\id PHM - Indian Easy Version (IEV) Telugu \ide UTF-8 \h ఫిలేమోనుకు రాసిన పత్రిక \toc1 ఫిలేమోనుకు రాసిన పత్రిక \toc2 ఫిలేమోనుకు రాసిన పత్రిక \toc3 phm \mt1 ఫిలేమోనుకు రాసిన పత్రిక \s5 \c 1 \p \v 1 నేను పౌలును. యేసు క్రీస్తు దాసుడనైనందుకు ఇప్పుడు జైల్లో ఉన్నాను. నాతో మన సాటి విశ్వాసి అయిన తిమోతి కూడా ఉన్నాడు. ఫిలేమోనూ, మేము ప్రేమిస్తున్న క్రీస్తుని నువ్వు కూడా ప్రేమిస్తున్నావని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. \v 2 మన సహ విశ్వాసి అయిన అప్ఫియాను, మనతో కలిసి సైనికుడిలా క్రీస్తుకు సేవ చేస్తున్న అర్ఖిప్పును కూడా మేము అడిగామని చెప్పండి. మీ ఇంట్లో సంఘంగా కలుస్తున్న విశ్వాసులందర్నీ కూడా అడిగినట్టు చెప్పండి. \v 3 మన తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు కృప మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలనీ, నిత్యమూ శాంతి కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. \s5 \p \v 4 ఫిలేమోనూ, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీ విషయమై కృతజ్ఞతలు చెప్తున్నాను. \v 5 నువ్వు దేవుణ్ణి, ఆయన ప్రజల్నీఎంతగా ప్రేమిస్తున్నావో, యేసు ప్రభువులో నువ్వు ఎంతగా నమ్మిక ఉంచావో మనవాళ్ళు నాతో చెప్పారు. \v 6 ఆయన సేవ చేయడం లో క్రీస్తు మాకు ఇస్తున్న మంచి విషయాలన్నీ మాలాగే లోతుగా నువ్వు కూడా పూర్తిగా నమ్మడం వల్ల నీకు బాగా అర్థం కావాలని ప్రార్దిస్తున్నాను. \p \v 7 చూడు మిత్రమా, నువ్వు దేవుని ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు అందుకే నేను చాలా సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉంటున్నాను. \s5 \v 8 అలాగే నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను క్రీస్తుకు అపోస్తులుణ్ణి కాబట్టి నువ్వేం చేయాలో చెప్పే అధికారం నాకు వుందని నమ్ముతున్నాను. \v 9 కానీ మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. నాకా, వయసు పైబడింది. పైగా క్రీస్తుకు దాసుడుగా జైల్లో ఉన్నాను కాబట్టి ఆదేశించడానికి బదులుగా బతిమాలుతున్నాను. \s5 \p \v 10 ఇక్కడ జైల్లో ఒకతనికి నేను క్రీస్తుసువార్త చెప్పినప్పుడు అతడు నాకు కొడుకులాగా అయిపోయాడు. అతని పేరు ఒనేసిము. ఆ పేరుకు అర్థం "ఉపయోగకరం" అని నీకు తెలుసు. అతనికి ఎంతో కొంత సాయం చేయమని నిన్ను బతిమాలు తున్నాను. \v 11 అతడు ఇంతకు ముందైతే నీకు నిష్ప్రయోజకుడు. ఇప్పుడైతే నీకూ నాకూ ఇద్దరికీ ప్రయోజనకారి. \v 12 నా ఆరోప్రాణమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. \v 13 సంకెళ్ళలో ఉండి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న నాకు ఈ సమయంలో సాయం చెయ్యడానికి నీకు బదులుగా అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను. \s5 \v 14 అయినప్పటికీ నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. ఎలాటి బలవంతం లేకుండా నీకై నువ్వు ఇష్టపూర్వకంగా నాకు సాయపడాలని నా అభిప్రాయం. \v 15 బహుశా అతడు ఎప్పటికీ నీ దగ్గరే ఉండడానికి కాబోలు దేవుడు కొంతకాలం నీకు దూరంగా ఉండనిచ్చాడు. \p \v 16 చూడు ఫిలేమోనూ, అతడు ఇక బానిస కాదు. అంతకంటే ఎక్కువ. ఇప్పుడు అతణ్ణి సాటి విశ్వాసిగా నీవు ప్రేమించవచ్చు. అతడు నాకు చాలా ఇష్టమైన వాడు. నీక్కూడా ప్రియమైన సోదరుడు. ఎందుకంటే అతడిప్పుడు నీ బానిస మాత్రమే కాదు, ప్రభువుకు చెందిన వాడు. \s5 \p \v 17 అందుచేత దేవుడు మనకి అప్పజెప్పిన పని విషయంలో నన్ను నీ జత పనివానిగా ఎంచి నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా నీ ఇంట చేర్చుకో. \v 18 ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి, దాన్ని నా లెక్కలో వెయ్యి. \v 19 పౌలు అనే నేను నా స్వహస్తాలతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ ఏదైనా వుంటే నేనే తీరుస్తాను. అయినా నీకు క్రీస్తు సువార్త చెప్పిన వాణ్ణి నేనే కదా. అలా నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ ఉన్నావని నేను వేరే చెప్పనక్కరలేదు. \p \v 20 ఔను సోదరా, ప్రభువులో మన ఇద్దరం ఒక్కటే అని నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు. \s5 \v 21 నువ్వు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నువ్వు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు. \p \v 22 సరే. ఇది చేస్తూనే నీ ఇంట్లో ఉండడానికి నా కోసం ఏర్పాట్లు చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్నుఈ జైల్లో నుండి విడుదల చేసి మీ దగ్గరికి పంపుతాడనే నమ్మకంతో ఉన్నాను. \s5 \v 23 క్రీస్తు యేసు కోసం నాతో పాటు ఖైదీగా ఉన్న ఎపఫ్రా మీకు శుభం అని చెప్తున్నాడు. \p \v 24 అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు సంతోషంతో నమస్కారాలు చెబుతున్నారు. \v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత దయామయుడో తెలుసుకుని మీరందరూ నిత్యమూ ఆనందించాలని ప్రార్థిస్తాను. ఆమెన్.