురు శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ నిద్ర పోవడం చూశాడు. వాళ్ళు కళ్ళు తెరవలేకపోతున్నారు.
\v 44 కాబట్టి వాళ్ళనలా వదిలేసి ఆయన మళ్ళీ దూరంగా వెళ్ళి మూడో సారి కూడా ఇంతకు ముందు లాగానే ప్రార్థన చేశాడు.
\s5
\v 45 అప్పుడాయన తిరిగి తన శిష్యుల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, "మీరింకా నిద్ర పోవడం చూస్తే నాకు నిరుత్సాహంగా ఉంది. చూడండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
\v 46 లేవండి, ఇక వెళ్దాం. మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. అదిగో, నన్ను పట్టించేవాడు వస్తున్నాడు."
\s5
\p
\v 47 యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగానే, పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా యేసును శత్రువుల చేతికి అప్పగించడానికి వచ్చాడు. అతనితో బాటు కత్తులూ కర్రలూ పట్టుకుని పెద్ద గుంపు కూడా ఉంది. వారిని ముఖ్య యాజకులూ, ఇతర పెద్దలూ పంపారు.
\v 48 "నేనేవరికైతే ముద్దు పెడతానో అతణ్ణి పట్టుకోమ" ని యూదా వాళ్ళకి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
\s5
\p
\v 49 అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి, "బోధకా, నీకు శుభం" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
\v 50 యేసు అతనితో, "మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది తొందరగా చేయి" అన్నాడు. వెంటనే యూదాతో ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి, ఆయన్ని ఒడిసి పట్టుకున్నారు.
\s5
\p
\v 51 అకస్మాత్తుగా యేసుతో ఉన్నవాళ్ళలో ఒకడు ఒరలోనుండి కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి చంపాలనుకున్నాడు గానీ అతని చెవిని మాత్రమే తెగనరికాడు.
\v 52 యేసు అతనితో, "కత్తిని ఒరలో పెట్టేయ్. కత్తి వాడాలనుకున్న వారంతా కత్తితోనే నశించిపోతారు.
\v 53 ఇప్పుడు గనక నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు వ్యూహాల సైన్యాలకంటే ఎక్కువమంది దూతల్ని పంపలేడని మీరనుకుంటున్నారా?
\v 54 నేను అలా వేడుకుంటే మెస్సీయకు ఈ విధంగా జరుగుతుందని ప్రవక్తలు రాసిన మాటలు ఎలా నెరవేరతాయ్?" అన్నాడు.
\s5
\p
\v 55 యేసు తనను ముట్టడించిన గుంపును చూసి, "మీరు నన్ను ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులు, కర్రలతో ఇప్పుడు వచ్చారే, ప్రతి రోజూ కోవెలలో కూర్చుని బోధించినప్పుడు మీరెందుకు నన్ను పట్టుకోలేక పోయారు?
\v 56 అయితే, లేఖనాల్లో ప్రవక్తలు రాసిన ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది కాబట్టి ఇదంతా జరిగింది" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.
\s5
\p
\v 57 యేసును బంధించిన మనుషులు ఆయన్ని ప్రధాన యాజకుడు కైఫా ఇంటికి తీసుకొచ్చారు. యూదు ధర్మశాస్త్రాన్ని బోధించేవారూ, పెద్దలూ అందరూ అప్పటికే అక్కడికి చేరుకున్నారు.
\v 58 పేతురు దూరంగా ఉండి, యేసును వెంబడిస్తూ ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. అక్కడ సైనికులతో బాటు కూర్చొని ఏమి జరుగుతుందో అని చూస్తూ ఉన్నాడు.
\s5
\p
\v 59 ప్రధాన యాజకుడూ, మిగిలిన యూదు మహాసభ పండితులూ, పెద్దలూ యేసును చంపించాలని దొంగ సాక్ష్యం చెప్పే వ్యక్తుల కోసం వెదుకుతూ ఉన్నారు.
\v 60 చాలా మంది అబద్ద సాక్ష్యాలు చెప్పారు కానీ వాళ్ళకి ఉపయోగకరమైనది ఒక్కటీ లేదు. చివరికి ఇద్దరు మనుషులు ముందుకు వచ్చారు.
\v 61 వాళ్ళు "ఈ మనిషి, "నేను దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి కడతాను" అని చెప్పాడు" అన్నారు.
\s5
\p
\v 62 అప్పుడు ప్రధాన యాజకుడు నిలబడి యేసుతో, "నువ్వు జవాబు చెప్పదలచుకోలేదా? వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు నీ జవాబు ఏమిటి?" అని అడిగాడు.
\v 63 అయితే యేసు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ప్రధాన యాజకుడు ఆయనతో, "నిజం చెప్పమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మహా శక్తిమంతుడైన దేవుడు వింటున్నాడు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా?" అని అడిగాడు.
\v 64 యేసు, "అవును, నువ్వే అన్నావు గదా, అయితే మీకందరికీ చెప్తున్నాను, ఒకానొక రోజు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుడైన దేవుని పక్కన కూర్చుని పరిపాలన చేయడం చూస్తారు. అంతేగాక ఆయన ఆకాశమేఘాల మీద ఆసీనుడై తిరిగిరావడం మీరు చూస్తారు" అన్నాడు.
\s5
\p
\v 65 ప్రధాన యాజకుడు కోపంతో ఊగిపోతూ తన పైవస్త్రాన్ని చింపేసుకున్నాడు. "ఇతడు దేవుడినే అవమానించాడు. తనను తాను దేవునితో సమానం చేసుకున్నాడు. ఇంకా వేరే సాక్ష్యాలతో పని లేదు. ఇతడేమి చెప్పాడో మీరే విన్నారు కదా.
\v 66 మీరేమంటారు?" అని సభవారిని అడిగాడు. వాళ్ళు, "మన చట్టాల ప్రకారం ఇతడు దోషి. చావుకు తగినవాడు" అన్నారు.
\s5
\v 67 వెంటనే కొంతమంది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. కొందరు పిడికిలితో గుద్దారు. కొందరు చెంపల మీద కొట్టారు.
\v 68 "నువ్వు క్రీస్తువని చెప్పుకుంటున్నావు కదా, నిన్నెవరు కొట్టారు చెప్పు" అన్నారు.
\s5
\p
\v 69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతణ్ణి చూసి, "నువ్వు కూడా గలలియ జిల్లావాడైన యేసుతో ఉండేవాడివే కదా?" అంది.
\v 70 అక్కడ ఉన్న అందరూ వింటూ ఉండగా పేతురు, "లేదు లేదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకేమీ తెలియదు" అన్నాడు.
\s5
\v 71 అతడు వసారాలో నుండి లేచి గేటు దగ్గరకి వెళ్ళాడు. అప్పుడు ఇంకొక పనిపిల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో, "ఈ మనిషి నజరేతు వాడైన యేసుతో ఉంటాడు" అంది.
\v 72 కానీ పేతురు మళ్ళీ దాన్ని అంగీకరించలేదు. "నేను అబద్ధం చెప్తే గనక దేవుడు నన్ను శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలీదు" అన్నాడు.
\s5
\p
\v 73 కొంతసేపైన తరవాత అక్కడ నిలబడిన కొంతమంది పేతురు దగ్గరికి వచ్చి, అతనితో, "నువ్వు కచ్చితంగా ఆ మనిషితో ఉన్నవాడివే. నువ్వు గలలియ వాడివని నీ యాసను బట్టి మాకర్ధమై పోతుంది" అన్నారు.
\v 74 ఇక దాంతో పేతురు ఒట్లు, శాపనార్థాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, "నేను నిజమే చెబుతున్నాననే దానికి పరలోక దేవుడే సాక్షి. ఆ మనిషి నాకు తెలియనే తెలియదు" అన్నాడు. వెంటనే కోడి కూసింది.
\v 75 అప్పుడు పేతురు, "కోడి కూయక ముందే నువ్వు మూడుసార్లు నేను ఎవరో తెలియదని చెబుతావు" అన్న యేసు మాటలు గుర్తు తెచ్చుకొని, వసారా బయటికి వెళ్ళి తాను చేసిన దానికి ఎంతో దుఖంతో పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s5
\c 27
\p
\v 1 ఉదయాన్నే ముఖ్య యాజకులందరూ, మహా సభ పెద్దలందరూ కలిసి యేసును చంపడానికి రోమన్లకు ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచించారు.
\v 2 వాళ్ళు ఆయన చేతులు కట్టేసి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు.
\s5
\p
\v 3 అప్పుడు యేసుని పట్టించిన యూదా, వాళ్ళు యేసును చంపడానికే తీర్మానించారని గ్రహించాడు. కాబట్టి తాను చేసిన దానికి మనస్తాపం చెందాడు. తనకు వాళ్ళు ఇచ్చిన ముప్ఫై నాణాలు పట్టుకుని ముఖ్య యాజకుల దగ్గరికీ, పెద్దల దగ్గరికీ వెళ్ళాడు.
\v 4 "నేను పాపం చేశాను, నిర్దోషి అయిన మనిషిని మీకు అప్పగించాను" అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళు, "అయితే మాకేంటి? అది నీ సమస్య. నువ్వే చూసుకో" అన్నారు.
\v 5 అప్పుడు యూదా ఆ డబ్బులు తీసుకొని ఆ దేవాలయ వసారాలో విసిరేశాడు. తరవాత వెళ్ళి ఉరివేసుకొని చనిపోయాడు.
\s5
\p
\v 6 ప్రధాన యాజకులు ఆ నాణేలు తీసుకొని, "ఇది ఒక మనిషిని చంపడానికి ఇచ్చిన డబ్బు. వీటిని కానుకల పెట్టెలో వేయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం" అని చెప్పుకున్నారు.
\v 7 కాబట్టి ఆలోచించి ఆ డబ్బుతో ఒక పొలం కొన్నారు. దాన్ని కుమ్మరి వాడి పొలం అని పిలుస్తారు. పరాయి దేశస్తులు ఎవరైనా, యెరూషలేములో చనిపోతే వాళ్ళని పాతిపెట్టడానికి ఆ పొలాన్ని కేటాయించారు.
\v 8 అందుకే ఇప్పటికీ ఆ స్థలాన్ని "రక్తభూమి" అని పిలుస్తారు.
\s5
\v 9 చాలా కాలం క్రితమే యిర్మీయా ప్రవక్త రాసిన ఈ మాటలు నెరవేర్పుకు వచ్చేలా వాళ్ళు ఆ కుమ్మరివాడి పొలం కొన్నారు,
\v 10 "ఇశ్రాయేలు నాయకులందరూ కలిసి ఆయనకు కట్టిన వెల ముప్ఫై వెండి నాణేలు. ప్రభువు నాకు ఆజ్ఞాపించినట్టుగానే వాళ్ళు వాటితో ఒక కుమ్మరి వాడి పొలాన్ని కొన్నారు."
\s5
\p
\v 11 యేసు గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. "నువ్వు యూదుల రాజువి అని చెప్పుకున్నావా?" అని గవర్నర్ ఆయన్ని అడిగాడు. "అవును, నువ్వు అన్నట్టే" అని యేసు అతనికి జవాబిచ్చాడు.
\p
\v 12 అయితే ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద రక రకాలైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నప్పుడు మాత్రం ఆయన ఏమీ తిరిగి జవాబు చెప్పలేదు.
\v 13 పిలాతు ఆయనతో, "వాళ్ళు నీమీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటున్నావా? నువ్వేమీ మాట్లాడవా?" అన్నాడు.
\v 14 అయితే యేసు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. తన మీద వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా తిరిగి జవాబివ్వలేదు. దీనికి గవర్నర్ చాలా ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 15 ప్రతి సంవత్సరం, పస్కా పండగ జరిగే సమయంలో జైలులో ఉన్న ఒక ఖైదీని గవర్నర్ విడుదల చేయడం ఒక ఆనవాయితీ. ప్రజలు ఏ ఖైదీని కోరుకుంటే అతణ్ణి గవర్నర్ విడుదల చేస్తాడు.
\v 16 ఆ సమయంలో యెరూషలేము జైల్లో బరబ్బ అనే పేరు మోసిన ఖైదీ ఉన్నాడు.
\s5
\v 17 జనమంతా గుమికూడి ఉండగా పిలాతు వాళ్ళని, "మీరు ఏ ఖైదీని విడుదల చేయాలనుకుంటున్నారు? మెస్సీయ అని పిలిచే యేసునా?" అని అడిగాడు.
\v 18 అతడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఆ ముఖ్య యాజకులు కేవలం యేసు మీద అసూయ చేతనే ఆయన్ని తన దగ్గరకు తీసుకొచ్చారని అతడు గ్రహించాడు. కాబట్టి ప్రజలంతా యేసుని విడిపించమంటారని అతడు అనుకున్నాడు.
\p
\v 19 పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, "ఈ మనిషి గురించి ఉదయాన్నే నాకొక కల వచ్చింది. నువ్వు ఆ నిర్దోషికి శిక్ష వేయొద్దు. ఆయన జోలికి పోవద్దు" అని కబురు పంపింది.
\s5
\v 20 కానీ ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బని విడుదల చేయమనీ, యేసుకు మరణ శిక్ష అమలు చేయమనీ పిలాతును అడగమని జనాలపై వత్తిడి తెచ్చారు.
\v 21 ఆ విధంగా గవర్నర్ర్ వాళ్ళని "ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలి?" అని అడిగితే వాళ్ళు, "బరబ్బ" అని కేకలు వేశారు.
\v 22 "అలా అయితే యేసును ఏంచేయాలి? మరి మీలో కొంతమంది ఆయన్ని మెస్సీయ అన్నారు కదా?" అని పిలాతు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "సిలువ వెయ్యమని నీ సైనికులకు ఆజ్ఞాపించు" అన్నారు.
\s5
\p
\v 23 అప్పుడు పిలాతు, "ఎందుకు? అతడు ఏ నేరం చేశాడు?" అని వాళ్ళని అడిగాడు. అయితే వాళ్లింకా గట్టిగా కేకలు వేస్తూ, "సిలువ వేయండి" అని అరిచారు.
\p
\v 24 ఇంకా దానికి బదులుగా ఏం చేయాలన్నా అల్లరి ఎక్కువవుతుందే గానీ తన ప్రయత్నాలేవీ సాగవని అనుకుని పిలాతు జనమంతా చూస్తుండగా, ఒక పళ్ళెం తీసుకొని అందులో తన చేతులు కడిగేసుకుని, "ఇలా చేతులు కడుక్కోవడం ద్వారా ఈ మనిషి మరణం విషయంలో నా తప్పేమీ లేదు, అదంతా మీ తప్పే అని చూపించడానికి ఇలా చేశాను" అన్నాడు.
\s5
\p
\v 25 అప్పుడు అక్కడి ప్రజలంతా, "అతని చావు వలన కలిగే అపరాధం మామీదా, మా పిల్లల మీదా కుడా ఉంటుంది గాక!" అని జవాబిచ్చారు.
\v 26 అప్పుడు అతడు వాళ్ళకి బరబ్బని విడుదల చేయమని సైనికులకి ఆజ్ఞాపించాడు. అయితే యేసును మాత్రం కొరడాలతో కొట్టమని సైనికులకు చెప్పాడు. ఆ తరవాత యేసుని సిలువ వేయడం కోసం సైనికులకు అప్పగించాడు.
\s5
\p
\v 27 అప్పుడు గవర్నర్ కింద ఉన్న సైనికులు యేసుని సైనికుల శిబిరాల్లోకి తీసుకు వెళ్ళారు. ఆ పటాలమంతా ఆయన చుట్టూ పోగయ్యారు.
\v 28 వాళ్ళు ఆయన బట్టలు లాగివేశారు. ఆయన ఒక రాజు అన్నట్టుగా ఒక మెరిసే ఎర్రని అంగీని ఆయనకు కప్పారు.
\v 29 ముళ్ళతో ఉన్న ఒక చెట్టు తీగలను కోసి వాటిని ఒక కిరీటంలాగా అల్లి ఆయన తల మీద ఉంచారు. ఆయన కుడి చేతిలో ఒక రాజు దండం పట్టుకున్నట్టుగా ఒక గడ్డి రెల్లును ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, "యూదుల రాజుకు శుభం" అంటూ ఆయన్ని ఎగతాళి చేశారు.
\s5
\p
\v 30 వాళ్ళు ఆయన మీద ఉమ్ముతూనే ఉన్నారు. ఆయన చేతికర్రని తీసుకొని దానితో ఆయన తలమీద కొడుతూ ఉన్నారు.
\v 31 అలాగ ఆయన్ని హేళన చేసిన తరవాత ఆయన అంగీని తీసేసి, ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించారు. అక్కడినుండి ఆయన్ని సిలువ వేసే స్థలానికి నడిపించుకుంటూ వెళ్ళారు.
\s5
\p
\v 32 యేసు తన సిలువని కొంత దూరం మోసుకెళ్ళిన తరవాత ఆ సైనికులు కురేనే అనే పట్టణానికి చెందిన సీమోను అనే వ్యక్తిని చూశారు. యేసు సిలువను అతని చేత బలవంతంగా మోయించారు.
\v 33 వాళ్ళు గొల్గొతా అనే స్థలానికి వచ్చారు. ఆ పేరుకి అర్థం, "కపాలం లాంటి స్థలం."
\v 34 అక్కడికి చేరిన తరవాత ద్రాక్షరసంలో చేదు ద్రవాన్ని కలిపారు. వాళ్ళు ఆయన్ని మేకులతో సిలువకి కొట్టేటప్పుడు అంతగా బాధ కలగకుండా ఉండేందుకు దాన్ని యేసుకు తాగించారు. అయితే ఆయన దాన్ని రుచి చూసి దాన్ని తాగడానికి నిరాకరించాడు. కొంతమంది సైనికులు ఆయన బట్టలు లాగేసుకున్నారు.
\s5
\p
\v 35 అప్పుడు వాళ్ళు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. తరవాత చీట్లు వేసి ఆయన బట్టల్లో ఏది ఎవరికీ వస్తుందో చూసి పంచుకున్నారు.
\v 36 ఎవరైనా ఆయన్ని కాపాడటానికి వస్తారేమో అని ఆ సైనికులు సిలువకు కాపలాగా కూర్చున్నారు.
\v 37 యేసుని ఎందుకు సిలువకు మేకులతో కొట్టామో చెప్పడానికి ఒక చెక్క ముక్కను యేసు తలపైగా సిలువకు తగిలించారు. దానిపైన, "ఈయన యూదులకు రాజైన యేసు" అని రాసి ఉంది.
\s5
\p
\v 38 అదే సమయంలో వాళ్ళు ఇద్దరు బందిపోట్లను కూడా సిలువ వేశారు. ఒక సిలువని యేసుకు కుడివైపునా, మరొకటి ఎడమ వైపునా నిలబెట్టారు.
\v 39 ఆ పక్కగా వెళ్తున్న ప్రజలు ఆయన్ని చూసి ఆయనేదో ఒక దుర్మార్గుడైనట్టుగా తమ తలలు ఊపుతూ ఎగతాళి చేస్తున్నారు.
\v 40 వాళ్ళు ఆయనతో, "మన దేవాలయాన్ని కూలదోసి మళ్ళీ మూడు రోజుల్లోనే దాన్ని కడతానని చెప్పావు. ఆ విధంగా చేసేవాడివైతే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా! నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగి రా!" అన్నారు.
\s5
\p
\v 41 అదే విధంగా ముఖ్య యాజకులూ, యూదా ధర్మశాస్త్రాన్ని బోధించే వారూ, పెద్దలు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు.
\v 42 "ఈయన రోగుల్ని స్వస్థ పరిచాడు గానీ తనకు తాను సహాయం చేసుకోలేడు. తను ఇశ్రాయేలుకు రాజునని చెప్పుకున్నాడు కాబట్టి సిలువ మీద నుండి దిగి రావాలి. అప్పుడు మేము ఆయన్ని నమ్ముతాం."
\s5
\p
\v 43 "తాను దేవునిలో విశ్వాసముంచాననీ, తాను మానవునిగా ఉన్న దేవుడిననీ అన్నాడు. ఒకవేళ దేవుడికి అతనంటే ఇష్టమైతే ఇప్పుడే దేవుడు అతణ్ణి విడిపించాలి!" ఇలాంటి రక రకాల మాటలతో వాళ్ళు ఆయన్ని హేళన చేశారు.
\v 44 అలాంటి మాటలే పలుకుతూ ఆయనకు అటూ ఇటూ సిలువలపై ఉన్న బందిపోట్లు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు.
\s5
\p
\v 45 మధ్యాహ్నం అయినప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ అలా చీకటిగానే ఉండిపోయింది.
\v 46 సుమారు మూడు గంటల సమయంలో యేసు, "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?" అని పెద్దగా అరిచాడు. దాని అర్థం, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావు?" అని.
\v 47 ఆ పక్కన నిలబడి ఉన్న కొందరు "ఏలీ" అనే మాట విని, ఆయన ఏలీయా ప్రవక్తని పిలుస్తున్నాడేమో అనుకున్నారు.
\s5
\p
\v 48 వెంటనే వాళ్ళలో ఒకడు పరిగెత్తి ఒక స్పాంజిముక్క తీసుకొచ్చాడు. దాన్ని చేదు ద్రాక్షరసంలో ముంచి, దాన్ని ఒక గడ్డి పుల్ల చివర తగిలించి యేసు దానిలోని ద్రాక్షరసాన్ని పీల్చుకుంటాడేమో అని దాన్ని ఆయన ముఖం దగ్గరకు ఎత్తి పట్టుకున్నాడు.
\v 49 అక్కడ ఉన్న ఇంకొందరు, "ఆగాగు, ఏలీయా వచ్చి ఆయన్ని కాపాడతాడేమో చూద్దాం" అన్నారు.
\v 50 అప్పుడు యేసు మళ్ళీ ఇంకొకసారి పెద్దగా కేక వేసి తన ఆత్మని దేవునికి అప్పగించి చనిపోయాడు.
\s5
\p
\v 51 అదే క్షణంలో దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉండే బరువైన, మందమైన తెర పైనుండి కిందికి రెండుగా చిరిగిపోయింది. భూమి కంపించింది, కొన్ని చోట్ల పెద్ద రాతి బండలు చీలిపోయాయి.
\v 52 సమాధులు తెరుచుకున్నాయి. దేవునిపై భయభక్తులతో జీవించి చనిపోయిన చాలా మంది శరీరాలు తిరిగి జీవం పొందాయి.
\v 53 వాళ్ళు సమాధుల నుండి బయటికి వచ్చారు. యేసు తిరిగి లేచిన తరవాత వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి చాలామందికి కనిపించారు.
\s5
\p
\v 54 యేసుని సిలువకు మేకులతో కొట్టిన సైనికులను పర్యవేక్షించే అధికారి అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఆ సిలువలకు కాపలాగా ఉన్న సైనికులు కూడా అక్కడే ఉన్నారు. భూకంపం రావడం, ఇంకా అక్కడ జరిగిన ఇతర విషయాలను చూసినప్పుడు వాళ్ళు భయంతో వణికిపోయారు. "ఈయన నిజంగా దేవుని కుమారుడు" అని వాళ్ళు పెద్దగా చెప్పుకున్నారు.
\p
\v 55 అక్కడ చాలామంది స్త్రీలు కూడా దూరంనుండి చూస్తున్నారు. యేసుకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేయడానికి వారంతా గలిలయనుండి ఆయనతో కలిసి వచ్చారు.
\v 56 వారిలో మగ్దలకు చెందిన మరియ, యాకోబు, యోసేపుల తల్లి అయిన ఇంకొక మరియ, యాకోబు, యోహానుల తల్లి ఉన్నారు.
\s5
\p
\v 57 సాయంకాలం అయినప్పుడు యోసేపు అనే ఒక ధనవంతుడు అక్కడికి వచ్చాడు. అతడు అరిమతయియ అనే ఊరువాడు. అతడు కూడా యేసు శిష్యుడే.
\v 58 అతడు పిలాతు దగ్గరకి వెళ్ళి యేసు శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధి చేయడానికి అనుమతి అడిగాడు. అతణ్ణి ఆ శరీరాన్ని తీసుకుపోనిమ్మని పిలాతు సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 59 కాబట్టి యోసేపు, ఇతరులు కలిసి ఆ శరీరాన్ని శుభ్రమైన తెల్లని గుడ్డతో చుట్టారు.
\v 60 దాన్ని యోసేపు ఒక కొండ రాతిలో తన పనివారి చేత స్వంతగా తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచారు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద గుండ్రని చదునైన రాయిని దొర్లించి వెళ్ళిపోయారు.
\v 61 మగ్దలేనే మరియ, ఇంకో మరియ, ఆ సమాధికి అవతల కూర్చొని గమనిస్తూ ఉన్నారు.
\s5
\p
\v 62 తరువాతి రోజు యూదులకు విశ్రాంతి రోజైన శనివారం. ముఖ్యయాజకులు, కొంతమంది పరిసయ్యులు పిలాతు దగ్గరకి వెళ్ళారు.
\v 63 వాళ్ళు అతనితో, "ఈ మోసగాడు బతికి ఉన్న సమయంలో "నేను చనిపోయిన మూడు రోజులకి మళ్ళీ సజీవంగా తిరిగి లేస్తాను" అని చెప్పినట్టు మాకు జ్ఞాపకం.
\v 64 కాబట్టి ఆ సమాధిని మూడు రోజుల పాటు కాపలా కాయమని మీ సైనికులకు ఆజ్ఞాపించండి. మీరు అలా చేయకపోతే అతని శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలించవచ్చు. అప్పుడు వాళ్ళు ఆయన చనిపోయినా తిరిగి బతికి లేచాడని ప్రజల్లో ప్రచారం చేస్తారు. అలా చెప్పి వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తే అది అంతకు ముందు అతడు చేసిన దానికంటే ఎక్కువ మోసం అవుతుంది" అన్నారు.
\s5
\p
\v 65 అప్పుడు పిలాతు వాళ్ళతో, "మీరు కొంతమంది సైనికుల్ని తీసుకు వెళ్ళొచ్చు. సమాధి దగ్గరకు వెళ్ళి మీకు చేతనయినంత వరకు దానికి కావలి ఏర్పాటు చేసుకోండి" అన్నాడు.
\v 66 కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ సమాధి మీద ఉంచిన రాతిని అటూ ఇటూ కొండకు తాళ్ళతో కట్టి దానిపై ముద్ర వేశారు. ఆ సమాధికి కొంతమంది సైనికుల్ని కూడా కాపలా పెట్టారు.
\s5
\c 28
\p
\v 1 విశ్రాంతి దినం అయిపోగానే ఆదివారం ఉదయాన్నే మగ్దల గ్రామానికి చెందిన మరియ, ఇంకొక మరియ కలిసి యేసు సమాధి దగ్గరకి వెళ్ళారు.
\v 2 ఒక బలమైన దేవదూత పరలోకం నుండి దిగిరావడం వలన అక్కడ పెద్ద భూకంపం కలిగింది. అతడు వచ్చి ఆ సమాధి ముఖద్వారానికి అడ్డుగా నిలిపిన ఆ రాతిని దొర్లించి వేసి, ఆ రాతి మీద ఎక్కి కూర్చున్నాడు.
\s5
\v 3 అతని రూపం మెరుపులాగా వెలిగిపోతున్నది. అతని వస్త్రాలు మంచులాగా తెల్లగా ఉన్నాయి.
\p
\v 4 అక్కడ కావలి ఉన్న భటులు భయంతో వణికిపోయారు. చివరికి వాళ్ళు చచ్చిపోయిన వారిలాగా కింద పడిపోయారు.
\s5
\p
\v 5 ఆ దూత ఆ స్త్రీలతో ఇలా చెప్పాడు, "భయపడాల్సిన పని లేదు! సిలువకు మేకులతో కొట్టిన యేసు కోసం మీరు వెదకుతున్నారని నాకు తెలుసు.
\v 6 ఆయన ఇక్కడ లేడు! యేసు మీతో ఏమని చెప్పాడో అలాగే దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. రండి, వచ్చి ఆయన శరీరం ఉంచిన స్థలం చూడండి!
\v 7 తరవాత వెంటనే వెళ్ళి "ఆయన మరణం నుండి తిరిగి లేచాడు! మీకంటే ముందుగా గలలియకు వెళ్తాడు, అక్కడ మీరు ఆయన్ని చూడొచ్చు" అని ఆయన శిష్యులతో చెప్పండి. నేను మీతో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి!"
\s5
\p
\v 8 వెంటనే ఆ స్త్రీలు సమాధిని వదిలి వెళ్ళిపోయారు. వాళ్లకి చాలా భయం వేసింది గానీ అదే సమయంలో చాలా సంతోషంతో నిండిపోయారు. ఏమి జరిగిందో శిష్యులతో చెప్పడానికి పరుగెత్తి వెళ్ళారు.
\v 9 వాళ్ళు పరుగెత్తుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళకి యేసు ప్రత్యక్షం అయ్యాడు. "మీకు శుభం కలుగుతుంది!" అని ఆయన వారితో అన్నాడు. ఆ స్త్రీలు ఆయన దగ్గరగా వచ్చి ఆయన పాదాలకు మొక్కారు.
\v 10 అప్పుడు యేసు వారితో, "భయపడవద్దు! వెళ్ళి, నా శిష్యులందరూ గలలియకు వెళ్లాలని వారితో చెప్పండి. వాళ్ళు నన్నక్కడ చూస్తారు."
\s5
\p
\v 11 ఆ స్త్రీలు వెళ్తూ ఉండగా, ఆ సమాధిని కాపలా కాస్తున్న కొందరు సైనికులు నగరంలోకి వెళ్ళారు. అక్కడ ఏమేమి జరిగిందో అదంతా ప్రధాన యాజకులకి వివరించారు.
\v 12 ఆ వెంటనే ప్రధాన యాజకులూ, యూదా మత పెద్దలూ కలిసి సమావేశమయ్యారు. ఆ సమాధి ఎందుకు ఖాళీగా ఉన్నదో వివరించడానికి ఒక ప్రణాళిక వేశారు. వాళ్ళు ఆ సైనికులకి లంచంగా చాలా సొమ్ము ముట్టజెప్పారు.
\v 13 వారితో, "మేము నిద్ర పోతుండగా యేసు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళారు"అని చెప్పండి."
\s5
\p
\v 14 "ఈ సంగతి గవర్నర్ గారికి తెలిస్తే ఆయన మీ మీద కోపం తెచ్చుకోకుండా మేము చూసుకుంటాం. కాబట్టి మీరేమీ కంగారు పడవద్దు" అని చెప్పారు.
\v 15 కాబట్టి ఆ సైనికులు ఆ డబ్బు తీసుకొని వాళ్ళు తమకి చెప్పినట్టుగానే చేశారు. ఈనాటి వరకూ ఆ కథ యూదుల మధ్య ప్రచారంలో ఉంది.
\s5
\p
\v 16 ఆ తరవాత పదకొండు మంది శిష్యులు గలలియ జిల్లాకి వెళ్ళారు. యేసు తమకి వెళ్ళమని చెప్పిన ఆ కొండ దగ్గరికి వెళ్ళారు.
\v 17 వాళ్ళు ఆయన్ని అక్కడ చూసి ఆయన్ని ఆరాధించారు. అయితే వారిలో కొంతమంది మాత్రం యేసు నిజంగా బ్రతికాడా అని సందేహించారు.
\s5
\p
\v 18 అప్పుడు యేసు వారికి దగ్గరగా వచ్చి, "పరలోకంలో, భూలోకంలో అంతటి మీదా, సర్వ మానవుల మీదా నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు.
\v 19 కాబట్టి మీరు వెళ్ళి నా అధికారాన్ని ఉపయోగించి సమస్త జాతుల ప్రజలకూ నా సందేశం వినిపించి వారిని కూడా నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మల అధికారం కింద వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి.
\s5
\v 20 నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో దానినంతటినీ వాళ్ళకి బోధించండి. నేను ఈ యుగాంతం వరకూ మీతో ఎల్లప్పుడూ ఉంటానని జ్ఞాపకం ఉంచుకోండి."