Migrating Old Project

This commit is contained in:
translationCore User 2020-11-16 11:42:15 +05:30
commit 98377facc5
51 changed files with 352864 additions and 0 deletions

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

File diff suppressed because it is too large Load Diff

16677
luk.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

89
luk/1.json Normal file
View File

@ -0,0 +1,89 @@
{
"1": "ఘనులైన తియొఫిలా, ",
"2": "మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు",
"3": "కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం",
"4": "వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది",
"5": "యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు అతని భార్య అహరోను వంశీకురాలు ఆమె పేరు ఎలీసబెతు ",
"6": "వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు ",
"7": "అయితే వారికి పిల్లలు లేరు ఎలీసబెతు గొడ్రాలు అంతేకాదు వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు ",
"8": "జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా ",
"9": "యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది",
"10": "ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు ",
"11": "ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు",
"12": "జెకర్యా అతనిని చూసి కంగారుపడి భయపడ్డాడు ",
"13": "అప్పుడాదూత అతనితో జెకర్యా భయపడకు నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది అతనికి యోహాను అని పేరు పెడతావు ",
"14": "అతని మూలంగా నీకు హర్షం మహదానందం కలుగుతుంది అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు ",
"15": "అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు",
"16": "ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు ",
"17": "తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు అన్నాడు",
"18": "దేవదూతతో జెకర్యా ఇది నాకు ఎలా తెలుస్తుంది నేను ముసలివాణ్ణి నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు అన్నాడు ",
"19": "దూత నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును నీతో మాట్లాడడానికి ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు ",
"20": "నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు అని అతనితో అన్నాడు",
"21": "ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు ",
"22": "అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు ",
"23": "అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు ",
"24": "ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు ",
"25": "ఆమె దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు అనుకొంది",
"26": "ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో ",
"27": "దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు ఆ కన్య పేరు మరియ ",
"28": "ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహం పొందినదానా నీకు శుభం ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అని పలికాడు ",
"29": "ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా ",
"30": "దూత మరియా భయపడకు నీకు దేవుని అనుగ్రహం లభించింది ",
"31": "ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు ",
"32": "ఆయన గొప్పవాడవుతాడు ఆయన్ని సర్వోన్నతుని కుమారుడు అంటారు ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు ",
"33": "ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని ఆమెతో చెప్పాడు",
"34": "మరియ నేను కన్యను గదా ఇదెలా జరుగుతుంది అంది ",
"35": "ఆ దూత పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు ",
"36": "పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది గొడ్రాలనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల ",
"37": "దేవునికి అసాధ్యం ఏమీ లేదు అని ఆమెతో చెప్పాడు",
"38": "అందుకు మరియ నేను ప్రభువు పాదదాసిని నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక అంది అప్పుడా దూత వెళ్ళిపోయాడు ",
"39": "",
"40": "",
"41": "ఎలీసబెతు ఆ అభివందనం వినగానే ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది",
"42": "స్త్రీలలో నీవు ధన్యురాలివి నీ గర్భఫలం దీవెన పొందినది ",
"43": "నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం",
"44": "నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు ",
"45": "ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు అంది",
"46": "అప్పుడు మరియ ఇలా అంది నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది ",
"47": "ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.\n\\q1 ",
"48": "",
"49": "",
"50": "ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది",
"51": "ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు గర్విష్ఠులను వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు ",
"52": "బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు ",
"53": "ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు ",
"54": "",
"55": "",
"56": "మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది ",
"57": "ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది ",
"58": "అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు ",
"59": "వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా ",
"60": "తల్లి అలా కాదు ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి అంది ",
"61": "అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా అని ",
"62": "వాడికి ఏ పేరు పెట్టాలి అని తండ్రిని సైగలతో అడిగారు ",
"63": "అతడు పలక తెమ్మని బాబు పేరు యోహాను అని రాశాడు అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు ",
"64": "వెంటనే అతని నోరు తెరుచుకుంది నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు ",
"65": "అది చూసి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు ",
"66": "జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో అనుకొన్నారు ",
"67": "అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు ",
"68": "ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు ",
"69": "తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు ",
"70": "",
"71": "",
"72": "",
"73": "",
"74": "",
"75": "",
"76": "",
"77": "",
"78": "",
"79": "మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు",
"80": "ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలం పుంజుకుంటూ ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు",
"front": "\\s1 పరిచయం\n\\p ",
"39-40": "ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది. ",
"48-49": "నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.\n\\q1 సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.\n\\q1 ",
"54-55": "అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి,\n\\q1 వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు,\n\\q1 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”\n\\p ",
"70-73": "మన శత్రువులబారి నుండీ మనల్ని ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.\n\\q1 దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.\n\\q1 ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,\n\\q1 అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.\n\\q1 ",
"74-75": "మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,\n\\q1 పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,\n\\q1 పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,\n\\q1 భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,\n\\q1 మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.\n\\q1 ",
"76-78": "ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు.\n\\q1 మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి,\n\\q1 వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా,\n\\q1 ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.\n\\q1 "
}

45
luk/10.json Normal file
View File

@ -0,0 +1,45 @@
{
"1": "ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు ",
"2": "వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు కోత ఎక్కువగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి ",
"3": "మీరు వెళ్ళండి ఇదిగో వినండి తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను ",
"4": "మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు దారిలో ఎవరినీ పలకరించవద్దు ",
"5": "మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే ముందుగా ఈ ఇంటికి శాంతి కలుగు గాక అని చెప్పండి ",
"6": "శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది ",
"7": "వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు ",
"8": "మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి ",
"9": "ఆ ఊరిలో ఉన్న రోగుల్ని బాగు చేయండి దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది అని వారికి ప్రకటించండి ",
"10": "ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే ",
"11": "మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి అని చెప్పండి",
"12": "తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను ",
"13": "అయ్యో కొరాజీనూ నీకు యాతన అయ్యో బేత్సయిదా నీకు యాతన మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు ",
"14": "అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది ",
"15": "కపెర్నహూమా ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు ",
"16": "మీ మాట వినే వాడు నా మాటా వింటాడు మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు ",
"17": "ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభూ దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి అని చెప్పారు",
"18": "అప్పుడు ఆయన సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను ",
"19": "ఇదిగో వినండి పాములనూ తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను మీకు ఏదీ ఏ మాత్రమూ హాని చేయదు ",
"20": "అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి అని వారికి చెప్పాడు",
"21": "ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు తండ్రీ ఆకాశానికీ భూమికీ ప్రభూ నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను అవును తండ్రీ అలా చేయడం నీకు అనుకూలం ఆయింది ",
"22": "నా తండ్రి నాకు అన్నిటినీ అప్పగించాడు కుమారుణ్ణి తండ్రి తప్ప మరెవరూ ఎరగరు అలాగే తండ్రి ఎవరో కుమారుడూ ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరగరు",
"23": "అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి ",
"24": "అనేకమంది ప్రవక్తలూ రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేకపోయారు వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెబుతున్నాను అని అన్నాడు",
"25": "ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ బోధకుడా నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి అని అడిగాడు ",
"26": "అందుకాయన ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది నువ్వు దానినెలా అర్ధం చేసుకున్నావు అని అడిగాడు ",
"27": "అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి అన్నాడు ",
"28": "దానికి ఆయన సరిగ్గా చెప్పావు నువ్వూ అలా చెయ్యి జీవిస్తావు అన్నాడు ",
"29": "అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు అది సరే గానీ నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాడు ",
"30": "అందుకు యేసు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి కొన ప్రాణంతో విడిచి పెట్టారు ",
"31": "అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు ",
"32": "ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు ",
"33": "అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు అతణ్ణి చూసి జాలి పడ్డాడు ",
"34": "అతనిపై నూనే ద్రాక్షారసం పోసి గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు ",
"35": "మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను అనిచెప్పి వెళ్ళిపోయాడు",
"36": "అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది అని అతనిని అడిగాడు",
"37": "దానికి అతడు అతని మీద జాలి చూపిన వాడే అన్నాడు యేసు నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి అని అతనితో చెప్పాడు ",
"38": "వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది ",
"39": "ఆమెకు మరియ అనే సోదరి ఉంది ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది ",
"40": "మార్త ఎన్నో పనులు పెట్టుకొని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి ప్రభూ నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది నీకేం పట్టదా వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు అంది ",
"41": "అందుకు ప్రభువు మార్తా మార్తా నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు కానీ అవసరమైంది ఒక్కటే",
"42": "మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు అని ఆమెతో చెప్పాడు",
"front": "\\s1 యేసు తనకు ముందుగా డెబ్భై మందిని పంపడం (మత్తయి 10:1-42)\n\\p "
}

59
luk/11.json Normal file
View File

@ -0,0 +1,59 @@
{
"1": "ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభూ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు అని ఆయనను అడిగాడు ",
"2": "అందుకు ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకంలో ఉన్న మా తండ్రీ నీ నామం పవిత్రంగా ఎంచబడు గాక నీ రాజ్యం వచ్చుగాక ",
"3": "మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి ",
"4": "మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు అని పలకండి అని చెప్పాడు",
"5": "తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా నాకు మూడు రొట్టెలు బదులివ్వు ",
"6": "నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరికి వచ్చాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పారనుకోండి",
"7": "అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసేశాను చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు నేను లేచి ఇవ్వలేను అని చెబుతాడా ",
"8": "మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెబుతున్నాను ",
"9": "అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి ఆయన ఇస్తాడు వెదకండి మీకు దొరుకుతుంది తలుపు తట్టండి మీకు తెరుచుకుంటుంది ",
"10": "అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది వెదికే వాడికి దొరుకుతుంది తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుందని మీకు చెబుతున్నాను",
"11": "మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా ",
"12": "గుడ్డు అడిగితే తేలునిస్తాడా ",
"13": "కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను కచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా అని చెప్పాడు",
"14": "ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు ",
"15": "అయితే వారిలో కొందరు వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పుకున్నారు ",
"16": "మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు",
"17": "ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు ఆయన వారితో ఇలా అన్నాడు తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది ",
"18": "సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది ",
"19": "నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు ",
"20": "అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే ",
"21": "బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది ",
"22": "అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు ",
"23": "నా వైపు ఉండని వాడు నాకు విరోధి నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే ",
"24": "అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది దానికెక్కడా విశ్రాంతి దొరకదు అందుకని అది నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను అనుకుంటుంది",
"25": "అది వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూసి ",
"26": "తిరిగి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది అని చెప్పాడు",
"27": "ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా నిన్ను మోసిన గర్భం నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం అని కేకలు వేసి చెప్పింది ",
"28": "దానికి ఆయన అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు అని చెప్పాడు ",
"29": "ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు ఈ తరం చెడ్డది వీరు సూచన అడుగుతున్నారు అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు ",
"30": "యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడూ ఈ తరానికి సూచనగా ఉంటాడు ",
"31": "దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు",
"32": "నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు ",
"33": "ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు ",
"34": "నీ దేహానికి దీపం నీ కన్నే నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది ",
"35": "కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో ",
"36": "నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది ",
"37": "ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు",
"38": "ఆయన భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు ",
"39": "అది చూసి ప్రభువిలా అన్నాడు పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో చెడుతనంతో నిండి ఉంది",
"40": "అవివేకులారా బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా ",
"41": "మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి",
"42": "అయ్యో పరిసయ్యులారా మీకు యాతన మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ న్యాయాన్నీ వదిలేస్తున్నారు మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి",
"43": "అయ్యో పరిసయ్యులారా మీకు యాతన మీరు సమాజ మందిరాల్లో అగ్ర స్థానాలూ వ్యాపార వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు ",
"44": "అయ్యో మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు ",
"45": "అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధకుడా ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు అని ఆయనతో అన్నాడు ",
"46": "అందుకు యేసు అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీకు యాతన మీరు మనుషులపై మోయలేని బరువులు మోపుతారు మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు ",
"47": "అయ్యో మీకు యాతన మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు ",
"48": "దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు వారు ప్రవక్తలను చంపారు మీరు సమాధులు కడుతున్నారు ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే నేను వారి దగ్గరికి ప్రవక్తలనూ అపొస్తలులనూ పంపుతాను",
"49": "వారు కొంత మందిని చంపుతారు కొంతమందిని హింసిస్తారు ",
"50": "",
"51": "",
"52": "అయ్యో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానం తాళం చెవిని తీసుకు పోయారు మీరు లోపల ప్రవేశించరు ప్రవేశించే వారిని అడ్డుకుంటారు అని చెప్పాడు",
"53": "",
"54": "",
"front": "\\s1 ప్రార్థన నమూనా\n\\p ",
"50-51": "కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను.\n\\p ",
"53-54": "ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయిన తరువాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన మాటల్లో తప్పు పట్టుకోడానికి చూస్తూ ఆయనతో వాదిస్తూ వచ్చారు. "
}

62
luk/12.json Normal file
View File

@ -0,0 +1,62 @@
{
"1": "అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు ",
"2": "కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు ",
"3": "అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు ",
"4": "నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు ",
"5": "ఎవరికి మీరు భయపడాలో చెబుతాను చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను ",
"6": "ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు ",
"7": "మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది భయపడకండి మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా ",
"8": "ఇంకా మీతో చెప్పేదేమిటంటే నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు ",
"9": "మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను",
"10": "మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు ",
"11": "వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు ",
"12": "మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు ",
"13": "ఆ జనసమూహంలో ఒకడు ఉపదేశకా వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి అన్నాడు ",
"14": "అందుకు ఆయన ఏమయ్యా మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు అన్నాడు ",
"15": "ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు మీరు అత్యాశకు చోటివ్వకండి జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు ",
"16": "తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది ",
"17": "అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు కాబట్టి నేనేం చేయాలి ఇలా చేస్తాను",
"18": "నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను వాటిలో నా ధాన్యమంతటినీ నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను ",
"19": "అప్పుడు నా ప్రాణంతో ప్రాణమా ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను సుఖపడు తిను తాగు సంతోషంగా ఉండు అని చెబుతాను అనుకున్నాడు",
"20": "అయితే దేవుడు అతడితో మూర్ఖుడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి అని అతనితో అన్నాడు ",
"21": "దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు అన్నాడు",
"22": "తరువాత ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు ",
"23": "ఆహారం కంటే ప్రాణం వస్త్రం కంటే దేహం గొప్పవి కావా ",
"24": "కాకుల గురించి ఆలోచించండి అవి విత్తనాలు చల్లవు కోయవు వాటికి గిడ్డంగులూ కొట్లూ లేవు అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు ",
"25": "పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు ",
"26": "కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి",
"27": "అవి కష్టపడవు బట్టలు నేయవు అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను ",
"28": "అల్ప విశ్వాసులారా ఈ వేళ పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా",
"29": "ఏం తింటాం ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి చింతించకండి ",
"30": "లోకులు వీటిని వెతుకుతారు ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు ",
"31": "మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి",
"32": "చిన్న మందా భయపడకండి మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం ",
"33": "మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి అక్కడికి దొంగ రాడు పురుగు పట్టదు ",
"34": "మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది ",
"35": "మీ నడుము బిగించుకుని ఉండండి మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి ",
"36": "యజమాని ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తూ అతడు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసే సేవకుల్లా ఉండండి",
"37": "యజమాని వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు ధన్యులు అప్పుడు అతడు తన నడుం కట్టుకొని వారిని భోజనానికి కూర్చోబెట్టి వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు కచ్చితంగా చెబుతున్నాను ",
"38": "అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు ",
"39": "దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి ",
"40": "మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి అని వారికి చెప్పాడు",
"41": "అప్పుడు పేతురు ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా అని ఆయనను అడిగాడు ",
"42": "దానికి ప్రభువు ఇలా అన్నాడు సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు ",
"43": "యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు ",
"44": "అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను ",
"45": "అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే ",
"46": "వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు",
"47": "తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి ",
"48": "దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు ",
"49": "నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను ",
"50": "అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ",
"51": "నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా కానే కాదు నేను చీలికలు కలగజేయడానికే వచ్చానని మీకు చెబుతున్నాను ",
"52": "ఇక నుండి ఒక ఇంట్లో ఉండే ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు ",
"53": "తండ్రి కొడుక్కీ కొడుకు తండ్రికీ తల్లి కూతురుకీ కూతురు తల్లికీ అత్త కోడలికీ కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు అని చెప్పాడు",
"54": "తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు అలాగే జరుగుతుంది ",
"55": "దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు అలాగే జరుగుతుంది ",
"56": "కపట భక్తులారా మీరు భూమి ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు ",
"57": "ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు ",
"58": "మీపై నేరారోపణ చేసే వాడితో కలసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి లేకుంటే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి లాక్కుపోతాడు ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు ఆ భటుడు నిన్ను జైల్లో పెడతాడు ",
"59": "చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను అన్నాడు",
"front": "\\s1 పరిసయ్యుల పొంగజేసే పదార్థం గురించి హెచ్చరిక (మార్కు 8:14-21)\n\\p "
}

38
luk/13.json Normal file
View File

@ -0,0 +1,38 @@
{
"1": "కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు ",
"2": "అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా",
"3": "కారని మీతో చెబుతున్నాను మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు ",
"4": "అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా ",
"5": "కానే కాదని మీతో చెబుతున్నా మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు ",
"6": "తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు",
"7": "దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు దీన్ని నరికెయ్యి దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి అన్నాడు ",
"8": "అయితే ఆ తోటమాలి అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి ",
"9": "అది ఫలిస్తే సరే లేకపోతే నరికించి వెయ్యి అన్నాడు",
"10": "ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు ",
"11": "బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది ",
"12": "యేసు ఆమెను చూసి తన దగ్గరికి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందావు అని ఆమెతో చెప్పి",
"13": "ఆమె మీద చేతులుంచాడు వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది ",
"14": "యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు అతడు జనసమూహాన్ని చూసి పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి విశ్రాంతి దినం మాత్రం రావద్దు అని చెప్పాడు ",
"15": "అందుకు ప్రభువు కపటులారా మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా ",
"16": "ఇదిగో పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా అన్నాడు",
"17": "ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు ",
"18": "ఆయన ఇలా అన్నాడు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది దాన్ని దేనితో పోల్చగలం ",
"19": "అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది అది పెరిగి పెద్ద చెట్టు అయింది ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి ",
"20": "మళ్ళీ ఆయన దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం ",
"21": "ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది అన్నాడు",
"22": "ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు ",
"23": "ఒకడు ప్రభూ రక్షణ పొందేది కొద్ది మందేనా అని ఆయనను అడిగాడు ",
"24": "దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను ",
"25": "ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ అయ్యా దయచేసి తలుపు తెరవండి అని ప్రార్థిస్తే",
"26": "ఆయన మీరు ఎవరో ఎక్కడి వారో నాకు తెలియదు అని మీతో అంటాడు అప్పుడు మీరు నీ ఎదుటనే మేము తిన్నాం తాగాం మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా అంటారు",
"27": "అప్పుడు ఆయన మళ్ళీ చెబుతున్నా మీరు ఎక్కడి వారో నాకు తెలియదు మీరంతా అక్రమాలు చేసేవారు నా దగ్గరనుంచి పొండి అంటాడు ",
"28": "అబ్రాహాము ఇస్సాకు యాకోబు ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు ",
"29": "ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు ",
"30": "ఇదిగో వినండి చివరి వారు మొదటి వారవుతారు అలాగే మొదటివారు చివరి వారవుతారు ",
"31": "అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు అని ఆయనతో చెప్పారు",
"32": "ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి ఇదిగో ఈ రోజూ రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను రోగులను స్వస్థ పరుస్తాను మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను",
"33": "అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు ",
"34": "యెరూషలేమా ఓ యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను కాని నువ్వు కలిసి రాలేదు ",
"35": "ఇదిగో విను నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను ప్రభువు పేరిట వచ్చే వాడు ధన్యుడు అని నువ్వు చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవని నీతో కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు",
"front": "\\s1 ఇతరులను వేలెత్తి చూపకూడదు\n\\p "
}

38
luk/14.json Normal file
View File

@ -0,0 +1,38 @@
{
"1": "ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు ",
"2": "అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు",
"3": "అప్పుడు యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు ",
"4": "వారు మాట్లాడలేదు అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు ",
"5": "మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా అని వారిని అడిగాడు",
"6": "ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు ",
"7": "ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు ",
"8": "నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు",
"9": "మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు అనవచ్చు అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు",
"10": "కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో మిత్రమా పై స్థానానికి వెళ్ళు అనవచ్చు అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది",
"11": "తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది ",
"12": "తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు ",
"13": "అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు ",
"14": "నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పాడు",
"15": "ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అని ఆయనతో అన్నాడు ",
"16": "అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలా మందిని పిలిచాడు ",
"17": "విందుకు వేళయినప్పుడు అతడు ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది రండి అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన సేవకుణ్ణి పంపాడు ",
"18": "అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు మొదటివాడు నేనొక పొలం కొన్నాను వెంటనే వెళ్ళి దాన్ని చూసుకోవాలి నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను అన్నాడు",
"19": "మరొకడు నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను అన్నాడు ",
"20": "మరొకడు నేను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి రాలేను అన్నాడు ",
"21": "అప్పుడాపనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు ",
"22": "తరువాత ఆ పనివాడు వచ్చి ప్రభూ నువ్వు చెప్పినట్టే చేశాను కానీ ఇంకా చోటు ఉంది అన్నాడు ",
"23": "అప్పుడు ఆ యజమాని తన సేవకుడితో నా ఇల్లు నిండిపోవాలి కాబట్టి నువ్వు రాజ మార్గాల్లోకీ కంచెల్లోకీ వెళ్లి అక్కడి వారిని బలవంతంగా తీసుకురా ",
"24": "నేను నీకు చెబుతున్నాను నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు అన్నాడు",
"25": "గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు ",
"26": "నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు ",
"27": "అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు ",
"28": "మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా ",
"29": "అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే ",
"30": "చూస్తున్న వారంతా ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు అంటూ వేళాకోళం చేస్తారు",
"31": "అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా ",
"32": "తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా ",
"33": "అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు ",
"34": "ఉప్పు మంచిదే అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది ",
"35": "అది భూమికి గానీ ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు కాబట్టి దాన్ని బయట పారవేస్తారు వినడానికి చెవులున్న వాడు విను గాక",
"front": "\\s1 విశ్రాంతి దినాన యేసు స్వస్థపరిచాడు\n\\p "
}

35
luk/15.json Normal file
View File

@ -0,0 +1,35 @@
{
"1": "తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు ",
"2": "పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ అది చూసి ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు అని సణుక్కున్నారు ",
"3": "అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు ",
"4": "మీలో ఏ మనిషికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకూ వెదకడా ",
"5": "అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ ఇరుగుపొరుగు వారినీ పిలిచి",
"6": "మీరు నాతో కలిసి సంతోషించండి ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని వారితో చెబుతాడు కదా",
"7": "అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది ",
"8": "ఒకామెకు పది వెండి నాణాలు ఉండి వాటిలో ఒకటి పోతే ఆమె దాని కోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి పోయిన నాణెం దొరికే వరకూ జాగ్రత్తగా వెదకదా",
"9": "అది దొరికినప్పుడు తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వారినీ పిలిచి నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది కాబట్టి నాతో కలసి సంతోషించండి అంటుంది కదా",
"10": "అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను అన్నాడు",
"11": "ఆయన ఇంకా ఇలా అన్నాడు ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ",
"12": "వారిలో చిన్నవాడు నాన్నా ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు అన్నాడు తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు",
"13": "కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు",
"14": "అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది అతనికి ఇబ్బందులు మొదలైనాయి ",
"15": "దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు ",
"16": "అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు ",
"17": "అతనికి బుద్ధి వచ్చింది అతడిలా అనుకున్నాడు నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను ",
"18": "నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నాన్నా నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను",
"19": "ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు",
"20": "అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు ",
"21": "అప్పుడు ఆ కొడుకు తండ్రితో నాన్నా నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు అన్నాడు ",
"22": "అయితే తండ్రి తన సేవకులతో శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి ఇతని చేతికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి",
"23": "కొవ్విన దూడను తెచ్చి వధించండి మనం తిని సంబరాలు చేసుకుందాం ",
"24": "నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పాడు అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు ",
"25": "ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం నాట్యధ్వని అతనికి వినిపించాయి ",
"26": "ఒక సేవకుణ్ణి పిలిచి ఏం జరుగుతోంది అని అడిగాడు ",
"27": "ఆ పనివాడు అతనితో నీ తమ్ముడు వచ్చాడు అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు అని చెప్పాడు ",
"28": "దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు",
"29": "కాని అతడు ఇదిగో విను ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను ఏనాడూ నీ మాట జవదాటలేదు అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు ",
"30": "కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు అంటూ నిష్టూరంగా మాట్లాడాడు",
"31": "అందుకతని తండ్రి నాయనా నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు నావన్నీ నీవే ",
"32": "మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పాడు",
"front": "\\s1 సణుక్కున్న పరిసయ్యులు\n\\p "
}

35
luk/16.json Normal file
View File

@ -0,0 +1,35 @@
{
"1": "ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది",
"2": "అతడు ఆ అధికారిని పిలిపించి నీ గురించి నేను వింటున్నదేమిటి నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు ఇక పైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు ",
"3": "అప్పుడతడు యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి తవ్వకం పని నాకు చేతకాదు భిక్షమెత్తాలంటే అవమానం ",
"4": "నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తరువాత నలుగురూ తమ ఇళ్ళలోకి నన్ను ఆహ్వానించాలంటే ఎలా చేయాలో నాకు తెలుసులే అనుకున్నాడు ",
"5": "ఆ తరువాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు ఒకడితో నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని అడిగాడు ",
"6": "మూడు వేల లీటర్ల నూనె అని అతడు జవాబిచ్చాడు ఈ అధికారి ఆ వ్యక్తితో నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో అన్నాడు ",
"7": "నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని మరొకణ్ణి అడిగితే అతడు వంద మానికల గోదుమలు అని చెప్పాడు నిర్వహణాధికారి అతనితో నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో అన్నాడు ",
"8": "న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు ",
"9": "అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను ",
"10": "చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు",
"11": "కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు ",
"12": "మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు ",
"13": "ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు ",
"14": "డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు ",
"15": "ఆయన వారితో ఇలా అన్నాడు మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం ",
"16": "బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు ",
"17": "ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పిపోవడం కంటే ఆకాశం భూమీ నశించి పోవడమే తేలిక ",
"18": "భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు ",
"19": "ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు ఊదారంగు వస్త్రాలూ ఖరీదైన బట్టలూ ధరించేవాడు ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు ",
"20": "లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు ",
"21": "ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి ",
"22": "ఆ నిరుపేద చనిపోయాడు దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు అతణ్ణి పాతిపెట్టారు ",
"23": "అతడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి ",
"24": "తండ్రీ అబ్రాహామూ నన్ను కరుణించు నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు అని కేకలు పెట్టాడు ",
"25": "దానికి జవాబుగా అబ్రాహాము నాయనా గుర్తుందా నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు నువ్వు యాతన పడుతున్నావు ",
"26": "అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది అన్నాడు",
"27": "",
"28": "",
"29": "అందుకు అబ్రాహాము వారి దగ్గర మోషే ప్రవక్తలూ ఉన్నారు నీ సోదరులు వారి మాటలు వినాలి అన్నాడు ",
"30": "అతడు తండ్రీ అబ్రాహామూ అలా అనకు చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు అన్నాడు",
"31": "అందుకు అబ్రాహాము అతనితో మోషే ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు అన్నాడు",
"front": "\\s1 న్యాయం తప్పిన మేనేజర్ ఉపమానం\n\\p ",
"27-28": "అప్పుడతడు, ‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. "
}

40
luk/17.json Normal file
View File

@ -0,0 +1,40 @@
{
"1": "ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో",
"2": "అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు ",
"3": "మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి ",
"4": "అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడుతున్నాను అంటే మీరు అతణ్ణి క్షమించాలి ",
"5": "అప్పుడు అపొస్తలులు ప్రభూ మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అన్నారు ",
"6": "ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది ",
"7": "మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో అంటాడా అనడు",
"8": "పైగా నాకు భోజనం సిద్ధం చెయ్యి తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి ఆ తరువాత నువ్వు తినవచ్చు అంటాడు ",
"9": "తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని నాపై దయ చూపించావు అని వాణ్ణి మెచ్చుకుంటాడా ",
"10": "అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత మేము ఏ యోగ్యతా లేని సేవకులం మేము చేయాల్సిందే చేశాం అని చెప్పాలి ",
"11": "ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ ",
"12": "ఒక గ్రామంలో ప్రవేశించాడు అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు ",
"13": "యేసూ ప్రభూ మాపై జాలి చూపు అని గట్టిగా కేకలు వేశారు ",
"14": "ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకు కనపడండి అని చెప్పాడు వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు ",
"15": "వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి ",
"16": "బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు వాడు సమరయ ప్రాంతం వాడు ",
"17": "అందుకు యేసు పది మంది శుద్ధులయ్యారు కదా తక్కిన తొమ్మిది మంది ఏరీ ",
"18": "దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి అన్నాడు",
"19": "నువ్వు లేచి వెళ్ళు నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అని వాడితో చెప్పాడు",
"20": "ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయనను అడిగారు దానికి ఆయన దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు ",
"21": "ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు అని వారికి జవాబిచ్చాడు",
"22": "ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది కానీ మీరు ఆ రోజును చూడరు ",
"23": "వారు ఇదిగో ఇక్కడుంది అదిగో అక్కడుంది అంటారు మీరు వెళ్ళవద్దు అసలు వారిని అనుసరించవద్దు ",
"24": "ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు",
"25": "అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి ",
"26": "నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది ",
"27": "నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది ",
"28": "లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు",
"29": "అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు ",
"30": "అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది ",
"31": "ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు ",
"32": "లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ",
"33": "తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు ",
"34": "నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది ",
"35": "ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు వారిలో ఒకామె వెళ్ళిపోవడం మరొకామె ఉండిపోవడం జరుగుతుంది ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు వారిలో ఒకడు వెళ్ళిపోతాడు మరొకడు ఉండిపోతాడు",
"36": "అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. ",
"37": "దానికి జవాబుగా ఆయన శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి అన్నాడు",
"front": "\\s1 క్షమాపణ గురించిన ఉపదేశం (మత్తయి 18:7,15)\n\\p "
}

46
luk/18.json Normal file
View File

@ -0,0 +1,46 @@
{
"1": "తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు",
"2": "ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతనికి దేవుడంటే భయం లేదు మనుషులంటే లెక్కలేదు ",
"3": "ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి అని అడుగుతూ ఉండేది",
"4": "అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు నేను దేవుడికి భయపడను మనుషులనూ లెక్కచెయ్యను ",
"5": "కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను అనుకున్నాడు ",
"6": "ఇంకా ప్రభువు ఇలా అన్నాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా ",
"7": "తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా ",
"8": "ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా ",
"9": "తామే నీతిమంతులని తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు ",
"10": "ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు వారిలో ఒకడు పరిసయ్యుడు ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు ",
"11": "పరిసయ్యుడు నిలబడి దేవా నేను దొంగలూ అన్యాయం చేసేవారూ వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ",
"12": "వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు",
"13": "అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు వాడు గుండెలు బాదుకుంటూ దేవా నేను పాపిని నన్ను కరుణించు అన్నాడు ",
"14": "పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది",
"15": "తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు ",
"16": "అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు పిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి వారిని ఆటంకపెట్టవద్దు ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే ",
"17": "చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు ",
"18": "ఒక అధికారి ఆయనను చూసి మంచి ఉపదేశకా నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు ",
"19": "అందుకు యేసు నన్ను మంచివాడని ఎందుకంటున్నావు దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు ",
"20": "వ్యభిచారం చేయవద్దు హత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు నీ తండ్రినీ తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని అతనితో అన్నాడు",
"21": "దానికి జవాబుగా అతడు వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను అన్నాడు",
"22": "యేసు అతని మాట విని ఇలా అన్నాడు నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు అన్నాడు",
"23": "అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు ",
"24": "యేసు అతన్ని చూసి ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం ",
"25": "ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక అన్నాడు",
"26": "ఇది విన్న వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని అడిగారు ",
"27": "అందుకు ఆయన మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని చెప్పాడు ",
"28": "అప్పుడు పేతురు ఇలా అన్నాడు చూడు మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం ",
"29": "అందుకు ఆయన దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా భార్య నైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా వదులుకుంటే అతనికి ",
"30": "ఈ లోకంలో ఎన్నో రెట్లు రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు",
"31": "ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి వినండి మనం యెరూషలేము వెళ్తున్నాం ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి ",
"32": "ఆయనను యూదేతరులకు పట్టిస్తారు వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు అవమానిస్తారు ఆయన మీద ఉమ్మి వేస్తారు",
"33": "ఆయనను కొరడాలతో కొడతారు చంపివేస్తారు కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు",
"34": "వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు ఈ సంగతి వారికి మర్మంగా ఉంది కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు ",
"35": "ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు ",
"36": "పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి ఏం జరుగుతోంది అని అడిగాడు ",
"37": "నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు ",
"38": "అప్పుడు వాడు యేసూ దావీదు కుమారా నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలు పెట్టాడు",
"39": "ముందు నడుస్తున్నవారు నోరు మూసుకో అని గద్దించారు కానీ వాడు యేసూ దావీదు కుమారా నన్ను కరుణించు అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు",
"40": "అప్పుడు యేసు నిలబడి వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు ",
"41": "వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు అని అడిగాడు దానికి వాడు ప్రభూ నాకు చూపు కావాలి అన్నాడు",
"42": "దానికి యేసు చూపు పొందు నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అని వాడితో చెప్పాడు",
"43": "వెంటనే వాడు చూపు పొందాడు దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు",
"front": "\\s1 న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం\n\\p "
}

52
luk/19.json Normal file
View File

@ -0,0 +1,52 @@
{
"1": "ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి ",
"2": "దానిగుండా వెళ్తున్నాడు అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు ధనవంతుడు ",
"3": "ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు కాని జనసమూహం గుమిగూడడం వలనా ఇతడు పొట్టివాడు కావడం వలనా చూడలేకపోయాడు ",
"4": "అప్పుడు యేసు ఆ దారిలోనే వస్తున్నాడు కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు ",
"5": "యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తలెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగిరా ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు ",
"6": "అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు ",
"7": "అది చూసి అందరూ ఈయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు అని గొణగడం మొదలుపెట్టారు",
"8": "జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభూ నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను అన్నాడు ",
"9": "అందుకు యేసు ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే ",
"10": "నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్పాడు",
"11": "వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు ",
"12": "గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు ",
"13": "దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి అని చెప్పాడు ",
"14": "అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు అంటూ అతని వెనుకే రాయబారం పంపారు ",
"15": "అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చాడు తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు ",
"16": "మొదటి వాడు వచ్చి అయ్యా మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది అన్నాడు ",
"17": "దానికి ఆ యజమాని భలే మంచి సేవకా నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు ",
"18": "ఇక రెండవ పనివాడు వచ్చాడు అయ్యా మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను అన్నాడు ",
"19": "యజమాని వాడితో నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు ",
"20": "అప్పుడు మరో పనివాడు వచ్చాడు వాడిలా అన్నాడు అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం ",
"21": "దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను నువ్వు కఠినుడివని నాకు తెలుసు నువ్వు పెట్టని చోట తీసుకుంటావు నాటని చోట పంట కోస్తావు అన్నాడు",
"22": "అందుకా యజమాని చెడ్డ సేవకా నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను నేను పెట్టని చోట తీసుకుంటాను నాటని చోట పంట కోస్తాను కఠినుడినని నీకు తెలుసు కదా",
"23": "అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా అని వాడితో చెప్పి",
"24": "తన దగ్గర ఉన్న వారితో వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి అన్నాడు ",
"25": "దానికి వారు అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా అన్నారు",
"26": "అందుకు అతడు ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను ",
"27": "మరోమాట నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి అన్నాడు",
"28": "యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు ",
"29": "ఆయన ఆలీవ్ కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు ",
"30": "మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు దాన్ని విప్పి తోలుకు రండి ",
"31": "ఎవరైనా దీన్ని ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావాలి అని చెప్పండి అని చెప్పి వారిని పంపించాడు",
"32": "ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు ",
"33": "ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు అని వారినడిగారు ",
"34": "దానికి వారు ఇది ప్రభువుకు కావాలి అన్నారు ",
"35": "తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు ",
"36": "ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు ",
"37": "ఆలీవ్ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు ",
"38": "ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక పరలోకంలో శాంతీ ఉన్నత స్థలంలో మహిమ అన్నారు ",
"39": "ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకా నీ శిష్యులను గద్దించు అని ఆయనతో అన్నారు ",
"40": "ఆయన వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను అన్నాడు ",
"41": "ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు ",
"42": "నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు ",
"43": "ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు",
"44": "నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది అన్నాడు",
"45": "",
"46": "",
"47": "ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు",
"48": "కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు",
"front": "\\s1 జక్కయ మార్పు\n\\p ",
"45-46": "అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. "
}

57
luk/2.json Normal file
View File

@ -0,0 +1,57 @@
{
"1": "ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు ",
"2": "ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య ",
"3": "అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు ",
"4": "యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు ",
"5": "తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు ",
"6": "వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి ",
"7": "ఆమె తన తొలిచూలు బిడ్డను కని మెత్తని గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు ",
"8": "ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు ",
"9": "ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది వారు హడలిపోయారు ",
"10": "అయితే ఆ దూత భయపడకండి ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను ",
"11": "దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు ఈయన ప్రభువైన క్రీస్తు ",
"12": "మీకు కొండ గుర్తు ఒకటే ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు అని వారితో చెప్పాడు",
"13": "ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి",
"14": "సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక ",
"15": "ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి అని ఒకడితో ఒకడు చెప్పుకొని ",
"16": "త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు ",
"17": "ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు ",
"18": "గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు ",
"19": "మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది ",
"20": "ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు ",
"21": "ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు ",
"22": "",
"23": "",
"24": "",
"25": "యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు అతడు న్యాయవంతుడు భక్తిపరుడు ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు ",
"26": "అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు ",
"27": "ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు ",
"28": "సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు ",
"29": "ప్రభూ ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా ",
"30": "",
"31": "",
"32": "",
"33": "యోసేపు ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు ",
"34": "అతడు వారిని దీవించి మరియతో ఇలా అన్నాడు అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు ",
"35": "అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది ",
"36": "దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది ఆమెది ఆషేరు గోత్రం ఆమె పనూయేలు కుమార్తె ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో ",
"37": "ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది ",
"38": "ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది ",
"39": "ఆ విధంగా యోసేపు మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు ",
"40": "పసివాడు ఎదుగుతూ బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు దేవుని దయ ఆయన మీద ఉంది ",
"41": "పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు ",
"42": "ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు ",
"43": "ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి తెలియలేదు ",
"44": "ఆయన గుంపులో ఉన్నాడనుకుని ఒక రోజు ప్రయాణం చేసి తమ బంధువుల్లో అయిన వారిలో ఆయనను వెదకసాగారు ",
"45": "ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు ",
"46": "అప్పటికి మూడు రోజులైంది ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు ",
"47": "ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు ",
"48": "ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఆయన తల్లి కుమారా ఎందుకిలా చేశావు మీ నాన్న నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం అంది ",
"49": "అందుకు ఆయన మీరెందుకు నన్ను వెతుకుతున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు ",
"50": "కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు ",
"51": "అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికొంది ",
"52": "యేసు జ్ఞానంలోనూ వయసులోనూ దేవుని దయలోనూ మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు",
"front": "\\s1 యేసు జననం (మత్తయి 1:18-25. 2:1)\n\\p ",
"22-24": "మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. ”ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లల్ని గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.\n\\s1 సుమెయోను ఆరాధన, ప్రవచనం\n\\p ",
"30-32": "అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా\n\\q1 నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”\n\\p "
}

52
luk/20.json Normal file
View File

@ -0,0 +1,52 @@
{
"1": "ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు అప్పుడు ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ",
"2": "నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు ఈ అధికారం నీకెవరు ఇచ్చారు మాకు చెప్పు అని ఆయనను అడిగారు ",
"3": "దానికి ఆయన నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నాకు జవాబివ్వండి ",
"4": "యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా మనుషుల్లో నుండి కలిగిందా అని వారినడిగాడు",
"5": "వారు ఇలా ఆలోచించారు మనం పరలోకం నుండి కలిగింది అంటే అలాగైతే మీరెందుకు నమ్మలేదు అని అడుగుతాడు ",
"6": "మనుషుల్లో నుండి కలిగింది అంటే జనం మనల్ని రాళ్ళతో కొడతారు ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు ",
"7": "ఇలా ఆలోచించుకుని వారు అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు అని జవాబిచ్చారు ",
"8": "దానికి యేసు నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను అన్నాడు ",
"9": "ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు ఒక మనిషి ద్రాక్షతోట నాటించి దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు",
"10": "కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు ",
"11": "మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు వారు వాణ్ణి కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు",
"12": "మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు ",
"13": "అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో ",
"14": "అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి ఇతడే వారసుడు ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ",
"15": "వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు ",
"16": "అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు వారు అది విని అలా ఎన్నటికీ కాకూడదు అన్నారు ",
"17": "ఆయన వారిని చూసి అలాగైతే ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది ",
"18": "ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది ",
"19": "ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు ",
"20": "వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు ",
"21": "వారు వచ్చి బోధకా నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు ",
"22": "మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని ఆయనను అడిగారు",
"23": "ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి ",
"24": "ఒక నాణెం చూపించండి దీని మీది బొమ్మ అక్షరాలు ఎవరివి అని అడిగాడు వారు సీజరువి అన్నారు ",
"25": "అందుకాయన ఆలాగైతే సీజరువి సీజరుకు దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు ",
"26": "వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు ",
"27": "పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు ",
"28": "బోధకా ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా",
"29": "ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు ",
"30": "రెండవవాడు మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు",
"31": "ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు ",
"32": "ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది",
"33": "ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా అన్నారు",
"34": "అందుకు యేసు ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ ",
"35": "పరలోకంలో నిత్యజీవానికీ మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు ",
"36": "వారు పునరుత్థానంలో భాగస్తులు దేవదూతలతో సమానులు దేవుని బిడ్డలు కాబట్టి ఇక వారికి చావు లేదు ",
"37": "మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా",
"38": "ఆయన సజీవులకే దేవుడు మృతులకు కాదు ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి జవాబిచ్చాడు",
"39": "",
"40": "",
"41": "ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు ",
"42": "",
"43": "",
"44": "దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు అన్నాడు",
"45": "ప్రజలందరూ వింటుండగా ఆయన శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి వారు నిలువుటంగీలు వేసుకొని తిరుగుతూ ఉండాలని చూస్తారు",
"46": "వ్యాపార వీధుల్లో వందనాలను సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు ",
"47": "వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు అని తన శిష్యులతో చెప్పాడు",
"front": "\\s1 యేసుకు అధికారం ఎక్కడిది? (మత్తయి 21:23-27. మార్కు 11:27-33)\n\\p ",
"39-40": "ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు. ",
"42-43": "“నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ,\n\\q1 నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.\n\\p "
}

41
luk/21.json Normal file
View File

@ -0,0 +1,41 @@
{
"1": "హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు ",
"2": "ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు ",
"3": "అప్పుడాయన ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను ",
"4": "వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది అని వారితో చెప్పాడు",
"5": "దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు ",
"6": "అప్పుడు ఆయన ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది అన్నాడు",
"7": "అప్పుడు వారు బోధకా ఇవి ఎప్పుడు జరుగుతాయి ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది అని ఆయనను అడిగారు ",
"8": "ఆయన మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి చాలా మంది నా పేర వచ్చి నేనే ఆయనను అంటారు ఆ కాలం దగ్గర పడింది అంటారు మీరు వారిని అనుసరించవద్దు ",
"9": "మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు అన్నాడు",
"10": "ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది ",
"11": "కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి ",
"12": "ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు ",
"13": "దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది ",
"14": "కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి",
"15": "మీ విరోధులు ఎదిరించలేని కాదనలేని జ్ఞానాన్నీ నోటిమాటలనూ మీకిస్తాను ",
"16": "తల్లిదండ్రులూ అన్నదమ్ములూ బంధువులూ స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు వారు మీలో కొంతమందిని చంపిస్తారు ",
"17": "నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు ",
"18": "కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు ",
"19": "మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు ",
"20": "యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి ",
"21": "అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు ",
"22": "ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి ",
"23": "ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది",
"24": "వారు కత్తిపాలై చనిపోతారు శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు ",
"25": "ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి సముద్రం దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు ",
"26": "ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది వారు గుండెలవిసి పోయి కూలిపోతారు",
"27": "అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు ",
"28": "ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి తలలు పైకెత్తి చూడండి మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది అన్నాడు",
"29": "తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి ",
"30": "అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా",
"31": "అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి ",
"32": "ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను ",
"33": "ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు ",
"34": "తినడం తాగడం వల్లా మత్తుగా ఉండడం వల్లా ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి ",
"35": "ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది ",
"36": "కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అని చెప్పాడు",
"37": "ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు ",
"38": "ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు",
"front": "\\s1 వితంతువు వేసిన కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం (మార్కు 12:41,44)\n\\p "
}

74
luk/22.json Normal file
View File

@ -0,0 +1,74 @@
{
"1": "పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది ",
"2": "ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు ",
"3": "అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు ",
"4": "దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో అధికారులతో మాట్లాడాడు ",
"5": "దానికి వారు సంతోషించారు అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు ",
"6": "అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు",
"7": "పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది ",
"8": "యేసు పేతురు యోహానులతో మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి అన్నాడు ",
"9": "వారు మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి అని అడిగారు",
"10": "ఆయన మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి ",
"11": "మా గురువు నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి ",
"12": "అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు అక్కడ సిద్ధం చేయండి అని వారితో చెప్పాడు",
"13": "సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు ",
"14": "సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు ",
"15": "అప్పుడాయన నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను ",
"16": "ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను ",
"17": "తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి మీరు దీన్ని తీసుకుని పంచుకోండి ",
"18": "ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు ",
"19": "ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి అని చెప్పాడు ",
"20": "అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన ",
"21": "వినండి నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు",
"22": "దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు అన్నాడు",
"23": "ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు ",
"24": "తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది ",
"25": "అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు ప్రజల మీద అధికారం చెలాయించే వారు ధర్మదాతలు అని పిలిపించుకుంటారు ",
"26": "మీరు అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు తక్కువవాడుగా నాయకుడు సేవకుడిలా ఉండాలి ",
"27": "అసలు గొప్పవాడు అంటే ఎవరు భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా భోజనానికి కూర్చునే వాడే కదా అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను ",
"28": "నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు ",
"29": "నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి",
"30": "సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.\n\\s1 పేతురు చెప్పనున్న అబద్ధం (మత్తయి 26:33-35. మార్కు 14:29-31)\n\\p ",
"31": "“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. ",
"32": "నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” ",
"33": "కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. ",
"34": "అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.\n\\s1 వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు\n\\p ",
"35": "ఇంకా ఆయన, “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. ",
"36": "ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.\n\\p ",
"37": "‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. ",
"38": "శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.\n\\s1 గేత్సెమనే వనంలో యేసు (మత్తయి 26:36-46. మార్కు 14:32,42. యోహాను 18:1)\n\\p ",
"39": "భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. ",
"40": "వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు. ",
"41": "వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు. ",
"42": "“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.” ",
"43": "అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.\n\\p ",
"44": "ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది. ",
"45": "ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు. ",
"46": "వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.\n\\s1 యూదా ద్రోహం (మత్తయి 26:47-56. మార్కు 14:43-50. యోహాను 18:3-11)\n\\p ",
"47": "ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు. ",
"48": "అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు. ",
"49": "ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు. ",
"50": "ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు. ",
"51": "దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.\n\\p ",
"52": "తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా? ",
"53": "నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.\n\\s1 యేసును బంధించడం. పేతురు అబద్ధం (మత్తయి 26:57, 69-75. మార్కు 14:53,54, 66-72. యోహాను 18:12, 15-18, 25-27)\n\\p ",
"54": "వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు. ",
"55": "అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.\n\\p ",
"56": "అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది. ",
"57": "దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు. ",
"58": "కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు. ",
"59": "మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు. ",
"60": "అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. ",
"61": "అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. ",
"62": "దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.\n\\s1 యేసును కొట్టడం (మత్తయి 26:67,68. మార్కు 14:65. యోహాను 18:22,23)\n\\p ",
"63": "యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. ",
"64": "ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు. ",
"65": "ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.\n\\s1 సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు (మత్తయి 26:59-68. మార్కు 14:55-65. యోహాను 18:19-24)\n\\p ",
"66": "ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు. ",
"67": "“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. ",
"68": "అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు. ",
"69": "అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు. ",
"70": "“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు. ",
"71": "అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.",
"front": "\\s1 యేసును పట్టివ్వడానికి యూదా లాలూచీ (మత్తయి 26:2,4. మార్కు 14:1,2,10,11)\n\\p "
}

59
luk/23.json Normal file
View File

@ -0,0 +1,59 @@
{
"1": "అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. ",
"2": "“ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు. ",
"3": "అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు.\n\\p ",
"4": "పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు. ",
"5": "అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.\n\\s1 హేరోదు ఎదుట యేసు\n\\p ",
"6": "పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు. ",
"7": "ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.\n\\p ",
"8": "హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు. ",
"9": "హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.\n\\p ",
"10": "ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ",
"11": "హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. ",
"12": "అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు.\n\\s1 మళ్ళీ పిలాతు ఎదుటికి, బరబ్బా విడుదల, యేసుకు మరణ శిక్ష (మత్తయి 27:15-26. మార్కు 15:6-15. యోహాను 18:39,40)\n\\p ",
"13": "అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు. ",
"14": "“ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు. ",
"15": "హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు. ",
"16": "అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.\n\\p ",
"17": "పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక. ",
"18": "అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు. ",
"19": "బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు.\n\\p ",
"20": "పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు. ",
"21": "కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు. ",
"22": "మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు.\n\\p ",
"23": "కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి. ",
"24": "వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు. ",
"25": "వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.\n\\p ",
"26": "వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు.\n\\s1 సిలువ (మత్తయి 27:33-38. మార్కు 15:22-28. యోహాను 19:17-19)\n\\p ",
"27": "పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.\n\\p ",
"28": "యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.\n\\p ",
"29": "వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి.\n\\p ",
"30": "అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.\n\\p ",
"31": "చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు.\n\\p ",
"32": "ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. ",
"33": "వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.\n\\p ",
"34": "అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.\n\\p ",
"35": "ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు.\n\\p ",
"36": "ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ ",
"37": "“నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. ",
"38": "“ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు.\n\\s1 పరితాపం చెందిన దొంగ (మత్తయి 27:44. మార్కు 15:32)\n\\p ",
"39": "వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు.\n\\p ",
"40": "కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? ",
"41": "మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.\n\\p ",
"42": "తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. ",
"43": "అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.\n\\p ",
"44": "అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. ",
"45": "సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.\n\\s1 యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించడం (మత్తయి 27:50. మార్కు 15:37. యోహాను 19:30)\n\\p ",
"46": "అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.\n\\p ",
"47": "శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. ",
"48": "ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ",
"49": "ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.\n\\s1 భూస్థాపన (మత్తయి 27:57-61. మార్కు 15:42,47. యోహాను 19:38,42)\n\\p ",
"50": "యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. ",
"51": "మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ",
"52": "అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.\n\\p ",
"53": "తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.\n\\p ",
"54": "అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది. ",
"55": "అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి ",
"56": "తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.",
"front": "\\s1 పిలాతు ఎదుట యేసు (మత్తయి 27:2, 11-14. మార్కు 15:1-5. యోహాను 18:28-38)\n\\p "
}

56
luk/24.json Normal file
View File

@ -0,0 +1,56 @@
{
"1": "ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. ",
"2": "సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. ",
"3": "కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు.\n\\p ",
"4": "అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. ",
"5": "వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? ",
"6": "ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు ",
"7": "మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు.\n\\p ",
"8": "అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. ",
"9": "వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.\n\\p ",
"10": "ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ. ",
"11": "అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు. ",
"12": "అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.\n\\s1 పునరుత్థాన క్రీస్తు పరిచర్య\n\\p ",
"13": "ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు. ",
"14": "జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. ",
"15": "అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. ",
"16": "అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది.\n\\p ",
"17": "ఆయన, “మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?” అని వారిని అడిగాడు. దాంతో వారు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు. ",
"18": "వారిలో క్లెయొపా అనేవాడు, “యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా” అన్నాడు.\n\\p ",
"19": "ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. ",
"20": "మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా? ",
"21": "ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.\n\\p ",
"22": "అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. ",
"23": "కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ",
"24": "మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు” అని ఆయనకు చెప్పారు.\n\\p ",
"25": "అందుకాయన, “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, ",
"26": "క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?” అని వారితో అన్నాడు. ",
"27": "ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు.\n\\p ",
"28": "ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది. ",
"29": "దాంతో వారు, “పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు” అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.\n\\p ",
"30": "ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు. ",
"31": "అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు. ",
"32": "అప్పుడు వారు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్టు అనిపించ లేదూ” అని చెప్పుకున్నారు.\n\\p ",
"33": "అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని ",
"34": "“ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని",
"35": "దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.\n\\p ",
"36": "వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. ",
"37": "అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. ",
"38": "అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? ",
"39": "నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. ",
"40": "అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.\n\\p ",
"41": "అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. ",
"42": "వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ",
"43": "ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. ",
"44": "తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. ",
"45": "అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.\n\\s1 మహాభినియామకం (మత్తయి 28:18-20. మార్కు 16:15-18. యోహాను 1:8)\n\\p ",
"46": "“క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, ",
"47": "యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. ",
"48": "మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.\n\\s1 క్రీస్తు ఆరోహణం (మార్కు 16:19,20. అపొ.కా.1:9,11)\n\\p ",
"49": "“వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. ",
"50": "ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ",
"51": "అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ",
"52": "వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ",
"53": "దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.",
"front": "\\s1 యేసు క్రీస్తు పునరుత్థానం (మత్తయి 28:1-6. మార్కు 16:1-8. యోహాను 20:1-17)\n\\p "
}

41
luk/3.json Normal file
View File

@ -0,0 +1,41 @@
{
"1": "సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్ హేరోదు గలిలయ చతుర్థాధికారి అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి ",
"2": "అన్న కయప ముఖ్య యాజకులు అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది ",
"3": "అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు ",
"4": "యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి ఆయన బాటలు తిన్నగా చేయండి ",
"5": "ప్రతి లోయనూ పూడ్చాలి ప్రతి పర్వతాన్నీ మెరకనూ పల్లం చేయాలి వంకర దారులు సరి అవుతాయి గరుకు బాటలు నునుపు అవుతాయి ",
"6": "ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు ",
"7": "అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో సర్ప సంతానమా రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు ",
"8": "పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెప్తున్నాను ",
"9": "ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు అని చెప్పాడు",
"10": "అప్పుడు గుంపులో కొంతమంది అయితే మేమేం చేయాలి అని అతన్ని అడిగారు ",
"11": "అతడు రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటివ్వాలి భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి అని చెప్పాడు ",
"12": "పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి బోధకా మేమేం చేయాలి అని అతన్ని అడిగారు ",
"13": "అతడు మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు అని వారితో చెప్పాడు ",
"14": "మా సంగతేంటి మేమేం చేయాలి అని కొంతమంది సైనికులు కూడా అడిగారు ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు మీ జీతంతో తృప్తిపడండి అని అతడు వారితో చెప్పాడు ",
"15": "క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు ",
"16": "వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు ",
"17": "తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది తన గిడ్డంగిలో గోదుమలు పోసి పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు ",
"18": "అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు",
"19": "అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు ",
"20": "హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు",
"21": "ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది ",
"22": "పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీవు నా ప్రియ కుమారుడివి నీవంటే నాకెంతో ఆనందం ",
"23": "యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు ఆయన యోసేపు కొడుకు అని ప్రజలు ఎంచారు యోసేపు హేలీ కొడుకు ",
"24": "హేలీ మత్తతు కొడుకు మత్తతు లేవి కొడుకు లేవి మెల్కీ కొడుకు ",
"25": "మెల్కీ యన్న కొడుకు యన్న యోసేపు కొడుకు యోసేపు మత్తతీయ కొడుకు మత్తతీయ ఆమోసు కొడుకు ఆమోసు నాహోము కొడుకు నాహోము ఎస్లి కొడుకు ఎస్లి నగ్గయి కొడుకు",
"26": "నగ్గయి మయతు కొడుకు మయతు మత్తతీయ కొడుకు మత్తతీయ సిమియ కొడుకు సిమియ యోశేఖు కొడుకు యోశేఖు యోదా కొడుకు ",
"27": "యోదా యోహన్న కొడుకు యోహన్న రేసా కొడుకు రేసా జెరుబ్బాబెలు కొడుకు జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు షయల్తీయేలు నేరి కొడుకు ",
"28": "నేరి మెల్కీ కొడుకు మెల్కీ అద్ది కొడుకు అద్ది కోసాము కొడుకు కోసాము ఎల్మదాము కొడుకు ఎల్మదాము ఏరు కొడుకు ",
"29": "ఏరు యెహోషువ కొడుకు యెహోషువ ఎలీయెజెరు కొడుకు ఎలీయెజెరు యోరీము కొడుకు యోరీము మత్తతు కొడుకు మత్తతు లేవి కొడుకు ",
"30": "లేవి షిమ్యోను కొడుకు షిమ్యోను యూదా కొడుకు యూదా యోసేపు కొడుకు యోసేపు యోనాము కొడుకు యోనాము ఎల్యాకీము కొడుకు ",
"31": "ఎల్యాకీము మెలెయా కొడుకు మెలెయా మెన్నా కొడుకు మెన్నా మత్తతా కొడుకు మత్తతా నాతాను కొడుకు నాతాను దావీదు కొడుకు ",
"32": "దావీదు యెష్షయి కొడుకు యెష్షయి ఓబేదు కొడుకు ఓబేదు బోయజు కొడుకు బోయజు శల్మాను కొడుకు శల్మాను నయస్సోను కొడుకు ",
"33": "నయస్సోను అమ్మీనాదాబు కొడుకు అమ్మీనాదాబు అద్మిను కొడుకు అద్మిను అర్నీ కొడుకు అర్నీ ఎస్రోము కొడుకు ఎస్రోము పెరెసు కొడుకు పెరెసు యూదా కొడుకు ",
"34": "యూదా యాకోబు కొడుకు యాకోబు ఇస్సాకు కొడుకు ఇస్సాకు అబ్రాహాము కొడుకు అబ్రాహాము తెరహు కొడుకు తెరహు నాహోరు కొడుకు ",
"35": "నాహోరు సెరూగు కొడుకు సెరూగు రయూ కొడుకు రయూ పెలెగు కొడుకు పెలెగు హెబెరు కొడుకు హెబెరు షేలహు కొడుకు ",
"36": "షేలహు కేయినాను కొడుకు కేయినాను అర్పక్షదు కొడుకు అర్పక్షదు షేము కొడుకు షేము నోవహు కొడుకు నోవహు లెమెకు కొడుకు ",
"37": "లెమెకు మెతూషెల కొడుకు మెతూషెల హనోకు కొడుకు హనోకు యెరెదు కొడుకు యెరెదు మహలలేలు కొడుకు మహలలేలు కేయినాను కొడుకు ",
"38": "కేయినాను ఎనోషు కొడుకు ఎనోషు షేతు కొడుకు షేతు ఆదాము కొడుకు ఆదాము దేవుని కొడుకు",
"front": "\\s1 బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మత్తయి 3:1-12. మార్కు 1:1-8. యోహాను 1:6-8, 15-36)\n\\p "
}

47
luk/4.json Normal file
View File

@ -0,0 +1,47 @@
{
"1": "యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు ",
"2": "అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది ",
"3": "సాతాను ఆయనతో నీవు దేవుడి కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు అన్నాడు ",
"4": "యేసు మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు అని రాసి ఉంది అని జవాబిచ్చాడు ",
"5": "అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు ",
"6": "ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను దానిపై అధికారం నాదే అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను ",
"7": "కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే అని ఆయనతో చెప్పాడు",
"8": "అయితే యేసు నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి అని రాసి ఉంది అని జవాబిచ్చాడు ",
"9": "ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు ",
"10": "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ",
"11": "నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు",
"12": "అయితే యేసు నీ దేవుడైన ప్రభువును పరీక్షించ కూడదు అని రాసి ఉంది అని జవాబిచ్చాడు ",
"13": "సాతాను యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు ",
"14": "అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది ",
"15": "ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు ",
"16": "ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు ",
"17": "యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు ఆయన గ్రంథం విప్పితే ",
"18": "ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ",
"19": "ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు",
"20": "ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు ",
"21": "సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది అని ఆయన వారితో అన్నాడు",
"22": "అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు ఈయన యోసేపు కొడుకు గదా అని చెప్పుకున్నారు",
"23": "ఆయన వారితో వైద్యుడా నిన్ను నీవే బాగు చేసుకో అనే సామెత నాకు చెప్పి కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు అన్నాడు",
"24": "ఆయన ఇంకా ఇలా అన్నాడు ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు ",
"25": "ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా",
"26": "దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు",
"27": "ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు ",
"28": "సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని ",
"29": "ఆగ్రహంతో నిండిపోయి లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు వారి ఊరు కొండ పైన ఉంది ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు ",
"30": "అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు ",
"31": "అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి విశ్రాంతి దినాన వారికి బోధించాడు ",
"32": "వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు ",
"33": "ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు ",
"34": "నజరేతువాడా యేసూ మాతో నీకేం పని మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా నీవెవరో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడివి ",
"35": "యేసు ఊరుకో ఇతనిలో నుండి బయటకు రా అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది",
"36": "అందరూ ఆశ్చర్య పడ్డారు ఇది ఎలాటి మాట ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ",
"37": "అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది ",
"38": "ఆయన సమాజ మందిరం నుండి సీమోను ఇంటికి వెళ్ళాడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమాలారు",
"39": "ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది ",
"40": "పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు ",
"41": "వారిలో చాలామందిలో నుండి దయ్యాలు నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు ",
"42": "తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు ",
"43": "అయితే ఆయన నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి దీని కోసమే దేవుడు నన్ను పంపాడు అని వారితో చెప్పాడు",
"44": "ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు",
"front": "\\s1 క్రీస్తు విషమ పరీక్ష (మత్తయి 4:1-11. మార్కు 1:12-13)\n\\p "
}

42
luk/5.json Normal file
View File

@ -0,0 +1,42 @@
{
"1": "ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు",
"2": "ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు ",
"3": "పడవల్లో సీమోను పడవ ఒకటి యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు ",
"4": "ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి అన్నాడు ",
"5": "సీమోను స్వామీ రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు అయినా నీ మాటను బట్టి వల వేస్తాను అని ఆయనతో అన్నాడు ",
"6": "వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి ",
"7": "వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి ",
"8": "సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ముందు పడి ప్రభూ నేను పాపాత్ముణ్ణి నన్ను విడిచి వెళ్ళు అన్నాడు ",
"9": "ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు ",
"10": "వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు యోహాను కూడా ఉన్నారు అందుకు యేసు సీమోనుతో భయపడకు ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే వాడివవుతావు అన్నాడు ",
"11": "వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు ",
"12": "యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు యేసును చూడగానే అతడు సాగిలపడి ప్రభూ నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు అని ఆయనను వేడుకున్నాడు ",
"13": "అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి నాకిష్టమే బాగు పడు అన్నాడు వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది ",
"14": "ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అయితే వెళ్ళి యాజకునికి కనబడు వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు అని యేసు అతన్ని ఆదేశించాడు ",
"15": "అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన బోధ వినడానికీ తమ రోగాల్ని బాగుచేసుకోడానికీ వచ్చారు ",
"16": "అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు ",
"17": "ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది ",
"18": "కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు అతణ్ణి లోపలికి తెచ్చి ఆయన ముందు ఉంచాలని చూశారు గాని",
"19": "ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు కాబట్టి వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు ",
"20": "యేసు వారి విశ్వాసం చూసి అయ్యా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు ",
"21": "శాస్త్రులూ పరిసయ్యులూ దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు అనుకున్నారు ",
"22": "యేసు వారి ఆలోచన గ్రహించి మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు ",
"23": "ఏది సులభమంటారు నీ పాపాలు క్షమిస్తున్నాను అనడమా లేచి నడువు అనడమా ",
"24": "అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అన్నాడు ",
"25": "వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి తాను పడుకొన్న పరుపు ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు ",
"26": "అందరూ విస్మయం చెంది ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు ",
"27": "ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు ఆయన అతనితో నా వెంట రా అన్నాడు ",
"28": "అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు ",
"29": "లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు ",
"30": "పరిసయ్యులూ వారి శాస్త్రులూ మీరు పన్నులు వసూలు చేసే వారితో పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి అని శిష్యుల మీద సణుక్కున్నారు ",
"31": "అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడక్కర లేదు ",
"32": "పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు అన్నాడు",
"33": "వారాయనతో యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు అని అన్నారు ",
"34": "అందుకు యేసు పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా ",
"35": "పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు అని వారితో చెప్పాడు",
"36": "ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు ",
"37": "ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి రసం కారిపోతుంది తిత్తులు పాడవుతాయి ",
"38": "అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి ",
"39": "పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు ఎందుకంటే పాతదే బాగుంది అంటారు",
"front": "\\s1 కోకొల్లలుగా చేపలు (యోహాను 21:6-8)\n\\p "
}

53
luk/6.json Normal file
View File

@ -0,0 +1,53 @@
{
"1": "ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు ",
"2": "అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు అని వారినడిగారు ",
"3": "యేసు వారితో ఇలా అన్నాడు దావీదుకీ అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేశాడో అది కూడా మీరు చదవలేదా ",
"4": "అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా అన్నాడు",
"5": "ఇంకా ప్రభువు అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని అని వారితో చెప్పాడు",
"6": "మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు ",
"7": "ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు ",
"8": "వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని చచ్చుబడిన చెయ్యి గలవాడితో నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు అన్నాడు వాడు లేచి నిలబడ్డాడు ",
"9": "అప్పుడు యేసు విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా లేక కీడు చేయడం న్యాయమా ప్రాణాన్ని రక్షించడం న్యాయమా లేక హత్య చేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను అని వారితో చెప్పి ",
"10": "చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి నీ చెయ్యి చాపు అని వాడితో చెప్పాడు వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది ",
"11": "అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు ",
"12": "ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు ",
"13": "ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు ",
"14": "వారెవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను అతని సోదరుడు అంద్రెయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తొలొమయి ",
"15": "మత్తయి తోమా అల్ఫయి కుమారుడు యాకోబు దేశభక్తుడు అని పిలిచే సీమోను ",
"16": "యాకోబు సోదరుడు యూదా నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు ",
"17": "",
"18": "",
"19": "రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు ",
"20": "అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు ",
"21": "ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా మీరు ధన్యులు మీకు తృప్తి కలుగుతుంది ",
"22": "మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు ",
"23": "ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి చూడండి పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు ",
"24": "అయ్యో ధనికులారా మీకు యాతన మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు ",
"25": "అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన మీకు ఆకలి వేస్తుంది అయ్యో ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన మీరు దుఃఖించి ఏడుస్తారు ",
"26": "మనుషులంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్త లకు అలాగే చేశారు ",
"27": "వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి ",
"28": "మిమ్మల్ని శపించే వారిని దీవించండి మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి ",
"29": "నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు ",
"30": "అడిగే ప్రతివాడికీ ఇవ్వు నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు ",
"31": "మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి ",
"32": "మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా ",
"33": "మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా ",
"34": "మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా ",
"35": "మీరైతే మీ శత్రువులను ప్రేమించండి వారికి మేలు చేయండి తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు ",
"36": "మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి ",
"37": "ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు ఇతరులను క్షమించండి అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది ",
"38": "ఇవ్వండి అప్పుడు మీకూ ఇస్తారు అప్పుడు మనుషులు మీకు అదిమి కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది ",
"39": "తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు వారిద్దరూ గుంటలో పడరా ",
"40": "శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు ",
"41": "నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు ",
"42": "నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో సోదరా నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి అని నువ్వెలా చెప్పగలవు వేషధారీ మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది ",
"43": "మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు ",
"44": "ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోయరు ",
"45": "మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది ",
"46": "నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే ప్రభూ ప్రభూ అని నన్ను పిలవడం ఎందుకు ",
"47": "నా దగ్గరికి వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి",
"48": "వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది ",
"49": "అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం",
"front": "\\s1 విశ్రాంతి దినం గురించి యేసు ఉపదేశం (మత్తయి 12:1-8. మార్కు 2:23-28)\n\\p ",
"17-18": "ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. "
}

53
luk/7.json Normal file
View File

@ -0,0 +1,53 @@
{
"1": "ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూముకి వచ్చాడు ",
"2": "అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు ",
"3": "ఈ శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన సేవకుణ్ణి బాగు చేయాలని ఆయనను బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు ",
"4": "వారు యేసు దగ్గరికి వచ్చి నువ్వు తప్పక ఈ మేలు చేయాలి ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు",
"5": "అతడు మన ప్రజలను ప్రేమించాడు మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే అని ఆయనను ఎంతో బతిమాలారు",
"6": "కాబట్టి యేసు వారితో వెళ్ళాడు ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ శతాధిపతి తన స్నేహితుల్ని కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు ప్రభూ నువ్వు శ్రమ తీసుకోవద్దు నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు",
"7": "అలాగే నీ దగ్గరికి వచ్చే యోగ్యత కూడా నాకు లేదు నువ్వు మాట మాత్రం చెప్పు నా సేవకుడికి పూర్తిగా నయమవుతుంది ",
"8": "నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణే నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకణ్ణి వెళ్ళు అంటే వెళ్తాడు ఒకణ్ణి రా అంటే వస్తాడు నా సేవకుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు ",
"9": "యేసు ఈ మాటలు విని ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు తన వెనక వస్తున్న జనసమూహం వైపు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుతున్నాను అన్నాడు ",
"10": "అతడు పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూశారు ",
"11": "ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు ఆయన శిష్యులు ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు ",
"12": "ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు ఆమె వితంతువు గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు ",
"13": "ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి ఏడవ వద్దు అని ఆమెకు చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు",
"14": "ఆయన అబ్బాయ్ నేను చెబుతున్నాను లే అన్నాడు ",
"15": "ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు ",
"16": "అందరూ భయంతో నిండిపోయి మనలో గొప్ప ప్రవక్త లేచాడు దేవుడు తన ప్రజలను సందర్శించాడు అంటూ దేవుణ్ణి కీర్తించారు ",
"17": "ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది ",
"18": "యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు ",
"19": "అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి రావలసిన వాడివి నువ్వేనా లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు ",
"20": "వారు ఆయన దగ్గరికి వచ్చి రావలసిన వాడివి నువ్వేనా లేక మరొకరి కోసం ఎదురు చూడాలా అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు అని చెప్పారు",
"21": "అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ బాధితులనూ దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు ",
"22": "అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి గుడ్డివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్ట రోగులు బాగుపడుతున్నారు చెవిటివారు వింటున్నారు చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది ",
"23": "నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు ",
"24": "యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత ఆయన యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు గాలికి ఊగే రెల్లునా ",
"25": "అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా వినండి విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు ",
"26": "అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు ప్రవక్తనా అవును కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను ",
"27": "చూడు నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు ",
"28": "స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను ",
"29": "ప్రజలందరూ పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని దేవుడు నీతిమంతుడని అంగీకరించారు అతని ద్వారా బాప్తిసం పొందారు ",
"30": "కానీ పరిసయ్యులూ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు ",
"31": "కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చాలి వీళ్ళు దేనిలాగా ఉన్నారు ",
"32": "సంతవీధుల్లో కూర్చుని మేము వేణువు ఊదాం మీరు నాట్యం చేయలేదు ఏడుపు పాట పాడాం మీరేమో ఏడవలేదు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు",
"33": "బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని వీడికి దయ్యం పట్టింది అని మీరు అంటున్నారు ",
"34": "మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని వీడు తిండిబోతూ తాగుబోతూ సుంకరులకూ పాపులకూ స్నేహితుడు అంటున్నారు ",
"35": "అయితే జ్ఞానం దాని పిల్లల్ని బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది ",
"36": "పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు ",
"37": "ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి ",
"38": "ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది ",
"39": "ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో ఎలాంటిదో తెలుసుకోగలడు ఈమె పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు ",
"40": "దానికి యేసు సీమోనూ నీతో ఒక మాట చెప్పాలి అని అతనితో అన్నాడు అతడు బోధకా చెప్పు అన్నాడు ",
"41": "అప్పుడు యేసు అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు ",
"42": "ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు అని అడిగాడు",
"43": "అందుకు సీమోను అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది అన్నాడు దానికి యేసు సరిగ్గా ఆలోచించావు అని అతనితో చెప్పి ",
"44": "ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇలా అన్నాడు ఈ స్త్రీని చూస్తున్నావు కదా నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది ",
"45": "నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాల్ని ముద్దు పెట్టుకోవడం ఆపలేదు ",
"46": "నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది ",
"47": "దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది అధికంగా ప్రేమించింది ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు అని చెప్పాడు",
"48": "తరువాత ఆమెతో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు ",
"49": "అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు పాపాలు క్షమించడానికి ఇతనెవరు అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు ",
"50": "అప్పుడు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించింది శాంతిగా వెళ్ళు అని ఆమెతో చెప్పాడు",
"front": "\\s1 శతాధిపతి సేవకుని స్వస్థత (మత్తయి 8:5-13)\n\\p "
}

59
luk/8.json Normal file
View File

@ -0,0 +1,59 @@
{
"1": "ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు ",
"2": "పన్నెండుగురు శిష్యులు అపవిత్రాత్మలనుంచీ రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ ",
"3": "హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు వారంతా తమ స్వంత ధనం సామగ్రిని వెచ్చించి ఆయనకు ఆయన శిష్యులకు సహాయం చేసేవారు",
"4": "ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన దగ్గరికి వస్తున్నారు అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ",
"5": "విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి ",
"6": "మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి ",
"7": "మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి ",
"8": "మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి ఆయన ఇలా చెప్పి వినడానికి చెవులున్నవాడు విను గాక అని బిగ్గరగా అన్నాడు",
"9": "ఆయన శిష్యులు ఈ ఉపమానం అర్థం ఏమిటి అని అడిగారు ",
"10": "ఆయన దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను ",
"11": "ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం ",
"12": "దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు ",
"13": "రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు ",
"14": "ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో సుఖాలతో సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు వీరి ఫలం పక్వానికి రాదు ",
"15": "మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు ",
"16": "ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు మంచం కింద పెట్టడు ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు ",
"17": "తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు తెలియకుండా బయట పడకుండా దాగి ఉండిపోయేది ఏదీ లేదు ",
"18": "కలిగిన వ్యక్తికే ఇస్తారు లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి అన్నాడు",
"19": "ఆయన తల్లీ సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు ",
"20": "అప్పుడు నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ సోదరులూ వచ్చి బయట నిలుచున్నారు అని ఎవరో ఆయనతో అన్నారు ",
"21": "అందుకు ఆయన దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ అన్నాడు",
"22": "మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి సరస్సు అవతలి వైపుకు వెళ్దాం అన్నాడు వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు ",
"23": "వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి వారి స్థితి ప్రమాదకరంగా మారింది",
"24": "కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి ప్రభూ ప్రభూ నశించిపోతున్నాం అంటూ ఆయనను లేపారు ఆయన లేచి గాలినీ ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది ",
"25": "అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు వారు భయపడి ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు ",
"26": "వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు ",
"27": "ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు సమాధులే వాడి నివాసం ఇంట్లో ఉండేవాడు కాదు ",
"28": "వాడు యేసును చూసి కేకలు వేశాడు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు అతడు సర్వోన్నత దేవుని కుమారా యేసూ నా జోలి నీకెందుకు నన్ను బాధించకు నిన్ను బతిమాలుకుంటున్నాను అంటూ కేకలు పెట్టాడు ",
"29": "ఎందుకంటే ఆయన ఈ వ్యక్తిని వదిలి బయటకు రా అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది వాణ్ణి గొలుసులతోనూ కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి ",
"30": "యేసు నీ పేరు ఏమిటి అని వాడిని అడిగాడు చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి కాబట్టి వాడు నా పేరు సైన్యం అన్నాడు ",
"31": "పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి ",
"32": "అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది వాటిలో చొరబడడానికి అనుమతి నిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు ",
"33": "అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి అప్పుడు ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి",
"34": "ఆ పందుల్ని మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు ",
"35": "ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు వారంతా యేసు దగ్గరికి వచ్చారు అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు ",
"36": "జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు ",
"37": "గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు ",
"38": "ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు ",
"39": "కానీ ఆయన నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు అని వాణ్ణి పంపివేశాడు వాడు వెళ్ళి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు ",
"40": "ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు ",
"41": "అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు ",
"42": "సుమారు పన్నెండేళ్ళ వయసున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు",
"43": "అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది కానీ ఎక్కడా నయం కాలేదు ",
"44": "ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది ",
"45": "యేసు నన్ను తాకిందెవరు అని అడిగాడు చుట్టూ ఉన్నవారు మాకు తెలియదే అన్నారు అప్పుడు పేతురు ప్రభూ జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ మూగి మీద పడుతున్నారు అన్నాడు",
"46": "అయితే యేసు ఎవరో నన్ను తాకారు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది అన్నాడు ",
"47": "ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది ",
"48": "అందుకు ఆయన అమ్మాయీ నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది ప్రశాంతంగా వెళ్ళు అన్నాడు ",
"49": "ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి మీ అమ్మాయి చనిపోయింది బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు అని చెప్పాడు ",
"50": "యేసు ఆ మాట విని భయపడకు నమ్ము ఆమె బాగవుతుంది అని చెప్పాడు ",
"51": "అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు ",
"52": "అందరూ ఆమె కోసం ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారు ఆయన వారితో ఏడవ వద్దు ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు అన్నాడు ",
"53": "ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు",
"54": "అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని అమ్మాయీ లే అని చెప్పగానే ",
"55": "ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది ఆమె వెంటనే లేచింది అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టండి అని ఆదేశించాడు ",
"56": "ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు అప్పుడు ఆయన జరిగింది ఎవరికీ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించాడు",
"front": "\\s1 గలిలయలో ఉపదేశాలు, స్వస్థతలు\n\\p "
}

65
luk/9.json Normal file
View File

@ -0,0 +1,65 @@
{
"1": "ఆయన తన పన్నెండుగురు శిష్యుల్ని పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు ",
"2": "దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగుల్ని బాగు చేయడానికీ వారిని పంపాడు ",
"3": "అప్పుడు ఆయన మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు ",
"4": "మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి అక్కడ నుండే బయలుదేరండి ",
"5": "మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి అన్నాడు",
"6": "వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు",
"7": "జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు ఎందుకంటే కొందరు యోహాను చనిపోయి లేచాడు అనీ ",
"8": "మరి కొందరు ఏలీయా కనిపించాడు అనీ ఇంకొంతమంది పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు అనీ చెప్పుకుంటూ ఉన్నారు",
"9": "అప్పుడు హేరోదు నేను యోహాను తల తీయించాను కదా మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు ",
"10": "అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు ",
"11": "జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు ఆయన వారిని రానిచ్చి దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు ",
"12": "పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి అన్నారు ",
"13": "ఆయన మీరే వీళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే అన్నారు ",
"14": "అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు ఆయన వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి అని శిష్యులతో చెప్పాడు ",
"15": "వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు ",
"16": "అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు ఆకాశం వైపు చూసి వాటిని దీవించి విరిచి జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు ",
"17": "వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు ",
"18": "ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని ఆయన వారిని అడిగాడు ",
"19": "వారు బాప్తిసమిచ్చే యోహాననీ కొందరు ఏలీయా అనీ కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు అని ఆయనకు జవాబిచ్చారు ",
"20": "అప్పుడు ఆయన మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని వారిని అడిగాడు అందుకు పేతురు నువ్వు దేవుని అభిషిక్తుడివి అన్నాడు ",
"21": "ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు ",
"22": "మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు యూదు పెద్దలూ ప్రధాన యాజకులూ ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు ఆయనను చంపుతారు ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పాడు",
"23": "ఆయన ఇంకా ఇలా అన్నాడు ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి ",
"24": "తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు ",
"25": "ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం ",
"26": "నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు",
"27": "అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు",
"28": "ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు యోహాను యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు ",
"29": "ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి ",
"30": "ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు వారు మోషే ఏలీయాలు ",
"31": "వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు ",
"32": "పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు ",
"33": "ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు ప్రభూ మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది నీకు ఒకటీ మోషేకు ఒకటీ ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు ",
"34": "అతడు ఈవిధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు ",
"35": "తరువాత ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు ఈయన మాట వినండి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది ",
"36": "ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు ",
"37": "మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది ",
"38": "ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను వీడు నాకొక్కడే కుమారుడు",
"39": "చూడు ఒక దయ్యం వాణ్ణి పడుతుంది అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు అది వాణ్ణి విలవిలలాడిస్తుంది అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది",
"40": "దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు అని దీనంగా చెప్పాడు",
"41": "యేసు విశ్వాసం లేని అక్రమ తరమా నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి అని నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకుని రా అని ఆ తండ్రితో చెప్పాడు ",
"42": "వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు ",
"43": "అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు ",
"44": "ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు ",
"45": "అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు అది వారికి రహస్యంగానే ఉండిపోయింది కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు ",
"46": "తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది ",
"47": "యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని ",
"48": "ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు ",
"49": "అప్పుడు యోహాను ప్రభూ ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు వాడు మనల్ని అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం అని యేసుతో చెప్పాడు ",
"50": "అందుకు యేసు మీరు వాణ్ణి అడ్డుకోవద్దు మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే అని చెప్పాడు ",
"51": "యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గర పడింది అని గ్రహించి ",
"52": "ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు",
"53": "ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు ",
"54": "శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి ప్రభూ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా అని అడిగారు ",
"55": "ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు ",
"56": "అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు ",
"57": "వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను అని ఆయనతో అన్నాడు ",
"58": "అందుకు యేసు నక్కలకు గుంటలు ఉన్నాయి ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు అని అతనికి చెప్పాడు ",
"59": "ఆయన మరో వ్యక్తిని చూసి నా వెంట రా అన్నాడు ఆ వ్యక్తి ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి అన్నాడు ",
"60": "అందుకాయన చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని అతనితో చెప్పాడు ",
"61": "మరొకడు ప్రభూ నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను నాకు సెలవియ్యి అన్నాడు ",
"62": "దానికి యేసు నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు అని వాడితో చెప్పాడు",
"front": "\\s1 యేసు పన్నెండు మందిని రాజ్య ప్రకటనకు పంపించడం (మత్తయి 10:1-42. మార్కు 6:7-13)\n\\p "
}

18
luk/headers.json Normal file
View File

@ -0,0 +1,18 @@
[
{
"tag": "id",
"content": "LUK EN_JOY te_Telugu_ltr Luke Tue Oct 22 2019 00:12:07 GMT+0530 (India Standard Time) tc"
},
{
"tag": "usfm",
"content": "3.0"
},
{
"tag": "imt",
"content": "లూకా సువార్త"
},
{
"tag": "h",
"content": "Luke"
}
]

45
manifest.json Normal file
View File

@ -0,0 +1,45 @@
{
"generator": {
"name": "tc-desktop",
"build": ""
},
"target_language": {
"id": "te",
"name": "Telugu",
"direction": "ltr",
"book": {
"name": "Luke"
}
},
"ts_project": {
"id": "luk",
"name": "Luke"
},
"project": {
"id": "luk",
"name": "Luke"
},
"type": {
"id": "text",
"name": "Text"
},
"source_translations": [
{
"language_id": "en",
"resource_id": "ult",
"checking_level": "",
"date_modified": "2020-11-16T06:12:09.887Z",
"version": ""
}
],
"resource": {
"id": "",
"name": ""
},
"translators": [],
"checkers": [],
"time_created": "2020-11-16T06:12:09.887Z",
"tools": [],
"repo": "",
"tcInitialized": true
}